కాశీ మజిలీలు

తలుపులమ్మ

జూలై 2014


తలుపులమ్మ

దుబ్బుగడ్డి కోసే పనికెళ్లినోళ్ళకి అన్నాలట్టికెళ్ళిన తట్ట తలమీదనుండి దించి కుదేసి నామలో పడేసింది తలుపులమ్మ “ ఏంటే తలుపులూ! మాంచి ఇసురుగా వొచ్చావ్! ఏడిమీదున్నట్టున్నావ్ దుబ్బులంకలో ఏమన్నా గొడవయ్యిందా ఏంటీ? అన్నాడు నాగేశరావు. మా రేవునుండి దుబ్బులంకని దాటుకుంటా అటేపున్న చేర్లంకకి ఎల్లాలంటే నామ్మీదే ఎల్లాలి మేము ఆ నామల్ని నామాల నాగేశరావు, పడుసప్పారావు తొళ్తారు.అయేల లంకలో దుబ్బుగడ్డి కొయ్యడానికి సూరమ్మ , పెదలచ్చిమీ, గొంతమ్మా , బూరిగాడి పెళ్ళాం ఇంకా సేనా మంది ఎల్లారు. వొచ్చేది వానాకాలం కదా రాజులందరూ ఇళ్లదగ్గర వంట పాకలు దుబ్బుగడ్డితోనే నేయించుకుంటారు.

అందుకే మాయూరోళ్ళందరూ మే నెల సివర్లో చేలల్లో పైరుతీతలయ్యాక కూలి కూడా ఎక్కువుంటాది కదా…
పూర్తిగా »

బేగొచ్చేత్తా..

జూన్ 2014


బేగొచ్చేత్తా..

మా రాయుగారి సెట్టుల్ని రాలిన పిందులన్నీ ఏరుకొచ్చి గుమ్మాలో ఏసాడు మానాన . అందులో కొన్ని పెద్దయ్యన్నీ ఏరి మాకు తీసేసి, మిగతాయి ఊరోల్లకి పంచేది మాయమ్మ. బడున్నప్పుడు ఎలాగా పెద్దగా ఆడుకునేవోన్ని కాదు. సెలవల్లో కూడా ఆడనియ్యకపోతే సిర్రెత్తుకోచ్చేది నాకు. నేలాబండాట ఆడుకోడానికి బడిబిల్లింగు దగ్గరికెల్లినోన్ని పిలిపించి గుమ్మాలో సంచిమీద మామిడికాయలేసి గీత్తా కుచ్చుందిమాయమ్మ.

” ఎందుకు పిలిసావే” అనడిగితే ” ఇయ్యాల బోల్డు పనున్నాది ఇల్లు కదిలావంటే ఒల్లో సీరేత్తాను” అన్నాది మాయమ్మ. తైతిక్కలు తొక్కి ఏడిసినా ఏమాత్రం పట్టించుకోలేదు. తెగీ తెగని బండకొడవలొకటి తీసుకుని నేనూ మామిడి కాయలు గీత్తా కుచ్చున్నాను. టెంక ముదిరిన కాయలన్నీ అరిసేతిలో…
పూర్తిగా »

పిల్ల నచ్చింది

పిల్ల నచ్చింది


మా  మాలపేట్లో బత్తులోల్లంటే తెలీనోల్లు లేరు. ఎవలన్నా మాయూరికి కొత్తగా ఒత్తే  ఆల్లు గనక బత్తులోల్ల సుట్టాలైతే దారి పొడుగునా ఆల్లకి సుక్కలే కనబడతాయి . ఎందుకంటే మాయూల్లో నామాడోల్ల తర్వాత బత్తులోల్లె ఎక్కువుంటారు .

నామాడోల్ల పేటని పేరే గాని  సేనామంది  బయటూరోల్లకి బత్తులోల్లె ఎక్కువ తెలుసు. మయూరి అంబేట్ గారి బొమ్మ దాటగానే  మంచినీల నూతి దాటాక  పెత్తాత కిళ్ళీ కొట్టుంటాది. ఆ తర్వాత సుబ్బన్నగాడి ఇల్లు దాటాక , తోర్రోడి కోల్లు ఇల్లుంటాది. తోర్రోడి కోల్లంటే బత్తుల సూర్రావు కోల్లు. అదేనండీ కుంటి పెసాదం పెళ్ళం…. కుంటోడని అందరూ కుంతీ పెసాదం అంటారు గానీ మామూలు మనుషులకంటే ఎక్కువ…
పూర్తిగా »

సింతపులుసు

ఏప్రిల్ 2014


సింతపులుసు

ఒరే అల్లుడా ! ఓ బకీట్నీలు ముంచియ్యిరా అంది నాగమణి బాప్ప. పెద్దగేది కాల్లోనే పడుకూనుంది. లేగదూడని కూడా కాల్లోకి దింపాను.
పెద్దగేదిలాగ అది కుదురుగా పడుకోదు. అవతల గట్టేక్కేసి హడావుడి సేత్తాది. దానిని అదుపు సేయ్యలేనని తాడు కాలుకింద తొక్కిబెట్టి నాగమణి బాప్ప దగ్గర బకీటందుకున్నాను. కాలవ పాంచాల మీదనుంచి నీలందుకోబోతుంటే మొలకున్న రుమాలూడిపోయింది. గబాల్న తాడూ, బకీటు వొదిలేసి, రుమాలట్టుకున్నాను. కుర్రనా గొల్లిగా డాయరేసుకోవేట్రా అన్నాది. ఇంతకీ సూసిందో లేదో గాని తిట్టడం బలే నచ్చింది నాకు నవ్వుకున్నాను. ఏ బాప్పా ఇప్పుడేమయ్యింది అన్నాను. ఇంతకీ నేను కడ్డాయిరేసుకున్నాను కదా అది కంగారులో సూసీ సూడకుండా సూడ్డం…
పూర్తిగా »

గంగమ్మ సీర

మార్చి 2014


గంగమ్మ సీర

ఏరా ఇంకా పడుకూనే ఉన్నవా ? ఒక్కడే ఏమీ సేస్కోలేకపోతున్నాడు రాజూ , కాత సాయమెల్లరా. పొద్దున్ననగా ఎల్లాడు, కాపుల సేలో పిండిజల్నాకి. మద్దేల కూటిక్కూడా రాలేదు అసలే జివ తగ్గిపోయింది , సేతులొనుకుతాయి,కళ్ళు తిరుగుతాయి., పిండి మూట్లు ఏటిగట్టు మీదకెక్కించాలంట. మీరెవలన్నా ఎళ్తే సాయముంటాదిరా రాజూ ! అయినా మద్దేలపూట పడుకోడమేటీ రాజు ? లెగు లెగిసెల్లు అన్నాది మా యమ్మ .. ఇంత ఇదిగా సెప్పాక ఏం సేత్తాను?కళ్ళు నులుముకుంటా లెగిశాను.

తిన్నగా గోలుంకాడకెళ్ళి దోసిల్లనిండా నీలు తీసుకుని కళ్ళు కడుక్కున్నాను. దండింమీద ఆరేసిన రుమాలిచ్చి కూసేపాగు టీ ఎట్టాను తాగేల్దిగాని అని జంతిక ముక్కిచింది చేతికి. సిన్న పిల్లోడికంటే దారుణంగా గబుక్కన…
పూర్తిగా »

సెవిరింగు సెకోడీ

ఫిబ్రవరి-2014


సెవిరింగు సెకోడీ

“మెట్రో తంబానికి మేకులు కొట్టే పేసూ నువ్వూనూ … మచ్చెబ్బరెదవా పయానమప్పుడు ఓ గంట ముందుగా పయనమాడాలని తెలీదా నీకు? ఏ పనికైనా లేటే ఎదవకానా ఎదవకానా” తెళ్లమీసాలేసుకుని కొడుకుని తిడతానే ఉన్నాడామహానుబావుడు. ఆయన తిట్టే తిట్లకి మళ్ళీ రైల్లో నుంచి దిగేత్తాడేమో అనిపించింది నాకు అతని మొకం సూత్తే. కుచ్చోడం మానేసి బెల్టు బద్దుల్లోంచి సెలప్పోను ఎడ్ సెట్టు తీత్తన్నాడు. ఆ పెద్దయానికి మళ్ళీ తిక్కరేగింది కామాలు మళ్ళీ అందుకున్నాడు దండకం. ఎంతాపుకున్నా నవ్వొచ్చేసింది నాకు. అచ్చం సిన్న పిల్లాడిలాగ ఉప్పుడేమయ్యింది నానా టయానికొచ్చేశా కదా ఇంక తిట్టకన్నాడు. “ఆ సాల్లే “ అన్నట్టు కొడుకొంక సూసి ఊరుకున్నాడా తెల్లజుట్టూ, తెల్ల మీసాలూ,…
పూర్తిగా »

ఆ నెమలెంటిక ఇప్పటికీ…

జనవరి 2014


ఆ నెమలెంటిక ఇప్పటికీ…

“ఒరేయ్ లెగరా ఏబ్రాసినా కొడకా, తెల్లారి సేలా సేపయ్యింది. లెగవేరా ? కోటిపెల్లికి పంటికట్నాకి బుల్లిగాడొచ్చేశాడు, పండుగాడు పెదబుజ్జిగాడు రేవులో తానానికెళ్లారు తమ్ముడు సేనికాడికెళ్లి గట్టుకన్నం కట్టేసొత్తాడు. ఈ లోపులో నువ్వు పయనమాడెయాలి. లెగరొరేయ్ సన్నాసి”

నాన తిట్టిన తిట్లన్నీ ఇనపడుతున్నాయి అయినా ఇంకా మెళుకువ రానట్టు, నటిత్తానే పడుకున్నాన్నేను. గాజులు సప్పుడు కూడా ఇనబడింది. అమ్మ కూడా లెగిసే ఉంటాది. కొంపదీసి తపేల్తో నీలట్టుకూని రాట్లేదు కదా! అని దుప్పడి పైకెత్తి సూశాను!

చిలక్కర్రకి తగిలించిన పాల తపాలా తీసి అందులో సకానికి నీలేసి నాన చేతికిచ్చింది మాయమ్మ. కచ్చితంగా ఈడిపుడు ఆ నీలు తీసుకొచ్చి నా మోకానికేసి కొడతాడు డౌట్ లేదు అనుకుంటానే…
పూర్తిగా »