డైరీ

తుఫాన్

డిసెంబర్ 2017


ఎనిమిదో అంతస్తులోని ఆ హాలులో కూర్చున్న వాళ్ళంతా అరవైనుండి ఎనబై దాటిని వాళ్ళే.
కొంతమంది టీవి చూస్తుంటే మరి కొంతమంది పేకాట, చెస్సులాంటి  ఆటలలో మునిగివున్నారు.
  ఓకరిద్దరు నిట్టింగ్ చేస్తున్నారు.
"ఈ వయసు వాళ్ళని ఇక్కడినుండి కదపడం ప్రాణాంతకం. పోయినసారి చేసిన ప్రయత్నాలలో హార్ట్ఎటాక్‌కి గురి అయినవాళ్ళు, కాళ్ళు చేతులు విరుచుకున్నవాళ్ళు అనేకం.
పై అంతస్తులో వున్నాం. అన్ని వైద్య సదుపాయాలతో పాటు జెనరేటర్లు కూడా వున్నాయి..." చెపుతున్నాడో డాక్టర్ ప్రశ్నిస్తున్న విలేఖరికి. "ఎక్కడికిక వెళ్ళేది? వెళ్ళడం, వెళ్ళడం మరింక అక్కడికే" అంటూ నిట్టింగ్ చేస్తున్న ఓ వనిత నవ్వుతూ చేతిలో నీడిల్ ని పైకి చూపించింది.  నిస్సహాయతనుండి వచ్చిన…
పూర్తిగా »

స్కూలుకెళ్ళే ఆ పొద్దు

సెప్టెంబర్ 2017


స్కూలుకెళ్ళే ఆ పొద్దు

పిట్టగోడనానుకుని వున్న గన్నేరు చెట్టు మీద పిచుకలు తెగ అల్లరి చేస్తున్నాయి. బాయిలర్‌లోని వేడి నీళ్ళతో బాల్చీ నిండుతోంది.  రెండు చేతులూ పైకి చాచి ఓ సారి ఒళ్ళు విరుచుకుంది చిన్ని. పూలచెట్లని, నీళ్ళ కుండీలని రాసుకుంటూ చిట్టిదూడ గంతులు వేస్తూ పరిగెడుతోంది. దాన్నో కంట కనిపెడుతూ బుజాల మీద వాలిన రెండు జడలని పైకెత్తి వెనుకకి ముడివేసింది.

నిండిన వేడి నీళ్ళ బాల్చీని తీసుకెళ్ళేముందు తన వంతు న్యాయంగా బాయిలర్ గొట్టంలో వేసిన రెండు చెక్కముక్కలు చిటపటామంటూ వెలుగందుకున్నాయి. స్నానం కానిచ్చి – ఆవుదూడని తల్లి దగ్గరికి చేర్చే ప్రయత్నంలో పరుగులు పెడుతుంటే – అమ్మ వేసిన మూడో కేక ఇంటి లోపలికి…
పూర్తిగా »

ఎండ మీద ఒట్టు

ఏప్రిల్ 2017


ఎండ మీద ఒట్టు


ఇంటికి రానీయని ఆట పేరు వేరు.ఊరవుతలకుర్కిచ్చె సెలవు పేరు వేరు. పొద్దున్నే తట్టిలేపే మనిషి పేరు వేరు.రాత్రైతే భయమేసే చీకటి పేరు వేరు. ఏమీ ఉండదు నేర్చుకునెట్ది. గీరలు మార్తయి-బండిదోలుడు మారదు;పైసలు మార్తయి-చేయి చాచుడు మారదు;దెబ్బలు మార్తయి- తగిలిచ్చుకునుడు గంతే;సాయితలు మార్తయి- సాయంజేసుడు గదే..

లాగు పొడుగైతది. దినం పొడుగైతది. ఎండ ఇంకింత ఎక్వనేగొడతది. మనుషులు ఇంకింత కొంచెపడుతుంటరు. ఒక్కపూట బళ్ళో నేర్శిన ఈత బరిబాతల నిన్ను బయటకు ఈడ్వదు.ఒక్కశిత్తమనుకుని చేశిన దొంగతనం కట్టేశిన చెట్లకి కనికరం ఉండదు. వయిలు ముట్టకుండా రాశిన పరీక్ష, సొప్పబెండుదెచ్చి చేశిన గాలం..సాకలి సదువుని బండకేశికొట్టదు. గొంతులగుచ్చుకొని మాట్లాడనీయదు

అనుకుంటంగాని- తాకుడుగాల్లోడు యెటు అడుగేస్తే ఏంది. తపాలాలు…
పూర్తిగా »

పౌర్ణమి

డిసెంబర్ 2016


ఎన్ని సార్లు అడిగాను, ఒక్క పౌర్ణమికైనా కలిసుందామని.

ఈ రోజు పౌర్ణమి !

రాత్రి పది గంటలకి ఆఫీసు మూసేసి వస్తూ ఉంటే, చల్లచల్లగా వెన్నెల, మంద్రంగా కొబ్బరాకులు, చుట్టూరా నిశ్శబ్దం. మనసంతానువ్వు. నువ్వెదురుగా ఉన్నావనుకో! చాలా బిజీగా ఉన్నట్లు కనిపించాలన్నట్లు, అంతసేపూ నువ్వు నాకోసం ఎదురు చూడాలన్నట్లు- అదో తపన.

నేను ఎదురుగా ఉన్నాననుకో నువ్వూ అంతే!

ఇన్ని రోజులలో ఒక్కసారైనా వీలు పడలేదు మనకి, ఒక్క పున్నమి రాత్రైనా వెన్నెల్లో తడవడానికి! రాత్రిపూట డిన్నర్ అయ్యాక అలా నడుద్దామని బయట అడుగు పెడితే ఎంత ప్రయత్నించినా నువ్వు కొన్న మువ్వల సవ్వడి అలజడి కలిగించకుండా వదలదు.
నిశ్శబ్దంలో నిన్నెలా దూరంగా ఉంచాలో…
పూర్తిగా »

అంతా ఒకేసారి

నవంబర్ 2016


అంతా ఒకేసారి

నాలుగంటే నాలుగు వానచినుకులు చేరినందుకు సరస్సు పొత్తిళ్ళనిండా నీలికలువలు పూసి ఉండటం నువ్వెప్పుడూ చూసి ఉండవు. నాలుగు రోజుల పరిచయానికే తమ సమస్తాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన మనుషులగురించి నేనూ ఏమీ మాట్లాడి ఉండను. నిజానికి ఉన్నారు. దేవదారు నీడల్లో తలదాచుకుంటూ ఒంటరిగా ఓపిగ్గా ఎదిగొచ్చిన వాళ్ళున్నారు. వెనకనుండి పట్టుకునో,కాళ్ళకి చుట్టుకునో నిలువెత్తు దేహంపై ఎగబాకినవాళ్ళున్నారు.
పూర్తిగా »

గడ్డిపోచలు – 5

అడుగెయ్యగానే కర్రలవంతెన ఊగుతుంది. వెనక్కి తగ్గి మురుగునీళ్ళలోంచే అవతలికి నడిచెళ్తావు. టార్చి వెలుతురు గుండ్రంగా కదుల్తూ ముందుకెళ్తుంది. పేరు తెలీని ఆ వూళ్ళో చేపల వాళ్ళెవరో భోజనానికి పిలుస్తారు. రేపు రాత్రికెలాగో ఉల్లిపాయలు, దుంపలూ కాల్చుకు తినాలి అనుకుంటూ వాళ్ళ వరండాలో ఆకు ముందేసుకుని కూర్చుంటావు. బారు లంగా, పూల గాజులు వేసుకున్న పిల్ల ఒక్కత్తే కంకర్రాళ్ళతో గిల్లాయిలాట ఆడుకుంటుంది. ఆ పిల్ల నాన్న వెర్రిబాగులోడు, అరుగు మీద బోర్లా పడుకుని ఆపకుండా గొణుగుతూనే ఉంటాడు. లావుపాటి అన్నం లోకి, పెద్ద పెద్ద కూరముక్కల పులుసు. నీకు ఇల్లు గుర్తొస్తుంది. ఓ మూలన సొట్ట పడ్డ ఇరవయ్యేళ్ళనాటి నీ అరిటాకు కంచం, ఈ మధ్యనే పెళ్ళి…
పూర్తిగా »

ఎనఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్

సెప్టెంబర్ 2016


అరణ్యాల్ని దాటి వచ్చి అప్పటికప్పుడే ఎందుకు పారిపోయేదీ, గాయాల పరిమళంతో గాలినెందుకు నింపిపోయేదీ చెప్పేసాను. పసిదాని పాదాల మీద నిలిచిపోయిన అమ్మ చూపు గురించి, ఆకాశపు నీలి నదిలో దూకిన చేపపిల్ల చివరగా అన్న మాట గురించి ఇంకెప్పుడైనా చెప్తాను. నిజమే కదా అడిగావు? సరే! అలవాటైన పూలభాషలో-
పూర్తిగా »

మరీచిక

సెప్టెంబర్ 2016


ఆటో అబ్బాయి కొంతసేపయిన తర్వాత మాటలు కలిపేడు. ఆ తర్వాత నేను కూర్చుని ఉన్న సీటు పక్కనా, వెనుకా చూడమన్నాడు. అక్కడ కొన్ని సినిమా తారల ఫుటోలు, కొన్ని కవితలూ రాసి ఉన్నాయి. అన్నిటిలోనూ ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు. సినిమా తారలతో ఫుటో దిగటం చవకబారు హాబీయే కదా అనుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఆ అబ్బాయి 'కథ' చెప్పాడు. అతని కుటుంబం చిన్నది. అయితే అతడు కుటుంబ బాధ్యతకన్నా మరొక గొప్ప సామాజిక బాధ్యత ఒకటి తీసుకున్నాడు. అతడు తీరిక వేళల్లో సినిమాలలో ఫైట్లలో పాల్గొంటాడు.
పూర్తిగా »

ఎప్పట్లాంటిది కాదీ వాన…

జూలై 2016


స్నానం చేసి బయల్దేరితే మనసొచ్చేది కాదు. హయ్ హయ్. తడిస్తె ఎంత బాగుంటుంది. మీ ఇంటికి తడిసిపోతూ రావడం ఎంత బాగుంటుంది. వేన్నీళ్ళ స్నానం, నువ్విచ్చే కాఫీ.. అబ్బా!

ఎప్పట్లాంటిది కాదీ వాన- నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. మళ్ళా ఇవ్వాళే. ఇంట్లో ఎవరు లేరని దానికీ చెప్పావూ?

నవ్వొద్దు. నిజంగా ఎప్పట్లాంటిది కాదీ వాన. వచ్చిన దారిలో ఒక్కడూ కనపడలేదు. ఒక్క తాబేలు, కొన్ని నీళ్ళూ.

***

చిన్నప్పుడంటే గుర్తొచ్చింది.

పొద్దుపొద్దునే మట్టి గోడ తవ్వి నీళ్ళాడిన కుందేటి పిల్లకి ఇది ఎన్నో కాన్పని అమ్మనడిగానా! అమ్మ నన్నేం కొట్టలేదు. అన్నిటిని చూపుడు వేలితో లెక్కపెట్టించింది. ఇంకా ఉడకబెట్టిన…
పూర్తిగా »

ఎటువైపు తడిమినా చల్లగా తగిలే అన్ని రాత్రుల లాంటిదే ఒక రాత్రి..

ఎటువైపు తడిమినా చల్లగా తగిలే అన్ని రాత్రుల లాంటిదే ఒక రాత్రి..

రెక్కకు బురద అంటిన సీతాకోకను నేను. ప్రేమించగలవా అంతే ఇష్టంతో? ఐ స్టిల్ థింక్ ఔట్సైడ్ ద బాక్స్. ఐ స్టిల్ హావ్ వండర్ఫుల్ థింగ్స్ టు సే. ఏం? మాటసాయం మరీచికా!
ముడుచుకుని. షెల్ - అల్చిప్పలో. ఇక వద్దు. ఒక్క కాంతి రేఖ కూడా.
ఒక్క ఇసుక కణం - ఎట్లాగో సందు చేసుకుని.
ఒక ముత్యం - ఎప్పటికో.
అప్పటిదాకా, ఒక్క గాయం - ఎడతెగకుండా సలుపుతూ
బతకనివ్వదు
చావనివ్వదు
మానిపోదు

పూర్తిగా »