‘ దర్భశయనం శ్రీనివాసాచార్య ’ రచనలు

కొత్త విమర్శ పరికరాలు కావాలి:దర్భశయనం (రెండవ భాగం)

కొత్త విమర్శ పరికరాలు కావాలి:దర్భశయనం (రెండవ భాగం)

కవి, విమర్శకుడు దర్భశయనంతో సంభాషణ… రెండవ భాగం
ఇంటర్వ్యూ: కోడూరి విజయ్ కుమార్

(8) స్త్రీ , దళిత వాద కవిత్వాల కాలం అయిపోయిందని ఒక అభిప్రాయం సాహిత్యం లో వుంది. కానీ, వాస్తవానికి దళితుల స్త్రీలస్థితిలో ఆ కవిత్వాల ముందు కాలానికీ, ఇప్పటికీ పెద్ద పురోగతి లేదని కూడా అంటున్నారు. ఒక విమర్శకునిగా ఎలా విశ్లేషిస్తారు ?

స్త్రీ, దళిత వాదాల కవిత్వం 90 లలో వొచ్చినంత ఉధృతంగా ఇప్పుడు లేదన్నది వాస్తవమే! అయితే, ఆ వాదాల కవిత్వాల కాలం అయిపోయిందనే అభిప్రాయం తో నాకు ఏకీ భావం లేదు. చిత్తశుద్దితో రాసే వాళ్ళు రాస్తూనే వున్నారు. ఇక దళితుల, స్త్రీల స్థితి…
పూర్తిగా »

నగర జీవితానికి పరాయి వాడిని – దర్భశయనం

నగర జీవితానికి పరాయి వాడిని –  దర్భశయనం

కవి, విమర్శకుడు దర్భశయనంతో సంభాషణ…
ఇంటర్వ్యూ: కోడూరి విజయ్ కుమార్

(1) సంజీవదేవ్ ముందు మాటతో వెలువడిన ‘జీవన వీచికలు ‘ నుండి మొన్న ఒంగోలు సభల్లో దేవీప్రియ ఆవిష్కరించిన ‘పొలం గొంతుక’ వరకూ కవిగా చేసిన ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తోంది?

వెనక్కి తిరిగి చూసుకుంటే కవిగా నేను నడచిన మూడున్నర దశాబ్దాల బాట కనబడుతున్నది. స్పష్టంగా నేను నడచిన బాట అది…అది నా యిష్ట ప్రయాణం…స్కూలు రోజుల్లో ఇష్టపడి కవిత్వం రాయడం మొదలు పెట్టాను …ఆ తర్వాతి కాలం లో ఇనుమడించిన యిష్టం తో దాన్ని కొనసాగించాను …ఇష్టంగా కవిత్వాన్ని చదివాను…ఇష్టమైన కవులతో, వ్యక్తులతో స్నేహించాను. ఇష్టమైన ప్రాంతాలకు…
పూర్తిగా »

పుస్తకమూ, అతనూ, నేనూ

పుస్తకమూ, అతనూ, నేనూ

దీన్ని
గతంలో చదివాను చాలా సార్లే-
అర్థమయిందనుకున్నా-

మళ్ళీ మళ్ళీ చదివిన కొద్దీ
మళ్ళీ మళ్ళీ అర్థమయింది
ప్రతిసారీ కొంచెం ఎక్కువగా-

అవే అక్షరమాలలు
మళ్ళీ దర్శించినపుడు
కొత్తగా వూగుతున్నట్లు, కొత్త లయ పుడుతున్నట్లు-
కొత్తగా అర్థమవుతూ వొచ్చింది.

మళ్ళీ మళ్ళీ చదివాను
అక్షరాల్తో పాటు రాసినతనూ
నాతో మాట్లాడ్డం మొదలెట్టాడు

చదవడం ఇక సంభాషణ అయింది
శబ్దాల సాయంతో నిశ్శబ్ద సంభాషణ
అర్థానికి మించినదేదో
అందుతూ వొచ్చింది.

ఎన్ని మార్లు చదివినా – అంటే-
ఎన్ని మార్లు సంభాషించినా
తనివి తీరదు ఆస్వాదన ముగియదు


పూర్తిగా »