లాఫింగ్ ‘గ్యాస్’

పెళ్ళి చేసి చూడు!

పెళ్ళి చేసి  చూడు!

పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!

‘పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు’ అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే…
పూర్తిగా »

పేపర్ వర్క్

పేపర్ వర్క్

మా చిన్నతనంలో వార్తాపత్రికల ప్రయోజనాలను గురించి రాయమన్న ప్రశ్న తరచూ మార్చి మార్చి వస్తుండేది. వార్తాపత్రికలమీద పెట్టిన దృష్టి అవి తయారయే కాగితంమీద ఎందుకు పెట్టలేదనే సందేహం ఎప్పుడూ నన్ను పీడిస్తుంటుంది.

రాతకు కాగితం తప్పని సరి. కాగితాలు అందుబాటులో ఉండబట్టే కవులు, కథకలూ మన జీవితాలతో చెలగాడమాడుతున్నది. ‘అలా కాదు.. కాగితం అంటూ ఒకటి హద్దుగా ఉండబట్టే కదా వాళ్ల ధాటికి సమాజం తట్టుకో గలుగుతున్నది?’ లేకపోతే వాళ్ల ఆశుధారాశక్తికి మానవ సంఘం ఎప్పుడో కొట్టుకు పోయుండేది.. అనే విరసలూ కద్దు. ఆ ఊసులు మనకిప్పుడు వద్దు. కాగితాలతో ఒనగూడే ఇతర ప్రయోజనాలూ బోలెడున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో! వాటిని గురించి ముచ్చటించుకుందాం… ముచ్చటగా…
పూర్తిగా »

మాయదారి వేషాలు

మాయదారి వేషాలు

‘అహల్యకోసం దేవేంద్రుడు చాటుగా గుడిసెలో దూరిన కోడి వేషానికి.. సీతమ్మతల్లికోసం రహస్యంగా హనుమంతుడు వేసిన బుల్లి కోతి వేషానిక్కూడా తేడా లేదనేట్లున్నావే? రావణాసురుడేసిన సన్యాసి వేషానికి నకలు బాబాయ్ తమరి నయీం భాయీసాబ్ వేసిన నయగారి ఆడంగి వేషం' 'ప్రపంచమే ఓ నాటక రంగం' అన్నాడ్రా పెద్దాయన షేక్స్పియర్. ఆ రంగంమీద ఎవరే వీరంగం వేసినా అవన్నీ మారువేషాల కిందే లెక్క. డార్విన్ పరిమాణ సిద్ధాంత ప్రకారం మనమంతా సురులం కానీ..అసురులం కానీ.. నరుల మేకప్పులో ఉన్న వానరులం.. ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయితో సహా!'
పూర్తిగా »

‘రాత’ ముచ్చట్ల

‘రాత’ ముచ్చట్ల

చెన్నైనుంచి హైదరాబాదు వస్తున్నాను చెన్నై ఎక్స్ ప్రెస్సులో.

పక్క సీటులో ఒక మోస్తరు పెద్దమనిషి తగిలాడు. పరిచయాలు గట్రా అయిన తరువాత నేను ‘రాతల తాలూకు శాల్తీన’ని ఏ కారణం వల్ల ఊహించాడో! ‘ఇప్పటి వరకూ ఏమేం రాసారు సార్?’ అని తగులుకున్నాడు.

మనం రాసినవి… రాసేవన్నీ అలా బైటికి చెప్పుకుంటూ పోతే ఏం బావుంటుంది?

నెత్తికి నూనె రాస్తాను. స్నానాల గదిలో వంటికి సబ్బు రాస్తాను. కాలు కండరం పట్టినప్పుడు, తలనొప్పితో కణతలు బద్దలవుతున్నప్పుడు ఏ జండూ బామో, ఆయింటుమెంటో రాస్తుంటాను.

బైట ఊళ్ళకు ఇలా పనులమీద వచ్చినప్పుడూ నాకీ ‘రాత’ తలనొప్పులు తప్పవు. తరుచూ కాళ్ల కండరాలు పట్టేస్తుంటాయి. అందుకే ఎక్కడున్నా…
పూర్తిగా »

స్వర్గం- నరకం

స్వర్గం- నరకం

ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారంరోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!

ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాలకోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.

అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.

ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ! ఆమ్ ఆద్మీలకంటే ఇలాంటి చేంతాళ్ళు అలవాటేగాని..…
పూర్తిగా »

కందిపోటు దొంగలు

కందిపోటు దొంగలు

ఎదురుగా బోనులో నిలబడ్డ ఆకారాన్ని వింతగా చూస్తూ అడిగారు యమధర్మరాజు ‘ఎవర్నువ్వు?!”బేండీకూట్’

‘సమవర్తి భృకుటి ముడిపడింది ‘విధాతగారు మాకు సమాచారం లేకుండా కొత్తజీవుల సృష్టిని ఎప్పుడు ఆరంభించారు?! యెనభైనాలుగు లక్షల రకాలు. రకానికో నలభై ఎనిమిది లక్షల జీవాలు. ఏది ‘హరీ’మని ఇక్కడికొచ్చినా విచారించి పాపపుణ్యాలు బేరీజు వేయలేక మాకు చారులు కారిపోవుచున్నవి.’ శివాలెత్తుతూ శివయ్యకు ఫిర్యాదు చేయాలని చరవాణికోసం వెదుకులాట ఆరంభించారా మృత్యుదేవుడుగారు.

చిత్రగుప్తులవారికిక జోక్యం తప్పింది కాదు.

‘ప్రభూ! ‘బేండీకూట్’ కొత్తజీవి కాదు. ఆంగ్లపదం. అచ్చమైన తెలుగులో దీన్ని ‘పందికొక్కు’ అందురు. తెలుగు గడ్డమీది గాదెల్లోని కందిపప్పు తెగ మెక్కు కొక్కు ఇది. ఈ సారే ఎందుకో తిన్నది అరక్క చచ్చి…
పూర్తిగా »

దేవుడే రక్షించాలి!

దేవుడే రక్షించాలి!

కోటీ బస్టాండులో బస్సు దిగిపోయారు విష్ణుమూర్తి దంపతులు.

‘గజేంద్రమోక్షంలో ఆ ఏనుగు పాపం ఆ మడుగులో మొసలితో ఎట్లా పడిందో గానీ వెయ్యేసి పాట్లు.. ఒక్క అరగంట మనమీ బస్సులో ప్రయాణం చేసేసరికే గురుడు గుర్తుకొచ్చాడు దేవీ!’

‘శంఖుచక్రాలు, గదా కిరీటాలు వెంట తెచ్చుకొమ్మంటే వింటిరి కాదు! కమ్మగా గరుడ వాహనం చేతికింద పెట్టుకుని.. ఈ డొక్కు గరుడాలో యాత్రలేంటట! రామావతారంనాటి కష్టాలు గుర్తుకొచ్చాయి స్వామీ! ఆ రావణాసురుడి పుష్పకవిమానమే నయం’

‘భక్తులు ఈ మధ్య ప్రద్దానికీ పెద్ద గగ్గోలు పెట్టేస్తున్నారు! నిజంగానే ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటున్నాయా? అసహనం అతిగా పెరిగి మన సహనాన్ని పరీక్షిస్తున్నారా?’ ఆవటా అని పరీక్షించుకోడానిక్కదా మనమీ భూలోక…
పూర్తిగా »

దేవుడి పాలన

దేవుడి పాలన

‘దేవుడి పాలన’.. ‘దేవుడి పాలన’ అంటూ అంతా అలా ఊదరగొట్టే సజ్జేగానీ.. ఆ పాలించే దేవుడుగారెవరో ఇతమిత్థంగా ఎవరూ తేల్చిచెప్పరు! ఎందుచేతనంటావ్ బాబాయ్!’
‘నీ ద్యాసీ పొద్దు దేవుడిగారిమీదకు మళ్లిందేరా! వివరాలేమన్నా తెలిస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యమేదన్నా వేసేద్దామన్న దుర్భుద్ధయితే కాదుగదా!’
పూర్తిగా »

చదివినోడికన్నా..!

చదివినోడికన్నా..!

‘సిగ్మా.. సిక్స్’ పేరు విన్నావురా?’

‘నగ్మా పేరు వింటున్నాం.. ఈ సిగ్మా.. నో ఐడియా బాబాయ్!”అనుకున్నాన్లేరా! సిగ్మా అనంగానే కనీసం నీకు సిగ్మండ్ ఫ్రాయిడ్ అయినా గుర్తుకొచ్చుండాల్సింది! ఏం చదువులో ఏంటో!.. ప్చ్ఁ!’విషయం చెప్పు బాబాయ్.. చంపక! ఇంతకూ నీ క్లాసు పీకుడు ఇప్పుడు సిగ్మండు ఫ్రాయిడ్ని గురించా?.. నగ్మా రాజకీయాల్ని గురించా?”రెండూ కాదబ్బీ! చిన్నప్పటి మా ఊరి తిప్పడ్ని గురించి!”తిప్పడ్ని గురించి చెప్పుకోడానికి ఏముంటుందబ్బా! సరే! కానీయ్! లింకుల్లేకుండా నువ్వే డొంకా కదలించవుగా!’

‘ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీ నేషనల్ కంపెనీలెన్నో ‘ఎర్రర్ ఫ్రీ’ ఆపరేషన్స్ కోసమని బిలియన్సాఫ్ డాలర్స్ మనీ ధారపోస్తున్నాయ్! అయినా ఎక్కడో కోటికో తప్పయినా దొర్లక తప్పడం లేదు!’


పూర్తిగా »

సంక్రాంతి సంబరాల్లో.. శంకరం పెళ్లి

సంక్రాంతి సంబరాల్లో..  శంకరం పెళ్లి


‘సంకురుమయ్య ఈ సంక్రంతికి ఏమెక్కి వచ్చాడంకుల్?’ అని అడిగాడు శంకరం.’విమానాలెక్కయితే రావట్లేదురా! ప్రధానితో పోటీ. తట్టుకోలేక పోయుంటాడు పాపం.. సంక్రాంతి పురుషుడు!’ అంటూ పంచ్ ఒహటి విసిరేసారు.. మా వారు పంచాంగం చూసుకొంటూ కూడా!

శంకరం అంటే మా ఆడపడుచుగారి పెద్దబ్బాయి. పదహారణాల తెలుగు బాలుడు. ‘ఒహ అణా తక్కువైనా ఫరవాలేదు.. వయినమయిన తెలుగు పిల్లే కావాల’న్న పీకులాట పిల్లోడికి.. వాడి తల్లికి!

‘పెద్ద పండుగయ్యే లోపల పిల్లనెతుక్కురమ్మ’ని పిల్లాడిని ఇండియామీదకు తోలింది ఆ అమెరికా తెలుగుతల్లి.

పిల్లోడి వరాన్వేషణలో ఓ మజిలీ మా ఇల్లు ఈ సారి పండక్కి!

‘సంక్రాంతి అంటే నాకు మహా ఇష్టం ఆంటీ! భోగిమంటలు, భోగిపళ్ళు,…
పూర్తిగా »