‘ కె.గీత ’ రచనలు

ఇల్ హెల్తు – ఇన్సూరెన్సు

డిసెంబర్ 2013


ఇల్ హెల్తు – ఇన్సూరెన్సు

(సిలికాన్ లోయ సాక్షిగా-8)

ఇంతకీ మనకు ఏ ఇన్సూరెన్సు ప్లాను సెలెక్టు చేసావ్? అడిగాడు సూర్య.

“అయ్యో! ఆ విషయమే మర్చిపోయాను.” అని చప్పున నాలిక్కరుచుకుని “ఇప్పుడే చూస్తాను, అయినా ఇద్దరం కూర్చుని ఆలోచించుకుంటే బావుంటుంది అన్నాను.”

రెండు నిమిషాలు చూసి నాకస్సలు ఏవీ అర్థం కావడం లేదు. ఈ H.M.O లు ఏవిటో, P.P.O లు ఏవిటో అన్నాను.
“ఇలా చూడు ప్రియా! ఈ దేశం లో మన దగ్గరలా ఏ డాక్టరు దగ్గిరికీ, ఏ హాస్పిటల్ కీ మనంతట మనం వెళ్లడానికి కుదరదు. (వెళ్తే ఏమవుతుందో అప్పటికి సూర్యకీ తెలీదు.)

ఏదో ఒక ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవలసిందే. మనలాంటి వాళ్లకు మనం…
పూర్తిగా »

హోం లెస్

నవంబర్ 2013


హోం లెస్

“అయాం సారీ, ఆలస్యమైందా” గబగబా నడిచి రావడం వల్ల ఒగురుస్తూ అన్నాను.

“ఫర్వాలేదు, నాకివ్వాళ ఎలాగూ కాలేజీ లేదు.” అంది కరుణ.

“ఇక్కడి లైబ్రరీలు ఎంత బావుంటాయో కదా! ఎక్కడా దుమ్మూ, ధూళీ లేని పుస్తకాల అరలు, విశాలమైన రీడింగ్ రూంస్, నాకెందుకో మా ఇంటి కంటే ఇక్కడి లైబ్రరీ చాలా ఇష్టం” అన్నాను.

ఏదో ఆలోచిస్తున్నట్లున్న కరుణ నిశ్శబ్దంగా తలూపి నవ్వింది.

అలా వెళ్లి ఆ కార్నర్ లో కూచుందాం అన్నాను.

రెండంతస్థుల పెద్ద సిటీ పబ్లిక్ లైబ్రరీ అది. ఇక్కడ పక్కపక్క “పేట” లను కూడా సిటీలుగా పిలుస్తారు. పిలవడమే కాదు. ఆ స్థాయిలో లైబ్రరీల వంటి ప్రజోపయోగకరమైన స్థలాల్ని అభివృద్ధి చేస్తారు…
పూర్తిగా »

ఫుడ్డు- వేస్టు ఫుడ్డు

అక్టోబర్ 2013


ఫుడ్డు- వేస్టు ఫుడ్డు

“ఓర్నాయనో ఆపిల్ చెట్టు” దాదాపుగా చెట్టుకేసి పరుగెత్తుతూ అన్నాను.

“చిన్నప్పటి నించీ ఆపిల్ చెట్టుని చూడాలని ఎంతగానో అనిపించేది. అసలు ఆపిల్ చెట్టుని నేను మామిడిచెట్టులా ఒక్కో కొమ్మకి ఒక్కో ఆపిల్ వేళ్లాడుతూ ఊహించుకున్నాను. తీరా చూస్తే జాం చెట్టులా ఉందిది. కానీకాయలు ఇలా కణుపులకి గుత్తులు గుత్తులుగా కాసి ఉసిరి చెట్టులా భలే తమాషాగా ఉందే” దగ్గరగా వెళ్లి చెట్టుని తడుముతూ ఏవిటేమిటో మాట్లాడుతున్న నా వైపు నవ్వుతూ చూసేడు సూర్య.

ఇక్కడ ప్రతీ అపార్ట్ మెంటుకీ ఒక లీజింగ్ ఆఫీసు అదే ప్రాంగణంలో ఉంటుంది. వందల సంఖ్యలో ఉండే అపార్ట్ మెంటు కాంప్లెక్సులకి ఉన్న కామన్ స్విమ్మింగ్ పూల్, జిం, క్లబ్ హౌస్…
పూర్తిగా »

డ్రైవింగు- లైసెన్సు

సెప్టెంబర్ 2013


డ్రైవింగు- లైసెన్సు

డ్రైవింగ్ లైసెన్స్ మాట ఎత్తేసరికి సూర్య ముఖం మళ్లీ కంద గడ్డలా తయారైంది.

అదెందుకో అర్థం కావాలంటే సూర్య డ్రైవింగ్ లైసెన్సు కథ తెలుసుకోవాలి.

సూర్య అమెరికాకు నా కంటే రెండు నెలల ముందు వచ్చాడు. వస్తూనే కారు లైసెన్సు కోసం ప్రయత్నం మొదలు పెట్టాడు. మూడు వారాలు ప్రైవేటు కోచింగ్ కూడా తీసుకున్నాడు. నిజానికి మేమిద్దరం ఇండియా లో అప్పటికి రెండు, మూడేళ్లుగా కారు డ్రైవ్ చేస్తున్నాం. అయినా కారు నడపడంలో ఇక్కడి రూల్స్ కి, ఇండియా రూల్స్ కి పొంతన ఉండదు కాబట్టి ఎందుకైనా మంచిదని కోచింగ్ కు వెళ్లానని చెప్పాడు.(నిజానికి సూర్య కి నాకున్న ధైర్యం ఏ విషయంలోనూ ఉండదని నా…
పూర్తిగా »

కాలేజీ కథ

09-ఆగస్ట్-2013


కాలేజీ కథ

“కొమస్తాజ్?” స్పానిష్ లో “హౌ ఆర్యూ?” అంది మరియా.

షాపు నించి వస్తూనే బైట వరండాలో వాళ్ల అమ్మ తో బాటూ నిల్చుని కబుర్లు చెబ్తున్న నన్ను ఆప్యాయంగా కౌగలించుకుంది.

మరియా అలీసియా పెద్ద కూతురు. దగ్గర్లోని హోల్ ఫుడ్స్ లో పనిచేస్తూంది.

“ఇలా లోపలికి వచ్చి కూర్చుని మాట్లాడుకోండి” అని పిలిచింది మమ్మల్ని.

“ఫర్వాలేదులే ఇంట్లో కూర్చుని, కూర్చుని బోల్డు బోరుగా ఉంది” అన్నాను.

“అదృష్టం ప్రియా, రోజల్లా నిలబడి ఉద్యోగాలు చేసే నా లాంటి వాళ్లకి దొరకని జీవితం నీది” అంది ఇంగ్లీషులో.

మళ్లీ తనే “రోజుకి 8 గంటలు, గంటకి 8 డాలర్లు, ఆదివారం తో సహా వారమంతా కష్ట పడినా…
పూర్తిగా »

కొండవాలు వాన తీగ

02-ఆగస్ట్-2013


కొండ వాలుపై నిల్చుని
ఆకాశంకేసి చూస్తున్న
నిరాధార జీవితమ్మీద
ఒక వానపూల తీగొచ్చిపడ్డట్లు
ఎక్కడి నుంచో
గొప్ప పరిమళభరిత
కవిత్వమొకటి
నిలువెల్లా కురుస్తూ-
నిర్వికార
నిరాకార
బాంధవ్యమొకటి
కళ్లే చేతులై చుట్టేస్తూ
హృదయం
బయటెవరో అవిశ్రాంతంగా
తడుతున్న చప్పుడు
హృదయం లోపల
ఎవరో అకస్మాత్తుగా
దుమికిన చప్పుడు
ఎక్కడున్నాయిన్నాళ్లూ!
పదాల్లో
కళ్లముందుండీ స్పృశించలేని
తుమ్మెద రెక్కల విన్యాసం
పాదాల్లో
అడవి లతలు పెనవేసుకుని
ఎదిగిన అల్లిబిల్లి అలుపులేనితనం
ఎక్కడినించొచ్చాయివన్నీ

పూర్తిగా »

డిపెండెంటు అమెరికా

12-జూలై-2013


డిపెండెంటు అమెరికా

సాయంత్రం ఏటవాలు కిరణాలతో దేదీప్యమానంగా మెరుస్తూంది. ఇంట్లో అద్దాలలోంచి చూస్తే బయట వెచ్చగా ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ విసురు గాలి వీస్తూ అతి చల్లగా ఉంది.
ఆకాశం లో ఒక పక్క చంద్రుడు పగటిని తరుముకొస్తున్నాడు. రెండు గదుల ఇంట్లో అక్కడక్కడే తిరుగుతూ ఎడతెరిపిలేకుండా మనసుని మెలికలు తిప్పుతున్న ఏవేవో ఆలోచనలు.
“అవునూ కాథరీన్ అట ఎవరో నా సెల్ కి ఫోన్ చేసేరు. నేను ఇంటికి వెళ్లగానే నీతో ఫోన్ చేయిస్తానని చెప్పేను” అన్నాడు సూర్య ఇంట్లోకి వస్తూనే.
“అవును. పార్కులో కలిసిన ఫ్రెండు. వెనక వీథిలో ఉంటారట. నేను నిన్న సాయంత్రం ఫోన్ చేసేను. తనీవేళ చూసుకున్నట్లుంది. నీ…
పూర్తిగా »

వర్క్ ఫ్రం హోం

07-జూన్-2013


వర్క్ ఫ్రం హోం

సూర్య ఆఫీసు నుంచి పెందరాళే వస్తున్నాడు. వచ్చే సరికి నేను, పాప గుర్రు పెట్టి నిద్ర పోవడం చూసి “చింటూ! టీ పెట్టు” అని లేపాడు.

ప్రేమగా “చింటూ” అని పిలిచి పని చెబ్తావేంటి? ఆ టీ ఏదో కాస్త నువ్వు పెట్టరాదూ! అన్నాను మళ్లీ ముణగ దీసుకుంటూ.

“అదేం కుదరదు- నిన్నిలా వదిలేస్తే ఇక ఎప్పటికీ ఇండియా టైమింగ్స్ నే ఇక్కడా పాటిస్తావ్ ఇలా పగలంతా నిద్రపోతూ- “

“అబ్బా!” అని విసుక్కుంటూ లేచి ఫ్రిజ్ వరకూ వెళ్లి “అన్నట్లు, పాలయిపోయాయి వెళ్లి తీసుకురా” అని మరలా ముసుగు వెయ్యబోయాను.

“నువ్వూరా ఇద్దరం వెళ్దాం”

“పాలకి నేనెందుకు?”

“ఇదేమైనా ఇండియా అనుకుంటున్నావా! రేపట్నుంచి సరుకులు…
పూర్తిగా »

స్పానిష్షూ- ఉష్షూ

02-మే-2013


స్పానిష్షూ- ఉష్షూ

అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నాడు.

‘ఇంట్లో కూర్చుని కునికి పాట్లు పడకుండా అలా పార్కుకి వెళ్లి రారాదూ- నీకూ ఎవరైనా కనిపించినట్లవుతారు, నిధికి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది ‘అన్నాడు.

“నాకు ప్రపంచమంతా కలో, నిజమో అర్థం కాని భ్రాంతిగా ఉంది ఇంకా” అన్నాను.

ఓ కమాన్ ప్రియా! “అదే జెట్లాగ్ మరి” అని

పోన్లే నిద్రొస్తే మరి కాస్సేపు పడుకో “అలారం పెట్టుకుని ” అని వత్తి పలుకుతూ బైటికెళ్తూ తలుపు లాకు వేసెళ్లేడు.

నిజానికి బోల్డు పనులు ఉన్నాయి. కొత్తగా ఒక ప్రాంతానికి పెట్టే, బేడా సర్దుకుని వచ్చి…
పూర్తిగా »

వేదన పలచ బడిన గీతం

29-మార్చి-2013


వేదన పలచ బడిన గీతం

కవిత్వానికి”లోపలి మాట” ను చెప్పడమంటే ఒక విధంగా చాలా కష్ట సాధ్యమే. కవిత ఎంపిక దగ్గర్నించి కవిత్వపు సారాంశం నమిలి మింగే వరకూ.

అసలు ఏ కవితని ఎలా ఎంచుకోవాలి? చదివిన ప్రతి కవితలోనూ కొన్ని లోపాలు, కొన్ని అద్భుతాలూ కనిపిస్తూంటే-ఒకోసారి అయ్యో మనిమిలా రాయలేకపోయామే అని దిగులు, ఆశ్చర్యం! ఎంత బాగా రాసారన్న ఆనందం! కవితలు చదూకుంటూ పోతూ, కవిత్వమే నిబిడాంధకారాన్ని తొలగించే రాత్రి చేతి దీపమై నడచుకుంటూ పోతూంటే ఎక్కడో ఒక ముల్లు కాలికి గుచ్చుకున్నట్లు ఒక కవిత వ్యధ పెడితే అది నిన్ను వదలకుండా వేధిస్తే అది నిజంగా ఒక కవిత-

అయినా కొన్ని కవితలు విసిగిస్తే ఆ కవితకున్న పేరు…
పూర్తిగా »