‘ హెచ్చార్కె ’ రచనలు

కోరిక

25-అక్టోబర్-2013


కోరిక

గుక్క పట్టి ఏడుస్తుంది. కటిక నేల మీదికి దొర్లి కాల్జేతులు కొట్టుకుంటుంది.
అంతా అయిపోయాక ఒక మెత్తని అద్దం నవ్వై ఒళ్లోకి ముడుచుకుంటుంది.
ఎందుకేడ్చావంటే ఏం చెబుతుంది పాప? ఏదో చెబితే మాత్రం, అది నిజమా!

నేనూ అంతే. ఏం కావాలో తెలియదు. తెలిసిందేదీ చివరిది కాదు. కోసుకుపో
తుంటుంది, రూప రస గంధాల్లేనిది, ఏ నిరూపణకు నిలవనిది, నా కన్న ముందే
వచ్చి ఇక్కడ వుండినది, తనతో కలిసి కాలడమే గాని పొమ్మనడానికి వీల్లేనిది,

ఒకటి కాకుంటే ఇంకోటి. రూపాల దేముంది, రస గంధాలూ అంతే. ఇదిగో ఇదే,
ఇదే, ఇదొక్కటే, ఇంకేదీ కాదు, ఇదే చివరిదని…
పూర్తిగా »

అపనమ్మకం ఆగిపోయే సందర్భం: ఆకుపచ్చ దేశం

07-జూన్-2013


అపనమ్మకం ఆగిపోయే సందర్భం: ఆకుపచ్చ దేశం

కొన్ని పుస్తకాలుంటాయి. చదివాక ఎవరితోనైనా ఏమైనా చెప్పాలని బలమైన కోరిక పుడుతుంది. చెప్పకుండా ఉండడం కుదరదు. డాక్టర్ వి చంద్రశేఖర రావు ‘ఆకుపచ్చ దేశం’ చదివాక అలా అనిపించింది. అంతర్ బహిర్ స్వప్నభంగాల వల్ల నవలను ఒకేసారి చదవకపోవచ్చు నాలాగే ఎవరేనా. మూడు నాలుగు సార్లు ఆపి చదవొచ్చు. చదవకుండా ఉండలేరు. ఇది ఇలాంటి నవల రచన/పఠన పద్ధతిలోనే ఒక భాగం కావొచ్చు. కథ మొదలైనప్పట్నుంచి చివరి వరకు ఎక్కడా ఆగని ఒక ధార ఆశ్చర్యపరుస్తుంది.

రచయిత తన పనిలో తాను తన్మయుడై వుండే సమయాన్ని ‘సమాధ్యవస్థ’ అంటారనుకుంటా. తనదైన ఒక ‘సమాధి’ లోనికి వెళిపోయి ఇక అదే మూడ్ లో ఉండిపోయే ఒక అద్భుత…
పూర్తిగా »

లేదు

లేదు

ఊరిని చూస్తే ఊరిని చూసినట్టు లేదు
ఇంకాసేపట్లో ఖాళీ చేసి వెళ్లిపోనున్న బిడారును చూసినట్టుంది

అడివిని చూస్తే అడివిని చూసినట్టు లేదు
చట్టవిరుద్ధంగా పత్రహరితం దాచుకున్న దొంగను చూసినట్టుంది

మనిషిని చూస్తే మనిషిని చూసినట్టు లేదు
ఆకారం పొందిన ఖాళీతనాన్ని, అంగీకృత ఓటమిని చూసినట్టుంది

తోటలో
సీతాకోక చిలుకలుగా మారలేని తిండిపోతు గొంగళి పురుగులు
కావిలించుకోవాల్సిన దేహాల మీద సందేహాల తుమ్మ పొదలు
నాల్కల మీద పదును దేరిన ముళ్లు లేదా వలల తాళ్లు

గాలిలో ప్రయాణం
అడుగు తీసి అడుగేయడానికి కాస్త నేల వుంటే బాగుండు
ఆసరా లేదెలాగూ
అసూయ పడ్డానికైనా…
పూర్తిగా »

బాధాగ్ని కుసుమం: కలల కళ్ల నిషా

జనవరి 2013


బాధాగ్ని కుసుమం: కలల కళ్ల నిషా

‘బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్న… క్షణాల మధ్య అగాథంలో స్వప్న చక్షువుల నిషా’ ను రుచి చూపించించిన కవి అజంతా.  పువ్వులు, అగ్నుల భాష కలిసిపోతే ఎలా వుంటుందో వాసన చూయించిన కవి. ‘కాంతా సమ్మితత్వా’న్ని వదులుకోకుండానే ‘అగ్నిసమ్మితమై’న కవిత అజంతాది.

తెలుగు అజంత భాష. తెలుగు పదాలు హల్లులతో కాకుండా అచ్చులతో అంతమవుతాయి. అందుకే తెలుగుకు ఇంతటి సంగీత శక్తి. తెలుగుదనాన్నే కాదు, తెలుగు సంగీతాన్ని వచన కవితలో అందించిన కవి అజంతా.

చిన్న చిన్న వాక్యాలు చుదువుకోడానికి బాగుంటాయి. వాటికి కాస్త పద మైత్రి కలిస్తే వచనం వేగంగా వెళ్లిపోతుంది. ఎక్కడున్నామో తెలిసే లోగా రైలు స్టేషన్ కు చేరుతుంది. చదవీ…
పూర్తిగా »