వాకిలి » తాడికొండ కె. శివకుమార శర్మ

తెలుగు కథలు, స.ప.స.లు
తెలుగులో మంచికథలు రావట్లేదని ఈమధ్య తరచుగా వింటున్నాం, చదువుతున్నాం. అయితే, ఈ “మంచి” అన్న విశేషణం గూర్చి పెద్దగా చర్చ జరగలేదు. పైగా, “మంచికథలు రావట్లేదు” అని మొదలయ్యే వ్యాసాలు రెండో వాక్యంలోనే చెహోవ్ ఇలా అన్నాడనో, లేదా గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అలా అన్నాడనో తరచుగా చూస్తుంటాం కూడా. ఈ వ్యాసకర్తలకు సాటి తెలుగువాళ్లు గానీ లేక భారతీయులు గానీ మంచికథ గూర్చి ఏమన్నారో తెలియదో లేక తెలుసుకోవాలని అనిపించదో అర్థంకాని విషయం. అయితే, తెలుగులో మూసకథలు కొల్లలుగా వస్తున్నాయనేది మాత్రం పత్రికలే ఒప్పుకునే విషయం. ఆ మధ్య ఆంధ్రభూమి కథలపోటీని నిర్వహిస్తూ, “మాకు మూసకథలు వద్దు!” అని స్పష్టంగా చెప్పినా చివరికి బహుమతికి ఎంపిక అయినవి అవే. ఆ పత్రికా సంపాదకులు అందరికీ తెలుసు గదా అనుకుని “మూసకథ”కు నిర్వచనాన్ని ఇవ్వకపోవడం ఇందుకు కారణం కావచ్చు.

“మూసకథ” అంటే స-ప-స కథ అనేది నా నిర్వచనం. సంగీతంతో పరిచయం ఉన్నవాళ్లకు ఆ మూడూ స్వరాలతో ముడిపడి ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం అసంఖ్యాకంగా వెలువడుతున్న కథల్లో కనబడేవి, సమస్య-పరిష్కారం-సందేశం కథలు. సంగీతంలో పంచమం లేకుండా రాగాలున్నాయి. అలాగే పై షడ్జమం లేకుండా కూడా రాగాలున్నాయి. కానీ, సమస్యో, లేక సందేశమో లేని కథలు పత్రికల్లో దాదాపు కనిపించట్లేదనే చెప్పచ్చు. కొన్ని కథలు పేర్లల్లోనే చెప్పేసి చదవాల్సిన బాధనుంచీ తప్పిస్తాయి. ఉదాహరణకి, “అమ్మకో బహుమతి,” “అమ్మా నన్ను క్షమించవూ?” ఈ కథల్లో సామాజిక సమస్యలు అగ్రభాగాన్ని ఆక్రమిస్తాయనేది నేను గమనించిన విషయం. అవి బి.టి. వంకాయలు కావచ్చు, సరోగసీ కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, అమెరికా వెళ్ళిపోయిన పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం కావచ్చు, సునామీ కావచ్చు, అంతమైపోతున్న కులవృత్తులు కావచ్చు. అది డాలర్ల వెంట పరుగెత్తడం కూడా కావచ్చు. తమాషా ఏమిటంటే, క్రితం శతాబ్దంలో మొదటిసగంలో భారతీయులు రంగూన్ వెళ్లివచ్చారు. అంతకు ముందర ఇంగ్లండ్ వెళ్లివచ్చారు. కానీ, అమెరికాకు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిటంటే అది మాత్రం డాలర్ల వెంట పరుగెత్తడం అని రచయితలూ రచయిత్రులూ నిర్ధారించేశారు. ఇంగ్లండ్ వెళ్ళిన వాళ్ల గూర్చి పౌండ్ల వెనక పరుగెత్తుతున్నారని రాయకపోవడానికి పాపం అప్పటికి తెలుగులో కథ అనేది పూర్తిగా రూపాన్ని దిద్దుకోలేదు. దీన్ని గూర్చి రాసిన, రాస్తున్న ఈ నాటి రచయితలు గనుక ఆనాడు ఉండివుంటే తెలుగు కథలు ఎలా ఉండేవోనని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. రంగూన్ వెళ్లి తిరిగి వచ్చిన పాత్రలు సినిమాల్లో బానే వచ్చాయి కదా! కథల్లో కూడా వచ్చాయేమో నాకు తెలియదు. మీ కెవరికయినా తెలుసా? రాలేదని మీరు అనేటట్లయితే అది ఆ కాలపు రచయితలకు ఎందుకు వస్తువు కాలేదంటారు?

ఈనాడు కథల్లో కనబడే వివక్షగూర్చి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథల్లో వివక్ష ఉండవచ్చు గానీ, ఒక్క వివక్షని చూపించడానికి మాత్రమే కథలు రాస్తే అవి కంకాళానికి తోలు కప్పినట్లు తయారవుతాయని నా అభిప్రాయం. వివక్ష అనగానే సందేశాత్మకం అని వెంటనే అర్థమవుతుంది కూడా. వివక్షని భాగంగా మాత్రమే చూపించే కథలు ఈ మధ్య కాలంలో నాకు స.వెం. రమేశ్ గారి “కతల గంప” సంకలనంలో కనిపించాయి. విశాలమయిన వర్ణ చిత్రాలలో సంఘర్షణలని, క్షోభపడే వ్యక్తులని, చిరకాలంగా చిత్రిస్తూనే ఉన్నారు. అవి కళాఖండాలయినవి ఆ వర్ణచిత్రాల నియమాలని పాటించడంవల్లే. అంటే ఆ చిత్రాలు చూసేవాళ్ళకు ఎలా కనిపిస్తాయి అని చిత్రకారులు ఆలోచించడం వల్ల. అలాగే, కథలో కూడా కథనమూ, భాష, పాత్రల ఔచిత్యమూ ముఖ్యం. రమేశ్ గారిలాగా అద్భుతమయిన వర్ణనలనీ, వాడి వాడి వడలిపోయిన వాటిని గాక తనకే స్వంతమయిన ఉపమానాలని రచయిత సృష్టించగలిగితే అది పాఠకునికి అదనపు బోనస్.

మనం సమాజంలో భాగమయి నందువల్ల అందులో కనిపించే సంఘటనలూ, అస్తిత్వమూ రచనకు ప్రేరణ కావచ్చు. ఉదాహరణకి, కేతు విశ్వనాథ రెడ్డి గారి కథ ‘రెక్కలు’. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారని తెలిసిందే. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకి పోలింగ్ బూత్ ల దగ్గర డ్యూటీ పడేదని కూడా వినేవుంటారు. ఈ కథలో అలాంటి డ్యూటీకి ఒక సహోద్యోగితో కలిసి కథకుడు లారీలో వెడుతుంటే అదే చోటికి వెళ్లే వయసులో వున్న ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా దానిలో ఎక్కుతారు. వాళ్ళకి కథకుడు వెడుతున్న పోలింగ్ బూత్ లోనే డ్యూటీ. చేరిన చిన్న ఊళ్లో చిన్న బడిలో వాళ్ల బస. మరునాటి పొద్దున్న ఎన్నికలు. రాత్రిపూట చీకట్లో కథకుడి సహోద్యోగి ఒక కానిస్టేబుల్ మీద మక్కువని ప్రకటించబోతాడు. ఇది కల్పితంకాదని తేలిగ్గా నమ్మవచ్చు. అయితే, ఆ ఉపాధ్యాయ వృత్తిలో లేనివాళ్ళకి ఈ కథ రాసే అవకాశం లేదు.

అలాగే ఇంకో అస్తిత్వం కథ వేంపల్లె షరీఫ్ రాసిన “తలుగు”. ఆయన తప్ప ఇంకెవరూ ఆ అంశాన్ని ముట్టలేరనిపిస్తుంది.

అనిల్ ఎస్. రాయల్ కథ “శిక్ష” కూడా సమాజపు రీతుల్ని వాడుకున్నదే. ఆసక్తికరమయిన కథనంతో పాఠకుణ్ణి ఆసాంతమూ చదివిస్తుంది.

యాభయ్యవ దశకంలో కథలు సమాజాన్ని ఉద్ధరించడానికే రాయాలి, సమాజాన్ని ప్రభావితం చెయ్యాలి, సమాజంలోని కుళ్లుని ఎండగట్టాలి, రచయితలకి బాధ్యత ఉండాలి అనడం మొదలయిందని బుచ్చిబాబుగారి కథలవల్ల తెలుస్తుంది. ఒక కథలో ఆయన దాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఈనాడు కథాంశానికే తప్ప కథనానికి పెద్దగా చోటులేదని అనిపిస్తోంది. కథల పోటీల్లో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన వాటిలోనే కాక గెలుపొందినవాటిల్లో కూడా ఈ తత్త్వం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో సందేశం ప్రధానం. ఇవి స-స ల కథలు – అంటే, సమస్య-సందేశం కథలన్నమాట. ఈ రెండు స్వరాలే ఉన్న ఒక రాగం గానీ ఒక పాటగానీ మీకేమయినా తెలుసా?

పరిష్కారం చూపించని కథలు లేకపోలేదు.

అయితే, ఈ పరిష్కారం చూపించేది ఎవరికోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. కథకి ముగింపు నివ్వడానికి మాత్రమే చూపే పరిష్కారాలకి ఊతనిచ్చేది సమస్యే. సమస్యతో మొదలయిన కథ పరిష్కారంకోసం దేవుళ్ళాడుతూనే వుంటుంది. అలాగని కథల్లో ఇచ్చిన సలహాలని పాటించిన వాళ్లెవరూ నాకు తెలియదు.

భారతీయ భాషల కథలన్నింటిలో ఈ స-ప-స ల స్వైరవిహారం వున్నదా లేక ఇది తెలుగు భాషకే ప్రత్యేకమా? తెలుగులోకి తర్జుమా చేసిన కొన్ని కథలని చదివాను గానీ వాటిలో నాకు ఇవి కనిపించలేదు. అయితే, ప్రచురింపబడ్డ వాటిలో చాలా తక్కువ శాతం వేరే భాషల్లోకి అనువదింపబడతాయి గనుక ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నా శాంపిల్ సైజు సరిపోదు. అందుకని అడుగుతున్నాను.

అసలు కథలెందుకు సమస్యలని తలకెత్తుకోవాలి? వాటికి పరిష్కారాల నెందుకు చూపాలి? వాటిలో సందేశాన్ని ఎందుకు ఇమడ్చాలి? ఉత్త స-స తోనే కాదు రాగాన్ని సృష్టించలేమనీ, మెలోడీని తయారుచెయ్యలేమని తెలిసేది. స-ప-స తో కూడా అవి సాధ్యం కాదు. ఆ మూడు స్వరాలలోనే ఎంత కొట్టుకున్నా మెలోడీని తయారు చెయ్యలేం. కనీసం ఐదు స్వరాలు కావాలి. స్వర్గీయ బాలమురళి గారు నాలుగు స్వరాలతోనే సృష్టించిన రాగాలని ఒప్పుకున్నా గానీ, నాలుగు స్వరాలు కావాలి. వాటిల్లో పై షడ్జమం ఉండదు.

ఆ మూడూ లేకుండా రాసిన ఎంతోమంది పాత కాలపు మేటి రచయితలని పక్కన పెడితే, ఈ మధ్య నాకు కొన్ని కథలు దొరికాయి. తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారివి. జై, నలుపెరుపు, గారడీ, ఆర్వీ చారి కరెంటు బిల్లు. ఇంకొక కథ నెమలీకలో సందేశ మున్నది గానీ అది ఆనందపరచేది. ఇంటి కెదురుగా ఉన్న చెట్టుని పట్టించుకోకుండా దాని పక్క నుంచే వెడుతుంటే ఎదురింటి వాళ్లు మనకు దాన్ని గూర్చి చెప్పడం లాంటిది. పొత్తూరి విజయలక్ష్మి గారి ఏలినవారి దివ్య సముఖమునకు అన్న కథ సామాజికమూ, తప్పక చదవవలసినది కూడా. హాస్యాన్ని కలిపిన వ్యంగ్యం నషాళాని కంటుతుంది. అలాగే, కె.ఎన్. మల్లీశ్వరి గారి కథ శతపత్ర సుందరి కథ చదివినప్పుడు నాకు అది సార్వజనీనమూ, సార్వకాలీనమూ అనిపించింది.

పత్రికలు నిర్వహించే కథల పోటీల్లో ఈ స-ప-స కథలకే అగ్ర తాంబూలం దొరుకుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి కథల నుంచి విముక్తి కలిగే అవకాశాలున్నాయా అని అనుమానం వస్తూంటుంది. అలాంటి కథలకే బహుమతులు వస్తాయి అని రచయితలు నిర్ణయించుకోవడం వల్ల అది జరుగుతోందా లేకపోతే సందేశమే ముఖ్యం అని పత్రికలు నిర్ణయించుకోవడం వల్లనా?

దాదాపు అరవయ్యేళ్లకు పైగా “కథలకు సామాజిక ప్రయోజనం ముఖ్యం” అనే నేపథ్యంలో ఈ స.ప.స.ల నుండి తెలుగు కథకి విముక్తి సాధ్యమా? ప్రపంచంలో ఏ సమాజమూ ఒక కథవల్లో ఒక నవలవల్లో మారిన దాఖలాలే లేనప్పుడు తెలుగు రచయితలు ఇంకా స.ప.స.లని పట్టుకుని వేళ్ళాడడం సమంజసమా? సంగీతంలో షడ్జమం లేని రాగాలే లేకపోవచ్చు. కానీ, స.ప.స.లు లేని కథలు పాత తరాల రచయితలవి కోకొల్లలు. ఈ తరంలో అలాంటి వాటిని దుర్భిణీ వేసి పట్టుకోవలసి వస్తోంది. లేకపోతే, అమ్మకు పుట్టిన ఆరుగురూ సంగీత పాఠకులు కారన్నట్టు, అరవై, డెభ్భై దశకాలు గొప్పవి, అప్పటిలాగా ఎప్పుడూ కథలు ఎలా వుంటాయి అని సర్దుకుపోవాలా?

(’10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)

మూసిన గుప్పెట
చాలా కాలమయింది మాట్లాడి అని గిరికి ఫోన్ చేస్తే “హలో” అన్న స్త్రీ గొంతు విని ఆశ్చర్యపోయాను. అది యామినిది కాదు. పెద్దయిన తరువాత వాళ్లమ్మాయి గొంతు ఫోన్లో ఎలా వుంటుందో విన్న గుర్తు లేదు. రాంగ్ నంబర్ అవడానికి వీల్లేదే అనుకుంటూ పది అంకెలూ చెప్పి, దీనికేనా నేను ఫోన్ చేసింది?” అనడిగాను. పాతికేళ్లుగా నోటికొచ్చిన నంబర్ అది. ఎలా మరచిపోతాను? “అవును” అని జవాబొచ్చింది. “గిరి…?” అని ఆగిపోయాను.

“హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్” అని జవాబొచ్చింది.

ఆ వాక్యపు టర్థం పూర్తిగా మెదడులోకి చేరక, “ఈజ్ హి అవుటాఫ్ ది కంట్రీ?” అనడిగాను.

“హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్ ఇన్ ది కంట్రీ ఆర్ అవుట్సైడ్ ది కంట్రీ” అన్నదా గొంతు.

ఆ జవాబుకు అదిరిపడ్డాను. ఆ స్త్రీ ఎవరో తెలియకపోయినా ఆవిడ మొదట చెప్పిన అయిదు ముక్కల సారం అర్థమై, “హౌ?” అన్నాను. “సర్జన్ చేతివాటం వల్ల –“ అని జవాబొచ్చింది.  ఇంకే మనాలో తెలియక ఫోన్ పెట్టేశాను. ఆవిడే యామిని అయ్యుంటే ఇంకొన్ని వివరాలని తప్పకుండా కనుక్కుని వుండేవాణ్ణి.

“ఏమి టంత తొందరగా ఫోన్ పెట్టేశారు?” అడిగింది గాయత్రి.

“గిరి ఈజ్ నో లాంగర్ …” అని నోట్లోంచి మాట రాక ఆపేశాను.

గాయత్రి మొహం పాలిపోయింది. గొంతు పెగల్చుచుకుని,“అయ్యో పాపం! ఎలా?” అని అన్నది.

“సర్జన్ చేతివాటం వల్లట. ఆవిడెవరో మంట మీదున్నట్లుంది, సర్కాస్టిక్‌గా చెప్పింది. ఆపరేషన్ టేబుల్ మీద అయ్యుంటుంది.”

“పాపం! చాలా సరదా మనిషి. యామినికా  ఇంకా యాభయ్యేళ్లు నిండలేదు,” అన్నది.

వాళ్లమ్మాయి సిరికి దాదాపు ఆరేళ్ల వయసప్పుడు వాళ్లుండే పశ్చిమ తీరాన్నుంచీ తూర్పు తీరాన వున్న మా ఇంటి కొచ్చారు. యామిని అప్పుడు వాడు సిరికి చెప్పిన బెడ్ టైం స్టోరీతో వాడిలోని ఒక పార్శ్వాన్ని గాయత్రికి పరిచయం చేసింది.

అనగనగా ఒక రాజకుమారుడు. అతను కాలేజీ కెడుతున్నప్పుడు ఒక రాజకుమారికి ఎదురుగా వెళ్లి – “ అని గిరి అంటూ  వుండగానే సిరి అడ్డొచ్చి, “రాజకుమారి కూడా కాలేజీ కెళ్లేదా?” అని అడిగింది.

“అవును,” అని వాడనగానే, “ఇద్దరూ ఒకే కాలేజీ కెళ్లేవాళ్లా?” అని మళ్ళీ ప్రశ్న వేసింది.

“రాజకుమారులూ, రాజకుమార్తెలూ వేరువేరు కాలేజీల కెళ్లే వాళ్లు. … రాజకుమారుడు రాజకుమార్తెకు ఎదురెళ్లి, ‘నేను నీకు ఐ లవ్యూ అని చెబితే చెంపమీద కొడతావని నా స్నేహితులూ, ఐ లవ్యూ అని చెప్పకపోతే కొడతావని నేనూ పందెం వేసుకున్నాం. మాలో ఎవరిని గెలిపిస్తావ్?’ అనడిగాడు.” అని ఎఫెక్ట్ కోసం ఆగాడు.

“రాజకుమార్తె ఎవరిని గెలిపించింది?” సస్పెన్స్ తట్టుకోలేని సిరి అడ్డు తగిలింది.

“ఆ రాజకుమార్తె అతని కళ్లల్లోకి చూసి, ‘ఇంతకీ నువ్వు నాకు ఐ లవ్యూ అని చెప్పినట్టా కాదా?’ అనడిగింది.”

“దానికి ఆ రాజకుమారుడు, ‘ఇప్పటిదాకా నేనేం మాట్లాడానో నువ్వు విన్నావు గదా!’ అని జవాబిచ్చాడు. అప్పుడామె ఒక క్షణం ఆలోచించి, అతని చెంప పగులగొట్టి అక్కడి నుంచీ వెళ్ళిపోయింది.

(“ఇంతకీ ఎందుకు కొట్టినట్లు?” అనడిగింది గాయత్రి అర్థంకాక. “అతను మాట్లాడిన మొదటి వాక్యంలో ‘ఐ లవ్యూ’ అని రెండు సార్లున్నది! అంటే, చెప్పినందుకు!” అని యామిని జవాబిచ్చింది. కానీ, అసలతను ముందూ వెనకా ఏమీ లేకుండా స్పష్టంగా ఐ లవ్యూ అని చెప్పకపోవడం వల్ల, అని నా కనిపించింది.)

మరునాడు అతను మళ్లీ ఆమెకు ఎదురు వెళ్లి, ‘నీ చేతి వేళ్లకి నా చెంప అంటే ఇష్టమని నేనూ, కాదు, నా చెంపకి నీ వేళ్లంటే ఇష్టమని నా స్నేహితులూ  పందెం కాసుకున్నాం. ఎవరిని గెలిపిస్తావ్?’ అని అడిగి, ‘దానికి నా వేళ్లూ, నీ చెంపా మళ్లీ సంప్రదించుకోవాలి అని చేతి వేళ్లతో అనిపిస్తా వేమో – నాకు కొంచెం  క్లారిటీ కావాలి. నన్ను గెలిపించాలంటే ఈసారి నీ ఎడమ చేతికి పని చెప్పు!’ అని జోడించాడు.”

“ఆమె అతని మాట విన్నదా?” అడిగింది సిరి.

“శుభ్రంగా!”

“సిండరెల్లా గానీ, స్నోవైట్ గానీ రాజకుమారులని అలా కొట్టలేదే!” అడ్డు తగిలింది సిరి.

“వాళ్లు అమెరికన్లు. ఇండియన్లు అలాగే కొడతారు. మీ అమ్మ నడుగు కావాలంటే!”

“మీ డాడీ అలాగే మాట్లాడతారులే గానీ, సిండరెల్లా, స్నోవైట్లు కూడా ఎవరికో ఒకళ్లకి చెంపదెబ్బలు తగిలించే వుంటారు,” అన్నది  యామిని.

“లేదు మామీ. యూ డోంట్ రిమెంబర్? సిండరెల్లాని స్టెప్ మదర్ కిచెన్లో నుంచీ బయటకు రానివ్వలేదు గదా. స్నోవైట్ కి కర్స్ వల్ల ఎవరిని కొట్టడానికీ ఆపర్చ్యూనిటీ దొరకలేదు.” అన్నది సిరి. “నువ్వూ, మీ నాన్నా ఇద్దరూ ఒకళ్లకొకరు సరిపోయారు!” అని యామిని విసుక్కుంది.

“ఆ రాజకుమార్తె ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె తల్లి –“

“రాణీగారు కదా!”

“ఆఁ. ఆవిడ, ఇప్పటిదాకా నువ్వు ఎవరో ఒకళ్లని చెంపమీద కొడుతూ నీ స్వయంవరాన్ని చాటుతున్నావని విన్నాను. దానిలో ఒకడు కావాలని  నీ చేతి దెబ్బని రెండవసారి రుచి చూశాడని విని నా కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. మంచి సంబంధం. వదులుకోకు. అయితే, ఇక నుంచీ ఇలాంటి వాటిని ప్రైవేట్ గా చేసుకోవాలి అన్నది.”

“దెన్ దే గాట్ మారీడ్ అండ్ లివ్డ్ హాపిలీ ఎవరాఫ్టర్?”

“చిన్న ట్విస్ట్ వున్నదిక్కడ. వాళ్లిద్దరూ రెండు మూణ్ణెల్లు డేటింగ్ చేసిన తరువాత ఒక రోజున, పెళ్లి చేసుకుందాం అని అన్నది ఆ రాకుమారి. నువ్వు నన్ను కొట్ట నంటేనే అన్నాడు రాకుమారుడు. ఆ కండిషన్ కి ఒప్పుకునేది లేదు. నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే అదే కుదరంటే ఎలా? అని ఆమె వెళ్ళిపోయింది. దెన్ దే లివ్డ్ హాపిలీ ఎవరాఫ్టర్ – సపరేట్లీ!”

“కాలేజీలో గిరికి గర్ల్ ఫ్రెండ్స్ వుండేవాళ్లా?” యామిని నన్ను నిలదీసింది గిరి ఎదుట. వాళ్ల పెళ్లయిన తరువాత కలవడం మాకు అది మొదటిసారి. కుతూహలం సమంజసమే మరి!

“ఆ అనుభవం కావాలి అని వాడన్న మాట నిజమే!” కర్ర విరక్కుండా, పాము చావకుండా జవాబిచ్చా ననే అనుకున్నాను.

“ఏదీ, ప్రేమించిన అనుభవమా లేక దెబ్బ తిన్న అనుభవమా?” అన్నది గాయత్రి.

“ఆ ఒక్కటీ అడక్కు!” అన్నాడు గిరి.

“పోనీ, అది ఇండియాలోనా లేక అమెరికాకి వచ్చిన తరువాతా? అదయినా చెప్పండి,” అన్నది యామిని.

“అమెరికాలో ఆడపిల్లలు ఐ లవ్యూ అని చెప్పగానే చెంపమీద కొట్టరు – వాళ్లు ఇండియా నుంచీ వచ్చిన వాళ్లయినా గానీ!” యథార్థమే చెప్పాను.

“స్వానుభవంతో చెబుతున్నారు!” అన్నది గాయత్రి.

“రహస్యా లేమీ దాచవద్దు అని అనుకున్న వాణ్ణి గనుక ఆ అనుభవ మేదో చెప్పాను. ఇలా వ్యంగ్యానికి వాడుకుంటా వనుకుంటే చెప్పేవాణ్ణే కాదు,” అన్నాను.

“రాగా కదనకుతూహలం ఆలాపన మొదలయింది,” అన్నాడు గిరి. నాదీ, గాయత్రిదీ పేర్లలోని మొదటి అక్షరాలని కలిపి మమ్మల్ని రాగా గానూ లేక గారా గానూ పిలవడం గిరికి అలవాటు. మధువంతి పుట్టిన తరువాత మా ముగ్గురినీ కలిపి రాగా మధువంతీ అని ముద్దు చేస్తుంటాడు. “ఎప్పటి కయినా ఆ ఆలాప్ స్థాయి నుంచీ ఝాలా దాకా కాకపోయినా కనీసం జోర్ దాకా నయినా చేరుకుంటా రేమో నని ఆశపడుతూ ఎదురు చూస్తుంటే ఇప్పటి దాకా మిగిలింది నిరాశే!” అని జోడించాడు.

వాడు చెప్పిన కథలోని రాణీగారు తన కూతురు కిచ్చిన సూచనని మేం పాటించడం వల్ల గానీ, లేకపోతే ఫ్రీ పెర్ఫార్మెన్స్ చాలా తరచుగానే చాలా మందికి దొరికేది.

“ఇండియాలో వున్న రాజకుమారిని గిరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు?” అడిగింది గాయత్రి.

“పోయినవాళ్ల గూర్చి మంచే మాట్లాడమంటారు. ఈ క్షణాన నువ్వా ప్రశ్న వెయ్యడం ఆశ్చర్యకరంగా వున్నది,” అన్నాను కొంత చిరాకుతో.

“మీరు త్వరగా కంక్లూజన్స్ కి జంప్ చేస్తారు. నేనిప్పుడు చెడ్డగా ఏమన్నానని?” తను కోపంగా జవాబిచ్చింది.

ఆమె ప్రశ్నని గుర్తు తెచ్చుకుని చికాకు తగ్గించుకుని, “సారీ! అదే నాకూ అర్థంకాని విషయం. నేను అడిగినా వాడు చెప్పలేదు. తరువాత అడగడం మానేశాను,” జవాబిచ్చాను.

“నాకు నమ్మబుద్ది కావట్లేదు!” అన్నది గాయత్రి. ఏదో దాస్తున్నానే తన నమ్మకం.

నాకు ఆ లలిత విషయంలోనే కాదు వాడు అర్థం కానిది. రెజీనా, డెబ్బీ విషయాల్లో కూడా. లలిత ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి విషయం. నేను పిట్స్‌బర్గ్ లో ఎమ్మెస్ చేస్తున్నప్పుడు వాడితో మా ఊరు వచ్చింది రెజీనా.  నేను న్యూజెర్సీలో వున్న వాణ్ణి విజిట్ చేసినప్పుడు వాడి పక్కన వున్నది డెబ్బీ. ఆ ట్రిప్ అంత తేలికగా మరచిపో గలిగేది కాదు.

వాడి అపార్ట్‌మెంట్ లో అద్దెకు తెచ్చి ట్రిపులెక్స్ సినిమా చూద్దామనుకున్నాం వాడి రూమ్మేట్లు ఇద్దరు దేశీలతో కలిసి. డెబ్బీ డజ్ డల్లాస్! ఆ కాలంలో చాలా పాపులర్ మూవీ అది. పక్క అపార్ట్‌మెంట్ లో వుండే ఇంకో ముగ్గురు దేశీలు జాయిన్ అయ్యారు. కళ్లని టీవీ స్క్రీన్ కి అప్పగిస్తూనే పక్కవాళ్లు వేసే జోకులకి పడీ పడీ నవ్వుతున్నాం. మధ్యలో వాడివైపు చూస్తే వాడి దృష్టి టీవీ మీద గాక నేలమీద కూర్చుని చూస్తున్న ఒకతని క్రాచ్ మీద వున్నది. ఆశ్చర్యపోయాను. తరువాత రెండు మూడుసార్లు వాడి వైపు చూసినప్పుడు దాదాపు అదే పరిస్థితి.

మరునాడు వాడితో “డెబ్బీ డజ్ డల్లాస్?” అనడిగాను కుడిచేతి వేళ్ళని మధ్యలో సందు వుండేలా గుప్పిట ముడిచి నోటి దగ్గరకు తెచ్చి పైకీ, క్రిందకీ ఆడిస్తూ.

“డెబ్బీకి బదులు ఏ దేవికో అయ్యుంటే ఆ ప్రశ్న వేసేవాడివా?” సూటిగా వచ్చిన ఆ ప్రశ్నకు ఖంగుతిన్నాను. “తెల్ల వాళ్లయితే తేలిగ్గా వచ్చి పక్కలో వాలిపోతా రనీ, అదే దేశీలయితే పెళ్లయేదాకా పాతివ్రత్యాన్ని పాటిస్తూ వుంటా రనీ – ఈ స్టీరియోటైప్ ఆలోచనల నుంచీ ఎప్పుడు బయటపడతావ్?” చికాగ్గా అడిగాడు.  మా స్నేహం అండర్ గ్రాడ్యుయేట్ అప్పుడు మొదలయింది కాబట్టి ఊరుకు నుంటాడు గానీ లేకపోతే చెయ్యి చేసుకునే వాడేమో ననిపించింది.

ఆ ట్రిప్పులోనే వరల్డ్ ఫేమస్ ఫార్టీ సెకండ్ స్ట్రీట్ కి తీసుకు వెళ్లాడు అడల్ట్ షో చూపించమని అడిగితే. తిన్నగా అక్కడికి తీసుకెళ్లిన వాడితో మెచ్చుకోలుగా, “ఇక్కడికి రావడంలో మంచి అనుభవం వున్నట్లున్నదే!” అన్నాను. భుజాల నెగురవేశాడు.

ఇవన్నీ గాయత్రి కెందుకు చెబుతాను? “ఉండేవాళ్లు,” అన్నాను.

“మన పెళ్లయేటప్పటికి?” నా సమాధానంతో సరిపెట్టుకోకుండా రెట్టించింది.

“వాడి గర్ల్ ఫ్రెండ్స్ చిట్టా తయారుచెయ్యడానికి నాకు అవకాశమన్నా వుండాలా? వాడు న్యూ జెర్సీలో, నేను పిట్స్‌బర్గ్ లో మాస్టర్స్ చేసింది అని ఎన్నిసార్లు గుర్తు చెయ్యమంటావు? వాడేం చేస్తున్నాడో చెబితే గదా నాకు తెలిసేది!”

“అవే కాదు తమరు తెలుసుకోవాల్సింది. ఆడవాళ్లకి ఏ రంగులు నప్పుతాయో, స్కిన్ టోన్ బట్టీ ఎలాంటి మేకప్ వేసుకోవాలో కూడా. అయినా ఇవన్నీ గిరికి తెలిసినంతగా ఇంకే మగవాళ్లకీ తెలుసు ననుకోను. మిమ్మల్ని అనుకోని ఏం లాభం?” అన్నది నన్ను పూచికపుల్ల కింద తీసిపారేసి నిట్టూరుస్తూ.

గాయత్రి అమెరికా వచ్చినప్పుడు మొదట జే.ఎఫ్.కే. ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి క్రిస్మస్ టైంలో నాతో బాటు వాడూ వచ్చాడు గానీ, ఇండియా నుంచీ అప్పుడే రావడం వల్ల ఎముకలు కొరికే ఆ చలిలో తనతో సైట్ సీయింగ్ చేయించకుండా సమ్మర్ వచ్చిన తరువాతే గాయత్రిని న్యూ యార్క్ చూపించడానికి తీసుకెళ్లింది. చీరెల షాపింగ్ కి క్వీన్స్ కి తీసుకెళ్లినప్పుడు తనకి ఏ రంగులు నప్పుతాయో చెప్పడంతో ఆగకుండా వాటిని కొనిపించేదాకా వాడు వదలలేదు.

“నా కిప్పటికీ ఆశ్చర్యమేస్తుంది ఆ రోజు బ్యుటీషియన్ చేత చేయించిన నా మేకప్పుని తలుచుకుంటే!” అన్నది గాయత్రి. మేకప్పుని గూర్చిన ఆ రెవరీలో గాయత్రి వుంటే, దానికి సంబంధించే నాకు గుర్తున్న అంశాలు నా మెదడు నిక్షేపాల్లో నుంచీ బయట కొచ్చాయి.

ఆ కాలంలో విజయవాడ నుంచీ వచ్చిన కాలేజీ అమ్మాయిలు మేకప్పుకి అంతగా అలవాటుపడ్డ వాళ్లు కాదు. అందుకే న్యూ జెర్సీ నుంచీ బయలుదేరి పిట్స్‌బర్గ్ కి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు గాయత్రి ఎన్ని వందల సార్లు అద్దంలో చూసుకున్నదో గుర్తు లేదు.

అలా చూసుకోని క్షణాల్లో రెండు మూడు సార్లన్నది – “ఆ ఫోటోలో వున్నది గిరే నంటే నమ్మబుద్ది కాలేదు!” అని.

వాళ్ల యూనివర్సిటీలో వుండే ఒక ప్రొఫెసర్ తెలుగు సాంస్కృతిక సమితిలో వేసిన కన్యాశుల్కం నాటకంలో వీడి చేత మధురవాణి వేషం కట్టించారట. ఆ నాటకం గ్రూప్ ఫోటోలో వాడు చెబితే గానీ తెలియనంతగా గుర్తుపట్ట లేకుండా వున్నాడు.

“మేకప్ చేసిన వాళ్ళ ప్రతిభ అది. నేను చేసినదల్లా మీసం తీసెయ్యడమే!” అన్నాడు గిరి.

“చీరెవరు కట్టార్రా?” కుతూహలం తోసుకుని గొంతు లోంచి బయటకు రాగా అడిగాను.

“పాపం, ఆ రామప్ప పంతులు గారి భార్య తెగ ముచ్చట పడింది. జాకెట్టు, లంగాలని ఆవిడే కుట్టిచ్చిందిలే. అయితే, దానివల్ల ఆ దంపతుల మధ్య తగాదా లొస్తాయని భయపడి డైరెక్టర్ గారే కట్టారు,” గిరి జవాబిచ్చాడు.

“నేను ఆ నాటకం చూశా గదా! ఏం గ్లామ రనుకున్నారు? విడియో వున్నది గానీండి, నిజంగా చూడడం వేరు. ఆ కులుకూ, ఆ హొయలూ, అరె, గొంతు కూడా అచ్చం అమ్మాయిదిలా మార్చాడండీ!” అన్నాడు వాడి రూమ్మేట్.

ఆ నాటకం విడియో నేనూ, గాయత్రీ చూశాం. మైక్ సిస్టం బాగోలేక డైలాగ్స్ సరిగా వినిపించలేదు గానీ, వాడి హావభావాలూ, వయ్యారాలూ సహజ స్త్రీ అభినయానికి చాలా దగ్గరలోనే వున్నా యనిపించింది. దానితో బాటే, ఎప్పుడో మరచిపోయిన ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ యియర్లో రాగింగ్ అప్పుడు మా బాచ్ లో వీడు అమ్మాయిలలాగా నడవడం పెద్ద హిట్ అన్న సంగతి గూడా గుర్తొచ్చింది.

“ఈ మధ్య ఫేస్ బుక్ లో గిరి నుంచీ పోస్ట్ లు ఏవీ లేవా?” గాయత్రి అడిగింది.

“చూసినట్లు గుర్తు లేదు,” అని అక్కవుంట్లో లాగిన్ అయ్యాను. వాడి పోస్ట్ లు ఏవీ గత రెండేళ్లల్లో వాడి పేజీలో నాకు కనిపించలేదు గానీ, నాకోసమే నన్నట్లుగా మెమరీస్ అంటూ నా పేజీలో మూడేళ్ల క్రితం మేము గిరి కుటుంబంతో వున్న ఫోటోలు దర్శన మిచ్చాయి. మధు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి మెడికల్ ప్రోగ్రాంలో చేరే ముందర మేం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి చివర్లో ఫ్రీమాంట్ లో వాళ్లింటి కెళ్లినప్పటివి అవి.

“యాగీ!” అన్నాను గిరి వాళ్లింట్లో అడుగు పెట్టే ముందర తలుపు తీసిన వాళ్ళిద్దరినీ చూస్తూ రెండు చేతులూ చాచి.  వాడు మమ్మల్ని “రాగా” అన్నప్పుడు వాళ్లు మరి “యాగీ” గాక మరే మవుతారు?

“జాతకా లెట్లా కుదిరె య్యన్నారో గానీ బతుకే యాగీ అయిపోయింది!” అన్నదట యామిని గాయత్రితో ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు.

“మేమేదో సుఖంగా వున్నామని అనుకోకు! నా నోట్లోంచి ఏమొచ్చినా ఆయనకు తప్పే. నిమిష నిమిషానికీ కయ్యానికి కాలు దువ్వుతుంటాడు,” అని గాయత్రి బదులిచ్చి వుంటుందని నా నమ్మకం. నాతోనే అంటుంది కాబట్టి నా వెనకగా ఏమీ అనక్కర్లేదు మరి! మాకు అయిదు కార్లు న్నాయంటే మాకు ఆరున్నాయని పోటీ పడేవాళ్ళు ఒక రక మయితే, నేను సైకిల్తో సరిపుచ్చుకో వలసిందే అని ఒకళ్లు అంటే, నీకు అదన్నా వున్నది, నేను రెండు కాళ్లతో సరిపుచ్చుకో వలసిందే అని అనే వాళ్లు ఇంకో రకం మరి!

“నువ్వు డాక్టరువి. గిరి ఐటీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. మీ అమ్మాయి శ్టాన్‌ఫర్డ్ లో చదువుతోంది. బ్రహ్మాండ మయిన లొకేషన్లో విశాలమయిన ఇల్లు. మీ యింటి కిటికీలోంచి చూస్తే ఎదురుగా కొండలు కనిపిస్తాయి. మీదీ లైఫంటే!” అన్నదట గాయత్రి.

“ప్చ్!” అన్నదట యామిని. “ఏదో చెప్పబోయి ఆపేసింది,” అన్నది గాయత్రి తరువాత నాతో.

వాళ్లిద్దరూ వంటింట్లో మాట్లాడుతూ వుండగా లివింగ్ రూంలో గ్రీక్ గాడెస్ వీనస్, మైకెలాంజెలో రూపొందించిన డేవిడ్  శిల్పాల నమూనాలని చూసి, “మీ ఇద్దరికీ చెరొకటా?” అన్నాను కవ్వింపుగా. వీనస్ విగ్రహం పారిస్ లూవర్ లోని శిల్పానికి నమూనా అయితే, డేవిడ్ విగ్రహం ఇటలీలోని ఫ్లారెన్స్ మ్యూజియంలో శిల్పానికి నమూనా. వీనస్  విగ్రహం నడుము పైన ఏ ఆచ్ఛాదన లేకుండానూ, డేవిడ్ విగ్రహం పూర్తిగా నగ్నంగానూ వుంటుంది. రెండూ కూడా స్త్రీ, పురుష ఆకృతులకి అద్భుత మయిన నమూనాలు.

“రెండూ నాకే!” అన్నాడు గిరి.

“నీకు కళల మీద ఆసక్తి లేదేమిటి?” యామినిని అడిగాను డిన్నర్ టైంలో – ఇంట్లో డెకరేషన్ అంతా గిరి ప్రతిభే నని యామిని అన్నప్పుడు.

“అదేమిటి అలా అంటారు? చెయ్యాలని వుండే వుంటుంది. హాస్పిటల్ నుంచీ వచ్చిన తరువాత ఇంకా ఓపిక ఎక్కడుంటుంది?” అన్నది గాయత్రి యామినిని వెనకేసుకు వస్తూ.

“నేనేదో చేస్తాను. గిరికి అది నచ్చదు. గాయత్రి అన్నట్లు తనకున్నంత తీరిక నాకేదీ?” అన్నది యామిని. ఆ మాటల్లో చురుకు నాకే గాక గిరికి కూడా తగిలిం దనే నా నమ్మకం. గిరిది రెగ్యులర్ అవర్స్ ఉద్యోగం మరి.

“కావాలని పని కల్పించుకుంటే తీరి కెక్కడ దొరుకుతుంది” అన్నాడు గిరి.

“పనిలో నిమగ్న మవుతే ప్రశాంతత దొరుకుతుంది,” అన్నది యామిని గిరిని సూటిగా చూస్తూ.

“ఇంజనీ ర్లవుతే ఆఫీసులో కంప్యూటర్ల మీద మోనోపోలీ ఆడుకున్నా రోజంతా వెబ్ సర్ఫింగ్ చేసినా అడిగే వాడుండడు. సర్జన్ల పనంటే మాటలా? కాన్సంట్రేషన్ లేకపోతే పేషెంట్ హరీ మంటాడు,” అన్నది గాయత్రి. అయితే, యామిని స్పెషాల్టీ గైనకాలజీ అన్న సంగతి మరిచిపోయి వుంటుంది.

“ఇంటికి వచ్చిన వాళ్లంతా ఒక్క డెకరేషన్ మాత్రమే గాక వంటనీ, బయట ఫార్మల్ ఫంక్షన్ లల్లో కలిసిన వాళ్లు నా చీరెల రంగులనీ, జాకెట్ డిజైన్లనీ మెచ్చుకుంటూ వుంటే అంతా గిరి ప్రతిభే నని చెప్పడానికి నాకు మంట పుడుతుంటుంది. దాదాపు పదేళ్లనించీ ఆ బాధ లేదులే. అడగడం మానేశారు అందరికీ జవాబు తెలుసు గనుక. ఈ సంసారంలో నేను మొగుణ్ణీ, గిరి పెళ్ళామూ అయితే ఇద్దరమూ సుఖంగా వుండేవాళ్ళం,” అన్నది యామిని. ఆమె కళ్లవైపు చూడడానికి భయంవేసి తల దించుకుని పళ్ళెంలోకి చూస్తూ వుండిపోయాను.

డిన్నర్ అయిన తరువాత మళ్లీ నేనూ, గిరీ మాత్రం లివింగ్ రూంలో ఆఫ్టర్ డిన్నర్ డ్రింక్ తీసుకుంటు న్నప్పుడు డేవిడ్ శిల్పం మీద దృష్టిని నిలిపి గిరి అన్నాడు – “ఎవరో అన్నారు – ది మోస్ట్ బ్యూటిపుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ది మేల్ హ్యూమన్ బాడీ అని!”

“మోస్ట్ ఆఫ్ ది మేల్స్ విల్ డిసగ్రీ విత్ యు. ఆ వీనస్ బాడీ చూడు ఎంత అందంగా ఉన్నదో!” అన్నాను.

“ఐ సా ఎ మోస్ట్ బ్యూటిపుల్ థింగ్ రీసెంట్లీ,” అన్నాడు గిరి.

“ఎక్కడ?”

“రెస్ట్ రూంలో యూరినల్ దగ్గర. అక్కడ నిలబడి పక్కకు చూసినప్పుడు,” అన్నాడు మాటరాఫ్ ఫాక్ట్ గా. అదిరిపడ్డాను. వాడి అపార్ట్ మెంట్ లో ట్రిపులెక్స్ సినిమా చూస్తున్నప్పుడు వాడి దృష్టి ఒకతని క్రాచ్ మీద వుండడం గుర్తొచ్చింది. “ఎందుకంత షాకవయ్యావు? అందాన్ని మెచ్చుకోవడంలో తప్పేంటి? తెల్లగా, నున్నగా, పొడుగ్గా, ఎంత మెజస్టిక్ గా ఉన్నదో తెలుసా? దాని ముందు ఈ డేవిడ్ ఎందుకూ కొరగాడు.” అన్నాడు వాడే.

“మైకెలాంజెలోకి అంతకన్నా గొప్ప మోడల్ దొరికి వుండడు,” తేరుకుని జవా బిచ్చాను.

“కానీ, నేను చూసిన ఆ అందానికి తగిలించి వున్న శరీరాన్ని చూస్తే రోత పుట్టింది.  ఈ శిల్పానికి ఆ అందమే తగినది,” అన్నాడు ఆ డేవిడ్ శిల్పాన్నే చూస్తూ.

ఈ గిరి నాకు తెలియ దిప్పటి వరకూ. ఇందాక యామినీ, ఇప్పుడు గిరీ - ఈ సంభాషణలని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకుని వుంటారని అనుకోను.

“ఇంట్లోకి అడుగు పెడుతూనే మమ్మల్ని యాగీ అన్నావు. మరి మీ సంగతేమిటి? రాగా మోహనమా,  శివరంజనా, లేక కదనకుతూహలమా?” అన్నాడు మాట మార్చి.

“మోహనం కాలం మధువంతి ఎలిమెంటరీ స్కూల్ పూర్తయేవరకు. మిడిల్ స్కూల్లో దాని చదువును గూర్చి మొదలయిన కదనకుతూహలం అది కాలేజీలో చేరిన తరువాత కూడా  కంటిన్యూ అయింది. ఇప్పుడు మధు పెళ్లి గూర్చిన ఆందోళిక తనకి, పాలించు కామాక్షీ అంటూ మధ్యమావతి నాకూను. మీ యాగీ ఏ రాగంలో?”

“అహీర్ భైరవ్, మాయామాళవగౌళ, రాగా భీభత్స్!”

“ఆ చివరిది ఎప్పుడూ వినలేదే?”

“నైట్ ఆన్ ఎ బాల్డ్ మౌంటెన్ దొరుకుతుంది యూ ట్యూబ్ లో. విను. తెలుస్తుంది.” జవాబిచ్చాడు.

వాళ్లింట్లో గడిపిన ఆ రెండు రోజులూ భీభత్సానికి నిర్వచన మనిపించింది నాకు. అందుకే, తిరిగి వచ్చి, “చేరాం” అని టెక్స్ట్ పంపిన తరువాత వాణ్ణి కాంటాక్ట్ చెయ్యలేదు. వాడి నుంచీ కూడా నిశ్శబ్దం వుండడం నాకు ఆశ్చర్య మనిపించలేదు.

“మీరు రెండు వారాల్లో ఆఫీసు పనిమీద శాన్ ఫ్రాన్సిస్కో వెడుతున్నట్టున్నారు గదా, నన్ను కూడా తీసుకు వెళ్ళండి. యామినిని పరామర్శించి వద్దాం,” అన్నది గాయత్రి. ”రావచ్చా?” అని యామినికి టెక్స్ట్ పెట్టి, “ఓకే” అనిపించుకుంది కూడా.

“యామిని రావడానికి కొద్దిగా ఆలస్య మవుతుందని చెప్పింది. లోపలకు రండి,” అన్నది తలుపు తీసినావిడ. అందంగా, ఆ చీరెలో హుందాగా వున్నది. తేరిపార చూడడం సభ్యత కాదని కళ్లని బలవంతంగా పక్కకు తిప్పాను. “మీరు బాగా కావలసిన వాళ్లని చెప్పింది. రండి,” అంటూ ఫామిలీ రూంలోకి దారి తీసింది. ఆవిడ వెనకే మేమూ వెళ్లాం. చుట్టూ చూశాను. గోడల మీదా, కాఫీ టేబుల్ మీదా అంతకు ముందు వున్న ఫోటోలకి ఈవిడ చీరె కట్టుతో గిరి కూతురు సిరితో వున్న ఫోటో జతచేరింది.

“యామినిని నాతో కలిసి ఫోటో తీసుకొమ్మన మంటే వినదు. కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను,” అని ఆవిడ వంటింట్లోకి దారి తీస్తుంటే, గాయత్రి ఆమె వెనుకే వెళ్ళింది. నేను కాఫీ టేబుల్ మీది పుస్తకా న్నొకదాన్ని చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చున్నాను.

“ఎన్నాళ్ళయింది ఇక్కడికి వచ్చి?” అని గాయత్రి అడగడం స్పష్టంగానే వినిపించింది. దాని వెనకే, “రెండేళ్లు దాటింది,” అన్న ఆవిడ జవాబు కూడా.

“యామిని మీకు నా పేరు చెప్పే వుంటుంది గానీ, మీ పేరేంటి?”

“గిరిజ.”

“మీ వారేం చేస్తుంటారు?”

“ఐ యాం నాట్ మారీడ్.”

“ఇంత అందంగా వున్నారు. మిమ్మల్నెవరూ ఎగరేసుకు పోలేదంటే ఆశ్చర్యంగా వున్నది.”

“స్టిల్ లుకింగ్.”

ఆమె తెచ్చి యిచ్చిన కాఫీ తాగుతున్నప్పుడు వచ్చింది యామిని. బాగా చిక్కిపోయింది. గాయత్రి వయసు దయినా గానీ, హఠాత్తుగా పదేళ్లు మీద పడ్డట్లు కనిపించింది.

“నీ ఆప్త మిత్రుణ్ణి కావలించుకున్నావా?” గిరిజని అనడిగింది వస్తూనే.

“భయపడతాడని ఆ పని చెయ్యలేదు. పైగా, అలా చేస్తే గాయత్రి ఊరుకుంటుం దేమిటి? మీద పడి రక్కుతుంది,” అన్నది గిరిజ.

“పోనీ, గాయత్రికి హగ్ యిచ్చి వుండాల్సింది,” అన్నది యామిని.

“నువ్వు రాకముందు ఆ పని చేస్తే, నువ్వు న్యూస్ బ్రేక్ చేసిన తరువాత తనూ, వాడూ కూడా ఏ మనుకుంటారో నని ఆ పని చెయ్యలేదు,” గిరిజ జవాబిచ్చింది.

నేనూ, గాయత్రీ సంభ్రమంతో ఒకళ్ల మొహాలు ఒకళ్లం చూసుకుని ప్రశ్నార్థక మొహాలతో గిరిజ వైపు తిరిగాం.

“మీట్ గిరిజ. యు న్యూ హర్ యాజ్ గిరి బిఫోర్,” అన్నది యామిని.

“న్యూ జెర్సీలో చూసిన మధురవాణి వేషంలో లాగానే వున్నది. ఇంట్లోకి రాగానే అనుకున్నాను ఎక్కడో చూసినట్లున్నదే అని!” అన్నది గాయత్రి.

“అప్పటికీ ఇప్పటికీ ముఫ్ఫయ్యేళ్ల తేడా మరి!” అన్నది గిరిజ.

నేను గిరిజని కళ్లార్పకుండా చూశాను. అలా చూడడం సభ్యత అవునో కాదో ఆలోచించే పరిస్థితిలో లేను.

“అంతలా చూడకు. సిగ్గేస్తోంది. వచ్చి నీ ఒళ్లో వాలిపోదా మని నా కనిపిస్తే గాయత్రికి కష్టం,” అన్నది గిరిజ. నా ఒళ్లు గగుర్పాటు చెందింది.

ముందు తేరుకున్నది గాయత్రి. “మీరు తొందరగా కంక్లూజన్ కి వచ్చేసి అందరినీ హడలుగొడతారు,” నాతో  అని, గిరిజ వైపు తిరిగి, ”మీరు ఆయనతో ఏం చెప్పారో గానీ, మీరు” అని ఆగి, చేత్తో గాలిలో పైకెళ్లి పోయినట్లు చూపిస్తూ, “అనుకున్నా రీయన,” అన్నది.

“గిరి?” అని వాడడిగితే, “హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్,” అన్నాను అన్నది గిరిజ పకపకా నవ్వుతూ.

జవాబుగా, సోఫాలో ప్రక్కన కూర్చుని నిశ్శబ్దంగా తన ఒళ్లో తల పెట్టి పడుకున్న యామినిని చూసి నివ్వెరపోయింది గాయత్రి.

“టెక్నికల్ గా, గిరి ఈజ్ నాట్ డెడ్. ది పర్సన్ యు ఆర్ లుకింగ్ యట్ డజ్ నాట్ హావ్ సంథింగ్ హి వజ్ బార్న్ విత్. దట్సాల్,” అన్నది గిరిజ.

“నో. గిరి ఈజ్ డెడ్,” అన్నది యామిని విసురుగా లేచి కూర్చొంటూ.

గిరిజ నవ్వింది. “రమణ మహర్షి, ‘నేను’ అంటే ఎవరు? ఈ చెయ్యి నేనా, ఈ కాలు నేనా అంటూ దేహంలో అన్ని భాగాల గూర్చీ అలా అడిగారట. నువ్విప్పుడు జవాబు చెప్పావు. మా తల్లిదండ్రులు నామకరణం చేసింది ఇప్పుడు నా శరీరంలో లేని భాగాని కని!” అన్నది గిరిజ.

“డోంట్ బి రిడిక్యులస్!” అన్నది యామిని.

“ఇది నిన్ను పెళ్లాడినప్పుడు వున్న తలే. కనిపించే ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులే గాక శరీరం లోపల దాక్కున్న ఊపిరి తిత్తులు, గుండెకాయ, కిడ్నీ, అన్నీ అవే. ఇప్పుడు నా శరీరంలో లేని భాగాన్ని ప్రపంచంలోని అనేకమందితో బాటు నువుకూడా ఎప్పుడూ కళ్లతో చూడలేదు. దిసీజ్ ది ట్రూత్.” అన్నది గిరిజ.

“ఐ సా మెనీ అదర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. … కానీ అది అప్పుడప్పుడూ అయినా నా శరీరానికి ప్రకృతి సహజంగా అమర్చే సుఖాన్నిచ్చింది,” అన్నది యామిని.

“అది నిజం. ఇప్పుడు నేను కూడా ఆ సుఖం కోసమే తాపత్రయపడుతున్నాను,” అన్నది గిరిజ . గాయత్రి సోఫాలో నాకు దగ్గరగా జరిగి నా చేతిని గట్టిగా పట్టుకుంది.

“ముఫ్ఫయ్యేళ్లుగా నువ్వు చూసిన మొహమే యిది. ఆచ్ఛాదన లేని నా ఛాతీని మాత్రం నువ్వు ఎప్పుడూ చూడలేదు. పెళ్లిలో కూడా చొక్కా వేసుకునే కూర్చొన్నాను. నా చిన్నప్పుడే మా అమ్మ అనేది – చొక్కా లేకుండా ఎప్పుడూ కనపడవు. ఆడపిల్లలా ఆ సిగ్గేమిట్రా? అని. రియలైజేషన్ త్వరగానే కలిగినా గానీ, ఇట్ టుక్ మి టైం టు మేక్ ది డెసిషన్,” అన్నది గిరిజ నాతో.

“ది ఛేంజ్ మస్ట్ హావ్ బీన్ డిఫికల్ట్” అన్నాను నోరు పెగల్చుకుని.

“నాట్ యాజ్ హార్డ్ యాజ్ లివింగ్ విత్ ది రాంగ్ అటాచ్ మెంట్ ఆల్ దీజ్ యియర్స్,” అన్నాడు – అన్నది గిరిజ.

“ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎక్స్‌పెన్సివ్ టూ!” అన్నాను.

“యస్. హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యదు. యామిని సేవింగ్స్ లేకపోతే ఇది సాధ్యమయేది కాదు. ఐ విల్ ఆల్వేస్ బి థాంక్ ఫుల్ ఫర్ హర్ కంపానియన్షిప్ అండ్ ఫైనాన్సింగ్,” అన్నది గిరిజ.

“ఈ మగాళ్ల కెప్పుడూ డబ్బుల గోలే. ఫీలింగ్స్ గూర్చిన ఆలోచనే వుండదు,” విసుక్కుంది గాయత్రి.

“అందుకే ఏడుస్తుంటాను. నేను డాక్టర్ని కాకపోతే, ఆ సంపాదనే లేకపోయుంటే, ఇలా జరగడానికి అవకాశమే వుండేది కాదని,” అన్నది కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.

“భగవంతుడు అలా రాసిపెట్టాడు. ఏం చేస్తాం?” అంటూ గాయత్రి భుజం చుట్టూ చేయి వేసి యామినిని దగ్గరకు లాక్కుంది.

“సిరి ఎలా తీసుకుంది?” అడిగాను.

“కాలిఫోర్నియాలో వుండడం మంచి దయింది. ఎల్జీబీటీ గూర్చిన అవేర్‌నెస్ హైస్కూల్లోనే కలుగజేస్తారు కాబట్టి,” అన్నది గిరిజ.

“నిన్ను సిరి ఏమని పిలుస్తుంది?” గాయత్రి సందేహిస్తూనే అడిగింది.

“డాడ్ అనే. బయోలాజికల్ గా అంతే కదా?” ఫాక్చ్యువల్ గా చెప్పింది గిరిజ.

“అందుకే, మీ అమ్మ కూడా ఏడుస్తోంది – నువ్వు నాకు కొడుకు గానే పుట్టావు, అందుకే నువ్వు నాకెప్పుడూ కొడుకువే అని! నీకింత అన్యాయం జరుగుతుందని అనుకోలే దమ్మా అంటూ ఆవిడ ఒకటే ఏడుపు. మా ఇద్దరిలో ఎవరం ఎక్కువ ఏడిచా మన్నది ఆ దేవుడే చెప్పాలి,” అన్నది యామిని.

“ఎంత మంచి అత్తగారో చూడు! తనని మళ్లీ పెళ్లి చేసుకొమ్మన్నది. నాక్కూడా ఒక సంబంధం చూడమన్నాను,” అన్నది గిరిజ.

“డూ యు ఎలోవ్ హర్ టు బ్రింగ్ డేట్స్ ఇన్‌టూ ది హవుస్?” యామినిని అడిగాను.

“సిరికి చెప్పినదే చెప్పాను – నో ఓవర్నైట్ స్టే ఇన్ ది హవుస్, అండ్, దట్ టూ ఈజ్ లిమిటెడ్ టు ది లివింగ్ రూం ఓన్లీ,” అన్నది యామిని.

“మేం మధుకి చెప్పిందీ అదే!” అన్నది గాయత్రి.

“హౌ ఈజ్ లైఫ్?” గిరిజని అడిగాను.

“వర్క్ లైఫ్ ఈజ్ ఫైన్. వెరీ సపోర్టివ్. పైగా, ఒబామా వున్నప్పుడు చాలా ఫెడరల్ రూల్స్ వచ్చెయ్ నాలాంటి వాళ్లని ఎలా సక్రమంగా చూసుకోవాలో చెబుతూ. సుప్రీం కోర్ట్ కూడా నాలాంటి వాళ్లకీ మీలాంటి వాళ్లకీ వుండే హక్కుల్లో ఎటువంటి తేడాలు లేవన్నది. సోషల్ లైఫే, అది కూడా తెలుగువాళ్ల మధ్యలో మాత్రమే ఇబ్బంది,” అన్నది గిరిజ.

“అంతకు ముందు ఇక్కడ తెలుగు అసోసియేషన్స్ లో నాటకాల్లో రెగ్యులర్ గా స్త్రీ పాత్ర ధరించేవాడు గిరి. గత పదేళ్లలో కొంచెం తగ్గింది నా పోరు వల్ల అని కాదు గానీ, మధుకి ఊహ తెలిసిన తరువాత బాగుండదు అన్న నా ఆలోచనలో ఇంగితం కొంచెమయినా కనిపించడం వల్ల కావచ్చు. ఆ వేషాల్లో అందరి మెప్పుదలనీ పొందాడు – అందం గూర్చీ, నటన గూర్చీ కూడా. వాళ్లల్లో ఒకళ్లు గిరిజని ఒక గ్రోసరీ షాపులో చూసి గుర్తుపట్టి దగ్గరకు వచ్చి, ‘ఎక్కడ వేస్తున్నారు నాటకం? ఈసారి ముందే మేకప్ వేసుకుని వేడుతున్నట్టున్నారే!’ అనడిగి, జవాబుని విని ఖంగుతిన్నారు. వాళ్ల కిప్పుడు మాతో ఎలా మెలగాలో తెలియదు. నేను కనిపించినప్పుడు సానుభూతి చూపిస్తా మంటారు. కొంతమంది తప్పు నాలో వుండడం వల్లనే ఇలా అయింది అని బాహాటంగానే అన్నారు. ఇటు తప్పించుకుని తిరగలేము, అటు తప్పించుకోకుండా మసలలేము,” అన్నది యామిని.

“ఇరవయ్యేళ్లుగా తెలిసిన ఇండియన్ కుటుంబాల్లోని మగవాళ్లతో ఇప్పుడు మా ఇద్దరికీ చిక్కే,” నన్నది గిరిజ.

“తనని గూర్చిన కుతూహలంతోనూ, నా గూర్చిన ఆశతోనూ!” అన్నది యామిని.

“నాది దురాశ కావచ్చునని ఒప్పుకుంటాను గానీ, మా వేర్వేరు లవ్ లైఫులు ఎలా వున్నా గానీ, తను నా స్నేహితురాలిగా వుండాలన్నది నా బలమైన కోరిక,” అన్నది గిరిజ.

“తన డెలివరీ నా చేతుల మీదుగా జరగాలట!” అని కళ్లు తుడుచుకుంటూ అక్కణ్ణించీ లేచి వెళ్లిపోయింది యామిని.

“అది సాధ్యమా?” గాయత్రి నన్నడిగింది మరునాడు కార్లో కూర్చొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరగానే. అంతకు ముందు రాత్రి వాళ్లింట్లో మా బెడ్రూంలో మేమిద్దరం మాత్రమే వున్నా గానీ, ఆ యింట్లో ఆ ప్రశ్న అడగడం అసభ్యత అని తనకి అనిపించడం వల్ల అయివుంటుంది ఇప్పటిదాకా ఆగింది.

“మగవాడికి కానుపు అని ఎక్కడో తెలుగు పేపర్లో చదివిన గుర్తు. ఇలాంటి విషయాలు ఎందుకో ఆ పేపర్లల్లోనే ఎక్కువగా దర్శన మిస్తుంటాయి. యుటిరస్ ని అమర్చి హార్మోన్ల ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది సాధ్యంట,” నాకు తెలిసినది చెప్పాను.

“అచ్చం ఆడదాన్లాగే వున్నాడు కదలికలతో, చేష్టలతో కలిపి. గొంతు సంగతి సరేసరి,” అన్నది గాయత్రి.

“హార్మోన్ల ట్రీట్మెంట్ తో బాటు ఆడవాళ్ల లాగా కదలికలకీ, చేష్టలకీ ట్రైనింగ్ నిచ్చారట. వాడికి వాటితో అవసరం లేదనుకో. మేం కాలేజీలో వుండేటప్పుడు అక్కడి కొందరు అమ్మాయిల నడకలనీ, చేష్టలనీ అనుకరించి చూపి మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేవాడు. పాతికేళ్ల నాటి మధురవాణి విడియో నువ్వు చూడనే చూశావు. … మెడిసిన్లో అడ్వాన్స్‌మెంట్స్ వల్లనే ఇదంతా సాధ్యం. ఇప్పటిదాకా లోపలివి గానీ, బయటివి గానీ మెడ క్రింది అవయవాలని మాత్రమే మార్చారు గానీ, వచ్చే ఏడాది ఒక మనిషి తలని వేరొక మొండానికే ఏకంగా అమరుస్తారట! ఇంక మానవులకి సాధ్యం కానిదే ముంటుంది?”

“మనం మూడేళ్ల క్రితం వచ్చినప్పుడే యామిని చెప్పింది గిరి క్రాస్ డ్రస్సర్ అని. అర్ధంకాక అంటే ఏమిటని అడిగాను. గిరికి ఆడవాళ్లలాగా వేషం వేసుకోవాలనీ, అలంకరించుకోవాలనీ అమితమయిన కోరికట. కూతురి వయసు పెరుగుతున్నకొద్దీ ఆ వెర్రి పోకడలని దాన్నుంచీ దాచడానికి కష్టపడవలసి వచ్చేదట. వారంలో ఒకరోజన్నా అలా వుండకపోతే గిరికి పిచ్చెక్కిన ట్లుండేదట. అందుకని యామినే మధుని వీకెండ్స్ లో యాక్టివిటీలకి తనే తీసుకెళ్లి గిరికి ఇంట్లో వుండడానికి అవకాశ మిచ్చేదట. మొదట్లో వర్క్ వల్ల అని యామినితో అబద్ధం చెప్పాట్ట గానీ, అది ఎక్కువకాలం సాగకపోవడం వల్ల బయటపడాల్సి వచ్చిందట్లే. మగవాళ్ల హార్మోన్లేవో వుంటాయటగా -”

“టెస్టాస్టిరోన్“

“ఆ. అవే. సెక్స్‌లో ఆసక్తి పూర్తిగా కరువవుతోందని వాటిని పుచ్చుకొమ్మందిట కూడా. డాక్టర్ అవడం వల్ల అనుమాన మొచ్చిందట గానీ, అది నిజం కాకూడదని ఎన్నో దేవుళ్లకి మొక్కుకున్నదిట కూడా!” అన్నది గాయత్రి కళ్లు తుడుచుకుంటూ.

“నానుంచీ ఎంత దాచివుంచావు? ‘ఆడవాళ్ల నోట్లో నువ్వుగింజ నానదు’ అన్న నానుడిలో నిజం ఏమాత్రం లేదని నిరూపించావు!” అన్నాను ఆశ్చర్యపోయి.

“గిరి ప్రేమ వ్యవహారాల గూర్చి మీరు నాకు చెప్పారేమిటి?” అన్నది గాయత్రి ఎత్తిపొడుస్తూ.

“ఇంకా కాలేజీ విషయాల గూర్చేనా  నువ్వు మాట్లాడుతోంది? అప్పటికీ, ఇప్పటికీ కూడా నాది అదే సమాధానం. నాకు తెలిస్తేనే కదా నేనే మయినా చెప్పేది? కానీ, ఆలోచిస్తే ఇప్పుడనిపిస్తోంది – ఇండియాలో లలిత ప్రేమ వ్యవహారంలో తన గూర్చిన అనుమానంతోనే వాడు దాన్ని బ్రేక్ చేసుంటాడు.”

“మరి అమెరికాలో డెబ్బీ, రెజీనాల విషయంలో?”

“తేలిగ్గా సంభాషణ జరపగలగడం వల్ల వాళ్లు ఫ్రెండ్స్ అయివుండవచ్చు. తరువాత రొమాన్స్ విషయాని కొచ్చేసరికి కొంచెం ముందు వెనుకలుగా వాళ్లే దూరం జరిగారో, లేక వాడే దూరంగా జరిగాడో?” అన్నాను. న్యూయార్క్ లో వాడు నన్ను తిన్నగా ఫార్టీ సెకండ్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళడం, అది అప్పటికే ఎన్నోసార్లు వాడు అక్కడికు వెళ్లివుండడంవల్ల అని నేను అనుకోవడం గుర్తొచ్చింది.  అక్కడ తనమీద అపనమ్మకాన్ని తొలగించుకుని వాళ్లకి దగ్గరయ్యుండాలని అనుకున్నాను. వాళ్ల సాంగత్యంలో అనుభవం వల్లనే లలితతో చెయ్యని సాహసం యామినితో చేశా డనిపించింది. పైగా, అది తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం, చేసిన పెళ్లి.

“ఇట్లాంటివాళ్లు అసలు పెళ్లి చేసుకోకూడదు!” అన్నది గాయత్రి.

అలాంటి శాసనాన్ని అమలుపరచే శక్తి ఇప్పటిదాకా ఎవరికీ వున్నట్లు దాఖలాల్లేవు. అందుకని నా అభిప్రాయాన్ని మాత్రం తెలియపరచాను – “గిరిజ కోరిక సఫల మవ్వాలని కోరుకుంటున్నాను గానీ, పుట్టే ఆ పిల్లో, పిల్లాడో సమాజంలో ఎలాంటి పరిస్థితుల నెదుర్కోవలసి వస్తుందో నని ఆలోచిస్తున్నాను.”

వాడు నాకెప్పుడూ అర్థమయేటంత దగ్గర కాలేదని అనిపించింది. కానీ, జీవితంలో నలభయ్యేళ్లకి పైగా నరక మనుభవించాడని గుర్తొచ్చి కళ్లు చెమర్చాయి.

వెంటాడే కథలు; కతల గంప – స. వెం. రమేశ్
అస్తిత్వానికి మంచి భాషా, దాన్ని వాడుకోగల సత్తా తోడయితే కథలని ఎంత కళాత్మకంగా రూపొందించవచ్చో రమేశ్ గారు చూపిస్తారు “కతలగంప” సంకలనంలో. ఈ సంకలనంలోని 18 కథలు చదివితే ఈ రచయిత చిత్రించిన కాన్వాస్ విస్తీర్ణం అర్థమవుతుంది. వస్తువు ఈ కథల్లోని జీవితాలంత అపురూపం, చిత్రణ అనన్య సాధ్యం. అస్తిత్వం ఆయువుపట్టు అవడంవల్ల నేలని వదిలి సాముచేసే కథలేవీ కనిపించవు ఇందులో. గ్రామీణ వాతావరణమూ, దాన్ని అంటిపెట్టుకుని వుండే అచ్చమైన తెలుగు భాషా ఈ కథలకి సొబగులద్దాయి. బాట చెప్పిన, చెట్లు చెప్పిన, మట్టికుండ చెప్పిన, వానజల్లు చెప్పిన, మొయిలుకు చెప్పిన కథలూ, ఆ యా కథనాలకి దీటయిన వర్ణనలూ ఈ సంకలనానికి ప్రత్యేకం.

కొన్ని దశాబ్దాల జీవితాలని అతి దగ్గరగా చూపే చిత్రణమే గాక కమింగ్ ఆఫ్ ఏజ్ తో మొదలుపెట్టి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ) తెలుగు నేర్పడానికి పల్లెపల్లె తిరిగిన దాకా (ఆ అడివంచు పల్లె) ఎదురయిన ప్రతీ సంఘటనా అపురూపపు జ్ఞాపకంగా మారి అందంగా అలంకరించుకుని కనిపిస్తుంది. ప్రళయకావేరి తీరంలో రాష్ట్రవిభజనవల్ల తమిళనాడులో చేర్చబడ్డ పల్లెల్లోని తెలుగువాళ్ల జీవితాల చిత్రణతో ఈ సంకలనం మొదలవుతుంది. ఒక చిన్న బడి, హాస్పిటలు కూడా లేకపోవడమే గాక బస్సు రాకకు కూడా నోచుకోనివీ పల్లెలు. పన్నెండుమంది తమిళ, నూటయాభైమంది తెలుగు పిల్లలున్న చోట బడి అంటే చూరునుంచీ పెళ్లలు రాలిపడుతున్న చిన్న, పాత కట్టడం. ఆ చోటు తమిళనాడులో ఉన్నందున అక్కడ కట్టిన కొత్త గది తమకే కావాలంటారు తమిళ పిల్లలు (తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప). అసలు బడే లేనిచోట కడితే అరవబడే అవాలన్న ప్రతిపాదనకు సరే అందా మంటారు సర్దుకుపోదామనుకునే మనస్తత్వం ఉన్న కొందరు పెద్దలు (మీసర వాన). “మమ్మల్నేమో ఈ తమిళ తోడేళ్లకి యిడిసిపెట్టి ఆ సొరణే లేకుండా ఉండిపొయ్యిండారే ఆ ఆంద్రమోళ్లు” అంటాడు ఆశ్వత్తన్న (పదిమందికి పెట్టే పడసాల). ఈ ఘర్షణ తెలుగు జీవితమంటే యాభయ్యవ దశకంలో భాషాప్రాతిపదికన విభజింపబడ్డ ఇరవై జిల్లాలలో ఉన్నది మాత్రమేనని అనుకునేవా రందరికీ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించవలసిన విషయం, ఆ విభజన తరువాత అయిదు దశాబ్దాలకా అది ఇలా అచ్చులో కనబడిందీ అన్నది.

మొగుడు పోయిన చెల్లవ్వ రెండు బరిగొడ్లను కొని పాలుతీసి పోసి, తెల్లవారగానే ఇడ్లీలూ, వడలూ, సాయంత్రం బోండాలు, జంతికలు అమ్మి కష్టపడి కూతురు పెళ్లిచేస్తే ఆయమ్మ మొగుడు పోయి మళ్ళీ కొడుకు సత్యాన్ని తీసుకుని తల్లిచెంతకే చేరింది (ఊడల్లేని మర్రి). పొలాన్ని అమ్మల్లా అతన్ని పట్నంలో చదివిస్తే, ఆమెకున్న ఇంటిని అమ్మేసి ఆమెకి నిలువనీడ లేకుండా చేస్తాడు ఆ మనవడు. ఇలాంటి జీవితాల గూర్చి విననివాళ్ళు లేకపోవచ్చు గానీ కథనం చివరిదాకా చదివిస్తుంది.

శెడి రడ్డిండ్లు శేరిండ్లేవాళ్లే గానీ రడ్డిండ్లకు శేరి శెడినోళ్లు లేరు (పదిమందికి పెట్టే పడసాల) అంటూ అన్నిచోట్లా ఒకేలా ఉండని వర్ణ వ్యత్యాసాల గూర్చిన కథ ఇది. దీనికి భిన్నంగా ఉండే కథ “అబ్బిళింత.” కౌగిలింత అనే అర్థమయినా అబ్బిళింతల చవిగోలును తెలుసుకోవాలంటే సున్నిత మనస్కులయిన పిల్లల్లో జీవితాంతం గుర్తుండిపోయేలా చేసే ఈ వర్ణ వ్యత్యాసాల కథని పూర్తిగా చదవాల్సిందే.

మొగుడు బాలిరెడ్డి వెంటతెచ్చిన ఏనాది పిల్ల జిలకర మీద మండిపడ్డా, ఆ పిల్ల పోయిన తరువాత ఆమె కూతురు పద్నావతిని చన్నుకుడిపి బతికించింది బూరగవ్వ (ఒంటినిట్టాడి గుడిసె). ఆ పిల్లమీద తండ్రివరసని కూడా పట్టించుకోకుండా బాలరెడ్డి చేసిన దాష్టీకాన్ని ఆపలేకపోయింది గానీ, తన స్వంత కొడుకు కూడా దాన్నే తలపెట్టడంతో మొగుణ్ణీ, కొడుకునీ వదిలేసి కూతురుకు పెళ్ళిచేసి, ఆమె చుట్టపక్కాలే ఆమెని దూరంగా ఉంచడంతో ఒంటినిట్టాడి బతుకు బతికింది ఆమె.

చిన్నతనంలో ఊహ తెలియనప్పుడే మొగుణ్ణి కోల్పోయి తమ్ముడి పంచన చేరి, నడి వయసులో నిమ్న కులానికి చెందిన వాడితో పొందుపెట్టుకుందని ఆ తమ్ముడి చేతే జీవితాన్ని “రయికముడి ఎరగని బతుకు” చేయించుకున్న కథ కన్నెమ్మది. వస్తువు పాతదే అయినా ఆకట్టుకునే కథనం. కుమ్మరి చేతుల్లో రూపొందే కళాఖండాల వివరాలు పాఠకులకు అదనపు ప్రతిఫలం.

అల్లమదేవి పదాన్నీ, అడవి అంచున పంటపొలాల మీద ఆధారపడి బతికే మాదిగ కుటుంబాలు ఏనుగుల కోపాన్ని ఎలా కాచుకుంటాయనే వైనాన్నీ, నాగారాజనే ఒక కాపు మగాడు సిరివన్నె అనే కొత్త పెళ్లికూతురుమీద చెయ్యబోయిన దాష్టీకానికి బుద్దిచెప్పడాన్నీ కలగలిపిన కథ “సిడిమొయిలు.” ఏనుగుల మందని దారిమళ్లించే వివరాలు ఉత్కంఠభరితంగా చిత్రించారు రచయిత.

ఎప్పుడో విన్న “బడకొడితి” అన్న జంతువు వెదుకులాట గూర్చిన కథ శీర్షిక కూడా ఆ జంతువు పేరే. దాని గూర్చిన కొన్ని వివరాలివి: “అది గాడిదంత ఎత్తు ఉండచ్చు లేదా కుక్కంత ఎత్తు ఉండచ్చు. దానికి ముక్కుమీద కొమ్ము ఉండచ్చు లేదా దవడల్లోనుంచి కోరలు పొడుచుకుని వచ్చుండచ్చు. దాని వీపుమీద పెద్ద బిందెడు నీళ్లు పట్టేంత గుంట ఉండచ్చు లేదా …” భార్యల గూర్చి భర్తలు చేసే అన్ని రకాల ఫిర్యాదులూ దర్శన మిస్తాయి ఇందులో. ఆ జంతువు చివర్లో దర్శనమిస్తుంది.

కాపు కుటుంబంలో పనిచేసిన మాలోళ్ల మంగమ్మ అంటరానితనం ఆ ఇంట్లో మూడు తరాల్లో ఎలా మారిందో ఒక మరవరి (ఇంజనీర్) కొడుకు చెప్పిన కథ ఇది (కాకికి కడవడు పిచిక్కి పిడికిడు). మంగమ్మ రెక్కల కష్టంతో పండించిన ధాన్యాన్ని ఆ పంటచేను కొన్నది తాము అయినందుకు ‘కాకికి కడవడు పిచిక్కి పిడికిడు’ అంటూ కొలతలేసినా మారు పలకని మంగమ్మ మొగుడికి దొంగతనాన్ని అంటగట్టి వెళ్లగొడుతుండగా అంటుంది: “మీరందురూ మీపని కోసమే అంటును పక్కన పెట్టినారు. మీ లోపలి అంటును మటుకు గట్టిగా అట్నే పెట్టుకోనుండారు. పనులు తీరిపోగానే అది మళ్లా బయటకు వస్తా ఉండాది.” మంగమ్మ ఇక్కట్లు గుండెని కలచక మానవు, వాటికి కారణమయిన సమాజపు రీతులమీద కోపమూ రాక మానదు. అంటరానితనం తుదముట్టించిన అగ్రహారం పిల్లా, కథకుని ప్రేమ కథ “మాదిగపుటక కాదు.”

అరవళ్లి సూరవళ్లి కత, నల్లతంగ కత, కాంతరాజు కత, కమ్మపణితి కత, రేణిగుంట రామిరెడ్డి కత, … ఆ ఊరి మగాళ్ల మోడికోళ్ల కతలు చాలా వున్నాయి ఆ మాదిగ అవ్వ “కతల గంప”లో. తనను కాపాడుకోలేక పోయింది గానీ కూతురునే గాక ఆ చుట్టుపక్కల పల్లెల్లోని ఆడకూతుళ్ళ నందరినీ ఆ మగాళ్ల దౌష్ట్యాన్నుంచీ తప్పించాలనుకుని ఆ కతల నమ్ముతూ బతుకుతోంది. బర్రిగొడ్డయినా ఆవుగొడ్డయినా ఆడబతుకే అట్టాంటిది అబయా అంటుంది రుప్పిణవ్వ.

అలాంటి ఆశయంతోనే బతికింది సునందమ్మ (పాంచాలమ్మ పాట). ధర్మరాజు జూదంలో పణంగా పెట్టి ఓడిపోయిన ద్రౌపదిని కృష్ణుడు రక్షించాడు గానీ ముద్దురెడ్డి సునందమ్మని పణంగా పెట్టి ఓడిపోతే మునిరామ నాయుణ్ణించీ రక్షించడానికి ఎవరూ లేరు. ఆమె ఆ వైనాన్ని ఆ పల్లెలో చాటింపు వెయ్యడమే గాక తల నెగరేసి శేషజీవితాన్ని అక్కడే గడపడం ఆమె ఆ పల్లెవాసులకు చేసిన గొప్ప సహాయం. ఇది బాట చెప్పిన కథ కూడా. ఈ రెండు కారణాలవల్ల కథకు “పాంచాలమ్మ బాట” అని పేరుపెట్టి వుండాల్సిం దనిపిస్తుంది.

“అదంటే నాకు మక్కువ. పడి చచ్చిపోతాను దానికోసం. దానిమేను ఒక్కొక్కసారి కాటుక పసనుతో మెరిసిపోతుంటాది. ఇంకొక్క సామనలుపుతో మినుకుతుంటాది. అప్పుడప్పుడూ తెల్లటి పొట్లపూవయి విరగబడుతుంటాది.” అంటూ మొదలవుతుంది “మెయిలు నొగులు.” అప్పుడప్పుడూ రాక్షసుడిలా తయారయి ఊళ్లోని ఆడవాళ్లకి కొడుకు చేస్తున్న ఎనలేని అపచారాన్ని సహించలేక చేతులు ముడుచుకుని కూర్చోని తల్లి చిన్నారవ్వ కథ ఇది.

రాగమ్మతో బంధాన్ని వర్ణ వ్యత్యాసమని రవ్వమ్మ అడ్డంకొట్టి కొడుకు రాజయ్యకి రాణెమ్మతో మనువుచేసింది (చెట్లు చెప్పిన కత). ఆస్తి పోయిన తరువాత రెండేళ్ల రాదను, తల్లినీ తీసుకుని మాలవాడలో రాగమ్మని చేరతాడు రాజయ్య. రాణెమ్మ పుట్టింటికి చేరుకుంటుంది. రాదని కొన్నేళ్లు పెంచిన తరువాత ఆమెను మాలపిల్లగానే ఊరు పరిగణిస్తోందని గ్రహించి రవ్వమ్మ ఆ పిల్లని రాణెమ్మ చెంతకు చేరుస్తుంది. పెళ్లయిన తరువాత తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఎత్తుకుని పెంచిన తల్లిని చూడనంటుంది. వలపూ, జీవితం సామాజికంగా వర్ణ వ్యత్యాసం కోరే బలీ ముడివడివున్న కథ ఇది.

ఈ కథాంశాల ఎత్తుని మించినవి వీటిల్లోని భాష, వర్ణనలు, ఉపమానాలు.

ప్రళయ కావేరి మాండలీకంలోని సొబగులకు రచయిత కలం ఎన్ని వన్నె లద్దిందో!

మచ్చుకి కొన్ని -

ముసలి ఉసురునూ పసి ఊపిరినీ …; పెళపెళలాడే పసను లేకపోయినా కళకళలాడే మొగము ఆ అమ్మిది; (చెట్లు చెప్పిన కత)

… బూరగమ్మల కడగండ్లకన్నా జిలకరమ్మల కల్లేట్లు పెద్దవి. (ఒంటి నిట్టాడి గుడిసె)

ఇంటెడు అగచాట్లనూ ఒంటెడు పాట్లనూ … (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

తూరుపు పేట దడబుడ చప్పుళ్లు లేని, మంది లొడలొడలు మట్టుకే ఉండే తావు. (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

ఆ మాండలీకానికి తోడుచేసిన అద్భుతమయిన వర్ణనలు ఈ పుస్తకం నిండా కనిపిస్తాయి.

మచ్చుకి కొన్ని -

కూటికుండనూ కూరాకుచట్టినీ ఎగకట్టి పాలదుత్తను ఉట్టిమింద పెట్టి కన్ను కొరికింది రెయ్యమ్మ. కడుపే కాలిందో కన్నే కుట్టిందో ఎగిరి పాలదుత్తను తన్నింది జాబిల్లి. పాలదుత్త పగిలి మిన్నంతా వెన్నెలయి కురిసింది. (చెట్లు చెప్పిన కత)

గాలివానకు కొట్టుకొని పొయి ఊరికి ఎడంగా కుప్పగా పడిన ఎండుతాటాకుల మోపు మాదిరిగా ఆ బయల్లో నిలిచి ఉంటాది గోపాలక్రిష్ణ కొటాయి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

వక్కాకు గములు, పొవ్వాకు కలిసిన వక్కాకు గవులు, ముక్కుపొడి గబ్బు, చెమట కంపు, మన్ను మణము, పేడ వాడ, నాటుసారాయి గదురు, చుట్టపొగ పొలపము, మిడి అత్తరు గత్తు, ఎగరతా పైనొచ్చిపడే ఉచ్చబుడ్డల వేదు … మంది నుంచి ఇన్ని పొలుపులు వెలువడతాయని అప్పుడే తెలిసింది వాడికి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ). ప్రతీ వాసనకీ తెలుగులో ఒక పేరున్నదని ఎంతమందికి తెలుసంటారు?

అది పిల్లగోయి పాడినట్టు లేదు. గూట్లోని బెళవాయి కువకువమన్నట్టు ఉండాది. కట్టుకొచ్చిన పిక్కిలిగువ్వ పోతుగువ్వను పిలిచినట్టు ఉండాది. పచ్చముడ్డి కందిరీగ చెండుమల్లికి జోలపాడినట్టు ఉండాది. ముంతమావిడి పండుకోసం మునెక్క కూతురు ముదిగారంగా ఏడిచినట్టు ఉండాది. గుబ్బలమాను మీద జోడు జీరంకులు గీపెట్టినట్టు ఉండాది. (మెయిలు నొగులు)

జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వగూటిని నిమరతా కురిసింది. తలవాకిట దోగాడుతున్న పసిబుగ్గమీద చిటికేస్తా కురిసింది. దుమ్ముదుప్పటిని కప్పుకున్న చెట్టుచేమలను కడగతా కురిసింది. పగిలి నెర్రెలుబారిన బీళ్లను పదునెక్కిస్తా కురిసింది. చిట్టెదురు గుబురులో పిల్లంగోయి పాటయి కురిసింది. కోనేట్లో తామరాకుల మీద జారిపడతా కురిసింది. కనుమలో ఎగిరే చిలకముక్కును మెరిపిస్తా కురిసింది. ఉమ్మరిల్లిపోయిన మేనులు చెమ్మగిల్లేటట్టు కురిసింది. (బడకొడితి)

అప్పుడే అలికి ఎర్రమన్ను ఓరు తీసిన నట్టింట్లో ముగ్గుబుట్ట ఒలికినట్టుగా ఉండేది బూరగవ్వ. (ఒంటి నిట్టాడి గుడిసె)

పిలపిలమని గోలచేసే పులిచింతగువ్వల పసను ఆయమ్మిది. (ఒంటి నిట్టాడి గుడిసె)

చింతనిప్పుల మీది నివురు నెరుపు ఆ బిడ్డది. (ఒంటి నిట్టాడి గుడిసె)

తలాకిట కళ్లాపి చల్లి, ఎర్రమన్నుతో ఓరు తీసి, చుక్కల ముగ్గు వేసిందంటే ఆ వన్నెల వారసను చూడడానికి వానవిల్లే దిగివచ్చేది. (ఒంటి నిట్టాడి గుడిసె)

తలపుల గోళ్లతో గీరుకొని నెంజును పచ్చిపుండు చేసుకొనేది. గాయపడిన నెంజు నెత్తురయి ఆ అమ్మి కళ్లల్లో నుంచి కారిపోయేది. (చెట్లు చెప్పిన కత)

పువ్వరిసి మానుమింద పగిడిగువ్వ పకపక నగే పొద్దు, గురిగింజ పొదలలో గీజనగువ్వలు కువకువలాడే పొద్దు, … అంటూ పలురకాల పొద్దులు; పైర్లు వెన్నులిడిచే కాలం, చేన్లపైన ఏనుగులు దాడులు చేసేకాలం అంటూ పలురకాల కాలాలు. (ఆ అడివంచు పల్లె)

ఈ పుస్తకంలోని ఉపమానాలు ఈ రచయితకు ప్రత్యేకం. ఎన్ని ఉదహరించినా తక్కువే ననిపిస్తుంది. అయినా, మచ్చుకి కొన్ని -

మనపాటికి మనం ఎవర్నీ పట్టించుకోకుండా ఏవో తలపోతల్లో మునిగి బాట ఓర్న ఒదిగి నడిచిపోతుంటే, వెనకనించి వచ్చిన తులవగొడ్డు ఎత్తి కుదేసినట్టుగా, ఉన్నట్టుండి తగులుకొనింది నాకీ వెన్ను నెప్పి. (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

పొదల వానకు పొటమరించి పొట్లపూల వానలో పగలబడి పూస్తాదే గోరింట …; మింద మంచు పడితే మోదుగ పూసినట్టు, పైన ఈడు పది రాగమ్మ కూడా పూసింది. (చెట్లు చెప్పిన కత)

కాసేపటికి వట్టిపొయిన పత్తిచేలో తిరుగులాడే ఒంటరితుమ్మెద రోదలాగా పెరిగి పెద్దదయింది ఆ పాట సద్దు (ఎందుండి వస్తీవి తుమ్మెదా)

జమ్ముగుబురులో జోపానంగా పెట్టుకున్న గుడ్లను జంగుపిల్లి ఎత్తుకొని పోతే, గుండెలు పగిలేటట్లు అరస్తాదే నీళ్లకోడి, అట్లుంది ఆమె ఏడుపు. (ఎందుండి వస్తీవి తుమ్మెదా)

నడిరెయ్యిలో ఒళ్లెరగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, … (ఒంటి నిట్టాడి గుడిసె)

ఆ మాటతో ఉచ్చెంటికను పెరికినట్టు అనిపించి ఒళ్లుమండి పైకి చూసినాను. (ఒంటి నిట్టాడి గుడిసె)

పెట్టకోడి తను పెట్టిన గుడ్లను రెక్కలకింద పొదుక్కొన్నట్లు అరవై ఇండ్లను అబ్బిళించుకొని ఉందాపల్లె (ఆ అడివంచు పల్లె)

… అని పిల్లలపంది మాదిరిగా ఎదురు తిరిగి అరిచింది. (ఒంటి నిట్టాడి గుడిసె)

గ్రామీణ సామెతలు కూడా కొల్లలుగానే కనిపిస్తాయి. మచ్చుకి కొన్ని -

అవ్వకు అణిగినట్టు, మనవడికి తీరినట్టు … (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)

తెగించింది తెరువుకు పెద్ద, విడిచింది వాడకు పెద్ద; దున్నపోతు అన్నాక దున్ని చావాల, అన్నదమ్ములు అన్నాక వేరుపొయి చావాల; సారె వానలో నానితే సన్నికల్లు కూడా నొగులు పడతాది; గూట్లో పెడితే గూబ ఎత్తుకు పోతాది బీట్లో పెడితే పిల్లి ఎత్తుకొని పోతాది (చెట్లు చెప్పిన కత)

ఆంగ్ల పదాలు దాదాపు ఈ పుస్తకంలో కనిపించవనే చెప్పవచ్చు. అందువల్ల తెలుగు భాషాభిమానులకు ఈ పుస్తకం సంతోషాన్ని తప్పక కలిగిస్తుంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ వాడుక సాధారణమయిన ఆంగ్ల పదాలకు కూడా బదులుగా అచ్చ తెలుగు పదాలే దర్శనమిస్తాయి. మచ్చుకి కొన్ని -

పేరేగి (కారు); పట్టేగి (ట్రైన్), తానేగి (ఆటో), తోలేరు (డ్రైవర్), కూటిల్లు (హోటల్), మందులిలు (హాస్పిటల్), అలపలుకి (సెల్ ఫోన్), చిరువాలు (సిగ్నల్), ఎనికెన (కంప్యూటర్), తూకువెళుకు (లాంతరు), మైనంతిత్తి (ప్లాస్టిక్ బాగ్)

ఒంటరిగా మిగిలిన చెల్లవ్వ (ఊడల్లేని మాను), కెంచక్క (మాదిగపుటక కాదు), సునందమ్మ (పాంచాలమ్మ పాట), బూరగవ్వ (ఒంటినిట్టాడి గుడిసె), చిన్నారవ్వ (మెయిలు నొగులు), పెండ్లి చేసుకోకుండా మిగిలిపోయిన మద్దూరవ్వ, లచ్చుమవ్వ (ఆ అడివంచు పల్లె) ఈ రచయితకు ఆప్తులు. వాళ్ల కడగండ్లకు తను మున్నీరై పాఠకులచేత కన్నీరు పెట్టిస్తాడు.

తెలుగు భాష ఇతనికి ప్రాణం. “వేల ఏండ్ల మాదిగల ఉనికికి ఆటపట్టు ఈతావు. ఈడ ఆటా మాటా పాటలు మటుకే కాదు, పైరు ఎన్నుపై వాలి కూసే నీలిగువ్వ కూత తెలుగు. కానల్లో కోనల్లో సందెపొద్దుల్లో యిగిడి. కొండగాలితో కలిసివొచ్చి పల్లెంతా పరుసుకొనే అడవిపూల తావి తెలుగు. మాపుసరి మాదిగా పల్లెంతా కమ్ముకొని మత్తెక్కించే నంజర కూర కమ్మదనం తెలుగు. పనిచేసే మాదిగపిల్ల నొసటి సిరుసెమట తెలుగు. బిడ్డకు సన్నుగుడిపే పొద్దయి, సేపిన రొమ్ములు రైకముడిని కోసేస్తుంటే, పనిచేయలేక పనినింకా లేవలేక ఆ బాలింత పడే యెతలు తెలుగు. నల్లటి మెయిలు నుంచి కారే తెల్లటి తోలి సినుకు తెలుగు. ఈడ పుటక తెలుగు, సావు తెలుగు, పుటక సావులకు నడానుండే బతుకంతా తెలుగే” అంటూ పల్లె ప్రజలకి తెలుగు నేర్పడానికి వెళ్లిన ఈ తెలుగు భాషాభిమాని ‘ఆ అడివంచు పల్లె’లో పులకించిపోతాడు.

“ఆ అడివంచు పల్లె” తో బాటు చాలా కథలని మాకొద్దు అన్న పత్రికలు ఈ కథలన్నిటినీ చదివి ఆనందంగా ఆస్వాదించిన తరువాత రచయిత వ్యక్తిత్వం పూర్తిగా అర్థమై, అరెరే అని నాలిక్కరుచుకునే అవకాశం మెండుగా వుంది. వీటిల్లో మూడు మాత్రమే “వలపత్రికల” (web magazines)లో, మూడు “భూమిక”లో ప్రచురింపబడ్డాయి. రెండుమూడింటిని వార్షిక సంకలనాల్లో చూసిన గుర్తు. అందరికీ అందుబాటులో లేని మిగిలిన కథలని సంకలనంగా ప్రచురించినందుకు “మల్లవరపు వెలువరింత”లకు నాలాంటి పాఠకులు తప్పక ధన్యవాదాలు చెబుతారు. వెయ్యి ప్రతులూ త్వరగా అమ్ముడయిపోయి రెండూ, మూడూ కాక పదుల సంఖ్యలో పునఃప్రచురణలతో ఈ సంకలనం వెలుగు చూడాలనీ, వాటిల్లో ఇంకొన్ని పదాలకు అర్థాల నివ్వాలనీ (ఉదా: సిడిమొయిలు) కోరుకుంటున్నాను. ఆ పునఃప్రచురణలో ప్రతి కథకీ చివర్లో కొన్నికొన్ని పదాలకి అర్థాల నివ్వడం కాకుండా అన్ని పదాల అర్థాల పట్టికని పుస్తకం చివర్లో అకారక్రమంలో ఇస్తే పాఠకులకు సౌలభ్యంగా ఉంటుంది.

పుస్తకం: కతల గంప (కథలు)

రచయిత: స. వెం. రమేశ్

ప్రతులకు: 1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180. ఫోను: +91 90101 53505

రాతబడి
“మన రామారావు సంగతి విన్నావా?”

“ఏం చేశాడు?”

“వాడు చెయ్యలా. వాడికే – ”

“చేతబడా?”

“నా చిన్నప్పుడు ఒక కాంపౌండర్  ప్రాక్టీసు పెట్టి వచ్చిన రోగు లందరికీ ఒకే రంగు నీళ్లిచ్చేవాట్ట. అలాగే, కళ్లు తిరుగుతున్నాయన్నా, కాలు నెప్పి పుడుతోందన్నా చేతబడే అనేలా వున్నావు!”

“కాదు అని ఖచ్చితంగా నువ్వు అనలేదు గనుక, మిగతా వివరాలు చెప్పు.”

“ఏవో పిచ్చి చూపులు చూస్తూంటాడు లేకపోతే నవ్వుతుంటాడు. ఆఫీసు కెళ్లడం మానేశాడని వేరే చెప్పక్కర్లేదు గదా! వాణ్ణి చూసిన వాళ్లెవరూ గాలి సోకిందనో, విషప్పురుగు కుట్టిందనో ఏదో ఒకటి అనకుండా వుండట్లేదుట. ఇప్పుడు నువ్వు చేతబడిని కూడా ఆ లిస్టులో చేర్చావ్. వాడి అదృష్టమల్లా, పిల్లలందరికీ పెళ్లిళ్లవడం.”

“మనుషులని గుర్తుపడుతున్నాడా?”

“చెప్పడం కష్టం. నలభయ్యేళ్ల నించీ తెలిసినవాణ్ణి కదా, అయినా, గుర్తుపట్టినట్టేమీ కనిపించలా. నన్నే గాదు, ఒకవేళ వాడికి ట్విన్ వుండున్నా వాణ్ణి గుర్తుపట్టే స్థితిలో లేడు. వాళ్లావిడ గుడ్లనీరు కుక్కుకోవడం తప్ప ఏం చెయ్యలేకపోతోంది.”

“ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరివల్లో ఏమయినా తెలిసిందా? కనీసం ఐడియా అయినా వుందా?”

” ఆ ప్రశ్న లన్నింటికీ జవాబులు నా దగ్గర లేవు గానీ – చేతబడి అని ఎవరూ అనుకోవడంలే దింతవరకూ. తెలిసింది మాత్రం, వాడొక రోజున ఆఫీసులో ఒక ఉత్తరాన్ని మొహమ్మీద పులుముకుంటూ పెద్దగా నవ్వుతుంటే ఇదేదో మామూలుగా అప్పుడప్పుడూ వాళ్ల పత్రికకొచ్చే రచనలని చదివిన తరువాత కలిగే టెంపరరీ ఇన్‌శానిటీలే, కాసేపటికే పోతుంది అనుకున్నార్ట గానీ, వాడు మామూలు మనిషయ్యే అవకాశం కనపడకపోయేసరికి వీడి సబ్ ఎడిటర్‌కి  భయమేసి వీణ్ణి ఇంటికి చేర్చాట్ట. అతనే అప్పటికే నలిగిపోయి వున్న ఆ ఉత్తరాన్ని కూడా ఆవిడ కిచ్చాట్ట,  దాన్ని చూస్తే నన్నా కారణం తెలుస్తుందేమోనని. ఆవిడ కర్థం కాలేదు గానీ, రెండ్రోజుల తరువాత వాళ్లింటికి చూడడానికి వెళ్లినప్పుడు ఆవిడ నాకు ఆ కాగితాన్ని చూపించి, ఈ ఉత్తరం చదివి ఇలా అయిపోయుంటారా అన్నయ్య గారూ? అనడిగింది.”

“ఏమని వున్న దందులో?”

“ఫోన్లో ఫొటో ఎక్కించాను. నువ్వే చూడు.”

“… దీన్ని బట్టీ మాత్రమే వాడెందుకలా అయ్యాడో అర్థం కావడంలేదు. దీనికి ముందేం జరిగిందో ఏమయినా అయిడియా వున్నదా?”

“నాకూ ఆ విషయమే తెలుసుకోవా లనిపించి ఆ సబ్ ఎడిటర్‌కి ఫోన్ చేసి అడిగాను – ఇంతకు ముందు దీనికి సంబంధించిన విశేషా లేమిటి అని. ‘ఏమిటో నండీ! పాపం, ఆయన వచ్చిన ప్రతీ కథా, ప్రతీ ఉత్తరమూ ముందు తనే చదివి, చెత్తబుట్ట దాఖలా చెయ్యనివాటిని మాకిచ్చేవారు. ఇప్పుడు మాకు పనెక్కు వవడమే కాకుండా వాటిల్లో కొన్ని చదివిన తరువాత ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా పోతోంది. ఆయనకి ఎలాగయినా త్వరలో బాగయ్యేలా చూడండి సార్!,’ అని వాళ్ల పత్రిక సంచికలలోంచి కొన్ని పేజీలు కట్ చేసి ఇచ్చాడు. అవి కూడా ఫోన్లో వున్నాయ్. ఇదిగో, చూడు.”

“ఉత్తర రత్న,” ఆగస్ట్ 2

తెలుగు రత్న పత్రికకు -

మీ పాదసేవా చరణదాసి. కింద భవదీయుడు అని నాపేరు రాసిన తరువాత అంతా కథే. మీ పత్రిక దీన్ని వేసుకుంటే మీ స్థాయి పెరుగుతుందని మా బామ్మ. నేను మాత్రం నా పేరు అచ్చులో చూసుకుంటే చాలని నేను. అచ్చువెయ్యడానికి ఖర్చవుతుందంటాడు మా బామ్మ. దీనిలో ఒక వంద కాగితం వుంది చూడండి. కథపేరు కోడి కూయక ముందే ఇల్లలకడం మొదలవుతుంది మా బామ్మ.

భవదీయుడు.

“ఉత్తర రత్న,” ఆగస్ట్ 16 -

ఆగస్ట్ 2 “తెలుగు రత్న” సంచికలో అన్ని కథలూ, సీరియల్సూ, కార్టూన్లూ ఎప్పటిలాగే బావున్నాయి. “కోడి కూయకముందే ఇల్లలుకుతుంది మా బామ్మ” మమ్మల్ని ఆనందడోలికల్లో ఊగించింది.

కె.వి. సుబ్బారావు, సుజాత, పాలంకి

తెలుగు పత్రికల స్థాయి పడిపోతున్నా ఇన్నాళ్లూ కనీసం “తెలుగు రత్న” తెలుగుభాషకి చిన్నదయినా ఒక పీట వేస్తోందని అనుకున్నాను. ఆయనెవరో (లేక ఆవిడా?) మీకు నిజంగా వందరూపాయల కాగితాన్ని ఆ ఉత్తరంతో పంబించారని నమ్మమంటారా? క్రియ లేకపోవడంవల్ల మొదటి వాక్యం అసంపూర్ణం. కథ పేరులో “మొదలవుతుంది”కి బదులుగా “మొదలుపెడుతుంది” అని మారిస్తే తప్పితే ఆ వాక్యం అర్థవంత మవదు.  మొదటి పేరాలో మూడవ పదాన్నిబట్టీ ఆ ఉత్తరాన్ని రాసింది స్త్రీ అయ్యుండాలనిపిస్తోంది. మరి, చివర్లోనేమో భవదీయుడు అని వుంది. మీ పాఠకలోకానికి బుర్ర లుంటా యనడానికి ఈ ఉత్తరమే తిరుగులేని ఋజువు.  ధైర్య ముంటే ప్రచురించండి.

సి. రామారావు, వరంగల్లు.

ప్రియమైన “తెలుగు రత్న” సంపాదకులకు -

మా ప్రియమైన “తెలుగు రత్న” పత్రికలో నా ఉత్తరం అచ్చయినందుకు సంతోషించాలో లేక నా పేరుని అచ్చులో చూసుకోలేనందుకు విచారించాలో అర్థంకాని పరిస్థితి. నా స్నేహితుడికి అచ్చయిన నా ఉత్తరాన్ని చూపిస్తే నా కథ పేరులో “మొదలవుతుంది”కి బదులుగా “మొదలుపెడుతుంది” అని మారిస్తే సరిపోతుందన్నాడు. బహుశా కథపేరు సరిగ్గా లేనందువల్ల దాన్ని అచ్చువేసి వుండరు. ఈ సవరణతో ఆ అవరోధం తొలగిపోతుం దనుకుంటున్నాను. ఎందుకయినా మంచిదని వాడిచేత ఈ ఉత్తరాన్ని సవరించి పంపుతున్నాను.

భవదీయుడు.

ఏ.వి.వి.యస్.సి. రావు

(రావుగారు తన ఉత్తరాన్ని గుర్తుపట్టడం విశేషమే! ఆయన మొదట రాసిన ఉత్తరంలో ఆయన పేరు లేదు. కథ పేరు క్లుప్తంగా వుండాలని వారికి తెలిసినట్లు లేదు. ఇలాంటివి రాయడం సాధ్యమేనా అన్న మా సంపాదకవర్గపు సందేహం నివృత్తయింది. మా పాఠకులకి ఎప్పుడూ కనబడని ఒక లోకాన్ని పరిచయం చేద్దామని ఆగస్ట్ 2 సంచికలో చిన్న ప్రయత్నం చేశాం. అంతే. – సం.)

“ఉత్తర రత్న,” ఆగస్ట్ 30

ప్రియమైన సంపాదకులకు,

అచ్చులో నా పేరు చూసి మా బామ్మ ఆనందడోలికలలో తేలిపోయింది, మేఘాలమీద ఊగిపోయింది. కథకు పేరు క్లుప్తంగా వుండాలన్న మీ అభిప్రాయంతో నా స్నేహితుడు ఏకీభవించాడు గానీ, ఈ కథకు పేరు పెట్టడం మాత్రం తనకు వల్లమాలిన పని అని అన్నాడు. అందుకని మీరే ఒక పేరుని నిర్ణయించగలరు.

ఏ.వి.వి.యస్.సి. రావు

(అయ్యా, రావుగారూ! మీ పిల్లలకి మమ్మల్ని పేరు పెట్టమనడం భావ్యం కాదు. మీకు దగ్గర్లో వుండే గ్రంథాలయానికి వెళ్లి అక్కడ ప్రముఖ తెలుగు రచయితల కథలు చదవండి. పేరుకీ కథకీ ఎలాంటి సంబంధం వుండాలో తెలుసుకోండి. – సం.)

“ఉత్తర రత్న,” సెప్టెంబర్ 13

ప్రియమైన సంపాదకులకు -

మీ సూచనని పాటిద్దామని మా ఊళ్లో గ్రంథాలయంకోసం వెడితే వున్న ఒక్కటీ ఎప్పుడో మూతపడ్డదని తెలిసింది. ఏలూరుకి వెడితే గానీ తెలుగు పుస్తకాలమ్మే షాపుకూడా కనబడలేదు. అక్కడ వాళ్లు నన్ను ఒక్క పుస్తకాన్ని కూడా నిల్చొని చదవనివ్వలేదు. అందుకని కొన్ని పుస్తకాల టైటిల్స్‌ని మాత్రం ఒక కాగితంమీద ఎక్కించుకోగలిగాను. అక్కడ కూర్చొని బాతాఖానీ కొడుతున్న కొందరు తమకు తెలిసిన కథల పేర్లు చెప్పారు. వాటిని నా స్నేహితుడికి వినిపిస్తే, వాటిని కొంచెం మార్చుకోవచ్చన్నాడు. ఆ సలహాతో క్రింద కొన్ని పేర్లిస్తున్నాను. వాటిల్లో మీకు నచ్చినదాన్ని వాడుకోండి.

కాటేసిన మాలిన్యం, దిగజారిన కాఠిన్యం, ఆరంభం నాకే తెలియదు, ఏడుపుకి నవ్వొచ్చింది, నవ్వుకు ఏడుపొచ్చింది, మండే ఐసుగడ్డలు, మేకప్పు లేని పై కప్పు, వాస్తుల్లేని పస్తులు, పెనం కింది పేలాలు, దొడ్డిదారిన అడ్డ ఆశలు, అనుబంధాలు-ఆవలింతలు, బోణీ చెయ్యని బాణీ, ఆ కాళ్లకు పిక్కల్లేవు, పొడి లేని తడి, మేఘం లేని వర్షం, కంకాళంలో టెంకాయలు, కడ్డీల్లేని ఇడ్లీలు, ఇలాగే ఇంకా బోల్డు పేర్లున్నాయి. వీటిల్లో ఏదీ సరిపోదనుకుంటే చెప్పండి. పంపుతాను.

ఏ.వి.వి.యస్.సి. రావు

(తెలుగు పత్రికలకి పాఠకులే గాక రచయితలు కూడా కరువవుతున్న ఈ రోజుల్లో మా అనుభవాలని పాఠకులతో పంచుకోవడానికి పత్రికాముఖమే ఉత్తమ మార్గమని తలచి రావు గారి ఉత్తరాలని ప్రచురిస్తున్నాం. ఇలాంటి అవకాశం మా ముందు తరాల సంపాదకులని వరించకపోవడం, ఈ సత్కారం మాకే లభించడం మా అదృష్టమని ఏమాత్రం భావించడం లేదు.  మా సహాయకవర్గం వచ్చిన కవర్లని తెరిచి వాటిల్లో వున్న రచనల్లోని మొదటి వాక్యాలని చదవడానికే జంకుతున్నారు. కొంతమంది రాబోయే విపత్కర పరిస్థితులని ఎలా ఎదుర్కొనాలో తెలియక పోస్ట్‌మేన్ వస్తున్నాడన్నా,  ఈమెయిల్తో జతపరచిన ఎటాచ్‌మెంట్స్‌ని ఓపెన్ చెయ్యాలన్నా గజగజా వణుకుతున్నారు. ఇంకొందరు, వెన్నుకు గన్ను ఆనించడంవల్ల నయినా సరే, ఎవరూ తొక్కని బాటలో అడుగిడుతున్న ఘనత దక్కడం అదృష్టమా లేక దురదృష్టమా అన్న మీమాంస నుండీ బయటపడలేక గిజగిజా తన్నుకుంటున్నారు. ఎందుకంటే, రావుగారు కొత్త తరహా రచనలకి గట్టిగా బాట లేస్తున్నారని మాకొస్తున్న రచనలు నిర్ధారిస్తున్నాయి.

రావుగారూ, మీరు సూచించిన కథల పేర్లలో చాలా నవ్యత కనబరచారు. అయితే, వాటిల్లో మీ కథకు ఏ పేరు వాడాలో మీరే నిర్ణయించుకుని వేరే పత్రికలకు పంపండి.  కాండిడేట్ పేర్లు ఇంకా వున్నయ్యన్నారు గనుక పేరుతో మొదలుపెట్టి కథ రాయడంమీద ఫోకస్ చెయ్యచ్చేమో ఆలోచించండి. ఒక్కో పేరుకీ ఒక్కో కథ అల్లడానికి కావలసిన అవకాశాలు పుష్కలంగా వున్నాయి. -సం.)

“ఉత్తర రత్న,” సెప్టెంబర్ 27

ప్రియమైన సంపాదకులకు -

నేను ఈ ఉత్తరంతో బాటు కొన్ని కథలని జతపరుస్తున్నాను. మీ సౌకర్యం కోసం ఆ కథలని క్లుప్తంగా ఇక్కడ చెబుతున్నాను.

“కాటేసిన మాలిన్యం” – స్వఛ్ఛభారత్ కోసం నా వంతుగా. మాలిన్యం మీద తిరిగే దోమ కాటుకు కలిగిన చికెన్ గున్యాకు బలైపోయిన ఒక అభాగ్యుని కథ. “కుట్టిన” అనలేదు చూశారా? ఆ అభాగ్యుడు ఆ కాటుకు పూర్తిగా లొంగిపోయేలోగా ఆ దోమమీద ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడో కథని చదివి తెలుసుకోవలసిందే. స్ఫూర్తి దాయకమయిన కథ.

“కాబేజీలూ-ఫ్లవర్‌వేజులూ” – ఇది చాలా వినూత్నమైన అంశం. కాబేజీని మనం వెజిటబుల్ అనుకుంటామా, అదసలు ఒక ఫ్లవర్‌ట – కాలీఫ్లవర్‌లాగానే! పెళ్లికాని ఒక నలభయ్యేళ్లావిడ ఏ ఫ్లవర్‌వేజ్‌లోనూ కాబేజీ పట్టనట్లుగానే తనకు పెళ్లికాదని తెలుసుకునే గుండెలు కరగించే కథ ఇది.

“పంచదార పంచన వంశధార వంచన” – పంచదార హిస్టరీ, దానితోబాటు  అది ఈనాడు మనుషులకి బ్లడ్‌షుగర్‌ని వంశపారంపర్యంగా ఎలా పంచుతోందో చెప్పే విజ్ఞానదాయకమైన కథ ఇది.

“రోగానికి జబ్బొచ్చింది” – ఇది సైన్స్ ఫిక్షన్. డైమండ్‌ని కొయ్యడం డైమండ్‌తోనే సాధ్య మవుతుందని గ్రహించి ఆ విధంగానే ఒక రోగాన్ని తగ్గించాలంటే దానికి విరుగుడు ఇంకొక రోగమేనని తెలుసుకున్న సైంటిస్ట్ పరిశోధనల గూర్చిన వివరాలను తెలియజేసే కథ ఇది. కాన్సర్‌కి యాంటీ కాన్సర్, షుగర్‌కి యాంటీ షుగర్, మొదలైన రోగాలని అతను కనిపెడతాడు. “రోగం రోగేణ భక్షితః” అన్న వాక్యంతో ఈ కథ ముగుస్తుంది. (నాకు సంస్కృతం కూడా వచ్చునని పొరబాటుననయినా అనుకోకండి. నా స్నేహితుడి తెలివితేటలు ఇవి.)

“ఇడ్లీల్లో కడ్డీలు” – క్రైం + సైన్స్ ఫిక్షన్ కథ. ఇడ్లీల్లో పెట్టి జైల్లోకి నానో-కడ్డీలని సరఫరా చెయ్యడంవల్ల ఆ కడ్డీలతో చేసిన నిచ్చెననెక్కి పారిపోయిన ఖైదీల కథ ఇది.

“కళ్లాల్లేని పళ్లేలు” – ఫ్లయింగ్ సాసర్ల కథ. అవి ప్రజలని ఎలా భయభ్రాంతులని చేసెయ్యో చెప్పే కథ ఇది.

“అడ్డం పడిన మంచం” – మనం అడ్డం పడితే మంచంలో పడుకుంటాం. అదే మంచం అడ్డం పడితే? ఆలోచనాత్మక మయిన ఒక వినూత్న కథాంశం ఇది.

“అట్టకట్టిన అట్టహాసం” – ఊరిప్రజలని పీక్కు తినే ఒక కామందు కథ ఇది. అతని అట్టహాసం వింటే ప్రజలకు వణుకు – ఎందుకంటే దాని తరువాత ఎవడి ప్రాణానికో ముప్పన్నమాటే. అలాంటిది అతని చర్మం అతనిమీద తీసుకునే ప్రతీకారం వల్ల ఆ చెంపలు అట్టకట్టి అలాగే వుండిపోతాయి. అంటే ఆ దవడలు అలాగే బిగదీసుకుని వుండిపోత య్యన్నమాట. మంచి కమ్యూనిస్ట్ థీమ్ వున్న కథ యిది.

“విడిది చేసిన వేవిళ్లు” – అంటే, వేవిళ్లు వచ్చి కూర్చున్నాయా, లేక వేవిళ్లకి విడిది కారకురాలా అనేది కథని చదివి తెలుసుకోవలసిందే.

“కంకాళాల్లో టెంకాయలు” – పేరుబట్టీ డిటెక్టివ్ స్టోరీ అని తెలియట్లేదూ?

ఇంకొన్నింటిని తయారు జేస్తున్నాను. పూర్తికాగానే పంపిస్తాను.

ఏ.వి.వి.యస్.సి. రావు

పి.యస్.: కథలన్నింటి పేర్లూ సజెస్ట్ చేసింది నా స్నేహితుడు. కానీ, ఈ విషయాన్ని మీకూ నాకు మధ్య మాత్రమే వుండనివ్వండేం!

(చేదకు బావి తప్పనట్లే, బంతికి బాట్ తప్పనట్లే విషయపరమైన ప్రతీ చర్చకూ అంతం తప్పదు. ఏమిటో, రావుగారి ఒరవడి మాకూ వచ్చేస్తున్నట్లుంది!

ఏ.వి.వి.యస్.సి. రావుగారి కథలు మాబోటి సామాన్యులకు అందే పరిస్థితి కాదిది. వీరి రచనలు ప్రచురించే స్థాయిని తెలుగులో ఏ పత్రికలూ మా జీవిత కాలంలో చేరలేవని మా ప్రగాఢ విశ్వాసం. వీరి భాషా, శైలీ అనితర సాధ్యం. మామూలుగా అయితే, ఈ కుక్క తినే కుక్క – డాగ్ ఈట్స్ డాగ్ అంటారు గదా, అది! – పోటీ ప్రపంచంలో మిగిలిన పత్రికలకి ఈ కథలని పంపమని చెప్పి, ఆ సంపాదకులకి ఈ కథలని చదవడాన్ని తప్పనిసరి చేసి, ఈ కథలపట్ల మా నిర్ణయం సరయినదేనని ఋజువు చేయించేవాళ్లం. కానీ, మా మనసుల్లో ఏ మూలో దాగివున్న జీవకారుణ్యం మమ్మల్ని ఆ పనికి అడ్డగిస్తోంది. ఇంక ఏ.వి.వి.యస్.సి. రావుగారి రచనల గూర్చిన ఏ వివరాలూ “తెలుగు రత్న”లో వుండవ్. – సం.

పి.యస్.: రావుగారూ, మీ స్నేహితుణ్ణి అర్జెంటుగా వచ్చి మమ్మల్ని కలవమని చెప్పండి. భయపడాల్సిన అవసరమేమీ లేదు. మా దినపత్రికలో సబ్ ఎడిటర్ పోస్ట్ నొకదాన్ని వారి కోసమే క్రియేట్ చేశాం. ఆ విషయమై మాట్లాడడానికి, అంతే!)

“ఉత్తర రత్న” జనవరి 31 -

ప్రియమైన తెలుగు రత్న సంపాదకులకు -

నేను నా రచనలని పుస్తకరూపంలో వెలువరిస్తున్నా నని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీకొక కాపీని జతపరుస్తున్నాను, చూడండి. వెనుక కవర్ మీద నా కథలని గూర్చి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలని అచ్చువేశానని గమనించే వుంటారు. ముఖ్యంగా, “(రావుగారి) రచనలని ప్రచురించే స్థాయిని తెలుగులో ఏ పత్రికలూ మా జీవితకాలంలో చేరలేవని మా ప్రగాఢ విశ్వాసం. వీరి భాషా, శైలీ అనితర సాధ్యం,” అన్న వాక్యాలని చూశారా? నేను చేసినదల్లా “వీరి” ని “రావుగారి”గా మార్చడం మాత్రమే. మీ ఈ కితాబు ఈ పుస్తకం అత్యధిక సంఖ్యలో అమ్ముడవడానికి తోడ్పడుతుందని నా ప్రగాఢ నమ్మకం.

ఏ.వి.వి.యస్.సి. రావు

(క్రితం ఏడాది రావుగారి రచనల గూర్చిన ఎలాంటి వివరాలూ మా పత్రికలో వుండవు అని మేం రాయడం మితిమీరిన దురాశవల్ల! భవిష్యత్తుని గూర్చిన అవగాహన మా కే మాత్రం లేకపోవడం వల్ల!! కనిపించిన ఆ సంచికలోని ఆ పేజీని నమిలి మింగుతూ రాస్తున్న సంపాదకుని స్పందన ఇది.

మాకు తెలిసి, ప్రపంచ భాషల్లో “కథ రాయడ మెలా?” అన్న శీర్షికతో పుస్తకాలు వెలువడడం సర్వసాధారణం. ఒక్క తెలుగుభాషకే ప్రత్యేకతగా, “కథ ఎలా రాయకూడదు?” అన్న అంశంమీద వెలువడిన ఏకైక ప్రచురణగా “ఏ.వి.వి.యస్.సి. రావు కథలు” అన్న శీర్షికతో ప్రస్తుతం మార్కెట్లో వున్న పుస్తకాన్ని చెప్పుకోవచ్చు. ధైర్యమున్న యూనివర్సిటీలు కథలు ఎలా రాయకూడదన్న పాఠ్యాంశాన్ని సిలబస్‌లో చేర్చి ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు. అమెరికాలో “రాటెన్ ఎగ్” అవార్డులనీ, “లెమన్” అవార్డులనీ కొన్ని రకాల రచనలకి ఇస్తూంటారుట. ఇలాంటి పోటీని పెట్టి ఇంతకన్నా ఎంత చెత్తగా రాయవచ్చు అని విద్యార్థులని సవాలు చెయ్యవచ్చు. ఆ విధంగా ఈ ఎలక్టివ్ కోర్స్ సరదాగా బానే వుండే అవకాశమున్నది. చదవాల్సిన అవసరమే వుండదు గనుక విద్యార్థులు క్లాసు లెగ్గొడతారేమో ననుకోవడానికి ఆస్కారం లేదు. రావుగారి ప్రతిభ నెరిగి వున్నవాళ్లం గనుక ఈ విషయం మీద మేం మాట్లాడ్డం చివరిసారి అని చెప్పడానికి వెనుకాడుతున్నాం. – సం.)

“ఇదీ బాక్‌గ్రవుండ్.”

“రామారావు మొహానికి పులుముకున్న ఉత్తరం చదువొకసారి!”

ప్రియమైన “తెలుగు రత్న”  సంపాదకులకు -

మీరు నాకు చేసిన హెల్ప్‌కి థాంక్స్. నా పుస్తకాన్ని లక్డీ కా పూల్ యూనివర్సిటీవాళ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నకొత్త కోర్సుకి టెక్స్ట్‌బుక్‌గా వాడబోతున్నారని మీకు తెలియజెయ్యడానికి హాపీ. మీ బ్లెసింగ్స్‌తో త్వరలోనే ఉస్మానియా, ఆంధ్రా, నాగార్జున, అమరావతి యూనివర్సిటీలకు కూడా. పుస్తకానికి రీప్రింట్ తొందరలోనే అని ఇంకా హాపీ.

- ఏ.వి.వి.యస్.సి. రావు

” అదన్న మాట అసలు సంగతి! పాపం, రామారావ్! ఆ రచయితని ఉదాహరణగా పాఠకలోకానికి చూపించి అతణ్ణి గేలిచెయ్యా లనుకున్నాడు. తను రాతబడికి గురయ్యాడు.”

” ఇందాక చేతబడన్నావ్. ఇప్పుడు రాతబడంటున్నావ్! ఈ పేరే వినలే దిప్పటిదాకా.”

“ఇంకా అర్థం కాలేదా? ”

“… చేసిందెవరంటావ్?”

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – చివరి భాగం
11

రాక్‌స్లైడ్ కొంత భాగాన్ని కప్పివేయడంవల్ల కలిగించిన డీటూర్‌ని దాటి మళ్లీ హైవే 140మీదకు రాగానే ఆండ్రూ వాన్‌ని పక్కకు తీసి ఆపాడు. సరోజగారు కూర్చున్నవైపు డోర్ తీసి, ఆమె మొహంమీద నీళ్లు జల్లితే ఆమె మెల్లగా కళ్లు తెరిచారు. ఆ కళ్లు ధారగా వర్షించడం మొదలుపెట్టాయి. “ఈ ట్రిప్పులో ఆయన గూర్చి తెలుసుకుంటా ననుకోలేదు,” వెక్కిళ్ల మధ్య ఆవిడ నోట్లోంచి మాటలు వచ్చాయి.

“ఆంటీ, ఆ కుప్పకింద ఎవరూ వుండకపోయే అవకాశమున్నది. అయినా, శాన్ ఫ్రాన్సిస్కో కి బిజినెస్ ట్రిప్‌మీద వచ్చిన ఆయన ఇంతదూరం ఎందుకు వస్తారు?” అన్నాడు ఆండ్రూ.

“ఆయనకి ఈ పార్కులూ అవీ చూడ్డం అంటే ఇష్టం. ఎప్పుడు బిజినెస్ ట్రిప్‌కెళ్లినా టైముంటే ఆ చుట్టుపక్కల ఎక్కడికో అక్కడికి వెళ్లొచ్చేవారు. అలా ఆ బే ఏరియాలో చాలానే చూసొచ్చారు,” అన్నారు సరోజగారు గుర్తు తెచ్చుకుంటూ.

“ఇట్స్ ఓన్లీ ఎ ఫోర్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో! విత్ ఏన్ ఓవర్‌నైట్ స్టే, యు కుడ్ విజిటిట్,” అన్నాడు రోహిత్.

“అలా చూడ్డంకోసం ఎప్పుడయినా సెలవుపెట్టి ఒకరోజు ఎక్కువ వుండడం చేశారా?” అడిగారు మూర్తిగారు.

“తెలియ దన్నయ్యగారూ! ఆయన ఏరోజు వెడుతున్నారు, ఎప్పుడు తిరిగొస్తున్నారు, ఏ హోటల్లో వుంటున్నారు అన్న వివరాలని మాత్రమే నాకిచ్చేవారు.”

“అనుకున్న దానికంటే ఒకరోజు ముందరే మీటింగ్ పూర్తయితే, ఆ రోజు ఎలాగో మిగిలివున్నది గదా అని ఆ ముందు రోజు సాయంత్రమే బయలుదేరి యోసమిటీకి వచ్చి, ఎంత లేటయినా సరే, మరునాడు రాత్రికి మళ్లీ శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరి హోటల్‌కి వెడదామని ఆయన అనుకునివుంటే అలాంటి ట్రిప్ వీలవుతుంది. ఆయన ఫ్లయిట్ రిజర్వేషన్ మార్చుకోలేదు గనుక అది సాధ్యం. అయితే, ఆ రోజు రాత్రి ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఒక హోటల్లో బసచేసి వుండాలి. అంత హఠాత్తుగా వస్తే ఇక్కడ హోటళ్లల్లో రూములు దొరకద్దూ? దొరికినా, తెలుసుకోవడానికి పదేళ్ల క్రితం రికార్డులు ఎవరి దగ్గర వుంటాయి?” అనుకున్నారు మూర్తిగారు.

ఆండ్రూ తను వున్న చోటునించీ సిగ్నల్‌ని దాటి ఆ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వున్నవైపు చూశాడు. అక్కడ పనిచేసేవాళ్ల రాకపోకలకోసం మెష్ వున్న గేటు పెట్టివుంది. దానికి “డు నాట్ ఎంటర్” అన్న బోర్డు తగిలించి వున్నది. అప్పటికి సాయంత్రం ఆరు గంటలు దాటడంవల్ల అక్కడ పనివాళ్లు వెళ్లిపోయినట్టున్నారు. మనుషుల జాడ లేదు.

“రేపు డే టైంలో వస్తే ఎవరితో నయినా మాట్లాడగలిగే అవకాశ మున్నది,” అన్నాడు ఆండ్రూ మూర్తిగారితో.

అప్పటికింక ఎవరూ ఏమీ చెయ్యగలిగేది లేదు గనుక వాన్ ఎక్కి, భారీ మనసులతో హోటల్‌కి జేరారు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన తరువాత వాళ్లకి తెలిసిన వివరాలివీ: ఆ రాక్‌స్లైడ్ మొదలయిన తరువాత ఒక నెలపాటు అది పడుతూనే వున్నది. అలా పడుతూండగా జియాలజిస్ట్‌లో లేక మీడియావాళ్లో పగటిపూట తీసిన విడియో కనిపించింది కానీ, ఆ రికార్డింగ్ మొదలయ్యేసరికే రోడ్ మీద డెబ్రీ చాలా పేరుకుని వున్నది. అది పడడం రాత్రిపూట మొదలయ్యుంటే ఆ విషయం పోలీసులకి తెలియడానికి కొంతసేపు పడుతుంది. తెలియగానే పోలీసులు ముందు రోడ్ బ్లాక్ చేస్తారు. తరువాత మీడియాకి ఆ వార్త చేరి వాళ్లు వచ్చేసరికి అది మొదలై ఎంతలేదన్నా కనీసం పన్నెండు గంటలు అయ్యుండచ్చు. గవర్నమెంట్ జియాలజిస్టులు రావడానికి ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని రోజులో వారాలో అయిన తరువాత ఆ స్లైడ్‌ని కల్పించిన ఆ ఫార్మేషన్ ఇంకా అన్‌స్టేబుల్‌గా వుండడంవల్ల ప్రభుత్వం దాన్ని వెంటనే తొలగించే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అందుకే టెంపరరీ బ్రిడ్జీలని కట్టి డీటూర్‌ని కల్పించారు. ఆ డెబ్రీని తొలగించి ఆ రోడ్డుని పునరుధ్ధరించడంకోసం బిలియన్ల డాలర్ల కేటాయింపు 2015లో జరిగి, 2016లో పని మొదలయింది. మళ్లీ డెబ్రీ వల్ల ఆ మార్గం మూతపడకుండా వుండేటందుకు అక్కడ రాక్ షెల్టర్‌ని కడతారు. ఈ ప్రాజెక్ట్ 2019కి పూర్తవుతుందని అంచనా.

“ఆ డెబ్రీని తొలగించడానికి హెవీ ఎక్విప్‌మెంట్‌ని వాడతారు. కొండల్లో సొరంగాలని తవ్వడానికి వాడినట్లుగా,” అన్నాడు ఆండ్రూ.

“ఎలా చేసినా దానికింద కారుంటే తెలియకపోయే అవకాశం వుంటుందా?” అడిగాడు రోహిత్.

ఎవరికీ మనసు బాగోలేదు. ఆకళ్లు లేవని తిండితిప్పలు వద్దన్నారు సరోజగారు, భవానిగారు. రూంలో ఒక టవల్‌తో మొహాన్ని కప్పుకుని మంచంమీద వాలిపోయారు సరోజగారు. అప్పుడప్పుడూ వచ్చే ఎక్కిళ్ల వల్ల ఆవిడ నిద్రపోవట్లేదని తెలుస్తూనే వున్నది. ఆ మంచంమీదే భవానిగారు ఒకపక్క తన రెండు చేతులతో ఆమె కుడిచేతిని పట్టుకుని కూర్చున్నారు. హమీర్ ఆమె పాదాల చెంత కూర్చుని తనక్కడే వున్నానని చెప్పడాని కన్నట్టు ఆ పాదాలను పట్టుకున్నాడు. తన బాధని పంచుకోవడానికీ, తన తలని మెడవంపులో ఆనించుకుని  జుట్టులో వేళ్లుపెట్టి దువ్వడానికీ ఎవరూ లేరన్న వెలితి అతనికి స్పష్టంగా తెలిసివచ్చింది.

విదుషిని కూడా వాళ్లతో వుంచి, ఆండ్రూ, మూర్తిగారు, రోహిత్ ఆ రూం బయట తమ రూములనించీ తెచ్చుకున్న కుర్చీలని వేసుకుని కూర్చున్నారు. కాసేపటికి విదుషి వచ్చి, ఆండ్రూతో మాట్లాడిన తరువాత అతను వెళ్లి మీనాకీ, రావుగారికీ పరిస్థితిని తెలియజేశాడు. వాళ్లిద్దరూ దాదాపు పరుగెత్తినట్లు అక్కడికి వచ్చారు. రావుగారు బయటే ఆగిపోయారు గానీ, మీనా తలుపు తీసి ఆ రూంలోకి అడుగుపెట్టింది.

తలుపు తీసిన శబ్దానికి తలెత్తి చూసిన హమీర్ కళ్లల్లో తనని చూడగానే నీళ్లు తిరగడం మీనాకి స్పష్టంగానే కంపించింది. ఆ నీళ్లు, “ఇంకా ఎంతసేపు అలా దూరంగా నిల్చుంటావ్?” అని తనని నిలదీస్తున్న ట్లనిపించి వడివడిగా నడిచి అతని పక్కన నిలుచుంది. హమీర్ వెంటనే ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కుని ఆమె పొట్టమీద తల నానించాడు. మీనా అతని జుట్టులో వేళ్లు పెట్టి దువ్వడం మొదలుపెట్టింది.

తల్లి పోయిన తరువాతి దుఃఖం ఆమెకు బాగానే గుర్తుంది. పదేళ్లపాటు తండ్రి కనిపించకపోతే, “బ్రతికివుండే అవకాశాలు తక్కువ,” అని అనుకోవడం వేరు, “బతికిలేడు” అని నిర్ధారణని తెచ్చే క్లోజర్ ఎఫెక్ట్ వేరు.

“మీరెందు కలా అంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా రసలు?” హఠాత్తుగా అడిగింది మీనా. హమీరే గాక భవానిగారు, సరోజగారు కూడా ఆమెని ఆశ్చర్యంగా చూశారు.

“ఏదీ ప్రూవ్ అవలేదు ఇప్పటిదాకా. మీకు తెలిసిన తారీకుని బట్టీ, ఆ తారీకున ఇక్కడ జరిగిం దనుకుంటున్న సంఘటననిబట్టీ ఆ రెంటికీ ముడిపెట్టి మిమ్మల్ని మీరే దుఃఖసముద్రంలో ముంచేసుకుంటున్నారు. కరెలేషన్ ఈజ్ నాట్ కాజేషన్ అని ఒక సామెతుంది. మీరు ఇక్కడ చెయ్యి కదిపిన క్షణానే హోటల్ పార్కింగ్ లాట్లో యాక్సిడెంట్ అయితే, ఆ రెంటికీ ముడిపెట్టగలరా? అక్కడ రాళ్లనీ, మట్టినీ తొలగిస్తే కదా దానికిం దేమున్నదో తెలిసేది?” లాయర్‌లాగా ప్రశ్నించింది మీనా. అక్కడున్న ముగ్గురూ ఆమెను బ్లాంక్ ఫేసెస్‌తో చూశారు.

“ఆ కుప్పలో కూరుకుపోయి కారు ముందుకు పోక, సెల్‌ఫోన్ సిగ్నల్ లేక, ఊపిరాడక, డాడీ చివరి క్షణాలని ఎలా గడిపివుంటారోనని ఆలోచిస్తుంటేనే ఏడుపు తన్నుకొస్తోంది,” అన్నాడు హమీర్.

“అదే నేనంటోంది. దానిక్రింద ఆయన కారున్నట్టు మనకేమీ ప్రూఫ్ లేదు కదా!” ఆమె మాటలకు ఎవరూ జవాబు చెప్పలేదు.

“ఈ ప్రాజెక్టు 2019కి గానీ పూర్తికాదు. పోనీ, ఈ ఏడాది చివరికి ఆ కుప్పకిందే ఆ కారు వున్నది అని నిర్ధారణ జరిగిం దనుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు? ఇలాగే దిగులుగా ఇక్కడే కూర్చుంటారా?”

“రేపు ఆ ప్రాజెక్టు వాళ్లతో మాట్లాడితే గానీ వివరాలు తెలియవు,” అన్నారు భవానిగారు.

“అవునా? మరి అప్పటిదాకా ఇలా దిగులుగా వుండడం అవసర మంటారా? నిన్నటికీ, ఈ క్షణానికీ కూడా అంకుల్ గూర్చి నిర్ధారణగా తెలిసిన వివరాల్లో మార్పేమీ లేదుగదా! అందుకని, ఇవాళ యోసమిటీ నించీ వెనక్కు రావడానికి వాన్ ఎక్కి బయలుదేరిన క్షణాన ఎలా వున్నారో అలాగే వుండండి. అలా అయితే, మీకు అంకుల్ తిరిగి వస్తారనే ఆశ వుంటుంది. నాకు అలాంటి దేమీ వుండే అవకాశమే లేదు గదా మా అమ్మ గూర్చి?” అన్నది మీనా. ఆ చివరి వాక్యం ఆమె నోటినుంచీ రాగానే ఆమె కళ్లనుంచీ బొటబొటా నీళ్లు కారాయి.

భవానిగారు, “పిచ్చితల్లీ, ఇలారా!” అని పిలిచి మీనా తలని తన తల కానించుకుని కళ్లు తుడిచారు. సరోజగారు కూడా లేచి కూర్చుని మీనా తల నిమిరారు.

అక్కడికొచ్చిన మూర్తిగారు ఆకళ్లు వేస్తున్నాయని పిజ్జాని ఆర్డర్ చేస్తానంటే ఆ రూములో వున్నవాళ్లెవరూ వద్దనలేదు.

కాసేపయిన తరువాత హమీర్, మీనాలు చేతులు కలిపి నిశ్శబ్దంగా ఆ పార్కింగ్ లాట్లో నడవడం మొదలుపెట్టారు. తరువాత హమీర్ మీనా భుజంచుట్టూ చెయివేసి దగ్గరకు లాక్కుని నడిచాడు. మరికొంత సేపయిన తరువాత మీనా హమీర్ నడుంచుట్టు చేతులువేసి దగ్గరకు లాక్కుని అతని మెడవంపులో తన తలని దాచుకుంది. “యు నో హౌ మచ్ ఐ వాంటెడ్ దిస్ హగ్ సిన్స్ మై మామ్ పాస్డ్ ఎవే?” అన్నది మెల్లిగా గొణుగుతున్నట్లుగా. ఆమె మెడ వంపులో తన తలని ఆనించాలని అతనికి వున్నది గానీ, అది ఆ ట్రిప్పులో కుదరదని అతనికి తెలుసు.

మరునాడు తెల్లవారుఝామున అయిదు గంటలకల్లా ఆండ్రూ హాఫ్ డోమ్ ఎక్కడానికి వెళ్లిపోయాడు. అలా ఎక్కేవాళ్లలో కొంతమంది అదే హోటల్లో బసచేసి వుండడంతో అతనికి రైడ్ దొరకడం కష్టమేమీ కాలేదు. దానివల్ల మిగిలినవాళ్లు తీరిగ్గా లేచి, బ్రెక్‌ఫాస్ట్ చేసి యోసమిటీకి బయలుదేరడానికి వీలయ్యింది.

బ్రెక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒకాయన సరోజగారి వద్దకు వచ్చి, “మీరు సరోజగారు కదా!” అని అడిగారు. సరోజగారు ఆయన్ని చూసి, గుర్తుపట్టనట్లుగా, “మీరు …” అంటూ మధ్యలో ఆగిపోయారు.

“నేను వీరారెడ్డి నండీ. హంట్స్‌విల్‌లో వున్నప్పుడు వారాని కొకసారన్నా కలిసేవాళ్లం,” అన్నారాయన.

“చాలా కాలమయింది కదా, అందుకని గుర్తుపట్టలేదు. మీకు గ్రోసరీ షాప్ వుండేది కదా,” అన్నారు సరోజగారు గుర్తుతెచ్చుకుంటూ.

“అందుకే కస్టమర్లందరూ నాకు గుర్తుంటారు. నాకు బాగా జుట్టున్నపుడు చూశారు గనుక ఈ పూర్తి బట్టతలతో నన్ను గుర్తుపట్టడం కష్టమే. కానీ, మీరేం మారలేదు. నిన్న మిమ్మల్నిక్కడ చూశాను, అవునా, కాదా అనుకుని, ఇవ్వాళ పలకరించి తెలుసుకుందా మనుకున్నాను. గ్లాడ్ ఐ ఆస్క్‌డ్,” అని, “రామారావు గారు రాలేదా?” అని అడిగారు.

మూర్తిగారు కల్పించుకుని, “రాలేదండీ. బై ది వే, అయాం మూర్తి. ఎ క్లోజ్ ఫ్రెండ్,” అన్నారు.

“నైస్ టు మీట్ యు,” అని, “క్రితంసారి రామారావు గారొక్కరూ వచ్చారు. ఇప్పుడు సరోజ గారొక్కరూ వచ్చారు,” అని వీరారెడ్డిగారు జతకలిపారు.

మూర్తిగారి మైండ్లో అలారం బెల్స్ మ్రోగాయ్. “ఎప్పుడు?” ఆత్రాన్ని సాధ్యమయినంతవరకూ కనపడనీకుండా క్యాజువల్‌గా అడిగారు.

“అప్పటికి నేనీ హోటల్‌ని కొని ఏడాది కూడా అవలేదు. అందుకే తెలిసిన మొహాలకోసం కలవారించేవాణ్ణి,” అన్నారాయన.

“అదే, ఏ సంవత్సరమో గుర్తుందా?”

“2006! రాత్రి బాగా లేట్‌గా వచ్చారు, రిజర్వేషన్ లేదు, రూం దొరుకుతుందా అంటూ. అప్పుడు ఆయన అదృష్టం బావుండి అది సీజన్ కాదు కాబట్టి ఖాళీగా బోల్డు రూములున్నయ్. ఇది సీజనల్ బిజినెస్. అందుకే ఇప్పుడు వింటర్లో హంట్స్‌విల్‌లోనూ సీజన్ మొదలయినప్పటినించీ ఇక్కడా గడుపుతుంటాను.”

“మీకంత బాగా ఎలా గుర్తుంది, ఆయన వచ్చినట్లు?”

“తెలిసినవాళ్లు రావడం అది మొదటిసారి. పైగా, లేట్‌గా వచ్చారు. అప్పుడు రిసెప్షనిస్టునీ, ఓనర్నీ అన్నీ నేనే గనుక నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, వుండమన్నాను. ఆయన అప్పటికీ మొహమాట పడి, మా ఫామిలీతో వచ్చినప్పుడు మాత్రం డబ్బులు తీసుకోకపోతే వేరే హోటల్‌కి వెడతానన్నారు.”

సరోజగారు ఈ సంభాషణని నిశ్చేష్టులై విన్నారు. క్రితం రాత్రి మీనా మాటలవల్ల చిగురించిన ఆశలని ఆ క్షణాన మంటలో తగులబెట్టినట్టు ఆమెకి అనిపించింది. ఆవిడకి ఏడుపు మళ్లీ తన్నుకొచ్చింది. భవానిగారు ఆవిణ్ణి పట్టుకుని రూంకి తీసుకెళ్లారు.

సరోజగారు ఎందుకంత అప్‌సెట్ అయ్యారో వీరారెడ్డిగారికి అర్థంకాలేదు. “నేనే మన్నానని?” ఆశ్చర్యంతో మూర్తిగారిని ఆయన ప్రశ్నించారు.

ఆయనకి క్లుప్తంగా చెప్పి పంపించిన తరువాత హమీర్‌నీ, రోహిత్‌నీ, విదుషినీ చూస్తూ మూర్తిగారు అన్నారు – “శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల – అదే, పాలో ఆల్టోలో – రామారావుగారి పని అనుకున్న దానికంటే ఒకరోజు ముందే అయిపోయి వుంటుంది. ఫ్లయిట్‌ని ప్రిపోన్ చేసుకోవాలంటే ఎయిర్‌లైన్ బాగానే ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. ఆ డబ్బుని కట్టడానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీద పనిచేసే కంపెనీలు బాగా నసుగుతాయి. గవర్నమెంట్ రి-ఇంబర్స్‌మెంట్ ఇవ్వనంటే, అని వాళ్ల భయం. ఆ అనుభవంతో, ఎందుకొచ్చిన గోలలే అనుకుని, ఒకరోజు వెకేషన్ తీసుకుని యోసమిటికి వెళ్లొద్దామని రావుగారు అనుకుని వుంటారు. అయితే, అప్పటికే ఆ రోజుకి చెకవుట్ టైం దాటడంవల్ల ఆయన వుంటున్న హోటల్ ఆ రాత్రికి కూడా ఎలాగో ఛార్జ్ చేస్తుంది. పైగా, మరునాడు రాత్రి ఎలాగూ అక్కడే వుండాలి. ఎందుకంటే, ఆయన స్కెడ్యూల్డ్ ఫ్లయిట్‌ని శాన్ ఫ్రాన్సిస్కోలో పొద్దున్న ఎనిమిదింటికే కాచ్ చెయ్యాలంటే ఇక్కణ్ణించీ కనీసం తెల్లవారుఝామున రెండు గంటలకి బయలుదేరాలి. ఆ టైంలో డ్రైవ్ చేసుకుని వెళ్లడం సేఫ్ కాదు. అసలే కొండలప్రాంతం. దానికి తోడు నిద్ర వస్తూంటుంది. వెరీ డేంజరస్!  ఆ విషయం ఆయనకి తెలిసే, ఆ హోటల్లో చెకవుట్ చేసివుండరు.

“వర్క్‌డే అయిన తరువాత బయలుదేరి వుంటారనుకుంటే, ఇక్కడికొచ్చేసరికి రాత్రి కనీసం పదకొండు గంటలవుతుంది. అది లేటే కదా! ఇక్కడ ఓవర్‌నైట్ స్టే చెయ్యాలంటే ఎలాగూ తన బట్టలూ అవీ తెచ్చుకోవాలి కనుక మొత్తం కారీ-ఆన్‌తో వచ్చివుంటారు. అందుకనే అక్కడి హోటల్లో చెకవుట్ చెయ్యకపోయినా ఆయన బిలాంగింగ్స్ ఏవీ దొరకలేదు. మరునాడు పొద్దున్నే ఈ హోటల్‌నించీ చెకవుట్ చేసివుంటారు. తనివితీరా చూసేసి సాయంత్రం ఏడు గంటలప్రాంతంలో యోసమిటీనించీ బయలుదేరి వుంటారనుకుంటే ఆ రాక్‌స్లైడ్ ప్రాంతానికి వచ్చేసరికి ఏడున్నర అయివుండొచ్చు. ఆ  స్లైడ్ చిన్నచిన్న రాళ్లతోనూ మట్టిగడ్డలతోనూ మొదలయిందా లేక చాలా పెద్ద పెళ్ల ముందు పడి దానిమీద తరువాత ఆ కుప్ప సైజ్ పెరుగుతూ వచ్చిందా అన్నది మనకు తెలియదు కదా!  చిన్నచిన్న రాళ్లూ రప్పలూ పడుతుంటే చూసి కారుని ఆపగలిగే అవకాశ ముంటుంది. ఆయన అందులోనే ఇరుక్కుపోయివుంటే మాత్రం ఆ కారు ముందుకుపోలేని పరిస్థితి హఠాత్తుగా వచ్చిందని అర్థం. అఫ్ కోర్స్! ఇదంతా ఊహాగానమే, మన కిప్పటిదాకా తెలిసినదాన్ని బట్టీ.”

ఆయన ఎనాలిసిస్‌ని తప్పుపట్టడానికి ఎవరికీ తగినన్ని కారణాలు కనిపించలేదు.

హమీర్ సరోజగారి దగ్గరకు వెళ్లి, “మామ్, ఆండ్రూ వచ్చేదాకా మన మిక్కడ వెయిట్ చెయ్యడం తప్ప మరేమీ చెయ్యలేం. ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే సెకండ్లు గంటల్లాగా భారంగా అనిపించి నాకు పిచ్చెత్తుతుంది. డాడీ యోసమిటీ చూడడానికే వచ్చివుంటే, ఆయన చూసినవే మనం చూస్తున్నా మనుకుని, ముందు అనుకున్నట్లుగానే వెడదాం, పద! దారిలో ఆ రాక్‌స్లైడ్ జరిగిన చోట ఆగి, అక్కడ వున్న కన్‌స్ట్రక్షన్ క్రూతో మాట్లాడడానికి కూడా అవకాశం దొరుకుతుంది,” అన్నాడు. సరోజగారు లేచి బయలుదేరారు.

విదుషి వాన్‌ని డ్రైవ్ చేస్తుంటే మీనాని వాళ్లతో పంపించి రావుగారు వెనక తన కారులో ఫాలో అయ్యారు. విదుషి పక్కసీట్లో మూర్తిగారు కూర్చోగా, వెనక హమీర్ పక్కన విదుషి ఖాళీచేసిన సీట్లో మీనా కూర్చుంది. ఎన్నాళ్లనించో మిస్ అయిన ఆ స్పర్శ తాలూకు అనుభవాన్ని ఇంక విడవకూడదన్నట్లు చేతులు పట్టుకుని, భుజాల నానించి కూర్చున్నారు హమీర్, మీనా. వాన్ ఆ రాక్‌స్లైడ్ ఏరియాకి జేరేసరికి దాదాపు తొమ్మిది గంటలయింది. మూర్తిగారు హమీర్‌ని తనతో తీసుకువెళ్లి అక్కడి సూపర్వైజర్‌తో మాట్లాడారు. అతను మూర్తిగారి బిజినెస్ కార్డ్ తీసుకుని, వాళ్ల భయమే నిజమయితే తప్పక తెలియజేస్తాననీ, ఒకవేళ తను మరచిపోయినా అది నేషనల్ న్యూస్‌లో వస్తుందనీ, తరువాతి ఆరు నెలల్లో ఆ డెబ్రీని పూర్తిగా తొలగించాలనేది ప్లాన్ అనీ వివరించాడు.

యోసమిటి పార్క్‌లోకి ప్రవేశించిన తరువాత రూట్ 41 తీసుకుని గ్లేసియర్ పాయింట్ వైపు ప్రయాణించారు. చివర పార్కింగ్ లాట్లో దిగి, అక్కణ్ణించీ కనిపించిన దృశ్యాన్ని చూసి అచ్చెరువందారు. 3-డి నమూనాని విజిటర్ సెంటర్లో చూడడం వేరు, ఫుల్ సైజ్‌ని కళ్లారా చూడడం వేరు. ఒక పక్కన ఎత్తుగా హాఫ్ డోమ్ కనిపిస్తోంది. దానికి ఎదురుగా వున్న లోయలో తాము ముందురోజు వెళ్లిన విలేజ్ వున్నదని తెలుస్తోంది. ఆ వ్యాలీకి అవతలపక్క మళ్లీ కొండల వరుసలు. అయితే, చుట్టుపక్కల అన్ని కొండలలోనూ అతి ఎత్తయినది హాఫ్ డోమ్ మాత్రమే.

“లయన్ కింగ్‌లో ముఫాసా నిలబడితే మిగిలిన జంతువులన్నీ తలలు వంచి వాడి కెదురుగా, దూరంగా నిలబడ్డట్లున్నది,” అన్నాడు రోహిత్.

“ఈ లోయ అంతా గ్లేసియర్ కరగడం వల్ల ప్రవహించిన నీరు కోసెయ్యడంవల్ల ఏర్పడినదే?” అన్నారు భవానిగారు ఆశ్చర్యపోతూ.

“ఆండ్రూ ఈపాటికి అక్కడికి చేరుతూ వుంటాడంటావా?” అన్నారు మూర్తిగారు. విదుషి వాచ్ చూసి, “అప్పుడే ఎక్కడ, టు థర్డ్స్ డిస్టెన్స్ కవర్ చేసివుంటే గొప్ప!” అన్నది.

“అంత స్టీప్‌గా, నున్నగా వున్నది కదే ఆ ఆఫ్ డోమ్! ఎలా ఎక్కుతాడో ఏమిటో,” అన్నారు భవానిగారు.

(మధ్యలో క్రింద యోసమిటీ వ్యాలీ. కుడివైపున హాఫ్ డోమ్)

“దానిమీద ఐరన్ పోల్స్‌ని పాతి వాటికి తాడు కట్టి రోప్ వే తయారు చేశార్ట. దాన్ని పట్టుకుని ఎక్కుతారు. అక్కడ కంజెషన్ అవుతోందనే పార్క్ అథారిటీ రోజుకి కొంతమందిని మాత్రమే దాన్నెక్కడానికి అనుమతిస్తోందట,” విదుషి వివరాలు తెలియజేసింది.

“డాడీ ఇక్కణ్ణించీ ఈ లోయని చూసివుంటా రంటావా?” అన్నాడు హమీర్ తల్లి భుజంమీద చెయ్యివేసి గట్టిగా పట్టుకుని. అతని రెండవ చేతిని విదుషి గట్టిగా పట్టుకుని, “ఐ విష్ మై మామ్ హాడ్ సీన్ దిస్,” అని సన్నగా గొణిగింది.

“గ్లేసియర్ కరిగితే వచ్చిన నీళ్లు కొయ్యగా మిగిలిన వ్యాలీ లాంటివే నీదీ, నాదీ గుండెలు. అక్కడ ఎత్తుగా హాఫ్ డోమ్‌లాగా ఆకాశా న్నంటుతూ ఆయన,” అన్నారు సరోజగారు.

మిర్రర్ లేక్‌కి వెళ్లేముందు యోసమిటి విలేజ్‌లో ఆగి లంచ్ చేశారు. ఆండ్రూ వచ్చేసరికి ఎలాగూ బాగా లేటవుతుంది గనుక తీరిగ్గా ఆ చుట్టుపక్కల అన్నింటినీ చూడాలనుకున్నారు.

(మిర్రర్ లేక్)

కర్రీ విలేజ్ దగ్గర మళ్లీ వాన్‌ని పార్క్ చేసి హాపీ ఐల్స్ బ్రిడ్జ్‌ని దాటి ఈసారి లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. దాదాపు ఒక మైలు దూరం నడవాల్సొచ్చింది మిర్రర్ లేక్ దగ్గరకు వెళ్లడానికి. అయితే ఆ ప్రశాంతమైన వాతావరణంలో నడవడం అంత కష్ట మనిపించలేదు. “నడవలేకపోతే వెనక్కు వెళ్లేటప్పుడు పార్క్ బస్ తీసుకుందాంలే,” అన్నారు మూర్తిగారు.

మిర్రర్ లేక్ దగ్గరకు వెళ్లిన తరువాత దానికా పేరు ఎందుకొచ్చిందో అర్థమయింది. ఎంతో నిశ్చలంగా వున్నదది చుట్టూ వున్న కొండలని అందులో ప్రతిబింబిస్తూ.

“ఇక్కడెంత ప్రశాంతంగా వున్నదో! ఋషులు ఇట్లాంటి చోట్ల తపస్సులు చేస్తూంటారు గావును,” అన్నారు భవానిగారు.

“అలా చేస్తే ఎంతో కాలం పట్టివుండదు పూర్తి ప్రశాంతత దొరకడానికి. ఎందుకంటే కనీసం ఒక బేర్ అయినా మంచి ఆహారం దొరికిందని ఆనందపడుతుంది గనుక,” అన్నాడు రోహిత్.

“ప్రశాంతత కావాలంటే ముందు వీడి నోరు మూయించాలి,” అన్నది విదుషి. అక్కడేవున్న బండలమీద కూర్చున్నా రందరూ.

“ఈ మూమెంట్ విలువ ఎన్నో ఏళ్లకు గానీ తెలియదు. మళ్లీ ఎప్పుడొస్తామో! మనసుల నిండా నింపుకోండి,” అన్నారు మూర్తిగారు.

“నా ఐఫోన్లో నింపుతున్నాను,” అన్నాడు రోహిత్ చుట్టూ తిరుగుతూ విడియో రికార్డ్ చేస్తూ.

“నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆండ్రూతో నయినా వెడతాను, లేకపోతే అతణ్ణి నాతో ఇక్కడికి పట్టుకొచ్చి అయినా తీరతాను,” అనుకున్నది విదుషి.

హమీర్ భుజంమీద తలపెట్టి అతని నడుము చుట్టూ చెయ్యివేసి మీనా కూర్చోవడాన్ని చూసిన రావుగారి మనసు ఆనందంతో నిండిపోయింది. సరోజగారు వాళ్లిద్దరి పక్కనే కూర్చోకపోయినా హమీర్ ఒంటరితనం తీరుతున్నందుకు ఆమె మనసు స్థిమితపడింది.

అక్కణ్ణించీ కదలాలని లేకపోయినా మరీ ఆలస్య మవుతుందేమోనని ఒక గంట తరువాత అక్కణ్ణించీ బయలుదేరారు. బస్ ఎక్కాలని ఎవరూ అనుకోలేదు.

మూర్తిగారి బృందం తిరిగి హోటల్‌కి చేరుకునేసరికి ఏడు కావస్తోంది. పెద్దవాళ్లకి పిజ్జా తెప్పించి, తాము తినడానికి ఆండ్రూ తిరిగివచ్చేదాకా ఆగుదా మనుకున్నారు కుర్రవాళ్లు. అయితే, బార్లో వెళ్లి కూర్చోవడానికి ఆ అడ్డేమీ లేదు గనుక అక్కడ రిలాక్స్ అయి వస్తామన్నారు. అక్కడ స్నాక్స్ ఆర్డరిచ్చి వాటిని తింటూ ఒక బీరు సగం తాగిన తరువాత ఫోన్‌ని టేబుల్‌మీద పెట్టి హమీర్ రెస్ట్‌రూంకి వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత మీనా చెప్పింది – నీకు ఆమని నించీ ఫోన్ వచ్చింది అని. హమీర్ ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, “అమాని?” అన్నాడు. రోహిత్ కనుబొమలు ఒక్కసారి ముడుచుకున్నాయి. అతను విదుషితో గ్లాన్సెస్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడాన్ని మీనా గానీ హమీర్ గానీ చూడలేదు. హమీర్ ఫోన్ తీసుకుని ఆ బార్ బయటికి వెళ్లాడు. అమాని ఫోన్ చెయ్యడం అతనికి చాలా ఆశ్చర్యంగా వున్నది. ఆమె ఫోన్ చెయ్యడం అదే మొదటిసారి! అయితే, రెండోపక్కనుంచీ భయం – ఆమె నుంచీ ఎలాంటి వార్త వినవలసి వస్తుందో నని! “ఐ వాంట్ టు మీట్ యు,” అనంటే మాత్రం ఇప్పుడది పెద్ద ప్రాబ్లమే అవుతుంది.

అతను అమాని నంబర్ డయల్ చేసినప్పుడు ఆమె అవతలి నించీ, “ఐ కాల్డ్ టు టెల్యు ఎ గుడ్ న్యూస్!” అన్నది అతను ఇంకా “హలో” అని అనకుండానే.

“ముదస్సర్ హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోయాడు,” అన్నాడు హమీర్ ఒక పక్కనుంచీ తన గుండెని గుప్పిట్లో పెట్టుకుంటూనే. అయితే, అది మాత్రం, అప్పటిదాకా అమాని అతన్నించీ కమిట్‌మెంట్‌ని కోరలేదని గుర్తులేక మాత్రం కాదు.

ఒక్కక్షణం పట్టింది అతనన్నది ఆమెకు అర్థం కావడానికి. పెద్దగా నవ్వి, “నో … నాట్ దట్ గుడ్. యాక్చువల్లీ దట్ వుడ్ బి వెరీ బాడ్ ఫర్ సురయా. … ఐ బ్రోక్ హిజ్ లెగ్స్. సో, హి విల్ నో లాంగర్ బి ఎ డేంజర్ టు ఎనీబడీ!” అన్నది.

“వాట్?” అన్నాడు నమ్మలేనట్టుగా.

“నువ్వింకా, హౌ అనడుగుతా వనుకున్నాను. సరే ఆ ప్రశ్నకు నేనే జవాబు చెబుతాను విను. వాడి ప్లాన్ ఎగ్జెక్యూషన్‌కి ఆర్డర్లు వచ్చాయిట అని ఫోన్‌చేసి చెప్పింది సురయా. దానికి ఫోన్ లేదు. తన ఫోన్ మీద దాని చెయ్యి పడితే చంపేస్తానని ఎప్పుడో బెదిరించాడు గనుక అది ఆ ఫోన్ వైపు చూడడానికే భయపడుతుంది. ఆ రోజు మాత్రం మా అందరి అదృష్టం బావుండి వాడు బాత్రూంలో వున్నప్పుడు తెగించి నాకు ఫోన్ చేసి వాడి ప్లాన్ చెప్పింది. వాడి ప్లాన్లో దాన్ని సూసయిడ్ బాంబర్‌ని చెయ్యడంకూడా వున్నది. బ్రస్సెల్స్ ఎటాక్‌తో వాడు ఎలాగూ ఇన్‌స్పైర్ అయేవున్నాట్ట. అప్పటికే డొనాల్డ్ ట్రంప్ ముస్లిము లందరినీ శతృవులుగా చూపిస్తూండేసరికి వాడికి బుధ్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని వున్నాట్ట. న్యూయార్క్‌లో జరిగే ప్రైమరీకోసం రాలీలకి ఎలాగూ ట్రంప్ వస్తాడు గాబట్టి దాన్ని టార్గెట్‌గా పెట్టార్ట -  ఎక్కువమందికి హాని కలిగించే అవకాశ ముంటుందని. వాడు తన డొక్కు కార్లో బయలుదేరితే దాన్ని పొరబాటున ఏ పోలీసు ఆపడంవల్లనో లేక ఆ కారు దారి మధ్యలో ఆగిపోతే సహాయం చెయ్యడాని కొచ్చిన ఎవరివల్లనో వాడు చెయ్యబోయే ఘనకార్యం అందరికీ తెలిసి మేమందరం ఒకేసారి ముణిగిపోయే అవకాశం బాగా వున్నదని నాకు అర్థమైంది. అందుకని వాణ్ణి ఆపాలని నిర్ణయించుకుని వాడింటికి బయలుదేరాను.

“కారులో వెపన్స్‌ని పగటి పూట లోడ్ చెయ్యరు కదా! ఎంత సంచుల్లో వాటిని నింపినా అర్థరాత్రిపూటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. మా అదృష్టం బావుండి వాళ్లది కార్ గరాజ్ లేని టవున్‌హవుస్. అందుకని కారుని బయటే కర్బ్ పక్కగా పార్క్ చేశాడు. నేను వెళ్లేసరికి వాడు లోపలినించీ తెచ్చిన సంచీని అప్పుడే ట్రంక్‌లో పెట్టడానికి వంగాడు. అప్పుడే టర్న్ తీసుకుంటున్న నా కారు హెడ్‌లైట్లు వెనకనించీ తనమీద పడేసరికి స్టన్ అయ్యాడు గానీ వెనక్కు తిరిగి చూసే ప్రయత్నం చెయ్యలేదు – వచ్చే వాళ్లెవరో తనకి తెలియదు గదా! అందుకని తన పని తను చేసుకుంటున్నట్లు నటించాడు. లేకపోతే కారు శబ్దం విని వెనక్కి తిరిగి చూడాలి. వాడి కారు వెనుకగానే నాకు పార్క్ చెయ్యడానికి చోటుంది. మామూలుగా కర్బ్ పక్కన వన్నీ పారలెల్ పార్క్ స్పాట్సే కదా! ఇన్షాల్లా! ఆ రోజు అల్లా దయదల్చినట్లే ఆ స్పాట్లన్నీ వేకెంట్‌గా వున్నాయి.

“ఒక్కక్షణంలో ఏంచెయ్యాలో డిసైడ్ అయ్యాను. వాడి కారు వెనకే పార్క్ చేస్తున్నట్లు మెల్లిగా వెళ్లి, యాక్సిలరేటర్ మీద కాలేశాను. వాడు రెండు కార్లకీ మధ్యలో ఇరుక్కుపోయాడు. రెండుకాళ్లూ మోకాళ్ల దగ్గర నుజ్జు నుజ్జయిపోయా యని నమ్మకం కలిగిన తరువాత కానీ కారుని రివర్స్ చేసి ఆపలేదు. నేనే 911కి కాల్ చేసి వెంటనే కారు దిగి వాడి ముందు కెళ్లాను. అప్పటికి వాడు నేలమీద కూలిపోయి వున్నాడు గానీ ఆ పని చేసింది నేనేనని తెలిసి మాత్రం షాకయ్యాడు. వాడు ట్రంక్‌లో పెట్టిన బాగ్‌ని తీసుకుని  పరుగెత్తి వాడింట్లోకి వెళ్లి సురయా చేతికిచ్చి లోపల పెట్టమని చెప్పి, వెనక్కి వచ్చి వాడి పక్కన నిల్చొని ‘అయ్యో, ఎంత ఘోరం చేశాను ‘ అని పెద్దగా ఏదవడం మొదలుపెట్టాను. కనీసం ఇరవై మైళ్ల స్పీడ్‌తో వాడి కాళ్లని క్రష్ చేసినా హాస్పిటల్‌కి తీసికెళ్లిన తరువాత డాక్టర్లు హీరోయిక్‌గా వాడి కాళ్లని మామూలుగా చేస్తారేమోనని భయపడ్డాను గానీ, వాళ్లు ఆ కాళ్లు తీసెయ్యాలని చెబితే లోపల ఎంత సంతోషించినా పైకి మాత్రం, నా వల్లే కదా అని పెద్దగా అరుస్తూ ఏడుపు నటించాను. మోకాళ్లనించీ కింద భాగాన్ని రెండు కాళ్లకీ పూర్తిగా తొలగించారు.

“బ్రేక్ నొక్కబోయి యాక్సిలరేటర్ నొక్కానని పోలీసులకి చెప్పాను. వచ్చిన పెరామెడిక్సూ, పోలీసులూ వాడి ఇంట్లోకి అడుగుపెట్టకపోవడం మంచిదయింది. లేకపోతే వాడు పోగుచేసిన రకరకాల గన్స్‌నీ, బాంబులనీ చూసేవాళ్లు! వాడు హాస్పిటల్లో వున్న రోజుల్లోనూ, వాణ్ణి ఇంటికి తీసుకువచ్చిన తరువాత కూడా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంవల్ల నిద్రపోతూ వున్నప్పుడూ, నేనూ, సురయా ఆ మారణాయుధాలని నల్ల ట్రాష్ బాగ్స్‌లో పెట్టి చీకటిగా వున్నప్పుడు దూరంగా వున్న ట్రాష్ బిన్లలో పడేసి వచ్చాం. అన్నింటినీ ఒకేసారి గానీ ఒకేచోట గానీ పడేయ్యలేదులే! అదికూడా రోజుకి కొన్నిమాత్రమే. … ఇప్పుడు సురయాకి కూడా కొంచెం స్వేఛ్ఛ దొరికిన ట్లనిపించి, అది ఇస్తున్న ఫీలింగ్ నచ్చుతోంది. పెళ్లయిన తరువాత తను పోగొట్టుకున్నదేమిటో తనకి అర్థమవుతోంది. పిల్లల్ని స్కూల్‌కి పంపుతానని కూడా అంటోంది,” అని ఆగింది.

హమీర్‌కి మొత్తం పరిస్థితి అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. “నీమీద ఛార్జెస్ ఏవీ పెట్టలేదా?” అడిగాడు.

“ఎంతయినా విక్టిమ్, సిస్టర్స్ హజ్బెండే గనుక పోలీసులు నా స్టోరీనే నమ్ముతున్నారు. వాడు మాత్రం నన్ను సైతాన్ అంటున్నాడనుకో! అలాగని వాడు పోలీసులకి నేను ఎందుకలా చేసివుంటానో చెప్పలేని పరిస్థితి. రెక్‌లెస్ డ్రైవింగ్ అని రాశాడు అక్కడికొచ్చిన పోలీసు. మా లాయర్‌తో చెప్పాను – నేను చాలా పశ్చాత్తాప పడుతున్నాను, వాడికి వచ్చిన మెకానిక్ పని చెయ్యడం ఇంకనుంచీ సాధ్యం కాదు, అలాగని వేరే ఉద్యోగం దొరకడమూ కష్టం గనుక, పెళ్లి చేసుకోకుండా ఆ నలుగురినీ నేను బతికున్నంత వరకూ పోషిస్తాను అని చెప్పు, అవసరమైతే, అని. మెడకాయ మీద తలకాయ వున్న ఏ జడ్జీ కయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నన్న నా ప్రపోజల్ యాక్సెప్టబుల్ అని అనిపించాలి.”

“యు డిడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ది కంట్రీ – బట్, నో స్పెషల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్ ఫర్ యు!” అన్నాడు హమీర్.

“ముదస్సర్ వల్ల ఎవరికీ ప్రమాదం రాకపోవడమే నాకు పెద్ద రివార్డ్. అంతకన్నా ఎవరే మివ్వగలరు? బై ది వే, నేను దేశంకోసం, సమాజంకోసం, ఏం చెయ్యలా. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం ఒకేసారి ముణగకుండా వుండేలా చూసుకున్నానంతే! నాకు నవ్వొచ్చిన విషయం చెప్పమంటావా? ఇంత జరిగినా, ముదస్సర్ చెయ్యబోయిన హానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయేవో తెలిసినా, సురయా నా మీద జాలిపడి, వాడికి రెండో భార్యగా వుంటావా, షరియా ప్రకారం తప్పులేదుగా? అంటుంది – అక్కడేదో మగాడి పొందు మిస్సవకపోవడమే ఆడదానికి జీవిత లక్ష్యం అన్నట్టు! నీ పొందు జ్ఞాపకాలు పదిలంగా నాగుండెల్లో వున్నయ్యని తనకేం తెలుసు? ఆ యాక్సిడెంట్ తరువాత నీతో మాట్లాడాలని, నీ ఛాతీమీద తలవాల్చి సేదతీరాలనీ చాలాసార్లు అనిపించింది. నీ ఫోన్ నంబర్‌ని గుర్తు చేసుకుంటూ, ఈ నంబర్ మరిచిపోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నా లాభం లేకపోతోంది,” అన్నది అమాని.

“ఐ వాంట్ టు సీ యు!” అన్నాడు హమీర్ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా.

“నో, ఒమహా బాయ్! బై ది వే, ఆ పేరుతోనే నీ కాంటాక్ట్‌ని నేను మొదటినించీ గుర్తుంచుకుంది. లేకపోతే, పొరబాటున నీ పేరుని హమీద్ అనుకుంటానేమోనని భయం. ఈ మూణ్ణెల్లబట్టీ నువ్వు నాకు కాల్ చెయ్యడానికి గానీ, టెక్స్ట్ చెయ్యడానికి గానీ ప్రయత్నించకపోతే సెల్ఫ్ కంట్రోల్ నీకు బాగానే వున్నదే అనుకున్నా. ఐ వాంట్ టు ప్లే ఇట్ సేఫ్. రేపటినించీ నా నంబర్ మార్చుకుంటా.  యాక్చ్యువల్లీ, దిస్ విల్ బి ఎ ఫ్యామిలీ ప్లాన్, బట్ దిస్ టైం అండర్ మై కంట్రోల్. ముదస్సర్‌కి కూడా కొత్త నంబర్ వుంటుంది. అలా అయితే ముందుగా ఇక్బాల్‌కి ముదస్సర్ నంబర్ దొరకదు. ఇంకెవడయినా ముదస్సర్‌తో మాట్లాడినా నాకు తెలుస్తుంది. అయినా, రెండు కాళ్లూ విరిగిన వాడితో ఇక్బాల్‌కి అవసర మింకే ముంటుందిలే? సేఫ్‌గా వుంటుందని అడ్రస్ కూడా మార్చడానికి వాళ్లని ఆ యింటినుంచీ వాళ్ల అబ్బాజాన్ ఇంట్లోకి మారుస్తున్నాను కూడా,” అన్నది అమాని.

హఠాత్తుగా ఆమె మూణ్ణెల్లు అనడం అతని మదిలో రిజిస్టరయింది. “ఇది జరిగి మూణ్ణెల్లయితే, నా కిప్పుడు చెబుతున్నావా?” అడిగాడు.

“నేనన్నది మూణ్ణెల్లబట్టీ నువ్వు కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించ లేదని. ఇది జరిగి రెణ్ణెల్లే ననుకో, అయినా, హౌ వుడ్ ఇట్ ఛేంజ్ ఎనీథింగ్?” అడిగింది అమాని.

“ఇట్ వుడ్ హావ్! అంటిల్ లాస్ట్ వీక్!” అన్నాడు బార్లో వున్న మీనా గుర్తొచ్చి. కాదు. ఈ యోసమిటీ ట్రిప్‌కి బయలుదేరే ముందు దాకా, అనుకున్నాడు.

“టుమారో ఈజ్ మై కోర్ట్ డేట్. నో క్రిమినల్ ఛార్జెస్. బట్, రెక్‌లెస్ డ్రైవింగ్ ఛార్జ్ హాజ్ ఎ రేంజ్ ఫర్ పనిష్మెంట్, ఇంక్లూడింగ్ జెయిల్ టర్మ్. సో, విష్ మి ది బెస్ట్!”

“ఫ్రమ్ ది బాటం ఆఫ్ మై హార్ట్! … ఐ విల్ మిస్ యు!” అన్నాడు.

“అహాఁ. జస్ట్ లైక్ ఐ మిస్ ఎ పింపుల్!” అని నవ్వింది.

“దిసీజ్ ది ఫస్ట్ టైం ఐ హర్డ్ యువర్ గిగిల్,” అన్నాడు హమీర్.

“గ్లాడ్ టు గివ్ యు దట్ స్పెషల్ మెమరీ! బెటర్ లేట్ దాన్ నెవర్, రైట్?” అన్నది అమాని.

“2016 ఈజ్ స్పెషల్ ఫర్ బోతాఫ్ అజ్. యు ఆర్ ఫరెవర్ అవుటాఫ్ డేంజర్ ఫ్రం ది పెస్ట్ దట్ హాజ్ బాదర్డ్ యు ఫర్ ఎ డికేడ్. అయాం 99 పర్సెంట్ ష్యూర్ అబవుట్ వాట్ హాపెన్డ్ టు మై ఫాదర్,” అన్నాడు హమీర్.

“స్పెషల్ యియర్ ఇండీడ్! ఐ హావ్ టు గో నౌ, సురయా పిల్లల్ని స్విమ్మింగ్ పూల్‌కి తీసుకుపోవాలి,” అని అమాని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

బార్లోకి వచ్చినప్పుడు అతని మొహాన్ని చూసి ఎవరూ ఏమిటని అతణ్ణి అడగలేదు. అతను కూర్చున్న తరువాత, మీనా జరిగి అతని భుజానికి తలని ఆనించి కూర్చుంది.

బౌల్డర్లో వున్న గవర్నమెంట్ ఏజెన్సీలో ఒక వేకెన్సీ వస్తే హమీర్ ఆ ఉద్యోగానికి అప్లైచేసి ఆర్నెల్ల తరువాత అక్కడికి మారి మీనాని చేరాడు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో అప్పటికే పరిచయమున్న సైంటిస్ట్‌ని కలిసి, అక్కడ పార్ట్ టైం మాస్టర్స్ ప్రోగ్రాంలో జాయినయ్యాడు.

హమీర్, మీనా, రావుగారి, మూర్తిగారి కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మారేజీ చేసుకున్నారు. వాళ్లకి ప్రైవసీ నివ్వడం కోసం సరోజగారిని కొంతకాలం మూర్తిగారు వాళ్లు తమవద్దనే వుంచుకున్నారు.

సరోజగారు తన అన్నయ్యగారింట్లో జరిగే శుభకార్యాలకి వెళ్లినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా అమెరికాలోనే గడిపారు.

తరువాత హమీర్, మీనా ఐదు బెడ్రూముల ఇల్లు కొన్నా, తను ఇంకా యాభయ్యోపడిలోనే వున్నాడు గనుక తన బతుకు కొంతకాలం తనే బతుకుతానని చెప్పి రావుగారు వున్నవూరు షికాగో నుంచీ కదల్లేదు. షికాగో నుంచీ డెన్వర్ గానీ, బౌల్డర్ గానీ ఎంతో దూరం లేదు గదా అని కూడా అన్నారు. ఆయన ఆలోచనల అంతరార్థం కొంతకాలానికి మిగిలినవాళ్లకి తెల్సిసింది – తన కంపానియన్‌ని ఆయన మూర్తిగారింటికి ఆయన బర్త్‌డే పార్టీకి – అదే, క్రిస్మస్ పార్టీకి – తీసుకువచ్చి పరిచయం చేసినప్పుడు.

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – పదవ భాగం
10

ఫిబ్రవరిలో అమానిని చివరిసారి కలిసినప్పటినించీ హమీర్ కొద్దిగా డిప్రెషన్లో గడిపాడనే చెప్పవచ్చు. ఒకపక్క దగ్గరగా వచ్చిందనుకున్న వ్యక్తి దూరమయిందన్న విషాదం. రెండోపక్క తనకు నచ్చిన అమానీకి ఏమీ చెయ్యలేకపోతున్ననే బాధ. ఇంకోపక్క ముదస్సర్ చేసిన అఘాయిత్యం గూర్చిన వార్తలు ఏ క్షణాన వినవలసి వస్తుందోనని మనిషిగా భయం. దానితోబాటే అమెరికన్ పౌరుడిగా తను ప్రభుత్వంతో సమాజానికి రాబోయే ప్రమాదంగూర్చి తనకు తెలిసిన విషయాన్ని పంచుకోవాలా వద్దా అన్న సందేహం. ఒకవేళ అలా ప్రభుత్వానికి ఆ వార్తని చేరవేస్తే ఒక్క ముదస్సరే కాక అమానీ కుటుంబం, అటు ఏ పాపం ఎరుగని ముదస్సర్ తండ్రి కుటుంబం – రెండు కుటుంబాలూ తమ తప్పేం లేదని నిరూపించుకోగలిగినా సమాజంలో తోటివాళ్ల మధ్య తలెత్తుకుని తిరగలేక స్వంత బిజినెస్‌లని కూడా వదులుకుని ఇంకోచోటికి వెళ్లవలసి వస్తుందన్న ఎరుక. అమెరికాలో ఎన్నేళ్లు కష్టపడితే ఈనాడు అమాని తండ్రిగానీ ముదస్సర్ తండ్రిగానీ తమ బిజినెస్సుల్లో నిలదొక్కుకో గలిగారో అనుకున్నాడు.

తన దగ్గర వున్నది ఒక్క అమానీ కాంటాక్ట్ మాత్రమేనని కూడా అతనికి గుర్తుంది. ఆమె లాస్ట్ నేమే తనకి తెలియదు! ఆమె చెప్పిన వేటినీ అతను వెరిఫై చెయ్యడానికి కావలసిన వివరాలు అతని దగ్గర లేవని మాత్రం తెలుసు. ఇంక పోలీసుల దగ్గరకి వెళ్లి ఏం చెబుతాడు? ఒకవేళ ఆమె చెప్పినవన్నీ కట్టు కథలేమో? తనమీద సానుభూతిని అతని వద్దనుంచీ సంపాదించుకోవడానికి వేసిన నాటక మేమోనన్న సందేహం కూడా అతనికి వచ్చింది. కానీ, ఆమె బోట్ రైడ్‌లో ఇచ్చిన ముద్దూ, తన శరీరంతో పంచుకున్న క్షణాలని స్పష్టంగా ఆనందించినట్లు కనబడడం అతనికి గుర్తొచ్చి ఆమెని అనవసరంగా అనుమానిస్తున్నానని కూడా అతనికి అనిపించి సిగ్గుపడ్డాడు.

మార్చ్ నెలలో బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి గూర్చి వినగానే హమీర్‌కి మైండ్‌లో బాక్‌గ్రవుండ్‌లోకి తోసిన ముదస్సర్ గూర్చిన ఆలోచనలు ఠక్కున ముందుకి వచ్చాయి. ముదస్సర్ గనుక అలాంటి వెపన్స్‌ని ఇంకా పోగు చేస్తూనే వుంటే ఇలాంటివాళ్ల కోసమే ఎరవేసి పట్టేసే FBI వాళ్లు అతణ్ణి ఈ పాటికి పట్టుకుని వుండుంటార్లే అని సమాధానపడ్డాడు.  పైగా, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ కాండిడేట్స్ డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క, టెడ్ క్రూజ్ ఇంకొక పక్క ముస్లిముల మీద నిఘా వేసి వుంచుతాము అని గట్టిగా ప్రకటన లివ్వడంతో అసలు ఈ పాటికి ప్రభుత్వం ఆ పని చేస్తూనే వుండి వుంటుంది అని కొందరు కొలీగ్స్ అనడం అతను విన్నాడు గనుక అది ముదస్సర్‌ని భయపెట్టి చెక్‌లో వుంచడానికి తోడ్పడుతుందని ఆశపడ్డాడు. మళ్లీ, ప్రాణాలకే తెగించే వాడికి భయ మెక్కణ్ణించీ వస్తుంది అని కూడా తనని తనే ప్రశ్నించుకున్నాడు. అలాగని, ఏ క్షణాన ముదస్సర్ ఏం చెయ్యబోతున్నాడో అని అతను భయపడకుండానూ లేడు.

ఈ ఆలోచనల, భయాల మధ్యలో అతను నలుగుతుండగా జూన్ నెల రానే వచ్చింది.

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో దిగి వాన్ రెంట్ చేసుకుని మరిపోసాలో బెస్ట్ వెస్టర్న్ ఇన్‌కి హమీర్, సరోజగారు మూర్తిగారి కుటుంబ సభ్యులతో కలిసి చేరేసరికి సాయంత్ర మయింది. మూర్తిగారు, ఆండ్రూ లాబీలోకి వెళ్లి చెక్-ఇన్ చేసి రూమ్ కీస్ తీసుకువచ్చారు.

“ఈ హోటల్ మనవాళ్లదే,” అన్నారు మూర్తిగారు.

“మరే, మన చుట్టాలది!” అన్నారు భవానిగారు.

“కాదు. మన దేశీయులది, అని! రిసెప్షనిస్ట్ ఓ తెల్లావిడే గానీ, ఆవిడ వెనక ఆంజనేయస్వామి ఫోటోవుంది. లోపల ఓం జయ జగదీశ హరే అంటూ హారతిస్తున్నారు!” జవాబిచ్చారు మూర్తిగారు.

మూర్తిగారు, భవానిగారు, రోహిత్‌లు ఒక రూమ్‌లోనూ, ఆండ్రూ, విదుషి మరో రూమ్‌లోనూ, సరోజగారు, హమీర్‌లు ఇంకో రూమ్‌లోనూ సర్దుకున్నారు. హోటల్‌నించీ బయటపడి నాలుగంగలు వేస్తే వచ్చే పిజ్జా ప్లేస్ కెళ్లి డిన్నర్ కానిచ్చారు.

మరునాడు పొద్దున్నే స్విమ్మింగ్ పూల్ పక్కనున్న రూమ్‌లో ఎరేంజ్ చేసిన బ్రెక్‌ఫాస్ట్ చెయ్యడానికి అందరూ బయలుదేరుతుంటే, “రూమ్‌లో హీట్ లేదు కదా! నాకు ఫర్లేదు గానీ మామ్‌కి మాత్రం రాత్రి బాగా చలేసింది,” అన్నాడు హమీర్.

“వాళ్లు హీట్ ఆఫ్ చేసేసినట్లున్నారు వింటర్ అయిపోయిందని. మనకింకా చలిగానే వున్నది,” అన్నారు మూర్తిగారు.

“లెట్స్ గో అండ్ కంప్లైన్!” అన్నాడు ఆండ్రూ.

వాళ్లని బ్రెక్‌ఫాస్ట్ చెయ్యడానికి పంపి, మేనేజర్‌తో కంప్లైన్ చెయ్యడానికి ఆండ్రూ, హమీర్ వెళ్లొచ్చి వాళ్లని ఆ లౌంజ్‌లో జాయిన్ అయారు. అక్కడ మీనా తన తల్లితో మాట్లాడుతూండడాన్ని చూసి హమీర్ ఆశ్చర్యపోయాడు. మూర్తిగారు కూడా మీనా తండ్రి రావుగారితో మామూలుగానే మాట్లాడుతూ కనిపించారు. హమీర్ రావడాన్ని చూసి రావుగారు, మీనా మెల్లిగా వాళ్ల టేబుల్ దగ్గరనుంచీ వెళ్లిపోయారు. సరోజగారు మీనాతో మాట్లాడుతున్నదంటే మీనాని ఆవిడ క్షమించేసినట్లా? హమీర్‌కి అర్థంకాలేదు.

బ్రెక్‌ఫాస్ట్ అయిన తరువాత అతనితో ఎవరూ మీనా ప్రసక్తి తేకుండానే యోసమిటికి బయలుదేరారు. వాన్‌ని ఆండ్రూ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్క సీట్లో మూర్తిగారు కూర్చున్నారు. మధ్య వరుసలో వున్న రెండు సీట్లల్లో సరోజగారు, భవానిగారు కూర్చున్నారు. విదుషి, హమీర్, రోహిత్ చివరి రోకి పరిమిత మయ్యారు.

హైవే 140 మీద వెడుతున్నప్పుడు అన్నివైపులా కనిపిస్తున్న సీనరీని చూసి అందరూ  అచ్చెరువందారు. వెడుతున్నప్పుడు రెండుపక్కలా కొండలమీద చెట్లతోబాటు దూరంగా ముందుకూడా కొండల వరుస కనిపిస్తోంది.  అంటే, కొద్దిసే పయిన తరువాత రోడ్డు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న కొండల చుట్టూ కూడా మెలికలు తిరిగి సాగుతుందన్నమాట.  ఎడమవైపున దాదాపు రోడ్డు నానుకుని మెర్సెడ్ రివర్ ప్రవహిస్తుంటే రెండోవైపున రోడ్డు నానుకునే కొండ మొదలవుతోంది. ఆ నదికి ప్రారంభం ఆ కొండలమీద వింటర్లో పడ్డ మంచు కరగడం అని ఆండ్రూ చెప్పాడు.

“మన గంగా నది హిమాలయాల్లో పుట్టినట్లు!” అన్నారు భవానిగారు.

రోడ్డుపక్కగా కారు నాపి, దిగి, ఫోటోకోసం ఆ ఒడ్డుమీద నిలుచుని కాసేపు ఆ నీటి గలగలలని విన్నారు. ఆ గలగలలు, ప్రవహిస్తున్న నీరు అడ్డంగా వున్న కొండరాళ్లతో జరిపే సంభాషణలు.

మళ్లీ వాన్‌లో వెళ్లడం మొదలుపెట్టిన తరువాత గుర్తొచ్చిన టెన్నిసన్ పోయెమ్‌ని విదుషి పెద్దగా చదివింది.

I chatter over stony ways,

In little sharps and trebles,

I bubble into eddying bays,

I babble on the pebbles.

I wind about, and in and out,

With here a blossom sailing,

And here and there a lusty trout,

And here and there a graying.

I slip, I slide, I gloom, I glance,

Among my swimming swallows,

I make the netted sunbeam dance,

Against my sandy shallows!

And out again I curve and flow,

To join the brimming river,

For men may come and men may go

But I go on forever!

“నిజమే కదా, ఈ నది ఎన్నివేల సంవత్సరాలనుండీ ప్రవహిస్తోందో! మనుషు లొస్తున్నారు, పోతున్నారు!” అన్నది.

“అయామ్ ఇంప్రెస్డ్!” అన్నాడు ఆండ్రూ రేర్ వ్యూ మిర్రర్‌లో చూస్తూ. “ఎప్పుడు చదివావ్ దీన్ని?”

“హైస్కూల్లో!”

“యువర్ మెమరీ ఈజ్ వెరీ గుడ్!”

“దట్స్ వై యు హావ్ టు బి కేర్‌ఫుల్ విత్ హర్. నువ్వు ఈపాటికి ఏమేం అన్నావో అన్నింటినీ రికార్డ్ చేసి పెట్టుకుంది. దే విల్ బి యూజ్డ్ ఎగైన్స్ట్ యు!” అన్నాడు రోహిత్ వెనక సీట్లోంచి.

“అనుభవంతో చెబుతున్నట్లున్నావ్!” అన్నాడు ఆండ్రూ.

“ఆబ్సొల్యూట్లీ. గుర్తున్నంత వరకూ కనీసం ఇరవయ్యేళ్ల అనుభవం!”

“ఆ పోయెమ్‌లో ఒక వీక్‌నెస్ చెప్పనా?” అడిగాడు ఆండ్రూ.

“వద్దన్నా చెబుతావ్ గదా, అడగడ మెందుకు?” అన్నది విదుషి.

“ఎందుకే పాపం అతన్ని అంతలేసి మాట లంటావ్?” అన్నారు భవానిగారు అల్లుడి మీద జాలితో.

“థింక్ అబవుటిట్ లాజికల్లీ. ఎక్కడో కొండమీద కొన్ని మంచుకణాలు కరిగి ఒక నీటిబిందువుగా మారతాయి. అలాంటి గజిలియన్ల నీటి బిందువులన్నీ కలిసి ప్రహించి కొంతకాలం తరువాత సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్రంలో నీరు ఆవిరయి ఎక్కడో వాన రూపంలోనో లేక హిమాలయాల్లోనో, కిలిమంజారోమీదో, లేకపోతే వింటర్లో మన చుట్టుపక్కలో మంచురూపంలోనో కురుస్తాయి. అంటే, అదే నీటిబొట్టు ఎప్పుడూ ఒకేనదిలో గానీ, ఒకే బ్రూక్‌లో గానీ వుండట్లేదన్న మాట!” అన్నాడు ఆండ్రూ.

“భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆత్మ లాంటి దన్నమాట ఈ నీటిబిందువు!” అన్నారు మూర్తిగారు.

“హైస్కూల్లో వరల్డ్ రెలిజియన్స్ క్లాస్‌లో చదివాం – హిందువులు ఆత్మకు మరణం లేదని నమ్ముతారని. ఈ నీటిబిందువు కూడా అలాంటిదే నంటున్నాడు ఆండ్రూ,” అన్నాడు హమీర్.

“నీ లాజిక్ ప్రకారం, నది అంటే, కోండల్లో మొదలై, సముద్రం చేరేదాకా నీళ్లు పోవడానికి భూమిమీద చేసిన ఒక gash – పర్ర మాత్రమే!” అన్నది విదుషి.

“కరక్ట్!” అన్నాడు ఆండ్రూ.

ముందు రెడ్ లైట్ కనిపించి వాన్ ఆగితే, “కొండల మధ్యలో కూడా సిగ్నల్ లైట్లుంటయ్యన్నమాట!” అన్నారు మూర్తిగారు. గ్రీన్ లైట్ వచ్చి బయలుదేరిన తరువాత వాళ్లకి అర్థమైంది – టెంపరరీగా వేసిన ఒక వంతెన మీంచి ఆ నదిని దాటి అవతలిపక్క ఒడ్డుమీద ప్రయాణించడం కోసం దాన్ని వేశారనీ, ఆ వంతెన ఒక కారు మాత్రమే పట్టే వెడల్పు వుండడంవల్ల రెండువైపులా ట్రాఫిక్ వెళ్లడానికి ఆ బ్రిడ్జిని ఉపయోగించేలా నియంత్రించడానికి ఆ లైట్ కావలసి వచ్చిందనీ.

(మెర్సెడ్ నదిని దాటడానికి వేసిన టెంపరరీ బ్రిడ్జ్; రాక్‌స్లైడ్‌ని కుడిపక్కగా కింద చూడొచ్చు)

“దీన్ని నది అన్నారుగానీ, ఒక యాభై గజాల వెడల్పు కూడాలేదు. అదే, కృష్ణా, గోదావరులైతే కనీసం కిలోమీటరు వెడల్పుంటాయ్ అన్నారు సరోజగారు.

“మీరు చెబుతోంది విజయవాడ దగ్గరి కృష్ణానది గూర్చీ, రాజమండ్రి దగ్గరి గోదావరి గూర్చీను. కొండల్లో పుట్టినచోట అవికూడా సన్నగానే వుంటయ్!” అన్నారు మూర్తిగారు.

“లుక్ ఆన్ ది రైట్ సైడ్! యు విల్ సీ ది రీజన్ ఫర్ దిస్ డీటూర్,” పాయింటవుట్ చేశాడు ఆండ్రూ. తాము అటువైపు ప్రయాణించిన రోడ్డులో ఒక ఫర్లాంగ్ మేర పక్కనున్న కొండమీంచి జారిపడిన మట్టీ, రాళ్లూ కలిసి ఆ దారిని కప్పేశాయి. దానికి రెండువైపులా వున్న హెవీ కన్స్‌ట్రక్షన్ ఎక్విప్‌మెంట్‌ని చూస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నం మొదలైందని అర్థమయింది.

(Rockslide over Highway 140)

ఎదురుగా వచ్చే ట్రాఫిక్కే లేకుండా అలా ఒక అరమైలు ప్రయాణించిన తరువాత కుడివైపున వున్న బ్రిడ్జ్ మీద ఆ నదిని దాటి మళ్లీ ఆ నదికి కుడివైపు ఒడ్డుమీద ప్రయాణించడం మొదలుపెట్టారు.

యోసమిటి నేషనల్ పార్క్‌లో ప్రవేశించడానికి ఎంట్రన్స్ ఫీ కట్టి, అదే రోడ్డుమీద వంద గజాలు కూడా ప్రయాణించకుండానే కుడిపక్కన మెర్సెడ్ నదీ, దానికి రెండుపక్కలా హుందాగా రెండు కొండల వరుసలూ ప్రకృతి అందాలకి వన్నె లద్దుతూ కనిపించాయి. ఇక్కడ కొండరాళ్లు వాళ్లు ముందు చూసిన రాళ్లకంటే చాలా పెద్దవి. నది ఉరవడికూడా ఎక్కువగానే వున్నది. ఆగి ఫోటోలు తీసుకున్నారు గానీ, చూడడానికి ఇంకా చాలా వున్నాయి అని మళ్లీ వాన్ ఎక్కి బయలుదేరారు.

కొంచెం దూరం ముందు కెళ్లిన తరువాత రోడ్డుకు ఎడమపక్క కార్లు ఆపివుండడాన్ని గమనించి వాళ్లూ వాన్‌ని పార్క్ చేసి దిగారు. ఎంట్రన్స్ ఫీ రసీదుతోబాటు ఇచ్చిన మాప్ చూసి, “ఎదురుగా కనిపిస్తున్నది ఎల్ కాపిటన్ – ది కేప్టెన్!” అన్నారు మూర్తిగారు.

(El Capitan)

”నీకు గుర్తున్నదా, క్రితం ఏడాది జనవరిలో ఇద్దరు కుర్రాళ్లు ఇంత స్టీప్‌గా కనిపిస్తున్న ఈ ఫేస్‌ని సేఫ్టీ హార్నెస్ లేవీ లేకుండానే వట్టి చేతులతో ఎక్కడం?” ఆండ్రూ విదుషికి గుర్తుచేశాడు.

“ఐ డూ రిమెంబర్!” అన్నాడు హమీర్.

“ఈ ఫేస్‌ని వట్టి చేతులతో ఎక్కారా!” ఆశ్చర్యపోయారు భవానిగారు.

“వాళ్లమ్మ ఎట్లా ఎక్కనిచ్చిం దసలు?” కనిపిస్తే నాలుగు చివాట్లు పెడతానన్న ధోరణిలో అడిగారు సరోజగారు.

వాన్ ఎక్కిన తరువాత, “నెక్స్ట్ స్టాప్ యోసమిటి విలేజ్?” అడిగాడు ఆండ్రూ.

“దానికన్నా ముందే చాలా దగ్గర్లో Bridal veil ఫాల్స్ వున్నాయి, చూద్దామా?” మాప్‌ని చూసి అడిగాడు రోహిత్. అయితే, దాన్ని చూడడానికి వాన్‌ని పార్క్ చేసిన తరువాత ట్రెయిల్ పట్టుకుని కొంతదూరం నడవా ల్సొచ్చింది. తీరా అది కనిపించిన తరువాత, పీలగా వున్న ఆ ఫాల్స్‌ని చూసి, “రాజుని చూసిన కళ్లతో మొగుణ్ణి చూస్తే మొట్టబుధ్ధయిందన్న సామెతలాగా, నయాగరా ఫాల్స్‌ని చూసిన కళ్లకి ఇది ఏమాత్రం ఆనడంలేదు!” అన్నారు సరోజగారు.

మళ్లీ వాన్ ఎక్కి యోసమిటీ విలేజ్ దగ్గర ఆపి దిగిన తరువాత, “ఇక్కణ్ణించీ వెర్నల్ ఫాల్సూ, నెవాడా ఫాల్స్‌ల దగ్గరికి ట్రెయిల్స్‌మీద నడుచుకుంటూ వెళ్లాలి,” అన్నాడు ఆండ్రూ.

“ఎంత దూరం నడవాలి?” అడిగారు భవానిగారు.

“అదే ట్రెయిల్ మీద నడుచుకుంటూ పోతే హాఫ్ డోమ్ దాకా వెళ్లొచ్చు. నేను రేప్పొద్దున్న చేసేది అదే. రౌండ్ ట్రిప్ పధ్నాలుగు గంటలు పడుతుంది,” అన్నాడు.

“అంతదూరం మేం నడవలేంగానీ, ఒక గంట నడుద్దామా?” అన్నారు భవానిగారు.

“లంచ్ చేసి బయలుదేరదామా?” అన్నది విదుషి.

“అంతగా జనాల్లేరు గానీ, ఇంకొకవారం ఆగితే స్కూళ్లు క్లోజ్ చేస్తారు గనక్ ఫ్యామిలీ వెకేషన్స్‌కి వచ్చేవాళ్లతో ఈ ప్లేస్ బిజీగా వుంటుంది,” అన్నాడు ఆండ్రూ చుట్టూ చూసి.

వాళ్లు పిజ్జాలు తెచ్చుకుని బయట కూర్చుని తింటున్నప్పుడు, ఎదురుగా ట్రాష్ కాన్ కనిపిస్తే దానికి దగ్గరగా వెళ్లి చూసివచ్చారు మూర్తిగారు.

“ట్రాష్ కాన్‌ని గూడా అంత పరిశీలనగా చూడాలా?” అడిగారు భవానిగారు.

“అది మామూలు ట్రాష్ కాన్ గాదు, బేర్ ప్రూఫ్! అంటే, రాత్రిళ్లు ఇక్కడ ఎలుగుబంట్లు తిరుగుతూంట య్యన్నమాట!” అన్నారు మూర్తిగారు.

హమీర్‌కి బ్రైనార్డ్ లేక్ దగ్గరి తన అనుభవం గుర్తొచ్చింది.

“నువ్వు రేప్పొద్దున్న ఆరు గంటలకల్లా ట్రెయిల్ ఎక్కాలంటున్నావు. ఆ చీకట్లో బేర్స్ వుంటే?” భయంగా అడిగారు భవానిగారు.  ఆవిడకి కూడా హమీర్ అనుభవం గుర్తుంది.

“ఒక్కణ్ణే కాదుగా వెడుతోంది! రేపు హాఫ్ డోమ్ ఎక్కడానికి పర్మిషన్ వున్నవాళ్లంతా దాదాపు ఒకేసారి బయలుదేరాలి. పైగా, బేర్స్ చప్పుళ్లకి భయపడతాయి. అందుకని, అవి వుంటయ్యని తెలిసిన చోట్ల వాటికి, మేమొస్తున్నామని చెప్పడానికి గంట కొడుతూ నడుస్తూంటారు,” అన్నాడు ఆండ్రూ. ఆ జవాబుతో ఆమె మనసు కొంచెం కుదుటపడ్డది.

“రెస్ట్‌రూమ్‌కి వెళ్లొస్తా,” అని హమీర్ అటువైపు నడుస్తుంటే ఎదురుగా మీనా వస్తూ కనిపించింది.

“నన్ను వెంటాడుతున్నా వెందుకు?” అన్న హమీర్ ఆలోచనలు అతని పెదాలగుండా వెలువడబోతున్న క్షణంలో ఆమె నోట్లోంచి “అయామ్ సారీ!” అన్న మాటలు వెలువడ్డంవల్ల అతని నోట్లోనే ఆగిపోయాయి. ఆమె కళ్లు అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ అతనికి అర్థం అయినట్లేవుండి, గుప్తంగా వుండే భావాలని అతనికి చేరవేశాయి.

“నన్ను వెంటాడడానికి ఇంత దూరం రావాలా?” అతను అనుకున్నంత తీవ్రత మాటల్లో వుండకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలగజేసింది.

“వాటిఫ్ ఐ సే ఐ విల్ కమ్ టు ది ఎండాఫ్ ది ఎర్త్?” ఎదురు ప్రశ్న వేసింది మీనా.

ఆమె అందించిన ఆలివ్ బ్రాంచ్‌ని అందుకోవడానికి సిధ్ధంగా లేక, “టూ లేట్ ఫర్ దట్!” అని అక్కణ్ణుంచీ కదిలాడు. “ఎంత పొగరు! పెళ్లక్కర్లేదని వెళ్లిపోయి, ఒక్క అయామ్ సారీతో మా క్షోభ నంతటినీ మరచిపొమ్మంటోంది!” తనలో గొణుక్కున్నాడు.

ఆమె మెడ వంపులో తన తలని ఆనించడాన్ని అతను మరునాడు కోరుకుంటాడని అతనికి ఆ క్షణాన తెలియదు.

లంచ్ అయిన తరువాత పక్కనే వున్న విజిటర్స్ సెంటర్‌కెళ్లి అక్కడ 3-డి లో అమర్చిన యోసమిటి నమూనా చూశారు. గ్లేసియర్ కరిగి ఆ నీరు ప్రవహించడంవల్ల ఆ వ్యాలీ ఏర్పడిందని తెలిసి ఆశ్చర్యపోయారు. అందువల్లే కొన్ని కొండల ఉపరితలం బాగా నున్నగా వున్నదనీ, కొండల్లాగా కనిపిస్తున్న కొన్ని ఇసుక, రాళ్లూ కలిసి వేసిన మేట మాత్రమే అనీ తెలిసి ముక్కుమీద వేలేసుకున్నారు – “ఇదంతా నీటి కోతవల్ల ఏర్పడిందా!” అంటూ.

“గ్రాండ్ కాన్యాన్ కూడా అలాగే ఏర్పడింది గదా!” అన్నారు మూర్తిగారు.

అక్కణ్ణించీ బయలుదేరి కర్రీ విలేజ్ దగ్గర్ వాన్‌ని పార్క్‌చేసి నడిచి హాపీ ఐల్స్ బ్రిడ్జి మీద మెర్సెడ్ రివర్‌ని దాటిన తరువాత కుడిపక్కన జాన్ మ్యూర్ ట్రెయిల్ కనిపించింది. అక్కడ నడిచే దారంతా తారు రోడ్డు వేసివుండడం ఒక్క ఆండ్రూకి తప్ప అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. దానిమీద నడవడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే కొండ ఎత్తు పెరుగుతూండడం తెలిసివచ్చింది. ఒకపక్కనించీ హోరున వినవస్తున్న నది శబ్దం, రెండోవైపునించీ దాన్ని డ్రౌన్ చేస్తున్నట్లుగా నడకే అలవాటులేనివాళ్లు పడుతున్న ఆయాసం.

“ఇంక నడవలేం,” అన్నారు భవాని, సరోజగార్లు.

“వెర్నల్ ఫాల్స్‌నయినా చూడండి వెనక్కి తిరిగేముందు. ఇంతదూరం వచ్చాం కదా!” అన్నాడు ఆండ్రూ.

“మెల్లిగానే నడవండి. తొందరేం లేదు గదా! నేను వీళ్లతో వస్తూంటాను. మీరు వెళ్లండి,” అన్నారు మూర్తిగారు. ఆ నడక ఆయనకీ ఆయాసాన్ని తెప్పిస్తోంది.

“అక్కడ వెంకటేశ్వరస్వామి గుడి వున్నది తెలుసా?” అన్నాడు రోహిత్.

“అదే  నిజమయ్యుంటే ఈపాటికి బస్సులు వెళ్లడానికి వీలయ్యేలా రోడ్లని ఎప్పుడో వేసేవాళ్లు. మాకీ నడక తప్పేది,” జవాబిచ్చారు భవానిగారు. విదుషి నవ్వి రోహిత్ భుజమ్మీద చరిచింది. కుర్రవాళ్లు నలుగురూ తొందరలోనే పెద్దవాళ్లకు కనిపించకుండా మాయమయిపోయారు.

ఆ నలుగురూ నడుచుకుంటూ వెర్నల్ ఫాల్స్ కనిపించే బ్రిడ్జ్ దగ్గరకి వచ్చేసరికి అది అక్కడ ఆ ఫాల్స్‌ని దాటడానికి వేసిన బ్రిడ్జ్ మాత్రమేననీ, దానిమీద నిల్చొని చూస్తే ఒకవైపున కొంచెం దూరంలో వెర్నల్ ఫాల్స్, దానికి వీపుపెట్టిచూస్తే డౌన్‌స్ట్రీంలో నీటిప్రవాహమూ కనిపిస్తయ్యని వాళ్లకి తెలిసింది. “నువ్వు మమ్మల్నేమీ చెయ్యలేవు చూసుకో,” అని చెబుతున్నట్టుగా పెద్దపెద్ద కొండరాళ్లు అడ్డంగా నిల్చుంటే వొదిగిపోతున్నట్టు నటిస్తూ వాటిచుట్టూ తిరిగిపోతోంది నది నీరు.   ఆ బ్రిడ్జ్‌ని దాటిన తరువాత ట్రెయిల్ ఎడమపక్కకి తిరిగి దాని ఒడ్డునే కొనసాగింది.

(Vernal Falls)

“నెక్స్ట్ స్టాపీజ్ వెర్నల్ ఫాల్స్! అంటే ఎదురుగా కనిపిస్తున్న ఫాల్స్‌మీంచి పడే నీటి ఎత్తుకి,” అన్నాడు ఆండ్రూ.

మాప్‌ని చూసి, “ఇక్కణ్ణించీ మైలుకిపైగా వున్నది దూరం. పైగా, ఇది ఫ్లాట్ గ్రవుండ్ మీద నడిచినట్టేం కాదు. నేను రాలేను,” అన్నది విదుషి.

(Vernal Falls Downstream view)

“అయితే నువ్విక్కడే ఆగిపోతావా? కాసేపట్లో మీ పారెంట్స్ కంపెనీ యిస్తారు?” అన్నాడు ఆండ్రూ. వాళ్లలాంటి విజిటర్లు అక్కడున్నారు కాబట్టి జంతువులు ఎటాక్ చేస్తాయనే భయమేమీ లేదు. అక్కడొక పెద్ద రాయిమీద ఆమె కూర్చున్న తరువాత ఆమెకు కెమేరాని ఇచ్చి హమీర్, రోహిత్‌లతో ఆండ్రూ బయలుదేరాడు. ఆ ఫాల్స్ ఇంకా యాభై అడుగుల ఎత్తులో వుందనగా ఆ జలపాతం నించీ వచ్చే తుంపర దారిలో రాళ్లమీద పడి జారిపడతామని భయపడేలా చేస్తోంది. అక్కడక్కడా హాండ్ రెయిల్స్ వున్నాయి గానీ కిందకు దిగేవాళ్లకి దారినివ్వడంకోసం కొన్నిచోట్ల పక్కకు తిరిగి నిలబడవలసి వచ్చింది. ఆ జలపాతం పడే చోటుకు పక్కగావున్న అబ్సర్వేషన్ డెక్‌మీదనించీ కిందకు చూసి, “అద్భుతం!” అనుకున్నారు.

“విదు డజన్ట్ నో వాట్ షి ఈజ్ మిస్సింగ్!” అన్నాడు ఆండ్రూ.

హమీర్, రోహిత్ అక్కణ్ణించీ వెనక్కు తిరుగుదా మన్నారు. సమ్మరే కదా అనుకుని వాళ్లిద్దరూ షార్ట్స్ వేసుకొచ్చారు. ఆ ఫాల్స్‌మీద నుంచీ పడ్డ తుంపరలు వాళ్ల కాళ్లని తడిపెయ్. దానివల్ల ఆ ఎత్తులో వాళ్లకి బాగా చలివేస్తున్న ట్లనిపించింది. సరే, ఎలాగో నేను రేపు వస్తాను కదా అనుకుని ఆండ్రూ కూడా వెనుదిరిగాడు.

కిందకు దిగడం తేలికయిన పనే కాబట్టి వాళ్లు త్వరగానే విదుషి కూర్చున్న చోటుని చేరుకోగలిగారు. అప్పటికి పెద్దవాళ్లు ముగ్గురూ అక్కడకు చేరుకున్నారు. వాళ్లతో మీనా, ఆమె తండ్రి రావుగారు మాట్లాడుతూ వుండడాన్ని చూసి, “వీళ్లు నన్ను బంకలా పట్టుకుని వున్నారెందుకని?” అనుకున్నాడు హమీర్. పొద్దున్న బ్రెక్‌ఫాస్ట్ టైమ్‌లో మూర్తిగారు వాళ్లతో మాట్లాడడం చూశాడు కాబట్టి ఇప్పుడతనికి అది ఆశ్చర్య మనిపించలేదు.  మూర్తిగారు రావుగారికీ, మీనాకీ ఆ ఫాల్స్ బాక్‌గ్రవుండ్‌లో ఫోటో తీసి, తమ ఏడుగురికీ తియ్యమని కెమేరాని రావుగారి కిచ్చారు.

కిందకు దిగిన తరువాత అలాగే ముందుకు పోతే మిర్రర్ లేక్ చూడచ్చన్నాడు ఆండ్రూ. కాదు, ఇంక నడవలేం, ఎడమవైపుకు తిరిగి హాపీ ఐల్స్ బ్రిడ్జీని దాటి పార్కింగ్ లాట్‌కి వెడదామన్నారు భవాని, సరోజ గార్లు. సరే, వాళ్లకి మరునాడు హాఫ్ డోమ్‌ని గ్లేసియర్ పాయింట్‌నించీ చూపించిన తరువాత ఆ లేక్ దగ్గరికి తీసుకెళ్లు అని విదుషికి చెప్పాడు ఆండ్రూ.

వాన్‌లో బయలుదేరిన తరువాత కాసేపు మౌనంగా బయటకు చూస్తూ కూర్చున్నాడు హమీర్. మిగిలినవాళ్లు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోలేదు. కాసేపటికి బర్‌స్ట్ అయ్యాడు – “వాళ్లతో మీరెట్లా మాట్లాడగలుగుతున్నా రసలు? మామ్, నువ్వు కూడా!” అంటూ.

అతను అన్న ఆ “వాళ్లు” ఎవరో అందరికీ అర్థమయిన తరువాత వాన్‌లో కాసేపు నిశ్శబ్దం చోటుచేసుకుంది. విదుషి ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసింది – “వావ్! అనుకున్న దానికన్నా ఎక్కువసేపే కంట్రోల్ చేసుకున్నావ్,” అంటూ.

“యు మీన్ – దిస్ వజ్ ప్లాన్డ్?” హమీర్ ఆశ్చర్యపోతూ అడిగాడు. “వై ఈజ్ దిస్ కాన్‌స్పిరసీ? మామ్, హౌ కుడు యు జాయిన్ దెమ్?” కోపంగా అడిగాడు.

“ఇందులో కాన్‌స్పిరసీ ఏమున్నదిరా. ఒకప్పుడు నువ్వు చేసుకుందా మనుకున్న అమ్మాయే కదా!” అన్నారు సరోజగారు.

“నీకు చేసిన అవమానాన్ని అంత తేలిగ్గా ఎలా తీసిపారెయ్య గలుగుతున్నావ్?” కోపానికి చికాకుని కలగలిపి అడిగాడు.

“పిల్లలన్న తరువాత తప్పు చెయ్యకుండా ఎలావుంటారు? అయినా, అందులో ఆ పిల్ల తప్పేమున్నది? తల్లి మనసు నొప్పించకుండా వుండడంకోసం తన జీవితాన్నే శాక్రిఫైస్ చెయ్యడానికి సిధ్ధపడిందిగదా – నీలాగే?” అన్నారావిడ.

“ఇప్పుడా తల్లే పోయేసరికి ఆ శాక్రిఫైస్ అవసరం లేకుండా పోయిందన్నమాట!” వ్యంగ్యంగా అన్నాడు.

“ఇప్పటిదాకా పెళ్లికి నో చెప్పినా, ఆవిడే బ్రతికుంటే ఇంకో సంవత్సరం అయిన తరువాత అయినా ఆవిడ మనసు నొప్పించకుండా వుండడంకోసం ఇంకొకళ్లని పెళ్లి చేసుకుని మీనా ఎంత బాధపడేదో ఆలోచించు!” అన్నది విదుషి.

“ఇది తెలుగు సినిమా శాక్రిఫైస్! అమెరికాలో పుట్టి, పెరిగి, ఇలా ఆలోచించే వాళ్లుంటారా?” పక్కనే కూర్చున్న విదుషివైపు తిరిగి అడిగాడు హమీర్.

“నువ్వు, మీనా ఒక విధంగా స్పెషల్. విదుషికి రోహిత్ వున్నాడు గానీ, రావుగారి తరువాత మీనాకీ, నా తరువాత నీకూ రక్త సంబంధీకులు ఇంకెవరుంటారు? మీరేమో ఇండియా వచ్చి సెటిలయే ఆలోచననే దగ్గరకు రానివ్వరు. మీకీ దేశంలో అంకుల్స్ గానీ, కజిన్స్ గానీ లేరు. మేమంటే చిన్నప్పటినించీ మా కజిన్స్‌తోనూ, అంకుల్స్‌తోనూ, ఆంటీలతోనూ అనుబంధాలతో పెరిగాం గానీ, మీరు ఇండియా వచ్చినా గానీ ఇండియాలో వున్నా గానీ హలో అంటే హలో అనుకునేటంత తప్ప మీకు వాళ్లతో బంధా లేముంటాయి? మీ డాడీ, నేనూ ఇక్కడికొచ్చిన దగ్గర్నుంచీ ఇక్కడ బతకడం గూర్చే చూసుకున్నాం తప్పితే, ఈ విషయా న్నెప్పుడూ ఆలోచించలేదు. తరువాతి తరంగూర్చి మా మొదటి తరం వాళ్లు అంతగా ఆలోచించరేమో!” అన్నారు సరోజగారు.

“ఎప్పటినించీ ప్లాన్ చేశావ్?” విదుషిని అడిగాడు హమీర్.

“నువ్వు లాస్ట్ సెప్టెంబర్లో బౌల్డర్ వెళ్లే ముందునించీ.”

హమీర్ షాకయ్యాడు. “అంటే, డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో మీనా నన్ను కలవడం యాక్సిడెంట్ కాదన్నమాట!”

“ఏమాత్రం కాదు. నీ ట్రిప్ ఐటినరరీని నువ్వు మామ్‌కిచ్చినా గానీ, అందువల్ల నాకు తెలిసినా గానీ, అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నిన్నెట్లా కలవగలదో అని మీనా బెంగపెట్టుకుంది. నీకు గుర్తుందో, లేదో, నువ్వు వెనక్కి తిరిగివచ్చే రోజున ఎయిర్‌పోర్ట్‌లో నువ్వెక్కడ వున్నావని నీకు ఫోన్ చేసి ఎందుకు కనుక్కున్నా ననుకున్నావు? తను నిన్ను తప్పకుండా కలవగలిగేలా చెయ్యడంకోసం! ఆ ముందురోజు రాత్రి నువ్వు ఆండ్రూతో మాట్లాడుతునప్పుడు నీ ఫ్లయిట్ వివరాలు కన్‌ఫర్మ్ చేసుకోవాలని తనకి గుర్తులేదు. కనీసం మాట్లాడుతోంది నీతోనని నాకు చెప్పివుంటే అప్పుడు నేనయినా గుర్తుచేసి అడిగించేదాన్ని,” అన్నది విదుషి.

“నేను చెప్పానా, విదుషి మెమరీ ఎంత పవర్ఫుల్లో! సీ ఆండ్రూ, తొమ్మిది నెలల తరువాత కూడా ఎలా గుర్తుపెట్టుకుందో!” అన్నాడు రోహిత్.

“యు ఆర్ టెల్లింగ్ మి! ఐ హియర్ ఇట్ ఎవిరి డే,” జవాబిచ్చాడు ఆండ్రూ.

“ఎనీవే, ఇట్ వజ్ ఎ బ్లెస్సింగ్ ఆల్సో. ఆండ్రూ ఆ వివరాలు కనుక్కోకపోవడంవల్ల నేను రియల్‌టైమ్‌లో మీనాని నీ దగ్గరకు గైడ్ చెయ్యడానికి వీలయ్యింది.”

పాత గాయం ఇంకా మదిలో సలుపుతూండడంచేత హమీర్ వ్యంగ్యంగా అన్నాడు – “అంటే, వాళ్లమ్మ పోయిన మూణ్ణాలుగు నెలలకే అడ్డం తొలగింది కదా అని ఎగురుకుంటూ వచ్చిందన్నమాట!”

“మరీ అంత తిక్కగా మాట్లాడకు! అంతగా ఎగురుకుంటూ వచ్చేదే అయితే ఆవిడ పోయిన మరునాడే నీకు ఫోన్ చేసేది!” విదుషి కోపంగా జవాబిచ్చింది.

“మూణ్ణాలుగు నెలలు ఆగితే చాలని ఎవరు చెప్పారో?”

“వాళ్లమ్మ బిహేవ్ చేసిన తీరు అసభ్యంగా వున్నదని వాళ్ల డాడీ చెప్పార్ట. మీ అమ్మ పెళ్లంటే ఒక పిల్లాణ్ణీ, ఒక పిల్లనీ కలిపి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేస్తే చాలు అనే భ్రమలో వున్నది, మాకప్పుడు ఆ సమాజంలో అది తప్పలేదు గానీ, మీ జెనరేషన్లో వాళ్లు మీరంతట మీరే నిర్ణయించుకున్న తరువాత మేం కాదని అనడం మూర్ఖత్వం అవుతుంది, అని ఆయన మీనాకి చెప్పార్ట. ఇటు భార్య మాటకి ఎదురుచెప్పి ఆవిణ్ణి నొప్పించడం యిష్టంలేక, అటు కూతురు బాధపడడం చూసి తట్టుకోలేక తను పోకపోవడమే ఆశ్చర్యకరం అన్నాట్ట ఆయన. అందుకే, వాళ్లమ్మ పోయిన పదిరోజులకే మీనాని కూర్చొబెట్టి, ఇప్పుడు నీకు ఒకే పేరెంటు, హమీర్‌కీ ఒకే పేరెంటు. నువ్వు పెళ్లిచేసుకునే వాడెవడో, ఏదో చుట్టపు చూపుగా తప్ప నన్ను నీ ఛాయలకే రానివ్వనంటే ఏం చేస్తావ్? అని అడిగార్ట. ఆ సంగతి అమ్మనే అడక్కపోయారా అన్నదట మీనా. ఆయన అడిగాట్ట. ఒకవేళ తనే పోతే ఆవిడ పరిస్థితి ఏమవుతుందని. ఆవిడ మొండిగా, దానిగూర్చి నేను ఆలోచించను. ఆ అవసరం వచ్చినప్పుడు చూస్తాలే అన్నదట!”

“ఈ గోలేదో తను డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లోనే చెప్పొచ్చుగా! ఈ హైడ్ అండ్ సీక్ దేనికి?” మీనామీద తనకోపం ఐస్‌క్రీమ్‌లా కరుగుతుండగా అడిగాడు హమీర్.

“నువ్వు హర్ట్ అయ్యావని తెలుసు. పైగా, బ్రేక్ అయిన తరువాత మొదటిసారి కలిసినప్పుడు, మా అమ్మ పోయింది, మనమింక పెళ్లిచేసుకోవచ్చు అని ఎలా చెబుతుంది? నువ్వు చాలా హోస్టైల్‌గా బిహేవ్ చేశావని చెప్పిందిలే, ఏడుస్తూ. నీకో విషయం తెలుసా? ఆ ఎయిర్‌పోర్ట్‌లో తను నిన్ను కలిసిన తరువాత ఏ వూరికీ వెళ్లలా. తిన్నగా బౌల్డర్లోని తనింటికే వెళ్లింది.

“నాతో శాన్ ఫ్రాన్సిస్కో వెడుతున్నట్లు చెప్పిందే!”

“అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నిన్ను సెక్యూరిటీ క్లియరెన్స్ అయిన తరువాత గేటు చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడా ష్యూర్‌గా కలవడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే, తనుకూడా ఎక్కడికో ఒకచోటికి వెళ్లడానికి టికెట్ కొనుక్కోక తప్పలేదు. నీ ఐటినరరీని మామ్ దగ్గర తీసుకున్నాను. నువ్వు ఏ వూరెళ్లినా మాకు ఆ డీటెయిల్స్ ఇచ్చిగానీ వెళ్లకూడదని రూలుంది గదా మరి! నీ ఫ్లయిట్ ఎన్నింటికో చెప్పాను. అలాగే నువ్వు కాఫీ ఎక్కడ కొనుక్కుంటున్నావో చెప్పాను. అప్పటికీ, నిన్ను దూరంగా చూసిన తరువాత కలవకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోదా మనుకున్నదిట. ఫోన్లో నాకు చెబితే కోప్పడ్డాను. వాడికి ప్రస్తుతం గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, ఇంకా డిప్రెషన్లోనే వున్నాడు, పైగా, మా పేరెంట్స్ గానీ, ఇండియాలోవున్న ఆంటీగానీ ఏ పెళ్లి సంబంధం చెప్పినా ఇంటరెస్ట్ చూపించట్లేదు అని వున్న నిజాన్ని చెప్పి నేనే ఎంకరేజ్ చేశాను నిన్ను కలవకుండా వెళ్లొద్దని!” అన్నది విదుషి.

“అయితే, తనూ, వాళ్ల నాన్నా ఈ ట్రిప్పుకి ముందరే మీతో మాట్లాడి వుంటారు,” అన్నాడు హమీర్ ముందు సీట్లల్లో కూర్చున్న పెద్దవాళ్లవైపు చూస్తూ. మొహాలు అతనికి కనిపించకపోయినా, వాళ్ల మౌనమే అతనికి జవాబిచ్చింది.

“వాళ్లమ్మ పోయిన తరువాత గానీ నీ జీవితంలో మీ డాడీ లేని లోటుని అర్థం చేసుకోలేక పోయిందట!” అన్నది సరోజగారు.

“మామ్, మీనా నీతో ఎన్నిసార్లు మాట్లాడింది నువ్వు వచ్చిన తరువాత?” క్యూరియాసిటీతోనే అయినాగానీ, ఇంటరాగేట్ చేస్తున్నట్లు హమీర్ తల్లిని అడిగాడు.

“కనీసం … అరడజను సార్లయ్యుండదూ? ప్రతీ సారీ, అయామ్ సారీ ఆంటీ ఫర్ వాట్ వుయ్ పుట్ యు త్రూ అన్నది.”

“నువ్వేం చెప్పావ్?”

“నా దేమున్నదమ్మా, నువ్వు, వాడు పెళ్లి చేసుకుందా మనుకున్నారు. తరువాత నువ్వు వద్దనుకున్నావు. ఇప్పుడు నీకు వాడు కావాలనిపిస్తోంది. అదేదో నువ్వే వాడికి చెప్పు, అన్నాను,” అన్నారు సరోజగారు.

“నువ్వు డెన్వర్ నించీ వచ్చిన తరువాత నీకు ఫోన్ చెయ్యడానికి రెండు, మూడుసార్లు ట్రైచేసిందట. నువ్వే కాలర్ ఐడిలో చూసి బ్లాక్ చేశావుట. ఫ్రెండ్ నంబర్నించీ చేసినా గానీ తన గొంతుని వినగానే ఫోన్ పెట్టేశావని చెప్పింది,” అన్నారు భవానిగారు.

“మీ విషయంలో వేలుపెడుతున్నానని కాక, మీ డాడీలాగా ఆలోచించి చెబుతున్నా ననుకో. మీనా మంచిపిల్ల. నిన్ను కావాలనుకుంటోంది. ఇంతకన్నా గొప్ప సంబంధం నీకు దొరకదు!” అన్నారు మూర్తిగారు.

“అమాని కూడా తనని కావాలనుకుంది. కానీ, ఆమెకోసం ఏ త్యాగమూ చెయ్యగలిగే పరిస్థితిలో తాను లేడు. ఇక్కడ ఏ త్యాగమూ అవసరంలేదు గానీ మనసు ఇంకా పాత విషయాలని గుర్తు చేస్తూ మొరాయిస్తోంది,” అనుకుని మౌనంగా వుండిపోయాడు హమీర్.

అప్పటికి వాళ్ల వాన్ హైవే 140మీద మెర్సెడ్‌కు చేరే ముందున్న ఒకేఒక లైట్ దగ్గర ఆగి, డైవర్షన్ తీసుకుని అవతలి ఒడ్డుమీద వున్న రోడ్డుమీద వెళ్లడం మొదలుపెట్టింది. ఎడమపక్కన అవతలి ఒడ్డున కనిపిస్తున్న ఆ రాక్‌స్లైడ్‌ని వెనక విండో సీట్లో కూర్చున్న రోహిత్ విడియో తియ్యడం మొదలుపెట్టాడు.

“దానిక్రింద ఏదన్నా కారు ఇరుక్కునిపోయి వుండుంటే?” అన్నాడు ఆండ్రూ డ్రైవ్ చేస్తూనే దాన్ని చూస్తూ.

“ఎవరయినా కళ్లతో చూసివుంటే తప్ప అక్కడ అలాంటిది జరిగిందని ఎవరికీ తెలిసే ఛాన్సే లేదు,” అన్నాడు రోహిత్.

“ఆ రాక్‌స్లైడ్ ఎప్పుడు జరిగిందో?” అన్నారు మూర్తిగారు తనలోనే తను అనుకుంటున్నట్లుగా.

హమీర్ తన స్మార్ట్ ఫోన్లో చెక్ చేసి, “2006లో,” అన్నాడు.

“ఏ నెల?” మూర్తిగారు అడిగారు ఆదుర్దాని కప్పిపుచ్చుకుంటూ.

“ఏప్రిల్!” హమీర్ జవాబిచ్చాడు.

“తారీకు వివరాలు ఏమయినా వున్నాయా?” అడిగారు మూర్తిగారు. తనకి ఆ క్షణానే హార్ట్ ఎటాక్ వస్తుం దనిపించిం దాయనకి.

“ఏప్రిల్ నెల్లో చివరివారం,” హమీర్ జవాబు చెప్పాడు.

“సరోజగారు వాలిపోతున్నారు, కారాపండి!” అరిచారు భవానిగారు.

ఇంతకాలం మరుగునపడివున్న 2006 ఏప్రిల్ నెల చివరివారం సిగ్నిఫికెన్స్ అప్పుడు గుర్తొచ్చింది హమీర్‌కి. అప్పుడే కదూ, తన తండ్రి జాడ తెలియకుండా పోయినది, కారుతో సహా?

ఇంకా ఉంది..

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – తొమ్మిదవ భాగం
9

“రండి, రండి. ఈ దసరాల సమయంలో మీ రాక మా కెంతో ఆనందాన్నిస్తోంది,” అన్నారు మూర్తిగారు. ముందుగా వనజగారు, ఆవిడ వెనక రావుగారు, చివరగా మీనా మూర్తిగారింట్లోకి ప్రవేశించారు. లివింగ్ రూమ్‌లో అప్పటికే ఆయన కుటుంబ సభ్యులుండడం చూసి అటువైపు అడుగేశారు.

“మా ఆవిడ భవాని, అమ్మాయి విదుషి, అబ్బాయి రోహిత్, హమీర్ వాళ్లమ్మగారు సరోజ గారు!” మూర్తిగారు పరిచయం చేశారు.

“మీకీపాటికి తెలిసేవుంటుంది గానీ, నౌ యు కెన్ పుట్ ది ఫేసెస్ టు ది నేమ్స్ – నా భార్య వనజ, ఏకైక పుత్రిక మీనా,” రావుగారు తనవంతు పరిచయం చేశారు.

అప్పటికే రెడీగా వున్న స్నాక్స్‌ని అందించారు విదుషి, రోహిత్‌లు.

అక్కడ వున్న పియానోని చూసి, “మామ్, హమీర్ ప్లేస్ పియానో వెరీ వెల్,” అన్నది మీనా.

“పదేళ్లబాటు నేర్చుకున్నాడు,” అన్నారు సరోజగారు.

“వెల్, ఇది మీదే గదా!” అన్నారు మూర్తిగారు.

“అవునుగానీ, ఇప్పుడు మీరు తీసు కెడతా నంటే మాత్రం ఆయన ఇంకొకదాన్ని వెదుక్కోవాల్సుంటుంది,” అన్నారు భవానిగారు.

“డాడ్, యు ఆర్ లెర్నింగ్ పియానో?” ఆశ్చర్యపోతూ అడిగింది విదుషి.

“నౌ దట్ ది కాట్ ఈజ్ అవుటాఫ్ ది బాగ్, యస్! ఇప్పుడు నిన్నూ, వాణ్ణీ ఆ క్లాసులకనీ, ఈ యాక్టివిటీకి అని తిప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ ఫ్రీ టైమ్‌ని ప్రొడక్టివ్‌గా వుపయోగిద్దామనీ!” అన్నారు మూర్తిగారు.

“అయామ్  ప్రౌడాఫ్ యు, డాడ్! యు విల్ బి ఏన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ ఎ లాటాఫ్ పీపుల్!” అన్నది విదుషి సోఫాలో కూర్చున్న ఆయన మెడచుట్టూ వెనకనుంచీ చేతులువేసి తలమీద ముద్దుపెడుతూ.

“మీరు వాయిస్తా నంటే వినడానికి సిధ్ధంగా వున్నాం, ” అన్నారు అప్పటిదాకా సైలెంట్‌గా వున్న రావుగారు.

“యస్, డాడ్,” అన్నది విదుషి.

“మరింకేం! వాయించి వినిపించండి!” అన్నారు వనజగారు.

“నేనింకా ఆ స్థాయికి రాలేదు గానీ, కావాలంటే హమీర్ వాయించవచ్చు,” అన్నారు మూర్తిగారు.

“నీకు వాయించడం వచ్చా?” మీనాని అడిగారు సరోజగారు.

“రాదు ఆంటీ,” జవాబిచ్చింది మీనా.

“కమాన్ మాన్! ఐ డోన్ట్ రిమెమ్బర్ ది లాస్ట్ టైమ్ ఐ హర్డ్ యు ప్లే. గివ్ అజ్ ఎ ట్రీట్!” ఎంకరేజ్ చేశాడు రోహిత్.

“ఇది బావుంది. మా కాలంలో పెళ్లిచూపులంటే చూడ్డాని కొచ్చిన మగపెళ్లివాళ్లు అమ్మాయిని అడిగేవాళ్లు పాడమనో, వీణ వాయించమనో!  ఇక్కడ ప్లేసులు తారుమా రయ్యాయి,” అన్నారు సరోజగారు.  రావుగారు చటుక్కున భార్యవైపు చూసి ఆమె మొహం ఎర్రబడడం గమనించారు.

“మేం అమ్మాయిని చూసుకోవడానికి మిమ్మల్ని రమ్మనమనే చెప్పాం.  మీ అందరికీ రావడానికి కుదరడం లేదనీ, మీరు ఇండియానుంచీ రాగానే అలిసిపో యుంటారనీ మూర్తిగారే మమ్మల్ని రమ్మన్నారు!” అన్నారు వనజగారు కొంచెం అఫెన్స్‌నీ కొంచెం డిఫెన్స్‌నీ జతకలిపి.

“ఈక్వల్స్ మధ్య ఫార్మాలిటీ సేముంటాయండీ? నామటుకు నాకు మగపెళ్లివాళ్లు ఎక్కువనీ ఆడపెళ్లివాళ్లు తక్కువనీ ఏంలేదు. అయామ్ వెరీ ఇన్‌ఫార్మల్, ” అన్నారు మూర్తిగారు వాతావరణాన్ని తేలిక చెయ్యడానికి ప్రయత్నిస్తూ, ఆవిణ్ణి శాంతపరచడానికి.

“దిసీజ్ అమెరికా ఆంటీ! అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ!” అని విదుషి సరోజగారికి చెప్పి మీనావైపు తిరిగి, “పియానో బాగా వాయించలేదని ఈ సంబంధం కుదరదని అనడానికి మాత్రం నీకు వీల్లేదు మీనా!” బెదిరించింది.

“డోన్ట్ వర్రీ! హి ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ మి దట్ ఛాన్స్!” మీనా జవాబిచ్చింది.

“డాడీ, యు నో, మీనా, నేను మిడిల్ స్కూల్లో క్లాస్‌మేట్లం! దే మువ్డ్ ఎవే ఆఫ్టర్ దట్,” విదుషి తండ్రితో చెప్పింది.

“వావ్! ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్. బోతాఫ్ యు ఆర్ స్టడీయింగ్ మెడిసిన్ టూ! యు కెప్ట్ ఇన్ టచ్?” అన్నారు మూర్తిగారు.

“నాట్ అంటిల్ ఐ హర్డ్ అబవుట్ హర్ ఫ్రమ్ హమీర్! అప్పటినించీ ఫేస్‌బుక్ కాంటాక్ట్.”

“నువ్వు వాయించడం నేను విని గూడా చాలా కాలమయిందిరా,” ఇంకే మాలస్య మన్నట్టు అన్నారు సరోజగారు.

“ట్యూన్ చేయించి ఇంకా నెలకూడా కాలేదు! పియానో టీచర్ మొదటిసారి రాగానే అవుటాఫ్ ట్యూన్, వినలేకుండా వున్నాను, ముందు అర్జెంట్‌గా ట్యూన్ చేయించాలి అన్నారు.  ఏడాది కోసారి చేయించాలి అని గుర్తు చేస్తే నెలక్రితం మళ్లీ ముట్టచెప్పాను.  డబ్బు లయితే పోయాయి గానీ, నాకు మాత్రం ఆ ట్యూన్ చేయించినదాని ఫలితం ఏమీ వినిపించలా! ” అన్నారు మూర్తిగారు.

“యు నీడ్ ఎ మ్యుజీషియన్స్ యియర్ ఫర్ దట్ డాడ్!” అన్నది విదుషి.

“ప్లీజ్!” మౌనంగానే పెదవులని కదుపుతూ హమీర్ తనవైపు చూస్తున్నప్పుడు మీనా అడిగి, పెద్దగా, “మూన్‌లైట్ సొనాటా! ” అన్నది.

హమీర్ వెళ్లి పియానో ముందు కూర్చుని, కీబోర్డుకు వున్న కవర్ తీశాడు.

“ఐ డోన్ట్ హావ్ ది స్కోర్ బుక్. ఆ సీటుకింద అరలో వుండి వుంటే తప్ప! ” అన్నారు మూర్తిగారు.

“వాడికి పుస్తకం అక్కర్లేదు!” అని సరోజగారు, “హి డజన్ట్ నీడ్ ది బుక్!” అని మీనా ఒకేసారి అనగానే విదుషి మూర్తిగారి వైపు చూసి నవ్వింది.

హమీర్ వాయించిన ఆ పదిహేను నిముషాలూ తన్మయులై విన్నారు దాదాపు అందరూ. పదిహేను నిముషాలు ఎక్కువన్నట్టుగా సోఫాలో మధ్యలో అటూ ఇటూ కదిలారు వనజగారు. మధ్యలో ‘మంచినీళ్లు కావా’లన్నట్టు ఆవిడ సంజ్ఞ చేస్తే విదుషి లేచి వెళ్లి తెచ్చిచ్చింది. అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు.

“కొన్ని తప్పులున్నాయ్! ” అన్నాడు హమీర్.

“మాకు తెలియదు, చెప్పకు! ” అన్నారు మూర్తిగారు.

“ఆయన కెంత యిష్టమో, ఈ పాటంటే!” అని కళ్లు తుడుచుకున్నారు సరోజగారు.  ఆ మాటలతో అక్కడ ఒక్కసారి నిశ్శబ్దం నెలకొంది.

ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేద్దామని,  “నైస్ టు సీ యు ఎగైన్! వుయ్ విల్ బి సీయింగ్ మోర్ ఆఫ్ ఈచ్ అదర్!” అన్నారు మూర్తిగారు మీనాతో.

“ఎగైనా? అంటే నువ్వింతకు ముందే ఆయన్ని కలిశావా? నాకు చెప్పలేదేం?” వనజగారు మీనాని నిలదీశారు.

“నేనేదో పనిమీద బౌల్డర్ వెడితే అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో హమీర్, మీనా కనిపించారు. టోటల్లీ యాక్సిడెంటల్,” అన్నారు మూర్తిగారు.

“అయినా సరే, నాకు చెప్పొద్దూ?” రెట్టించారు వనజగారు.

“మెడిసిన్ చదువుతున్నప్పుడు ఎంతోమందిని కలుస్తూంటారు. అన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు?” రావుగారు సర్దిచెప్పబోయారు.

“మనం ఆ ఎంతోమంది ఇళ్లకు వెళ్లడంలేదుగా! ఇది నాకు చెప్పడం మానేసింది,” అన్నారు వనజగారు కొంచెం కోపంగానే.

“మీరెప్పు డొచ్చారు ఇండియానించీ?” రావుగారు సరోజగారిని అడిగారు మాట మార్చడంకోసం.

“ఎంత, ఇంకా నలభై ఎనిమిది గంటలు కాలేదు,” జవాబిచ్చా రావిడ.

“మీ ఫ్లయిట్ టైంకే వచ్చిందా?” మూర్తిగారు ఎంక్వయిర్ చేశారు.

“టేకాఫ్ గంట ఆలస్య మయింది గానీ, నాన్‌స్టాప్ గదా, బయల్దేరితే చాలు!” అన్నారు రావుగారు.

“మీరు ఎకాయకీ మా యింటికి రావల్సింది. హోటల్లో దిగుతామని ఇన్‌సిస్ట్ చేశారు,” అన్నారు మూర్తిగారు.

“వచ్చేసారినించీ తప్పకుండాను – వియ్యాలవారి వీసా స్టాంప్ వెయ్యగానే!” అన్నారు రావుగారు.

“ఆ స్టాంప్ వెయ్యగలను, వెయ్యలేను అని రెండు జవాబులూ ఇస్తాను. ఎందుకంటే, మీకు వియ్యాలవారు సరోజగారు. కానీ, హమీర్ నాకు కొడుకులాంటివాడు. అందుకని వియ్యాలవారి కారెక్టరైజేషన్ని తప్పించుకోను. వాడిముందే పొగుడుతున్నాను – మీకు ఇలాంటి టఫ్‌నెస్‌ వున్న కారెక్టర్ ఇంకెక్కడా కనిపించదు. వాట్ హి హాజ్ బీన్ త్రూ! మీనా, యు ఆర్ వెరీ లక్కీ!” అన్నారు మూర్తిగారు.

“ఐ నో అంకుల్, థాంక్యూ!” అన్నది మీనా.

“హమీర్ కూడా. మాకొక్కర్తే కూతురు. మెడిసిన్ పూర్తవుతుంది ఇంకో రెండేళ్లల్లో. అది పూర్తయేదాకా ఆగొచ్చు కదే అంటే అది వినిపించుకోవట్లేదు,” అన్నారు వనజగారు.

“మరేం లేదు – వివాహం విద్య నాశాయ అన్న నానుడిని నమ్ముతుంది మా ఆవిడ,” అన్నారు రావుగారు.

“నానుడుల కేమండీ, బోల్డుంటాయి. నేను పిహెచ్.డి చదువుతున్నప్పుడు పెళ్లిచేసుకున్నాను. భవాని సహకారంతోనే పూర్తిచెయ్యగలిగాను!” అన్నారు మూర్తిగారు.

“ఆ లెక్కన హమీర్ ఉద్యోగం మానేసి మీనాకి రెండేళ్లు వంటచేసి పెట్టాలి!” వనజగారు నవ్వుతూనే అన్నాగానీ అక్కడున్న హమీర్ తరఫు వాళ్లందరికీ మాత్రం అరవై మైళ్ల స్పీడ్‌తో వెడుతున్న కారుకు సడెన్ బ్రేక్ వేసిన ట్లనిపించింది.

“దాందే ముందండీ! ఈ కాలంలో ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే గడిచే దెట్లా?” భవానిగారు వాతావరణాన్ని తేలికపరచబోయారు.

“చూడు చెల్లెమ్మా, మన హమీర్ ఇష్టపడ్డది ఈ మీనాని. నీకు ఇప్పటికి చూడ్డానికి వీలయ్యింది,” అన్నారు మూర్తిగారు.

“అమ్మాయి బంగారపు బొమ్మలా వున్నది. వాడిష్టపడ్డాడు, తనిష్టపడ్డది. మీ ఆ శీర్వాదం వున్నది. అది వాడికి చాలా ముఖ్యం. మీరు కొండలా అండగా లేకపోతే ఏమయిపోయేవాళ్లమో!” కళ్లొత్తుకుంటూ అన్నారు సరోజగారు. మరచిపోగలిగేవా ఆ స్మృతులు?

“మీ నమ్మకా లేమిటో మాకు తెలియదు. ముహూర్తం పెట్టించడానికి మాకు తెలిసిన పురోహితు డున్నాడు. మీరు అడగమంటే అడుగుతాను. కాదూ, మీ పురోహితుణ్ణి సంప్రదించినా సరే!” అన్నారు మూర్తిగారు.

“మనింటి దగ్గర గుళ్లో శాస్త్రి గారున్నారు గదా! ఆయన్నడుగుదాం,” అన్నారు వనజగారు.

“ఆయన ఇండియా వెళ్లారు గదా! పైగా, జనవరిదాకా రారని విన్నాను!” అన్నారు రావుగారు.

“ఇదేమయినా అంత అర్జెంటు విషయమా? కాకపోతే ఫోన్లు లేవా మాట్లాడ్డానికి?” జవాబిచ్చారు వనజగారు.

“అంటే, ఇక్కడ సెలవు రోజయితే ఎక్కువమంది రావడానికి వీలవుతుందని జులై 4న, లేకపోతే క్రిస్మస్‌కీ న్యూ యియర్‌కీ మధ్యలోనూ పెళ్లిళ్లని పెట్టుకుంటార్ట. అలాగని మీనాయే కాక నా కొలీగ్స్ కూడా చెప్పారు.  క్రిస్మస్ ఇంకో రెణ్ణెల్లల్లో వుంది. ఇప్పుడే ప్రయత్నించకపోతే  వెన్యూలు దొరక్కపోవచ్చు. జులై అంటే మరీ తొమ్మిది నెల లాగాలి,” అన్నారు రావుగారు.

“అంత తొందరయితే వచ్చే నెల్లో థాంక్స్‌గివింగ్ సెలవుల్లో చేసెయ్యండి, ఓకె?” అన్నారు వనజగారు రావుగారివైపు కొరకొరా చూస్తూ.

ఎవరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన మొహాన్ని ఎవరూ చూడకూడదన్నట్లు తలవంచుకుని కూర్చుంది మీనా. మొహంలో భావాలేమీ కనిపించనీయకుండా ఎదుటి మనిషిలోంచి అవతలకి చూస్తున్నట్లున్నాయి రావుగారి చూపులు.

“పెళ్లవగానే మీరు ఇండియా వెళ్లిపోతారు గదా!” వనజగారు సరోజగారిని సూటిగా చూసి ప్రశ్నించారు. హమీరే గాక మూర్తిగారి కుటుంబ సభ్యులంతా స్టన్ అయ్యారా ప్రశ్నకి.

ముందు తేరుకున్నది హమీర్. “మామ్ మాతోనే వుంటుంది!” అన్నాడు.

“ఆరేళ్లుగా ఇండియాలో వుంటున్నారు గదా! మళ్లీ ఇక్కడికొచ్చి ఈ చలికేం అలవాటుపడతారు?” అన్నారు వనజగారు.

“ఆవిడ ఇంతకుముందు వుండలేనని వెళ్లినమాట నిజమే గానీ, ఇంక వెళ్లనివ్వను!” అన్నాడు హమీర్.

“నువ్వుండమన్నా నేనుండలేనురా. అయినా, కొత్తగా పెళ్లయినవాళ్ల మధ్యలో నేనెందుకు?” అన్నారు సరోజగారు.

“మామ్! నాకీ వరల్డ్‌తో వున్న ఒకేఒక కనెక్షన్‌వి నువ్వు. నాతోనే వుంటావు!” అన్నాడు హమీర్.

“కాదని ఎవరంటారు? ఇండియాలో వున్నా, ఇక్కడవున్నా అదే కనెక్షన్ కదా! దానికింత రాధ్ధాంత మెందుకు? మా అత్తగారిలాగా విడిగా ఇండియాలో వుంటే ఆవిడకీ సుఖంగా వుంటుంది. అలవాటయిన ప్లేసు. అక్కడ ఆవిడకి పనివాళ్లున్నారు. డ్రైవరున్నాడు. ఇక్కడవన్నీ కుదుర్తాయా ఏమిటి? కాదంటారా? మాట్లాడ రేమండీ?” వనజగారు భర్తని గద్దించారు.

“మా మామ్ మనతోనే వుండడం నీకు అభ్యంతరమని నాకు చెప్పలేదెందుకు?” హమీర్ మీనాని ప్రశ్నించాడు.

“పెళ్లి కాకుండానే మా ముందే దాన్నిలా నిలదీస్తున్నాడంటే పెళ్లయిన తరువాత దాని బతుకెలా అఘోరిస్తుందో నేనిప్పుడే ఊహించగలను!” అన్నారు వనజగారు.

“మామ్! యు ఆర్ మేకింగ్ ఎ మౌంటెన్ అవుటాఫ్ ఎ మోల్ హిల్!” మీనా చెప్పడానికి ప్రయత్నించింది.

“ఇప్పుడు నీకలాగే అనిపిస్తుందే! అదే, అత్తగారిని ఇంట్లో పెట్టుకున్న తరువాత ఆవిడ వంట చెయ్యడానికీ, పిల్లలని సముదాయించడానికీ ఓపిక లేదని చేతులెత్తేస్తే, ఈ రోగమనీ, ఆ రోగమనీ ఆవిణ్ణి డాక్టర్ల చుట్టూ తిప్పాల్సొస్తే అప్పుడు ఈ అమ్మమాట ఎంత విలువైనదో తెలిసొస్తుంది!” అన్నారు వనజగారు.

“మీనా పుట్టిన ఏడాదికి నీకు డబుల్ టైఫాయిడ్ వచ్చినప్పుడు దాన్ని పెంచింది మా అమ్మేనని మరిచిపోయినట్టున్నావ్!” అన్నారు రావుగారు.

“అది ఇండియాలో గదా! అలా చెయ్యకపోతే చుట్టుపక్కలవాళ్లు ఆడిపోసుకుంటారని భయపడి!” వెంటనే వనజగారి దగ్గరినుంచీ రిటార్ట్ వచ్చింది.

“ఇంతకీ మనం హమీర్, మీనాల పెళ్లిగూర్చే మాట్లాడుకుంటున్నామా?” మూర్తిగారు సంభాషణని అసలు విషయంవైపు మళ్లించడానికి ప్రయత్నించారు.

“ఈ విషయం తేలితే, అప్పుడు!” అన్నారు వనజగారు.

మొహం ఎర్రబడగా, “నీనా! నువ్వు, నేను ఈ విషయం డిస్కస్ చేశాం. మళ్లీ ఇప్పుడిదేమిటి?” ప్రశ్నించాడు హమీర్.

“నిండా పాతికేళ్లు లేవు. దానికేం తెలుస్తాయి నిజజీవితంలో సాధకబాధకాలు? ఎవరయినా అనుభవించడాన్ని చూసిందా? అంతెందుకు? మీ అమ్మగా రెక్కడున్నారు మూర్తిగారూ?” వనజగారు మూర్తిగారిని నిలదీశారు.

“ఆవిడ పోయి రెండేళ్లయింది,” మూర్తిగారు జవాబిచ్చారు.

“సారీ టు హియర్ దట్. ఆవిడ మీతోనే వుండేదా?”

“ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమా?” అడ్డం రాబోయారు రావుగారు.

“మనకో రూలూ, ఎదుటివాళ్ల కింకో రూలూ అనే ద్వంద్వ వైఖరి అంటే నాకు మంట. అందుకే అడుగుతోంది. చెప్పండి మూర్తిగారు!”

“ఆవిడ పోయేదాకా మాతోనే వున్నది!” కోపా న్నదిమిపెట్టుకుంటూ మూర్తిగారు జవాబిచ్చారు.

“మీ ఆవిడ గొప్పది. భవాని గారు, మీకో నమస్కారం. మా అత్తగారు పోయేవరకు మా బావగారి దగ్గరే వున్నది. ఆవిడ అమెరికా వచ్చిన ఒక్కసారీ రోగమొచ్చి ఎక్కడ అడ్డంపడుతుందోనని హడలి చచ్చాను. నేను మానవమాత్రురాలిని గనుక నాకు చేతనయినంతలో దానికి సుఖవంతమైన బ్రతుకు నివ్వాలనుకుంటున్నాను. మీ కున్నటువంటి గొప్పదనం నాకే లేనప్పుడు మా అమ్మాయికి అంటుతుందని నేననుకోను. మీరు దేవుళ్లు. మీకో నమస్కారం!” అన్నదావిడ చేతులు జోడించి.

“నీ కింతగా ఇష్టం లేదని ఇంటిదగ్గరే చెప్పివుండాల్సింది!” అన్నారు రావుగారు.

“ఆమాత్రం తెలివితేటలు నాకూ వున్నాయి. నాకేదో అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వుండేది గానీ, ఇందాక ఇక్కడి కొస్తున్న దారిలోనే ఈ పెళ్లయితే దాని భవిష్య త్తేమిటో పూర్తిగా అర్థమైంది గనుకనే ఇప్పటికయినా కళ్లు తెరిచినందుకు సంతోషిస్తున్నాను,” అని ఆవిడ రావుగారి నోరు మూయించారు.

“మామ్! పేరెంట్స్ పిల్లల దగ్గరుండడం ఇండియన్స్‌లో అన్‌కామన్ కాదు గదా! బామ్మ పెదనాన్న దగ్గరున్నట్లు?” అన్నది మీనా.

“ఇండియన్స్‌లో గూడా, పెళ్లయిన పదేళ్లకో, లేక ఇరవయ్యేళ్లకో అలా చేరడం వేరు, పెళ్లయిన దగ్గర్నించీ తోకలాగా వుండడం వేరు. అలాంటి తోకలేవీ లేకుండా బతికినదాన్ని గనుకనే అలాంటి సుఖాన్ని నీకివ్వా లనుకుంటున్నాను!”

“వుయ్ నెవర్ డిస్కస్డ్ దిస్!” అన్నది మీనా.

“అవసరం రాలేదు గనుక. అయినా, మీ బామ్మ మీ పెదనాన్న గారింట్లోనే వుండడం, మనింట్లో వుండకపోవడం చూసయినా గ్రహిస్తావనుకుంటే  ఆమాత్రం తెలుసుకోకపోవడం నా పెంపకంలో లోపంవల్ల ననుకోవాలి,” అంటూ నుదుటిమీద అరచేత్తో కొట్టుకున్నా రావిడ.

“హమీర్, ఐ థింక్ ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ క్లియర్!” అన్నారు మూర్తిగారు.

“నీనా – సారీ, మీనా! వన్ లాస్ట్ టైం! వాట్స్ యువర్ ఆన్సర్?” అడిగాడు హమీర్.

మీనా కళ్లల్లోంచి జలజలా నీళ్లు రాలాయి. “అయామ్ సారీ హమీర్! మా అమ్మ అభిప్రాయం ఇదని నాకిప్పటిదాకా తెలియదు!”

“ఇప్పుడు తెలిసిందిగా! వాట్ డు యు వాంట్ టు డు అబవుటిట్?”

“ఇందాక నువ్వన్నావే, నీకీ వరల్డ్‌తో వున్న ఒకే కనెక్షన్ మీ మామ్ అని? ది సేమ్ వే హియర్. దీజ్ ఆర్ మై టు కనెక్షన్స్ టు దిస్ వరల్డ్.  జస్ట్ లైక్ యు, ఐ ఆల్సో డోన్ట్ హావ్ ఎనీ అదర్ రిలెటివ్స్ ఇన్ దిస్ కంట్రీ. హూ వుడ్ ఐ గో టు ఇఫ్ ఐ నీడ్ హెల్ప్?  యు ఆర్ లక్కీ టు హావ్ దిస్ గ్రేట్ అంకుల్స్ ఫామిలీ టు టర్న్ టు. ఐ డోన్ట్ హావ్ ఎనీవన్. చిన్నప్పటినించీ తన ఆశలన్నీ నామీదే పెట్టుకుని బ్రతికింది. ఈ క్షణాన నేను ఆమెతో ఏం మాట్లాడినా అది అనుచితమే అవుతుంది. ఇంటి కెళ్లిన తరువాత ఆమెని కన్విన్స్ చెయ్యగలనన్న నమ్మకం నాకుంది. గివ్ మి ఎ ఛాన్స్!”

“నువ్వావిణ్ణి కన్విన్స్ చెయ్యగలవన్న నమ్మకం గానీ, ఆశ గానీ నాకేమాత్రం లేవు. ఆవిడ అంత స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పిన తరువాత మేకతోలు కప్పి ఆవిణ్ణి తీసుకువచ్చినా ఈ తోడేలు రూపాన్ని మాత్రం నేను మరచిపోలేను!” అన్నాడు హమీర్.

“నన్నంత మాట అన్న తరువాత ఇంకా కూర్చుంటారేం? లేచి పదండి!” సోఫాలోంచి లేచి విసవిసా నడుచుకుంటూ వనజగారు తలుపుదగ్గరకు నడిచారు. రావుగారికి భార్య ననుసరించడంకన్నా వేరే మార్గం కనబడలేదు. మీనా ఆయన వెనక బయల్దేరబోయింది గానీ, “గివ్ మి ది రింగ్ బాక్!” అని హమీర్ గద్దించడంతో ఆగిపోయింది.

“నేనింకా మా అమ్మను కన్విన్స్ చెయ్యగలననే అనుకున్నాను. నువ్వు అంత తొందరపడుతున్నప్పుడు నే నెందుకు ఆపాలి? టేకిట్!” అని విసురుగా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని అతని చేతిలో పెట్టి వడివడిగా తండ్రివెనుక నడిచింది. గుమ్మంలోంచి బయటకు వెడుతూ తలుపుని శ్లామ్‌ చేసింది.

“అన్‌బిలీవబుల్!” అన్నారు మూర్తిగారు వాళ్లు వెళ్లినవైపు చూస్తూ. ఆయనకింకా ఇదొక పెద్ద కలలాగానే వున్నది. పెద్దలు కలిసి మాట్లాడుకోవడం ఓ చిన్న ఫార్మాలిటీ అనే అనుకున్నారు గానీ దానివల్ల ఇంత చేదు అనుభవం మిగులుతుందని ఆయన ఏమాత్రం ఊహించలేదు.  పిల్లలు పెళ్లి చేసుకుంటా మంటే తల లూపిన తల్లిదండ్రులే ఆయనకి తెలుసు నప్పటిదాకా. దేరీజె ఫస్ట్ టైమ్ ఫర్ ఎవిరిథింగ్ అన్న ప్రావెర్బ్ ఆయనకి గుర్తొచ్చింది.

“ఐ డోన్ట్ నో వాట్ హర్ ప్రాబ్లం ఈజ్! ఐ వజ్ ఇచింగ్ టు ఆస్క్ దెమ్ టు గెటవుట్!” అన్నాడు రోహిత్.

“అదే ఆలోచన నాక్కూడా వచ్చింది గానీ సభ్యత కాదని వూరుకున్నాను. వాళ్లకి సిగ్గులేకపోతే మనకికూడా వుండకూడదని రూలేం లేదుగా!” అన్నారు మూర్తిగారు.

“ఇలాంటి మనుషు లుంటారని నాకివ్వాళే తెలిసింది!” అన్నారు భవానిగారు.

“ఇప్పుడే కాదు, ఎప్పుడూ వున్నారు భవానీ. ఇండియాలో చూస్తున్నాగా! ఎటొచ్చీ, ఈ సంభాషణ పెళ్లయిన తరువాత వచ్చుంటే పాపం వీడు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయేవాడు. మన అదృష్టం బావుంది,” అన్నారు సరోజ గారు.

“దీన్ని అదృష్టమని ఎలా అంటారు?” అడిగింది విదుషి.

“అంటే,” అని చెప్పబోయి, అనవసరమని ఆగిపోయారు మూర్తిగారు.

“ఆవిడ కెందుకో ఈ పెళ్లంటేనే ఇష్టం లేనట్టుంది,” అన్నారు భవానిగారు.

“డాక్టరు కూతురుకి నేను తగనని ఆవిడ నమ్మకం. సంపాదించడం మొదలయిన తరువాత తన శాలరీ నా శాలరీకి కనీసం రెండు రెట్లుంటుందిట!” అన్నాడు హమీర్.

“అలాగని నిన్ను నువ్వు తక్కువచేసుకోకు. అదిమాత్రం సహించలేను. నువ్వు మాస్టర్స్ చెయ్యొచ్చు, కాకపోతే ఎమ్బీయే చెయ్యొచ్చు. ఇంద్రా నూయిలాగా, ఓ కంపెనీకి సీఇవో కావచ్చు. మీనా తండ్రేమీ బిల్ గేట్స్ లాగా బిలియనీర్ కాదు. మీ నాన్నలాగా, నాలాగా పైకొచ్చినాయనే.  తన కూతురు జీవితాన్ని చేజేతులా నాశనం చేస్తున్నదని ఆవిడకి అర్థంకావడంలేదు. నీకన్నా డబ్బున్నవాణ్ణి అల్లుడిగా తేగలదేమోగానీ, నీకన్నా గొప్పవాణ్ణి మాత్రం కాదు. నో పాయింట్ ఇన్ క్రైయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. యు హావ్ టు మువాన్!” అన్నారు మూర్తిగారు. “ఎంగేజ్‌మెంట్ అయిన తరువాత మీ నాన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ పంపిన హాఫె మిలియన్ డాలర్ల చెక్కుని ఆ ఆనంద సమయంలో మీకిద్దా మనుకున్నాను. పూర్తిగా ఏడేళ్లు అవకుండానే, ఆరేళ్లకే పంపించారు! నిన్ననే వచ్చింది,” అన్నారు అక్కడే పెట్టివున్న కవర్ని హమీర్ కిస్తూ.

“మువింగ్ ఆన్లో మాకంటే ఎవరికి ఎక్కువ అనుభవ ముంటుంది అంకుల్?” అన్నాడు హమీర్ ఆ కవర్ని అందుకుని తల్లి భుజంచుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుంటూ.

అమాని వెళ్లిపోయిన తరువాత హమీర్‌ని నిరాశ కమ్మేసి అతని మెదణ్ణి శూన్యంతో నింపింది. తల నానించడానికి ఒక బుజమూ, ఒక బోజమూ, చెయ్యివెయ్యడానికి ఒక నడుమూ, కమ్ముకోవడానికీ, కప్పుకోవడానికీ ఒక మనసూ తేలిగ్గానే దొరికెయ్యనుకున్నాడు మీనా కలిసిన తరువాత. అయితే, మీనాతో బ్రేకప్ తరువాత వాటిల్లో ఏదీ అంత తేలికగా దొరికేది కాదని మెల్లిగా తెలిసొచ్చింది. మీనా తరువాత పెళ్లిచేసుకొమ్మనమని తల్లి ఎంత పోరుపెట్టినా, అతను దాదాపు ఒక సంవత్సరంపాటు పట్టించుకోలేదు. పట్టించుకుందా మనుకునేటప్పటికి అటు తల్లికీ, ఇటు మూర్తిగారి కుటుంబానికీ కూడా విసుగొచ్చి సంబంధాలను చెప్పడం మానేశారు. డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో మీనా కనిపించడం అతనికి అగ్నిమీద ఆజ్యం పోసినట్లయింది. అమాని అతనికి జీవితంలో ఎదురుచూడడాన్ని నేర్పించింది. ఆమె అందించిన పాట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్‌బో తనతోబాటే వుంటుందని అనుకున్నాడు గానీ అది రెయిన్‌బోతో కలిసి అదృశ్యమైపోతుం దనుకోలేదు.

అతను అదృశ్యం చేసింది తెచ్చిన సిక్స్ పాక్ లోని బీరునీ, వైన్ బాటిల్లోని వైనునీ. బీరు బాటిల్స్ అన్నింటినీ పూర్తిచేసిన తరువాత వైన్ బాటిల్‌ని చేత్తో పట్టుకున్నప్పుడు, “అయామ్ గోయింగ్ టు బి వేస్టెడ్ టుమారో!” అనుకున్నాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. మెలకువ వచ్చింది మరునాడు పదకొండు గంటలకే అయినా, తలకాయ పగిలిపోతోంది. దానితోబాటు వాంతులవడం మొదలుపెట్టాయి. నీళ్లు తాగినా ఇమడడంలేదు. రోహిత్‌కి కాల్ చేశాడు.

” అయామ్ వేస్టెడ్, మాన్! టెర్రిబుల్ హాంగోవర్. ఇట్లా వెళ్లి మామ్‌ని చూళ్లేను. ఆవిడ కంగారు పడుతుంది ఈ వామిటింగ్స్‌కి. ఐ కాన్ట్ డ్రైవ్ దేర్ ఎనీవే. ఆవిడ నన్ను చూడకపోయినా ఏమయిపోయానో అని వర్రీ అవుతుంది. కెన్ యు డ్రాప్ మి ఎట్ యువర్ పేరెంట్స్ ప్లేస్?”

“యు సీమ్ టు హావ్ హాడ్ వన్ హెక్ ఆఫ్ ఎ పార్టీ. వాట్స్ ది అకేషన్?” అడిగాడు రోహిత్.

“మై గర్ల్‌ఫ్రెండ్ బ్రోకప్ విత్ మి!”

రోహిత్ ఆశ్చర్యపోయాడు. ” నీకు యాక్సిడెంట్ అయ్యేముందు డిసిలో చూశాను -  ఈజ్ దట్ హర్?”

“యా. దట్స్ హర్!”

“సారీ టు హియర్ దట్ మాన్! హాంగాన్ దేర్. లెట్ మి సీ వాట్ ఐ కెన్ డు,” అని రోహిత్ ఫోన్ పెట్టేసి విదుషికి కాల్ చేశాడు. “కెన్ యు పికప్ హమీర్ అండ్ డ్రాప్ హిం ఆఫ్ ఇన్ మెక్లీన్? హి ఈజ్ వేస్టెడ్ అండ్ ఈజ్ ఇన్ హిజ్ ఎపార్ట్‌మెంట్. నేను న్యూ జెర్సీలో వున్నా. లేకపోతే నేనే పికప్ చేసుకునేవాణ్ణి.”

“హి ఈజ్ నాట్ దట్ బిగ్ ఎ డ్రింకర్. వై ఈజ్ హి వేస్టెడ్?”

“హిజ్ గర్ల్‌ఫ్రెండ్ బ్రోకప్ విత్ హిమ్.”

“మీనా బ్రోకప్ విత్ హిమ్ ఎగైన్?” విదుషి ఆశ్చర్యపోయింది.

“వాట్ డు యు మీన్ బ్రోకప్ విత్ మీనా? దట్స్ నాట్ హూ హి హాజ్ బీన్ సీయింగ్!”

“ఆర్యూ ష్యూర్?”

“యస్. ఆ అమ్మాయిని డిసెంబర్‌లో డీసిలో చూశా గదా! మీనాని ఆమాత్రం గుర్తుపట్టలేనా?”

“డెన్వర్‌నించీ వచ్చిన తరువాత నించీ వాడు డేట్ చేస్తోంది మీనాని కాదా? ఆ మధ్య హమీర్‌ని ఒబ్లీక్‌గా డేటింగ్ ఎనీబడీ అనడిగితే వాడు మీటింగ్ ఓన్లీ వన్స్ ఎ మంత్ అంటే మీనాయే అనుకున్నా.  ఎంతయినా లాంగ్ డిస్టేన్స్ రిలేషన్షిప్ కదా అని! ఓ మై గాడ్!” అనడం వినిపించింది గానీ, ఆమె ఖాళీగా వున్న చేత్తో తల పట్టుకోవడం రోహిత్‌కి కనిపించడానికి అది విడియో కాల్ కాదు మరి.

“ఏమయింది? వై ఈజ్ ఇట్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లం?”

“ఐ కాన్ట్ టెల్ యు. … పేరెంట్స్‌ని చూడ్డానికి ఆండ్రూ ఎల్లికాట్ సిటీ వెళ్లాడు. అక్కణ్ణించీ హమీర్‌ని పికప్ చేసుకొమ్మనమని చెబుతాను. స్టమక్ అప్సెట్ అని చెప్పి ఏవో మందు లిచ్చినట్లు నటిస్తాడు. ఈలోపల హమీర్‌కి ఫోన్‌చేసి ఐస్ చిప్స్‌ని చప్పరిస్తూండమను,” అని ఆండ్రూకి ఫోన్ చేసింది.

ఆండ్రూ నీరసంగా వున్న హమీర్‌ని తీసుకురావడాన్ని చూసి అందరూ కంగారుపడ్డారు గానీ, అతను డాక్టర్ కేర్లో వున్నందుకు సంతోషించారు.

ఇంకా ఉంది..

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఎనిమిదవ భాగం
8

యూనివర్సిటీ డైనింగ్ హాల్‌లో మేడ్ టు ఆర్డర్ శాండ్‌విచ్ కోసం లైన్లో నిలబడ్డ హమీర్ తన ముందు నిలబడ్డ ఆమెను చాలాసేపే చూశాడు. తన శాండ్‌విచ్ ట్రేని తీసుకుని, ఆమె ఒక్కతే టేబుల్ దగ్గర కూర్చుని వుండడాన్ని చూసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి, “ఐ హాడ్ ఎ గ్రేట్ వ్యూ!” అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. వినబడలేదేమో అనుకుని ఆ లైన్‌ని రిపీట్ చేసి, “ఐ వజ్ స్టాండింగ్ బిహైండ్ యు ఇన్ ది లైన్,” అన్నాడు.

“వాటెబవుట్ దిస్ వ్యూ?” అనడిగింది లేవకుండానే.

“హార్డ్ టు టెల్. ది టేబుల్ ఈజ్ హైడింగ్ పార్ట్ ఆఫిట్,” అన్నాడు ఆ టేబుల్ దగ్గరే ఇంకొక కుర్చీలో కూర్చుంటూ. ఆమె లేచి నిలబడి టేబుల్ పక్కకి వచ్చి అతనికి పూర్తిగా కనిపించేలా నిలబడ్డది. “టర్నెరవుండ్,” అన్నాడు హమీర్. ఆమె తనచుట్టూ తాను తిరిగింది.

“నాట్ బాడ్,” అన్నాడు. “వండర్‌ఫుల్ అనుంటే ప్రెజెంట్ ఇచ్చేదాన్ని!” అన్నదామె.

“వండర్‌ఫుల్,” వెంటనే అన్నాడు.

“నేను చెప్పిన తరువాత అలా అనడానికి సిగ్గులేదా?” షార్ప్‌గా అడిగింది.

“సిగ్గుపడుతూ కూర్చుంటే ప్రెజెంట్స్ దొరకవని నా ఫ్రెండ్ చెబుతూండేవాడు.”

“నిన్ను ఎవరితోనూ ఇక్కడ చూసిన గుర్తులేదే!”

“ఇక్కడ కాదు, హైస్కూల్లో.”

“దట్ మేక్స్ మోర్ సెన్స్. అసలీ పిల్లాడికి మాట్లాడడం వచ్చా అన్న సందేహం కొన్ని క్షణాల క్రితం దాకా వుండేది.”

“పిల్లాణ్ణి పుట్టించగల వయసున్నవాణ్ణి పిల్లాడంటే కోపమొస్తుంది.”

“కోపమొస్తే ఏంచేస్తాడు?”

“పిల్లాణ్ణి పుట్టించగలనని ప్రూవ్‌ చేస్తాడు.”

“ఎప్పుడు పడితే అప్పుడే? ఈ క్షణాన కూడా?”

“ఏముందీ, టేబుల్ క్రింద శాంపుల్ తీసుకుని లాబ్‌కి పంపిస్తే చాలదా?” అనడిగాడు. తను ఆలోచనలో తప్పుచేస్తూ పట్టుబడ్డదని అర్థమైన ఆమె తన పెదాల మీద చిరునవ్వుకి చోటిచ్చింది.

“నీ స్మైల్ బావుంటుంది మీనా,” అన్నాడు హమీర్.

“నన్నెవరో పిలిచినప్పుడు నా పేరు నోట్ చేసుకునుంటావు గానీ, నిన్నెవరూ పిలవగా చూళ్లేదు గత రెండేళ్లల్లో,” మీనా జవాబిచ్చింది.

“నన్ను రెండేళ్లుగా అబ్సర్వ్ చేస్తున్నావన్నమాట!” హమీర్ కెందుకో ఆ క్షణాన కొంచెం గర్వమూ, తనని పట్టించుకుంటున్న ఒక మనిషి వున్నందుకు కొంచెం సంతోషమూ కలిగాయి గానీ వాటిని వెలుపలకు రానివ్వలేదు.

“అలా చేస్తోంది నేనొక్కదాన్నే అని అనుకోకు!”

“నేనంత పాపులర్ అని నాకు తెలియదు!” కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాడు.

“పాపులర్ కాదు. ఎక్సెంట్రిక్. లేదా స్పెషల్. నా ఫ్రెండ్స్ ఎవరయినా నువ్వేం చేశావే ఆ బుధ్ధూచేత మాట్లాడించడానికి అనడిగితే నా బాక్ చూపించానని చెబుతాను.”

“ఫ్రంట్ చూసికూడా పారిపోలేదని జతకలుపు.”

” సో ఫార్ ఇట్స్ మై ఫ్రంట్ దట్ ఎట్రాక్టెడ్ ఎ లాట్ ఆఫ్ లుక్స్. యు ఆర్ ది ఫస్ట్ వన్ టు బి ఎట్రాక్టెడ్ బై మై బాక్. ఇంతకీ నీ పేరేమిటి పిల్లాడా?”

“హమీర్!”

“హమీద్?”

“కాదు, హమీర్!” ‘ర్‌’ని వత్తిపలుకుతూ అన్నాడు. “నేను ముస్లింని కాదు. నార్త్ ఇండియన్నీ కాదు. మా నాన్నకి ఇష్టమయిన రాగం పేరది!” ఎలిమెంటరీ, మిడిల్, హైస్కూళ్లల్లో తన పేరుని గురించి ఎదురయిన ప్రశ్నలన్నింటినీ గుర్తుపెట్టుకుని అన్నింటికీ కలిపి ఒకేసారి జవాబిచ్చాడు. “హమీర్ గొల్లపూడి.”

“మేమూ తెలుగువాళ్లమే. ఐ మీన్ – మా అమ్మా, నాన్న.”

“నువ్వు కూడా సీరియెస్‌గా వుంటావ్‌ గానీ ఇవాళ్లే కొంచెం రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నావ్.”

“నువ్వు నన్నంతగా అబ్సర్వ్ చేశావంటే, వాట్స్ మై స్పెషాల్టీ?” క్యూరియెస్‌గా అడిగింది.

“నీ చుట్టూకూడా పెద్ద గుంపులేవీ వుండకపోవడం!”

“గుంపులంటే నీ కిష్టం లేదా?”

“ఇష్టం లేకపోవడం కాదు, భయం!”

“ఎందుకు?”

“అవసరంలేని విషయాలని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని!”

“వెల్, ఫస్ట్ టైం విల్ బి పెయిన్‌ఫుల్,” అని కొంటెగా నవ్వింది.

“స్పీకింగ్ లైక్ ఏన్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ పర్సన్! బట్, అది నిన్ను టీజ్ చెయ్యడానికి నా డైలాగవ్వాలే?”

“ఐ హావ్ హర్డ్ ఫ్రం అదర్స్. ఐ వజ్ టాకింగ్ అబవుట్ ఫ్రెండ్‌షిప్స్ ఆర్ రిలేషన్‌షిప్స్ – మోస్టాఫ్ ది టైం డోన్ట్ స్టార్ట్ ఆన్ ఎ స్వీట్ నోట్, యు నో? దే మస్ట్ బి కల్టివేటెడ్!”

“లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు స్పెండ్ ఆన్ కల్టివేషన్. ఇట్ ఈదర్ క్లిక్స్ ఆర్ డజన్ట్!”

“ట్రబులల్లా, ప్రాబ్లంస్ అనేవి మొదట్లో మాత్రమే రావు. కానీ అవి ఎదురయినప్పుడు తెలుస్తుంది కల్టివేషన్ అవసరం అని.”

“దాని అవసరం లేకుండానే మాట్లాడుకుంటున్నాం కదా!”

“అవసరం ముందుముందు రాదని కాన్ఫిడెన్ట్‌గా చెప్పలేం. … మరీ సీరియెస్‌గా జరుగుతోంది ఈ కాన్వర్సేషన్. సాయంత్రం నువ్వు ఫ్రీ అయితే నీకు బీర్ కొనిపెడతాను సెలబ్రేట్ చేసుకునేటందుకు.”

“నీ బాక్ వ్యూ బావుందన్న అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికా?”

“దానితోబాటు MCATలో మంచి స్కోర్ వచ్చినందుకు.”

“కంగ్రాట్స్. అయితే, తరువాతి చదువు మెడిసిన్ అన్నమాట!”

“థాంక్స్! అన్నట్టు నీ వయసు 21 దాటిందా? లేకపోతే నిన్ను నా అపార్ట్‌మెంట్‌కి తీసుకుపోవాల్సి వుంటుంది.”

“ఒక క్షణం క్రితందాకా నా వయస్సు ఎప్పుడు 21 అవుతుందా అని ఎదురుచూశాను. ఇప్పుడు మాత్రం ఇంకో వారందాకా అలా జరగనందుకు సంతోషిస్తున్నాను.”

“అపార్ట్‌మెంట్‌లోకి రానిచ్చే ముందర నీ వయసు ప్రూఫ్ చూపించాలి. 21 నిండిందని తెలిసిందనుకో, అప్పుడు నీ మొహంమీదే తలుపేస్తాను.”

“నాకా భయంలేదు. నేను పిల్లాణ్ణి కాదని ప్రూఫ్ చూపిస్తానేమోనని నువ్వే భయపడాలి!”

“పెర్ఫార్మెన్స్ ఏంగ్జయిటీకి గురవుతావేమో జాగ్రత్త! కనీసం ఓ ఇరవైమంది వుంటారక్కడ!”

“వాటెబవుట్ యువర్ బాయ్‌ఫ్రెండ్?”

“వాటెబవుట్ హిమ్?”

“అతను అప్‌సెట్ కాడా?”

“దేనికి?”

“నా పెర్ఫార్మెన్స్‌కి.”

“నీ పెర్ఫార్మెన్స్‌కి నువు అప్‌సెట్ అవకుండావుంటే చాలు. … ఎంతయినా నీకది మొదటిసారిగా!”

“నా గురించి బలే గెస్ చేశావే! స్పెషాల్టీకింద సైకాలజీ సెలెక్ట్ చేసుకుంటున్నావా?”

“సైకాలజీ చదవడానికి మెడికల్ డిగ్రీ అక్కర్లేదు బుధ్ధూ, సైకియాట్రీకి కావాలి! నీగూర్చి ఇక్కడ ఎకనామిక్సూ, ఇంజనీరింగ్, బయాలజీ చదివే దేశీ ఆడపిల్లలందరికీ తెలుసు!”

“నన్నంతగా ఎందుకలా నోటీస్ చేశారో?”

“నువ్వే, ‘హియర్ అయామ్, హియర్ అయామ్’ అంటూ అట్రాక్ట్ చేశావ్!”

“ఎప్పుడు?”

“ఒకరోజు స్టూడెంట్ సెంటర్లో. దాదాపు ఏడాదిన్నర క్రితం అయ్యుంటుంది. నీ ఫస్ట్ సెమెస్టర్లో.”

“పియానో వాయించినప్పుడా?”

“మూన్‌లైట్ సొనాటా.”

“అదే ఇక్కడ మొదటిసారీ, చివరిసారీను!”

“మళ్లీ వాయించలే దెందుకని?”

“అప్పుడు అక్కడక్కడా కూర్చుని మాట్లాడుకుంటున్నవాళ్లూ, చదువుకుంటున్నవాళ్లూ అందరూ వాయించడం అయిపోగానే చుట్టూమూగారు. కొందరు తరువాతకూడా పలకరించబోయారు.”

“కానీ నువ్వెవరితోనూ మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. అందుకే నీకు ఏరొగెంట్ అనీ, ఎక్సెంట్రిక్ అనీ పేరు.”

“అందుకే నాదారిన నేను బతకగలిగాను.”

“బట్, దట్ డే. ఇట్ వజ్ సో గుడ్. డిడన్ట్ ఇట్ గివ్యూ పీస్?”

“నో. మా డాడీని గుర్తుకుతెచ్చి ఫ్రెష్‌గావున్న గాయాన్ని బాగా మండించింది. హి యూజ్డ్ టు ఎంజాయిట్ ఎ లాట్.”

“డు యు ప్లే ఇట్ వెన్ యు గో హోమ్?”

“నో. దేరీజ్ నో పియానో ఎట్ హోమ్ … దేరీజ్ నో హోమ్.”

మీనా షాకయింది. అతను తండ్రి గూర్చి “యూజ్డ్ టు” అని పాస్ట్ టెన్స్ వాడిన సంగతి గుర్తుకొచ్చింది. మాటలకోసం వెదుక్కుంటూ, “యువర్ మామ్?” అని మధ్యలో ఆగిపోయింది.

“షి లివ్స్ ఇన్ హైదరాబాద్. బట్ దట్స్ నాట్ మై హోమ్. మై హోమ్ వజ్ వేర్ ఐ గ్రూ అప్. వేర్ మై మామ్ అండ్ డాడ్ లివ్డ్. అండ్ వేర్ ఐ హాడ్ ఎ పియానో!”

అతని గుండెలోతుల్లో దాక్కున్న వ్యధ ఆమెకు లీలామాత్రంగా కనిపించి ఆమె చలించి, టేబుల్‌మీద పెట్టివున్న అతని కుడిచేతిని తన రెండుచేతులతోనూ పట్టుకుంది ఓదార్పు నివ్వడాని కన్నట్టు. అంత ఇంటిమేట్‌గా అనిపించిన అనుభవం దొరకడం హమీర్‌కి తండ్రి కనిపించకపోయిన తరువాత అది మొదటిసారి. ‘సమ్‌వన్ టు లీన్ ఆన్?’ అని ఆశపడ్డాడు.

“ఇంకనుంచీ నీ పేరు నీనా,” అన్నాడు హమీర్ పక్కకు తిరిగి పడుకునున్న మీనా నడుముని కుడిచేత్తో చుట్టి దగ్గరకు లాక్కుని వెనకనుంచీ గట్టిగా హత్తుకుంటూ. ఆమె చెప్పినట్లుగా టెక్నికల్ టర్మ్ మైక్రోబయోమ్ అవచ్చేమో గానీ, ఆమె శరీర పరిమళం అతని నాసికాపుటాలకీ, ఆమె స్పర్శ అతని శరీరంలోని అణువణువుకూ పరిచయం.

“ఎందుకనో?” మీనా అడిగింది.

“నీవు” అంటూ తన కుడిచేత్తో ఆమె కుడిచేతి చూపుడువేలిని పట్టుకుని ఆమె ఛాతీమధ్యలో తాకించి, “నాదానివి” అంటూ అదే వేలిని తన పెదాలకి ఆనిస్తూ అన్నాడు. “ఆ పదాల్లోని మొదటి రెండక్షరాలనీ కలిపిన షార్ట్‌ఫామ్ అది!”

“సో లవ్‌లీ!” అని ఆమె అతనివైపు తిరిగి అతని ఎడమచేతిమీద తలని ఆనించి అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది – “నేను నిన్ను ‘నానీ’ అని పిలిస్తే అర్థవంతమవుతుందా?”

“నాయొక్క నీవు? అర్థవంత మయినా కాకపోయినా నన్నట్లా ఇప్పటిదాకా పిలిచిన వాళ్లెవరూ లేకపోవడంవల్ల అది స్పెషలవుతుంది!” అన్నాడు.

“ఐ లవిట్!”

“నాలుగురోజులు నన్ను చూడకుండా వుండడం బావుంటుందా?” అంటూ అతను ఆమె ఛాతీమీద చేతిని ఆనించి, “ఇది నా హోమ్ అని చెప్పిన తరువాత నువ్వెళ్లిపోతే మళ్లీ హోమ్‌లెస్ అవుతాను గదా!” అన్నాడు.

“కాదు. వెకేషన్ కెళ్లిన ట్లవుతావు!” అమాని జవాబిచ్చింది.

“ఐ డోన్ట్ లైకిట్.”

“నిన్ను నాతో తీసుకెడదామంటే మా మమ్మీకి కోప మొస్తుందేమోనని భయం. చెబితే రానివ్వదు. చెప్పకుండా తీసుకెడితే సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది.”

“పోనీ వెళ్లకు. ఇక్కడే వుందాం. నీ డార్మ్‌స్ క్లోజ్ చేస్తేనేం? నా అపార్ట్‌మెంట్‌లో వుందువుగాని. వుయ్ కెన్ బి ఇంటిమేట్ ది హోల్ ఫోర్ డేస్!”

“మా మామ్‌తో అది కుదిరేది కాదు. సెమెస్టర్ బ్రేక్స్‌లో కూడా వెళ్లకపోతే – షి విల్ గో నట్స్. నాకోసమే బ్రతుకుతూంటుంది. స్పెల్లింగ్ బీ అనీ, హిస్టరీ బీ అనీ చిన్నప్పటినించీ తోమింది. దానికి తోడు కరాటే, టెన్నిస్!  నాకు సిబ్లింగ్స్ వుండుంటే ఇంత సఫర్ అయ్యేదాన్ని కాదు. నా పెళ్లికోసమని జ్యుయెల్రీని నా చిన్నప్పటినించే కొనడం మొదలుపెట్టింది తెలుసా? మెడిసిన్లో సీట్ రాకపోతే వచ్చే సెమెస్టర్లో గ్రాడ్యుయేషన్ అవగానే పెళ్లిచేసేస్తా ననేది.”

“అయితే ఇంకేం, మెడిసిన్లో సీటు రాలేదనుకుని నీ స్ప్రింగ్ సెమెస్టర్ అవగానే పెళ్లిచేసేసుకుందాం.”

“రెండు ప్రాబ్లంస్. మొదటిది, నీ బాచెలర్స్ పూర్తికావడానికి అప్పటికి ఇంకా ఏడాది వుంటుంది. రెండవది, మెడిసిన్ పూర్తయేదాకా మా మామ్‌ కుదరనివ్వదు. నా గోల్స్ అన్నీ చిన్నప్పటినించే సెట్‌చేసి వుంచింది.”

“ఇంకా నాలుగున్నరేళ్లా? నో వే!” అని ఆగి, “అసలు పెళ్లెందుకు చేసుకుంటారు? ఇందుకేగా!” అన్నాడు ఆమెని గట్టిగా కౌగిలిలో బంధిస్తూ.

“పెళ్లికే కాదు, ఫస్ట్ టైం కలయికకి కూడా ముహూర్తాలు పెడతార్ట తెలుసా?” అన్నది మీనా.

“మరి దాన్ని ఆల్రెడీ వయొలేట్ చేసేశాం కదా!”

“అందుకని నిన్ను ఏకంగా మా యింట్లో నా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాలా?”

“దట్స్ ఎ గ్రేట్ ఐడియా! ఈసారి థాంక్స్‌గివింగ్‌కి వాళ్లింటికి రావట్లేదనీ, నీ వెనుక మీ యింటికొస్తున్నాననీ మూర్తి అంకుల్‌కి చెబుతాను. ”

“మా మామ్ కేమని చెప్పాలి?”

“ఒక హోమ్‌లెస్ పర్సన్‌కి హోమ్ ఇస్తున్నానని చెప్పు!”

“ఆవిడ నిన్ను చింపిరిజుట్టుతో, పెరిగిన గడ్డంతో, చిరిగున్న బట్టలతో, చేతిలో ఒక బౌల్‌తో ఊహించుకుంటుంది.”

“ఆ గెటప్ తెచ్చుకోవడం చాలా ఈజీ! ఏ పాన్ హాండ్లర్‌కి పది డాలర్లిచ్చినా ఇస్తాడు. కాకపోతే ఇరవై. రిప్లేస్‌మెంట్ బట్ట లిచ్చిన తరువాతలే!”

“ఆ గెటప్‌తో నిన్ను మా ఇంటి ఛాయలకే రానివ్వదు.”

“మరెలా? ఈ కాలేజీలో నీకూ నాకూ కలిపి ఇదే చివరి థాంక్స్‌గివింగ్ బ్రేక్. వచ్చే ఏడాది నేనిక్కడే వున్నా నువ్వు వేరే కాలేజీలో వుంటావు గదా!”

“నీ బాచెలర్స్ అవగానే నాకు దగ్గరగా ఉద్యోగాన్ని వెదుక్కుని వస్తావులే అని అనుకున్నా, ముందు నీ సీనియర్ యియర్ పూర్తిచెయ్యాలి గదా! ఆ ఏడాదిలో నన్నల్లుకోకుండా ఎలావుంటావ్?”

“ఓ మానెకిన్‌ని తెచ్చుకుంటా. అదయితే ఎదురు చెప్పదు. … మరి నువ్వెవరిని అల్లుకుంటావ్?”

“ఒక మాన్‌ని.”

“ఆఁ?”

“డోన్ట్ వర్రీ. ఎవరిని అల్లుకున్నా అది నువ్వే అని అనుకుంటాను.”

“నో వే! దిస్ హోమ్ ఈజ్ మైన్ అండ్ మైన్ ఓన్లీ!” అంటూ ఆమె ఛాతీమీద తల పెట్టుకున్నాడు.

“… పోనీ, నిన్ను ఒక ఫ్రెండ్‌లాగా తీసుకెడతా. అంటే – నీకు గెస్ట్ బెడ్రూం. మా యింట్లో వున్నంతసేపూ నో టచింగ్!”

“అది మరీ భయంకరమయిన కండిషన్. నో బెనిఫిట్స్? ఎదురుగ్గా కనిపిస్తూ ముట్టుకోకూడదంటే అది టార్చర్. దానికి బదులు నేను మా అంకుల్ వాళ్లింటికి వెళ్లడమే బెటర్.”

“ఓకె. ఓన్లీ సీక్రెట్ టచింగ్ విల్ బి ఎలవుడ్.”

“అలా అని నువ్వు చెప్పకపోయినా అవి జరిగేవే. మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్!”

“అట్రాక్టివ్‌గా చేద్దామని ప్లాన్ వున్నా అది ఇప్పుడే చెప్పను. యు హావ్ ఎ ఛాయిస్. మీ అంకుల్ వాళ్లింటికి వెడతావో, నాతో వస్తావో నీ యిష్టం!”

“అంత క్లియర్‌గా చెప్పిన తరువాత ఏం చేస్తాను? ముందే చెబుతున్నా. చివరికి అక్కడ దూరంగా వుంచి, సారీ అని చెప్పావనుకో, దానికి పనిష్మెంట్‌గా తిరిగొచ్చిన మరునాడు – అంటే సోమవారంనాడు – మొత్తం క్లాసు లెగ్గొట్టించి నిన్నల్లుకుపోతా!”

“దట్స్ రీజనబుల్. ముందు మమ్మీకి ఫోన్ చెయ్యనివ్వు,” అని తన సెల్ తీసుకుని ఇంటి నంబర్ డయల్ చేసింది. “మామ్, అయాం బ్రింగింగ్ ఎ హోమ్‌లెస్ పర్సన్ విత్ మి ఫర్ ది బ్రేక్ నెక్స్ట్ వీక్!”

“నీ కేమయినా బుధ్దుందటే? హోమ్‌లెస్ పర్సన్స్‌కి దూరంగా వుండాలని తెలియదూ? పైగా ఇంటికి కూడా తెస్తా నంటున్నావు. చారిటీకి కూడా హద్దూ పద్దూ వుండాలి! ఇదంతా ఆయన పెంపకంవల్ల వచ్చిన గోల. నా మాటెవరు వింటారు గనుక? మీ డాడీతో చెప్పుకో.  ఆ నాలుగురోజులూ నేనే ఎక్కడికన్నా పోతాను!” అన్నదావిడ అవతలిపక్కనుంచీ.

“రిలాక్స్ మామ్. ఈ బ్రేక్‌కి ఎవరన్నా నాతోబాటు ఇంటికొస్తున్నారంటే వాళ్లకి ఈ దేశంలో హోమ్ లేనట్టేగా!”

“ఫారిన్ స్టూడెంటా? అదేదో ముందే చెప్పొచ్చుగా! అమ్మాయేనా?”

“కాదు, అబ్బాయి!”

“ఏ నల్లవాణ్ణో, చుంచుమొహంవాణ్ణో పట్రావట్లేదు గదా!”

“మా దేశంవాడు,” “మా”ని వత్తి పలుకుతూ అంది.

“అంతేలే. మా దేశం వేరు, మీ దేశం వేరు!”

“అవును మరి. మా దేశం అమెరికా, మీ దేశం ఇండియా.”

“నీ బాయ్‌ఫ్రెండా?”

“అన్నీ అనుమానాలే!”

“బాయ్‌ఫ్రెండంటూ చదువు నాశనం చేసుకుంటావని నా భయం!”

“దానికి ఫెర్టిలైజర్ వేసి నీళ్లు పోస్తూండు. తొందర్లోనే పెరిగి, పెద్దై కాయలు కాస్తుంది.”

“చాలా బావుందమ్మా, నీ వ్యంగ్యం! నువ్వు తల్లివయిన తరువాత చూస్తా నువ్వు నీలాంటి పిల్లలతో ఎలా డీల్‌చేస్తావో!”

“ఆవిడ అంత కుతూహల పడుతోంది గదా, మరి ఆలస్యమెందుకు?” అన్నాడు హమీర్ ఆమెని నడుముకు గట్టిగా హత్తుకుంటూ.

“బై మామ్!” అని చెప్పి ఫోన్ హాంగ్ చేసి, “నాట్ నౌ! ఐ హావ్ ఎ ప్రాజెక్ట్ టు ఫినిష్,” అంటూ అతని చేతిని పక్కకుతీసి లేవబోయింది.

“మూన్‌లైట్ సొనాటా ప్లేచేస్తా!”

“నౌ యు హావ్ టెంప్టెడ్ మీ! థర్డ్ మువ్‌మెంట్!!”

“అది వయొలెంట్‌గా వుంటుందంటావు గదా!”

“వయొలెంట్‌గా కాదు. విగరస్‌గా! సమ్‌టైమ్స్ ఐ లైక్ ది ఫస్ట్ వన్, సమ్‌టైమ్స్ ది థర్డ్!”

“ఓకె దెన్! యువర్ టో టు షోల్డర్ ఈజ్ ది పర్ఫెక్ట్ కీబోర్డ్ లెంగ్త్!” అని పక్కమీంచి లేచి కుర్చీని బెడ్‌పక్కకి లాగి అందులో కూర్చున్నాడు. మీనా మంచంమీద చివరకు జరిగి అతనికి దగ్గరగా వెల్లకిలా పడుకుంది. హమీర్ వేళ్లు ఆమె శరీరంమీద నాట్యంచెయ్యడం మొదలుపెట్టాయి.

“వీళ్లిద్దరూ ఏంచేస్తున్నారు?” అంటూ చేతులు తుడుచుకుంటూ వచ్చి భర్త పక్కన కూర్చున్నారు మీనా తల్లి వనజగారు.

“బేస్‌మెంట్లో సినిమా చూస్తున్నట్లున్నారు. శబ్దాలు వినిపించడంలా?” జవాబిచ్చారు రావుగారు.

“సినిమానే చూస్తున్నారో లేక టీవీ సౌండ్ పెద్దగా పెట్టి వెధవ్వేషా లేస్తున్నారో ఎవరికి తెలుసు?”

“అలా వెయ్యాలనే అనుకుంటే ఇక్కడికి రావలసిన అవసరమే లేదు. యూనివర్సిటీలో ఏంచేస్తున్నారో నువ్వు చూడొచ్చావా?”

“తల తిరుగుడు మాటలు కట్టిపెట్టి వాళ్లని పైకొచ్చి కూర్చుని ఆ చూసేదేదో ఇక్కడే కూర్చుని చూడమనండి!”

“దాని పక్కన కూర్చుని సూపర్‌వైజ్ చేసే కాలం దాటి అయిదేళ్లయింది. నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే మాట్లాడకుండా వుండడమే ఉత్తమం!”

వనజగారు కాసేపు ఏం మాట్లాడలేదు. తరువాత, “మేమిద్దరం పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాం అంటుందేమో!” అన్నారు.

“మంచిదేగా! పెళ్లిసంబంధాలు వెదికే పని తప్పుతుంది. ఎంతయినా తెలుగువాళ్ల పిల్లాడు.”

“ఏం మంచిది? దీనికంటే ఒక ఏడాది చిన్న! ఇదేమో డాక్టరవబోతోంది. అతను డిగ్రీ పూర్తిచేసి వెంటనే ఉద్యోగంలో చేరడానికే ఇంకో ఏడాదిన్నర పడుతుంది! ఇటు వయసులోనూ, అటు చదువులోనూ, పైగా సంపాదించే శక్తిలోనూ – ఏ విధంగా చూసినా వరహీనమే!”

“అన్నింటినీ ఆర్థిక సంబంధాలతో ముడిపెట్టకు. మీ చెల్లెలు డాక్టర్. బాంక్ ఉద్యోగిని చేసుకోలేదూ?”

“ఎప్పటిమాట చెబుతున్నారు? అప్పుడంటే తప్పక. ఇప్పుడంత ఖర్మేం పట్టింది?”

“నీకు అల్లుడుగా వచ్చేవాడు డాక్ట రయితే చాలు – తెల్లవాడయినా, నల్లవాడయినా!”

“నల్లవాళ్లనీ, ఆ చైనీసు వాళ్లనీ పొరబాటున కూడా ఒప్పుకోను. దేశం గొడ్డుపోయినట్లు ఇంతమంది ఇండియన్లే వుండగా ఇంకొకళ్ల అవసర మేముంది?”

“నీతో వాద నెందుకు గానీ, అది వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాం!”

“… పాపం హమీర్‌ది విషాద గాధ కదా!”

“పోయినవాళ్లు సుఖంగా వుంటారు, బతికున్నవాళ్లకే చచ్చే చావు అని ఎక్కడో చదివిన గుర్తు. అతనికి చిన్నవయసులోనే ఇంత కష్టం!”

“అతన్ని చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలు.”

“ఎందుకనో?”

“ఎందుకనేమిటి? మామగారి గోలే లేదు. అత్తగారా ఇండియాలో వుంటుంది. అందుకని ఆ పిల్ల తల్లిదండ్రులున్న వూళ్లోనే గనక కాపురం పెడితే ఎంచక్కా వాళ్లింట్లోనే వుండొచ్చు – ఇల్లరికంలాగా అన్నమాట. వేరే వూళ్లో వున్నా కూడా, క్రిస్మస్‌కి ఒకళ్లింటికీ, థాంక్స్‌గివింగ్‌కి ఇంకొకళ్లింటికీ స్ప్లిట్ చేసుకోవాల్సిన అవసర ముండదు.”

“హోమ్‌లెస్ పిల్లాడిమీద నీ కన్ను అప్పుడే పడినట్టుందే!”

“నేనేం చేసుకుంటాను? ఇంకెవరయినా సంబంధాలు చూస్తుంటే చెబుదామని, అంతే! అవునూ, అతణ్ణి పట్టుకుని హోమ్‌లెస్ అంటుందేమిటి ఇది? నేనింకా ఎవరో పిచ్చోడయ్యుంటా డనుకున్నాను.”

“అతనికి అందరిలాగా అయాం గోయింగ్ హోమ్ అని చెప్పడానికి లేదుగదా, అందుకని. అంతే తప్ప ఏ బ్రిడ్జీల క్రిందో పడుకుంటున్నాడని కాదు. యూనివర్సిటీలో ఇది కడుతున్నంత ఫీజూ కడుతున్నాడుగా!”

“ఏమో, కడుతున్నాడో, లేక అదన్నట్టుగా ‘హోమ్‌లెస్,’ అని జాలిపడి యూనివర్సిటీ వాళ్లు స్కాలర్షిప్ యిస్తున్నారో! ఆ రెడ్డిగారి భార్య చెప్పినట్టు దీనిలాంటివాళ్లకి స్కాలర్షిప్పు లివ్వరు – డబ్బులు కట్టగలం గదా అని మనలాంటివాళ్ల చేత మొత్తం కక్కిస్తూంటారు!”

“మిగిలిన వాళ్ల సంగతి తెలియదు గానీ, ఇతను మంచి కుర్రాడి లాగానే వున్నాడు. మీనాలాగే స్వంత ప్రతిభతో ఆ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాడు. కష్టాల్లో వున్న ఒక తెలుగు వాళ్లబ్బాయికి అలాంటి స్కాలర్‌షిప్ ఇస్తే, ఆ యూనివర్సిటీ వాళ్లు మంచిపనే చేశారని అనుకోవాలి.”

“అంతేలెండి. మీరు నన్నెప్పుడు సపోర్టు చేశారు గనక ఇప్పుడు చెయ్యలేదనుకోవడానికి! … నా బాధ మీకర్థం కాదు. ఇంతకాలం ఎవరినీ ఇంటికి తీసుకురానిది ఇప్పుడితణ్ణి పట్టుకొచ్చిందంటే నాకు వర్రీగా వున్నది. వెళ్లేటప్పుడు చెబుతాను వెధవ్వేషా లెయ్యకుండా బుధ్ధిగా చదువుమీద కాన్సన్‌ట్రేట్ చెయ్యమని!”

“నువు చెప్పేది చెబుతావు, అది చేసేది ఎలాగో చెయ్యక మానదు. నా సలహా అల్లా, నువు ఏమీ మాట్లాడకుండా వుండడం. ఇంకో ఆర్నెల్లల్లో ఎలాగో మీనా వర్జీనియా టెక్ వదిలి వెళ్లక తప్పదు – అక్కడ మెడిసిన్ ప్రోగ్రాం లేదు కాబట్టి. హమీర్‌కి చదువు పూర్తిచెయ్యడానికి ఇంకో ఏడాది ఎలాగో పడుతుంది. లాంగ్ డిస్టేన్స్ రిలేషన్‌షిప్స్ కాలాన్ని తట్టుకుని సర్వైవ్ అయ్యేవి చాలా తక్కువ అని ఎక్కడో చదివిన గుర్తు. పైగా, మెడిసిన్లో దీనికి ఊపిరి సలపనంత వర్కెలాగో వుంటుంది. అందుకని నీకు సమస్య వుండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ నిలిచిందనుకో, ఆ దూరాన్ని తట్టుకుని దాన్ని ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికినందుకు సంతోషించి, అవార్డుగా పెళ్లి చేసేద్దాం!” అన్నారు రావుగారు.

ఆయనతో వాదించి లాభం లేదని అనుకున్నారో, లేక మీనా తన మాట వింటుందన్న నమ్మకంతో వున్నారో గానీ, వనజగారు ఆయనను ఖండించలేదు. అలాగని సైలెంట్‌గా వున్నంత మాత్రాన ఆవిడ ఒప్పుకున్నట్టే నని ఆయన భ్రమపడడానికి ఆవిడతో గల సంబధం ఆ క్రితం రోజు నించీ మొదలవలేదు గదా!

ఇంకా ఉంది..

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఏడవ భాగం
ఫిబ్రవరిలో రెండవ శనివారం. రోజంతా ఫ్రీజింగ్‌కన్నా తక్కువగా వున్న టెంపరేచర్ సాయంత్రమయ్యేసరికి ఇంకో ఇరవై డిగ్రీలు క్రిందకు పడిపోయింది. హమీర్ అపార్ట్‌మెంట్‌లో మాత్రం అమాని చలిమంట లాగా అతణ్ణి చుట్టబోతోంది.

“మామ్ మూర్తి అంకుల్ వాళ్లింట్లో వుండడం మంచిదయింది,” అనుకున్నాడు హమీర్.

ఆరోజు పొద్దున్న అమాని టెక్స్ట్ పంపింది సాయంత్రం కలవాలంటూ – అతని అపార్ట్‌మెంట్లో. కాలికి కట్టు విప్పినాగానీ అతను తల్లితోబాటు ఇంకా మూర్తిగారింట్లోనే వుంటున్నాడు – వాళ్లు తమకీ కాలక్షేపంగా వుంటోందని బలవంతం చెయ్యడంవల్ల. రోహిత్ ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టిన తరువాత అపార్ట్‌మెంట్ తీసుకుని వెళ్లిపోయాడు. అందుకని భవానిగారికి కూడా సరోజగారు అక్కడ వుండడం మంచి కాలక్షేపాన్నిస్తోంది.

జనవరిలో రోమియో అండ్ జూలియెట్ చూసిన తరువాత మళ్లీ అమాని వద్దనుంచీ మెసేజ్‌లేవీ లేవు ఆరోజు పొద్దున్న దాకా. అందుకే అమాని అపాయింట్‌మెంట్ ఇవ్వగానే హమీర్ ఎగిరి గంతేసి, సరోజగారు “ఇంత చల్లగా వున్నప్పుడు వెళ్లడం అంత అవసరమా?” అని అడ్డు తగుల్తున్నాగానీ అక్కణ్ణించీ బయటపడ్డాడు.

అమాని చెప్పిన సమయానికి గంట ముందుగానే అపార్ట్‌మెంట్‌కి చేరి, బయటినించీ దాన్లోకి అడుగుపెట్టేవాళ్లకి వింటర్ జాకెట్లకే కాక స్వెట్టర్లకి కూడా అవసరమే లేకుండా వుండేలా – ఇంకా చెప్పాలంటే స్వెట్టర్లు వేసుకునుంటే ఆ వేసుకున్నవాళ్లకి చెమటలు పొయ్యడమే కాక మంటలు కూడా పుట్టేలా థర్మోస్టాట్‌లో టెంపరేచర్‌ని సెట్ చేశాడు. తను క్యాజువల్‌గా వున్నానని చెప్పడాని కన్నట్టు షార్ట్, పల్చగా వుండే టీషర్టూ వేసుకున్నాడు. వచ్చేటప్పుడు 7-ఎలెవెన్‌లో ఆగి తెచ్చిన బీర్ సిక్స్ పాక్‌ని రెఫ్రిజిరేటర్లో పెట్టి, వైన్ బాటిల్‌ని కిచెన్ కౌంటర్‌మీద పెట్టాడు. అమాని తనని ఎందుకు కలవాలన్నదో తెలియకపోయినా అదంత ముఖ్య మనిపించలే దతనికి. అంతకన్నా కూడా, ఆమెని ఇంటిమసీలో నెక్స్ట్ స్టెప్‌కి ఎలా తీసుకెళ్లాలన్న ప్రశ్నేఅతని మదినిండా కమ్ముకున్నది. పైగా, ఆమె కలిసినప్పటినించీ ఆమె తన బ్రెస్ట్స్‌గూర్చి అడగడం, ఇంటికి తీసుకెడితే ఏంచెయ్యా లనుకుంటాడో చెబుతూండడం అతనికి ఆ నెక్స్ట్ స్టెప్ ఎంతో దూరంలో లేదనిపించేలా చేసింది. సోఫాలో కూర్చుని టీవీని ఆన్‌చేసి అన్య మనస్కంగానే చూస్తూ ఒక బీర్ పూర్తిచేశాడు.

కాలింగ్‌బెల్ శబ్దం వినగానే హమీర్ ఎగిరి గంతేసి లేచి వెళ్లి తలుపు తీసి చాలా క్యాజువల్‌గా వున్నట్టు కనిపించేలా నటిస్తూ అమానిని లోపలకు ఆహ్వానించాడు. ఆమె లోపలకు రాగానే తన హాండ్‌బాగ్‌ని సోఫా పక్కన పెట్టి, వింటర్ జాకెట్‌ని విప్పి అతని చేతికిచ్చింది. అతను దాన్ని క్లోజెట్లో తగిలించి వచ్చేసరికి అమాని స్వెటర్‌ విప్పింది.  దానికింద వున్న పల్చని, శరీరాన్ని హత్తుకుంటూ క్రిందకు జారుతున్న పింక్ కలర్ షర్టుని తను అంతకుముందు ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో చూసినట్టు అతనికి అనిపించింది. దానికింద బ్లాక్ స్కర్ట్.

“కెన్ ఐ ఆఫర్ యు సమ్‌థింగ్ టు డ్రింక్?” అని అడిగి వెంటనే నాలిక కరచుకున్నాడు. దానికి కారణం, ఆ షర్టుని కూడా తొలగించబోతున్న ఆమె అతని మాటలకి ఆ పనిని విరమించడం, ఆ షర్టుకీ ఆమె వక్షానికీ మధ్య మరే ప్రతిబంధకాలూ లేవని అతనికి స్పష్టంగా కనిపించడం.

ప్రశ్నార్థకంగా చూసిన ఆమె కళ్లకి,”బీర్? వైన్?” అని నోటితో జవాబిచ్చాడు. ఒక్కక్షణం ఆలోచించి, “వైన్,” అన్నది అమాని.

అది జారిపోయిన ఆపర్చ్యూనిటీ కాక జస్ట్ డిలేడ్ మాత్రమే అయ్యుంటుందని ఆశిస్తూ అతను రెండు వైన్ గ్లాసుల్లో వైన్‌ని పోసి ఒకదాన్ని ఆమెకిచ్చి, తను ఒకదాన్ని పట్టుకుని “చీర్స్!” అన్నాడు. ఆమె మెడిసిన్‌ని తీసుకున్నట్టుగా రెండు గుక్కలు వేసి ఆ గ్లాస్ ని పక్కన టేబుల్ మీద పెట్టి, లేచి నిల్చుని షర్ట్‌ని తొలగించి సోఫామీద వేసింది. హమీర్ బయటపడ్డ ఆమె నిండైన వక్షాన్ని చూస్తూ ఏం మాట్లాడాలో అర్థంకాక నిలబడ్డాడు. అమాని అతని చేతిలోని గ్లాస్‌ని పక్కన టేబుల్‌మీద పెట్టింది. అలా వంగుతున్నప్పుడూ, లేచి నిలబడుతున్నప్పుడూ తనలో కలిగించిన భూకంపాలని సృష్టించిన వక్షసంపదని తనివితీరా చూడ్డానికి అతనికి అవకాశం ఇవ్వకుండానే ఆమె తన చేతులతో అతని చేతులకి ఆ సంపద నిందించి, అతని పెదాలకి తన పెదాలని అందించడానికి కాలి మునివేళ్లపై నిలబడి గడ్డాన్ని పైకెత్తింది. అతని పెదవులు ఆమె పెదవులని తాకేటంతలో అతణ్ణి రెండు చేతులతోనూ వెనక్కు తోసి, సోఫామీదకి విసిరేసిన షర్టుని తీసుకుని దానితో ఛాతీని కప్పుకుంటూ సోఫాలో కాళ్లు పెట్టి ముడుచుకుని కూర్చుని, “ఐ కాన్ట్ గో త్రూ విత్ దిస్!” అని కళ్లు మూసుకుంది. ఆమె కళ్లనుంచీ నీళ్లు ధారగా కారడం హమీర్‌కి కనిపించింది.

ఆ పరిణామానికి విస్తుపోయిన హమీర్ మెల్లగా వెళ్లి ఆమె పక్కన సోఫాలో కూర్చుని ఒకచేత్తో ఆమె జుట్టులో వేళ్లుపెట్టి దువ్వుతూ, “వై నాట్?” అని మాత్రం అనగలిగాడు.

“బికాజ్ అయామ్ యూజింగ్ యు. అయామ్ ఎబ్యూజింగ్ యువర్ ట్రస్ట్!” అమాని జవాబిచ్చి, సోఫాలోనే అతనివైపుకు వంగి అతని ఒళ్లో తలపెట్టి, పక్కకు తిరిగి ముడుచుకుని పడుకుంది.

తన కుడిచేత్తో ఆమె కుడిభుజాన్ని నిమురుతూ, “వేర్ డజ్ ది క్వశ్చన్ ఆఫ్ యూజింగ్ ఆర్ ఎబ్యూజింగ్ కమ్ ఫ్రం? … యు నో, వుయ్ విల్ బి పార్ట్నర్స్! యు హర్డ్ ది థింగ్ అబవుట్ ది గూస్ అండ్ ది గాన్‌డర్ – రైట్?” మాటలని వెదుక్కుంటూ, ఆగిపోయిన ప్రోగ్రాంని మళ్లీ కొనసాగించాలని ప్రయత్నిస్తూ అన్నాడు.

ఆమె అలాగే పక్కకు తిరిగి వెల్లకిలా పడుకుని తిన్నగా అతని మొహంలోకి చూసింది. ప్రస్ఫుటంగా కనిపించిన ఆమె నల్లని కనుబొమలూ, మెరుస్తున్న పెద్ద పెద్ద కళ్లూ, పొడవైన ఐలాషెసూ, సన్నని ముక్కూ, పల్చని పెదాలూ అతణ్ణి పిచ్చెక్కించాయి. అతను కుడిచేతి చూపుడువేలికి ఆమె పెదాల వంపుని పరిచయం చేసినా, తన చేతివేళ్ల వెనకభాగానికి ఆమె చెక్కిళ్ల మెత్తనిదనాన్ని నిమిరుతూ చెప్పించుకున్నా, ఆమె తన ఒడిలో తలపెట్టి అలాగే సోఫాలో పడుకుని వుండడం అతనికి ఇది స్కెడ్యూల్డ్ ప్రోగ్రామ్‌లో చిన్న లల్ మాత్రమే అన్న ధైర్యా న్నిచ్చింది.

“నేను ఫోన్లో నీతో మాట్లాడకపోవడం, టెక్స్ట్ మెసేజీలని మాత్రమే పంపడం, నేను కలవాలనుకున్నప్పుడే నిన్ను కలవడం – వీటివల్ల నేనో తిక్కల్దాన్ని అని నీకు అనిపించలేదా?” అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది అమాని.

“నాట్ యూజువల్ బిహేవియర్! అలాగని దాన్ని క్రేజీ అని అనలేనుగదా!”

“ఈ ఆర్నెల్లల్లో అయిదుసార్లు మాత్రమే నిన్ను కలవడం నీకు కోపం తెప్పించలేదా – ఏమిటీ తనో పెద్ద ప్రిన్సెస్‌లా బిహేవ్ చేస్తోందీ అని?”

“నువ్వు పక్కనుంటే బాగుండేది అని చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా యాక్సిడెంట్ తరువాత. ఒక వారం తరువాత మా అమ్మ వచ్చినా లోన్లీగా ఫీలయిన మాట మాత్రం నిజం. ఐ విష్‌డ్ యు వర్ దేర్! షి ఈజ్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ యు.”

“అందుకనే, నిన్ను స్కేటింగ్‌కి తీసుకెళ్లిన తరువాత గిల్టీగా ఫీలయ్యాను. స్విమ్మింగ్‌కి తీసుకెళ్లిన తరువాత మరికాస్త. బోట్‌రైడ్‌కెళ్లి, ముద్దుపెట్టిన తరువాత ఇంకొంత. ఇప్పుడయినా నాగూర్చి నీకు పూర్తిగా చెప్పకుండా ఇందాక మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పూర్తిచేసుంటే ఆ గిల్ట్ భారాన్ని మొయ్యడం ఇంక నావల్ల కాదనిపించింది. … నా బకెట్ లిస్ట్‌లోని ఐటంస్‌కి చెక్ మార్కులు పెట్టడానికి నిన్ను వాడుకున్నా నిప్పటిదాకా!” అని దృష్టిని అతని కళ్లమీంచి తప్పించింది.

“ఏ కాన్సర్‌తోనో లేక హార్ట్ ప్రాబ్లమ్‌తోనో కొద్ది రోజుల్లోనో లేక కొద్ది వారాల్లోనో టపా కట్టేస్తున్నానని చెప్పవుగదా?” అన్నాడు అపనమ్మకానికి కొద్దిగా హాస్యాన్ని మేళవించి.

“కాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ బాధ పెట్టేది ఒక్క రోగిని మాత్రమే. అంతకన్నా ఘోరమైనదాన్ని ఆపాలనివున్నా గానీ, నిస్సహాయతచేత నా పరిమితుల్లో నేనుంటూ లైఫ్‌లో సింపుల్ ప్లెజర్స్ రుచిచూద్దామని నేను గత ఆర్నెల్లుగా చేస్తున్న ప్రయత్నమిది!”

“కాన్సర్‌నీ హార్ట్ ప్రాబ్లంస్‌నీ మించిన సమస్య లేముంటయ్?” అపనమ్మకంగా అడిగాడు హమీర్.

“ఆ ప్రాబ్లమ్ పేరు ముదస్సర్.”

“నిన్నేమయినా హరాస్ చేస్తున్నాడా?”

“నన్నే కాదు. మా అక్కనీ, ఏమీ తెలియని వాళ్ల పిల్లలనీ, మా అమ్మీనీ, బాబానీ! ఇక్కడితో ఆగుంటే సమస్యే వుండకపోను. అలాంటి వ్యక్తులవల్ల బాధపడే కుటుంబాలు ప్రపంచంలో ఎన్ని లేవు? వాడి స్పెషాల్టీ ఏమిటంటే, వాడు జన్మనిచ్చిన తల్లినికూడా రొమ్ముమీద కొట్టే వ్యక్తి. అన్నంపెట్టిన చేతిని నరకాలనుకునే వ్యక్తి.”

“వాడి ప్రవర్తనకీ నీ బకెట్ లిస్ట్‌కీ సంబంధ మేమిటి?”

“ఈ జీవితంలో నాకు దొరకనివేమిటో బాగా అర్థమయింది. అందుకే, దొరకనివాటిని దొరకపుచ్చుకుందామని!”

“నాక్కొద్దిగా అర్థమయ్యేలా చెప్పు!”

“బాబా మా కుటుంబాన్ని తీసుకుని అమెరికా వచ్చేసరికి నాకు ఎనిమిదేళ్లు. అక్కకి పది. కర్ణాటకలో గుల్బర్గా దగ్గరనుంచీ వచ్చాం. అంకుల్ – బాబా బ్రదర్ – మా బాబాకంటే పదేళ్లు పెద్దవాడు. ఇంజనీరింగ్ చదివి అమెరికా వచ్చారు. ఆయన స్పాన్సర్ చేసిన గ్రీన్‌కార్డ్‌తో వచ్చాం. బాబాకి చదువు అబ్బలేదు. అందుకని అంకులే ఆయనచేత ఒక గ్రోసరీ స్టోర్ ఓపెన్ చేయించారు. దాన్లో బాబాకీ, అమ్మీకీ వారంలో ఏడురోజులూ సరిపోయేది. సెలవులంటూ వుండవు. దాంతో, సురయా – అదే, మా అక్కయ్య – చదువుని గూర్చి ఆలోచించడానికి వాళ్లకి కుదర్లేదు. మాకు ఇంగ్లీష్ రాకపోవడం ముఖ్యమైన అడ్డంకి. సురయా భయపడి స్కూల్‌కి వెళ్లే ఆలోచనని దగ్గరకే రానివ్వలేదు. నేను స్కూల్‌కి వెడతానంటే బాబా వద్దనలేదు. అమ్మీ, బాబా గ్రోసరీ స్టోర్‌తో బిజీగా వుండడంతో సురయానే ఇంటిపనంతా చూసుకునేది. నాకు ఎలిమెంటరీ స్కూల్లో ఫ్రెండ్స్ వుండేవాళ్లు కారు – భాషతో ప్రాబ్లం కనుక. మిడిల్ స్కూల్‌కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిన తరువాత కొంచెం ఫర్లేదు; క్లాసులోవున్న ఇండియన్లతో మాట్లాడగలిగేదాన్ని. అయితే, మా పారెంట్స్ నన్నెప్పుడూ ప్లేడేట్స్‌కి తీసుకువెళ్లేవాళ్లు కారు. వాళ్లకి తీసుకెళ్లే తీరికేదీ? అందుకని నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ దొరకలేదు. హైస్కూల్లోనూ అదే పరిస్థితి.

“సురయా మొగుడి రూపంలో మా కొంపకి సైతాన్ వచ్చాడు. ముదస్సర్ బాబా పాకిస్తాన్‌నుంచీ. అంకుల్ స్టెర్లింగ్‌లో కార్ రిపేర్ షాప్ పెట్టుకున్నారు. ఆయనకి బాబా పరిచయమయిన తరువాత, ఆయనకి ఒక కొడుకున్నాడని తెలిసింది. ఇద్దరూ మాట్లాడుకుని సురయాకీ ముదస్సర్‌కీ నికా చేద్దామనుకున్నారు. అంకుల్ మంచివాడే. ఈ సాలానే ఒక పెద్ద సైతాన్! ఆ పెళ్లయేటప్పటికి నేను హైస్కూల్లో జూనియర్ యియర్ పూర్తిచేశాను. 2006లో ఇలా పెళ్లయిందో, లేదో, ఆ సైతాన్ నన్ను చదువు మానిపించమన్నాడు. వాడు సురయాని బాధలు పెడతాడని బాబా  భయపడ్డారేమో తెలియదు గానీ, ‘పోనీ, మానెయ్యకూడదా?’ అని నన్ను అడిగారు. కుదరదని నేను మొండికేస్తే హైస్కూల్లో సీనియర్ యియర్ పూర్తిచెయ్యనిచ్చారు.

“ఆ డిసెంబర్లో కాలేజీలకి అప్లై చెయ్యబోతున్నప్పుడు ముదస్సర్‌ పెద్ద గోలచేశాడు – ఆడవాళ్లు చదవకూడదని ఖురాన్‌లో వున్నదని. ఇండియాలో వున్నప్పుడు అప్పుడప్పుడూ బాబా మసీదు కేమయినా వెళ్లేవారేమోగానీ, ఇక్కడికొచ్చిన తరువాత స్టోర్ నడపడంలో పడి అసలు వెళ్లడంగూర్చి ఆలోచించడమే మానేశారు. అయినా గానీ, సురయా కాపురం గూర్చిన వర్రీకొద్దీ, “ఆ చదువు నీకు అంత అవసరమా?” అని నన్ను ప్రశ్నించారు. ఆయన నడిపే గ్రోసరీ స్టోర్‌కి పోటీగా కొరియన్ స్టోర్ వచ్చి, ఇండియన్ ఐటంస్ అన్నీ తెచ్చి, మా స్టోర్‌కి రాబడిని బాగా తగ్గించింది. అది ఆయన ముఖ్యమయిన బాధ.

“ఆ యిద్దరితోనూ పోట్లాడి, మొత్తానికి కమ్యూనిటీ కాలేజీలో చేరాను. యూనివర్సిటీలతో పోలిస్తే ట్యూషన్ తక్కువే. పైగా ఇంట్లో వుండి వెళ్లిరావచ్చు. ఈ ప్రలోభపెట్టే పాశ్చాత్య సంస్కృతి కళ్ల ముందాడించే దుష్ప్రభవాలకి లోనవుతున్నానని ముదస్సర్ ఎప్పుడూ పనిగట్టుకుని మా యింటికి వచ్చి, నన్ను కూర్చోబెట్టి గంటలగ్గంటలు ఉపన్యాసా లిచ్చేవాడు. వాటిని తప్పించుకోవడానికి కాలేజీలో ఎక్స్‌ట్రా కోర్సులు తీసుకుంటే, నేను కాలేజీలో ఎవరితోనో తిరుగుతున్నానని వాడికి అనుమానం. నామీద నిఘా కూడా పెట్టించాడు.

“రెండేళ్లయేసరికి నా కౌన్సిలర్, నన్ను జార్జ్ మేసన్ యూనివర్సిటీకి మారమని సలహా యిచ్చారు – నా ప్రతిభని వుపయోగించుకోవడానికి అదే సరయిన ప్లేస్ అని. ముదస్సర్ మళ్లీ గోలపెట్టాడు – అక్కడ చాలామంది చెడిపోయిన వాళ్లున్నారనీ, వాళ్లల్లో ఇండియన్సే ఎక్కువమంది వున్నారనీ, వాళ్లతో చేరి నేను చెడిపోవడం తనకిష్టం లేదనీ. వాడు చేసే వుద్యోగం అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు వాళ్ల బాబాకి మెకానిక్‌గా హెల్ప్ చేసేవాడేమోగానీ, అప్పటికి పూర్తిగా మానేసి ఇంట్లో కూర్చుంటున్నాడు. పైగా, వేరే కాపురం పెట్టి, ఆ ఖర్చులన్నీ వాళ్ల బాబామీద రుద్దుతున్నాడు. నా క్లాస్ స్కెడ్యూల్స్ అన్నీ పనిగట్టుకుని నా దగ్గర్నుంచీ తెలుసుకుని, తన డొక్కుకార్లో నన్ను ఇంటినుంచీ పికప్ చేసుకుని, కాలేజీలో దించి, తరువాత మళ్లీ ఇంటిదగ్గర డ్రాప్ చేసేవాడు.

“పెళ్లవగానే రెండేళ్లల్లో ఇద్దరు పిల్లలని కన్నది సురయా. ముదస్సర్ వాళ్లని స్కూల్‌కి పంపనివ్వడు. వాళ్లుంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు వాళ్లని స్కూల్‌కి ఎందుకు పంపించట్లేదని ఎవరో అడిగారని చీప్ నైబర్‌హుడ్‌లో ఒక టవున్ హోమ్‌లోకి ఫ్యామిలీని మార్చాడు. అక్కడ వీడిలాంటివాళ్లే చాలామంది. డ్రగ్ రిలేటెడ్ షూటింగ్సో లేక డెత్సో వుంటే తప్ప పోలీసులుకూడా అక్కడకి రారు. అక్కడికి మారిన తరువాత సురయాని గానీ పిల్లల్ని గానీ బయటికి రానివ్వకపోవడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలు ఏం పాపం చేసుకున్నారో గానీ, వాళ్లకి స్కూలు కెళ్లడానికే గాదు, బయట ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఫ్రీడమ్ లేదు.

“గ్రాడ్యుయేట్ అయిన తరువాత ఏ కాలిఫోర్నియాలోనో ఉద్యోగం వెదుక్కుని వెళ్లిపోదాం అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే నాకోసం తనే ఉద్యోగం పట్టుకొచ్చాడు – లోకల్‌గానే, తన స్నేహితుడి కంపెనీలో – అక్కడంతా ‘మనవాళ్లే’ నంటూ. నా ఉద్యోగం నేనే వెదుక్కుంటానంటే వాడింకా మొండికేసి, బాబా చేత, సురయా చేత కూడా వత్తిడి పెట్టించాడు.

“ముదస్సర్ మా జీవితాల్లోకి ప్రవేశించిన తరువాత నా జీవితంలో నాకు ఏ విషయం గూర్చయినా స్వాతంత్ర్యం మిగిలిందంటే అది నా తిండి విషయంలోనే! వాళ్ల పెళ్లయిన తరువాతే నాన్-వెజిటేరియన్ తినడం నేను పూర్తిగా మానేసింది.  అది, వాడికి, ‘ఇన్‌డిపెన్డెన్ట్‌గా వుండడం నాకిష్టం’ అని తెలియజెప్పడానికి! మొహరంకీ, బక్రీదుకీ మా యింటికొచ్చినప్పుడు నా తిండిగూర్చి కామెంట్ చెయ్యకుండా ఒక్కక్షణం వుండలేడు. పైకి వాణ్ణి ఇగ్నోర్ చేసినట్టే కనిపిస్తాను గానీ లోపల మాత్రం మండుతూంటుంది. ఆఖరికి బట్టల విషయంలో కూడా నాకు స్వాతంత్ర్యం లేదు. నా అపార్ట్‌మెంట్‌లో సర్‌ప్రైజ్ ఇన్‌స్పెక్షన్లు చేసి ఇస్లాంకి విరుధ్ధమంటూ బట్టలని ట్రాష్ బాగ్‌లో పట్టుకెళ్లి పారేస్తూంటాడు. ఈ షర్ట్ ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో చూసినట్టు నీకు గుర్తుండే వుంటుంది. ఈ స్కర్టూ, అప్పుడు వేసుకున్న జీన్సూ కూడా స్నేహితురాలి పెళ్లికోసం కొనుక్కున్నవి.  జార్జ్ మేసన్లో క్లాస్‌మేట్. పెళ్లికి ఇన్వైట్ రాగానే ఎగిరి గంతేశా – వీడినించీ రెండురోజులయినా తప్పించుకోవడానికి వీలవుతుందని.  ఇంత ప్లెయిన్‌గా వున్న డ్రస్ గూర్చికూడా వాడు గోలపెట్టాడు – స్కర్ట్‌మీద సన్నసన్న మెరుపులున్నాయనీ, ఆ పింక్‌కు బదులు లూజ్‌గా వుండే నల్ల చొక్కా వేసుకొమ్మనమనీ. ఇవ్వి ఇన్నాళ్లు నా దగ్గరున్నయ్యంటే కారణం నేను వాటిని నా మాట్రెస్‌కీ బాక్స్ స్ప్రింగ్‌కీ మధ్యలో దాచడం. పెళ్లి నించీ తిరిగొచ్చిన తరువాత ఎంత గోలచేశాడో!

“అయితే, ఆ పెళ్లికోసమని డెన్వర్ వెళ్లే రెండ్రోజుల ముందర సురయా నాకొక భయంకరమయిన వార్తని చెప్పింది. ఆ ముదస్సర్ వల్ల అదే గాక, దానితోబాటు పిల్లలూ, బాబా, అమ్మీ, నేను, వాడి తరఫువాళ్లూ, అందరం సర్వనాశన మవబోతున్నాం. అదిగానీ, నేను గానీ చెయ్యగలిగిందేమీ లేదు. ఒకవేళ చెయ్యగలిగిన దేమయినా వున్నాగానీ దాని ఫలితాలు కూడా దారుణంగానే వుంటాయి.

“బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ వున్న డ్రస్ బావుంటుందనుకున్నా గానీ, ఆ నలుపే నా జీవితంగా వ్యాపించిందని డిప్రెషన్లోకి వెళ్లాను – ఆ పెళ్లిలో! కెన్ యూ బిలీవిట్? సీ దిస్ బ్లాక్ స్కర్ట్? కలర్ ఆఫ్ సారో! కలర్ ఆఫ్ డార్క్‌నెస్! అప్పుడు వేసుకున్నదే. దానికి తోడు ఆ విమానం చెడిపోవడం. అది కూలిపోయుంటే బావుండే దనుకున్నాను ఆ ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని.

“అప్పుడు నన్ను వెదుక్కుంటూ వచ్చిన ఆశాకిరణానివి నువ్వు. కాలేజీ రోజుల్లో కూడా ఏ ఇండియనూ నాదగ్గరకు రావడానికి గానీ, నాతో మాట్లాడ్డానికి గానీ ఇంటరెస్ట్ చూపలా. అలాంటిది నువ్వు నాతో మాట్లాడ్డమే కాకుండా రెచ్చగొట్టే మాటలతో మొదలుపెట్టావు. అప్పుడనిపించింది నాకు – నేనొక బకెట్ లిస్ట్‌ని ఎందుకు తయారుచేసుకోకూడదని! నీ సహాయంతోనే ఇవాళ్టిదాకా నిరాశా వూబిలో కూరుకుపోకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను! యు హావ్ బీన్ మై రే ఆఫ్ లైట్ అండ్ హోప్!

“ఆర్నెల్ల క్రితందాకా నేనుకూడా ఎవరినో ఒకళ్లని నికా చేసుకుని వెళ్లిపోతానన్న ఆశవుండేది. అది అంతరించిపోవడానికి కారణం ఇక్బాల్. ఇది ఫిబ్రవరి కదా, వాడు ముదస్సర్‌ని దాదాపు సంవత్సరం క్రితం కలిశాట్ట – సురయా చెప్పింది. ఇక్బాల్ కలిసేముందు దాకా అమెరికా ఓ సైతాన్ల దేశమని ముదస్సర్ ఎంత తిట్టినా, వాడు కలిసిన తరువాతే గన్లూ, బాంబులూ ముదస్సర్ దగ్గర చేరడం మొదలుపెట్టింది. అమెరికా వచ్చిన పదేళ్ల తరువాత కూడా పాకిస్తాన్‌కి వెళ్లాలని అనుకోని ముదస్సర్ ఏడెనిమిది నెలలక్రితం అక్కడికి కెళ్లొచ్చాడు.  ఇక్బాల్ వాడితో వెళ్లాడో లేదో నాకు తెలియదు గానీ, వాడు కలవమన్నవాళ్లని ముదస్సర్ కలిశాడని, అక్కడ ఈ వెపన్స్‌ని వాడడంలో ట్రైనింగ్ కూడా తీసుకుని వుంటాడని నా నమ్మకం.  వాడు పాకిస్తాన్లో వున్నప్పుడే నాకు కొద్దిగా సురయాతో మాట్లాడ్డానికి వీలయ్యింది. ఇక్బాల్‌తో కలిసి వాడు చెయ్యబోయే పని మమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఆ విషయం డెన్వర్ వెళ్లే ముందరే నాకు బాగా తెలిసొచ్చింది. ఎందుకంటే, పాకిస్తాన్ వెళ్లే ముందర ఆ వెపన్స్ అన్నింటినీ ఇంట్లోంచి ఖాళీ చేస్తే సురయా ఊపిరి పీల్చుకున్నది గానీ, వాడు ఆగస్టులో వెనక్కు రాగానే – అంతకు ముందున్నవాటికంటే ఎక్కువ సంఖ్యలో అవి ఇంట్లో బేస్‌మెంట్లో చేరడాన్ని చూసి సురయా గుండె బేజారెత్తిపోయింది. వాడు వెయ్యికళ్లతో కాపలా కాస్తూ సురయా, నేనూ మాట్లాడుకోకుండా వుండేలా చూసినా, నా డెన్వర్ ట్రిప్పుకు రెండ్రోజుల ముందు అది నాకు ఆ వార్తని చేరవేసింది.

“డెన్వర్లో పెళ్లి సందడి చూసిన తరువాత – అది ఒక ఇండియన్ పెళ్లిలే, తెల్లవాణ్ణి చేసుకుంటోంది – ఆ తరువాతనించీ రిటర్న్ ట్రిప్‌లో ఒమహా ఎయిర్‌పోర్టులో నిన్ను కలిసేదాకా నా జీవితంలో వుండడానికి అవకాశమే లేని ఆనందాలన్నీ నాకు కళ్లముందు క్లియర్‌గా కనిపించాయి. నువ్వు నన్ను కలియడానికీ, మాట్లాడ్డానికీ ఆసక్తిని చూపించావు గనుక నేను నిన్ను వాడుకోవాలని – అవును, వాడుకోవాలని – అనుకున్నాను.

“దేనికో తెలుసా? నా జీవితంలో అప్పటిదాకా దొరకని చిన్న చిన్న ఆనందాలని చేర్చిన బకెట్ లిస్ట్‌లోని ఐటమ్స్‌కి చెక్ మార్క్ పెట్టడంకోసం. చిన్న లిస్టే అయినా అందులోని అన్ని ఐటమ్స్‌కీ చెక్ మార్క్ పెట్టడానికి నువ్వు సహాయం చెయ్యగల వనిపించింది. అలాగని అవి అన్నీ ఒకేసారి సమకూరేవి కాదు. అందుకే నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడ్డం మొదలుపెట్టాను. అలా అయితే నీకు నామీద ఆసక్తి పోకుండా వుంటుందని. మేం రెస్టన్లో వున్న మూడేళ్లల్లోనూ నేను స్విమ్మింగ్ పూల్‌లో అడుగు పెట్టిందిలేదు. స్కేటింగ్ రింక్ వైపు చూసిందే లేదు. కానీ, మా బాబా గ్రోసరీ స్టోర్‌కి వెళ్లినప్పుడు దాని పక్కన వున్న కరాటే స్టూడియోకీ, అలాగే బాలే డాన్స్ స్టూడియోకీ వచ్చిన పిల్లలనీ, ఆ స్టూడియోల ముందు నడుస్తున్నప్పుడు ఆగి గాజు అద్దాల్లోంచి వాళ్ల ప్రాక్టీస్ సెషన్స్‌నీ చూసినప్పుడు నా చిన్నప్పుడు గుల్బర్గా వీధుల్లో స్వేఛ్ఛగా తిరిగిన రోజులు గుర్తొచ్చాయి; ఆ కాలంలో అంతకు మించి ఆశించింది లేదు. ఆశించడానికి ఆస్కార మెక్కడున్నది గనుక! నా పిల్లలకి అలాంటి వాటిల్లో తప్పకుండా ట్రెయినింగ్ ఇప్పించాలనుకున్నాను గానీ, అసలు ‘నా పిల్లలు,’ అన్న ఆలోచనకే కొన్ని వేలమైళ్ల దూరంలో వున్నానని తెలుసు గనుక, నాగూర్చి మాత్రమే ఆలోచించాను. ఒలింపిక్స్‌ని టీవీలో చూసినప్పుడు నన్ను ఆకట్టుకున్నవి స్కేటింగూ, స్విమ్మింగూ. ఆ అనుభవాలు ఒక్క సారయినా కావాలనుకున్నాను.

“వాటితోబాటే, రొమాంటిక్ ఎక్స్‌పీరియెన్సెస్ – మూవీ & డిన్నర్, తరువాత బోట్ రైడ్! బై ది వే, డోన్ట్ గెట్ మి రాంగ్. దీస్ అర్ ది క్లాసికల్ టైప్ రొమాన్సెస్. ఐ మేడ్ ది స్విమ్మింగ్ అండ్ స్కేటింగ్ ఆల్సో రొమాంటిక్, డోన్ట్ యు అగ్రీ? అయితే వీటన్నింటినీ పక్కపక్క రోజుల్లోనే చెకాఫ్ పెట్టేస్తే వుండే గుర్తులు ఇందాక నేను రెండుగుక్కల్లో అరగ్లాస్ వైన్ ఖాళీ చేసినటువంటివి; లేకపోతే అరకిలో స్వీట్లని అయిదునిముషాల్లో తినడంలాంటిది. అంటే, అనుభవం దొరుకుతుంది గానీ, కావలసిన గుర్తులు మిగలవు, మిగిలిన వాటిల్లో అందముండదు. దానితో బాటే, నిన్ను ఊరించడంలో వున్న అనుభవం – అనుకోకుండా బోనస్‌గా దొరికింది – అది కేక్ మీది ఐసింగ్ లాగా ఎంత బావున్నదో తెలుసా? నేను కేక్ అంటోంది నాకు మిగిలిన అనుభవాన్ని! ప్రతీసారీ నిన్ను కలిసినప్పుడల్లా మిగిలిన ఆ అనుభవాన్ని మళ్లీ కలిసేదాకా ఆస్వాదిస్తూనే వున్నాను.

“నిన్నలా దూరంగా వుంచడం నాకూ బాధ కలిగించింది. అలా అని, స్విమ్మింగ్ తరువాతో లేక ఇంకా వెనక్కెళ్లి స్కేటింగ్ తరువాతో నన్నీ గెటప్‌లో ప్రెజెంట్ చేసుకున్నా ననుకో, ఎంతయినా మగాడివి గనుక నన్ను ‘షి ఈజ్ టూ ఈజీ’ అనుకుని ఆ తరువాత పట్టించుకోకపోయే ప్రమాద మున్నది. నాకు ఒక్కొక్క ఐటమ్‌నీ చెకాఫ్ చేస్తున్నకొద్దీ ఆనందంతో బాటే చెప్పలేని బాధ కలిగిందన్న సంగతి కూడా చెప్పాలి – నీకు ఇంతకన్నా దగ్గర కాలేకపోతున్నందుకు.

“అనార్కలి, సలీముల్లాగానూ, రోమియో, జూలియెట్ల లాగానూ తరచుగా కలవడానికి నీకూ నాకూ వున్న ఉద్యోగాలవల్ల కుదరకపోయినా, కనీసం ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా వీల్లేకుండా అడ్డంపడ్డాడు ముదస్సర్.  కాలేజీలో చేరిన రెండేళ్లదాకా నాకు సెల్‌ఫోన్ ఇవ్వనీకుండా చేశాడు. తరువాత ఫామిలీ ప్లాన్ అనిచెప్పి మా ముగ్గురి ఫోన్లనీ – బాబాదీ, అమ్మీదీ, నాదీ – తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎంతయినా ససుర్, వున్న ఒకే మగదిక్కు, అని బాబా అడ్డం చెప్పలేదు. కలిసినప్పుడల్లా నా ఫోన్ లాక్కుని అందులో కాంటాక్ట్స్‌లో కొత్తగా ఎవరయినా చేరారేమోనని వెదుకుతుంటాడు. అందుకనే నేను నీ నంబర్ని,” అని తన చేత్తో అతని చేతిని పట్టుకుని తన తలకాయవైపు పాయింట్ చేసి, “ఇక్కడ భద్రంగా దాచుకున్నాను,” అని కంటిన్యూ చేసింది. “నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరికి టెక్స్ట్ మెసేజులని పంపిస్తున్నానో ఆన్‌లైన్లో అకవుంట్లో లాగ్ అయి చూస్తూంటాడు. వాడికి తెలియని నంబర్‌కి నా ఫోన్‌నించీ కాల్ వెడితే వెంటనే అడుగుతాడు – ఎవరితో మాట్లాడుతున్నానో చెప్పమని. అందుకనే ఒమహా ఎయిర్‌పోర్ట్‌లో నీతో మాట్లాడిన తరువాత నీ ఫోన్లని నేను ఆన్సర్ చెయ్యలేదు. దానిగూర్చి కూడా అడిగాడు – అన్నిసార్లు నీకు ఈ నంబర్‌నించీ కాల్స్ వచ్చెయ్యెందుకు? అని. ఎవరో టెలిమార్కెటర్ అయ్యుంటాడు. అందుకనే నేను ఆన్సర్ చెయ్యలేదు గదా అని జవాబు చెప్పాను. నా అదృష్టం కొద్దీ నేను నీకు పంపిన టెక్స్ట్‌లు నెలకు ఒకసారి మాత్రమే అయినా గానీ వేరే బిల్లింగ్ సైకిల్‌లో వున్నందువల్ల ఆ నెంబరే రిపీట్ అయిందని గమనించినట్లు లేడు.

“నా లిస్ట్‌లో రెండు ఐటమ్స్ చెకాఫ్ అయిన తరువాత పారిస్‌లో నవంబర్లో, థాంక్స్‌గివింగ్‌కి రెండువారాల ముందు, ఉగ్రవాదుల అటాక్ జరిగింది. అది ఆ శాన్ బెర్నార్డినో కపుల్‌మీద చూపించినంత ప్రభావమూ ముదస్సర్‌మీద చూపించింది.  వాళ్లు చేశారు, వీడు చెయ్యడానికి సిధ్ధపడ్డాడు. అంతే తేడా! దానికితోడు, ఆ శాన్ బెర్నార్డినో అటాక్‌లో భార్యకూడా పాల్గొనడాన్ని చూసి – గుర్తుందా, డిసెంబర్ 2వ తేదీ నాడు? సురయాని కూడా తనతోబాటు తీసుకువెళ్లడానికి బలవంతంగా ఒప్పించాడు – లేకపోతే పిల్లలని చంపుతానని బెదిరించి. ఆ సంగతి తెలిసిన తరువాత నా బకెట్ లిస్ట్ నన్ను తొందరపెట్టడంవల్లే నేను నిన్ను చల్లగా వున్నా డిసెంబర్లో బోట్ రైడ్‌కి రమ్మనమంది. దట్ వజ్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్, బై ది వే! థాంక్ యు!

“సో, నా చిన్న బకెట్ లిస్ట్‌లో ఇది చివరి ఐటమ్. ముదస్సర్ ఎప్పుడు వాడి ఈవిల్ ప్లాన్‌ని అమలు చేస్తాడో తెలియదు. ఫిబ్రవరిదాకా ఆగాడంటేనే ఆశ్చర్యంగా వుంది. ఇంకెంతో కాలం ఆగుతాడనుకోను. అందుకే ఈ తొందర. లాస్ట్ ఐటమ్ ఆన్ ది లిస్ట్. నౌ మై కాన్షియెన్స్ ఈజ్ క్లియర్. ఆర్ యు యాంగ్రీ ఇనఫ్ విత్ మి టు త్రో మి అవుట్, ఆర్, డు యు స్టిల్ వాన్ట్ టు గో త్రు విత్ ఇట్? ఇఫ్ యు రియల్లీ వాంట్ టు త్రోమి అవుట్ – ఎ రిక్వెస్ట్. యూ హావ్ గివెన్ మి ఫైవ్ వండర్ఫుల్ మెమరీస్. వన్ మోర్ ప్లీజ్!” అని హమీర్ కళ్లల్లోకి చూసింది. ఆమె కళ్లు ధైర్యాన్ని నింపుకున్నట్టున్నా,  ఛాతీని కప్పుతూ షర్ట్‌ని పట్టుకున్న ఆమె చేతివేళ్లు వణకడం అతని కళ్లకి స్పష్టంగానే కనిపించింది.

హమీర్‌కి తాను విన్నదంతా ఒక కల అయ్యుంటే బావుణ్ణనిపించింది. తండ్రి కనిపించకుండా పోవడంవల్లా, మీనా ప్రవేశించిన తరువాత ఆశ్చర్యకరంగా నిష్క్రమించడంవల్లా – చుట్టుపక్కల ఇండియన్స్‌ని చూసినప్పుడల్లా తన జీవితమే ఎందుకింత కాంప్లికేటెడ్‌గా వున్నదా అని అనుకున్నాడు. అమానిని కలిసిన తరువాత తన స్టెప్‌లో ఒక బౌన్స్ వచ్చిందని అతనికి తెలుసు. దాన్ని లైఫ్ లాంగ్ నిలుపుకుందా మనుకుంటున్న దిశగా అతను అడుగేస్తున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా ఆమెని కౌగలించుకుని నీకు నేనున్నాను అని ధైర్యం చెబుదామనే వున్నది గానీ, తండ్రి అదృశ్యమవడంతో తలక్రిందులయిన తల్లి జీవితాన్ని తను టెర్రరిస్ట్ కేసులో నిందితుడై ఇంకా అల్లకల్లోలం చెయ్యడానికి అతనికి మనస్కరించలేదు. ఎందుకంటే, 9/11 తరువాత అందులో పాలుపంచుకున్న వాళ్లకి ఆతిథ్య మిచ్చారన్న నేరానికి ప్రాసెక్యూట్ చెయ్యబడి శిక్షలు పొందినవాళ్ల గూర్చి అతను విన్నాడు.

“వై డోన్ట్ యు గో టు ది పోలీస్ అండ్ వార్న్ దెమ్ అబవుట్ ముదస్సర్?” అమానిని అడిగాడు.

“వాడు మారణాయుధాలని పోగుచేస్తున్నమాట, వాడు టెర్రరిస్టులకి సింపతైజర్ అన్నమాట, దేశద్రోహం చెయ్యాలని అనుకుంటున్న మాట – అన్నీ కూడా నిజాలే. కానీ, అలా అనుకోవడమే క్రైంగా ఇంకా ఎక్కడా నిర్ణయింపబడలేదుగా? పైగా, సెకండ్ అమెండ్‌మెంట్‌ని అడ్డంపెట్టుకుని ఈ దేశంలో ఎంతమంది ఎన్ని రకాల గన్‌లని వాళ్ల దగ్గర పోగుచేసుకుంటున్నారో అందరికీ తెలుసు.  ప్రజల దగ్గర గన్లు లేకపోతే ఆరెగాన్లో 41రోజులపాటు జరిగి క్రితంవారమే ముగిసిన స్టాండాఫ్ ఎలా సాధ్యమయింది? అందుకని ముదస్సర్ ప్లానేమిటో తెలిసేదాకా ఏమీ చెయ్యలేను. తెలిసిన తరువాత పోలీసుల దగ్గరకి వెళ్లకుండా వుండనూ లేను – మా జీవితాలన్నీ నాశన మయినా గానీ,” జవాబిచ్చింది అమాని.

ఒక కొరియన్ కుర్రాడు గన్ తీసుకుని యూనివర్సిటీలో కొందరిని కాల్చి చంపినందుకు సెంటర్‌విల్‌లో వున్న అతని తల్లిదండ్రులు పబ్లిక్‌కి క్షమాపణలు చెప్పడం హమీర్‌కి గుర్తొచ్చింది. అలాగే, ఇంకోచోట మతి స్థిమితంలేని కొడుకు గన్ తీసుకుని బయల్దేరాడని యూనివర్సిటీవాళ్లకి తల్లిదండ్రులే చెప్పిన ఉదంతంకూడా అతని మదిలో మెదిలింది. రెండూ అతనున్న ఏరియా చుట్టుపక్కల జరిగినవే. ముదస్సర్ చెయ్యా లనుకుంటున్న తప్పు సామాన్యమైనది కాదని హమీర్‌కి తెలిసినా, ఎవరు ఏంచెయ్యాలో నిర్దేశించగల పరిస్థితిలో తానులేడని అతనికి అర్థమయింది. అయిదు కలయికలతోనే తనవద్ద ఇంత ఓపెన్‌గా మాట్లాడేలా తనని నమ్మిందంటే అతనికి ఆమెమీద ప్రేమతోబాటు జాలికూడా కలిగింది. ఎవరికోసమో కాక తనకోసం మాత్రమే తన జీవితాన్ని అనుభవించడాన్ని కోరుకోవడం ఏమాత్రం అసమంజసం కాదు. అందరూ సాధారణంగా కోరుకునే సంసార జీవితం తనకి అందుబాటులో వుండబోవట్లేదని గ్రహించిన తరువాత ఆమె చిన్న బకెట్ లిస్ట్‌ని తయారుచేసుకోవడమూ ఊహాతీతం కాదు. అంత తెగువ వున్న ఆమె పరిస్థితులకి ఎంత బందీ అయిందో అర్థమయిన హమీర్‌కి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. మీనా తరువాత తనకి జీవితం శూన్యం అని రాజీపడ్డ అనంతరం అమాని కనిపిస్తే తనకికూడా ఒక జీవితం వుండబోతోందని ఆశపడ్డాడు. ఇప్పుడు తనతోబాటు ఆమెకి కూడా ఒంటరి జీవితమేనని అతనికి అర్థమయింది.

“బై ది వే, ముదస్సర్ నన్ను ట్రాక్ చేస్తున్నాడని నా నమ్మకం. రెస్టన్ అంటే ఇష్టం వుండడంవల్లనే గాక వాడి ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికీ కనిపించకుండా వుండడానికే నిన్ను కలవడానికి మొదట్లో రెస్టన్‌ని సెలెక్ట్ చేసుకున్నది.  ఆ స్కేటింగ్ రింక్ చుట్టుపక్కలా, స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కలా ఎక్కువమంది తెల్లవాళ్లు నివసించడాన్ని గమనించి, ముదస్సర్ అక్కడికి వచ్చే ఛాన్స్ తక్కువే అని నిర్ధారించుకున్నాకే నిన్ను అక్కడ కలిసింది. వాడు నల్లవాళ్ల చుట్టుపక్కల వున్నంత కంఫర్టబుల్‌గా తెల్లవాళ్ల పక్కన వుండడని చాలా కాలం క్రితమే గ్రహించాలే! అది నల్లవాళ్ల మీద సానుభూతి వల్లో లేక ఆ నల్లవాళ్లకంటే తను ఎక్కువ అన్న అహంకారంవల్లో పూర్తిగా తెలియదు. బోట్ రైడ్‌కి వాషింగ్టన్ వెళ్లక తప్పలేదు.  అయితే, నేను వాషింగ్టన్‌కీ, ఆ తరువాత క్రిస్టల్ సిటీకీ వచ్చినట్టు వాడు కనిపెట్టాడు. ఇప్పుడు కూడా, ఎందుకయినా మంచిదని నా కారుని పక్క బ్లాక్‌లో పార్క్ చేసి చుట్టూ చూసుకుంటూ వచ్చాను.  ఎవరూ ఫాలో కాలేదులే. మరీ బిట్టర్ కోల్డ్‌గా వున్నదిగదా, ఇవాళ! నేను FBI వాళ్ల నేమయినా కలుస్తున్నానేమోనని వాడి అనుమానం. దాని నివృత్తికోసం నన్ను ఫాలో అవడానికి ఇక్బాల్ సహాయం చేస్తూ వుండవచ్చు! అందుకే, మనం కలవడం ఇది చివరిసారి,” అన్నది అమాని. “ఇంకో విధంగా అయితే మొదటిసారి కూడా,” అన్నది దృష్టిని అతని కళ్లమీంచి తప్పిస్తూ కనురెప్పలని వాల్చి.

హమీర్‌ ఆమె ఛాతీమీది షర్ట్‌ని తీసివేసి, ఆమె మెడవద్ద మొదలుపెట్టి నాభిదాకా కుడిచేతి వేళ్లని పియానో మెట్లమీద కదిపినట్లుగా ఆడించాడు.

“పియానో వాయిస్తున్నావా?” అడిగింది అమాని.

“Rachmoninoff 3rd piano concerto, allegro,” జవాబిచ్చాడు. Hauntingగా మొదలయ్యే ఆ మెలొడీ అంటే అతని కెంతో యిష్టం.  కొద్దిసేపటికే ఎడమచేతిని ఆమె మెడకిందవేసి, కుడిచేత్తో నడుముని చుట్టి పైకి లేపి కావలించుకున్నాడు. మరి కొంచెం సేపటికే ఆ concerto intermezzo స్పీడందుకుంది.

ఉరితీతకు గురయ్యే వ్యక్తి తన చివరి భోజనాన్ని – తనకు నచ్చే పదార్థాలు ఎన్నున్నా గానీ – ఆనందంగా ఆస్వాదించలేకపోవచ్చు గానీ, ఎడారిలా మిగలబోయే అమానికి ఆమె జీవితంలో మొదటిసారీ, చివరిసారీ కూడా ఆనందపు టంచులని చూపాలని హమీర్‌ ఆరాటపడ్డాడు.

అమాని వెళ్లిన తరువాత మళ్లీ ఒకసారి ఆమె పేరుకి అర్థాన్ని ఇంటర్నెట్లో వెదికాడు. Hopes, aspirations, wishes, అని తెలిసింది. అతని గుండె బరువెక్కింది.  వైన్ బాటిల్ పూర్తిచేసిన తరువాత రెఫ్రిజిరేటర్ తలుపు తీసి ఒక బీర్ తెచ్చుకుని సోఫాలో కూర్చుని తాగడం మొదలుపెట్టాడు.

ఎంతవద్దన్నా అమాని పరిష్వంగపు అనుభూతులు అతనికి అంత ఇన్‌టిమేట్‌గా పరిచయమున్న ఇంకొక ఒకే ఒక వ్యక్తి మీనాని గుర్తుకు రానీయకుండా ఆపలేకపోయాయి.

[ఇంకా ఉంది...]

అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ – ఆరవ భాగం
హమీర్‌కి పూర్తిగా నయమయ్యేదాకా వుండమని సరోజగారికి ఎవరికయినా చెప్పాల్సిన అవసరమేముంది? యాక్సిడెంట్‌కి ముందులాగా అతను తన పని తనే చేసుకోగలిగిన పరిస్థితిలో లేడు. తగిలిన దెబ్బ ఎంత ఎడమకాలికే అయినా, బ్రేకుమీద, యాక్సిలరేటర్‌మీదా ఆ కాలు వెయ్యవలసిన అవసరం లేకపోయినా, కనీసం కొంతవరకు నయమయితే గానీ డ్రైవింగ్ కూడా చెయ్యకూడని పరిస్థితి. అసలే చలికాలం. బయటకు వెళ్లి గ్రోసరీలు తెచ్చుకోవడం కూడా అంత తేలికయిన పరిస్థితి కాదు. అంగుళాల మందానో లేక 2015 జనవరిలోనో అంతకు ముందోలాగా అడుగులమందానో స్నో పడితే ఇంక చెప్పేదేముంది? క్రచెస్ పట్టుకుని స్నోమీదో, ఐసుమీదో అడుగెయ్యడమంటే కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే!

అయినా గానీ, హమీర్‌తో బాటే అతని అపార్ట్‌మెంట్లోనే వుంటామని పట్టుబట్టారు సరోజగారు; అప్పటికే మూర్తిగారికీ, భవానిగారికీ తామెంతో ఋణపడి వున్నామని ఆవిడ బాధ. స్వంత అన్నయ్య దగ్గరో, అక్కయ్య దగ్గరో వుండడానికీ తమవద్ద వుండడానికీ తేడా ఏమీ లేదని చెప్పి, ఆవిడ అబ్జెక్షన్లని తేలిగ్గా కొట్టేశారు భవాని గారు.

సరోజగారు కూడా, తాను మొదటిసారి అమెరికా వచ్చినప్పటి పరిస్థితికీ, ఇప్పటికీ వున్న తేడాని ఇట్టే గ్రహించారు. ఆ మొదటిసారయితే భర్తకి తనూ, తనకి ఆయనా, అంతే. మహా అయితే ఆయనకి తెలిసిన రెండు, మూడు ఇండియన్ ఫ్యామిలీ లుండేవి. మెల్లమెల్లగా తమవంటి పరిస్థితుల్లోనే వున్న ఇతర ఇండియన్లు అక్కడక్కడా కలవడం మొదలుపెట్టారు. హమీర్ పుట్టడం, ఆ కాన్పుకి తోడుగా తన తల్లిదండ్రులు రావడం, వాడు ఎదిగేటప్పుడు వచ్చిన చిన్న చిన్న నలతలతో ఆదుర్దాలు కలగడం – వీటన్నిటితో ఎక్కువ ఖాళీ సమయ మున్నట్టే అనిపించేది కాదు. అదే ఇప్పుడు? హమీర్ ఆఫీసు కెడితే ఎవరితో మాట్లాడ గలదు ఒక్క భవానిగారితో తప్ప? పైగా, సరోజగారి పరిచయాలు పదేళ్ల క్రితంవి గనుక వాళ్లు తమ జీవితాల్లో ఎంతో ముందుకు వెళ్లిపోయారు. అడిగితే వాళ్ల ఫోన్ నంబర్లని భవానిగారు ఇవ్వగలరేమో గానీ, వాళ్లని పొరబాటున కదిలిస్తే ముందు ఉప్పెనలాగా తగిలేది పదేళ్ల సానుభూతి! “ఇంకా ఏమీ తెలియలేదా?” తో మొదలుపెట్టి, “దురదృష్ట”మనో, “మీలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడ”దనో ఏదో పుసుక్కున అనేసి వెళ్లిపోతారు. విదుషి పెళ్లిలో అలాంటి అనుభవాలు చాలా కలిగా యామెకి.

ఒక రెండ్రోజులు ఊరికేనే కూర్చుని విసుగనిపించిన తరువాత, హమీర్ ఇంటినుండే పనిచెయ్యడానికి పర్మిషన్ తీసుకున్నాడు. క్రిస్మస్ సెలవులు దగ్గర్లోనే వుండడం అందరికీ తెరిపినిచ్చింది. హమీర్ పనిచేసుకుంటున్నప్పుడు చేసేదేమీ లేదు గనుక సరోజగారు భవానిగారితో కలిసి షాపింగ్‌మాల్స్‌కి వెళ్లేవారు. అలా మొదటిసారి వెళ్లినప్పుడు తను కోల్పోయినదేదో ఆమెకు మొహంముందు నిలిపి విధి ఎద్దేవా చేస్తున్నట్లనిపించింది. ఈ పదేళ్లల్లో వచ్చిన మార్పులు – ముఖ్యంగా టైసన్స్ కార్నర్లో మెట్రో రావడం వల్ల రూట్ 7 రూపే మారిపోవడంతో సహా – ఆమెకు స్పష్టంగా కనిపించాయి.

క్రిస్మస్‌నాడు మూర్తిగారింట్లో డిన్నర్‌కి ప్రిపరేషన్లు జరుగుతున్నప్పుడు ఆండ్రూ మీనా ప్రసక్తి తేవడం అక్కడున్నవాళ్లల్లో ఒక్క విదుషికి తప్పించి అందరికీ ఆశ్చర్యన్ని కలగజేసింది. ఆరోజాయన పుట్టినరోజు. దాని సందర్భంగా బాగా దగ్గరివాళ్లు సెలబ్రేషన్‌కి ఆ రోజున అక్కడ కలవడం దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. ఆ పార్టీ కొచ్చేవాళ్లల్లో కూడా ఎవరూ ఆయనకి చుట్టాల్లేరు. అన్నీ అమెరికా పరిచయాలే! ఈ కోలాహలంలో పాలు పంచుకోవడం ఆండ్రూకి మాత్రం ఇది రెండవసారి.

“నిన్న విదుషి ఫ్రెండుని కలిశాం,” అన్నాడు ఆండ్రూ.

“ఎవరే?” అని భవానిగారు అడగడం, “మీనా,” అని విదుషి చటుక్కున అనడం క్షణంలో జరిగిపోయిన ట్లనిపించింది. విదుషి గొంతులో ఆ ప్రసక్తి తేవాలన్న ఆత్రం మూర్తిగారి చెవికి సోకకపోలేదు. ఆండ్రూ ఇనిషియేట్ చెయ్యబట్టి సరిపోయింది గానీ, అదే విదుషి గనుక స్వయంగా తెచ్చివుంటే మాత్రం మూర్తిగారు, భవాని గారు ఇద్దరూ కూతుర్ని కేకలేసేవాళ్లు – “ఆ వార్తని సరోజగారు, హమీరూ వింటుండగా చెప్పడానికి బుధ్ధి లేదా?” అని.

అంతటితో ఆగకుండా, “వాళ్లమ్మ పోయి ఏడాది దాటిందట,” అన్నది విదుషి. విన్న అందరి మనసుల్లోనూ ఒక్కసారి కలుక్కుమంది ఆ తల్లిలేని పిల్లని తలుచుకుని. ఏ తల్లయితే కూతురి పెళ్లికి మొండిగా అడ్డుపడిందో, ఆమె ఇప్పుడు లేదు. అయితే, విరిగిన మనసులని కలపడం సాధ్యమేనా?

“పెళ్లయిందటనా?” అడిగారు భవానిగారు కొంచెం మెత్తబడి.

“లేదు,” జవాబిచ్చింది విదుషి.

“ఇటు వీడికీ పెళ్లికాలేదు, అటు ఆ పిల్లకూడా ఒంటరే. సైంధవుడిలా అడ్డంపడ్డ ఆవిడ పోయుండొచ్చుగానీ, ఆవిడ చూపిన ప్రతిబంధకాన్ని – నేను – ఇంకా రాయిలా వున్నాను!” అనుకున్నారు సరోజ గారు.

“డెన్వర్ ఎయిర్‌పోర్టులో కనిపించింది,” అన్నాడు హమీర్ యాథాలాపంగా.

“ఏమన్నది?” భవానిగారు అనాసక్తికరంగా అడిగినట్టున్నా, ఆవిడ మదిలో కుతూహలం ఉరకలేస్తోంది.

“నేను కూర్చున్న టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చోవచ్చా అనడిగింది. దిసీజ్ ఎ ఫ్రీ కంట్రీ అని చెప్పాను.”

“నీకు చెప్పిందా వాళ్లమ్మ పోయిన సంగతి?” అడిగారు భవానిగారే మళ్లీ.

“లేదు. అయినా వై వుడ్ ఐ కేర్?” అన్నాడు హమీర్. ఎయిర్‌పోర్ట్‌లో మీనామీద కలిగిన కోపం స్థానంలో అతి చిన్న భాగంలో అయినా కొంచెం విషాదమూ, కొంచెం జాలీ ఇప్పుడు చోటుచేసుకున్నాయి.

అతని సమాధానం సరోజగారికి కొంచెం ఉపశమనాన్ని కలిగించింది. “ఎంతయినా ఆ తల్లి కూతురే గదా! అలాంటివాళ్లకి దూరంగా వుండడమే మంచిది!” అన్నారావిడ.  ఆ మాటలకి మూర్తిగారూ వాళ్ల కుటుంబ సభ్యులూ కొంచెం నొచ్చుకున్నా గానీ ఆవిడ జీవితంలో దుఃఖాన్నీ, విషాదాన్నీ అతిదగ్గర నుంచీ చూశారు గనుక ఏమీ అనలేకపోయారు.

“పెళ్లయిన తరువాత కూడా మీరు ఇండియాలోనే వుంటారు గదా?” అని సమాధానం తెలుసుకోవడానికి వేసిన ప్రశ్నలాగా కాకుండా ఎక్కడ వుండాలో నిర్దేశించినట్లుగా మీనా తల్లి అడగడం హమీర్ చెవుల్లో మార్మ్రోగింది. అతనూ, మీనా తమ పెళ్లిగూర్చే అప్పటిదాకా ఆలోచించారు గానీ ఈ డీటెయిల్స్‌ని వర్కవుట్ చెయ్యడం మాటటుంచి, అసలు ఆలోచించనే లేదు. హమీర్‌, సరోజగారు తమతో కాక వేరెక్కడ వుంటారనే ఆలోచనకే తన మనసులో చోటివ్వలేదు. అది మీనాకి కూడా అంగీకారం ఎందుకు కాబోదని మాత్రం అతను అనుకున్నాడు.

“హౌ డిడ్ షి డై?” హమీర్ అడిగాడు. ఆ ప్రశ్నలో శాడిజానికి ఏమాత్రం ఆస్కారం లేదు గానీ, ఆ వివరాలు అనవసర మనిపించింది మూర్తిగారికి.

“అప్పరెంట్లీ ఇట్ వజ్ ఎ సడెన్ డెత్. మాసివ్ హార్ట్ ఎటాక్,” అన్నాడు ఆండ్రూ.

“మీనా వాళ్లమ్మగారిని తీసుకుని షాపింగ్‌కి కార్లో డ్రైవ్ చేస్తూ వెడుతోందట. తనేదో మాట్లాడుతుంటే ఆవిడ ఊఁకొడుతున్నదల్లా కాసేపు ఏమీ మాట్లాడకపోయేసరికి మీనా పక్క సీటువైపు చూస్తే ఆవిడ తల వాలిపోయున్నదట. తను డాక్టరే గనుక ఏం చెయ్యడాని కయినా సమయ మెప్పుడో దాటిపోయిందని గ్రహించిందట,” అన్నది విదుషి.

సడెన్ డెత్ కూడా సడెన్ డిజప్పియరింగ్ లాంటిదే అని అనుకున్నాడు హమీర్.

మీనా తల్లి ప్రసక్తిని తీసుకురావడం ఆండ్రూ, విదుషి బాగా ఆలోచించి చేసిన పనే గానీ, వాతావరణం బయటిలాగానే ఇంట్లోకూడా బాగా చల్లబడుతోందని గ్రహించి, విదుషి మాట మార్చింది. “ఆండ్రూ ది అవుట్‌డోర్స్ మాన్ హాజ్ ఎ ప్రపోజల్!” అన్నది.

“హౌ అబవుట్ గోయింగ్ టు యోసమిటి ఇన్ జూన్?” అడిగాడు ఆండ్రూ.

” ఎక్సెలెంట్ ఐడియా! ఎన్నేళ్లుగానో వెడదా మనుకుంటున్నా గానీ ఇప్పటిదాకా కుదర్లేదు. ఇప్పటినించే ప్లానింగ్ చేసుకోవడానికి కావలసినంత సమయముంది,” అన్నారు మూర్తి గారు.

“ఆ ప్లానింగ్ నాకు చాలా అవసరం. హాఫ్ డోమ్ ఎక్కడానికి ముందే రిజర్వ్ చేసుకోవాలి. అందుకని మహా అయితే ఒక వారం తీసుకోండి ఆలోచించుకోవడానికి,” అన్నాడు ఆండ్రూ.

“రాళ్లూ రప్పలూ ఎక్కాలా?” అడిగారు భవాని గారు.

“అవును మామ్! అది సముద్రమట్టానికి రెండువేల అడుగుల ఎత్తులో మొదలై పదమూడువేల అడుగుల ఎత్తుదాకా పోతుంది. భయపడకులే, నిన్ను ఆంత ఎత్తు ఎక్కమని అడగం. ఆండ్రూ హాఫ్ డోమ్ పైకి ఎక్కినప్పుడు మాత్రం ఆ ఎత్తుని చేరతాడు,” అన్నది విదుషి.

“మామ్, నువ్వెప్పుడూ యోసమిటి చూళ్లేదు కదా?” అడిగాడు హమీర్.

“మీ నాన్న వెళ్లాలి అనేవారు. నేనే రానన్నాను. ఈ చుట్టుపక్కల ఏదో పార్కుకి తీసుకెళ్లారొకసారి. అక్కడ నడిచినందుకే నా కాళ్లు పట్టేశాయి. తరువాత నేను నేను అలాంటి చోట్లకి రానన్నాను,” అన్నారు సరోజగారు.

“పెళ్లికి ముందు అలాంటివన్నీ ఎక్కేవారని చెప్పారు ఆయనా, నేనూ కలిసి గ్రేట్ ఫాల్స్‌లో బిల్లీ గోట్ ట్రెయిల్ మీద నడిచినప్పుడు,” అన్నాడు హమీర్.

“దట్స్ ఎ నైస్ ట్రెయిల్,” అన్నాడు ఆండ్రూ.

“ఆఁ. పెళ్లికి ముందు స్టూడెంట్‌గా వున్నప్పుడు బాక్‌పాక్ వేసుకుని దేశంలో చాలా నేషనల్ పార్కులకి తిరిగార్ట. పెళ్లయిన తరువాత నేను రానన్నాను. నన్నొక్కదాన్నీ ఇంట్లో వదిలేసి వెళ్లలేక తను మానేశారు గానీ, ఆ యోసమిటీకే, నువ్వు కాలేజీలో చేరిన తరువాత నీతో కలిసి వెడదామనుకున్నారు,” అన్నారు సరోజగారు. “అయినా, జూన్ దాకా ఆగడమెందుకు? ఇప్పుడే వెళ్లచ్చుగా?” అన్నారావిడే మళ్లీ.

“ఇలా కాదు గదా మామ్?” అన్నాడు హమీర్ క్రచెస్‌ని చూపిస్తూ.

“అవును కదా, మర్చే పోయాను,” అని ఆగి, “పోనీ ఫిబ్రవరిలో అయితే?” అని అడిగారావిడే.

“అది ఎత్తయిన ప్రదేశ మవడంవల్ల మంచుపడి దారులన్నీ మూసుకుపోతాయి. వాటిల్లో కొన్నింటి నయినా తెరవాలంటే ఏప్రిల్‌దాకా ఆగాలి. హాఫ్ డోమ్‌కి వెళ్లడాని కయితే జూన్ దాకా ఆగక తప్పదు,” అన్నాడు ఆండ్రూ.

“నే నప్పటికి ఇండియా వెళ్లిపోతాను. మీరేం చేసుకుంటే మీ యిష్టం,” అన్నారు సరోజ గారు.

“మీరు కూడా చూళ్లేదు కదా! కొంచెం ఆగి అది చూసేసి వెళ్లండి,” అన్నారు భవాని గారు.

“అలాగే వెడుదువుగాన్లే, యోసమిటి ట్రిప్ అయిన తరువాత! నువ్వు, నేను కలిసి ఎక్కడికీ వెళ్లింది లేదు ఈ తొమ్మిదేళ్లల్లో,” అన్నాడు హమీర్. సరోజగారికి జవాబు ఏమని చెప్పాలో తోచలేదు. అతని ఫ్రాక్చర్ ఎప్పటికి నయమవుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు కదా! అది పూర్తిగా నయ మయేటంతవరకూ ఆవిడ ఎలానూ వుండక తప్పదు. అందుకని ఆవిడ మౌనంగా వుండిపోయారు.

ఆ ట్రిప్‌కి కావలసిన అరేంజ్‌మెంట్లన్నీ ఆండ్రూనే చూసుకొమ్మనమని మూర్తిగారు చెప్పారు.

“అక్కడ కాబిన్లని తీసుకుని సెలబ్రేట్ చేసుకుందాం, ” అన్నాడు ఆండ్రూ విదుషిని నడుంచుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుని ముద్దుపెడుతూ.  ఎంత వద్దనుకున్నా తను మీనాని అలా దగ్గరకు లాక్కుని ముద్దుపెట్టడం హమీర్‌కి గుర్తొచ్చి మనసులో ముల్లు గుచ్చుకొన్నట్టనిపించింది.

“అమ్మో! అక్కడ black bears  తిరుగుతూంటయ్యట! నాకు భయం బాబూ! ” అన్నారు భవాని గారు.

“అయామ్ గ్లాడ్ హమీర్ మెట్ మీనా ఇన్ ది డెన్వర్ ఎయిర్‌పోర్ట్,” అన్నది విదుషి, క్రిస్మస్ వీకెండ్ అయిన తరువాత ఆండ్రూ డ్రైవ్ చేస్తూండగా మూర్తిగారి ఇంటినుంచీ బయలుదేరి వాళ్లింటికి వెడుతున్నప్పుడు.

“ఐ డిడన్ట్ సీ హిమ్ ఆర్ దెమ్ టు బి రిసెప్టివ్ టు ది ఐడియా,” అన్నాడు ఆండ్రూ.

“పగులు అతుక్కోవడానికి కొంతకాలం పడుతుంది. రిలేషన్‌షిప్స్ అనేవి అంత తొందరగా కుదిరేవీ కాదు, అతికేవీ కాదు,” అన్నది విదుషి. “మీనాకి ఇటు హమీరూ లేక, అటు తల్లీలేక చాలా బాధపడుతోంది. హాస్పిటల్ పనిలో తల మునకలయ్యే పరిస్థితి కల్పించుకుంటోంది గానీ, ఎంతకాలం అలా వుండగలదు?”

“బౌల్డర్ వెళ్లిన తరువాత బాయ్‌ఫ్రెండ్సే లేరా?” అడిగాడు ఆండ్రూ.

“అక్కడ మెడికల్ కాలేజీలో చదువుతునప్పుడు మొదటి రెండేళ్లూ నెలకి కనీసం ఒకసారన్నా హమీరే అక్కడి కెళ్లొస్తూండేవాడు. వీడితో బ్రేక్ అయిన తరువాత వాళ్లమ్మ, చదువయేదాకా ఇంకేం బాయ్‌ఫ్రెండ్స్ అంటూ తిరక్కు, రెసిడెన్సీలోకి రాగానే నేనే సంబంధాలు చూస్తా నన్నదిట. ఆ చదువు పూర్తికాకుండానే ఆవిడ పోయింది. … హమీర్‌కి సంబంధాలని చూద్దామని మామ్ అండ్ డాడీ, అలాగే ఆంటీ కూడా ప్రయత్నించారు. హమీర్, రోహిత్ ఇద్దరూ కూడా పార్ట్‌నర్స్‌ని వాళ్లే వెతుక్కుంటామని చెప్పారు.”

“నాలాగా!” అన్నాడు ఆండ్రూ.

“నాలాగా కూడా! ఐ లవ్యూ,” అన్నది విదుషి పాసెంజర్ సీట్లోంచే అతని మెడమీద చెయివేసి నిమురుతూ. “మీనామీద ఇంటరెస్టే లేనట్టు మాట్లాడాడు గానీ, హమీర్ ఈజ్ కుకింగప్ సంథింగ్. అంత వద్దని వెళ్లిపోయిన ఆమెని అంత తొందరగా క్షమించేస్తావా అని అంటారేమోనని వాడి భయమనుకుంటా! ఇఫ్ మై సస్పిషన్ ఈజ్ కరక్ట్, డెన్వర్ ట్రిప్ తరువాత మీనా, హమీరూ పాచప్ అయ్యుండాలీపాటికి. అమ్మాయి తనంతట తానే వెదుక్కుంటూ వస్తే కాదనే మగాళ్లెవరుంటారు?”

“ఐ వాంట్ టు సీ యు!” హమీర్‌కి అమానినించీ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది జనవరి చివర్లో.

ఇప్పటిదాకా “ఆ పనిచేద్దాం, లేకపోతే అది నేర్పించు,”అన్న ఆమెలో ఈ మార్పు హమీర్‌కి సంతోషా న్నిచ్చింది గానీ, జవాబుగా తనకో ఫొటోని తీసుకుని టెక్స్ట్‌కి జతచేసి పంపాడు.

“ఫేస్ టు ఫేస్!” జవాబొచ్చింది.

“స్కిన్ టు స్కిన్” అని, దానివెంటనే “ఐ మీన్ – ముద్దుపెట్టుకునేలా!” అని క్లారిఫికేషన్ వచ్చింది. రోజ్ కలర్ బ్లష్ వుండే ఎమోజీని చూసిన గుర్తు అతనికి లేదుగానీ, ఊహించుకోవడం అంత కష్టం కాదనిపించింది.

“యు విల్ హావ్ టు కమోవర్!” హమీర్ జవాబిచ్చాడు.

“అయాం నాట్ దట్ ఈజీ!” జవాబొచ్చింది.

“ఐ డిడన్ట్ సే టు మై అపార్ట్‌మెంట్!”

“నువ్వు డిజప్పాయింట్ చేశావు. నా రిసాల్వ్‌ని టెస్ట్ చెయ్యడానికి – అదే, ఈజీనో కాదో తేల్చుకోవడానికి – మీ  ఇంటి అడ్రస్ పంపుతా వనుకున్నాను!”

“ఇప్పుడేగా, నువ్వు అంత తేలిక కాదన్నావు?”

“అలా అనగానే అంత సీరియస్‌గా తీసేసుకోవడమే? ఏ మాత్రం టెస్ట్ చెయ్యకుండా! … ఐ నీడ్ ఎ షోల్డర్ టు లీన్ ఆన్!”

ఆ జవాబు హమీర్‌కి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. తనింకా డ్రైవ్ చెయ్యడం లేడు గనుక రోహిత్‌కి టెక్స్ట్ చేశాడు – రైడ్ ఇస్తావా అని.

రోహిత్ హమీర్‌ని క్రిస్టల్ సిటీ మేరియాట్ హోటల్ పార్కింగ్ లాట్లో డ్రాప్ చేశాడు. సైనెటిక్ థియేటర్ వైపు చూపిస్తున్న గుర్తులని ఫాలో అవుతూ హమీర్ ఎలివేటర్ ఎక్కి లాబీని చేరుకున్నాడు. ఆ థియేటర్ టికెట్ కౌంటరు ముందు అవతలి గోడవైపు వేసివున్న బెంచీమీద కూర్చుని వున్న అమాని అతణ్ణి ఆశ్చర్యంతో కళ్లు విప్పార్చి చూసి లేచి నిలబడింది.

“మారుమూల వున్నట్లే వుంది గానీ, ప్రైవసీ కల్పించే చోటేమీ కాదు!” కొద్దిగా నిరాశ ధ్వనించేలా కొంటెగా అన్నాడు.

“కాలికి ఫ్రాక్చర్ అయిందని చెప్పొచ్చుగా!”

“మనం ఫోన్లో మాట్లాడుకున్న దెప్పుడు?” బెంచీమీద కూర్చుంటూ అడిగాడు.

“రమ్మనమని అడిగినప్పుడన్నా – ”

“రాలేనని చెప్పడానికి పూర్తిగా అలాంటి పరిస్థితిలో లేనుగదా!”

“ఎలా జరిగింది?” అడిగిందామె అతనిపక్కన కూర్చుంటూ. చెప్పాడు.

“యాక్సిడెంట్ చేసిన ఆ కార్లో బాంబులుండి పేలితే నువ్వివాళ నన్ను కలవగలిగేవాడివి కాదు. అదే, బాంబులున్నా గానీ అవి పేలకపోయుండుంటే ఈ పాటికి నీ పేరు దేశమంతా మార్మ్రోగిపోతూ వుండేది. ఆ విధంగా కూడా నువ్వు నాకు దొరికేవాడివి కాదు!” అతని భుజంమీద తలని ఆనిస్తూ అన్నదామె.

ఆమె మాటల్లో అంత నిరాశ ఎందుకు నిండివున్నదో అతనికి అర్థం కాలేదు. పైగా మాటల్లో బాంబులు దొర్లాయి! శాన్ బెర్నార్డినోలో భార్యాభర్తలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి పదకొండుమందిని చంపడమూ, ఇంకొంతమందిని గాయపరచడమూ, ఆ కాల్పులకి ఇస్లాం రాడికలిస్టుల ప్రోద్బలమో, లేక ప్రోత్సాహమో వున్నదంటూ అమెరికాయేగాక భార్య పాకిస్తాన్‌నించీ వచ్చిందని ఆ ప్రభుత్వం కూడా పరిశోధనలని మొదలుపెట్టడమూ అతనికి గుర్తొచ్చింది. కానీ, ఆమె ఈ ప్రసక్తి ఎందుకు తీసుకువచ్చిందన్నదే అతనికి అర్థంకాలేదు.

అమాని అతని భుజానికి తన తల నానించి ఆమె చేతిని అతని నడుంచుట్టూ వేసి అతని కెడమపక్కన మౌనంగా కూర్చుంది. అతను తన ఎడమ చేతిని ఆమె నడుంచుట్టూ వేశాడు. అలా కాసేపయిన తరువాత హమీర్ తన కుడిచేతిలోకి ఫోన్ తీసుకుని ఇద్దరికీ కలిపేలా సెల్ఫీని తీసి చూస్తే ఆమె నిద్రపోతోంది. ముందు ఆశ్చర్యమేసింది గానీ, ఆమెకు తను ప్రశాంతత నివ్వగలగడం అతనికి ఒకవిధమైన ఆనందాన్నిచ్చింది.  అయితే, ఒమహా ఎయిర్‌పోర్టులో కలిసిన తరువాత ఈనాడు ఆమె ఇంత నిర్భయంగా తన భుజంమీద తలనానించి నిద్రపోయేటంత కాన్ఫిడెన్స్‌ని ఎలా ఇవ్వగలిగాడో అతనికి అర్థంకాలేదు.

అలా దాదాపు అరగంటసేపు కూర్చున్న తరువాత, ఇంక కూర్చోలేనంటూ చేసిన అతని శరీరపు మొరాయింపు ఆమె నిద్రకి భంగం కలిగించింది.

“నిద్రపోవాలనుకుంటే మా అపార్ట్‌మెంట్‌కి వెళ్లేవాళ్లం!” అన్నాడు.

“అక్కడ నన్ను నిద్రపోనిస్తావేమిటి?” అని ఆగి, “అయినా, అక్కడ నిద్రపోనిస్తే నేనెందుకు వూరుకుంటాను?” అన్నది అమాని. ఆ కవ్వింపు అతనికి స్పష్టంగానే అర్థమయింది.

“ఇంకో గంటలో ఈ థియేటర్లో ఒక షో వున్నది – చూద్దామా? రోమియో అండ్ జులియెట్,” అమాని అడిగింది.

“విషాద గాథ నెన్నుకున్నావెందుకు?”

“మన కేది రాసిపెట్టి వున్నదో మనకేం తెలుసు? ఏదయినా మన చేతుల్లో వుంటేగా! ఇక్కడ ఒక షో చూద్దా మనుకున్నాను.  తమాషాగా ఇప్పుడిక్కడ ఆ విషాద గాథనే ప్రదర్శిస్తున్నారు. అసలు డైలాగులేమీ వుండవట ఈ ప్రదర్శనలో.  మాటల్లేని విషాదాన్ని చూడా లనిపించింది.”

“ఇంకో రెండో, మూడో గంటల తరువాత పికప్ చేసుకోగలవా?” అని రోహిత్‌కి మెసేజ్ పంపిస్తే అతను సరేనన్నాడు.

థియేటర్లో షోమీద కళ్లతోబాటు మనసుని కూడా కేంద్రీకరించగలిగి నప్పుడు చాలా బావుంది అనుకున్నాడు. తనచెయ్యి అమాని చేతితో పెనవేసుకునున్నదని గుర్తు వచ్చినప్పుడు, దారీ తెన్నూ లేకుండా వున్నట్టున్న తన ఏకాకి జీవితానికి ఒక తోడు లభించబోతున్న దన్న నమ్మకం హమీర్‌కి కలిగింది. కానీ, అది రిలేషన్‌షిప్ అని పూర్తిగా అనుకోవడానికి ఆస్కారం లేకుండా, ఇప్పటిదాకా ఆమే అన్నీ నిర్దేశిస్తూ వున్నది.

“జూన్లో యోసమిటీ వస్తావా?” షో అయి, బయటకు వచ్చిన తరువాత అడిగాడు. అప్పటిదాకా తెరిపిగావున్న ఆమె మొహం మ్లానమవడం గమనించాడు. “ఇంకా చాలా కాలమున్నదిగా! ఎన్నో జరగవచ్చు ఈ అయిదునెలల  కాలంలో!” అన్నది అమాని. ఆమె గొంతులో అంత నిరాశ ఎందుకు నిండుకున్నదో అతనికి అర్థంకాలేదు.

ఇంకా ఉంది…