ముఖాముఖం

“నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి

“నేల విడిచి సాము చేయని రచయితలంటే గౌరవం”- వంశీధర్ రెడ్డి

కథగా రాయాలనుకున్న అనుభవం ఒక భాషని ఎంచుకుంటుంది. ఆ భాష దొరికేవరకు ఏమీ రాయను. చౌరస్తా, జిందగీ లాంటి కథలు తెలంగాణ మాండలికంలోనే రాయతగ్గవి. వాటికి రూట్స్ మా ఊరి జీవితాల్లో ఉన్నాయ్.
పూర్తిగా »

అందరూ ఒకేరకంగా ఎందుకు రాయడం? – కన్నెగంటి చంద్ర

ఏప్రిల్ 2017


అందరూ ఒకేరకంగా ఎందుకు రాయడం? – కన్నెగంటి చంద్ర


తన రచనల్ని ప్రచారం చేసుకోటం అలా వుంచి అవి ఎక్కడ అచ్చయ్యాయన్నది కూడా చెప్పడు – గుచ్చి గుచ్చి అడిగితే తప్ప. అచ్చయిన తన పుస్తకాలు ‘మూడో ముద్రణ’, ‘వాన వెలిసిన సాయంత్రం’ ఎక్కడున్నాయో తనకే తెలీని అయోమయం. World Wide Web లో పడి దేనికోసమో ఎందుకో వెతుకులాడుతున్నప్పుడు గూగుల్ క్రాలర్‌కి కూడా దొరకని ఓ మారుమూల పేజీలో తామర తూడులా పాకుతూ తన కవితో, కథో, తుమ్మముల్లులా గుచ్చుతూ వెంటపడి మన స్వానుభవంలోకి చొచ్చుకొస్తుంది.తెలుగు కథలా అనిపించని ఓ కొత్త కథా నిర్మాణం, ఊహించశక్యం కాని ఇమేజరీ కవిత్వం ఇతను మనవాడేనా అన్న సందేహంలో ముంచినా, తనతో సంభాషించిన మరుక్షణం…
పూర్తిగా »

యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం

ఏప్రిల్ 2017


యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ – వందేళ్ళ ఏకాంతం – స్పానిష్ భాషలో గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ రాసిన మాగ్నం ఓపస్. మార్క్వెజ్ ఈ నవలను 1965 లో రాయటం మొదలుపెట్టి 1966 లో పూర్తి చేశాడు. ఇది ఏభయై ఏళ్ళ క్రితం 1967లో అచ్చయ్యి అనేక సంచలనాలతో సాహిత్య ప్రపంచాన్ని కుదిపివేసింది.

ఏప్రిల్ 17 న మార్క్వెజ్ వర్ధంతి. One Hundred Years of Solitude పుస్తకానికి ఈ ఏడాదితో యాభయ్యేళ్ళు నిండుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యాభయ్యేళ్ల వందేళ్ల ఏకాంతం” పేరుతో మార్క్వైజ్ ఇంటర్వ్యూ తెలుగులో.

“మార్క్వెజ్ రచనాశిల్పం” పేరుతో సురేష్ అందిస్తున్న వ్యాస పరంపరలో ఇదొక భాగం. మూడేళ్ల క్రితం…
పూర్తిగా »

విశ్వసాహిత్యంతో కరచాలనం మొదలు కాబోతోంది

మార్చి 2017


విశ్వసాహిత్యంతో కరచాలనం మొదలు కాబోతోంది

ఆదివారం మధ్యాహ్నం.
జనాలంతా విశ్రాంతిగా టీవీ చానెల్స్ ట్యూన్ చేసే సమయం. ఎలాంటి ప్రోగ్రాంస్ ఐతే బాగా అమ్ముడౌతాయి? కొత్త సినిమాలు, సినిమా కబుర్లు, టాలీవుడ్ గాసిప్, ఫ్లాష్ న్యూస్, మసాలా పాటలు, మిర్చి డాన్సులు…
పూర్తిగా »

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016


Monique Rossen  – కెమెరాతో కవిత్వం

ముందు ఏమీ అనుకోకుండానే అలవోకగా ఓ చిన్న పని మొదలెడతాం, లేదా ఎవర్నో కలిసి కాస్సేపు మాట్లాడతాం. కానీ, ఒక్కోసారి ఆ చిలిపి పనే, ఆ చిరుగాలే ఒక తరంగమై మనలో తిష్టవేసుకుని గింగిరాలు తిరుగుతుంది, మనం ఊహించని దారుల్లోకి మనల్ని పట్టుకుపోతుంది. ఎప్పుడో విడిపోయిన మన ప్రతిబింబాన్ని తిరిగి తీసుకొచ్చి మనకి జోడిస్తుంది – అది కవిత్వం కావొచ్చు, పొటోగ్రఫీ కావొచ్చు, లేదా ఏ రాక్ క్లైంబింగో, పారా గ్లైడింగో కావొచ్చు – పనేదైనా అదే అసలైన ప్రేమ కథ.

అలాంటి ప్రేమకథే మోనిక్ రోసెన్ దీనూ. వృత్తిరీత్యా థెరపిస్టు అయినా, ఫొటోగ్రఫీ, కవిత్వం అంటే ఉన్న ఆసక్తీ, పట్టుదలా ఆవిడని…
పూర్తిగా »

Monique Rossen – Photo poetry

అక్టోబర్ 2016


1. A brief introduction about you – what you do, who you are, your interests how you came to do this project.

My name is Monique, I’ve been born and raised in Holland. I’ve been working as a social worker and body therapist for the last 20 years and as a hobby I’ve always been photographing and also travelling. In the eighties and nineties with an analogue camera, I developed black and white at home,…
పూర్తిగా »

“నేర్చుకుని చెయ్యము, చేసేటప్పుడు నేర్చుకుంటాం.” – పింగళి చైతన్య

ఆగస్ట్ 2016


“నేర్చుకుని చెయ్యము, చేసేటప్పుడు నేర్చుకుంటాం.” – పింగళి చైతన్య

అభివృద్ధి అనేది ఒకే దిశలో జరగడం సాధ్యం కాదు. ఒకే టైం లో శ్రీశ్రీ ఉన్నాడు, చలం ఉన్నాడు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఉన్నాడు, గాంధీ ఉన్నాడు. వీరేశలింగం ఒకవైపు వితంతువివాహాలు జరిపిస్తున్నాడు. ఎవరితోబడితో వారితో వివాహాలు జరిపించాలనే తప్ప, ఆడవారి కోరికలు మరిచిపోతున్నావని చలం ప్రశ్నించాడు. మనకు రెండూ అవసరమే. వితంతు వివాహమే పెద్ద విప్లవం. దానికి మళ్ళీ "నువ్వెవడివి రా భాయ్" అనడం ఇంకా పెద్ద విషయం. ఇవతల అందుకునే స్థానంలో ఉన్నవారు అందిపుచ్చుకోవడం లో డిగ్రీస్ ఉంటాయి. ఏ డిగ్రీ లో వాళ్లకి ఆ డిగ్రీ లో జరిగే పోరాటం కావాలి. కవియిత్రి సరోజినీ నాయుడు కావాలి, అదేసమయంలో యూనియన్ ఫ్రీడమ్…
పూర్తిగా »

“చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్

“చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్

నిన్నటి తరం రేడియో అభిమానులను తన స్వరంతో అలరించి, శ్రవ్య నాటకాల ద్వారా సాహిత్యంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. - శ్రీశాంతి దుగ్గిరాల

నాటకాన్ని మైక్ ముందు చదివే ముందు రిహార్సల్స్ ఉండేవి. అందరితో కలిసి రెండు మూడు రోజులు బాగా చదివి ఎవరి వేషాన్ని వారు ఆకళింపు చేసుకోవాలి. నేను అలాగే ఇంట్లో పనిచేస్తున్నా నాలోనేను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ పాత్రలోకి ప్రవేశించడానికి, ఆ పాత్రను ఆవాహం చేసుకోడానికి ప్రయత్నించి చేసినవే నా నాటకాలన్నీను. ఇంకోమాట ఏమిటంటే రేడియోకి ప్రతీ అక్షరమూ క్షుణ్ణంగా పలకాలి. అలా ప్రతీ అక్షరాన్ని పలకడంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకునేదాన్ని.…
పూర్తిగా »

Appreciation చాలదు ఈ వయసులో, critical appreciation కావాలి. – పతంజలి శాస్త్రి

Appreciation చాలదు ఈ వయసులో, critical appreciation కావాలి. – పతంజలి శాస్త్రి

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు మనదైన వాతావరణానికి భంగం కలక్కుండా సంప్రదాయ ఆధునిక కథనరీతుల్ని జోడించిన కథకుడు. ఆయన కథలు తెలుగు ప్రాదేశిక సరిహద్దుల మధ్య జరుగుతూ కూడా ఒక విశ్వవ్యాప్త దృక్పథాన్ని కలిగివుంటాయి. ఈ ఇంటర్వ్యూ గత ఏడాది వేసవికాలం మధ్యాహ్నం రాజమండ్రిలో ఆయన ఇంట్లో జరిగింది. ఆయన మెదడు ఒకేసారి పలు ఆలోచనల్ని తెచ్చిపోస్తుంటే, వరుసక్రమానికి బంధీ అయిన మాట వాటిని కొంత కలగాపులగంగా వ్యక్తం చేస్తుందనిపిస్తుంది. వాటిని కాస్త అటూయిటూ చేసి ఈ ఇంటర్వ్యూ కూర్చటం జరిగింది.

ఇంటర్వ్యూ:  ఫణీంద్ర

1. మీపై రచన దిశగా పడిన తొలి ప్రభావం గురించి చెప్పండి?

ఎక్కువ కుటుంబంమే. నేను…
పూర్తిగా »

సుషుప్తావస్థను దాటి రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం – నిశీధి

ఫిబ్రవరి 2016


సుషుప్తావస్థను దాటి రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం – నిశీధి

“చలి కౌగిలింతల్లో తుళ్ళుతున్న సూర్యకాంతి
వేడిస్పర్శల కోసం తపిస్తున్న శీతగాలులు
ఆవిర్లలో సీతాకోకచిలుకలు వెతుక్కొని
ముసురుకుంటున్న కాఫీ మోచా
మధ్యాహ్నపు మెలుకువలో భూపేన్ హజారికాతో బందిష్
నెగళ్ళంటుకోని మంచునెల సెలవల సాంగత్యపు హాయి” – నిశీధి

ఛాందసవాద తెలుగు కవితారీతుల శృంఖలాలని తెంచుకుని కవిత్వానికి కొత్త భాష్యపు సొబగులద్ది, వైవిధ్యభరిత కవిత్వాన్ని అంతర్జాల మాధ్యమంగా పాఠకులకందిస్తున్న ఈ తరం కవయిత్రి నిశీ. తెలుగు కవితాప్రపంచంలో ఓ కొత్తకెరటంలా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రని వేసుకున్న నిశీధి ఈ మధ్యకాలంలో తప్పక చదవాల్సిన కవయిత్రి.

“ఒక బలమయిన భావం కకూన్లో ముడుచుకు పడుకున్న గొంగళిపురుగు అయితే, ఆ సుషుప్తావస్థను…
పూర్తిగా »