‘ నాదెళ్ల అనూరాధ ’ రచనలు

సముద్రం

నిన్ను చూడాలని వస్తూ
సముద్రాన్ని యథాలాపంగా దాటేసేను.
అనంతమైనది కదా,
నా నిర్లక్ష్యాన్ని నిబ్బరంగా దాచుకుంది.
బొమ్మల దుకాణం ముందు మోకరిల్లిన బాల్యంలా
ఈ గుండె నీ సమక్షాన్ని శ్వాసిస్తోంది!

మన మధ్య దూరాలూ, కాలాలూ
కనుమరుగవుతూ సాగిపోయినపుడు
సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్ర రాసులూ ఇట్టే కరిగి పోయాయి.
కరిగిన ఒక్కో క్షణం
ఒక్కో జ్ఞాపకమై బరువెక్కుతుంటే
భుజాల్ని విల్లులా వంచి తిరుగు ప్రయాణమయ్యాను!

శూన్య హస్తంలా నిలబడిన ఆకాశం
స్థితప్రజ్ఞతను ఎప్పుడో నేర్చుకుంది.
ఏమీ నేర్వని నేను
ఉప్పునీటి వారధుల్ని దారిపొడవునా కడుతుంటే,
దాటి…
పూర్తిగా »

జీవించేందుకు సూత్రాలేమిటి?

అక్టోబర్ 2016


తెలతెల వారుతూంటే నిద్ర లేని రాత్రిని విసుక్కుంటూ మంచం దిగి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశం దిగులుగా ఉందని తోచింది. నా మనసులో దిగులు ఆకాశానికి పులిమేసి చూస్తున్నానా లేక ఆ మబ్బులు నిజంగా ఆకాశానివేనా? ఇంతలో చటుక్కున వాన చినుకులు ఆరంభమయ్యాయి. నా అశాంతికి మృదువైన లేపనంలా చల్లని జల్లు ముఖాన్ని తాకుతోంది. ఒక్కసారిగా తెలియని ఆనందమేదో నా చుట్టూ పల్టీలు కొట్టింది. నన్ను పలకరించింది. చేతిలో టీ కప్ తో వచ్చి బాల్కనీ అంచున కూర్చున్నాను.

ఇష్టంగా నేను ఏర్పరుచుకున్న వ్యాపకాన్ని వదిలి పారిపోయి వచ్చేసేను. ఈ నచ్చకపోవటాలు నాకు ఎక్కువే. నాలుగైదేళ్లుగా ఏకాగ్రతతో ఒక రూపుకు తీసుకొచ్చిన బొటీక్ ‘శింగార్’ని, రేణు స్నేహాన్ని…
పూర్తిగా »

పునరపి

సెప్టెంబర్ 2016


నువ్వొస్తున్నావట

ఔను, పాత ఉక్రోషాలన్నీ మర్చేపోయిందీ మనసు
వచ్చేస్తున్నావ్, నాకు తెలుసు.
వేల మైళ్ల దూరాన్ని మనో వేగంతో ముందే దాటేస్తావ్,
ఇంతలోనే నడి ప్రయాణపు పలకరింపువవుతావు.
ఒట్ఠి పిచ్చివాడివి!
సమాంతరంగా నీతో ప్రయాణం చేస్తూనే ఉన్నానన్న వాస్తవం మరిచేపోతావ్
ఓహ్, నిజంగా వచ్చావ్.
అదే మబ్బుపట్టిన సాయంకాలం, అదే ఎదురుచూపుల వాకిలి
ఆ కాసిని మెట్లూ అధిగమించలేని అలసట నీ అడుగుల్లో
నీ ముఖంలో ఒక దైన్యం
మాటల దొంతరలు పేర్చని ఓ నిశ్శబ్దం
ఆ కళ్లల్లో ఏదో వెదకబోయి అర్థం కాక నిలబడ్డాను
ప్రకృతి వాయిద్యాలని…
పూర్తిగా »

నిర్మోహం

ఏప్రిల్ 2016


నిర్మోహం

జీవితాన్ని నిష్కామంగా, నిర్లిప్తంగా గడిపేస్తున్నానని, గడిపెయ్యాలని అనుకుంటానా..
అవును, రోజూ అనుకుంటూనే ఉంటాను
ఏ సంతోషపు శిఖరాలూ అధిరోహించలేను, ఏ దుఃఖపు గుహలూ దర్శించలేను
నాకొద్దీ మాయామోహపు బంధనాలు
అందుకే ఒక నిమిత్తమాత్రురాలిగా, ఒక ప్రేక్షకురాలిగా మారిపోతూ ఉంటాను
రాత్రి వరండాలో పుస్తకంతో కూర్చుంటానా
నా దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తూ చందమామ నవ్వుతాడు
పైగా అడుగుతాడు కదా
నన్ను చూసి కూడా అలా నిర్మోహంగా జీవితాన్ని ఎలా చూడగలవు అంటూ
నన్ను కాదని తప్పించుకుని లోపలికి వస్తానా
వాకిటి గదిలో కొలువైన ఆ జీవం లేని కబుర్ల పెట్టె…
పూర్తిగా »

ద్వైతాద్వైతం

అలుపెరుగని దూరాలకు పరుచుకున్న
ఆరావళీ వరుసలు
ఎప్పటెప్పటి నిశ్శబ్దాన్నీ చుట్టుకున్నట్లున్నాయి.
ముద్ర వెయ్యకుండానే మాయమయే
మబ్బుదొంతరలు
సముద్రాన్ని ఆవాహన చేసుకుంటూ ఆవులిస్తూ సాగిపోతున్నాయి.
పశ్చిమంగా హద్దుగీస్తున్న
అరేబియా సముద్రం
పరుగెత్తే కాలానికి రేయింబవళ్లు పహరా కాస్తున్నట్లుంది.
తీరాన్ని వదిలి అద్దరికీ ఇద్దరికీ మధ్య
పరుగెత్తే మోటారు లాంచీలు
పరవశంతో ప్రవహించే కూనిరాగాల్ని
కడలి ఒడిలో ఒడుపుగా లాక్కెళుతున్నాయి.
ఆటవిడుపుగా జాతరకి బయలు దేరిన
పల్లెవాసుల పకపకల మాటున
పరిమళించే ముచ్చట్ల సవ్వడులు
అలలై కదులుతున్నాయి.
ఆ వార- బీడుభూములు, ఉప్పు కయ్యల…
పూర్తిగా »

వర్షపు కళ్లాపులు

ఎర్రెర్రని సూరీణ్ణి పలకరించేందుకు ఎదురెళ్లే ప్రొద్దుటి నడక,
పోగేసిన కబుర్లతో వెంటాడే అల్లరి గాలి,
జీవనానందమే నాదైన మతం అయినప్పుడు
ఉచ్చ్వాశ, నిశ్వాసల్ని మరిచి తపస్సమాధిలోకి వెళ్ళడమే!

దారివెంట బారులుతీరిన ఆకుపచ్చని నేస్తాలు
నావంక చూసి
అప్పుడప్పుడో ఆకునో, పూవునో రాలుస్తూనే ఉన్నాయి.
ప్రాపంచిక వ్యామోహాల్ని గుప్పిట్లో దాచిపెట్టేసిన నన్ను
రహస్యంగా మోహపుదారాలు అల్లుకుంటూనే ఉన్నాయి.

నా మటుకు నేను
రాత్రి మోసి తెచ్చిన కలల్ని విప్పి
ఆకాశం క్రింద చల్లుతూనే ఉన్నాను.
అవన్నీ నాతో నడిచే సెలయేళ్ల నంటి మొలిచి పలకరిస్తూనే ఉన్నాయి.
ఋతువు వెనుక ఋతువై సమస్త…
పూర్తిగా »