‘ వేణు వేపూరి ’ రచనలు

నిశ్శబ్ధ స్ఖలనం

మార్చి 2015


శూన్యం
సువిస్తార శిధిల శబ్ధం

అది, ఎద తలుపుల మాటున
తలపుల ఆబిస్స్ (Abyss).
ముట్టుకొంటే, ఆర్తినిండిన
వెచ్చని భావాల ముడి

ఒకానొక యుగంలో, లిప్తపాటు
జనించిన ఆర్ధ్రతావిష్కారం.
మనో విచ్చేదనాలలొ,
సాముహిక వ్యధలకి,
అంతర్ గర్భిత కల్లోలాలకి,
సాక్షిగా – అకాల కణం.

వేనవేల వత్సరాలు,
విలపింపులని వేదనలని,
తనలో కుదించుకుని, గుప్ఫున
వేలివడ్డ నిశ్శబ్ధ స్ఖలనం

శూన్యం
అవిస్తార శిధిల శభ్ధం

**** (*) ****


పూర్తిగా »