‘ వేమూరి వేంకటేశ్వరరావు ’ రచనలు

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

డయాస్పోరా రచయితల అనుభవాలను ఒక కూర్పుగా చేసి ఆటా సావనీర్లో వేద్దామనే ఉద్దేశంతో రచయితలకు ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకు ఆయా రచయితలు చెప్పిన సమాధానాలు, వారి అనుభవాలు ఇక్కడ మీకోసం (ఆటా వారి అనుమతితో):
ప్రశ్నలు:

1. డయాస్పోరా రచయితగా మీరు చేసిన రచనలు, మీరు పడ్డ ఇబ్బందులు, మీ సాహిత్య ధోరణిలో/గమ్యంలో వచ్చిన మార్పుల గురించి చెప్పండి? ప్రవాసదేశంలో మీరు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల్ని ఎంతవరకు సాహిత్యీకరించగలుగుతున్నారు?

2. అమెరికాలో మీరు భిన్న దేశాల సాహిత్యాలు చదువుతుంటారు కదా! అవి చదువుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఒక రచయితగా అంతర్జాతీయ పటం మీద మీరు ఎక్కడ ఉన్నారనుకుంటారు?


పూర్తిగా »

నీరసించిన ఉపతాపి నేర్పిన పాఠం

నీరసించిన ఉపతాపి నేర్పిన పాఠం

మా పరీక్షా మందిరానికి ఉన్న చిన్న కిటికీ లోంచి బయటకి చూస్తే ఖాళీగా ఉన్న నిరీక్షా మందిరం, ఆ బయట కచ్చా రోడ్డు, ఆ రోడ్డుకి ఇరుపక్కలా ఎర్రటి ఎండలో మాడుతూన్న సీనారేకు కప్పులతో ఉన్న గుడిసెలు కనిపించేయి. ఇంక ఆట్టే వ్యవధి లేదు. చీకటి పడే లోగా కేలిఫోర్నియా చేరుకోవాలంటే ఇక్కడ మూటా, ముల్లె సర్దుకుని, కారు వచ్చే వేళకి సిద్ధంగా ఉండాలి.

మేము – అంటే కొంతమంది వైద్యులు, నర్సులు, దుబాసీలు – అంతా కలసి మెక్సికోలో మారు మూలన ఉన్న ఈ చిన్న కుగ్రామానికి మొన్ననే వచ్చేం. కేలిఫోర్నియా-మెక్సికో సరిహద్దుకి దక్షిణంగా ఉన్న బాహాలో చిన్న చిన్న ఊళ్లకి నెలకోసారి వచ్చి,…
పూర్తిగా »