జిందగీ

అనుదిన జీవన చిత్రాలు కొన్ని…

దునియా…

మార్చి 2013


దునియా…

“ఆలోచించేది ఏమీ లేదు  అబ్బాజాన్, మమ్మల్ని ఆ “దోజఖ్” నుండి  బైట పడెయ్యండి”. ఖచ్చితంగా చెప్పింది తండ్రితో  కూతురు రజియా సుల్తానా.

“మరొక్కసారి  ఆలోచించు  బేటీ..రహీమ్ నీకు ససుర్ మాత్రమే కాదు, నాకు స్నేహితుడు కూడా ” నెమ్మదిగా సరిదిద్దే  ధోరణిలో  చెప్పాడు. రజియా తండ్రి  సలీం బాషా.

కూతురూ, అల్లుడూ వేరు కాపురానికి అన్నీ సిద్దం చేసుకొని తనను కేవలం  మాటవరసకు అడుగుతున్నారని గ్రహించ గలిగాడు, కానీ పెద్దమనిషిగా తన స్నేహితుని  మనసు ఎరిగిన వాడిగా అది తన భాద్యత అనుకున్నాడు సలీం బాషా.

“లతీఫ్ బేటా  నువ్వన్నా ఆలోచించు  అబ్బా, అమ్మీ ఎంత బాధపడతారో ” అల్లుడివైపు  తిరిగి  అన్నాడు సలీం బాషా.(అటునుండి నరుక్కొచ్చే  పద్దతిలో)

“వద్దు అబ్బాజాన్ ఆ ఇంట్లో వాళ్లకు…
పూర్తిగా »

పక్షులు

ఫిబ్రవరి 2013


పక్షులు

చల్ల గాలి వీస్తుంది, ఆకాశం నల్లగా మేఘాలతో నిండి ఉంది.తెల్లవారటానికి ఇంకా చాలా సమయంఉంది. నేనూ,తమ్ముడూ ముడుచుకొని మూడంకె వేసుకొని పడుకొని ఉన్నాం.

“అమ్ములూ.”.అమ్మ పిలుపు మెల్లగా చెవి దగ్గరగా వినిపించింది.
“ఊ ..” మత్తుగా పలికాను.

“లేవండి, నేను వెళ్ళాలి కదా, తమ్ముణ్ణి కూడా లేపు”. మందలించినట్లుగా ఉంది అమ్మ స్వరం.
నేనూ తమ్ముడూ బలవంతంగా లేచాము.

ఇద్దరమూ అమ్మ వడి చేరాము. అమ్మ నన్ను నిల్చోబెట్టి, తమ్ముణ్ణి వడిలో పెట్టుకొని, వాడి రెండు చేతులు కలిపి, మా ఇద్దరి చేతా ప్రార్దన చేయించింది. ఇక్కడ నాకు నచ్చని విషయం ఒకటుంది, అదేంటంటే అమ్మ మున్నియమ్మ గురించి కూడా ప్రార్దన చేయిస్తుంది.…
పూర్తిగా »

వసంతంలా వచ్చి వెళ్లిపోయింది ఆపా!

వసంతంలా వచ్చి వెళ్లిపోయింది ఆపా!

మా ఇంట్లో నేను ఆరో ఆడ  సంతానం, మా  ఇంటిని చుట్టేసుకుని ఉన్న చుట్టం గరీబీ. నాకు చదువంటే చాలా ఇష్టం. అక్కల చదువులు  అలీఫ్ ..బె ., దగ్గరే ఆగిపోయినా,  నా చదువు మాత్రం ఏడో  తరగతి వరకూ సాగింది. అబ్బాజాన్ కు  తన కుట్టు మిషనే ప్రపంచం.   నమాజుకు మజీదుకు వెళ్ళడం కోసం తప్ప వీధి ముఖం  ఎరుగడు, కుట్టు మిషను  తనతోనే పుట్టినట్లు భావిస్తాడు. తలకి మించిన భారమైనా ఊరిబట్టలన్నీ  తీసుకొని రాత్రి పగలూ కుడుతుంటాడు. ఆయన కుట్టే రంగు, రంగుల బట్టలు చూస్తుంటే  అవి మా వంటి మీద ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్ళం. అవి కుట్టిన తర్వాత ఎదో వంకతో మా వయస్సు వారైతే ఆల్తీ చూసినట్లుగా మమ్మల్నిఆ బట్టల్లో  …
పూర్తిగా »