‘ పద్మావతి.బి ’ రచనలు

సురపురం – మెడోస్ టైలర్ ఆత్మకథ

ఆగస్ట్ 2017


సురపురం – మెడోస్ టైలర్ ఆత్మకథ

మనకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళటానికి బస్సులు, రైళ్లు, విమానాలు, ఎవరితో అయినా మాట్లాడటానికి రకరకాల సమాచార వ్యవస్థలు, ఏ మూల పల్లెటూరికైనా కనీసం ఒక మట్టిరోడ్డు, మన స్థిర చరాస్తు లేవైనా కానీ వాటిమీద మన హక్కు, మనమీద ఎవరైనా దాడి చేస్తే పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇంకో ఆలోచన లేకుండా మన జీవితంలో బాగం అయిపొయాయి. ఇవన్నీ లేని ఒకానొక కాలంలో – 1824 లో – ఇంగ్లాండు నుండి ఒక 16 ఏళ్ల కుర్రవాడు బొంబాయిలో ఈ దేశపు గడ్డ మీద అడుగుపెట్టి ఒక 36 సంవత్సరాలు ఈ దేశంలో తిరుగుతూ తను చూసిన కళ్ళతో అక్షరాల్లో అవన్నీ చూపిస్తుంటే చూడటం ఎంత…
పూర్తిగా »

కాలానికి నిలిచిన కథ పాలగుమ్మి పద్మరాజు ‘చీకట్లో మెరుపులు’

కాలానికి నిలిచిన కథ పాలగుమ్మి పద్మరాజు ‘చీకట్లో మెరుపులు’

ఒక మిత్రుడు, మా ఇద్దరికీ బాగా తెలిసిన వ్యక్తి, మేమిద్దరమూ పెళ్ళి చేసుకున్నామని తెలిసి అప్యాయంగా ఇంటికి భోజనానికి పిలిచాడు. నలభై ఏళ్ళు అతనికి. భార్య, ఇద్దరు పిల్లలు. ఆ సాయంత్రం నవ్వులు, సరదా, అందం, ఆనందం అన్నీ. కబుర్లు, కొత్త ఆశలు మావి. పాత ఆనందం వాళ్ళది. ముచ్చటయిన సంసారం. మధ్యలో ఊళ్ళు మారి, చిరునామాలు పోయి, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరునామా దొరికి పిల్లలతో వెళ్ళాము.

అదే ఇల్లు. సుఖ సామ్రాజ్యాలు ధ్వంసమయి మిగిలిన కోటగోడలా ఉంది ఇప్పుడా ఇల్లు. 15 ఏళ్ళ క్రితం ఆమె కాన్సర్ తో చనిపోయింది. పిల్లలకి రెక్కలొచ్చాయి. అతనికి రిటైర్ అయ్యే వయసు వచ్చింది.…
పూర్తిగా »