వాకిలి » మాట్లాడుకుందాం

సంగీత సాహిత్యమే …
ఈ మధ్య ఒక పుస్తకంలో ఒక ఆలోచింప జేసే ప్రతిపాదన చూసాను. అది చూసిన తరువాత దానిలో నిజానిజాలెంతో మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలనిపించింది.

ముందుగా ఈ ప్రతిపాదన చేసిన మనిషి గురించి నాలుగుమాటలు.

ఈయనకు తన మాతృభాష మీద అసాధారణమైన అధికారం ఉండేది. యూనివర్సిటీ చదువుకు స్వస్తి చెప్పి రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టి పాత్రికేయుడిగా, వ్యాసకర్తగా, బహుగ్రంథకర్తగా, విశ్లేషకుడిగా, మేధావిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి.

కొన్ని దశాబ్దాలపాటు విపరీతంగా చదవటం, వ్రాయటం ప్రధాన ఉద్యోగాలుగా పెట్టుకుని తనభాషలో ముఖ్యంగా వ్యాసరచనలో అసమానుడని మన్నలందుకున్న వ్యక్తి. భాషమీద ప్రేమకు ఇతరేతరకారణాలు అవసరంలేదని దానికదే కారణం అని నమ్మిన వ్యక్తి. తోటి రచయితలను, కవులను విశేషంగా అభిమానించే సంస్కారి.

ఇంకా వీరిగురించి చెప్పాలంటే చాలావుంది గానీ మన అంశానికి నేపథ్యంగా ఈ వివరాలు చాలు.

ఈయనకు ఒక సందేహం. వచనం, వ్యాసాలూ గట్రా బాగానే వ్రాయగలను గానీ కల్పనతో సృజనతో కూడిన సాహిత్యం, అనగా కథ, నవల, కవిత్వం మొదలైనవి తాను అంతబాగా వ్రాయలేనని. ఆ దిశగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని అతని అంచనా.

దీనికి కారణం ఏమిటని ఆలోచించగా ఒకరోజు మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టిందిట.

“సంగీతం” అనేది ఆ ఆలోచన.

ఇంకా వివరంగా చెప్పాలంటే సంగీతాభిమానం, అభిరుచి, ప్రవేశం ఇలా సంగీతంతో అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉంటే అంత మంచిది కథా, నవలా రచయితలకు, కవులకు అనిన్నీ, ఇది లేనివారు కేవలం తనలాగా నాన్-ఫిక్షన్ వ్రాసుకోవలసిందే అనిన్నీ అనిపించిందట.

ఈ ఆలోచనను తనకు, తన స్నేహితులకు, తనకు తెలిసిన సృజనాత్మక రచయితలకు అన్వయించి చూసి తనకు ఆటలలాగే సంగీతం పెద్దగా తలకెక్కదని, తనకు తెలిసిన కవులు, నవలారచయితలు అందరికీ సంగీతంలో ఉత్తమ అభిరుచి, ఆసక్తి ఉన్నదనీ ఈయన తేల్చుకున్న విషయం.

కవిత్వం ఒక ఆల్కెమీ అన్నాడు తిలక్. ఈ ఆల్కెమీకి (అలాగే ఫిక్షన్ అంతటికీ) సంగీతాస్వాదన ఒక తప్పనిసరి అయిన ముడి సరుకు అన్న ప్రతిపాదన చాలా ఆసక్తికరంగా అనిపించింది నామట్టుకు నాకు. మనకు కొద్దొ గొప్పో తెలిసిన కవులందరికీ సంగీతం ఇష్టమే అనుకుంటాను. చాలామంది బాగా పాడుతారు కూడా. కొందరు ఇతర లలిత కళలలో కూడా ప్రవేశంవున్నవారున్నారు. అయితే చాలామంది సాహితీ వేత్తల సంగీతాభినివేశం గురించి మనకున్న సమాచారం స్వల్పం.

సంగీతం పట్ల నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉండి గొప్ప కల్పనల తో కూడిన కావ్యాలు, నవలలు, కథలు వ్రాసినవాళ్ళు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే నాకు ఎవరి పేరూ గుర్తు రాలేదు.

మీకెవరైనా గుర్తొచ్చారా? అలాగే ఈయన చెప్పిన ప్రతిపాదనమీద మీ అభిప్రాయం మీ వ్యాఖ్యల ద్వారా దయచేసి తెలియజేయమని విన్నపం.

పని అంటే ఏమిటి?
“పని” అంటే ఏమిటి? ఇదీ ఓ ప్రశ్నేనా “అనే సందేహం కలగడం సహజం.కానీ, పని గురించి మనకు చాలా విషయాలు తెలీవు.”పని”అంటే వ్యాపారం అని చెబుతుంది “శబ్ద రత్నాకరం”.వ్యాపారంలో వస్తు మార్పిడి గానీ, ద్రవ్య మార్పిడి గానీ ఉంటుంది.వ్యాపారం కానిదేదీ పని కాదు. సో..క్రియలన్నీ పనులు కావు.చేతలు కొన్ని పనులు కొన్ని.”ఏం పని చేస్తున్నావ్?” అని ఎవరైనా ప్రశ్నిస్తే—“ఏం చేయడం లేదు.పళ్లు తోము కుంటున్నాను” అని అనాలి.ఎందు కంటే పళ్ళు తోము కోవడం పని కాదు గనుక.ఎందుకు పని కాదు?ఇందు లో ఏ వ్యాపారం జరుగ లేదు గదా!నీ పళ్ళు నువ్వు తోము కుంటున్నావ్.ఇందులో వస్తు మార్పిడి గానీ,ద్రవ్య(డబ్బు) మార్పిడి గానీ జరగడం లేదు గదా.అందు చేత నీ పళ్ళు నువ్వు తోము కోవడం,నీ తల నువ్వు దువ్వుకోవడం, నిద్ర పోవడం,నడవడం,చదువుకోవడం పనులు కావు.ఇవి చేతలు మాత్రమే.చేతలంటే క్రియలు.క్రియలు రెండు రకాలు.పనులు,చేతలు.పనులేవీ చేతలు కావు.కానీ,చేతల్లో కొన్ని పనులుంటాయి.నీ పళ్ళు నువ్వు తోముకుంటే చేత.ఇదే చేత డబ్బులు తీసుకొని ఏ గుడ్డి గుర్రానికో పళ్ళు తోమితే అది పని.నీ వంట నువ్వు చేసుకుంటే చేత.అదే నువ్వు డబ్బులు తీసుకొని ఎవరికైనా వంట చేసి పెడితే అది పని.సో..ఒక క్రియ ఆత్మాగతమైతే చేత.పరగతమైతే పని.

ఇక ఇప్పుడసలు విషయానికి వద్దాం.అమ్మ లేదా భార్య ఇంట్లో చేసే చేతలు పనులా? పై నిర్వచనాలతో పోల్చి చూద్దాం.అమ్మ లేదా భార్య ఇంట్లో వంట ఎవరి కోసం చేస్తుంది?ఇల్లు ఊడవటం,బట్టలు ఉతకడం—ఈ చేతలన్నింటిలోనూ వ్యాపారం లేదు గదా.సో—ఇవి పనులు కావు,చేతలు.ఈ చేతలు ఆత్మగతమే కాకుండా తన వారి కోసం ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేస్తుంది. కాబట్టి ఇది వ్యాపారం కాదు.వ్యాపారం కానిదేదీ పని కాదు.”ఏమ్మా ఏం పని చేస్తున్నావ్?” అని ప్రశ్నిస్తే,”ఏమీ చేయడం లేదు.వంట చేస్తున్నాను, బట్టలుతుకు తున్నాను”—అని చెప్పటం రైట్.లేక పోతే అది పని అనుకుంటే కొడుకు లేదా భర్త నీ పనులకు డబ్బు చెల్లించాలి.మరి “అలాంటప్పుడు అమ్మ లేదా భార్య చేసే క్రియల్ని ఏమనాలి?”.అవి చేతలే.చేతలు మానవ సంబంధాలను వ్యాపార రహితమైన,అనిర్వచనీయమైన,అవ్యక్తమైన క్రియలుగా చెప్పవచ్చును.

వ్యాపార దృక్పధం లేని చేతల్ని సేవలు అన వచ్చునా? అనవచ్చు.కానీ,చేతలన్నీ సేవలు కావు.ఫలాపేక్ష లేకుండా,బంధం లేకుండా పరులకోసం చేసే చేతలు సేవలు అనవచ్చు.కానీ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైద్య,విద్య వంటివి సేవలా?— అవి పాక్షిక సేవలు.ప్రభత్వం,ప్రజల మధ్య ఎలాంటి వ్యాపారం లేనపుడు అవి పాక్షిక సేవలు.ఎందు కంటే,వైద్యం చేసే డాక్టర్,విద్య చెప్పే టీచర్ వాళ్ళు చేస్తున్న చేతలకు జీతం తీసుకుంటున్నారు.అంటే ఇందులో వ్యాపారం జరుగుతుంది.కానీ ఈ చేతలను అనుభవిస్తున్న ప్రజలకు ,ఈ సేవల్ని అందిస్తున్న ప్రభుత్వానికీ మధ్య ఎలాంటి వ్యాపారం జరగడం లేదు.పరోక్ష ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి.కాబట్టి ఇవి పాక్షిక సేవలు.

ఏతా వాతా తేల్చి చెప్పబోతున్దేమంటే..అమ్మ లేదా భార్య అలాగే తండ్రి లేదా భర్త చేసే చేతలు పనులు కావు.చేతలు మాత్రమే.కాబట్టి వీరి చేతలకు విలువ కట్టాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు గదా!

ఇంకా చర్చిద్దాం.

అమ్మ(ల)భాష
ఒకసారి వాసిరెడ్డి నవీన్ గారు ఒక సభలో మాట్లాడుతూ మాండలికాలనేవి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఉదాహరణకి కృష్ణాజిల్లాలో తన చిన్నప్పుడు విన్నమాట సిబ్బిరేకులు (ఈ సిబ్బిరేకుల్నికూరలచట్టి మీద మూతకు వాడేవారు నేను పెరిగిన పల్లెటూళ్ళో) ఇప్పుడు వినిపించడంలేదని చెప్పారు.

వేరే ప్రాంతాల్లో లేని మాటలు, ప్రయోగాలు, యాసలు అన్ని ప్రాంతాల్లో కనబడతాయనేది భాషాప్రియులకు అనుభవైకవేద్యం. ఒకే ప్రాంతంలో దగ్గర దగ్గరగావున్న ఊళ్ళలోకూడా కొన్నిసార్లు గమ్మత్తైన తేడాలు మాటలలో కనబడతాయి ….. బెజవాడ నుండి గుంటూరు వెళ్తే గేదెలు బర్రెలైనట్టు.

ఇదే తర్కాన్ని కొనసాగిస్తే ఒకఊరికి, అలాగే ఒక కుటుంబానికి, అసలు కేవలం ఒక మనిషికి ప్రత్యేకమైన యాస, ప్రయోగాలు, పదజాలం కనబడే అవకాశం వుంది.

మా కుటుంబంలో ఆడవారి మాటలలోనే ఎవరికి వారికి స్వంతమైన ఎన్నో తమాషాపదాలు, ప్రయోగాలు జ్ఞాపకం వస్తాయి. కొన్ని తెలిసినవి, కొన్ని మరెక్కడా నేను విననివి. పోయిన సారి వ్రాసిన కలకంఠికి కొనసాగింపుగా కొన్ని మీతో ప్రస్తావిస్తాను.

ఒకావిడ ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆవిడ వాడే విశేషణాలు విలక్షణంగా వుండటమే గాక ఆ సందర్భంలోని వ్యక్తులకు అతికినట్టు సరిపోయేవి. చిన్నగా గుండ్రంగా వున్న మనిషి పొట్లంలా ఉన్నదనీ, ముద్దుగాబొద్దుగా వున్న చిన్నపిల్లలగురించి బంతెల్లేవున్నారనీ, ఒక లావుపాటి పిన్నిగారిని చీమల్లే (నిదానంగా నింపాదిగా వుండే ఆమె నడకమీద కామెంటు) అనీ, ఇలా …..

ఎక్కడికెళ్తే అక్కడ కూలబడే బధ్ధకస్తురాలిని సండెల్లే కదలవేంటి అని కోప్పడేది. అస్తమానం తిరుగుతూ ఒకచోట నిలవకుండా ఏపనీ సరిగ్గా చేయనివారిని బటాసోరల్లే చేస్తున్నారనేది. ఈ సండు, బటాసోరు అన్నమాటలు ఇంకెవరూ వాడగా నే వినలేదు.

ఇలాగే మరొక ఆవిడ – ఎవరైనా ఖర్చు పెట్టడంలో పెద్ద చెయ్యి అయితే వాళ్ళదంతా బారామూరా అనేది. పెద్ద ఖర్చు వదిలేసి చిన్నచిన్న ఖర్చులు పట్టించుకునేవాళ్ళను ‘ఏనుగులెల్లేదారిపట్టించుకోరు గానీ చీమలెల్లేదారి కావాలి’ అని విసుక్కునేది. కదలకుండా ఎవరైనా పడుకుంటే మన్నుతిన్న పింజారి అని ఆమె అభివర్ణన.

ఒక అక్క అవసాన దశలో తన చెల్లెల్ని చూసి ‘నువ్వేట్లా వుంటావే నేను లేకుండా చిన్న మోడువి’, అన్నమాట ఆ చెల్లెలు పదేపదే గుర్తు చేసుకుంటుండేది. ఈ సంభాషణ జరిగినప్పుడు వారిద్దరి వయసు అరవై పైమాటే.

వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు అల్ల్రరి వేషాలను చూసి ఒకామె ముద్దుగా కించిత్ గర్వంగా ‘సోదిగున్న’ అని విసుక్కునేది. (బుడుగును వాళ్ళమ్మ రాధ పోకిరీవెధవ, తిప్పకాయవెధవ అని కోప్పడటం గుర్తుకొస్తుంది – ఇది తలచుకున్నప్పుడల్లా).

ఓ జేజెమ్మ వాళ్ళ పిల్లలతో భోజనాల దగ్గర జరిపే సంభాషణ ను గురించి మాఅమ్మ చెప్పేది.

మూడో కొడుకు: అమ్మా ఏవిటిది? తెల్లగావుంది?

అమ్మ: మజ్జిగ

మూడో కొడుకు: మాంచి పుల్లగా వుందిగా?

అమ్మ: ప్రొద్దునే కదరా తోడేసింది?

మూడో కొడుకు: అదే, నాలిక చిల్లులు పడుతోందిగా!

అమ్మ: ఓరి మాడ గదరా! కోతి మాడ!

ఈ మాడ (మోడు? మూఢ?) అర్థం ఏవిటో నాకిప్పటికీ తెలియదు.

మనలో చాలా మంది వారి వారి కుటుంబాల్లో స్త్రీల సంభాషణల్లో ఎన్నో ఇటువంటి ప్రత్యేకమైన మాటలు ప్రయోగాలు వినే వుంటారు. వీటిల్లో తరానికీ తరానికీ కనుమరుగైపోతున్నవి ఎన్నో.

కలకంఠి
చర్చకు ఆహ్వానం!

చిన్నతనంలో పి.సుశీల పాట విన్నప్పుడు ఎవరో అందమైన అమ్మాయి పాడుతున్నది అనిపించేది. అందం అంటే ఏవిటి అంటే సుశీల పాడిన కొన్ని పాటలు గుర్తొస్తాయి ఇప్పటికీ.

అలాగే లలితం, మృదులం అంటే బాలసరస్వతి గానం, మాధుర్యం అంటే జిక్కీ కంఠం ..

వారి పాటలను విన్నప్పుడు ఆయా విశేషణాలు గుర్తురావడమే కాక, ఆమాటలకు వారి కలస్వనాలు నిర్వచనాలుగా గోచరిస్తాయి.

మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చిన్ననాడు పాడుతున్నప్పుడు అచ్చం ఒక అమ్మాయి పాడుతున్నంత బాగా ఉండేదని చెప్పుకునేవారని ఆయనను దేవుడిగా కొలిచే ఒక శాస్త్రీయసంగీతాభిమాని మిత్రుడు చెప్పేవాడు.

ఇక్కడ నాకో సందేహం కలుగుతూంది. స్త్రీకంఠానికి సహజమైన సౌందర్యసౌకుమార్యాలు కాకుండా ఇంకేమైనా లక్షణం వుందా గాయనీమణుల పాటలో? ముఖ్యంగా భాష, పదజాలం, ఉచ్చారణకు సంబంధించిన సౌలభ్యం, వినే వారిని అకట్టుకునే గుణం?

పాటల గురించేకాక మాటలగురించి అలో చించినా ఇదే ప్రశ్న తలెత్తుతుందొక్కొక్కసారి.

తెలుగుభాష అంటే వారి అమ్మలు, అమ్మమ్మలు, మేనత్తల మాటల నుండే నేర్చుకున్నానని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇదే భావాన్ని మల్లాదిరామకృష్ణశాస్త్రిగారు కూడా వెలిబుచ్చడం గమనార్హం. తల్లిని ఆదిగురువుగా తలుస్తారు మనవారు.

అలాగే ఇంగ్లీషు భాష నాకు ఏవైనా అబ్బిందంటే దానికి కారణంగా నేను చిన్నప్పుడు చదివిన బళ్ళో కేరొలిన్ మిస్, బ్రిడ్జెట్ మిస్ అనే ఇద్దరు గొప్ప టీచర్లు గుర్తుకొస్తారు.

లెస్లీ కరోన్ మాట సినిమాలో విన్న తర్వాతే ఫ్రెంచి భాషలోని శబ్దసౌందర్యం తెలిసొచ్చింది.

వినడానికి కటువుగా వుండే జర్మన్ భాష కూడా అక్కడి ఆడవారి మాటలలో చక్కగా ధ్వనిస్తుందనుకుంటాను. మనకు పొరుగునవున్న తమిళం తెలియనివారి చెవులకు అంత సొంపుగా వినబడదు. శివాజీ గణేశన్ మాట్లాడితే మరీ ..

అయితే సుశీల, జానకి పాడిన తమిళపాటలు వింటే ఆభాష శ్రావ్యంగానే అనిపిస్తుంది.

ఒకభాషను సరిగ్గా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుందో అని అలోచిస్తే ఎందుకనో ఎక్కువ కలకంఠుల కంఠాలే జ్ఞప్తికొస్తాయి.

ఇది కేవలం నా ఊహా? మీకెవరికైనా ఇలా అనిపించిందా?

సినీ గీతం చక్కని కవిత్వం కావాలంటే?
పోయిన సారి అడిగిన ప్రశ్న సినిమా పాట కవిత్వమేనా? కు స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు.  వారి వ్యాఖ్యల వల్ల కొన్ని మంచి విషయాలు చర్చలోకి వచ్చాయి.

అన్ని రకాల ప్రక్రియల్లాగానే సినిమా పాటలలోకూడా మంచి చెడూ ఉన్నాయనీ, సాహిత్య విలువలువున్న పాటలు ఎన్నో కలవనీ,  వాటిలో చిక్కని కవిత్వం ఉందనీ ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.  కవిత్వానికి గీటురాయి ఏమిటి అన్న ప్రశ్న ఈ సందర్భంలో రావడం తప్పని సరి.  ఎన్నెస్ మూర్తి గారు కాలపరీక్షకు నిలబడడం ఒక గీటురాయి గా పరిగణిస్తే, ఎస్ నారాయణస్వామి గారు కాలపరీక్షకన్నా చిక్కదనం, గూఢత, సంపూర్ణత, మనసునో మెదడునో తాకే గుణం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

సినిమా పాటలో కవిత్వాన్ని వెతకటమంటే..నీళ్ళతొట్టిలో ముత్యాలకోసం వెతికినట్లే అంటూ కర్లపాలెం హనుమంతరావు గారు అవేదన వ్యక్తం చేశారు.  దీనికి వీరు సూచించిన కారణాలు – ప్రస్తుతం సినీగీతం తయారయ్యే విధానంలో కవిత్వం కలిసే అవకాశం అతిస్వల్పం, గొప్ప పాటలు వచ్చినరోజుల్లో బైట సాహిత్యంలో నిష్ణాతులైన కవులు మాత్రమే వ్రాసేవారు, సన్నివేశం వివరించి మంచి పాట వాసే స్వేఛ్ఛ కవికి ఇచ్చేవారు .. – అని.

ఈ సందర్భంగా మల్లీశ్వరి పాటలు గుర్తు చేసుకుందాం.  కృష్ణశాస్త్రిగారి ప్రతిభతో పాటు బీఎన్ రెడ్డి గారి అభిరుచి, పట్టుదల, ఓపిక (శాస్త్రిగారు ఎంతకాలానికీ ఒక పాట రాయకపోతే బీఎన్ కోపంగా ‘ధీరసమీరే’ అష్టపది వాడుకుంటానని బెదిరించారట – ఆ మర్నాడు కృష్ణశాస్త్రిగారు వ్రాసుకొచ్చిన పాట ‘మనసున మల్లెల మాలలూగెనే’) కూడా ఆపాటల అజరామరత్వానికి కారణాలు.

శంకరాభరణం సినిమా ముహూర్తం రోజు దర్శకుడు విశ్వనాథ్ వేటూరి, మహదేవన్ లతో ‘నా సినిమాలలో హీరో అరవైఏళ్ళవాడు. అసలు హీరోలు మీరే’ అని ప్రారంభం వారిద్దరితో చేయించారట.

అలాగే విజయ వారి సినిమాల్లో పనిచేసిన రచయితలు నిర్మాత, స్వయంగా రచయిత అయిన చక్రపాణిగారికి చాలా క్రెడిట్ ఇస్తారు.  హాయిహాయిగా జాబిల్లి పాటలో ‘రేయి వెండి దారాలల్లి’ అన్న ప్రయోగం నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఎంతగానో నచ్చిందని శ్రీశ్రీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు.

ఇలా ఉత్తమ అభిరుచి కల నిర్మాత, దర్శకులు గొప్ప కవులు, రచయితలతో కలిసి పనిచేసినప్పుడు మంచి సాహిత్యవిలువలు వున్న పాటలు రావడం సహజం.

కేవీమహదేవన్ గారి దగ్గరకు పాటరాయడానికి ఒక కవికుమారుడు వెళ్ళి ట్యూన్ ఉందా అని అడిగితే దేనికి కట్టమంటారు ట్యూన్, మీ సాహిత్యం వల్ల కలిగిన ప్రేరణలోంచే వస్తుంది ట్యూన్ అన్నారట.  ఆత్రేయ మనకందించిన ఆణిముత్యాల్లో ఎక్కువభాగం మహదేవన్ స్వరబధ్ధం చేయడం ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు.

ఘంటసాలగారు కూడా ఎక్కువగా కవి వ్రాసినదానికే బాణీ చేసేవారని వింటుంటాం.  లవకుశ సినిమాపాటలకోసం కవి సముద్రాలతో కలసి కూర్చొని సంగీత సాహిత్యాలు సంయుక్తంగా రూపొందించామని ఘంటసాల చెప్పారు.

దర్శకుడు చెప్పిన ఒక సన్నివెశం తనను కదిలించి ఒక ఆలాపన అప్రయత్నంగా వచ్చిందని దానిని వినిపించి సి నారాయణరెడ్డి గారిని ఇన్స్పైర్ చేసి మల్లియలారా మాలికలారా పాట వ్రాయించారు ఘంటసాల.

రహస్యం సినిమాలోని గిరిజా కల్యాణం యక్షగానాన్ని మల్లాది మల్లాదిరామకృష్ణశాస్త్రిగారు నిర్దేశించిన రాగాల్లోనే స్వరపరచి కవిపట్ల తన అపారగౌరవాన్ని చాటుకున్న ఉత్తమ సంస్కారి ఘంటసాల.  ఆయన స్వయంగా గేయ రచయిత కావడం, కరుణశ్రీ పుష్పవిలాపం, శ్రీశ్రీ ప్రతిజ్ఞ, గురజాడ పుత్తడిబొమ్మ మొదలైన గొప్ప ఖండకావ్యాలకు బాణీలు కట్టి చిరస్మరణీయంగా గానం చేయడం కాకతాళీయం కాదు.

మల్లాదిరామకృష్ణశాస్త్రి గారు ఒకసారి వ్రాసిన పాటలను మళ్ళీ దిద్దవలసిన అవసరం ఉండేది కాదంటారు.  ఎవరైనా మార్చమంటే ఆయన ఒప్పుకునేవారుకాదు. అందుకు ఇష్టమైన వాళ్ళే ఆయన దగ్గరకు వెళ్ళేవారు.  రాశిలో తక్కువ పాటలు వ్రాసినా కవిగా తన స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకోని కవిఆయన.  ఆయనను శ్రీశ్రీ ప్రస్తుతించడంతో పాటు ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి వంటి గొప్పకవులు గురువుగా భావించారు.

వేటూరిగారు సినీమాల్లో రాకముందు వ్రాసిన అద్భుత గేయాలు తరవాత సినిమాల్లో వచ్చాయి.  ‘ఏ కులము నీదంటే (సప్తపది)’, ‘పుచ్చాపూవుల విచ్చేతావుల వెచ్చావెన్నెలలు (మనోహరం)’ మొదలైనవి.  సినిమాకోసం కాకుండా కవి తనకోసం వ్రాసుకున్న గొప్ప సినిమాపాటలలో పైన చెప్పిన గిరిజా కల్యాణం యక్షగానం, చలన చిత్ర సీమ తొలినాళ్ళలో వచ్చిన బసవరాజు అప్పారావు పాటలు, ఎంకిపాటలు మొదలైనవి ఎన్నో కానవస్తాయి.

ఈ రకంగా గొప్ప సాహిత్యవిలువలున్న పాటలు కాలంకలసివస్తే ఎన్నో సందర్బాలలో  వస్తాయని మనం చూడవచ్చు.

ఇంకా గొప్ప సినీ కవిత్వం ఎటువంటి సందర్భాలలో వస్తుంది?  మనం గర్వపడే సాహిత్యం రావాలంటే ఎవరెవరు – నిర్మాతలు, దర్శకులు, సంగీతదర్శకులు, రచయితలు, శ్రోతలు -  ఏమేం చేయాలి?  మీ స్పందనలను వ్యాఖ్యలద్వారా తెలియ జేయమని అందరికీ మనవి.

సినిమా పాట కవిత్వమేనా? చర్చకి మా ఆహ్వానం.
శ్రీశ్రీ తన సినీ గేయాల సంపుటి “పాడవోయి భారతీయుడా” మల్లాదిరామకృష్ణశాస్త్రిగారికి అంకితమిస్తూ ఆయన ‘తెలుగు సినీమా పాటకు సాహిత్య ప్రకాస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు‘ అన్నారు.

ఇక్కడ రెండు విశేషాలున్నాయి.  ఒకటి మల్లాదిగారి విశిష్టత, రెండవది అసలు సినీమాపాటకు సాహిత్యవిశిష్టత.

సినీ సాహిత్యం సీరియస్ సాహిత్యం కానేకాదన్న వాదన మనకు అక్కడక్కడా అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది. ఇది ఎప్పటినుండో నాకు వున్న ఒక ధర్మసందేహం కూడాను.

పైవాక్యాలలో మహాకవి శ్రీశ్రీ సినీమా పాటకు సాహిత్య ప్రకాస్తి వుందనే అభిప్రాయపడ్డారు.  కొన్నేళ్ళ క్రితం సినీమహాకవి వేటూరి సుందరరామమూర్తి ఒక టీవీఇంటర్వ్యూ లో ‘సినీ గీతం సామాన్యంకాదు. కావ్య గౌరవాన్ని సంతరించుకున్న ఒక ప్రక్రియ’ అన్నారు.

సినిమాపాటలను అమితంగా ప్రేమించే అసంఖ్యాక అభిమానులు ఎందరో ఈ ఇద్దరు పెద్దల సుద్దులతో ఏకీభవిస్తారని  అనుకుంటాను. ఆలోచనామృతంగా, అపాతమధురంగా కాలపరీక్షను తట్టుకొని నిలబడ్డ ఎన్నో పాటలు వీరి నమ్మకానికి బలాన్నిస్తాయి.

అయితే ఇది నిజంకాదని, సినీగీతం సాహిత్యంకాదని నమ్మేవారి ఆలోచనలను కొట్టి పారేయలేం. వీరిలో కొందరు అసలు సినిమాపాటంటేనే పడని వారుఉంటారు.  వీరికి కొండంత అండగా లెఖ్ఖలేనన్ని చెత్తపాటలు కూడా మన సినిమాలలో వచ్చాయి.

ఇదికాక సినిమాపాటలను అమితంగా ప్రేమించేవారిలో కూడా వాటిలో కవిత్వవిలువలను శంకించేవారు వుంటారు.

ఈ అభ్యంతరాలకు మనం కారణాలు కొన్ని ఇలా చెప్పుకోవచ్చు.

1        సినీగేయం నిబధ్ధతతో వ్రాసిన సాహిత్యంకాదు.  వృత్తిగా, భుక్తికోసం, విత్తం మీద ధ్యాసతో వ్రాసింది.  సినిమా పాట వ్రాసేటప్పుడు ఏమాలోచిస్తారని అడిగితే ‘పాట ఎప్పుడవుతుందా, నిర్మాత డబ్బులెప్పుడిస్తాడా’ అని ఆలోచిస్తానని మళ్ళీ శ్రీశ్రీయే చెప్పారు ఒక సందర్భంలో.

2        నిర్మాత, దర్శకుడు, కథానాయకుడు మొదలైన వారు చెప్పిన ప్రకారం తయారు చేయబడ్డ అంగడి సరుకేగాని, ఆ కవి స్వంత బాధ కాదు.  ‘బయట కవి నిరంకుశుడు, సినీకవి పరాంకుశుడు’ అని వేటూరే అనుకుంటాను ఒకసారి అన్నారు.

3        సన్నివేశం, లొకేషన్లు, తారాబలం, సంగీతం, వాద్య గోష్టి, గాయనం  ఇవన్నీ కలిస్తే సినిమాపాట.  ఈ హంగులు తీసేస్తే దాని విలువ  ???

ముందు చెప్పినట్టుగా ఈ అభ్యంతరాలన్నీ సహేతుకమైనవే అనిపిస్తాయి. అయితే ఈకారణాలు చూపించి సినీగీతం కవిత్వంకాదని అనగలమా? మీరేమంటారు??

ఈ అంశం మీద చర్చకి మా ఆహ్వానం.

ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం
(ఆంధ్రజ్యోతి వివిధ లో అచ్చయిన అఫ్సర్ గారి ఇంటర్వ్యూ  పూర్తి పాఠం ఇదీ… )

అఫ్సర్…. ఈ పేరు తెలుగు సాహిత్య జీవులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఖమ్మం జిల్లాలో ఒక మారు మూల గ్రామం అయిన చింతకాని ఊరుబడి నుండి  టెక్సాస్ యూనివర్సిటీ దాకా అతని నడక,  మేధో యాత్రలో ఆలోచనల్ని ప్రోది చేసుకొనే క్రమం అంత సులువుగా జరిగింది కాదు. తండ్రి కౌముది నించి అభ్యుదయ సాహిత్య వారసత్వం, తల్లి వేపు కుటుంబం నించి వామ పక్ష రాజకీయాల ప్రభావం…వీటన్నీటి పునాది మీద నిర్మించుకున్న అస్తిత్వ వేదన అఫ్సర్.  ఆమెరికాలో ఉన్నా తన వూరితో  ముడిపడిన మూలాల వెతుకులాట అఫ్సర్.  అవే అఫ్సర్ ని కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా ముందుకు నడిపిస్తున్నాయి; స్థానికత మాత్రమే ప్రపంచీకరణకి సమాధానం అనే దృక్పథం వేపు తీసుకు వెళ్ళాయి. సూఫీ కథనాల మీద రాయబోతున్న కొత్త పుస్తకానికి సంబంధించి పరిశోధనలో లో భాగంగా ఇటీవల మన రాష్ట్రం వచ్చిన అఫ్సర్ హైదరాబాద్  లో జరిగిన వివిధ సాహిత్య సమావేశాలలో తన పరిశోదన విషయాలను, సాహిత్య అనుభవాలను  సాహితీ మిత్రులతో పంచుకున్నారు.

‘80లలో  తెలుగు సాహిత్యం లో అస్తిత్వ , ఆధునిక ఉద్యమాల మార్పు వాటి  ధోరణుల నాడి, సరిగా అంచనా  వేసిన అఫ్సర్ విమర్శకుడిగా కూడా బలమయిన ముద్ర వేశారు. ఒకటి నిజం– తెలుగు కవిత్వ విమర్శలో ఒక లోతయిన ఖాళీ ఉంది దాన్ని పూరించే పని కొంత మేరకు అఫ్సర్ చేసారు.   1991లో “ఆధునికత- అత్యాధునికత” అనే విమర్శ పుస్తకంతో అస్తిత్వ ధోరణులమీద సాధికారికంగా ఆయన చేసిన చర్చలు ఇప్పుడు మరీ విలువయినవి. ఇక అంతర్జాతీయ స్థాయిలో – అమెరికన్ విశ్వ విద్యాలయం నించి డాక్టరేట్ తీసుకున్న తొలి తెలుగు కవి అఫ్సర్. అస్తిత్వ ధోరణుల మీద చర్చని అంతర్జాతీయ వేదికల దాకా తీసుకు వెళ్ళిన విమర్శకుడు కూడా ఆయనే.

ముఖ్యంగా స్థానికత , మౌఖిక రీతులు   దేశీయ మౌఖిక కధనాలు   దర్గా సూఫీ సంస్కృతుల మీద ఎన్నో  అంతర్జాతీయ పత్రికలలో ఆసక్తికరమయిన పరిశోదనా వ్యాసాలను రాసారు . స్థానిక కథనాలు అస్తిత్వ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్తూ, వివిధ అంతర్జాతీయ సదస్సులలో తన స్వరం వినిపించారు. సాహిత్య సాంస్కృతిక రంగాలలో మైనారిటీ డిస్కోర్సు కి సిద్ధాంత బలాన్ని తీసుకు రావడం తన ప్రధానమయిన ప్రయత్నమని ఆయన అంటారు.  పీర్ల పండగ మీద ఆయన ఇంగ్లీషులో రాసిన పుస్తకం త్వరలో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా అచ్చు కానుంది.  కథకుడిగా మొదలెట్టి అంతర్జాతీయ స్థాయి పరిశోధకుడిగా అఫ్సర్ సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలు ఇంకా చర్చకు దారి తీయబోతున్నాయి.  ఈ నేపధ్యంలో అఫ్సర్ తో ఈ ముఖాముఖి .

1     అఫ్సర్ మీరు దాదాపు ఒక దశాబ్ద కాలంగా అమెరికాలో వున్నారు. అక్కడి/ఇక్కడి సాహిత్యమూ/ పరిశోధనలూ చూశారు.  చాల సందర్భాలలో నేడున్న సంక్లిష్ట వ్యక్తీకరణకు కవిత్వ్యం  సరిపోదనీ నిజంగా కవిత్యం తన రూపం మార్చు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఒక కవిగా మీ అస్తిత్వాన్ని ఉనికిని ఎలా వ్యక్తీక రించుకుంటారు ?  మీరన్నట్లు ఇంత కాలం కవిగా మీ ఉనికి లేదా మీ కున్న అవగాహన ఎలా అర్ధం చేసుకోవాలో వివరిస్తారా ?

ప్రస్తుతం వున్న సామాజిక సంవాద సందర్భంలో కవిత్వం బలహీనమయిన ప్రక్రియ అన్నది నా అభిప్రాయం. ఒక సామాజిక సంవాదం చెయ్యాలంటే కేవలం కవిత్వం మీదే ఆధారపడలేం. ఎందుకంటే, కవిత్వం ఎంత కాదన్నా ఉద్వేగ భాష. వ్యక్తిగత స్థాయిలో ఉద్వేగ భాషకి వున్న ప్రాధాన్యాన్ని గౌరవిస్తూనే మనం వొప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మనకి కావలసింది మనల్ని ఆలోచింపజేసే భాష. ఆలోచనాత్మకమయిన భాష లేని చోట అవగాహన పెరగదు. అవగాహన లేని చోట అసహనమే వుంటుంది. అపోహలు పెరుగుతాయి. కవిత్వ భాషతో సంబంధం లేని నిర్దిష్టమయిన వచనం కూడా మనం రాయగలిగి వుండాలి. లేకపోతే, కవిత్వం అంతా వొక ఆక్రోశంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా అస్తిత్వ ఉనికి వాదాల గురించి స్పష్టత వచనం ద్వారానే సాధ్యపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కవిత్వం పట్ల వున్న సెంటిమెంటుని వదిలించుకొని ఈ విషయాలు చర్చించుకోవాలి మనం. కవిత్వం అనేది అనేక పరిమితులున్న వ్యక్తీకరణ రూపం అన్న స్పృహ పెరిగితే తప్ప దాన్ని మార్చాలన్న ఆలోచన రాదు. దానికేదో మంత్ర శక్తి వుందనుకున్నంత కాలం మనం దాన్ని అపురూపంగా చూసుకుంటాం. అది చాలా సాధారణమయిన వ్యక్తీకరణ రూపం అనుకుంటే గాని, దాంతో స్వేచ్ఛగా ఆడుకోలేము. అలా ఆడుకునే వెసులుబాటు లేని చోట కవిత్వమే కాదు, ఏ సాహిత్య రూపమయినా కుంచించుకు పోతుంది.

మీరడిగిన రెండో ప్రశ్న ఇంత కాలంగా కవిగా నా వునికి గురించి- ఆ విషయం నేను కాదు మీరు మాట్లాడాలి. నన్ను మాట్లాడమని అడిగితే, నన్నెవరయినా కేవలం కవి అంటే నేను అసలే వొప్పుకోను. ఆ కవి అనే ముద్ర నాకే కాదు, ఎవరికయినా సుఖంగా వుంటుంది. బుద్ధిపరంగా వొక సుఖానికి అలవాటు పడిపోతాం ఆ ముద్ర పడగానే! కవి అనే లేబుల్ చుట్టూ మనకి చాలా గ్లామర్ వుంది. ఆ గ్లామర్ అర్థం లేనిది. కవులు అని పిలవబడుతున్న వాళ్ల కంటే తెలుగులో కథకులు, వ్యాస రచయితలు, పత్రికా రచయితలు చేస్తున్న కృషి కొన్ని రెట్లు మెరుగు. ఎంత కాదన్నా, తెలుగులో కవిత్వం ఎంత సామాజికతతో/ సామూహికతతో రాసినా “నేను” కేంద్రితమే! ఈ “నేను”కూడా ఎగువ మధ్యతరగతి సృష్టించుకున్న “నేను.”

2     . మూడు  దశాబ్దాలు ఒక కవిగా పరిశోదకుడిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని తెలుగు సమాజం ఒక కవిగానే చూసింది ఈ సందర్భం లో కవిత్వానికి కాలం చెల్లింది అనే సంచలన మయిన ప్రసంగానికి మీ కవి మిత్రుల నుండి వ్యతిరేక త వచ్చింది ? ఈ విషయాన్ని ఎలా సమర్దించు కుంటారు ? ఇక నుండి మీరు కవిత్యం రాయరా ?

తెలుగు సమాజం నన్ను కవిగానే చూసిందని నేను అనుకోవడం లేదు. నేను రాసిన విమర్శ వ్యాసాలు గానీ, విమర్శ పుస్తకాలు గానీ కొంత వాద వివాదాలకు దారి తీసాయి. 1980ల తరవాతి సాహిత్య గతిని గురించి మాట్లాడుకోవడానికి అవి ఎంతో కొంత సాధనా లయ్యాయి. కవిత్వం కంటే ముందు నేను కథకుడిని, విమర్శకుడిని. నా లోపలి ఆ రెండు వ్యక్తిత్వాలకు తగినంత గుర్తింపు ఈ ముప్ఫయేళ్ళలో వచ్చిందనే నా నమ్మకం. అదలా వుంచితే, ఈ పదేళ్ళలో నేను సూఫీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించిన రచనలు నా మటుకు నాకు వొక అర్థవంతమయిన మలుపు.

ముఖ్యమయిన విషయం: కవిత్వానికి కాలం చెల్లింది అని నేను అనడం లేదు. అది చాలా అరిగిపోయిన స్టేట్మెంట్..మళ్ళీ నేను ఇవ్వక్కరలేదు. నేను అంటున్నది బౌధ్ధిక స్థాయిలో కవిత్వానికి రూప పరంగా వున్న పరిమితుల్ని గుర్తించమని మాత్రమే. ఏ సాహిత్య రూపానికయినా వొక కాలం వుంటుందని నేను అనుకోను. అయితే, మన ఆలోచనారాహిత్యం వల్లనో, వుద్వేగ మనస్తత్వం వల్లనో మనం కవిత్వానికి అవసరానికి మించి ప్రాముఖ్యం ఇచ్చాం. దానికి వొక కేంద్రీకృత శక్తిగా మార్చాం. అన్ని విధాలుగా కేంద్రరాహిత్యాన్ని కోరుకుంటున్న, వికేంద్రీకరించుకుంటున్న దశలో వున్న మనం కవిత్వాన్ని మాత్రం ఆ కేంద్ర శక్తిగా ఎందుకు కొలవాలి అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్న వేయడం ద్వారా మనం ఇంకా కృషి చేయాల్సి వున్న వచన ప్రక్రియల వేపు నేను దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నా.

ఇక నేను కవిత్వం రాయడం గురించి…నేను కవిత్వం రాయకపోవడం అంటూ వుండదు. అది నా basic instinct. ఇక రాయొద్దు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రాసే ప్రమాదం కూడా లేకపోలేదు. నా లోపల సహజంగా వున్న ధిక్కార స్వభావానికి అది తక్షణ వ్యక్తీకరణ. కానీ, ధిక్కారమే సరిపోదనే స్థితి వేపు నేను వెళ్తున్నాను. ఆ స్థితి రాయించే కొత్త కవిత్వం కోసం నా ఎదురు చూపులు.

3          ఒక జర్నలిస్టు గా కవిగా పరిశోదకుడిగా రూపాంతరం చెందిన మీ ప్రస్తానం -ఇటు ఇండియా లో అమెరికా/ యౌరోపెయన్ అకడమిక్ లో మీరు గమనించిన మార్పులు పరిశోదన విషయమా లో ఇక్కడ ఉన్న పరిశోధకుల అవగాహన మీరు ఎలా అంచనా వేయగలరు ? పరిశోధన లో మీ రు ఏం గమనించారు ?

చాలా పెద్ద ప్రశ్న. మొదట వొక సవరణ. మీరన్నట్టు, నేను జర్నలిస్టుగా నా ప్రస్థానం మొదలు పెట్టలేదు. మొదట నేను విమర్శ వ్యాసాలు రాశాను. తరవాత కథలు రాశాను. జర్నలిజంలోకి రావడం వొక యాక్సిడెంట్. జర్నలిస్టుగా కూడా నేను చేసిన పనికి – సాహిత్య పేజీల నిర్వహణ ద్వారా సాహిత్య జర్నలిజం వేపు వెళ్ళడం- లాంటివి నాకు తగినంత గుర్తింపుని తెచ్చాయి. కాబట్టి, సాహిత్య జీవిగా నాకు అప్పటికే వుండిన వొక అన్వేషణకి జర్నలిజం వొక సాధనం అయ్యింది. మొదటి నించీ నేను అస్తిత్వ వాదిని – నిర్దిష్ట ఉనికి, గుర్తింపు వాదాల పక్షపాతిని. అవి వొక ఉద్యమ రూపం దాల్చక ముందు నించీ వాటి అవసరాన్ని నేను చెప్తూ వస్తున్నా. ఇప్పుడు నా పరిశోధనా కృషి కూడా ఆ అస్తిత్వ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నమే. అయితే, అమెరికాలోని విశ్వ విద్యాలయాలలో లభించిన శిక్షణ, ఆదాన ప్రదాన అవకాశాల వల్ల అవి పదునెక్కాయి. అంతే కాదు, సమకాలీన అధ్యయనాలలో స్థానిక ఇస్లాం ల ప్రాధాన్యానికి వొక గుర్తింపు తేవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నం చాలా మటుకు సఫలమవుతోంది కూడా!

మన పరిశోధన కూడా స్థానికత మీద మరింత దృష్టి కేంద్రీకరించాలని నా అభిప్రాయం. అది సాహిత్యమా, సాంస్కృతిక అధ్యయనాలా అన్నది వేరే చర్చ. కానీ, స్థానికత మీద దృష్టి పెరిగే కొద్దీ మీ అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది. మొత్తంగా ప్రపంచాన్ని అర్థం చేసుకునే ధోరణిలో మార్పు వస్తుంది. మనకి అంతర్జాతీయ ప్రమాణాలకి ఏ మాత్రం తగ్గని పరిశోధకులున్నారు. కానీ, పడమటి గాలులకి తలలూపే ధోరణిలో పడిపోతున్నారు. అలా కాకుండా మన పరిసరాల్లో మేధో సంచారం చేయగల పరిశోధకులు కావాలని అనుకుంటున్నా. మనం పడమటి సాధనాలు మన స్థానికతని అర్థం చేసుకునేంత వరకే తీసుకోవాలి. మన స్థానికతని గందరగోళం చేసేట్టయితే, ఆ సాధనాల్ని నిరభ్యంతరంగా నిరాకరించాలి.

4.      బాబ్రి మస్జిద్ / లేదా సెప్టెంబర్ 11   లాంటి ఒక సంక్లిష్ట సందర్భం లో  మీరు ఇస్లాం ను ఒకన టెర్రరిస్టు గా బూచి గా చూపించిన అమెరికన్ సొసైటీ లో ఏమయినా ఇబ్బందులు  పడ్డారా ?

సమస్య అమెరికా మాత్రమే కాదు, మన దేశంలోనూ అలాంటి సమస్యలు వున్నాయి, అలాంటి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వొకే అమెరికా, వొకే ఇండియా అనే జాతీయవాద భావన ప్రమాదకరం ఎప్పుడయినా! అమెరికా భిన్న సంస్కృతుల కలయిక. ఆ భిన్నత్వాన్ని చెరిపేసి, “వొకే” అమెరికా అన్న భావనని పెంచే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అదృష్ట వశాత్తూ, దీనికి ప్రజల నించి సమ్మతి లేదు. అలాంటి ఎకోన్ముఖీకరణ మన దేశంలోనూ జరుగుతోంది. అయితే, మన దేశంలో దానికి తగినంత ప్రతిఘటన లేదు.

ఇక రెండో విషయం: వలసలో ఎప్పుడూ కొన్ని కష్టాలూ, సాహసాలూ వుంటాయి. అది ఖమ్మం నించి హైదరబాద్ కావచ్చు, హైదరబాద్ నించి ఢిల్లీ కావచ్చు. దేశం నించి ఇంకో దేశం కావచ్చు. అయితే, అదృష్టం బాగుండి, నేను పని చేసిన రెండు యూనివర్సిటీలు – అప్పుడు విస్కాన్సిన్, ఇప్పుడు టెక్సాస్- రెండూ వొక విధంగా కొంచెం బహుళ సాంస్కృతిక వాద అనుకూల ప్రదేశాలు. ఇంకో కొత్త సంస్కృతిలోకి అడుగేట్టినప్పుడు కొన్ని అస్తిత్వ సమస్యలు ఎదుర్కొక తప్పదు – అది అమెరికా అయినా, ఉత్తర భారతమయినా, మన పొరుగు వూరే అయినా. ఆ సంస్కృతికి సంబంధించిన అంశాలు కొన్ని మనల్ని సవాల్ చేస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడడం కష్టమే,కానీ అసాధ్యం కాదు. నేను అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు నారాయణ రావు గారు అన్న మాట ఇప్పటికీ బాగా గుర్తు పెట్టుకుంటా. “అంతర్జాతీయ అస్తిత్వం చాలా సాహసంతో కూడుకున్నది. మీరు చాలా పెద్ద సాహసానికి సిద్ధ పడాలి. వొక తెలుగుకవిగా మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మాత్రమే ఇక్కడ సరిపోవు. చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వుంటుంది. ఇప్పటి దాకా నేర్చుకున్నది మరిచిపోవాల్సి వుంటుంది కూడా.”

అయితే,  నేను స్థానికతని బాగా నమ్మే వ్యక్తిని. ఆ స్థానికత నేను పెరిగిన చిన్న వూరు చింతకానిది అయినా, అమెరికాలోని ఆస్టిన్ ది అయినా…నేర్చుకోవాల్సింది/ మారాల్సింది చాలా వుంటుందన్న వాస్తవికతకి నేనెప్పుడూ సిద్ధమే.

అలాగే,  నాలోపల వొక జంగమ ప్రవృత్తి కూడా వుంది. అందుకే వొక కవితలో “జంగమం నా ఇలాకా” అని రాసుకున్నా. అలాంటప్పుడు నాకు కృత్రిమ స్థావరాలు సృష్టించే అడ్డుగోడల మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇబ్బందులు పడడమూ వుండదు.

5.     ఈ నేపధ్యం లో అంతర్ జాతీయ సమాజం మీ సృజనాత్మక రచనల లో ఈ సంక్షోభం  సమర్ద వంతంగా ప్రతిఫలించింది అని భావిస్తున్నారా ?

అవును. ఆ అంతర్జాతీయత ప్రతిఫలనాలు తప్పక కనిపిస్తాయి. “రక్తస్పర్శ”లోని నా కవితల్లో వొక విధమయిన అంతర్జాతీయత కనిపిస్తుందని చేకూరి రామారావు గారు వొక చోట రాశారు. ఇటీవలి నా పుస్తకం “ఊరిచివర”లో కూడా అంతర్జాతీయత కనిపిస్తుంది. కానీ, రక్తస్పర్శలో కనిపించేది పరోక్ష అంతర్జాతీయత, వూరిచివరలో అది ప్రత్యక్ష అంతర్జాతీయత – అంటే, మిగిలిన కవుల మాదిరిగా అంతర్జాతీయతని నేను వూహించుకొని కవిత్వం రాయడం లేదు. అది వొక వ్యక్తి జీవితంలో భాగంగా ఇంకిపోతే ఎలా వుంటుందో “ఊరిచివర”లో కనిపిస్తుంది.

6 . సెప్టెంబర్ 11   తరవాత ఇస్లాం ప్రపంచం పై అమెరికా రాజ్యం  అవలంబించిన విదానం పై దేశం లోని బుద్ధి జీవుల నుండి రావాల్సినంతగా   ప్రతిస్పందన రాలేదు. దాన్ని ప్రస్తుత మైనార్టీ డిస్కోర్సు ద్వారా ఎలా అర్ధం చేసుకోవచ్చు?

అంతర్జాతీయ స్థాయిలో మేధావులు స్పందించినంత తీవ్రంగా మన దేశంలోని  బుద్ధిజీవులు దీని మీద స్పందించ లేదన్నది వాస్తవం. దానికి ప్రధానమయిన కారణం: మనం సెప్టెంబర్ 11 అనంతర ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే! మొత్తంగా ప్రాపంచికదృక్పథాన్ని మార్చడంలో దీని ప్రభావాన్ని మనం ఇప్పటికీ అంచనా వేసుకోలేక పోతున్నాం. అసలు మైనారిటీ డిస్కోర్సు వొకటి వుందన్న చైతన్యం అమెరికాలోనూ/ ఇతర దేశాల్లోనూ కలిగింది ఈ సెప్టెంబరు 11 తరవాతనే- అమెరికాలో రాజ్య విధానాలకూ, ప్రజలకూ మధ్య వున్న వైరుద్ధ్యం బాగా అర్థమయింది కూడా దీని తరవాతనే. ఈ వైరుద్ధ్యం అర్థమయిన తరవాత మైనారిటీ డిస్కోర్స్ తేలికగా అర్థమవ్వడం మొదలయ్యింది. అమెరికాలోని మైనారిటీల స్వరం అటు సాహిత్యంలోనూ, ఇటు పబ్లిక్ స్పేస్ లోనూ బాగా వినిపించడం మొదలయ్యింది. అలాగే, ఇస్లాం అంటే ఏమిటో  అందులో ఎంత విభిన్నత వుందో తెలిసి వచ్చింది. చాలా కాలంగా ఇస్లాం అంటే కొందరు మతాచార్యుల గుప్పిట్లో బందీ అనే భావనని ప్రపంచం పెంచి పోషిస్తూ వచ్చింది. అది వొక్క సారిగా బద్దలయి, ఇస్లాంలోని అభ్యుదయ శక్తులు ముందుకొచ్చి, ప్రతిఘటనని వ్యక్తం చేశాయి. ఇది మన దేశంలో కూడా జరగాల్సి వుంది. ఇస్లాంలో వున్న అభ్యుదయ శక్తులు బలపడితే తప్ప, ముస్లిం సమాజాలకు విముక్తి లేదు.

7. అలాగే ఇక్కడ తెలుగు లో మైనారిటీ డిస్కోర్సు ఒక సంకుచితత్వంలోకి పోయింది అంటే ఆ వాదాన్ని సమర్ద వంతంగా తీసుకెళ్లడం లో మైనారిటీ కవుల లోపాన్ని ఎలా అంచనా వేస్తారు ?

ఇంతకు ముందే చెప్పినట్టు, ఇప్పుడు అంతర్జాతీయ సాహిత్యం అంతా వొక  మైనారిటీ డిస్కోర్స్ ని వెతుక్కుంటోంది. అంచులలో వున్న జీవన దృశ్యాల ఆవిష్కరణ అన్ని భాషల్లోనూ కనిపిస్తోంది. తెలుగులో ఈ ప్రక్రియ మొదట ప్రారంభమయినంత బలంగా కొనసాగలేకపోతోంది. దానికి ముఖ్య కారణం: అది కవిత్వం గుప్పిట్లో వుండిపోవడమే! ఈ విషయంలో వొక్క దళితస్త్రీ వాదులే కొంత మినహాయింపు. దళిత స్త్రీవాదులు తరవాతి దశలో వచనంలోకి చేసిన ప్రయాణం గొప్ప మలుపు నా దృష్టిలో. అది మిగిలిన మైనారిటీ వాదులకి ఆదర్శం కావాలి. ముఖ్యంగా ముస్లిం వాదులకి!ముస్లిం వాదం ఇప్పుడు రాస్తున్నది తక్కువ, వివాదాలు ఎక్కువ అన్నట్టుగా వుంది. వ్యక్తిగత అహంకారపూరిత రాజకీయాల వల్ల ముస్లింవాదంలోని బలం బలహీనతగా మారుతోంది. ఈ రాజకీయాలు మానేసి, ముస్లిం రచయితలు నిజంగా సృజనాత్మకత మీద దృష్టి పెడితే బాగుంటుంది. సృజనాత్మకత విషయంలో నాకు దళిత వాదం సృష్టించిన మాడల్స్ బాగా నచ్చాయి. ఏ వాదానికయినా ఆ వాదం పరిధిలోకి వచ్చే నిజ జన సమూహాలతో ఆత్మీయ సంబంధం వుండాలి. తెలుగు ముస్లిం రచయితలకు –ముఖ్యంగా కవులకు- వాళ్ళ తక్షణ సమూహం అంటే ముస్లింలతో దగ్గిర సంబంధాలు లేవు. అది వాళ్ళ రచనల్లో కూడా కనిపిస్తున్న లోపమే! అలా సమూహ  సంబంధం లేని సాహిత్యం డొల్లగా వుంటుంది.

8. ఆదునికత, ఉత్తరాదునికత తదితర భావ జాలాల మీద పనిచేసిన మీరు తరవాత స్తానికత గురించి మాట్లాడడం మొదలెట్టారు. మీ విమర్శనీ,  పరిశోదననీ  తెలుగు సమాజం సరిగా అంచనా వెయ లేక పోయిందని మీరు భావిస్తున్నారా  ?

స్థానికత అత్యాధునికతలో ప్రధానమయిన కోణం. 1991లో వెలువడిన “ఆధునికత- అత్యాధునికత” వ్యాసాలు మళ్ళీ చదివితే ఆ వాదంలో స్థానికత పాత్ర ఏమిటో తెలుస్తుంది. తెలుగు సమాజం వీటిని ఎలా అంచనా వేస్తుంది అన్నది నాకు అంత పట్టింపు లేదు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నా. అంతే! కానీ, ఆ వ్యాసాలు వెలువడినప్పుడు, తరవాత నేను అస్తిత్వ వాదాల మీద రాసినప్పుడు కూడా అనుకూల/వ్యతిరేక స్పందనలు గట్టిగానే వచ్చాయి. అయితే, నేను కవిని అన్న విషయం మీరు మరచిపోతే తప్ప, విమర్శకుడిగా నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. స్థానికత అనేది ఇప్పటికిప్పుడు అవసరమయిన  సాహిత్య ప్రమాణం అని ఇప్పటికీ నేను అనుకుంటున్నా- అది ప్రవాస స్థానికత కూడా కావచ్చు. అమెరికా తెలుగు రచయితలు ఇటీవలి కాలంలో వెతుక్కుంటున్న ప్రవాస స్థానికత కూడా ఇందులో భాగమే.

9.  దక్కనీ సమాజం దాదాపు 11  వందల ఏళ్ళ పాటు సూఫీ ప్రభావం లో ఉంది    ఈ క్రమం లో మీరు చేస్తున్న దర్గాలు  సూఫీ సంస్కృతల మీద పరిశోదన మైనారిటీ డిస్కోర్సు కు ఏవిదం గా దోహద పడుతుందని భావిస్తున్నారు ?

దక్కనీ సమాజ అధ్యయనాలలో మనం అంతగా పట్టించుకోని రంగం: సూఫీవాదం. సూఫీ అనగానే మనం రూమీ దాకా వెళ్తున్నాం కానీ, మన పక్కనే వున్న సూఫీల జోలికి మాత్రం పోవడం లేదు. మన స్థానికత మీద మనకి అంత శ్రద్ధ లేదనడానికి ఇదొక వుదాహరణ. నేను ఈ సారి ట్రిప్ లో ఆంధ్ర, తమిళ్ నాడు, కర్నాటకలలో అనేక సూఫీ స్థలాలు తిరిగా. తిరిగిన చోటల్లా కుప్పలు పడి వున్న చరిత్ర కనిపిస్తున్నది. అది మనకు తెలియని మన చరిత్ర. కానీ, సాధారణ ప్రజానీకానికి ఈ చరిత్రకి సంబంధించిన చైతన్యం వుంది. లేనిదల్లా, చదువుకున్న మనలోనే! మనం కులాలుగా, మతాలుగా చీలిపోయాం. విడదీసే అంశాల మీద వున్నంత ఆసక్తి మనల్ని కలిపే అంశాల మీద లేదు. సూఫీ వాదం అందరినీ కలిపే సంస్కృతి. రూమీ గురించి కాదు, మన గ్రామాల సూఫీల గురించి ముందు నేర్చుకోవాలి. మైనారిటీ డిస్కోర్సుని బలంగా వినిపించిన వాళ్ళు మొదట సూఫీలే! ఇవాళ మనం మాట్లాడుకుంటున్న చాలా అంశాలు ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడారు. వాటి వర్తమానికతని మనం అర్థం చేసుకోవాలి.

10. మీ పరిశోధన లో మీకు ఆసక్తి కరంగా తోచిన విషయాలు వివరిస్తారా ?

చాలా వున్నాయి. ముఖ్యంగా, మానవ సంబంధాల గురించి సూఫీలు చెప్పిన విషయాలు, ప్రేమని వొక అద్భుతమయిన ప్రత్యామ్నాయంగా వాళ్ళు దర్శించిన పద్ధతి. ఇటీవలి నా కవితల్లో ఆ ప్రేమ భావనకి సంబంధించిన భిన్న పార్స్వాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా.

11. ఈ పరిశోదన ద్వారా పశ్చిమ దేశాలు తేలుచు కోవాల్సిన విషయాలు ఏమయినా ఉన్నాయా ?

పశ్చిమ దేశాలు ఏం నేర్చుకుంటాయని కాదు, నా మొదటి లక్ష్యం నేనేం నేర్చుకుంటున్నానో అది ముఖ్యం. అది వొక వ్యక్తిగా, రచయితగా నాకు తక్షణ అవసరం. నా చుట్టూ వాళ్ళకి దాని ద్వారా నేనేం చెప్పగలనన్నది రెండో అవసరం. ముస్లిం సమాజాల స్వభావం గురించి పశ్చిమ దేశాలే కాదు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. ముఖ్యంగా, ముస్లిం సమాజాలు సంకుచితం అనే అపోహ చాలా మందిలో వుంది, ముస్లిం సమాజాలు అభ్యుదయం వేపు చూడడం లేదన్న నిరంతర విమర్శ వుంది. ముస్లిం సమాజాల్లో వున్న అనేకత్వాన్ని చెప్పడానికి సూఫీజమ్ బాగా వుపయోగపడుతుంది, ఎందుకంటే, ముస్లింల వాస్తవ పరిస్తితి చెప్పేది వాళ్ళ సూఫీ చరిత్ర మాత్రమే!

12.  ఈ పరిశోధన ద్వారా పశ్చిమ దేశాల కేంద్రిత అవగాహనను విబేధించే పరిశోధక  అంశాలను మీరేమయినా స్పృశించారా?

మొత్తంగా ఈ పరిశోధన అంతా పశ్చిమ-కేంద్రిత అవగాహనతో విబేధించడమే. స్థానికత అనే వాదంలోనే ఆ విభేదం వుంది. స్థానిక సాహిత్యాల/సంస్కృతుల అధ్యయనం కేవలం వొక భాషకి సంబంధించిన విషయం కాదు. అది ఇంకో స్థాయిలో  సైద్ధాంతిక/రాజకీయ ప్రకటన కూడా. వివిధ అంతర్జాతీయ పత్రికలలో/ సంకలనాల్లో నా వ్యాసాలు చదివితే, ఇది నేనెలా చేశానో అర్థమవుతుంది. ఈ వ్యాసాల్లో కొన్నీటిని తెలుగులోకి అనువదించడానికి మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ ప్రయత్నం చెయ్యడం అంటే తెలుగులో ఆ సైద్ధాంతిక పరిభాషని కూడా నిర్మించడమే! దానికి ముందు పశ్చిమ-కేంద్రిత పరిశోధన నించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. పరిశోధనా పద్ధతి, విశ్లేషణ, ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే దారి మనకి ఇంకా అంత స్పష్టంగా లేదు.

13.   అఫ్సర్ మీరు చెప్పండి గడిచిన కొన్ని దశాబ్దాలుగా వర్తమాన మేదో సమాజం యూరప్ కేంద్రకంగా ఒక తిరుగులేని స్తితి లో ఉంది . దానికి కౌంటర్  గా  మధ్య ప్రాచ్యం,  లాటిన్అమెరికా లో జరిగిన (ఎడ్వర్డ్ సైద్, ఫాన్నోన్ )    ప్రత్యామ్నాయ మేధో స్రవంతి దక్షిణ ఆసియా నుండి రాలేక పోవడానికి , మన బుద్ధిజీవుల / మేధో వైఫల్యం ఉందని  భావిస్తున్నారా ? అలా జరగక పోవడానికి కారణాలు ఏమయి ఉంటవి అని అనుకుంటున్నారు ?

సంఘర్షణ అనేది కేవలం సమాజాల్లో జరిగినంత మాత్రాన్న సరిపోదు. మేధో సమూహాలు ఆ సంఘర్షణలో పాల్గొన్నప్పుడే దానికి సరిదీటు అయిన సాహిత్యమూ, సిద్ధాంత చర్చా జరుగుతుంది. దక్షిణాసియా దాకా ఎందుకు గానీ, తెలుగు సమాజానికే పరిమితమయి మాట్లాడితే- పబ్లిక్ ఇంటెక్చ్యుయల్స్ మనకి లేరు, తెలుగులో అలా నిలబడేది వొక్క బాలగోపాల్ మాత్రమే. అయితే, గుండె లోతుల్లోంచి, లేదా మేధో లోతుల్లోంచి మాట్లాడే బుద్ధిజీవిని తట్టుకునే శక్తి తెలుగు సమాజానికి ఎంత వుందో ప్రశ్నార్థకమే.  మనకి ఆలోచించే వాళ్ళంటే భయం. ఆలోచన పెరుగుతుందంటే భయం. అందుకే, మన చర్చలు చాలా మటుకు ఉద్వేగ స్థాయికి మాత్రం వెళ్ళి, కవిత్వంలో చతికిలబడ్తాయి. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కాదు, మరీ పెద్ద చూపు చూడడం వల్ల మన మేధోప్రపంచం చిన్నదయిపోతున్నదని నా బాధ. మన మేధో వికాసానికి అదొక అడ్డంకి. ఆలోచనల్ని కూడదీసుకునే శక్తి లేని చోట సమూహాల్ని సమీకరించే శక్తి కూడా వుండదు. ఈ విషయంలో మన కంటే పాకిస్తాన్, బంగ్లా దేశ్ లాంటివి చాలా నయం. వాళ్ళ మేధో వికాసం, సాహిత్య వికాసం మనకి వొక నమూనా కావాలి. పాకిస్తాన్ స్త్రీవాద కవయిత్రులూ, బంగ్లాదేశ్ ముస్లిం రచయితలూ ఏం చేస్తున్నారో వొక సారి గమనించాలి. మనకి ఆ తులనాత్మక దృష్టి పెరిగితే తప్ప మనకి మనంగా ఏం చెయ్యాలో తెలియదు.

రెండు: మన ప్రతిఘటన ఉద్యమాలలో వొక నిలకడ లేదు. రాజ్య హింస మీద ఇప్పటికీ మన ప్రతిఘటన బలహీనంగానే వుంది. తెలంగాణ తో సహా వివిధ అస్తిత్వ ఉద్యమాలు నిజానికి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడవడం లేదు. వొక వేపు కార్పొరేట్ శక్తుల విష కౌగిలిలో చిక్కుకొని వున్నాం కూడా. ఇంకో వేపు అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. ఇక మిగిలిన అరకొర బుద్ధిజీవులు నిశ్శబ్దంలోకి వెళ్లిపోతున్నారు, లేదా ఉద్దేశ పూర్వక మౌనం ప్రకటిస్తున్నారు. వొక విధమయిన కృతిమ మేధో వాతావరణం మధ్య నిజమయిన బుద్ధిజీవి నిజానికి భయంకరమయిన వొంటరితనాన్ని అనుభవించే స్థితి తెలుగు నాట వుంది.

మూడు: అంచుల నించి వస్తున్న అభిప్రాయాల మీద మనకి చిన్న చూపు. అంటే, వొక కొత్త అభిప్రాయాన్ని దళితులో, స్త్రీలో, ముస్లింలో, పల్లె నించి వచ్చే బుద్ధిజీవులో వ్యక్తం చేసినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకునే సహనం ఇంకా మనకి రాలేదు. అదే అభిప్రాయం పట్టణ ప్రాంతాల అగ్ర వర్ణాలు వ్యక్తం చేస్తే జయహో అంటున్నాం. ఈ ధోరణి మనలోని బానిసతత్వాన్ని, పరాధీనతని, వ్యక్తిత్వలేమిని చెప్తుంది.

14. ఇలాంటి ప్రతిఘటన లేకపోవడానికి ఈ దేశ సామాజిక పరిస్తితి ,ఈ దేశ రాజకీయ వ్యవస్తకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది ? దానికి ప్రత్యామ్నాయ ప్రతి ఘటన సాహిత్య రూపాలు తీసుకొని రావడం లో దళిత బహుజన వైఫల్యం ఉందని అనుకుంటున్నారా ?

ప్రజల్లో నిజమయిన  ప్రతిఘటన వుంది. దాన్ని గుర్తించినా ముందుకు తీసుకువెళ్లే రాజకీయ  వాతావరణం మనకు లెదు. ఇక మన ప్రతిఘటన సాహిత్య రూపాల మీద కూడా మన చదువుల ప్రభావం వుంది. మన చదువులు, మన మేధోలోకం  ఇంకా వలస వాద చట్రంలో వున్నాయి. ఆ చట్రం నించి బయట పడే శక్తి ఇంకా మనకి రాలేదు.  విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ పని చేయాలని అనుకోవడం మన పొరపాటు. అలాగే, ఎంత కాలం ఈ బ్రాహ్మణ పండిత వర్గాల్ని తిట్టుకుంటూ కూర్చుందాం? మన పరిస్తితికి ఇతరుల కంటే మనమే బలమయిన కారణం. మనల్ని మనమే ముందు నిందించుకోవాలి. బ్రాహ్మణ అని కాదు కానీ, అగ్రవర్ణ అంటాను. వాళ్ళలో వున్న ఐక్యత ఇంకెక్కడా లేదు. అలాగే, కుడి పక్షం ఎప్పుడూ ఐక్యంగా వుంటుంది. వామపక్షం చీలికలు పీలికలయి పోతూ వుంటుంది. విశ్వవిద్యాలయాలలో అగ్రవర్ణ  ఆధిపత్యం ఇంకా వుంది. మైనారిటీలు, అణగారిన వర్గాలు తమ లోపలి  బలహీనతల్ని గుర్తించి, తమ బలాన్ని పెంచుకునే శక్తి సంపాదించుకోవాలి.

15. మీరు అమెరికాలో అధ్యాపకుడిగా మారాక మీ ఆలోచన / అవగాహన లో / మేధో శ్రమ లో అస్తిత్వ రాజకీయాలలో  ఏ మార్పులు గ్రహించారు?

అధ్యాపకుడిగా పని చేస్తూ వుండడం వల్ల కొత్త తరం సంవేదనలూ, అనుభవాలూ, ఆలోచనలూ నాకు తెలుస్తున్నాయి. అట్లాగే, నా తరగతి గదుల్లో భిన్న దేశాల భిన్న సంస్కృతుల విద్యార్ధులు వుండడం వల్ల ఆ భిన్నత్వం నా ఆలోచనల్ని తప్పనిసరిగా మారుస్తుంది. నా విద్యార్థులు నా నించి ఎంత నేర్చుకుంటున్నారో నేనుగా చెప్పలేను గాని, ప్రతి విద్యార్థినించీ నేను నేర్చుకుంటూనే వుంటాను. అధ్యాపకుడయినా, వ్యక్తి అయినా నిరంతరం ఆ విద్యార్థి స్తితిలో వుండాలి అనుకుంటా. అందు వల్ల మీలోపల పీఠాలు ఏమయినా నిర్మితమవుతూ వుంటే, అవి వెంట వెంటనే కుప్పకూలిపోతాయి వాటికి అవే! ఇందులో చాలా మేధో శ్రమ వుంటుంది. మీ అస్తిత్వం నిరంతరం ప్రశ్నల మధ్య వూగిసలాడడమూ వుంటుంది. ఇది మేధో ఆరోగ్యానికి చాలా మంచిది. వొక్క ప్రశ్న కూడా పుట్టని రోజు నేను నిలవ నీరయిపోయినట్టే లెక్క. వొక కవితలో రాసుకున్నట్టు “ ఎక్కడో వొక చోట గడ్డ కట్టుకుపోలేను.”

(గుర్రం సీతారాములు)

ఇంటర్వ్యూ: గుర్రం సీతారాములు, డాక్టోరల్ ఫెలో ఇంగ్లీష్ ,విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్.