ఈస్టర్పండగని అప్పుసొప్పుజేసి కొన్నకొత్త గుడ్డలేసుకొని, పొద్దున్నే కొండ దగ్గరున్న దేవుడి సిలువ దగ్గరకు నడిచెల్లి, మద్యాన్నమయ్యాక అన్నాలు కూరలు తిని, తరువాతప్రార్దనకెళ్ళి, రాత్రి పల్లెలో కుర్రోళ్లు వేస్తున్న దేవుడి నాటకాలు చూసి అలసిపోయిన ఆ వూరి ప్రజలు ఒంటి మీద సోయలేకుండా నిద్రపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈస్టర్ పండగరోజు సమాధి నుంచి లేచిన దేవుడు కూడా నిద్రపోతున్న సమయమది. రేపొదున్నే కత్తేసు కోయ్యబోయే దున్న కుర్ర మాంసాన్ని ఊహించుకుంటూ, పనికిరాని దొబ్బల్ని పడేసే దిబ్బ దగ్గర కూసోని దొరకబోయేదొబ్బల్ని ఎలా దొబ్బి తినాలో ఆలోచించుకుంటూ, నిద్రను చెడగొట్టుకొని మరి ఊరంతా కలియ తిరుగుతున్న కుక్కల అరుపులచప్పుళ్ళు తప్ప ఇంకే శబ్దము వినపడడం లేదు మావూళ్ళో…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్