వాకిలి » స్వాతీ శ్రీపాద

పాసింగ్ క్లవుడ్స్
మంద్రంగా వినిపిస్తున్న ముఖారి రాగం. కిటికీలో నుండి కుప్పలు తెప్పలుగా వీస్తున్న చల్లగాలి. బెడ్ లైట్ కూడా స్విచ్చాఫ్ చేసింది అనూ. అయినా ఎక్కడినుండో సన్నని వెలుగు గదిలో పసిపాపలా పారాడుతూనే ఉంది.

విశాలమైన బెడ్ మీద ఇద్దరమూ నిశ్శబ్దాన్ని నెమరువేస్తూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళం.

వారం క్రితం కాబోలు సీరియస్ గా నా పనిలో నేనున్నప్పుడు ఎదురు చూడని సమయంలో ఎదురుచూడని వ్యక్తి నుండి ఫోన్ కాల్. మీటింగ్ లో ఉన్నా అనూ కాల్ చేస్తే ఫోన్ ఎత్తవలసి౦దే. ఫోన్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసి మెస్సేజ్ పంపాను –ఇన్మీటింగ్ కాల్ యు – అని.

ఆ తరువాత ఎందుకు అనూ ఫోన్ చేసిందా అని ఆలోచనే తప్ప మీటింగ్ పట్ల ఆసక్తి లేకపోయింది. నా కాబిన్ లోకి దూసుకు వస్తూనే దానికి కాల్ చేశాను.

“అనూ , నువ్వేనా కాల్ చేసినది? ఆశ్చర్యం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?ఎన్నాళ్ళకు కాదు ఎన్నేళ్ళకనాలి? ఎందుకిలా గుర్తుకు వచ్చాను? చెప్పు తల్లీ ఏం సంగతులు?నీ కూతుళ్ళు ఎలా ఉన్నారు? కొ౦పదీసి అల్లుళ్ళను వెతుకుతున్నావా ?”

“కొ౦చ౦ ఆపు ప్రియా…”అంటూ నా మాటల ప్రవాహానికి ఆనకట్ట వేసి, “ నాలుగు రోజులు స్పేర్ చెయ్యగలవా, నీతో గడుపుదామని టికెట్ హోల్డ్ లో పెట్టాను రేపు సాయంత్రం ఫ్లైట్ కి బుక్ చెయ్యనా ?”

ఎగిరి గంతెయ్యడమే తరవాయి, వెంటనే ఈమెయిలు పంపి ముందుగా నాలుగు రోజులు సెలవు సాంక్షన్ అయ్యాకే అనూకి ఓకే చెప్పేసాను.

మంగళ వారం నుండి శుక్ర వారం వరకూ సెలవు. శనాది వారాలు కలుపుకు౦టే వారం.

ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఒకసారి ఇంట్లో లేనివేమిటో గుర్తు తెచ్చుకుని , డీ మార్ట్ లో షాపింగ్ చేసి, తొమ్మిదింటికి ఇంటికి వచ్చి ఫ్లాట్ తలుపు తీస్తుంటే ఓ పక్కన వేళ్ళాడుతున్న విండ్ చైమ్స్ మెత్తగా స్వాగతం పలికాయి. నాదైన ప్రపంచానికి తిరిగి వచ్చిన అనుభూతి.

తలుపు ఓపెన్ చేస్తూనే ఎదురుగా పూలతోటలా వాల్ పేపర్. దానిముందున్న సోఫాలో విశ్రాంతిగా వాలి బాగ్స్ టీపాయ్ మీదు౦చి ఒక సారి ఫోన్ చెక్ చేసుకున్నాను.

అన్నీ పనికి రాని మేస్సేజేసే’ ఫ్రిజ్ తెరిచి చల్లటి నీళ్ళు గ్లాస్ లోకి వ౦పుకుని తెచ్చుకున్నాక. టీవీ ఆన్ చేసాను గాని ఆలోచనలన్నీ అనూ చుట్టూనే.

ఎప్పటి స్నేహం ఇద్దరిదీ.స్కూల్ రోజులనుండి సాగి సాగి కాలేజిలోనూ కలసి చదువుకుని అయిదారేళ్ళు ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి తొ అన్నీ వదులుకుని వెళ్ళిన అనూ, నా స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. అవును అప్పుడో ఇప్పుడో కనీసం వారానికోసారైనా ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళం. ఇద్దరు అమ్మాయిలైనా తన సౌకుమార్యాన్నీ నాజూకుతనాన్నీ అలాగే కాపాడుకుంది. చూస్తూండగానే సంవత్సరాలు పదులుగా మారి ఇరవై రెండేళ్ళు. అవును ఇరవై రెండేళ్ళు.

క్రితం సంవత్సరమే శౌర్య ఎమెస్ చేసేందుకు అమెరికా వెళ్ళాడు. శౌర్య ఒక్కడే తన కంటి వెలుగు. అక్కడికీ అనూ చెప్తూనే ఉండేది “నువ్వొట్టి బోలా మనిషివే అందరినీ ఇట్టే నమ్మేస్తావు జాగ్రత్త ప్రియా’ అంటూ. కాని చంద్రను ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మింది, ఏడాదిన్నర కలసి బ్రతికాక మిగిలినది శౌర్య. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఈ విశాల ప్రపంచంలో వెతకడం ఎలాగ ? ఎక్కడని వెతకాలి? చూస్తూ చూస్తూ ఇరవై రెండేళ్ళు గడచిపోయాయి. అప్పుడో ఇప్పుడో వచ్చిపోయే మేఘాల మాదిరి జ్ఞాపకాలు ఇలా వచ్చి ఓ జల్లులా కురిసి వెళ్ళిపోతాయి.

పాసింగ్ క్లవుడ్స్. ఎక్కడా స్థిరంగా ఆగవు. మనసు మళ్ళి౦చుకు౦దుకు లేచి కిచెన్ లోకి నడిచాను.

ఉదయం హడావిడిగా తాగి సింక్ లో వదిలేసిన కాఫీ కప్పు , ఓ మై గుడ్ నెస్ పాలు ఫ్రిజ్ లో పెట్టలేదు, ఎలా ఉంటాయో –కాస్తే గాని తెలియదు, పాలు సిం లో పెట్టి ఒకసారి ప్లాట్ఫాం తడిగుడ్డతో తుడుచుకున్నాక టీ కెటిల్ తీసుకుని నీళ్ళు పట్టి స్టౌ మీదపెట్టి బాల్కనీలోకి అడుగు పెట్టాను. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెలు. చెట్టుకున్నవి నాలుగైదే అయినా స్ప్రే చల్లుకున్నట్టు గుభాళి౦పు. మళ్ళీ అనూ గుర్తుకు వచ్చి౦ది. మోకాళ్ళు దాటిన బారెడు జడలో ఎప్పుడూ రె౦డు మూరల మల్లెదండ ఉండాల్సి౦దే.

“పాపం ఆపూలనె౦దుకలా తలల్లో పెట్టుకుని హింసిస్తావు?” పుష్పవిలాపం గుర్తుకు వచ్చి అడిగే దాన్ని.

“నీకేం తలుసు? జుట్టుకు పూలు ఎలా అందమో పూలకు చక్కని జుట్టే అందం” అనేది.

నా పూ బాలలనోసారి తడిమి చూసుకుని వెనక్కు వెళ్లేసరికి కేటిల్ లో నీళ్ళు సగం మరిగిపోయాయి.

పాలు మరుగుతున్నాయి –విరగలేదు. బుజ్జి రైస్ కుక్కర్లో బియ్యం కడిగిపెట్టి టీ కప్పుతో బయటకు వచ్చాను. రేపు అనూ వస్తుంది. ఇన్నేళ్ళ తరువాత ఎందుకి౦త అర్జంట్ గా రావాలనుకు౦టో౦ది. ఏమో…

ఇద్దరు అమ్మాయిలూ చక్కని చెక్కిన పాలరాతి బొమ్మల్లా ఉంటారు. మరీ ఒక ఏడాదే తేడా నేమో కవలల్లానే అనిపిస్తారు. ఎవరు చూసినా కళ్ళు తిప్పుకోలేని అందం. ఇల్లూ పిల్లలూ మొగుడే జీవితమని మనసా వాచా నమ్మిన తనకి ఇప్పుడిలా ఎందుకు గుర్తుకు వచ్చానో!

సరే ఎలాగూ వస్తోందిగా, నా తలబద్దలు చేసుకోడం అవసరమా అనుకుంటూ నాపనిలో నేను నిమగ్నమైపోయాను.

అనుకున్న సమయానికి అనూ రానే వచ్చి౦ది.

పలకరి౦పులూ, పరామర్శలూ, వెచ్చని కంటి చెమరి౦పులూ అన్నీ ముగిసి ఇంటికి వచ్చి తాగడం తినడం ముగించి ఇప్పుడిలా పడక చేరి …

“అనూ, ఎన్నేళ్ళు గడిచిపోయాయి? అయినా నిన్న మొన్న మనం హాస్టల్లో గడిపినట్టుగానే ఉంది. చెప్పు, ఏ విషయం నిన్నింతలా కదిలించి నా వరకూ తీసుకు వచ్చి౦ది”

చేతిని చాపి నా చెయ్యి లాక్కుని చెక్కిలి కానించుకు౦ది అనూ.

ఒక నిమిషం పాటు అలా ఉ౦డిపోయాక నెమ్మదిగా, మెత్తగా మాట్లాడటం మొదలు పెట్టింది.

“ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ అసంతృప్తి ఆరంభమై౦దో చెప్పలేను కాని అయిదారేళ్ళుగానో ఆపై మాటేనో… సన్నగా అస్పష్టంగా మొదలైన బాధ ఇది.

పిల్లలకు వారి చదువుల్లో సాయపడలేను.

“నో మమ్మీ .. మీకు తెలియదు. ఇది ఇలాకాదు.” వీ కాన్ డూ’ అంటారు. సమయం మారిపోయే కొద్దీ చదువుల విలువా మారిపోతుందేమో.

అటు పిల్లలకు కాని ఇటు ఆయనక్కాని నా ఎం టెక్ చదువే గుర్తు రాదు.

పెళ్లి మాటల సమయం లోనే ఉద్యోగం పెద్దగా అవసరం లేదు. వచ్చిన దానిలో సర్దుకు౦దా౦ – అన్న రోజున మరో ఆలోచనే రాలేదు నాకు. ఇరవై నాలుగ్గంటలూ నా ఇల్లు, మా ఆయన , నా పిల్లలు ఇంతకన్నా మరో ఆలోచనే రాలేదు. పిల్లలకూ నాకూ మధ్యన కాస్త కాస్త దూరం పెరుగుతున్నదని అనుకున్నాను కాని పిల్లలకు రాం కూ నాకూ మధ్యన ఒక అగాధం మొలుస్తున్నదనుకోలేదు. ఏళ్ల తరబడి రాం ఏం చెప్తే అదే వేదం. ఇంట్లో అన్ని నిర్ణయాలూ తనవే. తను బయటి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు తనకే బాగా తెలుసుననుకునే దాన్ని. పిల్లలు ఇలా టీనేజీ లో ప్రవేశిస్తూనే అలా నాకేమీ తెలీదనే స్థాయికి వచ్చేసారు. ‘మన’నుండి ఇష్టాలు ‘నాకు’ ఎప్పుడు మారిపోయాయో తెలియనే లేదు.

ప్రియా ఈ ప్రేమ అనే ఊబిలో దిగి నన్ను నేను కోల్పోయానని అనిపిస్తోంది. నా ఉనికిని , నా ఇష్టాఇష్టాలను, చివరకు నన్ను నేనే . ఈ విషయం గమని౦చే౦దుకు కూడా రె౦డూ మూడేళ్ళు పట్టింది. మొదట్లో ఉదయం లేచి ఏం చెయ్యాలో తెలిసేది కాదు. డైటింగ్ లు పాలుతాగరు, ఏమీ తినరు. లంచ్ పాక్ లు ఫాషన్ కాదు. రాం ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచి గబగబా రెడీ అయి నిమ్మరసం తాగి ఆఫీస్ కి వెళ్తాడు.

అందుకే ఉదయం ఆరుకే మెలుకువ వచ్చి పది వరకూ ఏమీ తోచక నేనే రెండు సార్లు కాఫీ తాగి కాలు గాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగేదాన్ని. తరువాత్తరువాత లేచి ఏ౦చెయ్యాలని అటుదొర్లి ఇటుదొర్లి ఎనిమిది దాటాక లేవడం … ఎక్కడికి పోయిందో ఆ సిస్టమాటిక్ జీవితం? ఇష్ట౦ వచ్చినప్పుడు లేవడం ,ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోడం. ఏదుంటే అది తినడం? ఒక్కోసారి ఏమీ తినాలనిపి౦చక రోజుల తరబడి ఏమీ తినకపోడం …. వీటన్నింటి మధ్యా ఒకటి నాకు అర్ధమయింది.

ఎవరిప్రపంచం వాళ్లకు లేనప్పుడు జీవితం భారమవుతుంది. అర్ధ రహితమవుతు౦ది. ఆ క్రమ౦ లో చివరకు జీవితేచ్చ లేకు౦డా పోతు౦ది”అనూ స్వర౦లో వణుకు. చప్పున లేచి కూచుని దాని తల నా వళ్ళోకి లాక్కున్నాను.

“ఇంత నిరాశా నిస్పృహల్లో నేను గుర్తు రాలేదా అనూ “

“కాదు ప్రియా నన్ను నేనే తెలుసుకోలేకపోయాను.ఇప్పుడిలా చెప్తున్నాను కాని , ఇప్పటికైనా ఇలా మనసు విప్పి చెప్పుకోకపోతే ఏ బలహీన క్షణం లోనో ఆత్మ హత్య చేసుకు౦టానేమో అనిపించే ఉన్నఫళంగా నీకోసం పరుగెత్తుకు వస్త”

“వద్దు అనూ ఇంకేమీ చెప్పకు , నేను తట్టుకోలేను ప్లీజ్”

నిద్రపోకపోయినా ఒకరిచేతుల వెచ్చదనం నుండి మరొకరి అ౦తరంగంలోకి ప్రవహించే భావ లహరిలో మూగవోయాము.

పొద్దున్నలేస్తూనే ఇద్దరం కాఫీ తాగి ఓగంట జాగింగ్ కి వెళ్ళాము. అమ్మో అయ్యో అంటూనే నాతొ పాటు పరుగెత్తి౦ది అనూ. ఇద్దరం కలిసి వంట చేసుకుని సరదాగా ముఖేష్ పాటలు వింటూ రోజంతా గడిపాము.

సాయంత్రం బిర్లా మందిర్ కి వెళ్లి దీపాలు వెలిగాక నెక్లెస్ రోడ్ మీద నడక సాగిస్తూ అడిగాను, “ రామ్ మంచి వాడేగా”

“అవును రాముడు మంచి బాలుడే” నవ్వింది అనూ.

“అతనితో జీవితాన్ని ప౦చుకున్నావ్, సంవత్సరాలకొద్దీ సహజీవనం చేశావు. అతనితో నీ అంతర్మధనం చెప్పుకోలేకపోయావా?”

అనూ కాస్సేపు నిశ్శబ్దంగా వుంది. హుస్సేన్ సాగర్ నీటి అలలపై తేలుతున్న నెలవంకను చూపుతూ –“నిజమే ప్రియా, కాని ఇప్పుడు అలా అనిపించట౦ లేదు. అదిగో ఆ

నెలవంకను చూడు, నిజంగా నీళ్ళ మీద గంతులేస్తున్నట్టే ఉందిగా. కాని నిజాని అ౦దు కోలేన౦త దూరం. ఇప్పుడు మాఇద్దరి అనుబంధం అలాగే అనిపిస్తుంది.చాలా సామీప్యంలో ఉన్న భ్రమ , కాని నిజానికి ఎంతో దూరం, నేనతనికి ఒక హోదా ను. ఎంటెక్ చదివిన కేర్ టేకర్ ను. వండిపెట్టే వంట మనిషిని ఒక పితృత్వాన్ని ఇవ్వగల కారకాన్ని, చివరికి ఏ అర్ధ రాత్రో కావాలనిపించినపుడు కోరిక తీర్చే యంత్రాన్ని”

“అనూ … పొరబడుతున్నావు రాంకి నువ్వంటే చాలా ప్రేమ, నువ్వు కష్టపడటం అతనికి ఇష్టం లేకపోయి౦ది.”

“అలా అనే నన్ను నేను మభ్యపెట్టుకున్నాను, ఒక్క మాట చెప్పనా ప్రియా, అతని స్పర్శ కూడా నాకిప్పుడు కంపరం అనిపిస్తోంది” అనూ స్వరంలో కన్నీళ్లు. ఆ రాత్రి పది గంటల వరకూ అక్కడే తిరిగి కామత్ లో డిన్నర్ చేసి ఇంటికి వచ్చాం. లేట్ గా పడుకున్నామేమో మంచి నిద్రలో౦చి వైబ్రేషన్లో ఉన్న అనూ ఫోన్ డ్రెసి౦గ్ టేబుల్ మీద సన్నటి షార్ప్ సౌ౦డ్ మేల్కొలిపి౦ది.అనూ వంక చూసాను, మంచినిద్రలో ఉంది.

అప్రయత్నంగానే ఫోన్ ఆన్సర్ చేద్దామని నొక్కాను.

“ఎన్నాళ్ళు నాకీ పనిష్మెంట్ రేపు సాయంత్రం వచ్చెయ్యి, నువ్వులేకపోతే నాకేం తోచదు. ఐ వాంట్ యూ”మరో మాటకు అవకాశ ఇవ్వకుండా పెట్టేశాడు రాం.

ఆ తరువాత మరి నిద్ర రాలేదు నాకు అనూ సమస్యకు పరిష్కారమేమిటో ఆలోచిస్తూ.

పది రోజుల తరువాత మెయిల్ చెక్ చేసుకు౦టు౦టే కొత్త సెండర్ పేరు దగ్గర ఆగిపోయాను.

వెన్నెల సిరి.

అవును చాలా సార్లు కాలేజి లో ఉన్నప్పుడు ఆ పేరుతో కధలో కవిత్వమో రాస్తూ ఉండేది అనూ.

ఆత్రంగా మెయిల్ ఓపెన్ చేసాను.

ప్రియా,

నిజంగానే అక్కడున్న నాలుగు రోజుల్లో నాకు నాలుగు యుగాలకు కావలసిన బలాన్నిచ్చావు. ముఖ్యంగా నాలో పేరుకు పోతున్న సెల్ఫ్పిటీ ఎంత ప్రమాదకరమో ఎంత బాగా చెప్పావు. ఒక్క మాటకూ నన్ను సపోర్ట్ చెయ్యకుండా ఒక్క సలహా ఇవ్వకుండా.

నిజమే పెళ్లిపేరిట నన్ను నేను త్యాగం చేసుకున్నాననుకున్నది నేనే. రాం ఒక్కరోజూ ఉద్యోగం చెయ్యమనీ వద్దనీ అనలేదు. పిల్లలు ఇల్లు అంటూ నన్ను నేను మభ్య పెట్టుకున్నదీ నేనే. మేమంతా ఉద్యోగాలు చేసి ఏం సుఖ పడ్డాం. దానికేం తక్కువ ఉద్యోగం చేసేందుకు అని అమ్మ అంటే కామోసనుకున్నాను కాని ఉద్యోగం వ్యాపకం ఏదో తక్కువైతేనే చెయ్యాలా అని అనుకోలేదు.

నిజమే. మీ పనిమనిషి కూతురికి కాదే నువ్విచ్చిన బ్రెయిన్ వాష్ అది నాకే అనిపించింది.

మొగుణ్ణి వదిలేసి వచ్చిన కూతురికి కాస్త నచ్చజెప్ప మని నీ వద్దకు తెచ్చినప్పుడు ఆ రోజున నీ మాటలు నాకు బాగా గుర్తున్నాయి, ఎందుకు వదిలి వచ్చేశావని అడగలేదు ఆ పిల్లను. ఎంత వరకూ చదువుకున్నావని అడిగావు, రోజంతా ఏం చేస్తావని అడిగావు. మొగుడి ప్రతిపనీ, చివరకు కాళ్ళజోళ్ళు కూడా పాలిష్ చేసిస్తానని చెప్పక మరో మాట అడిగావు. నీకోసం నువ్వు నీకు నచ్చినపని ఏమీ చెయ్యడం లేదెందుకని అడిగావు. ఇంటర్ చదువుకున్నానన్నావు, కనీసం ఒక పుస్తకమయినా చదువుకు౦దామనో ఏదైనా చిన్నగా చెయ్యవచ్చనో అనిపించలేదా అని అడిగిన మాట నాకే తగిలింది.

అవును, నేనూ అంతేగా అనుకున్నాను.

“నిన్నుపట్టి౦చుకోడ౦లేదంటావు. నిన్ను నువ్వే పట్టి౦చుకోక మరొకరినెలా అంటావు?

అయినా చెట్టంత మనిషిని నీ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆరాటం కాకపొతే అతని జీవితం అతనూ నీ జీవితం నువ్వూ నచ్చిన విధంగా బతుకుతూ కలిసి ఏ౦చెయ్యాలో , విడివిడిగా ఎవరికీ వారు ఏం చెయ్యాలో తెలుసుకోకపోతే ఎలాగ? జీవితం సినిమా కాదు. కలగలపు కూరలా అన్నీ ఒకటిగా చూసేందుకు. అదొక తేనే పట్టు. ఏ అరకు ఆ అరే.కాని అందరూ కలిసి దాంట్లో తేనే నింపాలి. జీవితమూ అంతే. ఎవరి జీవితో వారిదే కాని అన్నీ కలిసే ఉంటాయి. ఏకత్వంలో భిన్నత్వ౦” అన్నావు.

మనను మనం శూన్యం చేసుకోడం ఎంత తేలిక , అయితే ఆ శూన్యన్ని౦చి బయట పడతామా లేక అందులో ఉక్కిరి బిక్కిరై ఊపిరి విడుస్తామా అన్నది మన చేతుల్లోనే ఉ౦దన్నావు.

జీవితం లో ప్రతి ఘట్తమూ, ప్రతి వ్యక్తీ ఒక పాసింగ్ క్లవుడ్. కాస్సేపు ఓ జల్లుకురిసి వెళ్లి పోయేవే అన్నావు. నిజమే మనమూ మన వ్యక్తి గత ఆనందమూ మన చేతుల్లోనే ఉంది.

మన ఉనికి లోనే ఉంది.

అన్నింటినీ కలగలిపి కాక దేనికి దాన్ని చూడాలని తెలుసు కున్నాను. ఇల్లు వేరు, పిల్లలు వేరు , సమస్యలు వేరు అనుబంధాలు వేరు. అవును వేటికవి ఎక్కడికక్కడ నిలుపు కోవాలి, వ్యక్తిత్వంతో సహా. అన్నింటి సమన్వయమే తీనే పట్టు.

పాసింగ్ క్లవుడ్స్ ను అలాగే చూడాలి తప్ప ఆద్యంతం అందులో తల్లీనమైపోతే మిగిలేది ఇదే.

థాంక్యూ రా ప్రియా”

అనూ కూడా ఒక పాసింగ్ క్లౌడేనా ..ఏమో, మరి.

చేతులు కాలాక…
ఒక్కొక్క అక్షరమే

తడబడుతూ తత్తరపడుతూ

కొత్తగా రెక్కలుమొలిచిన కపోతంలా తారట్లాడుతుంది.

ఆనంద పరవశాల పన్నీరు చినుకులలో

ఒక తుళ్ళింతగా తడిసి

పెను తుఫాను విశాదపు జడివానలో ముద్ద ముద్దై

చూపుల వెచ్చదనానికే కందిపోయే సుకుమారమవుతూ

ఆకు చాటు తొలి పువ్వు నవ్వులా

రంగ ప్రవేశం చేస్తుంది

వింత వింత శబ్దాలను తాగితాగి

లోలోపల ఇమిడిపోలేని భేషజాలు భళ్ళున గుమ్మరిస్తూ

నైర్మల్యాన్నీ శ్వేత వర్ణాన్నీ ఆదర్శాల రంగులధూళిలో

పొర్లించి పొర్లించి

లోలోపల సజీవత సైతం ఖాళీ చేసి పోయిన

తోలు బొమ్మై మిగులుతుంది అక్షరం

అడుగడుగునా చప్పట్ల దరువుకు అలవాటుపడి

చీటికీ మాటికీ మెప్పుదల మేకతోళ్ళలో అణిగిఅణిగి

పులకింతల నిశ్శబ్ద సమాధుల మీద

ప్రదర్శనల జాతరై కొత్త మొహాన్ని తొడుక్కుంటుంది అక్షరం

ఎవరిదారిన వారు తమతమ ప్యూపాల్లోకి ఒదిగిపోయాక

శబ్దాలూ రాగాలు మాటుమణిగి

రంగులు కడిగేసుకున్న అహం

అర్ధరాత్రి సూర్యోదయాన కళ్ళు తెరిచాక

అదృశ్యమైన అంతః కరణ వెయ్యి వేళ్ళు ఎత్తి చూపుతూ

నువ్వునువ్వంటూ నిందిస్తే

అక్షరాలూ రాలిన పూరేకులవుతాయి.

అహాలూ అహంకారాలూ కుమ్మరి మట్టిలా తొక్కేసిన సంస్కారం

నడివీధిన నగ్నంగా కాట్లాడే కుక్కలవుతాయి

ఎప్పుడో స్పృహ వచ్చి తప్పు తెలిసి

పశ్చాత్తాప పు వెలుగులు పరచుకునే సరికి

అనాగరికపు మట్టిలో దుమ్మూధూళీ లో దొర్లిదొర్లి

ఊదారంగు పులుముకున్న ఉదాసీనతకు ఉరివేసుకుంటాయి

అప్పుడు ఊపిరందని మహామహులు

చచ్చిన శవాలను భుజానవేసుకు

అమ్మకాలకు క్యూ కడతారు.

వీపు
బ్రిటిష్ కధా చక్రవర్తి అనదగిన ఎచ్ ఎచ్ మన్రో “సాకి” అనే కలం పేరుతొ విశ్వవ్యాప్తంగా చిరపరిచితుడు. గొప్ప కధా శిల్పం అసమాన ప్రతిభ స్వంతం చేసుకున్న అతను అక్యాబ్ బర్మాలో పుట్టారు. ఫ్రాన్స్ లో మరణించే సమయానికి అతని వయసు 46 సంవత్సరాలే! రెండేళ్ళ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న మన్రో ఇంగ్లండ్ లోని అమ్మమ్మ ఆలనాపాలనలో పెరిగి పెద్దయాడు.

సాకి అనే కలం పేరు ఎలా వచ్చి౦దన్న దానిపై భిన్న అభిప్రాయాలున్నాయి. ఒమర్ ఖయ్యాం రుబాయత్ లలో పానపాత్ర అందించే స్త్రీ పాత్ర అని కొందరు, ఆ పేరు గల సౌత్ ఆఫ్రికన్ కోతి అనికొందరు భావించేవారు.

వ్యంగ్యం ఒక వైపు హాస్యం మరో వైపు పదునుగా ఉన్న రెండంచుల కత్తిలాంటివి అతని రచనలు. మర్యాదను అతిక్రమించిన తీవ్రమైనవిమర్శ అతని ఆయుధం. మొదటి సారి చదివినప్పుడు హాస్యం అలరిస్తుంది కాని మళ్ళీ మళ్ళీ చదివినప్పుడే సాకి భాష, దాని సౌందర్యాన్ని ఆస్వాదించగలరు. కొ౦దరు అతన్ని ఓ హెన్రీ తో మరికొందరు డోరతీ పార్కర్ తోనూ పోల్చినా సాకి ఒక అసాధారణ అద్వితీయ రచయిత. అతనికి సాటి అతనే తప్ప మరొకరు ఎప్పటికీ కారు.

Hector Hugh Munro (SAKI) రాసిన “The Background” అనే కథకు నా అనువాదం ఇప్పుడు చదవండి.

వీపు

“ఆ మాటలే౦టో ఆ చిత్రాల పరిభాష ఏమిటో ఒక్క ముక్క అర్ధమయి చస్తేనా ? వర్ణించడం మొదలు పెట్టిందా అయిపోయినట్టే , మాటలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చినట్టు“ క్లోవిస్ తన జర్నలిస్ట్ మిత్రుడితో అన్నాడు.

“అరె నీకు చెప్పలేదా? హెన్రీ డెప్లిస్ కధ చెప్పాననుకున్నానే ? “ వెంటనే అన్నాడా మిత్రుడు.

క్లోవిస్ తల అడ్డంగా ఊపాడు

హెన్రీ డెప్లిస్ లక్జే౦బర్గ్, డచ్ నివాసి . బాగా ఆలోచించి ఆలోచించి ఒక కంపెనీలో సేల్స్ మాన్ గా చేరాడు.ఉద్యోగ రీత్యా తరచూ దేశం దాటి కూడా వెళ్తూ ఉండేవాడు.

ఓసారలాగే ఉత్తర ఇటలీలో ఓ చిన్న నగరంలో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఒక వార్త వచ్చింది. ఎక్కడో దూరపు బంధువొకడు పోవడం తో ఇతనికి కాస్త ఆస్తి వారసత్వంగా వచ్చిందని.

అది హెన్రీ డెప్లిస్ ఆర్ధిక స్థితి గతుల దృష్ట్యా కూడా అంత పెద్ద మొత్తమేమీ కాదు.

కాని ఎప్పటి నుండో ఉన్న కోరిక మాత్రం బయటకు తన్నుకు వచ్చింది. ఈ కాస్త దుబారా పెద్ద ప్రమాదమేమీ కాదని అనుకున్నాడు. ప్రఖ్యాత స్థానిక పచ్చబొట్టు కళాకారుడైన శ్రీయుతులు పిన్సిని ఆండ్రూస్ గుర్తుకు వచ్చాడు. అతన్ని ప్రోత్సహించి, స్థానిక కళాపోషణ చెయ్యడం వైపు అతని ఆలోచనలు సాగాయి. ఇటలీలో శ్రీయుతులు పిన్సిని గారు పచ్చబొట్టు కళ లో అత్యంత నైపుణ్యం గల మేధావి, కానీ అతనిపై మూకుమ్మడిగా దండెత్తిన పరిస్థితుల ప్రాబల్యం వల్ల, కటిక దారిద్ర్యం లో ఉండటం వల్ల ఇతనిచ్చే ఆరువందల ఫ్రా౦కుల మొత్తానికి అతని వీప్మీద మెడనుండి నడుం వరకు “ఇకేరస్ పతనం” అనే చిత్రాన్ని పచ్చబొట్టుగా వేసేందుకు ఆనందంగా ఒప్పుకున్నాడు.

చివరికి ఆ చిత్రం పూర్తయ్యే సమయానికి శ్రీ హెన్రీ డెప్లిస్ కొంచం నిరాశపడ్డా , చూసిన వాళ్ళంతా దాన్ని పిన్సిని గారి అద్భుత కళాఖండమని మెచ్చుకోడంతో చాలానే తృప్తి పడ్డాడు. ఇకేరస్ పతనం అంటే అదో కోట, ముప్పై సంవత్సరాలు యుద్ధం చేసి వాలెన్స్టెయిన్ దాన్ని సాధి౦చ గలిగాడనీ అనుకున్నాడు కాని గ్రీకు పురాణాల్లో ఇకేరస్ తన తండ్రి డేడలస్ తయారు చేసిన కొవ్వు, పక్షి ఈకలు కలిపిన రెక్కలతో విజయవంతంగా ఎగిరి, తండ్రి హెచ్చరికలు మరచిపోయి సూర్యుడి దగ్గరగా వెళ్ళడంతో వాక్స్ కరిగిపోయి సముద్రంలో పడి మునిగిపోతాడు—అదీ ఇకేరస్ పతనం చిత్రం.

అది పిన్సిని అద్భుత కళాఖండమే కాదు చివరిది కూడా. డబ్బు తీసుకునే లోగానే ఆ ప్రముఖ కళాకారుడు జీవితాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దేవదూతలను చెక్కిన శవపేటికలో పాపం అతను తన అభిమాన కళను కొనసాగి౦చే౦దుకు ఆ చెక్కిన బొమ్మలు ఏ మాత్రం అవకాశ౦ ఇవ్వలేదు మరి.

అయితే పిన్సిని భార్య ఆరువందల ఫ్రా౦క్ లు పుచ్చుకు౦దుకు సిద్ధంగా ఉంది. కాని హెన్రీ డేప్లిస్ జీవనంలోనే పెద్ద సంక్షోభం తలెత్తి౦ది. చిన్న చిన్న ఖర్చుల ఒత్తిడితో ఆ డబ్బు కాస్త కాస్త అదృశ్యమై వైన్ బిల్లు ఇతర అప్పులు చెల్లి౦చాక కేవల౦ 430 ఫ్రాంక్ లు మాత్రమే మిగిలింది. ఆమె గట్టి గట్టిగా అరిచి 17౦ ఫ్రా౦క్ లు తగ్గి౦చడ౦ చిన్న విషయం కాదనీ, పైగా కీర్తి శేషుడైన తన భర్త చివరి కళాఖండం విలువ తగ్గించడమేమిటనీ వాదించారు. ఇలా సాగుతూ ఉండగానే సరిగ్గా వారం రోజుల్లో మరింత ఖర్చు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కుదించి 405 ఫ్రాంక్ లకు తెచ్చాడు డేప్లిస్. ఆవిడ కోపం ఆగ్రహంగా మారి ఒళ్ళుమండి భర్త కళాఖ౦డ౦ అమ్మకాన్ని రద్దు చేసి౦ది. అయితే డేప్లిస్ ను విభ్రా౦తికి గురిచేసే వార్త—ఆవిడ ఆ కళాఖ౦డాన్ని బర్గామో మున్సిపాలిటీకి బహుకరించడం , ఆ మునిసిపాలిటీ దాన్ని బహు కృతజ్ఞతతో స్వీకరించడం.

సాధ్యమైనంత అనామకంగా అక్కడి నుండి తప్పుకోవాలనుకున్నాడు డేప్లిస్. తన వ్యాపార లావాదేవీ ల కోసం రోమ్ వెళ్ళిపోతే అక్కడ ఆ చిత్రం కనుమరుగైపోతు౦దనీ దాన్ని పెద్దగా ఎవరూ గుర్తించరనీ అనుకున్నాడు.

కాని అతను మోస్తున్నది మరణించిన ఒక మేధావి భారం. ఒకసారి ఆవిరి స్నానం కోసం ఆ పార్లర్ కారిడార్ లో ఉన్న అతన్ని ఉత్తర ఇటలీ దేశం వాడైన ఆ పార్లర్ యజమాని హడావిడిగా డ్రెస్ లోకి తోసినంత పని చేసాడు . బెర్గామో మునిసిపాలిటీ అనుమతి లేకుండా “ఇకేరస్ పతనం “ అనే గొప్ప కళాఖండాన్ని ఇలా జనాలకు ప్రదర్శించడం అతనికి నచ్చలేదు. విషయం మరింత విస్తృత౦గా గుర్తింపు పొందడంతో, ప్రజల ఆసక్తి , అధికారిక భద్రతా పెరిగింది, హెన్రీ డేప్లిస్ వేడిగా ఉండే సాయంత్రాలు ఒక మామూలు సముద్ర స్నానం, లేదూ నదీ స్నానం చెయ్యాలన్నా మెడ వరకూ ఉన్న బట్టలు వేసుకుంటే తప్ప వీల్లేక౦డా పోయింది.

తర్వాత బెర్గామో అధికారులు, ఉప్పు నీరు కళాఖండానికి హానికరం కావచ్చన్న ఆలోచన రాడం తో ఏ పరిస్థితులలో నూ సముద్ర స్నానం కూడదని ఒక శాశ్వత కోర్ట్ నిషేదాజ్ఞ తెచ్చుకోడంతో పాపం అప్పటికే చిత్రవధ అనుభవిస్తున్న డేప్లిస్ కి ఆ యోగమూ లేకు౦డాపోయి౦ది. మొత్తానికి అతని సంస్థ యాజమాన్యం తమ కార్యకలాపాల కోసం అతన్ని బోర్దాక్స్ పరిసర ప్రాంతాలకు వెళ్ళమనగానే అతను ఎంతగానో ఆనందించాడు . అయితే అతని ఆనందం హఠాత్తుగా ఫ్రాంకో ఇటాలియన్ సరిహద్దు వద్ద అమాంతం ఆగిపోయింది . అధికారిక శక్తి శ్రేణి అతని నిష్క్రమణ నిరోధించింది, ఇటాలియన్ కళ ఎగుమతి నిషేధిస్తున్న కఠినమైన చట్టం మరింత కఠినంగా గుర్తు చేశారు ఆ అధికారులు.

“దౌత్య షరతులను, విధానాలను గూర్చి చర్చించేందుకు ఏర్పరచిన సమావేశము లక్జెంబర్గ్ ఇటాలియన్ ప్రభుత్వాల మధ్య జరిగి, ఒకానొక సమయంలో యూరోపియన్ పరిస్థితి గొప్ప ఇరకాటం లో పడింది కూడా . కానీ ఇటాలియన్ ప్రభుత్వం బలంగా నిలబడి హెన్రి డేప్లిస్ ఉనికి తో కాని అతని ఆస్తిపాస్తులతో కాని తమకు ఈషణ్మాత్రపు ఆసక్తి కూడా లేదని, కాని ప్రస్తుతం బెర్గామో మున్సిపాలిటీ ఆస్తి అయిన ఇకేరస్ పతనం ( కీ శే పిన్సిని ఆండ్రూస్ చేసినది ) ఎట్టి పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్ళరాదనే నిర్ణయంలో మాత్రం దృఢ౦గా ఉ౦డిపోయి౦ది.

“కాలక్రమేణా ఆ ఉత్సాహం సద్దుమణిగినా , దురదృష్టవ౦తుడైన డేప్లిస్ రాజ్యాంగ బద్ధంగా ఒక అచేతన స్థితిలో ఉన్న సమయాన కొన్ని నెలల తరువాత మరోసారి ఒక తీవ్రమైన వివాదానికి కేంద్ర బి౦దు వయాడు .ఆ ప్రసిద్ధ కళాఖండ౦ పరిశీలనకు బెర్గామో మున్సిపాలిటీ నుండి అనుమతి పొందిన ఒక జర్మన్ కళా నిపుణుడు, అది నకిలీది అనీ పిన్సినీ చేసినది కాదని బహుశా అతను తన వయసు మళ్ళిన దశలో ఉపాధి కోసం తన వద్ద చేర్చుకున్న ఏ విద్యార్థి తోనో చేయించి ఉంటాడని ప్రకటించాడు. ఈ విషయం మీద డేప్లిస్ సాక్షాధారం ఏ మాత్రం విలువలేనిది .ఆ డిజైన్ రూపకల్పన దీర్ఘ ప్రక్రియ సమయంలో సూదుల నొప్పి తెలియకుండా అతను వాడుకగా వాడే డ్రగ్స్ మత్తులో ఉన్నాడు . ఒక ఇటాలియన్ కళా పత్రిక ఎడిటర్ , జర్మన్ నిపుణుడి అభిప్రాయాలను సాక్ష్యం లేనివిగా తోసిపుచ్చి అతని వ్యక్తిగత జీవితం ఏ ఆధునిక ప్రామాణికానికీ అనుగుణంగా లేదని నిరూపించడానికి నడుం కట్టాడు పూర్తి ఇటలీ ,జర్మనీ మొత్తం ఈ వివాదం లో కి వచ్చి చేరాయి , మిగిలిన యూరోప్ అంతా ఈ తగువులో తలదూర్చి౦ది. స్పానిష్ పార్లమెంట్ లో నూ ఈ తగువుల తుఫాను దృ శ్యాలు చోటు చేసుకున్నాయి , పారిస్ లో ఇద్దరు పోలిష్ స్కూల్ పిల్లలు వారి అభిప్రాయం తెలపడానికి ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్హాగన్, (తర్వాత అక్కడికక్కడే ప్రమాణాలు పరిశీలించడానికి ఒక కమిషన్ ను పంపడంతో పాటు ) జర్మన్ నిపుణుడికి ఒక బంగారు పతకం అందజేసి౦ది.

“ఈ సమయంలో అంతకు ముందుకన్నా ఏ మాత్రం మెరుగ్గాలేని దశలో ఉన్న ఆ మానవ శరీరం ఇటాలియన్ అరాచకవాదిగా మళ్ళడం పెద్ద ఆశ్చర్యకరం ఏమీ కాదు. అతను ఒక ప్రమాదకరమైన ,అవాంఛనీయ విదేశీయుడిగా కనీసం నాలుగు సార్లు సరిహద్దు వరకు తీసుకు వెళ్ళారు కాని , ప్రతి సారీ ఇకేరస్ పతనం (పిన్సిని ఆండ్రియాస్, ఇరవయ్యో శతాబ్దం గా ఆపాదించబడింది) కారణంగా వెనక్కు తిరిగి తెచ్చారు. తరువాత ఒక రోజు జెనీవాలో ఒక అరాచకవాదుల కాంగ్రెస్ సమావేశంలో చర్చల మధ్య , తోటి అరాచక వాది కోపంలో నిండు బాటిల్ ఆమ్లాన్ని అతని పైకి విసిరే సరికి, అతను ధరించిన ఎర్ర చొక్కా ఆ ద్రావకం ప్రభావాన్ని తగ్గించినా, ఇకేరస్ పతనం ఆనవాలు పట్టలేనంతగా శిధిలమైపోయింది.

దాడి చేసిన వాడిని తోటి అరాచక వాది పై చేసిన దాడికి తీవ్రంగా మందలించి, ఒక జాతీయ కళా సంపద ను రూపు మాపినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు . ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన తక్షణమే హెన్రి డేప్లిస్ అవసరం లేని విదేశీయుడిగా సరిహద్దు దాటించారు.

“పారిస్ ప్రశాంత వీధులలో, ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్ మంత్రిత్వశాఖ పరిసరాల్లో, మీరు నిరాశా నిస్పృహలతో అణగారి, చూపులలో ఆత్రుతతో కనిపించే అతన్ని చూస్తూనే ఉంటారు . అతని కోసం కాస్త సమయం వెచ్చి౦చ గలిగితే లక్షె౦బర్గియన్ యాసతో అతను “వీనస్ డి మీలో” కోల్పోయిన చేతులలో ఒకటి తానేననీ భ్రమను పోషి౦చుకుంటూ ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని అతనిని కొనుగోలుకు ఒప్పించాలనీ చెప్తాడు. మిగతా విషయాల కొస్తే అతను పూర్తి ఆరోగ్యవంతుడే మరి.

Painting credit: http://en.wikipedia.org/wiki/Landscape_with_the_Fall_of_Icarus

ఎప్పటికప్పుడు…
ఎప్పటికప్పుడు కొత్త గానే ఉంటుంది

నునులేత ఆకు మెరుపు చెక్కిళ్ళలా

వడితిరుగుతూ తొంగి చూసే తడి’ నీటితెర

చటుక్కున జారిపడే వేసవి తొలి చినుకులా

కనుకొలుకుల్లో మొలవడం కొత్తగానే ఉంటుంది

ఒక్క ఇదేనా !

ఏమూలను౦డి ఏమూలకు కొలిచినా

ఏమనసు లోతుల్లో క్షీర సముద్రాలు చిలికినా

ప్రతి మాటా అప్పుడప్పుడే వికసించే చురకత్తి మొగ్గలా కొత్తగానే కదా ఉండేది.

నీది కాని ప్రతిదీ నీకు కావాలనే అనిపిస్తుంది.

ఆనందాలూ విలాసాలూ హద్దులుగా నాటుకు

నీదనుకున్న ప్రతి నేలా బంగారం పండే మాగాణీ కావాలనే అనిపిస్తుంది

ఎక్కడికక్కడ ఏ మూల తవ్వుకున్న నిధులూ నిక్షేపలూ నీకే సొ౦త’మవాలని ఉంటుంది.

నీళ్ళి౦కి పోతున్న నది ఒడ్డున

పడిగాపులు పడుతూ పచ్చని పైరు నాటుకున్నట్టు

నిశ్శబ్దాని మరిగించి మిరియాల కాషాయం లా

సంవేదన పడిశానికి మందులా

కళ్ళుమూసుకు మింగేసినా

జ్వరపడిన ప్రతిసారీ

పసిపాపై మారాం చేసే మనసు కొత్తగానే కదా.

ఎంత పాతబడిన గాయమైనా

మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప తలపుల్లో

కొత్తగా రేగి రేగి

పోగొట్టుకున్న అమూల్యాలను కలల్లోనూ వెతుక్కున్నట్టు

వెక్కిళ్ళు పెడుతూనే ఉంటుంది.

చుట్ట చుట్టుకు పడుకుని

ఎన్ని వెలుగులను మింగేసిన

కొ౦డచిలువ పడమరో

మళ్ళీ తూర్పు వాకిట

కొత్త సూర్యుడిని ప్రసవి౦చినట్టు

ఎన్ని విషా’దాలో నిరంతరం అస్తమిస్తూ

ఉదయానికి ఆశలను ప్రసాదిస్తాయి

కడుపు నిండిన క్షణాలు

కనురెప్పలపై పవళించి

విశ్రమి౦చినా

మళ్ళీ ఆకలి కేకలు

అలారంలా మళ్ళీ మళ్ళీ మోగి

మస్తిష్కంలో సైరన్ లై మేల్కొలుపుతాయి

జాతరలో తప్పిపోయిన పాపాయిలా

తిరుగుతున్నప్పుడు

కొత్తమోహాలని౦డా జాలి మెత్తదనం చూపుల చివరే ఆగి లోలోతుల గాఢత

బేరీజుల తరాజుపై రాబందవు అవుతు౦ది

ఎప్పటికప్పుడు

ఈ సంశయాల బూచిని దాచేస్తూనే ఉంటాను

అమాయికపు మొహం తొడుక్కుని

ఆషాఢమేఘాన్ని అవుతూనే పోతాను

ఒంటరి
ఒంటరి జీవన౦ అది అనివార్యమైనా, కొని తెచ్చుకున్నా ఎక్కడి కక్కడ అసంతృప్తి చదువరులకే తెలిసి వస్తు౦ది. అయితే ఒ౦టరితన౦ ఎప్పటికీ అలా మిగిలిపోవాలన్న నియమమేమీ లేదు కదా . అది ఇంట్లో అయినా ఆకాశంలో అంతరిక్షంలో ఎక్కడ ఉన్నా తొంగి చూస్తూనే ఉంటుంది. అతనూ ఆమె ఇద్దరూ సహాప్రయాణీకులు. విమానంలో పక్కపక్కన సీట్లు. అయితే ఆమె అక్కడున్న స్పృహే లేదు అతనికి.

ఒక పక్క సెలెబ్రిటీ నన్న ఈగో మరో వంక గుర్తింపుని ఆస్వాదించే ఆనందం, వీటి మధ్య అతని నిర్లక్ష్యం కించిత్తు ఇబ్బందికరమే అనిపి౦చిదామెకు.

ఒంటరితనం . అందరిలో ఉండీ ఒంటరితనం.

కలిపి౦చుకుని ఏదో ఒకటి మాట్లాడటం, ఆ ఏదో ఒకటిలో సినిమాల ప్రసక్తి , కాస్త గర్వంగా తనను తాను నటిగా పరిచయం చేసుకున్నప్పుడు ఎదురు చూసిన స్పందన రాక వినలేదేమోనని మళ్ళీ చెప్పబోతే నవ్వి విన్నానని చెప్పడం ఇంత సహజంగా ఉన్న కధ చదివి చాలా రోజులైంది.

నెమ్మది నెమ్మదిగా అల్లుకున్న సంభాషణ అతని స్వభావం అంచనా వెయ్యాలన్న తహతహ .. చివరకు తన అందం మీద తనకే అపనమ్మకం.

అంచనాల అపనమ్మకాల మధ్య న్యూయార్క్ చేరాక గత్యంతరం లేక అతని వెంట అతని ఇంటికి వెళ్ళడం ఫిలిం ఫెస్టివల్ అయ్యేవరకు అతని అతిధిగా ఉండి పోడం ఆ పరిచయంలో మహితో అతని పొసగనిప్రేమ చివరకు అతన్ని ఇష్టపడటం

ముగింపు అద్భుతంగా ఉంది.

కదా చదివి ముగిసినా కధలో౦చి బయటకు రాలేదో బయటికి కధకూ తేడా లేదో అర్ధం కాలేదు. మనసును హత్తుకునే కధ. ఎక్కడా ఉపన్యాసాలలాటి సంభాషణలు లేవు.రచయిత అనవసరపు వ్యాఖ్యలు లేవు. ఎన్నో సార్లు భారత దేశానికీ అమెరికాకూ తిరిగాక ఎంత సహజంగా ఉండీ ప్రయాణ వర్ణన అనిపించింది.

సినిమాలలోలాగా డైలాగ్స్ లేవు చివరకు ముగింపు కూడా చెప్పకనే చెప్తున్న భావన.  జీవితంలా సాగిన కధ. ఎక్కడా ఒక్క పదమైనా తప్పించి చదువుదామనిపించలేదు. రచయితకు అభినందనలు.

చదివి ఆస్వాదించండి

ఒంటరి

రచన: తమ్మినేని యదుకులభూషణ్

అతన్ని పలుకరించాలంటే బిడియం అడ్డొచ్చింది. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం. తను చాలాసేపే ఎదురుచూసింది. కానీ అతనిలో ఏమీ కదలిక లేదు. పక్కన తాను ఉన్నానన్న స్పృహే లేదు. సాధారణంగా ప్రయాణాల్లో తనను గుర్తుపట్టేసి, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి, తనను మొహమాటపెట్టేసే వాళ్లే ఎక్కువ. ఒక్కోసారి ప్రయాణంలో ఏకాంతం పోతోంది అనిపించినా, ఆ గుర్తింపు తనకు లోలోపల ఆనందాన్నే ఇచ్చింది. కానీ ఈ శాల్తీ విచిత్రంగా ఉన్నాడు. పోనీ కళ్ళు మూసుకుంటాడా అంటే అదీ లేదు. కళ్ళు తెరచుకొనే వున్నాడు. తనవంక చూడట్లేదు. అసలు తనను ఒకసారన్నా చూశాడా అని శంక.

” డ్రింక్స్‌ ” ఏర్‌ హోస్టెస్‌ నవ్వుతూ తనవంకే చూస్తోంది. అలవాటు చొప్పున తను ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ తీసుకొంది. పక్కనున్న వ్యక్తి పళ్ల రసంతో సరిపెట్టుకొన్నట్టున్నాడు. అతనికి సర్వ్‌ చేస్తున్నప్పుడు ఏర్‌ హోస్టెస్‌ ఎక్కువ వినయం ప్రదర్శిస్తున్నట్టు అనిపించింది. ఆమెలో కొంచెం తడబాటు కూడా కనిపించింది.

విమానంలో అందరూ ఎవరిలోకం లో వారు ఉన్నట్టున్నారు. నాకు ఉన్నట్టుండి ఒంటరి తనంలో కూరుకుపోతున్నట్లు అనిపించింది. తను ఆర్ట్‌ సినిమాల్లో నటించేటప్పుడు, ఎక్‌ లా అన్న సినిమాలో ప్రధానపాత్రలో తనను అందరూ జీవించావు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా గుర్తుకు వస్తుంది; అందులో నాయిక ఒంటరితనంతో బాధ పడుతుంది. భర్త సైన్యంలో. .

ఎదురుచూపులతో ఎంతోకాలం గడిచిపోతుంది. తను కమర్షియల్‌ సినిమాలలో నటించడం మొదలుపెట్టాక చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ, తనకెందుకో నటిగా అసంతృప్తి పెరిగిపోతోంది. ” ఏదో నెపం మీద పలుకరిస్తే ?” అతనేదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు అతను గ్లాసును పట్టుకొన్న తీరే చెబుతుంది.

తాత్కాలికంగా నా ప్రయత్నాన్ని విరమించుకొన్నాను.

2

విమానం వాతావరణం లో ఏవో మార్పులవల్ల అనుకున్నదానికంటే పైనో క్రిందో ఎగురుతుందని చెబుతున్నాడు కెప్టెను.

ఖాళీగ్లాసులు తీసుకు వెళుతోంది ఏర్‌ హోస్టెస్‌.

అతను తన గ్లాసును కొంచెం ముందుకు వంగి అందివ్వబోతుంటే నేనే చొరవ తీసుకొని తన గ్లాసును ఏర్‌ హోస్టెస్‌ కు అందించాను.

అతను పొడిగా ” థాంక్స్‌” అన్నాడు. ” హమ్మయ్య” అనిపించింది.

ఏదో హిందీ సినిమాలో డిషూం డిషూం సీను. ” మీరు హిందీ సినిమాలు చూడరా” మాట కలిపాను సాలోచనగా అతనివంకే చూస్తూ.

” నాకు హిందీ బొత్తిగా రాదు. పెద్ద ఆసక్తి కూడా లేదు. ”

అతని సమాధానం నిరాశ కలిగించింది. కొంత సంతృప్తి కూడా కలిగింది , అతను తనను ఎందుకు గుర్తు పట్టలేదో కారణం తెలిశాక.

తాను ఒక నటినని పరిచయం చేసుకోవాలా ? వద్దా ?! అన్న సంశయం. తన ఫీలింగ్స్‌ తనకే కొత్తగా ఉన్నాయి.

ఏమయితే అదయింది లెమ్మని. . తను సినిమాల్లో నటిస్తుంటానని తల ఎగురవేస్తూ చెప్పింది. టీవీ లో వస్తున్న సినిమాలో విలన్‌ డైలాగు. . . జనాల నవ్వులు వాటిల్లో కలిసిపోయింది తన స్వరం.

మళ్ళీ చెప్పబోతుంటే , అతను నవ్వి . . తనకు వినిపించింది అన్నాడు యథాలాపంగా. అతనిలో నేను ఆశించిన చలనం కనిపించలేదు.

ఎందుకో నాకు లెక్కల మాస్టరు గుర్తుకొచ్చాడు. తను గొప్పగా ఎగురుతూ వెళ్ళి నూటికి తొంభై తొమ్మిది వచ్చాయి అని చూపించింది; ఆయన ఆ ఒక్కటి ఏమయింది అన్నాడు. తనకు ఉక్రోషం పొడుచుకు వచ్చింది. తర్వాత ఆయనే సముదాయించి పంపాడు.

ఈసారి అతనే మాట్లాడాడు. మీరు పాడతారా ? అని. తనకెందుకో సిగ్గుగా అనిపించింది , కానీ చెప్పక తప్పలేదు ” లేదు” అని.

జ్యూరిక్‌ వచ్చేదాకా మాటల్లో పడ్డాము.

నేను గమనించిందేమంటే అతను మితభాషి. ఒకరిని నొప్పించే తరహా కాదు. అతని స్వభావంలో చాలా తీక్ష్ణత వుంది. అతనిముందు ఎందుకో నేను తమాషాకు కూడా అబద్దాలు చెప్పలేక పోయాను.

అతను అమెరికా లో మంచి హోదాలో వున్నాడు. ఎదుటివారిలో తడబాటు కలిగించేది అతనిలో వున్న హుందాతనం.

ఇంతవరకు నాకు తారస పడిన వారెవరూ ఇలా లేరు. . ఇంత హుందాగా !!

అతనితో నేను ఎక్కువ మాట్లాడానేమోననిపించింది, స్కూలు పిల్లలు చేతులు కట్టుకొని రైమ్స్‌ అప్పచెప్పినట్టు , నా గురించి నేను పూర్తిగా చెప్పివేశాను. సినిమాల్లో కెరీర్‌ , ఒడుదుడుకులు , కుటుంబంలో కలతలు , ఇగోలు , గాసిప్‌ , ప్రేక్షకుల అమాయకత్వం ; ఊ కొట్టకుండా వింటున్నాడు. ఒక్కోసారి అనుమానం వేసేది తను చెబుతున్నది వింటున్నాడా లేదా , ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడా?? అని. కానీ, అతను ఆ తరహా మనిషి కాదనిపించింది. జ్యూరిక్‌ లో ఫ్రెషప్‌ అయ్యాము. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. బయట మంచులో విమానాలు. జర్మన్‌ లో పెద్ద సైన్‌ బోర్డులు. సందడిగా వుంది. ఏదో మూల పైంటింగ్స్‌ నన్నేవీ ఆకట్టుకోలేదు. రెస్టారెంట్‌ లో ఫ్రెంచ్‌ కాఫీ సిప్‌ చేశాము. డాలర్లు చెల్లుతున్నాయి. చిల్లర మాత్రం ఫ్రాంక్స్‌ లో అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ” ఏమిటి ఆలోచిస్తున్నారు ?” నవ్వుతూ ప్రశ్నించాను. విన్నట్టు లేడు. కొంచెం సేపటి తర్వాత ఉలిక్కిపడి, ” ఏమన్నారు” అని మళ్ళీ తన చుట్టూ ఉన్న ప్రపంచం లో పడ్డాడు. రొడిన్‌ శిల్పంలా అతను ఆలోచించే తీరు ఆకర్షణీయంగా ఉంది. ఒక సినిమా షూటింగ్‌ కోసం స్విజర్లాండ్‌ వచ్చినప్పుడు, నా లగ్గేజ్‌ రాక నేను పడ్డ అవస్థలు చెబుతుంటే నవ్వాడు ! ఏమీ ప్రశ్నలు వేయలేదు. గ్లాసుడోర్ల వెనుక చలి కమ్ముకొస్తుంది. అతను ఏదైనా మాట్లాడితే బావుండు ననిపించింది. ” స్మోక్‌ చేస్తారా ?” అని అడిగాడు. నేను లేదు అన్నాను. ఎందుకో లేవబోయి కూర్చుండి పోయాడు. నేను మౌనంగా వుండిపోయాను. అతని వాలకం నాకూ కొంచెం అబ్బినట్లుంది. నవ్వుకొన్నాను. గమనించాడు. ” మీలో మీరు నవ్వుకొంటున్నారే” అని అడిగాడు. ఏమీలేదని తల తిప్పాను. ఒక సాధారణ స్త్రీలా ఒకరోజు ఒకరి ముందు ఇలా చేష్టలుడిగి కూచుండిపోతానని కలలో కూడా అనుకోలేదు. అతనికి నా అలోచనలతో ప్రమేయం లేదు. , నా అంతర్మధనాన్ని అతను ఆనవాలు పట్టలేడు. కారణం అతని స్వభావం చాలా సరళం. లోపలా బయటా అది ఒకటే.

4

న్యూయార్క్‌ ఫ్లైట్‌ ఒక గంట ఆలస్యంగా బయల్దేరనున్నదని అనౌన్స్‌ మెంట్‌. నాకెందుకో చాలా సంతోషం వేసింది. ఒకసారి పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు బస్సు చెడి పోయింది. పెద్దలు ఆందోళనగా పరికిస్తుంటే, పిల్లలం పొలో మని పరిగెత్తాం ఆడుకోవడానికి! కొన్ని గంటల్లో న్యూయార్క్‌ చేరతాం. తర్వాత ఎవరి దారి వారిదే. అతని స్వభావాన్ని ఇంకా ఎందుకో తరచిచూడాలి అనిపించింది. ఎన్నో పాత్రలను పరిశీలించే నన్ను ఇతని పాత్ర పూర్తి అయోమయం లోకి నెట్టివేసింది. బుద్ధి పనిచేయడం మానివేసినట్టుంది. ” చల్లారి పోతుంది కాఫీ; ఇంకో కప్పు తీసుకురానా ?” ఈ సారి ఉలిక్కి పడటం నా వంతయింది. అతను జర్మన్‌ లో ఏదో మాట్లాడుతున్నాడు. ” చాలా భాషలు వచ్చే ” అని నవ్వుతూ నేనంటే ” ఏవో బొట్లేరు ముక్కలు” అన్నాడు. అతను మాట్లాడే వేగం , ఉచ్చారణ , తీరు చూస్తుంటే బొట్లేరు ముక్కలు కావనే నమ్మకం కలిగింది. అదే అతనితో చెబితే , నవ్వి ” జర్మనీలో ఏణ్ణర్ధం ఉన్నాను ” అన్నాడు. ఇద్దరం పొగలు పోయే కాఫీని సిప్‌ చేస్తూ కూచున్నాం, ” కాలం ఇలాగే ఆగిపోతే బావుండు ” అని నాకు చాలా సార్లు అనిపించింది, చిన్నప్పుడు ఊటీ స్కూల్‌లో కాథరిన్‌ టీచర్‌ పాఠం చెబుతుంటే, నిశ్శబ్దంగా క్లాస్‌ రూమ్‌, దూరంగా మంచులో తడిచిన పచ్చిక. . కాలం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించేది. . ఇంతలో గంట మోగేది.

ఆల్ఫ్స్‌ పర్వతాల మీదుగా ఎగురుతోంది విమానం. అతని ఆలోచనల్లో అతను. నాలోనేను. మొట్టమొదటి సారి నాకు అనుమానం కలిగింది, నేను అందంగా ఉన్నానా ? లేనా ?! అని. ఆ పక్కసీటు లో వయసు మళ్ళిన వ్యక్తి నన్ను దాదాపు తినేసేలా చూస్తూ నా అనుమానం పోగొట్టాడు. తలతిప్పుకొన్నాడు. మరి ఈ మనిషి ఏమిటి ?అతని చూపు లో ఒక అభినందన. . గుర్తింపు ఏమీలేవు. తలనొప్పిగా అనిపించింది. అతని గూర్చి ఆలోచించడం మానేస్తే మంచిదనిపించింది. మాగన్ను నిద్ర. . రాత్రి పొద్దు పోయింది. న్యూయార్క్‌ నగరం మెరిసిపోతోంది. అనౌన్స్‌ మెంట్లు ఏర్‌ పోర్ట్‌ లో రద్దీ కలకలం. లగ్గేజ్‌ వచ్చాక అతనే ఫోన్‌ చేశాడు, నన్ను పికప్‌ చేసుకొంటానన్న దేశాయ్‌ అన్న వ్యక్తికి. వాయిస్‌ మెసేజ్‌ కు వెళ్ళింది. తాను అనుకోని ప్రయాణం వల్ల ఏ్‌ పోర్ట్‌ కు రాలేక పోతున్నానని, దగ్గరలో ఏదైన హోటెల్లో దిగి తర్వాత కాల్‌ చేయమని సారాంశం. నేనూ అదే అనుకొన్నా. కాబట్టి పెద్దగా కంగారు పడలేదు. రవి స్వభావం (అన్నట్లు, అతని పేరు రవట) . . చూదామనిపించింది. మర్యాద కోసం పిలుస్తాడా, లేదా అలవాటైన మౌనం తో వెళ్ళిపోతాడా. . రవి మందహాసంతో అన్నాడు. ” సింధూ, no probs! we shall go home, later you can decide, comeon !!” నాకెందుకో అతని ఆహ్వానాన్ని తిరస్కరించాలి అనిపించలేదు. అతని కళ్ళు సంస్కారం తో మెరుస్తున్నాయి.

5

గంటలో ఇల్లు చేరుకొన్నాం. మంచు పేరుకుపోయి రాత్రిని మరింత చల్లగా మారుస్తోంది. కోట్లూ, షూస్‌ విప్పేసి, స్నానాలు గట్రా చేసి, ఫ్రెషప్‌ అయ్యేసరికి రాత్రి మూడయింది. నాకెందుకో కొత్త ప్రదేశానికి వచ్చాను అన్న బెరుకే లేదు. నాకే ఆశ్చర్యం అనిపించింది.

” రేపు వీకెండ్‌ నాకు ఆఫీస్‌ లేదు. మీరు నాకంటే ముందు లేస్తే, ఫ్రిజ్‌ లో అన్నీ వున్నాయ్‌” నైట్‌ చెప్పేసి తలుపేసుకొన్నాడు. అతని గదిలో లైటారిపోయింది. ఒకటే పెయింటింగ్‌ మూలన వాంగో వేసిన starrynights కు రెప్లికా ! అతనికి స్వభావానికి విరుద్ధంగా వుందే ఎంపిక అనిపించింది. వాంగో స్వభావం గుర్తుకు వచ్చి ఎందుకో ఒక్కక్షణం భయం ఆవరించింది. హీటరు చప్పుడు వినిపిస్తుంది. బ్లైండ్స్‌ వుండటం వల్ల ఆ వైపు మంచులో నిలుచున్న చెట్టు కనిపించడం లేదు. అమ్మ వేసే పెయింటింగ్స్‌ అన్నీ గుర్తుకు వచ్చాయి. starry nights లో గోళాకృతిలో ఊగుతున్న నక్షత్రాలను చూస్తూ నిద్రపోయాను, లైటార్పకుండానే.

నాకంటే ముందు అతనే లేచేసి వున్నాడు. ఫ్లైట్‌ లో అతని ప్రవర్తన ఇంట్లో అతని తీరు ఒకేలా ఉన్నాయి. ” బాగా నిద్ర పట్టిందా ?అలసి పోయినట్టున్నారు!” అన్నాడు. అతనిచ్చిన కాఫీ తాగాను.

“మీరు ఫ్రీ గా వుండండి. నేను ఓ అరగంట లో వచ్చేస్తా” నని వెళ్ళిపోయాడు నింపాదిగా, తొందరపాటు కలికానికైనా లేదు. దేశాయ్‌ కి ఫోన్‌ చేస్తే, దగ్గరి బంధువు హఠాన్మరణం, ఉన్న హోటెల్లో కంటిన్యూ అయిపొండి, ప్రస్తుతానికి. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వెన్యూ దగ్గర కలుస్తా అని హడావుడిగా ఫోన్‌ పెట్టేశాడు. ఇంతలో రవి వెచ్చాలు పట్టుకొచ్చాడు. దేశాయ్‌ విషయం చెబితే, ” నో వర్రీస్‌ , ఇక్కడే కంటిన్యూ ఐపొండి. మీ పనులు ముగించుకొని ఏ టైమ్‌ కు వచ్చినా ఫర్వాలేదు. అన్నీ ఫ్రిజ్‌ లో వుంటాయి, మైక్రో ఓవెన్‌ లో వేడిచేసుకొని తినడమే. అవసరమైతే నాకు కాల్‌ చేయండి. ” స్నేహపూర్వకంగా వుంది గొంతు. ఫ్రిజ్‌ లో సర్దేశాడు, మాటల్లోనే. బరువు దిగిపోయింది. రావలసిన చోటికే వచ్చావు అంటోంది మనసు. కృతజ్ఞతా పూర్వకంగా అతని వంక చూశాను. ఫ్లైట్‌ లో మాటల్లో థాంక్స్‌ లూ సారీలు నా కిష్టం లేదు అన్నవాక్యం నాకు బాగా గుర్తుండిపోయింది. మిన్నకుండిపోయాను.

నాకు వంట వచ్చన్నా వారించాడు. తనకు బాగా అలవాటు వున్నట్టుంది. ఇద్దరం ఆలస్యంగా భోజనం ముగించాం. పుస్తకాలు షెల్ఫ్‌ నిండా, Engg., management వదిలేసి, నవలల మీద దృష్టి సారించా. లారెన్స్‌ , హక్స్లీ కొందరు రష్యన్‌ రచయితలు. “టైమ్‌ ఉంటే చదువుకొండి,” నవ్వుతూ అన్నాడు.

film festival మొదలయిపోయింది. దేశాయ్‌ కలిశాడు. సారీ చెప్పాడు. ఇతరదేశాలనుండి వచ్చిన వారిని కలుసుకోవడం, ముచ్చట్లూ. ఒక పోలిష్‌ దర్శకుడు, నా ” పభlథథ ” సినిమా నచ్చిందని, “ఒంటరితనం కళ్ళల్లో బాగా నింపుకొన్నారు” అని ప్రశంసించాడు. నాకు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో పాల్గొనడం కొత్త కాకపోయినా ఈ సారి నేను రావడం వెనుక ప్రత్యేక కారణం వుంది. నేను నటించిన ఆ సినిమా ప్రదర్శనలో చోటుచేసుకోనుంది. ఇండియన్‌ సినిమా తీరుతెన్నులు, మలేసియా, గల్ఫ్‌ దేశాల నుండి వచ్చిన వారు ఎంతో కుతూహలంతో ప్రశ్నించారు. ” Art cinema నుండి popular cinema కు transition ఎలా సాధ్యం ” అని కొందరు. అన్నీ సాధ్యమే అని నవ్వుతూ చెప్పాను. జపనీస్‌ పత్రిక షింబున్‌ వారు, నా ఇంటర్వ్యూ తీసుకొన్నారు.

ఒక్కోసారి నేను లేటుగా వచ్చేదాన్ని. ఒక్కోసారి అతను. నేను తొందరగా వచ్చిన రోజు నేనే వంట చేసేదాన్ని. అతను నొచ్చుకొనే వాడు. మీరు నా గెస్ట్‌ అని మృదువుగా నవ్వేవాడు. నాకు విచిత్రంగా అనిపించేది. ” కుచ్‌ ఖాబ్‌ హై కుచ్‌ అసల్‌ హై” (” కొంత స్వప్నం కొంత వాస్తవం !” ) ఏదో ఎప్పుడో చదివిన గజల్‌ ముక్క మనసును పట్టుకొని మరి వదిలేది కాదు. నా సినిమా స్క్రీన్‌ అయ్యే రోజు వచ్చేసింది. రవికి చెబుతామనుకొన్నా. అతను నన్ను కేవలం సాటిమనిషిగానే చూస్తున్నాడు. సినిమాల గొడవ లేదు మా మధ్య. నిజం చెప్పొద్దూ ఈ మధ్యకాలంలో ఇది నాకెంతో ఊరట కలిగించే విషయం. పిలవాలా వద్దా అని చాలసేపు తర్జన భర్జన పడి , ” రవీ! రేపు నా సినిమా ఒకటి స్క్రీన్‌ అవుతోంది రావడం వీలవుతుందా?? అడిగేశా. ఒక్క క్షణం పలుకలేదు. అతని మొహం వంక నేను ఆత్రంగా గమనిస్తున్నా. నేను మొదటిసారి కెమెరా ముందు నిలబడి కొంత నెర్వస్‌ గా, కొంత ఆనందంగా నటించి కట్‌ అనగానే దర్శకుడి వైపు చూశా. ఆయన షాట్‌ ఓకే చేయగానే నా మొహం వెలిగిపోయింది. ఆ దృశ్యం కళ్ళముందు మరోసారి. రవి అలాగే నన్నాడు. స్క్రీనింగ్‌ టైమ్‌ అడిగి తెలుసుకొన్నాడు. ఆఫీసు నుండి నేరుగా వచ్చేస్తానన్నాడు. కొంచెం ఆలస్యంగా వచ్చినా కంగారు పడవద్దన్నాడు. నాకేమీ వినిపించడంలేదు. నా సంతోషానికి హద్దు లేదు. అతను గమనించాడో లేదో నాకు తెలియదు.

7

screening time కు కొందరు మన జర్నలిస్టులు, కొందరు విదేశాల వారు నేను అక్కడే వున్నానని తెలిసి నా చుట్టూ మూగారు. షో మొదలయిపోయింది. నాలో ఆత్రం పెరిగిపోయింది. ఇతను రాడు పిలవడం నా బుద్ధితక్కువ అని తిట్టుకొన్నా. ఎడమవైపు ఉన్న ద్వారం నుండి నాకు చిరపరిచితమైన నడక. హుందాతనం అడుగడుగునా. కొనదేలిన ముక్కుమీద లైట్‌ పడి మెరుస్తోంది. చివరి వరుస అమ్మాయిల చూపులు అతన్ని వెంటాడటం నేను గమనించక పోలేదు. నాలో ఏదో చిరు గర్వ హాస రేఖ ! ఫపలసlపరపల మేఘ గంభీర స్వరం, తల తిప్పి చూశాను అతని దారికి ఎవరో అడ్డొచ్చారు, దారి తొలగమని అతను అడిగేతీరు!!చేయి ఊపాను. పోలిష్‌ దర్శకుడికి పరిచయం చేశాను. ఆయన రవిని తేరిపార చూశాడు. ఏ పాత్రలో లేని లక్షణాలను పుణికిపుచ్చుకొన్న పాత్ర!!సినిమా లో మునిగిపోయాం. ఎక్లా థlలలప అని సబ్‌ టైటిల్స్‌ తో మొదలయింది. చిన్న సినిమాయే. ఒంటరితనం. . సైనికుడి భార్య. . ఎదురుచూపులు. . యుద్ధంలో పట్టుబడతాడు. జాడ తెలియదు. ఎంతో కాలం తర్వాత తిరిగి వస్తాడు. పునస్సమాగమం. రవిని గమనిస్తున్నా మధ్య మధ్యలో. ఆ రోజుకు అదే ఆఖరి సినిమా. కొన్ని ప్రశ్నలు, ఓపిగ్గా చివరిదాకా ఉన్నాడు రవి. తన కారులో బయల్దేరాం ఇంటికి. విపరీత మైన రద్దీ. మనది కాని ప్రపంచం.

వింత అనుభవం. ” రవీ, నీ అభిప్రాయం చెప్పలేదు. సినిమా మీద.”

” అంతా బావుంది, చాలా కాలం తర్వాత సైనికుడు ఇంటికి రాగానే భార్య వెళ్ళి వళ్ళో వాలడం తప్ప!” . నేను షాక్‌ తిన్నాను. ఆ షాట్‌ గురించి మేము చాలా అలోచించాము తీయబోయేముందు.

రవి స్టీరింగ్‌ మీది నుండి దృష్టి మరల్చకుండా అన్నాడు. “ఎంతో కాలం గడిచాక మనుషులు కలుసుకుంటే, వారి ప్రవర్తన మీకు అనుభవంలోకి రానట్టే వుంది. ఐనా నా ఒపీనియన్‌ ను అంత సీరియస్‌ గా తీసుకోవద్దు.” అప్రతిభురాలినైపోయా. ఇతనిలో ఇంత లోతు ఉందా ? ” గ్లిజరిన్‌ వాడతారా? సన్నివేశపరంగా కన్నీళ్ళు వస్తాయా??” నా చెవులను నేను నమ్మలేక పోయా! ఆ సినిమాలో కన్నీటి దృశ్యాలు చాలా వున్నా చివరి దృశ్యంలో మాత్రమే గ్లిజరిన్‌ వాడాము. ఇంటికి వచ్చేదాకా అలోచిస్తూ ఉన్నా!! are you upset by my comments? తల అడ్డంగా తిప్పాను. that’s good నాకు కలిగిన ఆశ్చర్యాన్ని దాచుకోలేక పోయాను. కన్నీళ్ళ గురించి ఇంత ఆలోచనా!

8

దేశాయ్‌ ఫోన్‌ చేశాడు. డైరెక్టర్‌ నుండి కాల్‌ వచ్చిందట, రిటర్న్‌ డేట్స్‌ గురించి. సరే నేను తర్వాత చెబుతా అని పెట్టివేశా !పెద్ద ఆకలిగా లేదు. ఈపూటకు ఆపిల్స్‌ చాలు. రవి నైట్‌ డ్రెస్‌ లో ఏదో పుస్తకం పట్టుకొని వెళ్లిపోతున్నాడు. ” ఒక్క నిమిషం” అంటే నావైపు వచ్చాడు. నేను ఒకటిరెండు రోజుల్లో వెళ్లవలసివస్తుందని చెప్పాను. వివరంగా రేపు మాట్లాడుదాం అని బై చెప్పి వెళ్ళిపోయాడు.

లేచి చూసేసరికి పొద్దెక్కింది. తలనొప్పిగా ఉంది. tickets confirm చేయించాలి. కాల్‌ చేస్తే సరిగ్గా వారం రోజుల తర్వాత confirmation దొరికింది. ఇళ్ళంతా కలియతిరిగాను. రవి గదిలోకి నేనెప్పుడూ వెళ్ళలేదు, సరికదా అతను నన్ను పిలవ లేదు కూడా. కుతూహలం కొద్దీ ప్రవేశించాను. అక్కడ ఇంకో బుక్‌ షెల్ఫ్‌ . నోట్‌బుక్స్‌, మాగజైన్‌ లు వగైరాలు వున్నాయి. వాటిల్లో ఒక పుస్తకం Odd size లో వుండి నన్ను ఆకట్టుకొంది. డైరీ! నా కళ్ళు మెరిశాయి. పదేళ్ల క్రిందటిది. గుండె దడ హెచ్చింది. కొన్నిరోజులు ఖాళీగా , మరికొన్ని నిండుగా, అక్కడక్కడా పేజీల్లో రెండు, మూడు లైన్లే వున్నాయి.

29 MAY1990

జీవితంలో ఎవ్వరూ వందసార్లు ప్రేమించరు. గొప్ప ప్రేమ పొందిన వాడు నిశ్చలంగా నిలబడతాడు. . ఆ ప్రేమ తనకు దూరమైనా సరే! మహీ పెళ్లి. తను నన్నెంత గాఢంగా ఇష్ట పడిందో తలచుకొంటే గుండె తరుక్కు పోతుంది. మనస్ఫూర్తిగా అభినందించి వచ్చేశా. తన కళ్లల్లో దిగులును నేను గమనించక పోలేదు.

22 AUG1990

మహీ దూరమైపోయింది. తను లేని లోటు తెలుస్తోంది.

9

ఫోన్‌ మోగింది. దేశాయ్‌ కంగారు పడుతున్నాడు. మళ్ళీ ప్రొడ్యూసర్‌ కాల్‌. ముక్తసరిగా మాట్లాడి పెట్టేశా. రవి రావడానికి ఇంకా చాలా టైమ్‌ వుంది. ఒక వేళ ముందే వచ్చేస్తే? ఎందుకో కీడు శంకించింది మనసు. ఆత్రం నిలువ నీయలేదు. డైరీ లో ఇంకో పేజీ.

30 0ct 1990

కాలేజీ లో చివరి రోజులు . . మహీ అంది . . ” నిన్ను మరచిపోలేను” నాకు నిజంగా అర్థం కాలేదు. మహీ వయసులో నా కంటే కొన్ని నెలలు చిన్న. కానీ బుద్ధిలో నా కన్న కొన్ని సంవత్సరాలు పెద్ద. మహీ నాకెప్పుడూ అంతు పట్టేది కాదు. వసంతంలో విడిగే పుష్పాల ధావళ్యం తన కళ్లల్లో. కానీ , అవి మేము ఉద్యోగాల వేటలో ఉరుకులు పెడుతున్న రోజులు. ఒక వైపు బేలగా మహీ. ఏదైనా సాధించాకే మహీకి మొహం చూపాలి అన్న పట్టుదలతో ఆరేడు నెలలు కలవలేదు. ప్రయత్నాలు కలిసి రాలేదు. మహీని చూడాలని ఆరాటపడే మనసు. అప్పుడు మహీ వాళ్ల బంధువుల ఇంట్లో వుండేది, చిన్న ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది. నన్ను అన్యాప దేశంగా తిట్టింది. నాకు తలకెక్కేది కాదు. నాకంత మానసిక పరిపక్వత లేదు. ఎవరినో ఇష్ట పడుతోంది మహీ, అందుకే నన్ను తిడుతుంది అనుకొనే వాణ్ణి. ఇంకా దూరమవ్వాలని ప్రయత్నించే వాణ్ణి. ఒకసారి ఈ విషయం తెలిసి మహీ అంది జాలిగా “నీవు బాగా అపార్థం చేసుకోగలవు”.

ఏదో అలికిడి. కొంపదీసి రవి రాలేదుగా. డైరీని జాగ్రత్తగా యథాస్థానంలో పెట్టి, అతని బెడ్‌ రూమ్‌ తలుపు వేసి వచ్చాను. ఏదో పువ్వుల బొకే. హాపీ బర్త్‌ డే అని రాసుంది. దాన్ని జాగ్రత్తగా పక్కన పెడుతుంటే ఫోన్‌ మోగింది. రవి !! రావడం లేటవుతుంది, తినేసి పడుకో అని చెప్పాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని మళ్ళీ డైరీ ముందేసుకు కూర్చున్నా.

1DEC1990

నాలో మహీ బాగా ఇష్టపడేది అమాయకత్వం. నేను అంత అమాయకంగా ఉండననే నా అభిప్రాయం. నన్ను ఉడికించడానికే ఎప్పుడు అలా అనేదేమో? ఏదైనా సాధించే కలవాలి అన్న పంతం తో ఎప్పటిలా చాలానెలలు కలవకుండా ఉన్నా, చివరికి ఉండబట్టలేక కలిశా. అదే ఆఖరు సారి తనను చూడటం. తనకు అప్పుడే పెళ్ళి కుదిరింది. అదే విషయం చెప్పింది. నేను నమ్మలేకపోయాను. మహీ నన్ను ఏడిపించడానికి అలా చెబుతుందేమోనని, ఆశ చావక మళ్ళీ మరోసారి వెళ్లా. . తను వరుడి ఫోటో చూపించింది. నేను ఎంత అమాయకున్నో ఆ రోజు బాగా తెలిసివచ్చింది. మహీ నాకంటే ఎన్నో రెట్లు తెలివైనది. తన అభిప్రాయమే కరెక్ట్‌ చాలాసార్లు.

4DEC90

నన్ను నన్నుగా ప్రేమించింది మహీ ఒక్కటే. అమాయక ప్రేమను దూరం చేసుకొన్నా.

తను వెళ్లిపోయాక నా ఒంటరితనం రెట్టింపైంది!!నిష్కృతి లేదు.

31DEC90

మహీ రాసిన ఉత్తరాలన్నీ తగులబెట్టాను. బూడిదైపోయింది కాగితాలే.

నిప్పుకణికెల్లా ఇప్పటికీ వెలిగిపోతున్నాయి తన జ్ఞాపకాలు.

నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనని ఎంతగా ప్రేమించాడు. నాకు మహీ మీద అసూయ కలిగింది. డైరీ అంతా వెదికాను. ఒక చిన్న ఫోటో. ఖచ్చితంగా మహీదే. తన నవ్వులో కట్టిపడవేసే ఆకర్షణ, కళ్లల్లో దయ, జాలి. చాలా సుకుమారంగా వుంది. నేను మహీ కన్నా అందంగా వుంటాను. కానీ నా స్వభావంలో అంత లోతు లేదు. గూఢతా లేదు. కాబట్టి నా చిరునవ్వు సాదాసీదాగా ఉంటుంది. అలోచనల్లో చాలా సమయం గడిచిపోయింది.

రాత్రి కొంచెం ఆలస్యంగా వచ్చాడు రవి. ఎవరో అందమైన అమెరికన్‌ అమ్మాయి. డ్రింక్‌ చేసినట్టుంది, రవి మీద ఒక చెయ్యి వేసి విలాసంగా నడుస్తోంది.

నా కెందుకో ఇబ్బందిగా అనిపించింది. పట్టుతప్పించి, తనను పడుకోబెట్టాను. ఆఫీస్‌ లో లేట్‌ అని ఇదా తతంగం. నా ఆలోచనల మీద , నా మీద నాకే నవ్వు ముంచుకొచ్చింది.

“సారీ సింధూ, ఇవాళ నా బర్త్‌ డే, ఉదయం నీవు పడుకొని వున్నావు, లేపలేదు.”

హాపీ బర్త్‌ డే అనబోయాను. నా ప్రయత్నం ఫలించలేదు. గొంతు పెగలలేదు.

అట్టే ఆలస్యం చేయకుండా బై చెప్పి రవి నిద్రకుపక్రమించాడు.

11

నా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి, వాంగో చిత్రాల్లో కనిపించే వలయాల్లా!

రవి వైపు లాగుతుంది మనసు. తలుపు తట్టాను. ఏదో biography పుస్తకం చేతబట్టుకొని లేచి వచ్చాడు. హాపీ బర్త్‌ డే అన్నాను. . . అతని వంకే చూస్తూ.

ప్రసన్నంగా వుంది వదనం. అలసట, ఒత్తిడీ ఏమీ లేకుండా.

” బొట్టు చెదిరిపోయింది. జుట్టు రేగిపోయింది. . ” మునివేళ్లతో బుగ్గమీద తట్టి

” ఇంత అశ్రద్ధ అయితే ఎలా” అన్నాడు. మొట్టమొదటి సారిగా తన స్పర్శ.

వెదురును వాయువు తాకినంత సహజంగా. అతను నాలో అశాంతిని కనిపెట్టి నట్టే వున్నాడు. ” సింధూ వెళ్లి పడుకో, లాంగ్‌ వీకెండ్‌, ప్లాన్‌ చేయి. ” నాన్న నన్ను అలాగే పడుకో బెట్టేవాడు. రేపు లేవగానే పార్క్‌ వెళదామనో; చిలుకను చూద్దామనో చిరు మందహాసం తోసుకొచ్చింది. నేను బయట పడనివ్వలేదు. కొంచెం సేపటి తర్వాత అతని గదిలో లైటారిపోయింది. నేను గాఢంగా నిద్రపోయాను, కలలో నా చిన్న నాటి స్కూల్‌ . మా అందరికీ రెక్కలు ఉన్నాయి. ఎ్తౖతెన చెట్ల మీదుగా అలసట ఎరుగకుండా ఎగురుతూ వున్నాము.

నేను లేచే సరికి రాత్రి వచ్చిన అమెరికన్‌ యువతి వెళ్లిపోయింది. రవి చెప్పాడు “ఇక్కడ డ్రింక్‌ చేసి డ్రైవ్‌ చేయరు. అందుకే వివిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాను. నాకైతే అతను పుస్తకాల కన్నా మనుషులను బాగా చదవగలడనిపించింది.

ఏది ఏమైనా అతను అలా చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మొదటి సారి ఇతనిలో ఏదో స్పందన కలుగుతోంది అనిపించింది.

నా కోరిక వినిపించాను. చిన్నప్పుడూ ఊటీ లో నాకు పాఠాలు చెప్పిన ఆస్ట్రియన్‌ టీచర్‌ కాథరిన్‌ అమెరికా లో సెటిలయింది. ఆమెను కలవాలి. రవి చిరునామా తీసుకొని మాప్‌ తో తిరిగి వచ్చాడు. ” దూరమే రెడీ అవ్వు” అంటూ.

నా మనసెందుకో సినిమాలు, అవార్డులు అన్నీ వదిలేసి ఊటీ వెళ్లిపోతుంది.

పొడవైన చెట్లనుండి పడే ఏటవాలు సూర్యకాంతీ, చలిలో ఉదయాలు.

కాథరిన్‌ చాలా అందంగా వుండేది. ఇప్పుడూ తన వయసు కొంచెం అటూఇటుగా ఒక 45 వుండవచ్చు. ఎంత అందమైన ఉత్తరాలు రాసేది. ఫ్రీవే ఎక్కాము. కారు దిగితే చలి.

మిట్టపల్లాల రోడ్డులు. కొండ దారులు. మంచు దట్టంగా. అక్కడక్కడ జింకలు కనిపిస్తున్నాయి.

మాటల్లో పడి దారి తప్పాం. ఏదో పల్లె. రౌతు లేని గుర్రం బండిని లాక్కువెళుతుంది, అలవాటుమీద. పచ్చిక బయళ్లలో ఆవులు మమ్మల్నే చూస్తున్నాయి.

ఏదో మిల్లు. . పొగ వస్తోంది. కొన్ని పాడుపడిన షెడ్డులు. మొండిగోడల మీద కొన్ని కోళ్లు ఎగురుతున్నాయి. గడ్డాలు పెరిగిన రైతులు తమ పని తాము చేసుకొంటున్నారు. వుండుండి ట్రాక్టర్‌ చప్పుడు. మేము దారి తప్పినట్టు స్థానికులు కూడా ధృవీకరించారు. ఆ రోజుకు ఓ మాదిరి బస దొరికించుకొన్నాం, చాలా అవస్థలు పడి. చిన్న గది. అయినా హీట్‌ సరి పోవడం లేదు. రవి బాగా అలిసిపోయాడు. నేనుకూడా ఒకమోస్తరుగా అలసిపోయాను. నిద్రకుపక్రమించాం. ఒకటే మంచం. కానీ ముగ్గురు పడుకోవచ్చు. అంత పెద్దది. ఇద్దరికీ నిద్ర పట్టింది. నాకు చూచాయగా గుర్తు. నిద్రలో అతని మీద ఒకటి రెండు సార్లు నా చేయి పడింది. కానీ అతను జాగ్రత్తగా సర్ది, బుద్ధిగా అటు తిరిగి పడుకొన్నాడు. గాఢనిద్రలో నా భుజం మీద బరువుగా తన చేయి. నాకెందుకో తొలగించాలనిపించలేదు. చల్లని వాతావరణం వెచ్చబడుతున్నట్లనిపించింది. కలలు. . కలతలు లేకుండా హాయిగా నిద్రపోయాను.

12

కళ్లు తెరిచేసరికి అతను తయారై పోయి నా వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. నేను నిద్ర నటిస్తూ గమనిస్తూ ఉన్నా. సిగ్గు ముంచుకొచ్చింది, బద్దకంగా ఆవులించి చాలా టైమ్‌ అయిందా ? అన్నా.

“నేను గాస్‌ నింపుకొస్తా ఈ లోపు నీవు తయారవు.”

తలుపుతీసుకు వెళ్లిపోయాడు.

ఆలస్యంగానే బయల్దేరాము. నానా కష్టాలు పడి ఎట్టకేలకు కాథరిన్‌ ను పట్టుకొన్నాం. మా కోసం ఎదురుచూస్తోంది. ముందు కాథరిన్‌ ఏమీ మాట్లాడలేదు. కొంచెం చేపయ్యాక నన్ను వచ్చి వాటేసుకొంది. nice to see my dear little sind along with your husband అంటూ. kathy, he is my friend పరిచయం చేశా. తడబాటు నాలో. ” it’s ok dear ” అని కాథి లోకాభిరామాయణంలో పడిపోయింది. పల్లెపట్టు జీవితాన్ని వర్ణించింది. ఊటీ రోజులను తలచుకొంది. నేను తెచ్చిన పట్టుచీరలు, చుడీదార్లు చూసి మురిసి పోయింది. దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత కలిశాం !

రవి “ఏక్‌ లా” సినిమా ముగింపును ఎందుకు విమర్శించాడో నాకు అర్థమయింది. అదే విషయం కాథీ తో చెబితే రవి వైపు మెచ్చుకోలుగా చూసింది.

నేను ఫ్రెషప్‌ అయి వచ్చేసరికి కాథి, రవి చక్కగా జర్మన్‌ లో మాట్లాడుకొంటున్నారు. నాకు ఒక ముక్క అర్థమైతే ఒట్టు. Sind, pick up some german! We shall go to our country అంటోంది. రవి తో జర్మన్‌ లో ఏదో చెణుకు విసిరి నా వైపు కొంటెగా చూస్తోంది. తిరుగు ప్రయాణం ఆనందంగా గడిచింది. కాథి ని కలిసాక నాలోనే కాదు రవిలో కూడా తెలియని మార్పు వచ్చినట్లు అనిపించింది. కానీ రవి దట్టమైన అడవిలా నాకు అంతు పట్టడం లేదు. ఎప్పటిలా ఏమీ బయట పెట్టకుండా అలాగే వున్నాడు. నాకు అతన్ని అడిగేద్దామా అనిపించింది. ” నా గురించి నీవేమనుకొంటున్నావ్‌ ?” అని. ” ఏమీ అనుకోవట్లేదు ” అన్న గడుసు సమాధానం కూడా రావచ్చు !తనకు ఎవరిమీదైనా ఇష్టం కలిగినా బయటపడి చెప్పడు అన్న విషయం నాకు రూఢిగా తెలిసిపోయింది. అతనిది మృగరాజు తరహా. అతని దగ్గరికి చేరిన వారిని హుందాగా చూసుకొంటాడు. freeway మీద వేగంగా పోతుంది కారు. ఏవో పాటలు.

13

ఇంటికొచ్చిచేరాం. voice messages నాకోసమే. నాన్న చేశాడు నాలుగుసార్లు. లండన్‌ లో ఇండస్ట్రియలిస్ట్‌ సంబంధం ok అయింది, నీవు సరే అంటే ముహుర్తాలు పెట్టించేస్తాం!అదీ సారాంశం. ఇక రవితో మాట్లాడవలసిన తరుణం వచ్చింది అనిపించింది. సాయంత్రమే నా ఫ్లైట్‌ కూడా. రవి నాకోసం సెలవు పెట్టాడు. ఊహించలేదు, ఐనా తెలియని సంతోషం. అవకాశం కోసం వేచిచూస్తున్నా. సర్దడం లో నాకు సాయ పడుతున్నాడు. సర్దడం ముగించి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర చేరాం. బ్లైండ్స్‌ పైకి లాగాను.

బయట చెట్టు కనిపిస్తుంది. నా గొంతు వణుకుతోంది.

” రవీ, నా పెళ్ళి UK లో ఇండస్ట్రియలిస్ట్‌ తో”

” కంగ్రాట్స్‌ ” అతని గొంతు ఎప్పటిలా వుంది.

” కానీ, నాకీ సంబంధం ఇష్టం లేదు”

” ఏం”

” నీ పెళ్ళెప్పుడూ ” ?

అతను కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు.

నేను రెట్టించాను.

రవీ నా రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. నవ్వి చెప్పాడు.

” నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా UK సంబంధం ఒప్పుకో. . పిచ్చిపిల్లా, ఎవరూ వందసార్లు ప్రేమించరు. నాలాంటి వారు మరీనూ”

” ఇలాగే ఒంటరిగా గడిపేస్తావా?” రుద్ధమయింది నా గొంతు.

కన్నీళ్ళు దూకుతున్నాయి బుగ్గల మీదుగా. ఇద్దరం లేచి ఇవతలకు వచ్చాం.

మబ్బులు వీడి సూర్యుడు దేదీప్యమానంగా వెలుగు తున్నాడు. నా మొహాన్ని తన గుండెలకేసి హత్తుకొన్నాడు. నుదుటిమీద ముద్దు పెట్టుకొని చెప్పాడు

” నా బంగారు కదూ, ఏడవకు”

రేపటి తరానికి..
క్షణం క్రితం వరకూ

విలవిలలాడిపోతూ ఏమీ తోచనితనం

ఏమీ అనుకోలేని ఏమీ కాని ఏమీ చెయ్యలేని వేళ

ఏం దాచుకోవాలో ఏం విసిరిపారేయ్యాలో వివేకి౦చలేని

అయోమయపు పొగమంచు సమయం

ఆహ్వానించిన కలలు అల్లంత దూరానే సంశయిస్తూ ఆగిపోతే

పరచిన తివాసీ పైన అనుకోని అతిధుల్లా ఆసీనులైన వైరాగ్యాలు

రెక్కలన్నీ రాలిపోయి మిగిలి పోయిన తొడిమలా …

చుట్టూచుట్టూ కమ్ముకునే వెచ్చని గాలి

వెన్నునిమిరి నిశ్శబ్దాన్ని వెచ్చని శాలువాగా

కప్పుతుంది

నాలుక చివర తొణికిసలాడే ఉద్విగ్న రూపాలను

నీలి నింగి ఒంపిన వెన్నెల చురక పెదవులకు అడ్డంపడి

సమన్వయతను సముదాయిస్తుంది

హద్దులు చెరిపేసుకున్న సహనం

గట్టుతెగిన గోదారిలా తీరాలను ముంచెత్త్తుతుంది

చీకటి ముంపు తీసిన క్షణాలకు దూరంగా

మాటల సెలయేర్లు గులకరాళ్ళను తడుముతూ

అడుగులు సారిస్తాయి.

ఇంకెంత

ఈ పున్నమి వెన్నెల కుంగి కృశించి

కనుమరుగయే౦దుకు ?

ఆపక్కన పిందెలు పిందెలుగా శకునాలు పలికే

పూత మామిడి

ఈ వంకన గొంతు సవరి౦చుకుంటూ

ఇంకా రెక్కలు రాని పిల్ల కోయిలలు

ముంగిట పూలుపూలుగా రాలి గాలి పరిమళమవుతున్న

మల్లెపందిరి

కాస్సేపు ఓపిక పట్టాలి మరి

కనురెప్పపాటులో

ఎక్కడి తీపి పలుకుల్లోనో కలగలిపి

పంచుకున్న మాధుర్యాలు మాటలై సరిగమలై

చుట్టూ మారుతున్న వసంతం రంగులై

ఇంకెందుకు ఘోషలూ ఘోషాలూ

ఈ క్షణాన్నే తూర్పు సంధ్యగా మార్చుకు

రేపటి కొత్త తరానికి ఆహ్వానం పలికేందుకు

మాటలతోరణాలు సమకూర్చుకుంటూ..

March 17, 2014 7:25 AM

(జయభేరి మొదటి భాగం – కవితలు 1)

జయభేరి మొదటి భాగం – కవితలు
రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

జయభేరి రెండవ భాగం – గొలుసు కవితలు
గొలుసు కవితలు

కవిత్వం ఎప్పుడూ ఒక ధార, ఒక ప్రవాహం. అనుభవం నుండి అనుభూతికి, సంఘటన నుండి సంస్పందనలోకి, మాట నుండి మనసుకి, మనసునుండి తిరిగి మనిషిలోకి నిర్విరామంగా నడుస్తూ, తాకుతూ, తడుపుతూ, తట్టి లేపుతూ కలుపుకుంటూ పోయే నిరంతర వాహిని కవిత్వం. కవిత్వం లోని ఈ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ..

ఒక చిన్న ప్రయోగం చేద్దామా? గొలుసు కవితలు రాద్దామా?

ఎక్కడిదైనా ఏదైనా ఒక కవితలోని ఒక వాక్యాన్ని తీసుకుని దాంతో మొదలెట్టి ఎవరైనా ఇక్కడ ఒక కవితను రాయండి. ఆ కవితలోని ఒక వాక్యంతో మరొకరు మరో కవిత… ఇలా ఒక భావం నుండి మరో భావం, ఒక వ్యక్తీకరణనుండి మరో శైలి…

అలా వెళ్తూ వెళ్తూ ఎలాటి మార్పులొస్తాయో, ఏ కొత్త రూపాలు ఏర్పడతాయో!

మొదటి కవిత ఎవరు రాస్తున్నారు మరి?

ఇప్పుడు కావలసినది -స్వాతీ శ్రీపాద

1

ఆగిపోయినది కాలం అనుకుంటాము

కాదు

ఎక్కడి అట్టడుగు అనుభూతులలోతుల్లోనో పాతుకు పోయిన క్షణానికి

చూపుల తాళ్ళతో మనను మనమే కట్టేసుకుంటాము

పెనుగులాడి పెనుగులాడి ఊడిరాని తలపులచుట్టూ

తిరుగుతూ పోయే గుడ్డి గానుగెద్దులమవుతాము

కాలం కదులు తూనే ఉంటుంది

ఆగని చక్రాలు అమర్చుకున్న యంత్రమై

కాలం సాగుతూనే ఉంటుంది

ఆపలేని ,అడ్డం లేని నదీ ప్రవాహపు ధారలా…

2.

ఉదయపు నీరెండ పలకరింతలు అద్దు కున్న మొహం మీద

ఉండీ ఉండీ మసకలు బారే మబ్బుల గుంపులు

రాలి పడిపోతున్న నీడల మెరుపుల్లో

తొంగి చూస్తూ వెలసిపోతున్న వెలవెలలు

అసహనంగా ఊపిరాడని ఉక్కపోతలో

ఒక చల్లని మాట వీవన కోసం

బీటలు వారిని భూమి పగుళ్ళలా

లోలోపల ఒక నిలువు పగులు

౩.

ఎవరిచుట్టూ వారు మౌనాన్ని కప్పేసుకు

శీతస్వాపన సుప్తావస్తలోకి జారుకుని

ఎప్పటికో రూపవిక్రయ విధాన ధ్యానంలో

కలల తెరలు దించుకు

పరిమళాలూ పట్టు పరుపులూ స్వప్నిమ్చే క్షణాలు

చిత్రి౦చుకుంటూ

కాలం కాళ్ళకు సంకెళ్ళు వేసామనుకుంటారు

4

ఎందుకిలా సమయాన్ని గాలి బుడగల్లా ఊదిపారేస్తూ

ఈ పిల్లతనపు చేష్టలు

తెరమీద కురిసిన వానవెల్లువలో

ఎందుకలా పరవశాల మయసభలో తత్తరపాటు

తెలుసు కదా

మనకు తెలియదు ఏది మిధ్యో ఏది విద్యో?

కాలం సంగతి మనకెందుకు

మనను మనం బతికి౦చు కోడం ముఖ్యం కదా

మనకు మనం వేసుకునే శృంఖలాలు విడగోట్టుకోడం

అదికడా ఇప్పుడు కావలసినది.

మానస చామర్తి

కాలం సంగతి మనకెందుకు,

ఇలా రా – ఈ ఏటిఒడ్డు వైపు.

గులకరాళ్ళ చప్పుడొకటి అడవి గుండెల్లో

ఎన్నడూ వినని అడవి పాట ఏటి గొంతులో

వింటున్నావా?

అహ, చెవులు రిక్కిస్తే వినపడవ్.

ఎందుకు పదే పదే తలెత్తి చూస్తావ్,

సూరీడేమైనా చెప్తాడనా?

కాలం సంగతి వదిలెయ్ -

ఈ లేచివుర్ల వయసెంతో

వీచేగాలి బలమెంతో

వానచుక్క ఎందాకా ఇంకిందో

చెప్పగలవా?

అహ – సూత్రాలకు దొరకవ్.

కాసేపాగగలవా?

పరిమళపు తుఫాను మొదలవుతుంది

ఆకాశానికి కలువపూలకీ వంతెన వేస్తారెవరో

చందనం చల్లి లోకాన్ని చల్లబరుస్తారెవరో

ఇప్పుడంటే ఇలా భయపడుతున్నావ్ కానీ,

నీ గుప్పిట్లోని నా చేతిని మళ్ళీ మళ్ళీ చూస్తున్నావ్ కానీ,

అడవి దారి అర్థం కాక దిక్కులు చూస్తూ

కాలం నిను వదిలేస్తుందని దిగులుపడుతున్నావ్ కానీ,

నీ భయాల్తో, సంశయాల్తో

నిద్రపట్టక నీలాకాశంలోకి చూసినప్పుడు,

నీకూ తెలుస్తుంది,

చీకట్లో మిణుకుమిణుకుమనే వెలుగొకటి ఉంటుందని

ఆశ గట్టిదైతే ఆకాశమంతా నీ చూపుల్లో ఒదుగుతుందనీ.

అడవి దారి – అడవి పాట – అడవి చూపు

రహస్యాలన్నీ ఒక్క రాత్రిలో అర్థమయ్యాక,

రేపిక నువ్వే అంటావ్ చూడూ,

“కాలంతో మనకేం పని”

వదల్లేక-వదల్లేక -స్వాతికుమారి బండ్లమూడి

ఆకాశానికీ కలువపూలకీ వంతెన వేస్తారెవరో

నేలని నిచ్చెనగా గాలిగోడల ఆసరాగా నిలబెట్టి-

అనుకునేలోపే అంతా ఐపోతుంది

మబ్బుల చెరువు- పువ్వుల ఆకాశం

మిగిలిపోయిన కొన్ని మాటలు.

నలుపు తెలుపుల నీడలో నడిచిపోతారెవరో

అరికాళ్ల అద్దాలు అరిగిపోయేదాకా

తోవలో గులకరాళ్ళు పగిలిపోకుండా

తన అడుగులకింద తానే నలిగిపోకుండా

వీడ్కోలు వలయాల్లో పెనుగులాడతారెవరో

వెళ్లలేక పోవడాన్ని ఆపలేక పోవడంలో

వీల్లేక పోవడాన్ని వదల్లేకపోవడంలో

వేళ్లమధ్య వేళ్లలా బిగించుకుని

ఊపిరితో దాహం తీర్చుకుంటూ

నీతోనే ఉండిపోతారెవరో…

ఎప్పటికో -క్రాంతికుమార్ మలినేని

అనుకునేలోపే అంతా అయిపోయింది

బడబడమంటూ ఉరిమేసి

జలజలమంటూ రాల్చేసి

మేఘాల గుంపు ఎటో వెళ్ళిపోయింది

కావలి వాడిని తప్పుకెళ్ళిన మంద వెళ్ళినట్టు

ఆకాశం నిండుదనమంతా

నేలతడి నింపుకుంది

యుద్ధమాపిన గాలి

మళ్ళీ గుసగుసలేవో మొదలెట్టింది

ఒళ్ళు విదిలించుకుంటూ

పిట్టల జంట

ముత్యాలు కాని ముత్యాలని మోస్తూ

ఆకూ పువ్వు

నన్ను చూసి నవ్వుతున్నాయనిపిస్తుంది.

చీకటిని ఎదిరించి అలిసిపోయి

మసిబారిన బుడ్డి దీపం

బార్లా తెరుచుకుని

వేచి చూసే వీధి గుమ్మం

రెప్పవేయడం మర్చిఫోయిన

నా కనులు

మాత్రమే సాక్ష్యాలు నా నిరీక్షణకి

నీ జతలొ వానలో తడవాలన్న

ఆశ ఆశగానే ఉండి పోయింది

ఈ సారీ ఎప్పటిలానే

గుండె నిండుగా భారంగా

ఆకాశం బరువు దించింది

నేల పైనా?

నా గుండె పైనా?

నేనిలాగే – రవి వీరెల్లి

ఎడమచేత్తో “ఆకాశం బరువు దించి”

కుడిచేతి చూపుడువేలు మీద భూమిని గిరగిరా తిప్పుతూ

నువ్వలా మౌనంగా వెళ్తుంటావే

తరిగి చూడని నదిలా

పాలిచ్చి మరిపించి వెళ్ళిన తల్లిలా.

నీ మౌనం విస్తీర్ణం కొలవడానికే అనుకుంటా

విశ్వంలోని గ్రహాలన్నీ ఇంకా అలా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాయి.

ఇవన్నేవీ పట్టకుండా

నువ్వలాగే వెళ్తుంటావు.

నేనిలాగే

నాలో నేనే మొలకెత్తి

వసంతాన్నై పూసి

గ్రీష్మాన్నై తపించి

శిశిరాన్నై రాలి

వెలుగుతూ ఆరుతూ

పదానికి పదానికి మధ్య ఋతువులా కరిగిపోతూ..

నా ప్రపంచానికి

క్షణానికో సరికొత్త పొలిమేరై పుట్టే

నీ పాదముద్రలేరుకుంటూ..

నేనిలాగే!

అవినేని భాస్కర్

ఎప్పటికీ నీతోనే ఉండిపోతారెవరో

ఆ నమ్మకమే ఈ వీడ్కోలుకి పునాదయ్యింది

సెలయేరుల పాటలతో గువ్వల కువకువలతో

ఎడతెగని సంగీతాలతో విభిన్న శబ్దాలతో

అలకల అలికిళ్ళతో చేరవేసిన చుంబనాలతో

తీరిన మన ప్రణయపు ఆకలికి

కాలం మౌనాన్ని వడ్డించెళ్ళింది

సిగ్గుల కాంతిలో చిరునవ్వుల వెలుగులో

కవ్వింతల మెరుపులో కళ్ళ దీపాలలో

గోళ్ళు గుచ్చుకున్న రక్తపు ఎరుపులో

రాత్రుళ్ళని వెలిగించుకు సాగిన

మన ప్రణయపు ప్రయాణంలో

కాలం కారు చీకటి నింపెళ్ళింది

విడివిడిగా సాగిన పొడిపొడి నడకలు

ఒకరినొకరు కలుసుకోగానే

వడివడిగా చేరువయ్యాము

ఏకాంతంలో ఇద్దరం ఒక్కరయ్యాము

ఒక్క గుండెచప్పుడుతో రెండు తనువులు

ఒక్క నిద్రతో నాలుగు కళ్ళు

కాలానికి కన్ను కుట్టింది…

ఒక్క అనామక ప్రవేశం,

ఒక్క అపార్థం -

జంటలో ఒంటరితనం

కౌగిట్లో దూరం

బాగానే ఉన్నట్టు ఆహార్యం

పైకి శ్మశాన నిశబ్ధం; లోలోపల చెరో కురుక్షేత్రం

బయటపడి ప్రశ్నించుకోనివ్వని సంస్కారపు ముసుగు

రాయభారానికీ, రాజీకీ అడ్డుపడుతూ…

అందుకే.. అందుకే..

ఎప్పటికీ నీతోనే ఉండిపోతారెవరో

ఆ నమ్మకమే ఈ వీడ్కోలుకి పునాదయ్యింది!

పైకి శ్మశాన నిశబ్ధం; లోలోపల చెరో కురుక్షేత్రం – సాయి పద్మ

ఎవరి జంటరి తనం వారిదే

ఎవరి వంటరి తనమూ వారిదే

వత్తిగిల్లిన జ్ఞాపకాల కనుసన్నల్లో

నడిచే జీవితాల పనోరమా

ఉవ్వెత్తున ఉరికిన వలపు జలపాతాల్ని

దిండు గలీబుల కన్నీటి ఉప్పునూతుల్లో

మునకలేసినా..

నిజమే, ఇక్కడంతా వ్యక్తిగతం

మనసు తప్ప మిగతా అంతా పరాయితనం

హృదయమెక్కడున్నది అంటూ నిత్యం జపించే మంత్రం

హరివిల్లులకి కూడా హద్దులు నిర్ణయించేటంత వదరుతనం

సహజాతాలని తూనిక కొలతల్లో ఇరికించేటంత భావుకత్వం

పైకి శ్మశాన నిశ్శబ్దం ; లోలోపల చెరో కురుక్షేత్రం

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?
కవిత్వం నాకేమిస్తోంది?

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని కనుక్కోవడం కోసమా, లేక, నాలో నాకు తెలియని లోతుల్ని కనుక్కోవడం కోసమా? ఎవరికోసం ఈ కనుక్కోవడాలూ, గుర్తు తెచ్చుకుని వెక్కి వెక్కి ఏడ్వడాలు? అత్యంత సంక్లిష్టమైన అనుభూతులను పలవరించడం ఎవరికోసం? కవిత్వం నాకు సంతోషాన్నిస్తుందా లేక దుఃఖం మిగులుస్తుందా? అసలు “కవిత్వం నాకేమిస్తోంది?”

జయభేరి కవి సమ్మేళనంలో మొట్టమొదటి టాపిక్, “కవిత్వం నాకేమిస్తోంది?”. ఈ టాపిక్ పై మీ స్పందన రాయండి.

శైలజామిత్ర గారి స్పందన:

మొదటగా కవిత్వం నాకు ఆనందాన్ని ఇస్తోంది. సమకాలీన సమాజం లో నన్ను నన్నుగా నిలబెడుతోంది . అయితే కవిత్వ స్వరం ఎలా ఉండాలి? ఏది రాస్తే కవిత్వం అవుతుంది అనే అంశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి . ఎవరికీ వారు ఇదే కవిత్వం అనే ధోరణి సాగుతోంది. ఇటీవల ఒక కవి సమాజాన్ని శాసించలేని కవిత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ప్రేమ కవిత్వాలు , వ్యక్తిగత కవిత్వాలు కవిత్వం అనిపించుకోదు అని ఆవేశంగా అన్నారు. నేను అందుకు సమాధానంగా ఎవరు రాసింది వారికి కవిత్వం . నా ధోరణి నాది . మీ ధోరణి మీది. ఒకరిది కవిత్వం కాదు అనడానికి , మరొకరు రాసేదే కవిత్వం అని పొగడానికి మనమెవరం? అనేది నా ఆలోచన. చూద్దాం రేపటి తరం చిక్కని కవిత్వం తో ముందుకు వస్తోంది. వారే నిర్ణయిస్తారు కవులెవరో? కవిత్వం ఏదో ?

నరేన్ (గరిమెళ్ల నారాయణ) గారి స్పందన:

తరచి చూసుకుంటె: పిల్లనగ్రోవి(మురళి) ఉదటం తెలిసిన ఒక మూగవానికి (లేదా) ఒక కాపరి కి, ఆ కళ ఏమిస్తుందో కవిత్వం కూడా నాకు అదే ఇస్తోంది.

తెలియని సంతృప్తి…శతాబ్దాల కాలం పాటూ అనేక పుటలని ఓపికగా దాటుకుంటూ బతికినట్టి అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందనిపిస్తోంది.

ఉదాహరణకు, నయాగరా జలపాతాన్ని చూసినప్పుడు…దాని జల్లులో తడిసి ముద్దైనప్పుడు పొందిన అనుభూతి…ఆ అనుభవాన్ని ఒక కవితగా ( ‘ బందీ’ ఈమాట) వ్రాసుకున్నాక పరిపూర్ణమయ్యిందనిపించింది.

అలాగే లోకాన్ని వీడిపోయిన ఆత్మీయమైన మనుషులను, కనుమరుగైపోయిన సందర్భాలనూ కూడా, సజీవంగా దాచుకునే వెసులుబాటునూ (ఫోటోల కన్నా ఎక్కువగా) కవిత్వం కల్పించింది.

నిషిగంధ గారి స్పందన:

చాలాసార్లే కూర్చుంటాను రాయాలని.. సమయాన్నే కాదు, చిందరవందర ఆలోచనల్లేని మనసునీ కూడా తోడు పెట్టుకుని.. కుదరదు.. రెండు మూడు పదాల కంటే ముందుకి జరగదు!

సంతోషమో.. బాధో.. కోల్పోయిన తనమో.. గుండె అంచుల్నిండి రాలినప్పుడూ… సరైన పదాలు వాటిని పట్టుకోగలిగినప్పుడే కవిత్వం అనేదేదో నాకు రాయడానికి వస్తుంది!

అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే.. సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు.. సమూహంలో అప్పుడప్పుడూ అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!

సాయి పద్మ గారి స్పందన:

హ్మ్మ్.. ఉహూ.. ఇవ్వటం అనేవరకూ వస్తే , కవిత్వంతో బిజినెస్స్ లా అనిపిస్తుంది కాబట్టి, ఏమీ లేదు అనిపిస్తుంది. కానీ కవిత నన్ను మెచ్చుకున్న విధానం చూస్తే అహాన్ని ఇహాన్ని ఎంత సంతృప్తి పరుస్తోందో కదా పాపం అని కవిత్వం మీద జాలేస్తుంది.

ఏది కవిత్వమో నాకు తెలీదు.. ఏ వచనమూ..నేను రాసిన దానితో సహా గుర్తుండదు. కానీ , మాటకీ , నిశ్షబ్దానికీ మధ్యన ఏదో మీడియేషన్ కవిత్వం చేస్తోందనే అనిపిస్తూ ఉంటుంది ..

ఎప్పుడంటే.. గొంతుదాటని మాట, పెదవి దాటని ప్రేమ, శరీరం దాటని అనుభూతి… కాన్షస్నెస్ లేకుండా రాసిన కొన్ని అక్షరాల మూటల్లో , తాయిలంలా అపురూపంగా కనబడినప్పుడు ..

హమ్మా.. కవిత్వమా .. ఏదో ఉంది అని అప్పుడు అనిపిస్తుంది.. ఇప్పటికి ఇంతే ..!

స్వాతీ శ్రీపాద గారి స్పందన:

చాల్లెండి , నవ్విపోతారు! కవిత్వం నాకివ్వడమేమిటండీ బాబూ, ఎంత సేపూ ఎంతొస్తే అంత లాభం అంటూ తీసేసుకోడమేనా ? నేనేమిస్తున్నాను అనే ఆలోచనే వద్దా ?

మదిలో మల్లెల తలపులను ఎందుకు విరబూస్తున్నారని అడగదమా? అపచారం అపచారం .ఎన్ని జాతుల మల్లెలో విశ్వమంతా వికసించి పరిమళభరితం చేస్తుంటే వాటిని అడుగుతున్నామా ఎందుకు పుయ్యాలనిపిస్తో౦ది మీకని? ఒక్క నీటిబొట్టు సన్నని వెలుతురు కిరణాన్ని సప్తవర్నాల్లో ఆవిష్కరిస్తుంటే దాన్ని అడుగుతున్నామా ఏం కనుక్కుందామని ఇన్ని హొయలు పోతున్నావని? నవ్వుల రవ్వలు మెరిసినా కన్నీటి బిందువులు చి౦దినా , నేను కీ మనకూ మధ్య రహదారి కదా అది. బాధపడి కొత్తతరాన్నో , కావ్యాలనో ప్రసవి౦చనిదే లోకమెక్కడ సాహితీ లోకమెక్కడ?పుడుతూనే మనకున్నది ఒకేఒక్క సంపద మనసేగా ? ఆలోచనా అనుభూతీ లుప్తమైన జీవితం ఒక జీవితమేనా? నా ఉనికి కవిత్వం, నాఊపిరి కవోత్వం నేనే కవిత్వం అందుకే నా ప్రతిభావానా కవిత్వానికి నేనే ఇస్తున్న అప్పుడే విరిసిన పూలుగానో అనాలి రగిలిన జ్వాలగానో సుకుమారపు సుతిమెత్తని మాటగానో , మనలో మన మాట మనది ఇచ్చే చేయ్యేగాని పుచ్చుకునేది కాదు.

కెక్యూబ్ వర్మ గారి స్పందన:

కవిత్వం నాకు ప్రతి క్షణం నన్ను నేను సంభాళించుకొని నేలపై నిటారుగా నిలబడే స్థైర్యాన్నిస్తుంది. నాకై నేను రాసుకుంటున్నప్పుడు వాక్యం పూర్తయిన ప్రతిసారీ పారే నీటిలో ముఖం కడుక్కున్న అనుభూతినిస్తుంది. అలాగే మిత్రుల కవిత్వం చదివేటప్పుడు పరకాయ ప్రవేశం చేస్తూ మరల మరల తరచి చూసుకొని చిగురాకులాంటి కొత్తదనాన్ని గుండెకు హత్తుకుంటాను. ఈ క్రియ ప్రక్రియల వలన నాకు నేను పునరుద్దీపమౌతుంటాను. జీవితమే యుధ్ధమైన సమయంలో కవిత్వం ఆయుధం కావడం యాధృచ్చికం కాదు కదా? మనుషులుగా జీవించాల్సిన సమయంలో హృదయ సంభాషణకు కవిత్వం ఓ వాహిక కదా?

నీటిరంగుల చిత్రం
ఒక అలౌకిక భావ పరంపర, జీవిత సారాంశాన్ని సలలితంగా ,సమ్మోహనంగా ప్రగాఢ రాగోన్మత్తతతో ఎరవేసి వెంట లాక్కుని వెళ్ళే వశీకరణ సుడిగుండం అతని కవిత్వం. “నీటిరంగుల చిత్రం“ అంటూ మూడు మాటల్లో సమస్త విశ్వాన్ని చూపిన పుస్తకం ఇది.

చిన వీర భద్రుడి కవిత్వం ఒక నిరంతర చైతన్య స్రవంతి. ఒక ప్రవాహం. ఒక అడవి. ఒక వాన ఒక వెన్నెల కోయిల , ఒక రాగాత్మక భావన ..ఇలా ఇంకెన్నో … వికీర్ణమవుతూ సంకీర్ణమవడం ఒక సాధన , ఒక తపస్సు ఒక తమి , ఒక తృష్ణ .

అవును అతని కవిత్వంలో ఎంత నైపుణ్యంతో చెక్కుతూ బాహ్య స్వరూపాన్ని కనబరిచినా ,అంతర్లీనంగా సాగే ఈ భావాల జాబితాకు అంతెక్కడ? సామాన్య పదాల ఎంపికలో అసామాన్య భావాన్ని ఆవాహన చేసి ఒక లౌకిక ప్రపంచం కేంద్ర స్థానం నుండి అలౌకిక భావ సామ్రాజ్యపు అంచులకు తీసుకు వెళ్ళే కవితాత్మకత ఒక ఋషికే సాద్యం, చిన వీరభద్రుడు కవిగా రూపాంతరం చెందిన ఋషి. ఒక అన్వేషణ. సౌందర్య రాసాస్వాదన, ఒక జాగురూకత ,ఒక నిర్దిష్ట భావ పరంపర కవి వెనకాల తరగని మూలధనం.

కాపాడు కోవలసిన పద్య౦, అమ్మా నాన్నా మరికొందరు ఆత్మీయులు, కాంతి, మ౦చు, మధురిమ, ఊదా, పసుపు, నారింజ నీటి రంగుల చిత్రం , చిత్తమణిగే చోటు –చిత్రంగా ఇవన్నే అక్కడక్కడ వరుసగా… లో కనిపించే ఉప శీర్షికలు

కాపాడుకోవలసిన పద్యం

“ఇంధనం అగ్నిగా మారినట్టు ,ప్రతిరోజూ

ఒక పద్యంగా మారాలని ప్రార్ధిస్తున్నాను “

చూడటానికి రెండు వరుసలే కాని ఎంత సునిశిత నేర్పరితనం ఈ పదాలు అమర్చి౦దా అనిపించింది. ఇంధనం అగ్నిగా మారడం వెనక ఎన్ని ఉత్ప్రేరకాలు , ఎన్ని లిప్తలు ,ఎన్ని ఘడియలు ,ఎంత ఉద్విఘ్నత ,ఎంత కృషి ,ఎంత శ్రమ, ఎన్ని యుగాల లయ విన్యాసం, ఎంత జీవన చైతన్యం! ఈ మూడు మాటల వెనక మూడు కాదు ముప్పై తరాల చరిత్ర. ఎంత లయవిన్యాసాల తరువాత ఇంధనం సమకూరుతుంది?

సమకూరినా కణకణమండే నిప్పు కణిక గా మారేందుకు ఎన్ని రూపాంతరాలు! ఎన్ని సజీవ స్పందనలు.

ప్రతి రోజూ ఒక పద్యంగా మారాలని ప్రార్ధిస్తున్నాను

ఎవరు ప్రార్ధిస్తున్నారు కవి ప్రార్ధిస్తే ఎవరు మారాలి ఒక పద్యంగా ? కవి పద్యంగా మారాలా ప్రతి రోజూ కవికి ఒక పద్యంగా మారాలా? ప్రతిరోజూ కవి పద్యంగా మారేందుకు రోజూ ఇంధనం అగ్నిగా మారే మహాక్రతువు. ఒకరోజే పద్యంగా మారాలన్న ప్రతిరోజూ వీపున యుగాల చరిత్ర మోసుకు రావాలి? మళ్ళీ కవి సవినయంగా ప్రార్దిస్తున్నాడు. ఎవరిని రోజునా ? అంటే పంచ భూతాల సమ్మిళితమైన ప్రకృతినా ? సజీవ ,నిర్జీవ చరాచర జగత్తుకు దివా రాత్రాలు ప్రసాదించే అద్వితీయ శక్తినా? అయితే ఆ శక్తి బాహ్యమైనదా? అంతర్లీనంగా అదృశ్యంగా ఆవహించిన భావస్ఫూర్తా?

ఈ ఉప శీర్షిక కింద ముప్పై రెండు పద్యాలు విశ్లేషించుకు చదువుకుంటే ఇహ మరో పుస్తకం చదవాల్సిన అవసరం కనబడదు. ఇందులో ఒక కవిత:

నేనొక కవితగా మారే వేళ

“రోజంతా ఏంచేసినా ,ఎక్కడ తిరిగినా మెహిదీ పట్నం లో

నా సోదరులు ప్రార్ధన వేళకు పడమట దిక్కు తిరిగినట్టు

నేనొక కవితగా మారే వేళ ఆకాశం వైపు తిరుగుతాను

అది నన్ను నేను మీతో అనుసందాని౦చుకునే సమయం.

రోజ౦తా నాలో ఎన్నో స్వరాలు,కంఠాలు ,పరుష గళాలు

మధురపదాలు,ఎవరిని కలిసినా చూసినా మాట్లాడినా

సముద్రం మీద కెరటాల్లాగా అ౦త లోనే పైకి లేచిఇంతలోనే

విరిగిపోతాయి.ఆనవాళ్ళు కూడా మిగలని భావావేశాలెన్నో

అప్పుడు కొన్ని క్షణాల పాటు ఆకాశాన్ని ధ్యానిస్తాను. నేత

లేచి నిలబడగానే జన సమూహం సద్దుమణిగినట్టు .దేహంలో

రక్తనాళాల౦తటా ఒక సరసర సర్రున సాగి సాగి ,నిశ్శబ్దం వైపు

చెవులు విప్పారుతాయి. అప్పుడొక వాక్కు వినిపిస్తుంది

ఎన్నో విరిగిన నేనులు ,తునిగిన నేనులు ,అ౦తదాకా

అల్లరి చేసిన నేనులెన్నో నెమ్మదిగా కరగిపోయి ఒకే

ఒక్క నేను ప్రత్యక్షమవుతు౦ది.చిత్రం అప్పుడా వదనాన్ని

పరిచితులతోపాటు అపరిచితులు కూడా తమదనుకు౦టారు”

సాధారణమైన ఆరంభంని౦చి కవి ఒక అసాధారణ స్థాయికి ఎలా దూసుకు వెళ్తారో ఒక మూర్త భావన నుండి ఒక అమూర్త భావనకు ఎంత సులభంగా glide అవుతారో ఒక జన సామాన్య సత్యం నుండి ఒక అద్వితీయ వేదాంత ధోరణికి విశ్వా జనీనక భావానికి కదిలి వెళ్తారో స్పష్టంగా కనిపిస్తుంది మొదటి నాలుగు లైన్లలో .

చివరికి మళ్ళీ మరో మాటల్లో ఎంత నిర్మోహత! నేనులెన్నో కరగిపోయి ఒక్కనేను ప్రత్యక్షమయాక అపరిచితులు కూడా తమదనుకుంటారు.

నా నుండి మన వైపు ప్రయాణం.

నిజమే చాలా మార్లు భావా సారూప్యత వల్ల కావచ్చు అంత నైపుణ్యంతో ప్రతిమాటా మెరుగు పెట్టి మెరుగు పెట్టి రాయకపోయినా నేనే రాసానా ఇది అని ఉలికిపడేలా చేశాయి ఇతని కవితలు.

అమ్మా,నాన్న మరికొందరు ఆత్మీయులు

“ఆమెకు తెలిసిందేదో మాకు తెలియనే లేదు ,

జీవించక తప్పని ఈ ఒక్క జీవితాన్నీ నిశ్శేషంగా జీవించడమెట్లానో”

ఇక్కడా అంతే. రెండు లైన్లలో ఎంత విస్తృత భావాన్ని ఇమిడ్చారో ఆలోచించండి.

కా౦తి,మ౦చు,మధురిమ

“అయినా నేనింకా చిగురించకు౦డావసంతం

వసంతం కాజాలదని అర్ధం అయింది”

ఊదా, పసుపు నారి౦జ

“ఈ ప్రప౦చమొక పుష్పంగా మారాలంటే

నేనొక తుమ్మెదగా మళ్ళీ పుట్టాక తప్పదు”

నీటి ర౦గుల చిత్ర౦

“ప్రతి మలుపులోని ప్రతి ప్రేమోద్వేగం లోనూ

నేనింకా పాలకోసం గుక్క పెడుతున్న పసిపాపనే”

చిత్తమణిగే చోటు

“ఒకటి మటుకు అర్ధం అయింది.నిన్ను ప్రేమి౦చిన వాళ్ళ

రుగ్మత తొలగాలంటే ఔషధం నువ్వే సేవించాలి”

అభయ వచనాల పేరిట ఆదిత్య ప్రశ్నలూ కవి జవాబులూ కొంతవరకు కవిని కవిత్వాన్నీ అర్ధ౦ చేసుకు౦దుకు దోహదపడతాయి. అర్ధం చేసుకున్న వారికి చేసుకున్న౦త.

ఒక అమూల్యమైన కవితా సంపుటి నా మటుకు నాకు ఎన్ని సార్లు చదివినా ప్రతి మాటా కొత్త అర్ధాన్ని ఇస్తూనే పోతుంది.

(మార్చి 28 సాయంత్రం పుస్తకావిష్కరణ జరుపుకున్న నీటిరంగుల చిత్రం ఒక విహంగా వీక్షణ౦)