‘ ఎలనాగ ’ రచనలు

నుడి – డిసెంబర్

డిసెంబర్ 2015


నుడి – డిసెంబర్

1. మొదలు లేని చారల వంక మరోలా మధుర ధ్వని (4)
1. గ్రామ్యంలో గ్రామీణ నిరుపేదల ఖర్చు (3)
4. కవిత్వంలో ఉండాల్సిన ఫిలాసఫీ ‘స్టోరీ’ (4)
6. ఒకసారి వెళ్లి మళ్లీ వెళ్లడం మరణించడమే! (5)
7. మంచి కన్నులు గల స్త్రీ మధ్యలో అటుదిటుగా చలో అంటుంది (4)
9. ముందొకరికి ఎదురొచ్చి, తర్వాత మరొకరికి ఎదురొస్తే సమస్యే అనుకుంటా (4)
పూర్తిగా »

వాకిలి నవంబర్ నుడి విజేతలు

డిసెంబర్ 2015


వాకిలి నవంబర్ నుడి విజేతలు

పాఠకులకు నమస్కారం!
నవంబర్ నుడి విజేతలు:
1. తేజస్విని
2. రవిచంద్ర
3. కామేశ్వర రావు
విజేతలకు అభినందనలు!
వాకిలి నవంబర్ నుడి పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు!
ఎక్కువ మంది పాఠకులు తడబడిన ఆధారాలకు సమాధానాలను వివరిస్తున్నాను.
పూర్తిగా »

నుడి – తెలుగు గళ్ళనుడికట్టు

నవంబర్ 2015


నుడి – తెలుగు గళ్ళనుడికట్టు

వాకిలిలో ఇకనుండి నెలకొక తెలుగు గళ్ళనుడికట్టుని ప్రచురిస్తాం. నుడిని వెబ్ పేజీలోనే మౌస్, కీ బోర్డ్ సహాయంతో పూరించి వాకిలికి సబ్మిట్ చెయ్యొచ్చు. వాకిలి నవంబర్ 'నుడి' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: నవంబర్ 20, 2015.
పూర్తిగా »

మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు

అక్టోబర్ 2015


మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు

మెదడుకు ఉత్తేజాన్నిచ్చి, మేధ (intelligence)కు పదును పెట్టే ప్రక్రియ క్రాస్ వర్డ్ పజిల్. మతిమరుపు ముఖ్య లక్షణంగా గల Alzheimer’s disease ఈ రోజుల్లో ఎందరినో పట్టి పీడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని బారిన పడకుండా వుండాలంటే ప్రతిరోజూ సుడోకు, క్రాస్ వర్డ్ మొదలైన పజిళ్లను పూరించడం, కొత్త భాష(ల)ను నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతాన్ని వినడం, ఎడమ చేతితో దంతాలను బ్రష్ చేసుకోవడం, అరికాలునూ పాదాల వేళ్లనూ అన్ని దిక్కుల్లో వంచుతూ ఓ ఐదు నిమిషాల సేపు చిన్న వ్యాయామం చేయడం – ఇవన్నీ అవసరమని వైద్యశాస్త్రం చెప్తోంది. ప్రామాణికమైన క్రాస్ వర్డ్ లను పూరించడం మెదడుకు మేలును కలిగిస్తుందనటంలో అనుమానం లేదు. భౌతికమైన…
పూర్తిగా »

కొలను – చివరి భాగం

సెప్టెంబర్ 2015


కొలను – చివరి భాగం

“నీకు మంచి గుణపాఠం చెప్తాను చూడు” అని, దగ్గరే వున్న కొరడాను చేతిలోకి తీసుకుని, దానితో ఆమెను కొట్టాడు. ఆమె అరిచింది. ఆ అరుపు అతడిని పిచ్చివాణ్ని చేసింది. దాంతో ఆమెను కొరడాతో మళ్లీమళ్లీ బాదటం మొదలు పెట్టాడు. ఇల్లంతా ప్రతిధ్వనించేలా ఎతెల్ అరుస్తుంటే ఆమెను తిడుతూ కొరడాతో కొట్టాడు. ఆమెను యెత్తి మంచంమీద పడేశాడు. ఎతెల్ నొప్పితో భయంతో వెక్కివెక్కి ఏడ్చింది. తర్వాత కొరడాను పారేసి బయటికి వెళ్లిపోయాడు. అతడు పోవటం చూసిన ఎతెల్ తన ఏడుపును ఆపింది. జాగ్రత్తగా చుట్టూ చూసి, మంచంమీంచి లేచింది. ఒళ్లంతా పుండులా ఉంది. కాని గాయం కాలేదు. తన డ్రెస్సు పాడయిందా అని పరీక్షగా చూసుకుంది. అక్కడి…
పూర్తిగా »

కొలను – మూడవ భాగం

ఆగస్ట్ 2015


కొలను – మూడవ భాగం

ఇంగ్లండులో ఉన్న తన దాయాదికి లాసన్ ఒక ఉత్తరం రాశాడు. అతడు అక్కడి ఒక షిప్పింగ్ కంపెనీలో భాగస్వామి. తన ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదుట పడ్డది కనుక తాను ఇంగ్లండుకు తిరిగి రావాలనుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో తెలిపాడు లాసన్. తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి యెంత చిన్న జీతమున్న ఉద్యోగమైనా సరే చూడమనీ, అది డీసైడ్ అనే ప్రదేశంలో వుంటే బాగుంటుందనీ, ఎందుకంటే అక్కడి వాతావరణం ఊపిరితిత్తుల జబ్బు వున్న తనకు ఎక్కువగా నష్టం చేయదనీ ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఆ ఉత్తరం చేరడానికి ఐదు వారాల కాలం పడుతుంది కనుక ఎతెల్ ను సిద్ధం చేయటం కోసం అది సరిపోతుందని భావించాడు. ఆ విషయం…
పూర్తిగా »

కొలను – రెండవ భాగం

జూలై 2015


కొలను – రెండవ భాగం


కాని, అతణ్ని బాగా మంత్రముగ్ధుణ్ని చేసిన ప్రదేశం ఏపియా పట్టణానికి రెండుమూడు మైళ్ల దూర్లో వున్న ఒక కొలను. స్నానం చేయటం కోసం అతడు తరచుగా సాయంత్రాల్లో అక్కడికి వెళ్తాడు. దానిపక్కనే వున్న రాళ్లగుట్టలో ఒక చిన్న సెలయేరు జన్మించి, గలగలల్తో వేగంగా పరుగెత్తుతుంది. తర్వాత లోతైన కొలనుగా మారి, చిన్న వంతెన కిందుగా ప్రవహించి, పెద్దపెద్ద బండరాళ్లను సగం ముంచుతూ ముందుకు సాగిపోతుంది. స్థానిక ప్రజలు కొందరు అక్కడికి వచ్చి, తమ బట్టల్ని ఉతుక్కుంటారు. ప్రవాహానికి రెండు వైపులా గట్లమీద కొబ్బరిచెట్లు దట్టంగా పెరిగి, నిర్లక్ష్యంతో కూడిన మనోహరత్వాన్ని వెలయిస్తూ ఉంటాయి. వాటి ప్రతిబింబాలు కింది నీళ్లలో ప్రతిఫలిస్తాయి. ఇంగ్లండులోని డెవాన్…
పూర్తిగా »

కొలను – మొదటి భాగం

జూన్ 2015


కొలను – మొదటి భాగం

ఏపియా పట్టణంలోని మెట్రోపోల్ హోటలుకు యజమాని అయిన చాప్లిన్ నన్ను లాసన్ కు పరిచయం చేసినప్పుడు, లాసన్ పట్ల ప్రత్యేకమైన ధ్యాసను పెట్టలేదు నేను. అప్పుడు మేము హోటల్ లాంజ్ లో కూచుని కాక్టెయిల్ తాగుతున్నాము. ఆ ద్వీపానికి సంబంధించిన విషయాలమీద లోకాభిరామాయణం కొనసాగుతుంటే, వినోదం నిండిన ఉల్లాసంతో దాన్ని వినసాగాను.
పూర్తిగా »

ముత్యాల హారం

మార్చి 2015


ముత్యాల హారం

“నేను మీ పక్కసీట్లో కూచోవడం యెంత అదృష్టం!” అన్నది లారా ఒకసారి ఓ విందు భోజనంలో.
“ఆ అదృష్టం నాది” అన్నాను మర్యాదగా.

“అదృష్టం యెవరిదో తర్వాత తెలుస్తుంది. మీతో మాట్లాడే అవకాశాన్ని ప్రత్యేకంగా కోరుకున్నాను. మీకు చెప్పటానికి నా దగ్గర ఒక కథ వుంది” అని లారా అనగానే నా గుండె గుబగుబలాడింది. “దానికన్న మీ గురించో లేక నా గురించో మాట్లాడుకోవడం మంచిదనుకుంటాను” అన్నాను.

“అబ్బా, కాని నేనీ కథను మీకు చెప్పి తీరాలి. మీరు కథ రాయడానికి యిది పనికొస్తుందని నా ఉద్దేశం”

“తప్పక చెప్పాల్సిన కథైతే దాన్ని నువ్వు చెప్పాల్సిందే, తప్పదు. కాని మెనూకార్డులో యేముందో చూద్దాం…
పూర్తిగా »

అల్లా కోరిక

నవంబర్ 2014


అల్లా కోరిక

అప్పటిదాకా వెలుగుల్ని వెదజల్లిన చంద్రుడు మబ్బుల చాటుకు పోవడంతో ఆ రాత్రి చీకటిమయంగా మారింది. డోగో ఆకాశం వైపు చూశాడు. కదిలే నల్లని మబ్బులు చంద్రుణ్ని దాచేశాయి. అతడు గొంతును సరి చేసుకుంటూ “ఈ రాత్రికి వర్షం వచ్చేట్టుంది” అన్నాడు తన మిత్రునితో. అతని స్నేహితుడైన సులే త్వరగా జవాబివ్వలేదు. అతడు దృఢమైన శరీరంతో పొడుగ్గా ఉంటాడు. అతని ముఖమూ అతని స్నేహితుని ముఖమూ అజ్ఞానం తాలూకు మూఢత్వపు ముసుగుల్లా వున్నాయి. డోగో లాగా సులే కూడా దొంగతనం చేస్తూ బతుకుతున్నాడు. కొన్ని క్షణాల క్రితం నుండి సులే అలవాటు లేని కుంటి నడక నడుస్తున్నాడు. కొంతసేపైన తర్వాత తన వేలును ఎడమ భుజానికి వేలాడదీసుకున్న…
పూర్తిగా »