వాకిలి » నిషిగంధ

కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
మనందరికీ కేవలం మనవే అనిపించే కొన్ని అభిరుచులూ, అనుభవాలూ, స్థలాలూ ఉంటాయి. అవి అర్థవంతమైనవీ, వ్యక్తిగతమైనవీనూ. ఒకప్పుడు వీటిని రాయొచ్చు, అందరితో పంచుకోవచ్చు అనే అవగాహన బహుతక్కువగా ఉండేది. నాకైతే దేశం విడిచి వచ్చిన తర్వాత కానీ నా అభిరుచులకు నేనివ్వాల్సిన విలువ అర్థం కాలేదు. స్వదేశంలో ఉన్నంతకాలం చదవడం మీద ఉన్న ఆసక్తి రాయడం మీద ఉన్నట్టు అస్సలు గుర్తులేదు. అసలు రాయడం అనేది మానవాతీతశక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అని నమ్మిన రోజులవి!

చిన్నప్పటి నించీ నేనూ పుస్తకాలు బానే చదివేదాన్ని… చందమామ, బాలమిత్ర, శరత్ సాహిత్యం, ఆంధ్రజ్యోతి, అంధ్రభూమిలో బొమ్మదేవర నాగకుమారి సీరియల్స్, యండమూరి నవల్సూ… ఇలా… సరిగ్గా ఇదే వరుసలో!!

చదువుతున్న కొద్దీ మనసులో మంచీ చెడ్డా బేరీజులూ, ఆలోచనల అలజడులూ ఎక్కువవుతూ ఉంటాయి. ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏదైనా గాఢమైన అనుభవంతో ముఖాముఖీ అవ్వగానే ఎవరితో అయినా పంచుకోవడం కోసం కాదు మన కోసం మనమే ఆ అనుభవాన్ని అక్షరాల్లోకి పెట్టాలనిపిస్తుంది.. అలా అనుభవాలూ, ఆలోచనలూ అనేక మలుపులూ తిరుగుతూ, కూడలులు దాటుకుని అక్షరాల రూపంలో బయటకొస్తాయి.. ఇహ అది ఏ స్థాయి కి చెందిన సాహిత్యం అనేది తర్వాత ప్రశ్న!

నా చిన్నప్పటి రోజుల్లో, అంటే వయసు ఖచ్చితంగా ఇదని ఇప్పుడు చెప్పలేను కానీ మనసూ, మమతా, వెన్నెలా, వేదనా లాంటి పదాలు అర్థమవుతున్న రోజుల్లో సినిమా పాటలూ, కవిత్వం కవల పిల్లలు.. మంచి ట్యూన్ వస్తే అది పాటవుతుంది లేదంటే అది పుస్తకాల్లో అచ్చవుతుంది అనేది నా అవగాహన!! అందుకే కవిత్వం అంటే ఖచ్చితంగా ప్రాస ఉండాలీ అనుకునేదాన్ని.. ఉదాహరణకి-

కోరీ.. ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ

వలచి.. ఈ వేళ పిలిచి… దూరాన నిలిచి

అదే ఇన్స్పిరేషన్ తో స్కూల్లో పోటీల్లో అమ్మ, స్నేహం, దేశం ఇలాంటి అంశాల మీద ఎక్కడా ప్రాస చెదరకుండా నాలుగైదు పేజీల కవితలు రాయడం మొదలుపెట్టాను.

బాగా మనసులో నిలిచిపోయిన సందర్భం- ఐదో తరగతిలో అనుకుంటాను ఒకసారి నా బంగారు భవిష్యత్తుని నిర్ణయించే పరీక్షలేవో జరుగుతున్నాయని మా అమ్మానాన్నా నన్ను చదువుకోమని పక్కింట్లో మా అమ్మమ్మ దగ్గర వదిలేసి, తమ్ముడ్ని మాత్రం తీసుకుని సినిమాకి వెళ్ళినప్పుడు అర్థరాత్రి వరకూ మేలుకుని ‘ఒంటరి నక్షత్రం’ అనే కవిత రాసి, ఆ కాగితాన్ని రోజూ పొద్దున్న హోమ్ వర్క్ చెక్ చేసే మా అమ్మకి కనబడేలా పుస్తకంలో పెట్టాను. అది చదివి అమ్మకి సినిమాకి వెళ్ళలేని నా క్షోభ అర్థమై, చాటుగా కళ్ళు తుడుచుకుని, ఇంకెప్పుడూ నన్ను వదిలేసి వెళ్ళననే శపథం చేసుకుంటుందని నా పసి కళాత్మక హృదయం ఆశించింది.

మర్నాడు పొద్దున్నే మా అమ్మ అయితే ఆపకుండా చదివింది.. కాకపోతే అంతే ఏకాగ్రతతో మజ్జిగ కవ్వం తిరగేసి కొట్టింది కూడాను! అంతకు ముందు సంవత్సరం స్కూల్లో నేను రాసిన నాలుగు పేజీల ‘అమ్మ ‘ కవితకి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏమన్లేదు ఎందుకో!? పైగా ‘మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినట్టు కనబడితే బడి మాన్పించి నాలుగిళ్లల్లో పాచిపనికి కుదురుస్తాను, జాగ్రత్త!’ అని బెదిరింపులు!

ఈ సంఘటన తల్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది, నేను మిలినియల్ కిడ్ అయితే ఎంత బావుండేది అని. ఎందుకంటే అమ్మ ఫేస్‌బుక్ లో ఉండేది, నా కవితని ఆనందంగా ‘A philosophical poem by my 10yr old daughter’ అని షేర్ చేసుకునేది, వందలకొద్దీ లైక్‌లు తెచ్చుకునేది. ఆ ఆనందంతో నన్ను poetry workshop classes లో జాయిన్ చేసేది!!

ఇక ఊహ నించి బయటకొస్తే, నాకు సాహిత్యమంటే నాన్నే! చందమామ, బాలమిత్రలను ఏడో తరగతిలోనే శరత్ నీ, జిడ్డు కృష్ణమూర్తినీ చేతిలో పెట్టి ఏది నచ్చితే అది చదువుకో అన్నారు. పేరుకి అర్థం కూడా తెలీకుండా ‘బడదీదీ’ చదివాను అప్పుడు. ఆ తర్వాత ‘సంస్కరణ ‘ (ఎవరు రాశారో అస్సలు గుర్తు లేదు!) అనే నవల ఇచ్చారు.. అలా అని కావ్యాలూ, క్లాసిక్సూ లాంటివేవీ చదవలేదు! కానీ చదవడం అనే అనుభవాన్ని పరిచయం చేశారు.

కవిత్వం మీద ఆసక్తి, ఇష్టం మొదలైంది మాత్రం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, ఆకులో ఆకునై, మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై, లాంటి పద ప్రయోగాలు సినిమా పాటల్లో వినడం, ఆయా రచయితల ఇతర రచనలు అని వెదుక్కుంటూ పద్యాలూ, కావ్యాలూ కాకుండా కవిత్వం అనే ఒక ప్రక్రియ, దాని తీరుతెన్నులూ అనుకుంటూ అన్వేషించడం మొదలు పెట్టిన రోజుల్లోనే! శేషేంద్రశర్మ, రవీ‌ద్రుడూ, కృష్ణశాస్త్రీ, గాలి దుమారంలా అలజడి సృష్టించిన శ్రీ శ్రీ.. వీళ్ళే తొలినాళ్ళలో ఆరాధ్యదైవాలు. ఇవ్వాళ్టి రోజున, కొన్ని వందలసార్లు వినేసిన తర్వాత, తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు ‘ అన్న భావం మామూలై పోయి ఉండొచ్చుగానీ అది మొట్టమొదటిసారి విన్న క్షణంలో నా మనసు లోనైన భావావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను!

స్వదేశంలో ఎక్కువగా రాయలేదు. రాసే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే తొంభైల్లో ఆంధ్రదేశం లో ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఇంటింటికో ఇంజనీరూ, డాక్టర్‌ని తయారుచేసే ఉద్యమం. అందులో అమ్మానాన్నలు చాలా చురుకుగా పాల్గొనడం వల్ల చదువు తప్ప ఇతరత్రా వేటినీ దగ్గరికి రానీయలేదు!

చదువులు ముగిసి జీవితం తిప్పిన మలుపులో భాగంగా దేశాన్ని వదిలి రావాల్సి వచ్చింది! అమెరికా జీవితంలో, ఇంటర్నెట్ జీవితంలొ ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టాక, మూలాల కోసం వెదుక్కోవడంలో భాగంగా తెలుగు గ్రూపుల్లో చురుకుగా పాల్గొనడం ఎక్కువయింది. అలా ఆ గ్రూపుల్లో లైక్ మైండెడ్ వ్యక్తులు తారసపడటంతో కవిత్వం మీద మళ్ళీ ఆసక్తి మొదలైంది. ఎంతోమంది వర్ధమాన కవులూ, కవయిత్రుల పరిచయాలూ.. కవిత్వంమీద చర్చలతో తెలీకుండానే కవిత్వం జీవితంలో ఎప్పుడు ముఖ్యభాగం అయిందో గమనించనే లేదు! అలా తెలీకుండానే ఒకటీ రెండూ అంటూ మొదలిపెట్టి తెలుగుజ్యోతి, పొద్దు, కౌముది, వాకిలి, సారంగ వంటి అంతర్జాల పత్రికలకు కవితలు పంపడమూ, అప్పుడప్పుడు పోటీలలో బహుమతులు తెచ్చుకోవడంతో కవిత్వం అస్తిత్వమై నాలో నిండిపోయింది. నా అక్షరాలు నన్ను దాటి నలుగురినీ చేరుకుని అమోదం పొందడంతో పాటు విలువైన సలహాలు నిరంతరం పొందడం కూడా ఒక ముఖ్య విషయం!

అమోదమూ, సలహాలూ అంటే ఇక్కడ ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్పాలి.

అంతర్జాలంలో కవిత్వం చదవడం, రాయడం మొదలుపెట్టిన కొత్తల్లో పరిచయమైన కొత్త కవిత్వ తత్వం, ఇస్మాయిల్ గారి నిశ్శబ్ద కవిత్వం! ఆ తత్వాన్ని ఆస్వాదించడం మొదలుపెడుతూనే తారసపడిన వర్ధమాన కవి యదుకుల భూషణ్ గారు. ఇస్మాయిల్ గారి శిష్యులు, అభిమాని! భావాన్ని వ్యక్తపరచడంలో ఎటువంటి దీర్ఘాన్నీ, ఆడంబరాన్నీ ఇష్టపడని కవి. ఆయన కవిత ఒకటి నన్ను ఎంతో ఆకట్టుకుంది.

గతం

నల్లని రాతిమెట్లు

అల్లుకున్నవి లతలు పూలు

చతికిలబడటానికే తప్ప నిన్నెటూ తీసికెళ్ళలేవు!

గతాన్ని రాతిమెట్లుతో పోల్చడం, అది కాసేపు సేద తీరడానికే తప్ప ముందుకి తీసుకెళ్ళడానికి పనికిరాదని చెప్పడం అద్భుతం! అలా భూషణ్ గారి కవిత్వాన్ని, ఆయన ఇతర వర్ధమాన కవుల కవిత్వాన్ని విశ్లేషించే విధానాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థం ఏంటంటే మాలాంటి ఒకటీ అరా రాస్తున్న వారికి ఆయన ఏదైనా కవితని మెచ్చుకోవడం అంటే ఐఐటీ ఎంట్రెన్స్‌లో మొదటి ప్రయత్నంలోనే కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావడం వంటిది!

ఆ తర్వాత నన్ను ప్రభావితం చేసినవారు అఫ్సర్ గారు, నా గురువుగారు! ఆయన వర్ధమాన కవులందరికీ డొక్కా సీతమ్మ లాంటి వారు. అంటే, ఆవిడ ఏ సమయంలో వచ్చినా అతిథులకి అన్నం పెట్టేవారు. ఈయన ఎవరికైనా రెండు మూడు ముక్కలు రాయడం వచ్చు అని తెలిస్తే చాలు ఆయన బడిలో చేర్చేసుకుని నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారు! ఆయన నాకు ఇచ్చిన అమూల్యమైన సలహా, “కొన్ని పదాలూ చిత్రాలూ కలిస్తేనే కవిత్వమైపోదు. వాటి మధ్య ఇంకేదో వినిపించాలి కనీసం వొక కూనిరాగం లాంటి గుండెచప్పుడు. వినిపించాక, అది నిస్సహాయపు మూలుగు కావచ్చు, చీకటి చివరి వెలుగు అయినా కావచ్చు. ఎదో వొకటి మాత్రం నువ్వే వినిపించగలిగిన శబ్దాలు కొన్ని వున్నాయి. అవి వినిపించకుండా వెళ్ళిపోకు.”

స్వతహాగా హిందీ భాష మీద ఇష్టం ఉండటంతో పాటలూ, కవిత్వమూ చదువుతూనే ఉన్నా కానీ అనువాదాలు చేయడానికి ముఖ్య కారణం ఒకరోజు రేడియోలో విన్న ఒక కథ!

ఒక రోజు మధ్యాహ్నం డాక్టర్స్ ఆఫీస్‌కి ఆగమేఘాల మీద వెళ్తూ, కార్లో రేడియో చానెల్స్ మారుస్తుంటే ఉన్నట్టుండి ఒకమ్మాయి గొంతు వినిపించింది, ఏదో చదువుతున్నట్టు. ఖచ్చితంగా న్యూస్ మాత్రం కాదని రెండు సెకన్లకే అర్థమైపోయింది. తన గొంతు తప్ప ఇంకేమీ వినబడని స్వచ్ఛమైన వైట్ నాయిస్ అది!

“…I don’t watch telenovelas. I hate drama. That’s why I live in Doral. (In Doral, the most dramatic thing that happens is golf.) But. When my mother calls to tell me about the filming, I say, “I’m coming!”

అది ఒకమ్మాయి — తన పేరెంట్స్ ఉండే నెయిబర్‌హుడ్‌లో జరుగుతున్న ఒక టివిసీరియల్ షూటింగ్ గురించీ, అక్కడ నివసించే మనుషుల గురించీ, ఆ సమయంలోనే కొడుకుని ఆల్మోస్ట్ నీళ్ళల్లో ముంచేసి చంపేయబోయిన ఒక అబ్యూసివ్ తండ్రి గురించీ, దాని గురించి పెద్దగా పట్టించుకోని పోలీసుల గురించీ… చెప్తున్న కథ!

“… I know the camera only sees what it wants. But, I keep trying to look outside the frame, to catch sight of the crowd watching from across the street. I want to see myself, living outside the drama.

But I can’t…”

ఇలా ముగిసేవరకూ నేను రియలైజ్ అవనే లేదు, నేను డాక్టర్స్ ఆఫీస్‌కి వచ్చేసి, పార్క్ కూడా చేసేసి, కదలకుండా ఆ కథ వింటున్నానని, అందులో పూర్తిగా మునిగిపోయానని! ఆ కథల్లో వాళ్ళ హృదయం ఉంది, నిజాయితీ ఉంది! ఒక భాషలోని భావాల్నీ ఆ వ్యక్తుల అనుభవాల్నీ యథాతథంగా వేరే భాషలో చెప్పగలగడం వల్ల ఎంతమంది భిన్న వ్యక్తులని ఏకం చేస్తుందో కదా అనిపించింది!

అప్పుడే అనిపించింది, నాకు తెలిసిన హిందీ భాషలోని మంచి కవితలని తెలుగులోకి ఎందుకు అనువాదం చేయకూడదని. మెల్లగా బ్లాగులో గుల్జార్ కవితలు రెండు మూడూ అనువాదం చేశాను.. అఫ్సర్ గారి ప్రోత్సాహం వల్ల సారంగలో గుల్జార్ అనువాదాల మీద ఒక సిరీస్ లాంటిది రాయగలిగాను.

చిన్న ఉదాహరణ-

Sketch

Yaad Hai Ik Din?

Mere Maze Par Baithe Baithe

Cigartte Ki Dibiya Par Tumne

Chhote Se Ek Paudhe Ka

Ek Sketch Banaya Tha

Aakar Dekho,

Us Paudhe Par Phool Aaya Hai!

చిత్రం

గుర్తుందా ఒకరోజు?

నా బల్ల మీద కూర్చున్నప్పుడు

సిగరెట్ డబ్బా మీద నువ్వు

చిన్న మొక్కలాంటి

ఒక చిత్రాన్ని గీశావు

వచ్చి చూడు,

ఆ మొక్కకి ఇప్పుడు పూలు పూస్తున్నాయి!

గుల్జార్‌ కవితలతో పాటు ఇప్పుడు అమృతా ప్రీతం (ఈమె ఇప్పటి పాకిస్తాన్ లో పుట్టిన పంజాబీ కవయిత్రి) కవితలని అనువాదం చేయాలని ఆలోచన. వీలైనంత వరకూ వీలు చేసుకుని కవిత్వంతో సమయం గడపాలని ఉంది.

వచనం చదవడం ఇష్టం. కవిత్వం రాయడం ఇష్టం. కవిత్వంతో అయితే చాలా చెప్తూనే ఏవీ చెప్పలేదన్న లేక అసలేం చెప్తున్నామోననే సందేహావస్థ కలిగే భావన తెప్పించవచ్చు. నాకు అది చాలా ఇష్టం! వచనంతో అలా కుదరదు. మనసులో కార్నర్స్ ని ఫ్లడ్‌లైట్ వెలుతురులో పెట్టి చూపిస్తున్నట్టనిపిస్తుంది.కానీ ఏ బద్దకపు మధ్యాహ్నమో, ముసురుపట్టి కాలు బయటపెట్టనివ్వని ఉదయాలలో ఏమన్నా చదవాలనిపిస్తే ఖచ్చితంగా అది వచనమే అయి ఉంటుంది.

అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే? సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు.. సమూహంలో అప్పుడప్పుడg అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!

ఎంతకాలం ఎన్ని రాయగలనో తెలీదు కానీ రాసిన, రాయబోయే నా నాలుగక్షరాలు మాత్రం తిలక్ తాలూకు వెన్నెల్లో ఆడుకుంటున్న ఆడపిల్లల కాలి మువ్వలుగానో, జడలో తురుముకున్న జాజులుగానో మిగిలిపోవాలని నా ఆకాంక్ష!!

(’10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)

కహా సే ఆయే బద్‌రా…
అద్భుతాలన్నీ తాత్కాలికాలేనని నమ్ముతాను కానీ అవి పునరావృతమూ అని ఖచ్చితంగా ఎవరూ చెప్పరెందుకనీ!? ఝూటా హీ తో సహీ, ఒక భరోసానెందుకివ్వరూ!?!?

నాకు తెలుసు.. ఈపాటికే వచ్చి ఉంటావనీ, గుప్పెడు గింజలు పోగేసి పెట్టి, అలసటగా ముడుచుకుని కూర్చుని ఉంటావనీ తెలుసు.. ముఖ్యంగా, నే వచ్చేదీ లేదీ తెలియడం నీకు చాలా ముఖ్యమని కూడా తెలుసు.

కానీ… ఇంకా ఏదో తెలియంది మిగిలుందనే చూస్తున్నా! వచ్చే ముందు ఇక్కడ దిగుడు బావిలో వెదుక్కోవాల్సింది ఇంకేదీ లేదని ఇంకోసారి ఖచ్చితంగా తేల్చుకోక తప్పదు!

అసలు ఎప్పుడైనా అనుకున్నామా!? ఇంత అందమైన ఊరిలో మనిద్దరం కలిసి ఒక ముచ్చటైన ఇల్లు కట్టుకుంటామని!

ఒద్దికగా, ఓపిగ్గా గోడల నిండా మనకిష్టమైన బొమ్మలేసుకున్నాం.

పల్చని మబ్బుల పైకప్పు నించి అనామక పూలతీగల షాండిలియర్ వేళ్ళాడదీయడానికి ఎన్నెన్ని బద్దకపు మధ్యాహ్నపు నిచ్చెనలు ఎక్కామో!! కిటీకీలన్నిటికీ నీరెండల, చిరుజల్లుల తెరలు కడుతున్నప్పుడల్లా ముందురోజు ఆపిన పాట మొదలుపెట్టమంటావు..

జీవితమేమో లేత వేళ్ళతో అక్కడో దీపం, ఇక్కడో పూలపాత్రా సర్ది పెట్టేది!

ఇంటికి చేరుకోవడంలో ఎంత ఆత్రుతా, ఆనందమూనూ!

సందు మలుపులోనే కలుసుకుని, కనుబొమ్మలెగరేసి నవ్వుకుని, వేళ్ళల్లో వేళ్ళు జొనిపి, పరుగులాంటి నడకతో ముందు తలుపు తోయడంతోనే కాలం ఆగి, ఊపిరి మొదలవుతుంది!

ముందుగా కూజాలో నీళ్ళు నింపడం నా వంతే.. అప్పుడు గానీ చెప్పడం మొదలుపెట్టవు, ఏదైనా… ఆ, అంతకుముందు నీ వేళ్ళతో నానుదిటి మీద జుట్టుని సరిచేయడం కూడా అవుతుందనుకో!

వద్దని వారించుకుంటూనే అలలతో అవసరమైనదానికంటే ఎక్కువగా ఆడుకుంటాను కదా!

తిరిగొచ్చి మూలమూలలకీ అంటుకున్న ఇసుకంతా దులుపుకోలేక అవస్థ పడుతుంటే ‘సముద్రాన్ని దూరం నించే చూడమని చెప్పలేదూ?’ నీ చిన్నపాటి మందలింపూ, చిరునవ్వూ కలిసిపోయి గాలి మువ్వలు కదులుతాయి.

అప్పటికప్పుడు నాలుగు మాటలేవో చాలా ఇష్టంగానూ, బోల్డంత ప్రేమతోనూ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను.. పక్కనెక్కడో ఆకుల్తో ఆడుకుంటున్న పిట్టలూ.. ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న గడ్డిపూవూ కూడా టక్కున నా వంక చూసి ‘గుడ్ లక్!’ అని ఫక్కున నవ్వేసుకున్నట్లనిపిస్తాయి!! ఉక్రోషమో.. నిస్సహాయాత్వమో.. కళ్ళల్లోంచి నాలుగు బిందువులు గురుత్వాకర్షణ శక్తికి దాసోహమంటూ చిట్లుకుంటూ నేలరాలతాయి!

అంతా అర్ధమైనట్టే పిడికిలి తెరిచి, అరచేతిలో ముద్దుపెడతావు సరే… మౌనాన్ని మోహనంగా మార్చడం కేవలం నీకు మాత్రమే తెల్సిన మాయాజాలమని చెప్పినట్లే గుర్తులేదు!

రోజువారీ అసహనాలూ అసంతృప్తుల్లో నలుగుతూ, నీరసపడుతూ మనల్ని ఇంటికి చేర్చే వంతెన నెర్రులివ్వడం చూసుకోనేలేదు… చూసినప్పుడైనా ఒక ఊదా సాయంత్రాన్ని వెంటేసుకుని బావురుమన్నానే కానీ నీలోంచి నన్నూ, నాలోంచి నిన్నూ కాస్త కాస్తా తవ్వి తీసి పలకలుగా పరుచుకుందామని తోచనేలేదు.

నువ్వేమో బాగుచేయడమనేదే బాగోదంటావు! అవతలివయిపు ఉన్ననాలుగు గోడల అంతస్థు మనకోసమేనని ఎప్పటికప్పుడు మార్దవంగానే గుర్తుచేస్తుంటావు.. అట్నించీ బారుగా నన్ను తాకే నీ నీడనీ, దాని వడలిన పాదాలనీ తల్లడిల్లుతూ చూస్తున్నప్పుడే తేల్చేసుకోవాలనిపిస్తుంది, కదలి ముందుకు వెళ్ళడమా? మరలి వెనక్కి వెళ్ళడమా?

ఆ గరుకు ఆలోచనకే గుండెలో ఒక సుదీర్ఘ హేమంత రాత్రినాటి వణుకు!!

గుర్తొస్తుంది ఇహ అప్పుడు నీ గొంతు- ‘జన్మజ దుఃఖ వినాశక…’ లా నాలోని ప్రాచీన విచారాన్నంతా అలవోకగా అరనిమిషంలో మరుగున పెట్టేసే నీ గొంతు! ఆ సవ్వడి కోసం, దాని జాడ కోసం, అర్ధరాత్రి సముద్రంలో దారితప్పిన జాలరిలా ఆత్రంగా వెదుక్కుంటుంటాను. కానీ, కనుచూపుమేరా పరిచి ఉంచబడింది నీ రాహిత్యమే! దూరం స్పష్టంగా లిఖిస్తున్న దగ్గరతనమే!

మూసిన తలుపుల్లోంచి సునాయాసంగా దారి చేసికొచ్చిన తూనీగలా వెంటనే ఒక విషయం తాకి పోయిందప్పుడే.. చిత్రంగా చిన్న నవ్వూ చేరుతుంది.

లోయల్లో ఇంద్రధనస్సులు వెదుక్కుంటూ, రికామీ రాత్రులకి కురిసెళ్ళిన చినుకుల్ని వేళాడదీస్తూ, అలసిపోయినతనంలో అవసరమైనవి విరామాలు కానీ ముగింపు కాదు!!

శరీరమంతా శాంతి పిక్సీ డస్ట్‌లా జాలువారుతుంటే ఒక లలితమైన ఆనందం…

ఇల్లానే ఏకాంతంగా ఇంకాసేపు నవ్వుకుంటో ఉండాలనిపిస్తుంది కానీ…

ఈలోపు…

సాయంత్రపు వానలో తడిచి, రాత్రి నీడల్లో దోబూచులాడే మరువపు సుగంధాన్ని దోసిళ్లకొద్దీ సర్ది, ‘ఇష్టాన్ని ఇష్టంగా చెప్పలేని అశక్తిని క్షమిస్తావు కదూ?!’ అని అపాలజటిక్ నోట్ పెట్టిన ఒక బహుమతిని నీ కోసం తప్పక వదిలి వస్తాను!

(Painting: Abdul Salim)

వలస పక్షి
కొన్నిసార్లు ఏదనీ చెప్పడానికేముండదు..

వద్దనుకున్నవో.. వదిలేసుకున్నవో

పాత బంధాలు

కొత్త బెంగలై

లోపల్లోపల పేరుకోకముందే

తటాలున విదిలించేసుకున్నా

అకారణ దిగులేదో

ఇంటిచూరు పట్టుకుని వేళ్ళాడే మధ్యాహ్నపుటెండలా

ఉత్తినే వేధిస్తుంటుంది..

పచ్చపూలవనాల్లో

అలక్ష్యంగా ఎగిరీ..

ఆగి ఆగి నవ్వుతున్న నక్షత్రాల ఆకాశాన్ని

భుజాన వేసుకుని..

ఎప్పటికీ తిరిగి రాని రెండు ఝాముల కోసం

ఒక వలస పక్షిలా

మళ్ళీ వెళ్ళి వెదుక్కున్నా

పలకరించేది

గోడలు కూలిన రహస్యగృహమే!

ఎందుకో మాట్లాడలేక.. మాట్లాడి ఏమవ్వనూ లేక

మౌనంగానే తేలికవ్వాలంటే..

ఎవరినీ చేరని కలలా

చీకటి చివర్లలో

ఊగుతూ ఒద్దికగా ఉండిపోవాలంతే!

ఉండడమేవిటో…

అంతలోనే లేకపోవడమేవిటో

మృదువుగా కదిలెళ్ళే మేఘంలో

లిఖించబడి ఉంటుంది!

అర్ధమయితే చాలు..

అసహనపు వల వీడిపోతుంది!

విచ్చుకుంటున్న స్వాతిశయపు పూలగుత్తుల్లోంఛి

తోవ చేసుకుంటూ

ఆకాశం సముద్రస్నానం చేస్తున్న

ఆవలి తీరానికి

ఇంకొక సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది!!

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

painting: జావేద్

అమ్మలు
సగం వేసి వదిలేసిన బొమ్మల్లోకి

తోక లేని ఉడుతలూ.. పేరు తెలియని పువ్వులూ

వచ్చి చేరేలోపలే

రంగులన్నీ గోడలతోనూ.. గుమ్మాలతోనూ

గుసగుసలు మొదలు పెడతాయి..

అలసి అదమరిచిన

చిందరవందర ఇంద్రధనస్సు

మేలుకున్నప్పుడే

ఒక అంతఃపురంలో తెల్లవారుతుంది..

స్తబ్దత తెరలన్నీ

హడావిడిగా పక్కకి జరపబడతాయి..

శృతి చేయబడుతున్న పదాలు కొన్ని

పాల చినుకుల్లో మునకలేస్తుండగానే

చెలికత్తె రామచిలుకలు

వాలతాయి..

నాలుగ్గోడల మధ్యనో

ఉద్యానవనం పరుచుకుంటుంది..

పరుగుల చివురాకు స్పర్శలూ

నవ్వుల కోయిల పాటలతో

ఉదయాలగుండా

వసంతం వీస్తుంటుంది!

కాగితపు పోగుల కేరింతల్లో

ఇష్టమైన పండగని జరుపుకుంటూ

అక్కర్లేని విరామమొకటి ప్రకటించి

కాళ్ళచుట్టూ చేతులేసి కావలించుకుంటుందా,

ఒకప్పుడెప్పుడో

చేస్తున్న పనాపి

బుగ్గలు పుణికి ముద్దెట్టుకున్న

అమ్మ చేతి తడి

మళ్ళీ కొత్తగా కళ్ళల్లో కమ్ముకుంటుంది!

March 20, 2014 4:00 PM

(జయభేరి మొదటి భాగం – కవిత 2)

జయభేరి మొదటి భాగం – కవితలు
రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?
కవిత్వం నాకేమిస్తోంది?

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని కనుక్కోవడం కోసమా, లేక, నాలో నాకు తెలియని లోతుల్ని కనుక్కోవడం కోసమా? ఎవరికోసం ఈ కనుక్కోవడాలూ, గుర్తు తెచ్చుకుని వెక్కి వెక్కి ఏడ్వడాలు? అత్యంత సంక్లిష్టమైన అనుభూతులను పలవరించడం ఎవరికోసం? కవిత్వం నాకు సంతోషాన్నిస్తుందా లేక దుఃఖం మిగులుస్తుందా? అసలు “కవిత్వం నాకేమిస్తోంది?”

జయభేరి కవి సమ్మేళనంలో మొట్టమొదటి టాపిక్, “కవిత్వం నాకేమిస్తోంది?”. ఈ టాపిక్ పై మీ స్పందన రాయండి.

శైలజామిత్ర గారి స్పందన:

మొదటగా కవిత్వం నాకు ఆనందాన్ని ఇస్తోంది. సమకాలీన సమాజం లో నన్ను నన్నుగా నిలబెడుతోంది . అయితే కవిత్వ స్వరం ఎలా ఉండాలి? ఏది రాస్తే కవిత్వం అవుతుంది అనే అంశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి . ఎవరికీ వారు ఇదే కవిత్వం అనే ధోరణి సాగుతోంది. ఇటీవల ఒక కవి సమాజాన్ని శాసించలేని కవిత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ప్రేమ కవిత్వాలు , వ్యక్తిగత కవిత్వాలు కవిత్వం అనిపించుకోదు అని ఆవేశంగా అన్నారు. నేను అందుకు సమాధానంగా ఎవరు రాసింది వారికి కవిత్వం . నా ధోరణి నాది . మీ ధోరణి మీది. ఒకరిది కవిత్వం కాదు అనడానికి , మరొకరు రాసేదే కవిత్వం అని పొగడానికి మనమెవరం? అనేది నా ఆలోచన. చూద్దాం రేపటి తరం చిక్కని కవిత్వం తో ముందుకు వస్తోంది. వారే నిర్ణయిస్తారు కవులెవరో? కవిత్వం ఏదో ?

నరేన్ (గరిమెళ్ల నారాయణ) గారి స్పందన:

తరచి చూసుకుంటె: పిల్లనగ్రోవి(మురళి) ఉదటం తెలిసిన ఒక మూగవానికి (లేదా) ఒక కాపరి కి, ఆ కళ ఏమిస్తుందో కవిత్వం కూడా నాకు అదే ఇస్తోంది.

తెలియని సంతృప్తి…శతాబ్దాల కాలం పాటూ అనేక పుటలని ఓపికగా దాటుకుంటూ బతికినట్టి అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందనిపిస్తోంది.

ఉదాహరణకు, నయాగరా జలపాతాన్ని చూసినప్పుడు…దాని జల్లులో తడిసి ముద్దైనప్పుడు పొందిన అనుభూతి…ఆ అనుభవాన్ని ఒక కవితగా ( ‘ బందీ’ ఈమాట) వ్రాసుకున్నాక పరిపూర్ణమయ్యిందనిపించింది.

అలాగే లోకాన్ని వీడిపోయిన ఆత్మీయమైన మనుషులను, కనుమరుగైపోయిన సందర్భాలనూ కూడా, సజీవంగా దాచుకునే వెసులుబాటునూ (ఫోటోల కన్నా ఎక్కువగా) కవిత్వం కల్పించింది.

నిషిగంధ గారి స్పందన:

చాలాసార్లే కూర్చుంటాను రాయాలని.. సమయాన్నే కాదు, చిందరవందర ఆలోచనల్లేని మనసునీ కూడా తోడు పెట్టుకుని.. కుదరదు.. రెండు మూడు పదాల కంటే ముందుకి జరగదు!

సంతోషమో.. బాధో.. కోల్పోయిన తనమో.. గుండె అంచుల్నిండి రాలినప్పుడూ… సరైన పదాలు వాటిని పట్టుకోగలిగినప్పుడే కవిత్వం అనేదేదో నాకు రాయడానికి వస్తుంది!

అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే.. సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు.. సమూహంలో అప్పుడప్పుడూ అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!

సాయి పద్మ గారి స్పందన:

హ్మ్మ్.. ఉహూ.. ఇవ్వటం అనేవరకూ వస్తే , కవిత్వంతో బిజినెస్స్ లా అనిపిస్తుంది కాబట్టి, ఏమీ లేదు అనిపిస్తుంది. కానీ కవిత నన్ను మెచ్చుకున్న విధానం చూస్తే అహాన్ని ఇహాన్ని ఎంత సంతృప్తి పరుస్తోందో కదా పాపం అని కవిత్వం మీద జాలేస్తుంది.

ఏది కవిత్వమో నాకు తెలీదు.. ఏ వచనమూ..నేను రాసిన దానితో సహా గుర్తుండదు. కానీ , మాటకీ , నిశ్షబ్దానికీ మధ్యన ఏదో మీడియేషన్ కవిత్వం చేస్తోందనే అనిపిస్తూ ఉంటుంది ..

ఎప్పుడంటే.. గొంతుదాటని మాట, పెదవి దాటని ప్రేమ, శరీరం దాటని అనుభూతి… కాన్షస్నెస్ లేకుండా రాసిన కొన్ని అక్షరాల మూటల్లో , తాయిలంలా అపురూపంగా కనబడినప్పుడు ..

హమ్మా.. కవిత్వమా .. ఏదో ఉంది అని అప్పుడు అనిపిస్తుంది.. ఇప్పటికి ఇంతే ..!

స్వాతీ శ్రీపాద గారి స్పందన:

చాల్లెండి , నవ్విపోతారు! కవిత్వం నాకివ్వడమేమిటండీ బాబూ, ఎంత సేపూ ఎంతొస్తే అంత లాభం అంటూ తీసేసుకోడమేనా ? నేనేమిస్తున్నాను అనే ఆలోచనే వద్దా ?

మదిలో మల్లెల తలపులను ఎందుకు విరబూస్తున్నారని అడగదమా? అపచారం అపచారం .ఎన్ని జాతుల మల్లెలో విశ్వమంతా వికసించి పరిమళభరితం చేస్తుంటే వాటిని అడుగుతున్నామా ఎందుకు పుయ్యాలనిపిస్తో౦ది మీకని? ఒక్క నీటిబొట్టు సన్నని వెలుతురు కిరణాన్ని సప్తవర్నాల్లో ఆవిష్కరిస్తుంటే దాన్ని అడుగుతున్నామా ఏం కనుక్కుందామని ఇన్ని హొయలు పోతున్నావని? నవ్వుల రవ్వలు మెరిసినా కన్నీటి బిందువులు చి౦దినా , నేను కీ మనకూ మధ్య రహదారి కదా అది. బాధపడి కొత్తతరాన్నో , కావ్యాలనో ప్రసవి౦చనిదే లోకమెక్కడ సాహితీ లోకమెక్కడ?పుడుతూనే మనకున్నది ఒకేఒక్క సంపద మనసేగా ? ఆలోచనా అనుభూతీ లుప్తమైన జీవితం ఒక జీవితమేనా? నా ఉనికి కవిత్వం, నాఊపిరి కవోత్వం నేనే కవిత్వం అందుకే నా ప్రతిభావానా కవిత్వానికి నేనే ఇస్తున్న అప్పుడే విరిసిన పూలుగానో అనాలి రగిలిన జ్వాలగానో సుకుమారపు సుతిమెత్తని మాటగానో , మనలో మన మాట మనది ఇచ్చే చేయ్యేగాని పుచ్చుకునేది కాదు.

కెక్యూబ్ వర్మ గారి స్పందన:

కవిత్వం నాకు ప్రతి క్షణం నన్ను నేను సంభాళించుకొని నేలపై నిటారుగా నిలబడే స్థైర్యాన్నిస్తుంది. నాకై నేను రాసుకుంటున్నప్పుడు వాక్యం పూర్తయిన ప్రతిసారీ పారే నీటిలో ముఖం కడుక్కున్న అనుభూతినిస్తుంది. అలాగే మిత్రుల కవిత్వం చదివేటప్పుడు పరకాయ ప్రవేశం చేస్తూ మరల మరల తరచి చూసుకొని చిగురాకులాంటి కొత్తదనాన్ని గుండెకు హత్తుకుంటాను. ఈ క్రియ ప్రక్రియల వలన నాకు నేను పునరుద్దీపమౌతుంటాను. జీవితమే యుధ్ధమైన సమయంలో కవిత్వం ఆయుధం కావడం యాధృచ్చికం కాదు కదా? మనుషులుగా జీవించాల్సిన సమయంలో హృదయ సంభాషణకు కవిత్వం ఓ వాహిక కదా?

ఈ రాత్రి…
మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ

చీకటి చిక్కపడుతుంది..

ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి

నాలుగు మాటలు చెప్పుకోడానికో

లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!

కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని

గాజుల చేతుల కింద పొదవిపట్టేసి

నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..

జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ

పగటి పాట్లనీ

వాటంతట వాటికి వదిలేసి

ఈ రాత్రిని జీవించాలని ఉంది!

నాలోకి నేను కాకుండా

నా నించి నేను దూరంగా..

నిశ్చలభయాల నిర్వికారాన్ని

ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ

తేలికై పోవాలి!

పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు

ఉండుండి వీచేగాలికి

వళ్ళు విరుచుకుంటుంటే..

వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో

కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!

మనస్థాపాల మసకతెరలని తప్పించి

అతన్ని ఐదునిమిషాలన్నా

చుంబించాలి…

ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!

వీచే నింగి కింద

గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…

అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…

ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..

ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!

గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా

ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!
జీవన ప్రస్థానంలో ఏదో ఒక మజిలీ దగ్గర ఆగి వెనక్కి తిరిగిచూసుకుంటే ఎన్నో సంతోషాలు.. ఆవేశాలు.. అవస్థలు.. ప్రేమలూ.. వేదనలూనూ!

అవి అనుభవించేప్పుడు మనఃస్థితి ఎలా ఉన్నా దాటేశాక మాత్రం ప్రతి జ్ఞాపకమో పరిమళాన్ని సంతరించుకుంటుంది. ఆ పరిమళాలే ప్రేరణగా మనల్ని స్పృశించే కవిత ఇది. “స్వప్నం నా ఊత కర్ర.. నిశ్శబ్దం నా గమ్యం..” అని చెప్పుకునే శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి అనుభూతి గీతాల సంపుటిలోదీ కవిత. చదువుతున్నంతసేపూ అనుభూతి నించి ఆలోచనకూ.. ఆలోచన నించి అనుభూతికీ సాగే అంతర్లోక భావనా సంద్రమొకటి అద్భుతమైన పదచిత్రాల ద్వారా సాకారమౌతుంది. అప్పట్లో కవిత్వం పేరిట కొందరు ప్రాధాన్యం ఇచ్చే విషయాలకు (ఛందస్సు, ప్రాస) భిన్నంగా 1976 లో ప్రచురింపబడిన ‘అనుభూతి గీతాలు ‘ సంపుటిలో ఏ గీతానికీ ఒక నిర్దుష్టమైన పేరు లేదు! కానీ ఈ గీతానికి ‘జ్ఞాపకాల హవేలీ’ అని నామకరణం చేశేయవచ్చు.

సాయంత్రం నించీ కురుస్తున్న వర్షం ఆగిపోయిన నిశ్శబ్దంలోనో.. అర్ధమయ్యీ అవనట్టుండే బెంగ ఒకటి మన చుట్టూనే మసలుతున్నప్పుడో.. ఒంటరితనపు తెరలు దించేసుకున్న వ్యక్తిగతసమయాలు కొన్ని ఉంటాయి. పరిశరాలు నీరవమయినా మనసులో మాత్రం ఆలోచనల రహస్య కోలాహలం మొదలవుతుంది. అచ్చు సందెవేళకి గూటికి తిరిగొచ్చిన గువ్వల కువకువలతో నిండిన చెట్టల్లే తుళ్ళిపడుతుంటుంది. మరిచిపోయినవో.. మరిచిపోవాలనుకున్నవో జ్ఞాపకాలు ఆ రాత్రప్పుడు సుదూరాలనించి సమీపానికొస్తాయి. ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ కవిత!

ఇందులో సంక్లిష్టమైన పదాలు, విడమర్చి చెప్పాల్సిన సమాసాలు, నిగూఢ ఆలోచనలు, రెండు మూడు సార్లు చదివితేగానీ తలకెక్కని తాత్వికత… ఇవేవీ ఉండవు! “స్పష్టమైన శబ్దం ఆధారంగా అపురూపానుభవాల నిశ్శబ్ద ప్రపంచంలో ప్రవేశించడం కవిత్వపరమావధి అనుకుంటున్నాను” అనే ఇంద్రగంటి గారి మాటలే ప్రమాణంగా కవిత ఆద్యంతం మేఘాలు కదులుతున్నంత మృదువుగా సాగిపోతుంది.

జ్ఞాపకాల హవేలీలో

అప్పుడప్పుడొక పరిమళాల దర్బారు జరుగుతుంది

సుతిమెత్తని వేళ్ళతో

కిటికీ తలుపు తట్టి

పూలకొమ్మకటి తల లోపలికి పెట్టి

కాస్తంత పరిమళం చల్లి చక్కాపోతుంది

ఎక్కడనించో ఒక అగరు మబ్బు

పల్చ పల్చగా జరిగివచ్చి

పడకింటి మంచానికి పందిరివేస్తుంది

గది గుమ్మానికీ

గది గుమ్మానికీ మధ్య

సుతారంగా కదిలే తెరల మీద

అత్తరు గుబాళింపుల సన్నివేశాన్ని

ముద్రించి ఒక వయస్సు వెళ్ళి పోతుంది…

దూరాకాశ తారావీధుల్లో

సంచరించే ఒంటరి మనస్సు దర్బారులో ప్రవేశిస్తుంది-

సావధానంగా విశ్రమించే మనస్సన్నిధిలో

ఒక్కొక్క జీవన పరిమళం చేతులు కట్టుకు

నిలబడి తన్ను తాను పరిచయం చేసుకుంటుంది.

హవేలీలో కోలాహలం అర్ధరాత్రయినా

కొనసాగుతుంది విరగబడే నవ్వులు…..

సంతోషపు కన్నీరు….

పరాచికాలు…..

ఇంత సందడి జరుగుతున్నా

మనసు మాత్రం ఏమీ చెప్పా పెట్టాకుండా

వెన్నెల రెక్కలు తొడుక్కుని

యౌవనవనాల వైపు వెళ్ళిపోతూంటుంది…

అప్పుడీ హవేలీ

శూన్యంగా మిగిలిపోదు

పరిమళాల సంగీతం వినిపిస్తూనే ఉంటుంది.

కవిత పూర్తవుతుంది.. కానీ మనం మాత్రం ఈసారి మనవైన జ్ఞాపకాలతో మళ్ళీ ఆ హవేలీలోకి ప్రవేశిస్తాం.. ఆ సందడిని కొనసాగిస్తాం! అంతేకాదు, దిగ్గున లేచి, దగ్గర్లో ఉన్నకిటికీ తెరిచి.. పరదాలు పక్కకు జరిపి.. రెండు చేతులూ బయటకు చాపి.. నిశ్శబ్దంగా తిరుగాడుతున్న గాలిని స్పర్శించాలనే ఉద్వేగం కలుగుతుంది. కొన్ని కవితలింతే! శ్రవ్యమో.. దృశ్యమో తేల్చి చెప్పడం బహుకష్టం!!

దైనందిన సంఘర్షణల ఊపిరాడనితనంలోనించి తాత్కాలిక విముక్తి అయినా ఇవ్వగలిగే సాహిత్యమేదైనా మనసుపై శాశ్వతముద్ర వేయగలుగుతుంది. మన మౌన సమక్షంలో చెంతనే నిలుస్తుంది.

“కవిత్వం సమూహాలను సంబోధించడంగా కాకుండా ఏకాంతంలో వ్యక్తిని విద్యుత్కరించేది అయి ఉండాలి” అనే ఇంద్రగంటిగారి నమ్మికకు ఈ కవిత ఒక మంచి ఉదాహరణ!

-నిషిగంధ

మనో విహంగాలు
వసంతాలూ.. వెన్నెల నీడలూ.. వెదురు తోటలూ

అన్నిటినీ ఒకేసారి కావలించుకోవాలని

గూడువదిలిన సీతాకోకచిలకల్లా హడావిడి పడుతుంటాయి…

స్వప్నసంచారాల నిదురవేళల్లో

కొబ్బరాకుల చివుళ్ళపై

రేపటి కలల్ని పేరుస్తుంటాయి..

పొగమంచుని తాకిన

పొద్దుటెండలోని మెత్తదనం…

నల్లని వర్షపు రాత్రులలో

తడితడిగా మునకలేసిన మోహాలు…

తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…

గాఢమైన దిగుళ్ళూ…

మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి

నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!

తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

అనుభూతులన్నిటికీ అస్థిత్వాన్నిఅద్దుతుంటాయి…

అసంఖ్యాక చిత్రాలనెన్నిటినో ఆవిష్కరిస్తాయి!

కానీ..

నైరాశ్యపు క్షణాలు కొన్ని

అస్సలిష్టంలేని అగరుబత్తి ధూపంలా

చుట్టుముట్టునప్పుడు మాత్రం…..

శీతాకాలపు సాయంకాలాలలో

నిశ్శబ్దపు వాగుమీద

వంతెనొకటి పేర్చాలన్నా…

లోపలా.. బయటా..

తుళ్ళిపడే ప్రేమావేశ జలపాతాన్ని

దారిమళ్ళించాలన్నా…

అక్షరాలు అదృశ్యమైన భాష ఒకటి మిగులుతుంది!