కథలోపలి కథ!

‘కథలోపలి కథ’ మీ కోసం మరో కొత్త శీర్షిక. మీకు బాగా నచ్చిన ఒక కథని ఎన్నిక చేసుకోండి. ఆ కథ గురించి అయిదారు ప్రశ్నల్ని నోట్ చేసుకోండి. ఆ ప్రశ్నల్ని మాకు పంపండి.

అమాయకురాలు

అమాయకురాలు

(కొకుగారి ‘అమాయకురాలు’ కథ చదివిన తరువాత)

వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?

భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. ‘తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?’ అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం.…
పూర్తిగా »

ఒక కథ- కొన్ని ప్రశ్నలూ!

ఒక కథ- కొన్ని ప్రశ్నలూ!

చంద్ర కన్నెగంటి కథ ‘చిట్టచివరిది’ చదివాక ఇస్మాయిల్ పెనుకొండ  గారు మనసు పారేసుకున్నారు. ఆ పారేసుకున్న మనసుని వెతుక్కోడానికి ఈ ఆరు ప్రశ్నలతో చంద్ర గారి దగ్గిరకు వెళ్లారు. ఇక ఆ తరవాత కథ మీరే చదువుకోండి. ***

మొట్టమొదటిది

కథ అన్నది చదివి ఆనందపడడం, బాధపడడం, ఉత్సాహపడడం, కొండొకచో ఆవేశపడడం లేదా ఓ అనిర్వచనీయమైన అనుభూతి పొందడం వరకే ఇన్నాళ్లూ సాగింది. కానీ ఓ కథ మీద తీరుబడిగా కూర్చొని నాలుగు వాక్యాలు రాయడం మాత్రం ఇదే మొదటిసారి. ఆ కథ పేరు “చిట్టచివరిది”, రచయిత: చంద్ర కన్నెగంటి.

చంద్ర గారి “చిట్టచివరిది” చదవడమే యాదృచ్ఛికంగా జరిగింది. మొన్నో…
పూర్తిగా »