‘ వర్మ కలిదిండి ’ రచనలు

ఒక్క మాటా తూలని ఆమెకి..

అక్టోబర్ 2015


సంభాషణా ప్రియత్వం ఆమెది
చేతులు అటూ ఇటూ ఊపుతూ
వేళ్ళని ఒక ముద్రలా ముడిచి
మంత్రలిపిని పలుకుతుంది.

అలుపెరగని ఆమె పెదాలని చూస్తే
చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపిస్తూ
అమ్మ చూపిన చందమామ
మళ్ళీ ఇన్నాళ్ళకి తారసపడింది

ఆమె ఒక పూదోట
సత్యంలాంటి అన్వేషి
రుతువుల్లాంటి ప్రకృతి
ఆమె ఒక్క మాటా తూలని నిశ్శబ్దం

ఆటొదిగి
ఉత్సవం తరువాతి మౌనంలా వెళ్ళిపోతున్న ఆమెకి
ముద్రతోనో మంత్రలిపిలోనో …

ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్ వార్తలలో నేర్చుకొని
జాగ్రత్త తల్లీ అని చెప్పాలి.


పూర్తిగా »