‘ బండ్ల మాధవరావు ’ రచనలు

కొత్త కొత్తగా

08-ఫిబ్రవరి-2013


ఇవాల్టి నుంచీ కొత్తగా మొదలవుదాం
నిన్నటికి కొనసాగింపుగా కాక
ఈ రొజే మొగ్గ తొడుగుతున్నట్లుగా
తాజా తాజాగా
పరిమళ భరితంగా
పాపాయి
లేలేత చేతుల్లోని
అరవిచ్చిన బోసి నవ్వుల్లోని
మృదువైన స్పర్శ లాగా
కొత్త కొత్తగా మొదలవుదాం

మాటలు పాతవే కావచ్చు
సంభాషణలు సరికొత్తగా
మొదలుపెట్టుకోవచ్చు
చూపులు అవే కావచ్చు
సరికొత్త దృశ్యాల్ని ఆవిష్కరిద్దాం
రంగులు రుచులు ముఖాలు
అన్నీ పాత పాతగానే వుండొచ్చు
ఒకసారి ప్రయత్నిస్తే
ఏదో ఒక కొత్తదనం దొరక్క పోదు
ఈ రోజు రేపటికి పాతదైనాపూర్తిగా »