‘ సాయి పద్మ ’ రచనలు

గాలికీ కులముంది…!!

మార్చి 2015


గాలికీ కులముంది…!!


అదో గాడ్పు మధ్యాహ్నం. వాళ్ళని దింపిన బస్సు అంపకాలు పెట్టి చేతులు దులిపేసుకున్న తండ్రిలా హడావిడిగా అపస్వరపు హారన్ రోదన చేసుకుంటూ వెళ్ళిపోయింది. దూరం నుంచి ‘ఇదే ఇల్లు ‘ చూపించాడు నారాయణ. దగ్గర పడుతున్నకొద్దీ ఏదో దిగులుగా, గుండెలు చిక్కపట్టినట్టు అనిపించింది అమృతకి . ఆమె హ్యాండ్ బాగ్ లో ఉన్న అమృత మత్సకంటి వెడ్స్ నారాయణ స్వామి గౌడ్ అని ఉన్న శుభలేఖ ఒక్కసారిగా బరువెక్కినట్టు, ఒకానొక వేసవి జూన్ నెల ఉబ్బరం అంతా మొహం లోకి వేడిగాలిలా కొట్టినట్టయి నారాయణ చేతిని పట్టుకుంది, అప్రయత్నంగా. సెకనులో టెన్షన్ తో ఉన్న నారాయణ మొహంలోకి ధైర్యపు నవ్వు పాకి వచ్చింది.…
పూర్తిగా »

బీతేవెన్ ఊహలాంటి జీవితపు అందమైన బహానా.. ఆకుపాట కవిత్వం

జూలై 2014


బీతేవెన్ ఊహలాంటి జీవితపు అందమైన బహానా.. ఆకుపాట కవిత్వం

శ్రీనివాస్ వాసుదేవ్ గారి కవిత్వ సంపుటి, ఆకుపాట చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఒక వర్షగోళం ఆహ్లాదంగా తాకి, నిర్ప్లిప్తంగా ఆవిరయ్యే క్షణంలో, ఒక అందమైన పాట, ఏకాంతం నుండి మార్మిక లోకంలోకి వెళ్ళే ప్రయాణంలో, అందీ అందని అనుభూతికి ఏదో ఫత్వా విధించినట్లు.. అక్షరం తాలూకు నిట్టూర్పు కూడా అందమైనదే సుమా.. అదీ సున్నితత్వ’మో, మార్మికత్వమో, మానవత్వమూ నింపుకున్న కవి కలల గళంలో నుంచి జాలువారితే ..!! మనః తొలకరి ఆకుపాట అనే చెప్పాలి.

కవి మాటల్లో చెప్పాలంటే, “అది ఆర్టా, హార్టా అని నిలదీస్తే మాత్రం, వొళ్ళంతా విచ్చుకున్న ఆకాశ గోడలపై, గుండెని ఆరబెట్టినవే నని చెప్పుకుంటాం ..” ఎంత నిజం…
పూర్తిగా »

రైనా బీతి జాయే …!!

ఏప్రిల్ 2014


రైనా బీతి జాయే …!!

ఎందుకొస్తారు ఎవరైనా .. ఆకాంక్షలని అదిమిపెట్టి, జీవితానికి స్తేపిల్ గా గడిపేస్తున్న, వ్యగ్ర మోహ ప్రపంచంలోకి , అనుభూతులని తాకట్టు పెట్టి , ఎంత సంతోషంగా ఉన్నామో అని , దుఃఖంగా మురుసుకునే ముసిరిన మనసుల్లోకి .. ఎందుకు రావాలి ఎవరైనా .. నీ జ్ఞాపకాల నీడల్లో సేదదీరుతూ.. అనుభూతుల్లో నాని , నాని చిరునవ్వుగా కన్నా మేలాంకలిక్ గా మారిన నీ దగ్గుత్తికని నువ్వంత ప్రేమిస్తున్నప్పుడు .. చోటులేని తనంతో ఉక్కిరిబిక్కిరి అవరా .. జ్ఞాపకాలు అవమేమో అని బెంగేట్టుకుంటున్న నీ ప్రస్తుత శకలాలు ..? ఎవరో ఆపే ఉంటారు.. కన్నీరు తోనో, నిస్సహాయత తోనో, కరుణ తోనో……
పూర్తిగా »

జయభేరి మొదటి భాగం – కవితలు

జయభేరి మొదటి భాగం – కవితలు

రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

 


పూర్తిగా »

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు

గొలుసు కవితలు

కవిత్వం ఎప్పుడూ ఒక ధార, ఒక ప్రవాహం. అనుభవం నుండి అనుభూతికి, సంఘటన నుండి సంస్పందనలోకి, మాట నుండి మనసుకి, మనసునుండి తిరిగి మనిషిలోకి నిర్విరామంగా నడుస్తూ, తాకుతూ, తడుపుతూ, తట్టి లేపుతూ కలుపుకుంటూ పోయే నిరంతర వాహిని కవిత్వం. కవిత్వం లోని ఈ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ..

ఒక చిన్న ప్రయోగం చేద్దామా? గొలుసు కవితలు రాద్దామా?
ఎక్కడిదైనా ఏదైనా ఒక కవితలోని ఒక వాక్యాన్ని తీసుకుని దాంతో మొదలెట్టి ఎవరైనా ఇక్కడ ఒక కవితను రాయండి. ఆ కవితలోని ఒక వాక్యంతో మరొకరు మరో కవిత… ఇలా ఒక భావం నుండి మరో భావం, ఒక వ్యక్తీకరణనుండి…
పూర్తిగా »

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

కవిత్వం నాకేమిస్తోంది? 

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని…
పూర్తిగా »

కళింగాంధ్ర తీర్ధ ప్రసాదాలు- చింతకింది శ్రీనివాసాం’తరంగాలు

జనవరి 2014


కళింగాంధ్ర తీర్ధ ప్రసాదాలు- చింతకింది శ్రీనివాసాం’తరంగాలు

చింతకింది శ్రీనివాస రావు, ఉత్తరాంధ్ర సాహిత్యంతో పరిచయం ఉన్న అందరికీ , రావి శాస్త్రి , పతంజలి సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతీ వారికీ కొత్తగా తెలిసిన పాత పేరు. శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ , నానీ ప్రక్రియ పై రీసెర్చ్ చేసిన సాహిత్య శాస్త్రవేత్త, “నానీల నాన్నగారు’ ఆచార్య ఎన్. గోపీ గారిచే ప్రశంశలు పొందిన రచయిత. పైగా , అతని భాషలో చెప్పాలంటే “ అక్షరాన్ని , అమ్మనీ ప్రేమించని వాళ్ళనీ, శత్రువులు లేని వాళ్ళనీ, గట్టిగా ఏడవని వాళ్ళనీ , చూస్తే నాక్కాస్త భయం తల్లీ ..!!”

పై ఒక్క ముక్క చాలు శ్రీను బాబు అంటే ఎటో సెప్పతానికి.. పుట్టడం…
పూర్తిగా »

ఇంకా రాయాల్సింది చాలా ఉంది – సాయిపద్మ

డిసెంబర్ 2013


ఇంకా రాయాల్సింది చాలా ఉంది – సాయిపద్మ

నా పేరు సాయి పద్మ. పుట్టడం, పెరగడం, చదువుకోవటం, అక్షరాల నుండి సాహిత్యం దాకా పరిచయం అన్నీ విజయనగరం జిల్లా . అమ్మ, నాన్న డాక్టర్లు , చిన్న  వయసునుండే ఇంగ్లిష్ లో మాట్లాడాలని బాగా  ఉండేది మా కజిన్స్ తో వాళ్ళతో. . అయితే చదివేది తెలుగు మీడియం అందువల్ల ఎలాగైనా ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన. నాన్న గారి గది లో ఉన్న ఇంగ్లిష్ పుస్తకాలన్నీ చదివేయాలని , నాన్న గారితో చాలా తెలివిగా మాటాడేయాలి అన్నది  ప్రధమ కోరిక నాలో  చాలా  చిన్న వయసునుండే ఉండింది. ఎందుకంటే అందరి పిల్లల్లా నేను ఆడు కోవడానికి  వీలు  అయ్యేది కాదు. అదీ కాక  ఏదో చదవాలనే తపన నాలో ముందు…
పూర్తిగా »

ఖాళీల అంచుల్లో…

02-ఆగస్ట్-2013


ముందుకీ వెనక్కీ నడుస్తూనే ఉన్నా..

కొన్ని అడుగులు నీతో,కొన్ని నాలోకి వేస్తూ
నీటి ఊట లాంటి ఆశల్ని, స్వేదజాలం చేసుకొని
ఉబికోస్తున్న ఆవేశాన్ని, వేసవి స్నానం లా కడిగేసిన
నీ నిబ్బరం నాకు అబ్బురం అప్పుడప్పుడూ
ముసుర్లలో,మొహమాటపు చెలమల్లో.

నువ్వు చెప్పలేని మాటల్ని విందామనే
అనుకున్నా ఈ పూట, అయినా నిశ్శబ్దం ఇంత సాధనేంటి నీకు?
జలతారు తెరలు పలచనే,అవే అద్దాలైతే
నువ్వూ,నేనూ,ఉంటాం అంతే, ఒకరికొకరు వినపడకుండా
ఒకే గదిలో రెండు వాచీల సమయాల్లా..

నీదో మౌనమైతే, నాదో అంతర్ముఖం
ఏమీలేని తనాల గురించి ఆలోచించటం మొదలెట్టా, రెండు రాళ్ల మధ్య ఖాళీల్లాపూర్తిగా »

రంగ పిన్ని ఆకాశం

జూలై 2013


రంగ పిన్ని ఆకాశం

నాకు రంగ పిన్ని అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టమంటే అమ్మ కన్నా ఇష్టం . అమెరికా నుంచి సెమిస్టర్ break కోసం ఇండియాకి వచ్చిన మర్నాడే , పిన్ని ఇంటికి వెళ్ళాలి అన్నంత ఇష్టం . అమ్మ చంపేస్తుందని ఆగాను గానీ, లేదా అక్కడే దిగేదాన్ని. అందుకే అమ్మ చెప్పిన మాట విని , తాగుతున్న ఫిల్టర్ కాఫీ గొంతులో గరళం అయిన ఫీలింగ్ వచ్చింది . ” రంగ విషయం ఏమీ తెలీదురా .. మారిపోయింది పూర్తిగా, నాకేం నచ్చలేదు ” అన్నది అమ్మ. ” అదేంటమ్మా అలా అంటావ్? రంగ పిన్ని ఏం చేసింది? బాబాయితో ఏమన్నా గొడవా ? ”…
పూర్తిగా »