‘ మండువ రాధ ’ రచనలు

దామిని

నవంబర్ 2016


దామిని

“సౌమ్యా, అశోక్ అంకుల్ ఇంట్లో పార్టీకి నువ్వు రాగలవుటే?” అంది అమ్మ.

“ఊఁ వస్తానమ్మా, ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకుంటే పార్టీలో కూర్చోగలనులే” అన్నాను. నాకిప్పుడు తొమ్మిదో నెల. ఇంకో వారంలో డెలివరీ డేట్ ఇచ్చారు. నాకు నిజానికి ఓపిక లేదు కాని అక్కడ దామిని గారిని చూడొచ్చుకదా అనుకోవడంతో ఉత్సాహం వచ్చేసింది.

దామిని – నాకు ఇష్టమైన రచయితల్లో ఒకరు. అశోక్ అంకుల్ డాక్టర్. బిజినెస్ మాగ్నెట్ కూడా. భార్య పోయాక దామిని గారితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు.

సాయంత్రం అమ్మ, నాన్న, నేను బయల్దేరి వెళ్ళేప్పటికే అతిథులు చాలా మంది వచ్చేసి…
పూర్తిగా »

గాలిపిట్టలు

అక్టోబర్ 2016


నా పేరు శీను. నా వయసు పదిహేనేళ్ళు. కాదు కాదు – ఇప్పుడు నేను ఇంకా ఆమె కడుపులోనే ఉన్నాను. పదిహేనేళ్ళు అంటే – నేను బతికున్నప్పుడు నా వయసు పదిహేనేళ్ళని.

నేనే ఆమెకి బిడ్డగా పుట్టబోతున్నానని ఆమెకి తెలిసిపోయింది. అదిగో చూడండి!… “నువ్వే కదరా శీనా నా పొట్టలో ఉందీ!? నాకు తెలుసు, నువ్వే నాకు బిడ్దగా పుట్టబోతున్నావు”అని ఎన్ని సార్లు అనుకుంటుందో…

మా నాన్న ఆమె మంచం మీద ఓ పక్కన ఒదిగి పడుకోనున్నాడు. ముందు గదిలో అమ్మమ్మ (నాకు కాబోయే అమ్మమ్మ) దగ్గుతోంది. ఆ పల్లెటూళ్ళో పెంకుటిల్లు బావుంది.

ఇంకాసేపట్లో నా తల్లి కాబోతున్న ఆమె జీవితం గురించి మీకు ఇప్పుడే…
పూర్తిగా »

అన్య

సెప్టెంబర్ 2016


అన్య

నాలుగు రోజుల నుండీ ఒకటే ముసురు. ఐదో రోజు సాయంత్రం కాస్త తెరిపి ఇవ్వడంతో రంగరాయపురం అమ్మలక్కలంతా బిందెలు తీసుకుని ఒక్కొక్కరే కృష్ణ ఒడ్డుకు చేరారు. జమీందారుగారి కోడలుపిల్ల కృష్ణమ్మలాగా గలగలా నవ్వుకుంటూ వచ్చి "అబ్బ! నాలుగు రోజులు కృష్ణని చూడకపోతే ఎంత దిగులేసిందో” అంది. పెద్దింటి కోడలు ఏం మాట్లాడినా అందమే అన్నట్లుగా "ఓయమ్మ నాలుగు రోజులకే దిగులేసుకున్నావా?" అంటూ ఆమెని అల్లరి పట్టించారు ఆమె స్నేహితులు.
పూర్తిగా »

నాలుగు స్తంభాలాట

నాలుగు స్తంభాలాట

ఆడపావురం

“నేను అతన్ని చంపాలనుకోలేదు. నన్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేనే అతన్ని పొడిచాను. తప్పు నాది. నా బిడ్డది కాదు. నా బిడ్డనీ, నా చెల్లినీ, నా భర్తనీ వదిలేయండి. విచారించడానికి ఎన్ని చోట్ల నుండో వచ్చిన ఈ పెద్దల పంచాయితీకి ఏం జరిగిందో చెప్తాను…

అదిగో ఆ కనపడుతున్న రావిచెట్టు గూడే మా నివాసం. ఇంట్లో నేను, నా కూతురు, మా ఆయన, నా తిక్క చెల్లి ఉంటాం. తిక్క అంటే పెద్ద తిక్కదేం కాదు కాని అస్తమానం ఏవేవో తింగరి మాటలు మాట్లాడుతుంటుంది. పాపం అనాకారిదని దాన్నెవరూ పెళ్ళి చేసుకోకపోతే మా అమ్మానాన్నలు పోయాక మా ఇంట్లోనే ఉంచుకున్నాను.…
పూర్తిగా »

కృతి

జనవరి 2016


కృతి

నా గురువు గారు కావ్యం రచించారు. కేవలం నా భర్తతో నన్ను కలపాలని రాసిన కావ్యమట అది. నిన్న రాత్రి ఆ కావ్యాన్ని చదవమని దాన్ని నా మందిరానికి పంపారు. ‘స్త్రీలు అసూయ, అభిజాత్యం, అహంకారాలతో తెలియక ఏమైనా తప్పులు చేస్తే మగవాళ్ళు క్షమించాలి కాని వాళ్ళని దూరం చేయకూడదు’ అని మగవారికి చెప్తున్నట్లుగా రాసిన ఆ కావ్యాన్ని చదివినప్పటినుండీ నా మనసు మరింత వ్యధలోకి జారిపోయింది. ఇన్నేళ్ళ ఆవేదనల జ్ఞాపకాల రొదకి ఈ వ్యధ తోడై రాత్రి నిద్ర దూరమైంది.

నా భర్త నాకు చేసిన అన్యాయాన్ని నా గురువుగారు తన కావ్యంలో ఎత్తి చూపుతాడనుకున్నాను. నా ఆవేదనకి అక్షరరూపమిస్తాడనుకున్నాను.…
పూర్తిగా »

కాకిలోకం!

జూన్ 2015


కాకిలోకం!

నాతో పాటు ఆర్ట్ కాలేజీలో చదువుకున్న నా ఫ్రెండ్ రాం ప్రసాద్ సినిమాల్లో ఆర్టిస్్ట గా చేరి వేగంగా ఆకాశపథంలోకి దూసుకుపోతున్నాడు. నేనేమో మా ఆవిడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో కూర్చుని బొమ్మలు వేసుకుంటుంటాను. అప్పుడప్పుడూ - అప్పుడప్పుడూ కాదులే బాగానే పత్రికల్లో కనపడుతుంటాయి నా బొమ్మలు.
పూర్తిగా »

ఎందుకు వగచేవో…!?

ఎందుకు వగచేవో…!?

“నీతో మాట్లాడాలి సాయంత్రం పెందరాడే వస్తావా?” అన్నాను షూస్ కి లేసులు బిగించుకుంటున్న ఆయనకి దగ్గరగా వెళ్ళి.

“అబ్బబ్బ! సునందా! ఎప్పుడు చూసినా ‘నీతో మాట్లాడాలి’ అంటూ స్టార్ట్ చేస్తావు, ఏదో సీరియస్ విషయమేమో అనుకుని వస్తానా, పిచ్చి వాగుడు మొదలు పెడతావ్ – ‘మనం ఇట్లా కాదు ఉండాల్సింది అనో, అబ్బాయి మనసులో ఏముందో అనో’ – అసలు నీకు ఇలాంటి ఆలోచనలు పుట్టడానికి కారణమేంటో!? నీ లాంటి వాళ్ళ మెదడుని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. సరేలే నాకు ఆఫీసుకి టైమయింది” గొంతులో విసుగు.

అతన్ని ఏమైనా అని బాధించాలన్నంత కోపం వచ్చింది. వద్దు వద్దు – ఎందుకు పండగ పూట గోల?


పూర్తిగా »

ఓ భావ సంచలన శకలం

ఏప్రిల్ 2015


ఓ భావ సంచలన శకలం

“పోతాయని కాదు ఎక్కడైనా ఉండేవే. కాకపోతే నెమ్మదిగా, ఒంటరిగా వేరే భారాలు లేకుండా నా వంక చూసుకుంటూ రాసుకోగలుగుతాననే వెళ్ళడం. అదే తృప్తి అని తెలుస్తోంది కనుక వెళ్ళడం. ఆలోచనల, జ్ఞాపకాలతో నిర్మించబడ్డ 'నేను'(అహం) రాత వల్ల ఎంత ఎక్కువగా dilute అయిపోతే - ఇక మిగిలి ఉన్న 'అసలు core' బయట పడుతుంది. ప్రతి వాళ్ళకీ అందుబాటులో ఉన్నదిది. అయితే వాంఛలతో నడుస్తున్న – కాదు పరిగెత్తుతున్న మనిషిని ఆగమనో లేదా వెనక్కి చూడమనో అంటే వెర్రివాళ్ళుగా జమకడతారు. ఎవరి వృత్తిలో వారు మునిగి ఉండటం గొప్ప అంతే - ఆగి తమ వంక చూసుకోవడమే అవమానంగా భావిస్తారు. కోరికలు, పుణ్యాలు, శాస్త్రాలు, ఇజాలు…
పూర్తిగా »

చందమామ బిస్కత్తు

డిసెంబర్ 2014


చందమామ బిస్కత్తు

మల్లెపువ్వులాంటి తెల్లని బట్ట బుట్టపైన కప్పి ఉంటుంది. ఎవరైనా బిస్కెట్టు కొనుక్కుంటుంటే ఆ గుడ్డను కొంచెంగా తొలగించి అడిగిన బిస్కెట్టు తీసి ఇస్తాడు. మేం పిల్లలందరం ఆ కొంచెం సందులోంచే బిస్కెట్లని చూడాలని ఉబలాటపడేవాళ్ళం. నేనైతే అందర్నీ నా మోచేతులతో తోసేసి సాయిబు పక్కకెళ్ళి చూసేదాన్ని. గుండ్రనివి, వంకలవి, నిలువువి, చతురస్రాకారపువి, త్రిభుజాలు, నక్షత్రాలు ముఖ్యంగా చంద్రవంకలు వీటన్నింటికీ మధ్యలో పెద్ద చందమామ బిస్కెట్టూ...... తీపివి, ఉప్పువి, జీలకర్ర బిస్కెట్లు, వాము బిస్కెట్లు అన్ని రకాలూ ఉండేవి సాయిబు దగ్గర. కొన్ని బిస్కెట్ల పైన వేరుశనగ పప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు చల్లి ఉండేవి. అవి కాస్త రేటు ఎక్కువ. అన్నిటికంటే…
పూర్తిగా »

నెట్ వర్కింగ్ – అతనితో నా స్వగతం

నవంబర్ 2014


నెట్ వర్కింగ్ – అతనితో నా స్వగతం

రకరకాల రంగులు, కోణాలు, విశ్లేషణలూ, కోరిక యెక్క ఎన్నో రూపాలు, నేను ఇక్కడకి రాకముందు ఊహించను కూడా ఊహించనివి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం - 'రేపు మనం చనిపోతే మన గురించీ, మన వ్యక్తిత్వాల గురించీ అందరూ ఏమని చెప్పుకుంటారో అని తెలుసుకోవాలకునే దుగ్ద. దాని కోసం ఇప్పటి నుంచే ప్రతివాడి దగ్గరా గొప్ప అన్పించుకోవాలన్న తాపత్రయం. కోరికకి ఇది మరో రూపం కదా?
పూర్తిగా »