ఫస్ట్ పర్సన్

ఎన్నో అనుభవాలు దాటి వచ్చిన ప్రసిద్ధ రచయితలు ఇప్పుడేం చెస్తున్నారు? ఏం చదువుతున్నారు? వాళ్ళ దినచర్య ఏమిటి?

కథ చదివితే మనలో ఒక urgeని create చేయాలి: నల్లూరి రుక్మిణి

కథ చదివితే మనలో ఒక urgeని create చేయాలి: నల్లూరి రుక్మిణి

నల్లూరి రుక్మిణి గారు కథా, నవలా రచయిత్రిగా అందరికీ సుపరిచుతులే. విరసం అధ్యక్షులుగా పనిచేసిన సి.ఎస్.ఆర్.ప్రసాద్ గారి సహచరిగా తానూ విరసం సభ్యురాలిగా వుంటూ తమ నలభై ఏళ్ళ సాహచర్యంలో ఇప్పటికీ గుంటూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలలో జరిగే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలలో మమేకమవుతూ వృత్తి రీత్యా న్యాయవాదిగా ఎంతో మంది పేదలు, మహిళలకు, కార్మికులకు సాయపడుతూ ఉద్యమాచరణతో, సాహిత్య కృషితో సాగుతున్న క్రమాన్ని మనతో ఇలా పంచుకున్నారు.. రుక్మిణి గారు ‘నర్రెంక సెట్టుకింద’ నవల, నెగడు పేరుతో కథా సంకలనం వెలువరించారు.

ఇప్పటి దినచర్య: ప్రాధమికంగా చదువుకోవడం, రాయాలనిపించినప్పుడు రాయడం, వృత్తి రీత్యా లాయర్ నికానీ అది కాలక్షేపానికే.

ఇప్పటి…
పూర్తిగా »

వర్గసమాజాన్ని గుర్తించాలి

ఫిబ్రవరి 2013


వర్గసమాజాన్ని గుర్తించాలి

విరసం వ్యవస్థాపక సభ్యురాలు  క్రిష్ణాబాయిగారు  ప్రస్తుతం విశాఖలో వుంటున్నారు. క్రిష్ణక్కగా అందరికి సుపరిచితం.  చిన్న నాటి నుండే వామ పక్ష ఉద్యమాలతో కుటుంభానికి వున్న అనుబందంతో విప్లవ రాజకీయాల పట్ల అవగాహనతో ఆత్మీయంగా కలసి పనిచేస్తున్నారు. విరసం ఏర్పడిన నాటి నుండి సభ్యురాలుగా వుంటు కార్యదర్శిగా కూడా పని చేసారు. విరసంను నిషేధించిన కాలంలో ఆమె కార్యదర్శిగా వున్నారు. మహిళా సంఘాలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోను తను భాగస్వాములవుతూ ఇప్పటికీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విరసం తీసుకు వచ్చిన కొడవటిగంటి సంపుటాలు సమగ్రంగా రావడానికి వీరి కృషి కూడా ప్రధాన కారణం. సాహిత్యం, ఉద్యమం రెండు రంగాలలోను తన పాత్ర ఆదర్శనీయం.

కృష్ణక్క ఈ…
పూర్తిగా »

చదువొక్కటే నా కాలక్షేపం

చదువొక్కటే నా కాలక్షేపం

కారా మాస్టారుగా చిరపరిచితులు కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథకి పెద్ద దిక్కు. శారీరకంగా అలసిపోతున్న వయసులో కూడా పుస్తకం చదవకుండా/ కథ గురించి ఆలోచించకుండా ఇప్పటికీ వొక్క రోజు గడవదు ఆయనకి- ‘వాకిలి’ ఫస్ట్ పర్సన్ శీర్షిక కోసం మేం అడిగే అయిదారు రోజువారీ ప్రశ్నలకు ఆయన సమాధానాలివి. కారామాస్టారు మాట్లాడ్డమే పొదుపుగా, ఎడిట్ చేసినట్టుగా మాట్లాడతారు. క్లుప్తంగా ఇవీ ఆయన మాటలు.

 

కారా మాస్టారు గారితో ఫోన్ లో అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు:

ఇప్పటి దినచర్య: కథానిలయంనుండి దూరంగా చోడవరంలో వుంటున్నాను. వయసు 89. అందుచేత వెనకటి ఓపిక లేదు. ఒక కన్ను ఒక చేయి పని చేయదు. అయినా…
పూర్తిగా »