‘ నాగరాజు రామస్వామి ’ రచనలు

కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత్వం, ఎప్పటికీ కొత్తగానే…

కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత్వం, ఎప్పటికీ కొత్తగానే…


కొత్తేమీకాదు పాఠకలోకానికి కొండ్రెడ్డి గారి కవిత్వం. తొమ్మిది కవితా సంపుటాలు, ఒక సాహిత్య వ్యాస సంకలనం, మూడు వందల పైచిలుకు విమర్షనా వ్యాసాలూ, రెండువందల ‘కదిలే కలాలకు’ కొత్త సత్తువను సమకూర్చే సాహితీ సమీక్షలు- రెడ్డి గారి కవిత్వ సంపద ఎంత దొడ్డదో వారి సాహిత్య బంధుకోటి కూడా అంత పెద్దది. కరీంనగర్ లో శరత్ సాహిత్య పురస్కారం, ఒంగోలు లో రాజరాజేశ్వరి అవార్డ్, విజయవాడలో రమ్యసాహితీ అవార్డ్, మచిలీపట్నంలోఆవంత్ససోమసుందర్ పురస్కారం, ఆటా వారి అవార్డ్- ఇలా పలు పురస్కారాలు పొంది ‘ఆకాశమంత చూపుతో’ సాహిత్య ఆకాశాన్ని ఆవరించిన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి సరికొత్త కవితా చిగిరింత “ఎప్పటికీ కొత్తగానే”.

రెడ్డి…
పూర్తిగా »

మహాభారతేతిహాస అనుసృజన “పర్వ” – ప్రశ్నార్థకమైన “ఆర్యధర్మం” !

మహాభారతేతిహాస అనుసృజన “పర్వ” – ప్రశ్నార్థకమైన “ఆర్యధర్మం” !

“పర్వ”- ప్రఖ్యాత కన్నడ సాహిత్యవేత్త Dr.S.L.బైరప్ప గారి విశిష్ట ఉద్గ్రంథం. మహా భారతేతిహాసం అధునిక నవలగా రూపొందిన రచన. బైరప్ప గారి Magnum Opus! అదే పేరుతో Dr.గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెనుగించిన “పర్వ” 730 పేజీల బృహదనువాదం. గంగిశెట్టి గారి మాటల్లో ‘మిత్ ‘నుండి చరిత్ర విడదీయబడి సమగ్రంగా పునర్నింప బడిన అపూర్వ పునఃసృష్టి “పూర్వ”. వైదిక యుగ చరమభాగం (12 th B.C.) లో జరిగిందని భావించ బడుతున్న కురుక్షేత్ర మహా సంగ్రామ నేపథ్యం కథావస్తువు. ఇతివృత్తాన్ని దైవీయ భావన నుండి విముక్తం చేసి, ఆనాటి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ధర్మానువర్తులైన వ్యక్తుల పాత్రలను సాధారణీకరించి, 20 వ శతాబ్ది…
పూర్తిగా »

నన్నీ రాత్రి జన్మించ నివ్వండి

నన్నీ రాత్రి జన్మించ నివ్వండి


జజన్మించ నివ్వండి నన్నీరాత్రి
తుఫాను తీసుకొస్తున్నది నదిని ఇంటికి
కర్కటాలు కొట్టుకొస్తున్నవి మరిగే చారులోకి
గాలి ఊల వేస్తున్నది
చెట్టు బరువెక్కి వంగుతున్నది
వాన జల్లులో
నలనల్లని పరిపక్వత రాలుతున్నది
పిల్లల కేరింత జోరందు కుంటున్నది
పిల్ల కాలువ పొంగుతున్నది
వంటింట్లో
పొయ్యి చిటపట లాడుతున్నది
నా గడప నుండి సాగిపోయే నావలు
త్వరలో
దిగ్రేఖ మీద కనుమరుగవ నున్నవి.

 

మూలం : నైజీరియన్ కవి విలియం ఈకే (Iheanyi’s poem ‘Let me born this night’ )
అనువాదం…
పూర్తిగా »

అనువాద కవితలు

అనువాద కవితలు

1. నేను ఒంటరిని కాను

ఈ రాత్రి నిర్జన రాత్రి
సానువులనుండి సముద్రం దాకా.
కాని, నిన్ను ఊయలలూపుతున్న నేను
ఒంటరిని కాను!

ఈ నింగి ఒంటరి ఎడారి
శశి సంద్రంలో పడిపోయింది
కాని, నిన్ను పొదివి పట్టుకున్న నేను
ఒంటరిని కాను!

ఈ భువి ఒంటరి ఊషర క్షేత్రం
ఉసూరు మంటున్నది దేహం
కాని, నిన్ను హత్తుకున్న నేను
ఒంటరిని కాను!

——————————

2. అపరిచిత

ఆమె ఒక విచిత్ర వృద్ధవర్షీయసి !
సముద్ర ఘోష ఆమె భాష
ఆమె మాట్లాడుతుంది తనదైన వింత పంథాలో
ఆల్గే…
పూర్తిగా »

ప్రవాస కోకిల

ప్రవాస కోకిల

పూలకారు మీద కోకిల షికారు
కొమ్మ కొమ్మన పుప్పొడి పొట్లం
ఆమని మీటిన కలకంఠం
అడవి పూచిన పూల పాట.

వసంత గీతాన్ని మోసుకుంటూ
వచ్చింది వలస కోకిల
కొత్తపూలను హత్తుకోవాలని.

ఇక్కడ మావిళ్లు లేవు
వేపలు లేవు, పలాశలు లేవు
లేవు మధుమాసపు మల్లెలు.

ఐనా,
వాడలేదు కోకిలమ్మ మొఖం!
స్వర్ణ వర్ణ గోల్డెన్ రాడ్
ఎర్రని పూల తివాసి పరచింది
నీలి రేకుల బ్లూ బోనెట్
స్నేహ హస్తం అందించింది
ఒళ్ళంతా తెలి పూల పొంగై
ఆపిల్ చెట్టు పలకరించింది
‘తొలి…
పూర్తిగా »

జయభేరి మొదటి భాగం – కవితలు

జయభేరి మొదటి భాగం – కవితలు

రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

 


పూర్తిగా »

తరణోపాయాలు

ఇవి తెరిపినీయక కురిసే ఆర్ద్ర క్షణాలు
తడవక తప్పదు!
అనాదిది ఈ నిరంతర కాల జీవన ధార
తరించక తప్పదు!

నేను రోజూ పొద్దున్నే
నా పెరటి లోని పొదరింటి పందిరికి పూసిన
పూల తడిని కోసుకునేందుకు వెళ్తుంటాను
అప్పుడు, తొలి తెలి కిరణశరం తుహిన కణాన్ని ఛేదిస్తుంటుంది
రాలి పడుతున్న క్షతగాత్ర వర్ణాలను దోసిళ్ళలో పట్టుకొని
నేను ఏడు రంగుల సీతాకోక చిలుకలను ఎగిరేస్తుంటాను!
నా ఆకలి కళ్ళు అరుణ రాగాల కోసం
గులాబి గుండెను గుచ్చి గుచ్చి చూస్తుంటాయి
నా ముని వేళ్ళు చిందిన రక్త బిందువులను…
పూర్తిగా »

వస్తున్నారు ఇండియన్లు మిక్స్ కో నుండి

దిగి వస్తున్నారు ఇండియన్లు మిక్స్ కో నుండి

నీలి బరువులు మోసుకుంటూ
వేకువలో ఆరిపోయే తారల వంటి
అరకొర కరదీపికలతో
భయకంపిత మైన పుర వీధులు వాళ్ళను స్వాగతిస్తున్నవి
వాళ్ళ చేతుల్లో ఉన్నది గుండె దడల శబ్దం
అది పడవ తెడ్లలా గాలిని తాడిస్తున్నది
వాళ్ళ కాళ్ళ నుండి అరికాళ్ళలా రాలిపడుతున్నవి
రోడ్ల ధూళి లో వారి చిరు పాదముద్రలు
మిక్స్ కో లో తొంగిచూచే తారలు
మిక్స్ కో లోనే ఉండి పోతాయి
ఇండియన్లు వాటిని అక్కడే పట్టేసుకుంటారు
వాళ్ళు బుట్టల్లో నింపుకునేది
తెల్లని స్పానిష్ బాయనెట్…
పూర్తిగా »

ఉదయ గీతం

ఉదయ గీతం

ప్రతి ఉదయం ప్రపంచ సృష్టి జరుగుతుంటుంది
సూర్యుని ఎర్రని ఎండు పుల్లల కింద బూడిదైన
రాత్రి భస్మ రాసులు మల్లీ ఆకులై అలవోకగా
వృక్ష శాఖలకు అతుక్కు పోతుంటాయి.

నల్లని వలువల వంటి కొలనుల మీద
వేసవి లిల్లీల ద్వీపాలు ముద్రించ బడుతుంటాయి.

నిత్య సంతోషం నీ నైజ మైతే
నీవా మెత్తని జాడల గుండా కదలిపోతుంటావు
నీ భావ జాలం మీద కాలూనుకుంటూ
నిరంతరంగా ఈదుకుంటూ
బరువెక్కిన నీ భావనలు లోన గుచ్చుకుంటున్నా
నీరసంగా కాల్లీడ్చుకుంటూ నడవక తప్పకున్నా.
నీ అంతరాంతరాల్లో అడవి జంతువేదో అరుస్తుంటుంది
‘తద్వతు తాను…
పూర్తిగా »

చరిత్ర శిథిలాల క్రింద

కాలం నిరంతర ఝరి, కాలం లయకారి
అది స్థితి గతులను రచిస్తూనే
వినాశనాన్ని విరచిస్తుంటుంది
ముందు అన్నీ సమకూర్చు కుంటూ పోతుంటుంది
వెనుక సర్వం పూడ్చు కుంటూ వస్తుంటుంది
కాలం చరిత్ర అవుతుంటుంది!

* * *

పాళీ ప్రాకృత ప్రాక్తన క్షేత్రాలు దాటి
ప్రాభవం కోల్పోయిన శ్రమణం,
కర్మ కాండల ‘కాల చక్ర’ ముగ్గుల్లో చిక్కువడ్డ బౌద్ధం,
స్కై బరియల్స్ లో దేహఖండా లవుతున్న వజ్రయాన శవం,
విగ్రహాలలో స్తాణువైన సిద్దార్థం –
స్వీయ భారం తో కుంగిన హిమాలయం!

శతాబ్దాల డెడ్వేట్ కింద శిథిలమైన గ్రీకు సంస్కృతి,

పూర్తిగా »