‘ రవి E.N.V ’ రచనలు

హంపివిరూపాక్షుడు – దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం

డిసెంబర్ 2017


హంపివిరూపాక్షుడు – దక్షిణ భారతదేశ సాంస్కృతిక ప్రస్థానం

చాలా ప్రాచీన కాలంలో ప్రకృతి యొక్క శక్తులను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి ఆరాధించేవారని చెప్పటానికి మన వాఙ్మయంలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. వేదకాలంలో ’రుద్రుడు’ ఒక దైవం. ఈ ’రుద్ర’ శబ్దానికి నిరుక్తంలో ’రోరూయమాణః ద్రవతి ఇతి రుద్రః’ అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే "హుర్రు...అన్న తీవ్రమైన శబ్దం చేస్తూ ప్రవహించే వాయువు" రుద్రుడు. వాయుదేవుడే రుద్రుడు అని చెప్పటానికి ఋగ్వేదంలోనూ కొన్ని సూక్తములు ఉన్నవి. తదనంతరకాలంలో రుద్రుడు - ’శివుడు’ గా పరిణమించటం, ఏకాదశ రుద్రులుగా వ్యాప్తి చెందటం జరిగాయి. హిందూ దేవతల వెనుక మార్మికమైన కథలు, కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలే విరూపాక్షుడికీ ఉన్నాయి.
పూర్తిగా »

ప్రబంధరసఝరి

అక్టోబర్ 2017


ప్రబంధరసఝరి

నేడు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో – ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.

తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా…
పూర్తిగా »

ప్రబంధరాగలహరి

జనవరి 2017


ప్రబంధరాగలహరి

అన్ని అవ్యక్త రాగాలు పలికించే వరూధిని, ప్ర-వరుని చూచింది. చూచి ఆ ’పంకజ’ముఖి, ఆతని సౌందర్యానికి మోహవిభ్రాంతి చెంది, తన ’అరవిందము’ను పోలిన తన పాదముల అడుగులు తడబడుతుండగా దిగ్గున లేచి ఎదురేగింది. ప్రవరుడికి మాత్రం అవేవీ పట్టలేదు. తనను ఊరికి చేర్చమని ఆమెను ప్రార్థించాడు. ఆవిడ - ఇక లాభం లేదని, ఇదివరకు అవ్యక్తంగా చూపిన అనురాగాన్ని వ్యక్తం చేసింది. ఇన్ని వ్యక్త అవ్యక్త రాగాలు పలికించినా, ఆ ’అరుణాస్పదపురవాసి’ ప్ర-వరుడికి ఆమెను చూడగా ఎదలో అనురాగం ఉదయించలేదు. (ఆస్పదము అంటే - నెలకొను, ఊనిక base అని అర్థం. అరుణాస్పదము - అంటే కావ్యంలో ప్రకరణికార్థంగా ఏ ప్రత్యేకతా లేదు కానీ, వ్యావహారికంగా…
పూర్తిగా »

మధ్యమవ్యాయోగం

అక్టోబర్ 2016


మధ్యమవ్యాయోగం

ప్రస్తావన:

సాధారణంగా ఓ కథ అల్లడానికి కథకుడు కొన్ని మౌలికమైన పద్ధతులు పాటిస్తాడు. అవే పద్ధతులు నాటకరచన లోనూ ఉపకరిస్తాయని భావించవచ్చు. రేఖామాత్రమైన కథ (storyline) ను ఊహించి, దాన్ని పొడిగించి, కొన్ని అంకాలుగా తీర్చి, పాత్రలను, పాత్రధారులను, సన్నివేశాలనూ, సంభాషణలనూ జోడిస్తూ విస్తరించడం ఒక పద్ధతి. అలా కాక ఒక వృత్తాంతాన్ని (theme) ఎంచుకుని, థీమ్ కు సరిపడా కథను సాధ్యమైనంత విస్తృతంగా ఒక చిత్తుప్రతి ద్వారా కూర్చుకొని, ఆ కథను ట్రిమ్ చేసి, అనవసరమైన సంభాషణలనూ, పాత్రలనూ, సన్నివేశాలనూ కత్తిరించి, మెరుగుపెట్టటం రెండవ పద్ధతి. మొదటిది రాత. రెండవది కోత. మొదటిది ఎక్కువభాగం Writing. రెండవది ఎక్కువభాగం Editing.

భాసుని నాటకాలలో స్వప్నవాసవదత్తమ్…
పూర్తిగా »

మరీచిక

సెప్టెంబర్ 2016


ఆటో అబ్బాయి కొంతసేపయిన తర్వాత మాటలు కలిపేడు. ఆ తర్వాత నేను కూర్చుని ఉన్న సీటు పక్కనా, వెనుకా చూడమన్నాడు. అక్కడ కొన్ని సినిమా తారల ఫుటోలు, కొన్ని కవితలూ రాసి ఉన్నాయి. అన్నిటిలోనూ ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు. సినిమా తారలతో ఫుటో దిగటం చవకబారు హాబీయే కదా అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఆ అబ్బాయి 'కథ' చెప్పాడు. అతని కుటుంబం చిన్నది. అయితే అతడు కుటుంబ బాధ్యతకన్నా మరొక గొప్ప సామాజిక బాధ్యత ఒకటి తీసుకున్నాడు. అతడు తీరిక వేళల్లో సినిమాలలో ఫైట్లలో పాల్గొంటాడు.
పూర్తిగా »

ప్రబంధవిపంచిస్వరలహరి

ఆగస్ట్ 2016


ప్రబంధవిపంచిస్వరలహరి

సందర్భం, నాంది:

మధ్యాహ్నం. ఎండ ఉద్ధృతంగా లేదు కానీ, చురుక్కుమనే అంటూంది.  అయితే వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. కొండ దిగి లోయకువస్తే కనుచూపుమేరా ఆకుపచ్చని తివాచీ పరుచుకున్నట్టు రాజనాల వరిపైర్లు. కయ్యల గట్లకు పక్కనే చిన్న చిన్న పంటకాలువలు ప్రవహిస్తున్నాయి. కాలువలలోంచి అక్కడక్కడా ఉబికి వచ్చిన ఎర్రటి కలువపూలు. అవి తమ పక్కన – కాస్త వంగిన వరిపైరుతో ఊసులాడుతున్నై. చల్లని గాలితో బాటూ ఆ కలువల పరిమళం నింపాదిగా వీస్తోంది.

తొందరగా ఈ ప్రదేశం నుంచి బయటపడాలి. అతని ఊరికి వెళ్ళాలి. కానీ అతడు ఊరికి వెళ్ళలేడు. ఆ త్రోవ కూడా తెలియదతనికి. జనావాసం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి చేరేడు. ఈ పచ్చని…
పూర్తిగా »

రూపు

జూన్ 2016


రూపు

అనగనగా - గిరిక అనే ఓ అందమైన తెనుగు ప్రబంధనాయిక. ’అందమైన’ అంటే సాదా సీదా అందం కాదు. వెన్నెల వెలుగుకే తట్టుకోలేక ఎలుగెత్తి శోకాలు పెట్టేంత సుకుమారి. జ్యోతిష్య,వ్యాకరణాది శాస్త్రాలను ఔపోసన పట్టిన మహా పండితుని కలం నుంచి జాలువారిన ముగ్ధ. సంస్కృతంలో అయితే ’తన్వి’. ఆ అమ్మాయి కోనలమధ్యన కేళీమందిరంలో కూర్చుని వీణ వాయిస్తూంది. ఆ వీణానాదాన్ని అధిష్టానపురపు రాజు విన్నాడు. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనుక్కుని రమ్మని తన అనుంగుమిత్రుణ్ణి పంపినాడు. ఆ నర్మసచివుడు వచ్చి, ఆ అమ్మాయిని కాస్తా చూశాడు. చూసి వచ్చి తన మిత్రుడు, యజమాని అయిన మహారాజుకు ఆమె అందం గురించి సుదీర్ఘంగా చెప్పాడు.
పూర్తిగా »

కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము – మొదటి ప్రతీకాత్మక భారతీయ నాటకం.

మే 2016


ఒక గహనమైన సిద్ధాంతాన్ని కానీ, క్లిష్టమైన సందేశాన్ని కానీ చెప్పాలనుకున్నప్పుడు ప్రతీకను (Allegory) ఉపయోగించటం- భారతదేశంలో వేదకాలమంత పురాతనమైనది. దీనికి దృష్టాంతంగా ప్రాచీన ఉపనిషత్సాహిత్యంలో, ముండకోపనిషత్తులోని ప్రముఖమైన శ్లోకం ఇది.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే |
తయోరన్యః పిప్పలం స్వాదత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి ||

ఒక చెట్టుపైన రెండు పక్షులు ఉన్నాయి. క్రింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది మధురమైన పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖాన్ని పొందుతున్నది. రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొని చూస్తూ, సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంది.

వృక్షం – జీవునికి,…
పూర్తిగా »

లజ్జాగౌరి

జనవరి 2016


లజ్జాగౌరి

కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లా, చరిత్రకూ, సుందరమైన మలప్రభా నదీపరీవాహక ప్రాంతానికి, కస్తూరి కన్నడ భాషా సౌరభాలకు ప్రసిద్ధి. ఒకప్పటి చాళుక్యుల రాజధాని అయిన బాదామి (వాతాపి) ఆ జిల్లాలోనే ఉంది. నాడు ఆ రాజులు కట్టించిన గుహాలయాలు, చుట్టుపక్క ప్రాంతాలలోని దేవాలయాలు నాటి ప్రాభవానికి సజీవ సాక్ష్యాలుగా నేడు నిలిచి ఉన్నాయి. ఇక్కడి పట్టదకల్లు దేవాలయప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.

చాళుక్యుల కాలం నాటి కొన్ని అవశేషాలను బాదామిలో ఒక సంగ్రహాలయంలో భద్రపరిచారు. ఆ మ్యూజియమ్ లోనికి ప్రవేశిస్తూనే ఒక వింత స్త్రీమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పేరు “లజ్జాగౌరి”. ఇదే విగ్రహాన్ని తెలంగాణాలో అలంపురం మ్యూజియమ్ లో…
పూర్తిగా »

భాస కాళిదాసులు

డిసెంబర్ 2014


భాస కాళిదాసులు

ఆకాశంలో ఇద్దరు సూర్యులు ఉండటం అసంభవమేమో కానీ యే సాహిత్యవినీలాకాశంలోనైనా ఒకరిద్దరు కాదు అనేక సూర్యులు ఉండవచ్చు. నిజానికి సాహిత్యంలో ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని చెప్పే ప్రమాణాలేవీ కూడా కొరగావు. మరి ఆ శీర్షికకు అర్థం ఏమిటి? – అంటే అది ఆ కవుల మధ్య పోటీ కానీ పోలిక కానీ కాదు, అదొక అనుశీలనాపద్ధతి అని చెప్పవలసి వస్తుంది. అలా సంస్కృత సాహిత్యంలో ఇద్దరు కవుల ఒరవడిని, వారి కవిత్వ రీతులను, వారి కవిత్వపు లక్ష్యాలను కొంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసలక్ష్యం.

ఆ ఇద్దరు కవులలో భాసకవి పూర్వుడు. కాళిదాసుది తరువాతి కాలం. కాళిదాసు భాసుని ప్రథితయశసుడని కీర్తించాడు.


పూర్తిగా »