‘ బండారి శైలజ ’ రచనలు

సరిపెట్టుకుంటాను

ఫిబ్రవరి 2015


కొన్ని కొన్నిసార్లు
నువ్వలా నడిచి వస్తుంటావు నాలోకి
ఒక గాలి తెమ్మెరలానో
పల్చటి నీరెండలానో
కూతపెట్టుకుంటూ రైలుబండి
స్టేషనులోకి వచ్చినట్టు

నీలిమేఘమై తేలుతూ వచ్చి
కొన్ని తేనెచినుకులు చిలకరించి వెళ్లిపోతావు
బ్రతుకంతా సేదదీరడానికి
కడలికెరటంలా మెల్లగా వచ్చి
పాదాలు స్పృశించి వెళ్లిపోతావు

బయటో లోపలో నాలో నేను నిలబడి
అవతలి తీరాన్ని సర్దుతుంటాను
నాలో నుండి నన్ను ఎత్తిపోసుకుంటాను
కళ్లలోకి కొన్ని కలలను కుప్పచేసుకుంటూ
గూళ్లుగా కట్టుకుంటుంటాను.


పూర్తిగా »