ఆనవాలు

కొత్త కవిత్వానికి ఓనమాలు

లోపలి ప్రయాణాలూ సాహసయాత్రలే!

17-మే-2013


లోపలి ప్రయాణాలూ సాహసయాత్రలే!

Flash upon that inward eye
Which is the bliss of solitude.

టీనేజీ ఉరుకుల పరుగులలో ఈ వాక్యం మొదటి సారి విన్నప్పుడు ఆ solitude గానీ, ఆ inward eye గురించి గాని నాకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ, ఆ వాక్యం విన్నాక Wordsworth గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. బాహ్యజీవితం అంత హుషారుగా అనిపించని ఆ కాలంలో నేను Wordsworth చేతివేలు పట్టుకొని ఏవేవో వూహారణ్యాల్లో దారి తప్పే వాణ్ని, అతనే చెప్పిన ఆ inward eye మెరుపులు చూపుల్ని వెలిగిస్తూ వుండగా!

నిజమే, జీవితం ఎవరికీ సాఫీగా వుండదు. పోనీ అని, సూఫీగానూ వుండలేం!…
పూర్తిగా »

Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!

ఫిబ్రవరి 2013


Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!

 1

1981 - రేవతీ దేవి కవిత్వ పుస్తకమూ, నాకు పదహారేళ్లూ వొక్క సారే వచ్చాయి!

ఇవి రెండూ వొక్క సారే జరగడం యాదృచ్ఛికమే కానీ, ఆ యాదృచ్చికత ఆ తరవాతి అనేక అనుభవాలకు మొదలుగా మారడం మాత్రం ఆశ్చర్యంగా వుంటుంది. కానీ, అలాంటి వొక యాదృచ్చికతకి కొనసాగింపు వూరికే జరగదు, ముఖ్యంగా కవిత్వం విషయంలో! ఆ పదహారేళ్ళ వయసు దాటిన తరవాత నా పాతికల్లోనూ, నా ముప్పయిల్లోనూ, నలభయిల్లోనూ ఎన్ని సార్లు రేవతీదేవి కవిత్వం చదివానో లెక్కలేదు. కానీ, చదివిన ప్రతిసారి నా పదహారేళ్ళప్పటి ఆ పఠన అనుభవమే పునరుక్తి అయినట్టుగా అనిపించింది నాకు!

ఎందుకు రేవతీదేవి నా మనసులో ఇంత గాఢంగా…
పూర్తిగా »

ఇసుక మీద సముద్రం గీసిన స్కెచ్- ఈ కవిత్వం

జనవరి 2013


ఇసుక మీద సముద్రం గీసిన స్కెచ్- ఈ కవిత్వం

 

1

Jack Kerouac నన్ను వెంటాడే అమెరికన్ కవి. వచన రచయిత.

ఆ పేరు వినగానే అతనంటే వొక్కో సారి కేవలం కవి కాదనిపిస్తుంది నాకు. కవిత్వం రాసినా, వొట్టి వచనమే రాసినా, అతని వాక్యాల కింద వుండే చలనం వొక తాత్విక సారంగా ప్రవహిస్తుంది.

మొదట్లో కొంతకాలం ఆవేశంగా రాస్తాం కవిత్వం. అప్పుడు ఉద్వేగం ఉప్పెనై ముంచెత్తుతుంది. రాయకపోతే వొక రకమయిన వొంటరితనం బాధిస్తుంది. నిజమే! కానీ, ఆ ఆవేశం యెప్పుడో వొకప్పుడు ఆరిపోతుంది. ఆరిపోయిన తరవాత మనలోపలి నిప్పు కణమేదో రాలిపోయినట్టే వుంటుంది. వొక రాయలేనితనం లోపల గుబులు పుట్టిస్తుంది. Kerouac అలాంటి అనుభవాలెన్నో చూశాడు, అనుభవించాడు. అలాంటి సమయంలో…
పూర్తిగా »