నీరెండ మెరుపు

కవిత్వం కేవలం కొన్ని వాక్యాల కూర్పు మాత్రమే కాదు. అదొక అనుభవం! మనలోపల మనకే తెలియని ఒక చీకటి కోణాన్ని వెలిగించే దీపం. ఆ దీపం మీలో ఎలా వెలిగిందో, ఏమేం వెలిగించిందో ఈ శీర్షికలో ఆ వెలుగుని పంచుకోండి. నీరెండ మెరుపు …ఎంచక్కని కవితల పరిచయం. ఈ శీర్షికకు ఎవరయినా రాయవచ్చు.

The Cow

ఫిబ్రవరి-2014


The Cow

ఈ మలయాళీ కవిత చదువుతుంటే మనకు నవ్వుగా అనిపించినా, కవి చూపిన చమత్కారం అందులోనే ఉంది. ఇందులో చాలా సున్నితమూ, సునిశితమూ అయిన విమర్శ ఉంది. ఆవుని ఒక ఆసరాచేసుకుని కవి సమాజాన్నీ, అందులో భాగస్వాములమైన మనలనందరినీ ఎంతఘాటుగా విమర్శిస్తున్నాడో గమనించండి.

మనందరికీ స్వాతంత్ర్యమంటే ఇష్టమే. వీరావేశముకూడా ఎత్తుతూంటుంది ఏడాదికి రెండుసార్లో మూడు సార్లో. మన ఆలోచనల్లో ఈ దేశానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి మనం కొన్ని వేల పథకాలు రచించి ఉంటాము కూడా. కానీ, మన స్వతంత్రేఛ్చకూడా పైన చెప్పిన ఆవు లాగే బంధనాలను ఎలాగైనా ఛేదించుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది. మనం ఒకటిరెండు చిన్నపాటి ప్రయత్నాలు చేస్తాము. అదికూడా కాసేపే. వద్దన్న పని చెయ్యడం, ఒకరు…
పూర్తిగా »

చివరికేం మిగలదు!

చివరికేం మిగలదు!

మొన్నీమధ్య సారంగలో ఆర్. ఎం. ఉమామహేశ్వరరావుగారి వ్యాసం చదువుతున్నప్పుడు మధ్యలో ఆయన ప్రస్తావించిన వజీర్ రెహ్మాన్ కవిత నన్ను ఆకర్షించింది. ఆ కవిత పూర్తిపాఠం కావాలని కోరగానే సహృదయతో ఆయన పంపించారు. నాకు సాహిత్యంతో ఏకాంతసేవ చెయ్యడం ఇష్టం అవడంతో చాలామంది కవుల కవిత్వం చదవలేదు. ఈ కవిత చదివిన తర్వాత ఒక మంచి కవిని చదవలేదే అని బాధపడిన మాట వాస్తవం.

కవితలోకి వస్తే, వస్తువులో కొత్తదనం లేదు… ‘అంతా శూన్యం చివరకి ఏదీ మిగలదు’ అని ఇంతకుముందు చాలా మంది చెప్పిన విషయమే. ఆ మాటకొస్తే, మనం ఇంతవరకు వచ్చిన సాహిత్యాన్ని పూర్తిగా చదవలేము గాని, వస్తువువిషయంలో, శ్రీశ్రీ చెప్పినట్టు “ఎప్పుడో ఒకప్పుడు…
పూర్తిగా »

జిన్నీ భూతం

డిసెంబర్ 2013


జిన్నీ భూతం

ఈ మధ్య నేను చదివిన కొన్ని మంచి కవితల్లో కత్తి మహేష్ కుమార్ గారి నా జిన్నీ భూతం ఒకటి. పైకి ఒక వ్యసనానికి బానిస అయిన వ్యక్తి, యథాప్రకారం, తాగిన తర్వాత, అంతర్ముఖుడై, చేసిన తాత్త్విక వివేచనలా బయటకి కనిపిస్తుంది. గడుసైన కవులు చేసే కొన్ని చిలిపి ప్రయోగాల్లో ఇదొకటి. కానీ, ఈ కవిత సందేశం వేరే అని నాకు అనిపిస్తుంది.

“నన్ను నేను సీసాలోకి ఒంపుకుని, బిరడా బిగించి, టై కాప్స్యూల్ లో పడేసుకున్నాను.”
ఈ ఎత్తుగడ ఒకసారి గమనించండి. మనిషికి వాడి విశ్వాసాలను మించిన మత్తు మందు మరొకటి ఉండదు. అది వ్యక్తి Comfort Zone. మనందరమూ, ఏ మినహాయింపులూ…
పూర్తిగా »

వెళ్ళిపోయిన ఒక క్షణం గురించి

నవంబర్ 2013


వెళ్ళిపోయిన ఒక క్షణం గురించి

వీడ్కోలు తరవాత
*************

వొక వంతెన మీంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె
ఇంకో పూవుని తన మెత్తని చేతులతో తాకినట్టు
ఇంకో రెమ్మని ఎరుపెక్కిన తన చెంపకి ఆనించుకున్నట్టు-
వొక వసంతంలో మునిగి తేలుతుంది వంతెన
తానే వొక పూవై,
ఆకుపచ్చ రెమ్మయి-
ఆ వంతెన దాటాక
వొక్క క్షణం ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది
చకచకా వెళ్ళిపోతుంది తన దారిన తానై!
ఆమె చూపుని తన వొంటి మీద వలయంలా చుట్టేసుకుని
ఆ వలయమ్మీద ఆకాశాన్ని కప్పేసుకుని
ఇక్కడితో జీవితం అంతమైతే చాలని
మొండికేసి…
పూర్తిగా »

రాఘవరెడ్డి కవిత్వం

రాఘవరెడ్డి కవిత్వం

పాఠం చెబుతున్నాను

ఇప్పుడేం … పదేళ్ల నుంచీ చెబుతూనే ఉన్నాను
నిజమే … కాస్త ఎర్రగానే చెబుతున్నాను
విద్యార్థి ఇంజనీరో డాక్టరో ఇంకేదో అవ్వాలంటాడు
కానీ మొదట అతను మనిషి కావాలి గదా -
మరి ఎర్రగా కాక ఇంకెలా చెప్పను …
జీవితం గురించి కాక దేనిగురించి చెప్పను …
దారుల గురించి చెప్పొద్దూ …
ఏ దారి ఎక్కడికెళ్తుందో తెలపొద్దూ …
ఎవరు ఏ దారిని ఎందుకు వేశారో అవగతమైతేనే గదా
తను వెళ్లాల్సిన దారిని వెదికి పట్టుకోగలడు –
నీ కోసం…
పూర్తిగా »

కావేరి కోసం బెంగటిల్లిన కొన్ని వాక్యాలు…

కావేరి కోసం బెంగటిల్లిన కొన్ని వాక్యాలు…

నీటికీ మనిషికీ ఏదో అనుబంధం ఉందని అనుకుంటాను… బహుశా తొమ్మిదినెలలపాటు ఉమ్మనీటిలో తేలుతూ ఉండబట్టేమో… సముద్రాన్ని చూసినా, అనంతమైన నీటిప్రవాహాల్ని చూసినా, వేసవిలో చిక్కి సగమైన నదుల్ని చూసినా కవులుకానివాళ్లకి కూడ ఏదో చెప్పాలన్న మాట గుండెలో కొట్టాడుతుంది. ఇక కవులైనవాళ్ళ సంగతి చెప్పక్కరలేదు కదా!

వాళ్ళు నీటిప్రవాహాన్ని ఎన్నిరకాలప్రతీకగా వాడొచ్చో అన్నిరకాలుగా బాహిరంతరప్రతీకగా వాడి కవితకి కొత్త అందాలు కూరుస్తారు. అదిగో సరిగ్గా అలాంటికవితే అఫ్సర్ రాసిన “కావేరి వొడ్డున”.

మీరెప్పుడైనా అనుభూతిచెందేరో లేదో తెలీదుగాని, నాకు సముద్రపుటొడ్డున కూర్చున్నా, నదీతీరంలో కూర్చున్నా, భూమిఉపరితలం అంచున కూర్చున్న అనుభూతి కలుగుతుంది (అది ప్రతిక్షణమూ నిజమే అయినా మిగతా సందర్భాల్లో ఆ తలపు ఉండదు). ఒక్కోసారి…
పూర్తిగా »

సజీవ కవిత్వం

సజీవ కవిత్వం

పొట్టిదానా అన్నాను హేళనగా,
భావం పిడిబాకై పొడిచేసింది.

ఎప్పుడో చాలకాలం క్రిందట రాసుకున్న వాక్యాలివి. అంతగా దూసుకుపోయే కవితలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్. అలా నాకు కన్పించిన రెండు కవితలు ఒకే కవివి కావడం ఇంకో విశేషం గా చెప్పుకోవచ్చు. అవి పి.రామకృష్ణ గారి, భగవాన్ ఉవాచ, ఎప్పట్లాగే.

రెండవకవిత “ఎప్పట్లాగే ‘” చదవగానే ఇంత ఆలోచనత్మకంగా, ఇంత సులభంగా చిన్న ఘటనను కవితగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. అరే, ఇలా మనం రాయలేకపోయామే అనిపిస్తుంది కూడా.

బడిపిల్లల పాఠ్యపుస్తకాలలో ఉంచదగిన కవిత ఇది నా దృష్టిలో. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అన్న సామెత గుర్తుకొస్తుంది. ఒక చిన్న సంఘటనను,…
పూర్తిగా »

వర్షం…నీటి దారాల కండె

వర్షం…నీటి దారాల కండె

చాలా కాలం క్రితం చదివిన తుమ్మల దేవరావు గారి ఈ కవిత చాలాసార్లు నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇందులో వున్న పదచిత్రాలు నన్ను బాగా అకర్షించాయి.

వర్షానికి నిర్వచనాలు, సూత్రీకరణలు, కొన్ని చిత్రాలు, అనుభూతి చెందడం ఎలా!, వాటివెనుక కొన్ని జ్ఞాపకాలు కన్పిస్తాయి. బీద ధనిక, గుడిసెలపైన భవంతులపైనా వకేలా కురుస్తుందని చెప్తూ

“వర్షం ఒక సమతా సూత్రం
భూమిని ఆకాశాన్ని కలిపి కుట్టే నీటి దారాల కండె”

ఆకాశానికి భూమికి మధ్య వున్న వేలకిలోమీటర్లను లెక్కిస్తున్న శాస్త్రపరిజ్ఞాన్ని చాలా సులువుగా సూత్రీకరిస్తున్నట్టు కన్పిస్తుంది. సమాంతరంగా వుండే రెండిటినీ కలిపి వుంచడానికి కలిపికుట్టే దారపుకండె అని ప్రతిపాదిస్తాడు.
మన నిత్యజీవితంలో దారం జీవన…
పూర్తిగా »

ఈ గోదావరి పద్యం నాదే, నాదే!

ఈ గోదావరి పద్యం నాదే, నాదే!

నది మీద పద్యం ఎవరికిష్టం వుండదనీ!

ప్రతి కవి ఎప్పుడో ఏదో ఒక నది చుట్టూ అందంగా అక్షరాల చేతులు వేసి ఏదో ఒకటి రాసే వుంటారు కదా! నది తీరాన్ని ప్రేయసి లేదా ప్రియుడి  చెంపల కన్నా అందంగా ముద్దాడే వుంటారు కదా! ఇస్మాయిల్ గారు గోదావరి మీద రాసిన ఈ పద్యాన్ని నేను ఎన్ని సార్లు ఇష్టంగా చదువుకున్నానో గుర్తే లేదు. ఆయనకెంతో ఇష్టమయిన ఈ గోదారిని నిజంగా నేను ఒక్క సారే చూశాను.  ఆ ఒక్క సారీ  పనిమాలా ఈ గోదావరి పద్యం తీసుకు వెళ్ళి ఒక స్నేహితురాలికి పైకే వినిపిస్తే కవిత్వమేమిటో తెలియని ఆ స్నేహితురాలు ఎంత ముచ్చటపడిందో చెప్పలేను.


పూర్తిగా »

ఒక అనుభూతి గీతం

ఒక అనుభూతి గీతం

అనుభవాల్లో సారూప్యత లేని ఇద్దరు వ్యక్తుల మధ్య భాష నిరర్ధకమే. కవిత్వం కూడా ఒక విధమైన భాషే. అందుకే సంవత్సరాల తరబడి అర్ధం కాని కవితలు కూడా, ఏదో క్షణంలో చటుక్కున అర్ధమౌతాయి ఒక మెరుపు మెరిసినట్టు. ఆ క్షణంలో పాఠకుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అక్కడ కవిత మారలేదు. మారింది పాఠకుడు. పెరిగింది అతని అనుభవ విస్తృతి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అనుభూతి గీతాలు అంతకు ముందు ఎన్ని సార్లో చదివినా, ఈ కవిత చదివినట్టే గుర్తులేదు. కానీ తర్వాత 2005 లో మా నాన్న గారి మరణం తర్వాత మళ్ళీ ఏదో సందర్భంలో అనుభూతి గీతాలు చదవడం తటస్థించింది. అప్పుడు…
పూర్తిగా »