‘ జగద్ధాత్రి ’ రచనలు

మందులేని వైరస్ “జెలసీ”

ఆగస్ట్ 2013


మందులేని వైరస్ “జెలసీ”

పొసెసివ్నెస్ , నిజానికి ఈ మాటకు సరైన తెలుగు మాట లేదు. మనది అనుకున్న దాన్ని ఇంకెవరూ తాకి ఉండకూడదు , మనకే సొంతం కావలనే ఫీలింగ్. ఇది ప్రేమలో కొంత వరకు బాపు రమణ చెప్పినట్టు “ అసూయ ప్రేమకు ఘాటైన ధర్మామీటర్” అంటే ఒప్పుకోవచ్చు కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇది జెలసీ గా రూపాంతరం చెందిందా చచ్చామన్న మాటే . పాపం ఇలా ఒకరి జెలసీ కి బలై పోయిన వ్యక్తులెందరో . అలాంటి ఒక కధ చలం “జెలసీ” . ఇందులో చలపతి రావు చాలా ఆదర్శవంతుడు. పెళ్ళయి మొగుడు పోయిన విధవనే పెళ్ళాడుతానని తలంచి అలాగే తన…
పూర్తిగా »

అరుణ కథనం ఒక అయస్కాంతం

మార్చి 2013


అరుణ కథనం ఒక అయస్కాంతం

రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటా ఒక మంచి మిత్రుడు నోటి వెంట   అరుణ  పప్పు బ్లాగ్ ” అరుణిమ ” గురించి విన్నాను .  బ్లాగులు పరిచయం చేస్తూ  ” హలో బ్లాగున్నారా ?” అని రాసేదాన్ని .   తనకు తెలిసిన మంచి బ్లాగులు గురించి చెప్పమని అడిగితె   మిత్రుడు  ఈ బ్లాగ్ గురించి చెప్పేరు. అప్పుడే మొదటి సారి చూసాను .  అయితే ఆ అమ్మాయి వేరొక పత్రికలో పనిచేస్తోంది కనుక నే రాసే పత్రికలో ఈమె గూర్చి రాయద్దులెండి అన్నారు నే రాసే పత్రిక వాళ్ళు .  ఓహో ఇలా కూడా ఉంటుందా అని అనుకుని ఊరుకున్నాను. ఆ తర్వాత   కొన్నాళ్ళకి అరుణ…
పూర్తిగా »

అంతరంగం వొక అడివి…ఆ అడివిలో ఇరుకు దారి కాశీభట్ల నవల

జనవరి 2013


అంతరంగం వొక అడివి…ఆ అడివిలో ఇరుకు దారి కాశీభట్ల నవల

” I CAN CONNECT NOTHING WITH NOTHING ” అంటాడు టి.ఎస్. ఇలియట్ తన ” వేస్ట్ లాండ్ ” కవితలో. ఆ  కవిత ఆధునిక కవిత్వానికి ఆదిమూలమైన కవిత అని మనమందరమూ భావిస్తాము. ఒక బీజ కణం నుండి ఆవిర్భవించి , ఒక రూపం తో జన్మించి , ఏమిటో ఎందుకో ఈ భూమి మీదకి వచ్చామో తెలీక కొట్టుమిట్టాడుతూ ఉన్న జీవి వేదన కు ప్రతిబింబం ఆ కవిత .ఆ కవిత చదవడం ఒక అపూర్వానుభవం. కాశీభట్ల వేణుగోపాల్ ని చదవడం కూడా అటువంటి ఒక అపూర్వానుభవమే అని చెప్పాలి .

మనసులోని భావాన్ని అక్షరంగా ఆవిష్కరించే ధైర్యం చాలా తక్కువమందికి ఉండచ్చు .…
పూర్తిగా »

వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే!

జనవరి 2013


వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే!

జగద్ధాత్రి : వేణుగోపాల్ గారు “నికషం ” రాయడానికి గల నేపధ్యం చెప్తారా ?

కాశీభట్ల వేణుగోపాల్ : నా నవలలలో రాతల్లోని పాత్రలందరూ ఎక్కడినుండో ఊహలనుండి  వచ్చిన వారు కాదు. వారందరూ ఎక్కడో ఎప్పుడో జీవితం లో తారస పడ్డవారే. నేను-చీకటి నవల లో భగవాన్లు నాకు ఒక ఆసుపత్రి ముందు పరిచయం అయిన వ్యక్తి. అందులో భగవాన్లు ని చంపేసాను. నికషం లోని అలెక్స్ భగవాన్లు పాత్రకి పొడిగింపుగా అక్షరీకరించాను.

(కాశీభట్ల వేణుగోపాల్ )

ధాత్రి  : భగవాన్లు స్ఫోటకం మచ్చలతో వికారంగా ,ఉంటాడు  అలాగే నికషం లో అలెక్స్ కి బొల్లి వ్యాధి, ఇలాంటి పాత్రలను చిత్రించడం…
పూర్తిగా »