‘ ఎలనాగ ’ రచనలు

యుక్త వాక్యం – చివరి భాగం

ఫిబ్రవరి 2018


*మినీ బస్సుల ద్వారా గుర్తించిన మార్గాలనుండి రవాణా సేవలు అందిస్తాము.
*మార్గాలను మినీ బస్సుల ద్వారా గుర్తించారా?! కాదే. ఇక్కడ ‘మినీ బస్సుల’ను ‘రవాణా సేవలు’కు వర్తింపజేయాలి. కాని, ‘గుర్తించిన’కు వర్తింపజేశారు. కాబట్టి, ‘గుర్తించిన మార్గాల నుండి మినీ బస్సుల ద్వారా రవాణా సేవలు అందిస్తాము’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.

*నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సీఈవో గా తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే నియమించుకున్నాడు.
*ఈ వాక్యం చెప్తున్నదేమంటే, ఒక వ్యక్తి నయీం చానెల్ కు సీఈవోగా – అంటే సీఈవో హోదాలో – ఉండి నయీంను వ్యతికేకించాడనీ, తర్వాత అతడినే నయీం…
పూర్తిగా »

యుక్తవాక్యం – మొదటి భాగం

ఫిబ్రవరి 2018


గమనిక: నా ‘భాషాసవ్యతకు బాటలు వేద్దాం’లో లాగానే ఇందులో కూడా కొన్ని విషయాలు వివాదాస్పదంగా కనిపించవచ్చు పాఠకులకు. ఎంతమాత్రం అయోమయానికి తావివ్వకుండా, వాక్యం పూర్తిగా సంతృప్తికరమైన రూపంలో ఉండేలా పదాలను, అక్షరాలను ఎలా రాయాలనే విషయం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండే అవకాశముంది. కాబట్టి, ఇందులో చెప్పిందే ఏకైక అంతిమ (Ultimate) రూపమని నిర్ద్వంద్వంగా నొక్కి వక్కాణించడం లేదు. ఏకీభావం కుదరని చోట కొంచెం భిన్నమైన వాక్య, పదరూపాలను అనుసరించవచ్చు.

***

వాక్యాన్ని సరిగ్గా రాయడమనేది చాలా మంది అనుకునేటంత సులభమైన విషయమేం కాదు. ఎందుకంటే, మనం రాసింది నిర్దుష్టంగానే కాక, నిర్దిష్టంగా కూడా ఉండాలి. నిర్దుష్టంగా అంటే భాషాదోషాలు…
పూర్తిగా »

మేధోమథనమా?, మేదోమథనమా?, మేధామథనమా?

జనవరి 2018


పదాల కచ్చితత్వం పట్ల పట్టింపు ఉన్నవాళ్లకు ఏదైనా పదం తాలూకు సరైన రూపం గురించిన సందేహం వస్తే, దాన్ని నివృత్తి చేసుకునేదాకా అశాంతితో వేగిపోతారు. ఇది సాహితీపరులకు ఉండాల్సిన మంచి లక్షణమని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. భాషకు సంబంధించిన జ్ఞానం బలంగా ఉంటే, అది రచన చేసేవాళ్లకు మంచి పునాదిగా పని చేస్తుందనటంలో అనుమానం లేదు. పదాల కచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకునే క్రమంలో ఎన్నో మలుపులు ఏర్పడవచ్చు, ఎంతో శ్రమ కలుగవచ్చు, ఎంతో కాలం పట్టవచ్చు. ఈ వ్యాసకర్త అటువంటి అశాంతిని ఎదుర్కున్న సందర్భాల్లోంచి కొన్నింటిని పేర్కొని, విపులంగా చర్చించడమే ఈ రచన ముఖ్యోద్దేశం.

మేధోమథనం: మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి మొదలైన పదాలను మనం అచ్చులో తరచుగా…
పూర్తిగా »

నుడి – 24 ఫలితాలు, జవాబులు, వివరణలు

నవంబర్ 2017


ఈ సారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ముగ్గురు. వారు:
1. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.
2. రవిచంద్ర ఇనగంటి
3. పి. సి. రాములు

పూర్తిగా »

క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం

అక్టోబర్ 2017


క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా…
పూర్తిగా »

నుడి – 24

అక్టోబర్ 2017


ఈసారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఒక్కరే. వారు: పి.సి. రాములు
ఈ నెల ‘నుడి’ (No. 24) తో రెండు సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ శీర్షికను అభిమానించడమే కాక, నాతో ఎంతగానో సహకరించిన పాఠకులకు, సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సెలవు.
పూర్తిగా »

నుడి – 23

సెప్టెంబర్ 2017


నుడి – 23

పాఠకులకు నమస్కారం.
ఈసారి ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఐదుగురు. వారు:
1. హేమనళిని
2. రవిచంద్ర, ఇనగంటి
3. పి.సి. రాములు
4. నాగరాజు రవీందర్
5. టి. సుధేంద్ర రెడ్డి

ఒక తప్పుతో నింపినవారు ముగ్గురు. వారు:
1. వి. దీప్తి
2. మమత
3. టి. చంద్రశేఖర రెడ్డి
పూర్తిగా »

నుడి – 22

ఆగస్ట్ 2017


నుడి – 22

పాఠకులకు నమస్కారం.
ఈ సారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఒక్కరే. వారు: టి చంద్రశేఖర్ రెడ్డి.
ఒక తప్పుతో పూరించినవారు కూడా ఒక్కరే. వారు: నాగరాజు రవీందర్.
విజేతలకు అభినందనలు.

పూర్తిగా »

నుడి – 21

జూలై 2017


నుడి – 21

ఈ సారి ‘నుడి’ని ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఇద్దరు. వారు:
1. రవిచంద్ర, ఇనగంటి
2. పి. సి. రాములు.
ఒక తప్పుతో పూరించిన వారు ముగ్గురు.
1. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.
2. రాంమోహన్ రావు, తుమ్మూరి
3. ఫణీంద్ర, పురాణ పణ్డ.
విజేతలకు అభినందనలు.
పూర్తిగా »

పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు

జూన్ 2015


పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు

ఆంగ్ల క్రాస్ వర్డ్ ఆధారాలను, వాటి విశిష్టతను వివరిస్తూ ఈ రచయిత రాసిన వ్యాసం వాకిలి, ఏప్రిల్ 2017 సంచికలో వచ్చింది. ఇప్పుడు, తెలుగు పజిళ్లలోని ఆధారాల గురించి అటువంటి మరొక వ్యాసాన్ని పాఠకుల ముందంచటం జరుగుతున్నది. పాత తెలుగు క్రాస్ వర్డ్ లు అంటే వెంటనే మనసులో మెదిలేవి శ్రీశ్రీ గారి పదబంధ ప్రహేళికలు. అవి ప్రమాణికతతో కూడుకున్నవి కావటమే అందుకు కారణం. తర్వాత ఆరుద్ర గారి పదబంధ ప్రహేళికలు గుర్తుకొస్తాయి. ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో వచ్చిన తెలుగు పజిళ్లను, ‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న పజిళ్లను తర్వాత పేర్కొనవచ్చు. ఇవి కాక, ‘వాకిలి’లో దాదాపు ఇరవై నెలలుగా వస్తున్న ‘నుడి’ ఉండనే…
పూర్తిగా »