‘ వైదేహి శశిధర్ ’ రచనలు

విద్యుద్దీపాలు

19-ఏప్రిల్-2013


కృతకమైనా విద్యుద్దీపాలు
విడదీయలేని జిలుగు దారాలై
జీవితాలతో పెనవేసుకుంటాయి

ఒక్క క్షణం అవి వెలగకపోతే
ఎంతటి సౌధాలయినా నిస్సహాయపు చీకటిలో
చిక్కగా చిక్కుకుంటాయి

అద్భుత రాగాల్ని వినిపిస్తూ వినిపిస్తూ
ఒక్కసారిగా ఆగిపోయిన గ్రామఫోన్ లా
జీవనం హఠాత్తుగా స్తంభించిపోతుంది.

కానీ
చీకటి ని వెలిగించే నక్షత్రదీపాలు
రాత్రిని మెరిపించే వెన్నెల మైదానాలు
ముంగురులతో ఆడుకునే చల్లగాలి తెమ్మెరలు
ఒక్కసారైనా అనుభవంలోకి రావాలంటే మాత్రం
కనీసం కాసేపైనా కరెంట్ పోవాలి

చిన్నప్పడు నాయనమ్మ తో కలిసి
సెలవుల్లో తిరిగిన పల్లెటూళ్ళ జ్ఞాపకాలు
వెచ్చటి గ్లాసు లాంతర్ల చుట్టూ ముచ్చట్ల…
పూర్తిగా »