చలం – చలనం

తెలుగు వాళ్ళకి చలనం నేర్పిన వాడు. తానే ఒక సంచలనమయినవాడు చలంతో మీ అక్షర ప్రయాణాన్ని తలచుకోండి.

స్వర్ణోత్సవ సుధాంచలం

జనవరి 2013


స్వర్ణోత్సవ సుధాంచలం

చలం గారి 117వ జయంతి, బుద్దపూర్ణిమ నాడు, సౌరిస్ ఆశ్రమం, స్నేహకుటి, భీమిలి లో చలం గారి అభిమానుల, ఆశ్రమ వాసుల , భీమిలి, విశాఖ, హైదరాబాదు   నుంచి  వచ్చిన వారి మధ్య ఆత్మీయంగా జరిగింది. ఆసందర్భం గా చాలా సార్లు  చదివినా చలం గారి సుధ ను వుటంకిస్తూ చేసిన ఒక ప్రసంగానంతర భావనలకు ఇది  అక్షర రూపం.  అంతే కాదు, ముద్రణ వత్సరం ద్రుష్ట్యా (1961) ఈ ఏడాది చలం గారి సుధ కు  స్వర్ణోత్సవ వత్సరం.  1949 – 50 మధ్య కాలంలో విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకుటుంబం గా తరలి వెళ్ళిన చలం గారు,…
పూర్తిగా »