‘ తృష్ణ ’ రచనలు

సాహిర్

మార్చి 2014


సాహిర్

चलो एक बार फिर से.. :

“..मुझसे पहले कितने शायर, आए और आकर चले गए,
कुछ आहें भरकर लौट गए, कुछ नग़मे गाकर चले गए
वो भी एक पल का किस्सा थे, मै भी एक पल का किस्सा हूँ
कल तुमसे जुदा हो जाऊँगा, जो आज तुम्हारा हिस्सा हूँ”
అన్న “సాహిర్” నాకెంతో ప్రియమైన హిందీ సినీకవులలో ఒకరు..!

సాహిర్ ఇంకా ఏమన్నాడంటే..

“ये दुनियाँ जहाँ आदमी कुछ नहीं है
वफ़ा कुछ नहीं, दोस्ती…
పూర్తిగా »

मोन्टा रे!

ఫిబ్రవరి-2014


मोन्टा रे!

సినీ రంగంలో సంగీతసాహిత్యమిళితమైన అద్భుతమైన పాటలు మనకందించిన కొన్ని చెప్పుకోదగ్గ జంటలు ఉన్నాయి. ఎస్.డి.బర్మన్-సాహిర్ లుధియాన్వీ, ఆర్.డి.బర్మన్-గుల్జార్, శంకర్ జైకిషన్-శైలేంద్ర., రాజా మెహదీ అలీ ఖాన్-మదన్ మోహన్… అలాగన్నమాట. అలా కొత్తతరం హిందీ సినీగీతాకాశంలో ఓ జంట హరివిల్లులాంటి అందమైన పాటలను మనకందిస్తున్నారు. వారే అమిత్ త్రివేదీ-అమితాబ్ భట్టాచార్య ! ఈ రణగుణధ్వనులకాలంలో పాటలంటే హోరు, వాయిద్యాల మోత మాత్రమే కాదు నాణ్యమైన సాహిత్యానికి సరిపడే సంగీతాన్ని జోడిస్తే, పదికాలాలు నిలబడిపోయే గీతాలు జన్మించగలవనే నమ్మకాన్ని ఇస్తున్న జంట వీరిద్దరూ.

Dev D, Wake up Sid, Ishaqzaade, Kai Po Che, Trishna, Ek mein aur Ek tu మొదలైన చిత్రాలకు సంగీతం…
పూర్తిగా »

“कोइ ये कैसे बताये..”

జనవరి 2014


“कोइ ये कैसे बताये..”

ప్రముఖ ఉర్దూకవి, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ మొదలైన పలు పురస్కారాల గ్రహీత, ఎన్నో అద్భుతగీతాల సృష్టికర్త “కైఫీ ఆజ్మీ”. ఈ సిరీస్ మొదట్లో ఆయనది “కుచ్ దిల్ నే కహా” అనే ‘అనుపమ’లోని గీతాన్ని గురించి రాసాను. కైఫీ ఆజ్మీ రాసిన మరికొన్ని ప్రముఖ సినీగీతాలు…

* “ధీరే ధీరే మచల్” (అనుపమ), * “భీగి భీగి ఫజా..” (అనుపమ), * “కర్ చలే హమ్ ఫిదా జానొతన్ సాథియో.. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో..”(హకీకత్), * “వక్త్ నే కియా క్యా హసి సితమ్..”(కాగజ్ కే ఫూల్), * చల్తే చల్తే యు హి కోయీ మిల్గయా..”(పాకీజా), * “తుమ్ ఇత్నా జో”…
పూర్తిగా »

ये कौन चित्रकार है..

డిసెంబర్ 2013


ये कौन चित्रकार है..

నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన శ్రీ వి.శాంతారామ్ ఎక్కువగా దర్శకుడిగానే మనకు తెలుసు. మన దేశంలో చెప్పుకోదగ్గ ఉత్తమ దర్శకుల్లో ఒకరు శాంతారామ్. ‘నవ్ రంగ్’, ‘దో ఆంఖే బారహ్ హాత్’, ‘డా.కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ మొదలైన ప్రయోగాత్మకమైన, కళాత్మకమైన చిత్రాలను తీసారు. శాంతారామ్ చిత్రాలు కళాత్మకంగానే కాక సందేశాత్మకంగా, సంగీతభరితంగా కూడా ఉంటాయి. తన చిత్రాల్లోని పాటలను ప్రత్యేకం సంగీతదర్శకుడి దగ్గర ఉండీ లేదా ఒకోసారి తానే స్వయంగా బాణీ కట్టి చేయించుకునేవారుట శాంతారామ్. సంగీతం పట్ల ప్రేమతో, అంత అపురూపంగా బాణీలు కట్టించుకునేవారు కాబట్టే వారి చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ ప్రజాభిమానాన్ని పొందుతూ ఉంటాయి. శాంతారామ్…
పూర్తిగా »

దిఖాయీ దియే యూ

నవంబర్ 2013


దిఖాయీ దియే యూ

“గజల్స్ ఫ్రమ్ ఫిల్మ్స్” అని లతా పాడిన ఓ పాతిక గజల్స్ ఉన్న ఆల్బం(రెండు కేసెట్లు) కొన్నారు నాన్నగారు నా కాలేజి రోజుల్లో. నా ఫేవొరేట్ ఆల్బంస్ లో ఒకటి అది. ఆ గజల్స్ లో వాడిన ఉర్దూ పదాలకు అర్థాలు తెలియకున్నా అవన్నీ నాకెంతగానో నచ్చేవి. కొన్నళ్ళయ్యాకా డిక్షనరీ కొనుక్కుని మరీ ఆ ఉర్దూ పదాలకు అర్థాలు వెతుక్కుని, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆ గజల్స్ వినేదాన్ని. అసలా భాషకున్న మధురిమవల్లనే అనుకుంటా ఓ చిత్రకథానాయకుడు “జిస్కీ జుబా ఉర్దు కీ తర్హా..” అని నాయికను వర్ణిస్తూ పాడతాడు! అలా నే పదే పదే వింటూ వచ్చిన ఆ సినీ గజల్స్ ఆల్బంలోదే ‘Bazaar’ చిత్రంలోని…
పూర్తిగా »

यारा सीली सीली

అక్టోబర్ 2013


यारा सीली सीली

“The Hungry stones” అని విశ్వకవి రవీంద్రుడు రచించిన ప్రఖ్యాత కథ ఒకటి ఉంది. ఆ కథను టాగూర్ వందేళ్ళ జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రముఖ బెంగాలి దర్శకుడు తపన్ సిన్హా “Khudito Pashan” అనే పేరుతో సినిమాగా తీసారు. చిత్రానికి జాతీయపురస్కారం లభించింది. మరో ముఫ్ఫై ఏళ్ల తరువాత ఈ కథ ఆధారంగానే గేయరచయిత గుల్జార్ “Lekin..” పేరుతో ఓ సినిమా తీసారు. ఈ చిత్రానికి కూడా జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రంలోని “యారా సీలీ సీలీ” అనే పాట గురించి ఈసారి చెప్పబోతున్నా..!

“లేకిన్..” చిత్ర కథలో కథానాయకుడు రాజస్తాన్ లో ఉన్న మారుమూల ఊరికి డిపార్ట్మెంట్ పనిమీద వెళ్తాడు. అక్కడ…
పూర్తిగా »

किसी की मुस्कुराहटों पे

సెప్టెంబర్ 2013


किसी की मुस्कुराहटों पे

“सजनरॆ झूठ मत बोलॊ, खुदा कॆ पास जाना है
न हाथी हैं न घॊडा हैं, वहां पैदल ही जाना है ”

అంటారు శంకర్ దాస్ కేసరీలాల్. ఆయన కలం పేరే “శైలేంద్ర”.

ఈ పాట, ఇంకా.. “छॊटी सी यॆ दुनियां, पह्चानॆ रास्तॆं हैं, कहीं तॊ मिलॊंगॆ तो पूछॆंगॆ हाल”,
“यॆ मॆरा दीवानापन हैं.. या महॊब्बत का सुरूर”,
“आवारा हूं “,
“मॆरा जूता है जापानी”,
“दीस्त दॊस्त ना रहा प्यार प्यार ना रहा”,
“हर…
పూర్తిగా »

रिमझिम गिरॆ सावन

ఆగస్ట్ 2013


रिमझिम गिरॆ सावन

చిరుజల్లులతో, జడివానతో వర్షాకాలం వచ్చేసింది. మరి ఓ మంచి వానపాటను తలుచుకోకుంటే ఎలా?! వాన పాటలు అనగానే బోలెడు గుర్తుకొచ్చేసాయి..

ऒ सजना बरखा बहार आई, भीगी भीगी रातॊं मॆं, ऎ रात भीजी भीगी, प्यार हुआ इकरार हुआ हैं, सावन कॆ झूलॆ पडॆ हैं..तुम चलॆ आओ, आहा

रिमझिम कॆ यॆ प्यारॆ प्यारॆ गीत लियॆ, रिमझिम कॆ तरानॆ लॆकॆ आई बरसात, रिम झिम रिमझिम रुमझुम रुमझुम, रिमझिम गिरॆ सावन, ऒ घटा सावरी, आज रपट जायॆ तो.., एक लड्की भीगी भागी सी… ఇలా…
పూర్తిగా »

जलते हैं जिसके लिए..

జూలై 2013


जलते हैं जिसके लिए..

సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో నిపుణుడైన “బిమల్ రాయ్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “సుజాత(1959)”. అంటరానితనం ప్రబలంగా ఉన్న అప్పటి రోజుల్లో, అది నేరమని చెప్తూ, ఆ జాడ్యాన్ని విమర్శిస్తూ, ‘అంటరానితనం’ ముఖ్య నేపథ్యంగా తీసిన చిత్రమిది. సుబోధ్ ఘోష్ అనే ప్రముఖ బెంగాలి రచయిత రచించిన కథ ఆధారంగా ఈ చిత్రం తయారైంది. సుబోధ్ రాసిన మరెన్నో కథలు హిందీ, బెంగాలీ సినిమాలుగా రూపొందాయి. 1959లో మూడవ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవటంతో పాటుగా, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కూడా ఈ చిత్రం సంపాదించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.

సుజాత అనే ఒక హరిజన బాలిక బ్రాహ్మల…
పూర్తిగా »

दिल ढूँढता है

జూన్ 2013


दिल ढूँढता है

“मुद्दत हुई है यार को मेहमाँ किये हुए
जोश-ए-क़दह से बज़्म चराग़ाँ किये हुए ”

ఈ గజల్ తాలూకూ మూడు వర్షన్స్ ఇక్కడ వినచ్చు: http://nindapuran.wordpress.com/2008/03/30/muddat/

 

ఇది ‘Ghalib (1961)’ అనే పాకిస్తానీ చిత్రంలోని ఒక గాలిబ్ గజల్. ఈ చిత్రంలో నాయికగా నటించటమే కాక, ఈ గజల్ కు గాత్రాన్ని అందించారు అప్పటి ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయని ‘నూర్జహాన్’. ఈ గజల్ లోని ఒక షేర్.. “जी ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन / बैठे रहें तसव्वुर-ए-जानाँ किये हुए” . ఇవే వాక్యాల్ని “మౌసమ్(1975)” చిత్రంలో…
పూర్తిగా »