‘ నారాయణస్వామి వెంకటయోగి ’ రచనలు

రాహిత్యం లోంచి

యెక్కడైనా
మనుషులూ మాటలూ వినిపించని
వొక జనసమ్మర్దపు రణగొణ ధ్వనుల చౌరస్తాలో
చెవి దగ్గర
తెరవని పెదవులు పెట్టి
వొక నిశ్శబ్దాన్ని గుసగుసగా చెప్పు.

యెపుడైనా
మనకన్నా ముందుగానే
చిమ్మ చీకట్లు కప్పుకుంటున్న
అతి సమీప స్పర్శారాహిత్య వేళ
మూతబడని కంటిపాప మీద ఊపిరితో
వొక ప్రతిబింబాన్ని అదృశ్యంగా అద్దు.

యేదైనా
వొక అతి దగ్గరైన క్షణాన
యెంతో దూరంగా విసిరికొడుతున్న
దిక్కు తెలియని కాలం ముళ్ళలో చిక్కుకొని
నెత్తురు రాకుండా విలవిలలాడినప్పుడు
యెండిన నుదిటిపై చెమటచుక్కను నాటు.

యిప్పుడు మెరిసి
యెప్పుడో…
పూర్తిగా »

“నా గొంతులో నేనే ఇమడటం లేదు” – ఒక ప్రవాస వేదన

“నా గొంతులో నేనే ఇమడటం లేదు” – ఒక ప్రవాస వేదన

1987 లో అనుకుంటా –  యింకా అప్పటికి లేలేత చిగురుటాకు లాంటి రిక్కల సహదేవరెడ్డి (విరసం అజ్ఞాత సభ్యుడూ, సిర్సిల్ల లో   విప్లవోద్యమ నాయకుడూ)  బూటకపు యెంకౌంటర్ లో పోలీసుల చేతిలో హత్య కాలేదు. విరసం సిటీ యూనిట్ తరపున ‘ప్రతిఘటనా సాహిత్యం’ అనే అంశం పై సభ నిర్వహించాం. అందులో ప్రముఖ కవి కె.శివారెడ్డి ‘నల్లటి మట్టికుండ’ అనే దీర్ఘకవితను అద్భుతంగా చదివి వినిపించారు. ముందు ఆయనే రాసారు అనుకున్నామంతా! చదవడం అయిపోయాక,  మేమంతా గొప్ప భావోద్విగ్న స్థితిలో కళ్ళు చెమర్చి ఉన్నప్పుడు, చెప్పారు శివారెడ్డి ఆ పద్యం గ్రీకు దేశపు మహాకవి యానిస్ రిట్సాస్ దని. అట్లా పరిచయమయ్యారు యానిస్ రిట్సాస్ మాకు!…
పూర్తిగా »

మన భయం – జ్బిగ్నీవ్ హెర్బర్ట్

మన భయం – జ్బిగ్నీవ్ హెర్బర్ట్

మన భయం
రాత్రి అంగీ తొడుక్కోదు
గుడ్లగూబ కళ్ళతో ఉండదు
శవపేటికను తెరవదు
కొవ్వొత్తినీ ఆర్పదు.

చనిపోయిన వాడి ముఖంతోనూ ఉండదు

మన భయం
”జాగ్రత్త! డ్లుగా వీధిలో వేడిగా ఉందని వోజిక్ ని హెచ్చరించండి’
అంటూ
జేబులో దొరికే కాగితం ముక్క

మన భయం
తుఫాను రెక్కలమీద ఎగరదు
చర్చి శిఖరమ్మీదా కూర్చోదు
అది భూమ్మీదే సాదా సీదాగా నడుస్తుంది

మన భయం
మృత్యువు ముంగిట్లో,
హడావుడిగా సర్దుకున్న
వెచ్చని బట్టలూ,…
పూర్తిగా »

విగ్రహాల్నిపగలగొట్టే వాడి కోసం…

1

నాకు సాయంత్రమూ
నీకు ఉదయమూ అయిన సమయంలో,

ముఖమూ కాని,
పుస్తకమూ లేని
ఒకా నొక చీకటి స్థలంలో ,

నువ్వు లేవన్న వార్త విని

దుఃఖమూ కాని వ్యథా లేని
లుంగలు చుట్టిన బాధతో
లిప్త పాటు నిశ్శబ్దమయ్యాను.

2

తీరని బాధా కాదు ఎడతెగని శోకమూ లేదు
యేదో సన్నగా కోస్తున్న నెత్తుటి పొడి రాల్తున్న చప్పుడు.

యెడతెగని కంఠధారల పాటల వర్షమై,
నిర్నిద్ర కవిత్వపు కెరటాల సముద్రమై,
యెప్పుడూ శబ్దమైన నువ్వు ఇట్లా హఠాత్తుగా నిశ్సబ్దమయితే
భరించడం కష్టంగా ఉంది – చెవులు చిల్లులు పడుతున్నయి.

3


పూర్తిగా »

వెయ్యి మొకాల ‘దేవుడు’

అనుకున్నదంత అయింది.

1
వెయ్యి మొకాల దేవుడు మనకు వరమిచ్చెతందుకు యెప్పటి లెక్కనే కొత్త గడువు పెడుతడు. మనమేమొ ఏదో చెప్తడని, ఏదో ఇస్తడని నరాలు తెగెటట్టు, గుండెలు పొర్లె దుక్కం తో దీనంగ పక్షులోలె యెదిరి చూస్తం. చానా మంచోడని , ఇప్పటి దాంక మనకు దక్కాల్సినయన్నీ నాయంగా సవ్యంగా దక్కెటట్టు చేసిండని, వాని మీద వెడ్డి భ్రమతో గుడ్డి నమ్మకం పెంచుకుంటం. వాడు గడువు పెట్టినప్పుడల్ల మన శత్రువులంతా యేకమౌతరు – మన గుండెలు చీల్చిన నెత్తురు పచ్చితో గట్టిపడ్డ తమ ఐక్యతను చాటింపేస్తరు.

వాళ్ళు (కూడా మన వెయ్యి మొకాల దేవుడి వేర్వేరు మొకాలే) మనని యెక్కిరిచ్చుకుంట కారుకూతలు కూస్తరు…
పూర్తిగా »

తీరాలంటే కాదు, నాకు సముద్రమంటేనే ప్రేమ!

“కళాకారుడు ఎప్పుడూ విప్లవం వైపే ఉండాలి, కానీ విప్లవకారుడిలా కాదు. వాళ్లలా రాజకీయ భాష మాట్లాడలేడూ,రాజకీయ వాతావరణంలో జీవించనూ లేడు” – అంటాడు ప్రముఖ అరబ్ కవి అదోనీస్ . “కవిత్వం జీవితాన్ని మారుస్తుందని నాకు పెద్ద ఆశలు లేవు. జీవితాన్ని మార్చాలంటే దాని నిర్మాణాలు మార్చాలి – కుటుంబం, విద్య,రాజకీయాలు వగైరాలు – అది కళ తనంత తానుగా చేయలేదు. కానీ కళ ముఖ్యంగా కవిత్వం ,వస్తువులకూ, పదాలకూ మధ్య సంబంధాన్ని మార్చి ప్రపంచానికి కొత్త ప్రతిబింబాన్ని సృష్టించగలదు. కవిత్వం గురించి తాత్వీకరించడమంటే ప్రేమ గురించి మాట్లాడ్డం లాంటిది. కొన్నింటిని మనం వివరించలేము. ఈ ప్రపంచం అర్థం చేసుకోవడానికి సృష్టించబడలేదు. ఆలోచించడానికీ, ప్రశ్నించడానికీ ఉన్నదిది.…
పూర్తిగా »

ఒక స్పష్టమైన detachedness కనబడుతోంది

ఒక  స్పష్టమైన detachedness కనబడుతోంది

‘ఈ వారం కవి’ నారాయణస్వామి వెంకటయోగి ….తెలుగు కవిత్వంలో మూడు దశాబ్దాల కదలికలకు ప్రత్యక్ష సాక్షి. కల్లోల దశాబ్దం నించి సంక్లిష్ట దశాబ్దం దాకా, సంక్లిష్ట దశాబ్దం నించి ప్రపంచీకరణ అనంతర దశాబ్దం దాకా అనుభవాల్నీ, జ్నాపకాల్నీ  తన అక్షరాల సందుకలో పొందు పరచిన కవి. మంచి చదువరి. లోతయిన బుద్ధి జీవి.

 

 

కలల కల్లోల మేఘం నించి ఇప్పటి మీ కవిత్వం దాకా మీ ప్రయాణం గురించి ఏమంటారు?

కల్లోల కలల మేఘం 1992 లో వచ్చింది. అప్పుడు నేను విరసం లో చాలా చురుగ్గా పనిచేసే వాణ్ణి. విరసం కార్యవర్గ సభ్యుడిని. ఉద్యమమే ఉఛ్వాస నిశ్వాసాలుగా బ్రతికిన రోజులవి.…
పూర్తిగా »

వొంటరిగా….

నిద్రరాని,
మెలకువలేని
దినాలలో కాళ్ళీడుస్తున్న క్షణాలు.

నడువరాని అడవుల మంచు కోతలు,
జడలు గట్టిన సముద్ర కెరటాలు,
యెండిన ఆకుల్లాంటి నదీ తీరాలు,
పాలిపోయిన ఆకాశం చెంపలపైంచి రాలే
చీకటి క్షణాల అగాధాలు.
వెల్తురు సోకని మైదానాల్లో,
దారితప్పిన అడుగుల
అమాయకత్వం.

యెవరివో అనాథ శవాల మీద నుంచి
వీస్తున్న దుర్భర జీవన దుఃఖాలు,

వొడి చేరని
అశాశ్వతపు పిట్టల పాటలు.
యెటు పోతుందో తెలువని,
నావ అంచు కోస్తున్న నీళ్ళలోకి
మునిగిపోతున్న ముఖాలు,
జారిపోతున్న చూపులు.

చేప కళ్ళల్లో
మిగిలిన కన్నీళ్ళనుపూర్తిగా »