సంపాదకీయం

సెలవు

మార్చి 2018


వాకిలికి ఈ నెల నుండి విరామం ప్రకటిస్తున్నాం. మీ అందరి సహకారం వల్లనే ఈ ఐదేళ్ళలో వాకిలి ఒక నమ్మకమైన రచయితల బృందాన్ని, వైవిధ్యాన్ని ఆదరించే ఒక మంచి పాఠక బృందాన్ని ఏర్పరచుకోగలిగింది. వాకిలిని కొనసాగించలేకపోతున్నామే అన్న దిగులైతే చాలా ఉంది కానీ మళ్ళీ ఎప్పటికైనా ఈ వాకిట్లోకి తిరిగిరాకపోతామా అన్న నమ్మకం కూడా లేకపోలేదు. పత్రికలో ఇప్పటివరకు ప్రచురించబడిన రచనలు ఇక్కడే పదిలంగా అందరికి అందుబాటులో ఉంటాయి.

వాకిలిని ఆదరించిన మీకందరికీ ధన్యవాదాలతో…

సెలవు.

వాకిలి సంపాదక బృందం


పూర్తిగా »

వాకిలి ఇకనుండి వారానికోసారి

జనవరి 2018


మొన్నటి డిసెంబర్ సంచికతో వాకిలికి ఐదేళ్ళు నిండాయి. ఒక మిత్రుడు చెప్పినట్టు ఇక వాకిలికి బాలారిష్టాలన్నీ తీరిపోయినట్టే లెక్క.

ప్రధాన స్రవంతికి చెందిన అచ్చుపత్రికల్లో సమకాలీన సాహిత్యం కనుమరుగవుతుడటం వలన వెబ్ పత్రికలమీద మరింత భారం పెరిగిపోతున్న సందర్భం ఇది. అచ్చు పత్రికలకున్న పరిమితులవల్ల కావొచ్చు, వ్యాపార ధోరణి వల్ల కావొచ్చు, ఇప్పుడు సాహిత్యం సింగిల్ పేజీకి మాత్రమే పరిమితమయింది, అదీ వారానికి ఒక్కపేజీకి మాత్రమే! దీనివల్ల, సీరియస్ సాహిత్యాన్ని ఆశించే పాఠకులకు నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడేర్పడుతున్న సీరియస్ సాహిత్యపు ఖాళీని పూరించడానికి, స్థలపరిమితుల్ని, భావపరిమితుల్ని దాటుకుని వాకిలి తనవంతు బాధ్యత తను నిర్వహిస్తుంది. ఇక ముందు కూడా నిర్వహించబోతోంది.

ఒక పత్రికను…
పూర్తిగా »

కొత్త శీర్షికలు

ఫిబ్రవరి 2017


వేలపూల సుగంధాల్ని మరిపించే సువాసన వానది. వానెప్పుడూ జ్ఞాపకాలుగా ముసురుకుని, కథలు కథలుగా కురిసి మరిచిపోలేని అనుభూతుల్ని మిగిల్చి వెళ్తుంది. ఉడుకుతున్న అన్నం వాసనేమో అచ్చం అమ్మ పిలుపులా ఒంట్లో ఉన్న ప్రతీ కణాన్ని పులకరింపజేస్తుంది. మంచి పాట కూడా అంతే, మన లోలోకి ఇంకి, రక్తంతో దోస్తీ చేస్తూ మనతో పాటే ఉండి పోతుంది.

మరి పుస్తకం?! దీంది కూడా వాన, అన్నం, పాటల పోకడే. వీటి పోకడ ఏమిటంటే… రాకడే! అవి వచ్చాక వెళ్ళే ప్రసక్తి ఉండదు. మరిచిపోవడమంటూ జరగదు. మనం ఏదైనా పుస్తకం నడుమ్మీద చెయ్యేసి ఒళ్లోకి తీసుకున్నప్పుడు అదొక్కటే రాకుండా దాంతో పాటు కొన్ని జ్ఞాపకాల్ని కూడా మనవొళ్లోకి లాగుతుంది.…
పూర్తిగా »

ఐదో అడుగు

జనవరి 2017


ఐదో అడుగు

నాలుగడుగులు వేసామంటే నమ్మబుద్ధి కావడం లేదు. నాలుగడుగులే మైలురాయి కాకపోవచ్చు కానీ, వెనక్కి చూసుకుంటే వెయ్యికిపైనే (1250) ప్రచురించిన రచనలు తలలూపుతూ కనిపిస్తున్నాయి. ఆ రచనల వెనకున్న మూడువందలకు పైగా రచయితలూ చేతులూపుతూ కనిపిస్తున్నారు. పత్రికమెడలో సగర్వంగా ఊగుతున్న సంపాదకహారం ఒక్కటేకాదు, పత్రిక వెనక నిలబడి పనిచేస్తున్న సాహితీమిత్రులు, రచయితల సహకారం వల్లనే వాకిలి ఈ నాలుగేళ్ళు ఇలా నిలదొక్కుకోగల్గింది.
ప్రతీ నెల వాకిలిని ఇష్టంగా తెరిచి, చదివి, రచనలపై స్పందన తెలియజేస్తూ, మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్న పాఠకులకి ధన్యవాదాలు. మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తున్నాం.
పూర్తిగా »

వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 2016


వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సరిగ్గా మూడేళ్ల క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి ఈరోజు సగర్వంగా 36 సాహిత్యపుటడుగులు వేసి మీ ముందు నిలబడింది. పాఠకరచయిత(త్రు)ల ఆదరణవల్లే వాకిలి ఈ మూడేళ్ల మైలురాయి అనాయాసంగా దాటగల్గింది. మీరు పంచిన ప్రేమ, మీనుంచి లభించిన స్పందన, మీ ప్రోత్సాహం కారణంగానే ఈరోజు వాకిలి ఇలా విస్తరించింది.

మాకు తెలీకుండా పత్రిక నిర్వహణలో ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు, ప్రచురణల్లో నిర్లక్ష్యాలు దొర్లి ఉండవచ్చు, అప్పుడప్పుడు పాఠకుల మనోభావాలు దెబ్బతీసే రచనలూ ప్రచురించి ఉండవచ్చు. ఈ సందర్భాలన్నింట్లో మమ్ముల్ని అర్ధం చేసుకుంటూ, మాతో పేచీ పడుతూ, రాజీకొస్తూ… మళ్ళీ నెల తిరగ్గానే అన్నీ మరిచిపోయి వాకిలిని ఇష్టంగా తెరిచి చూస్తూ ఎంతో…
పూర్తిగా »

రాత బల్ల

రాత బల్ల

ఒళ్లో పలక పెట్టుకుని మెడ బాగా ముందుకు వంచి మొదటిసారి అ ఆ లు దిద్దడం గుర్తుందా? పోనీ- కూర్చోడానికే బెంచీల్లేని పల్లెటూరి బడినుండి, రాసుకోడానిక్కూడా డెస్కులున్న హైస్కూల్లో చేరిన రోజు? ఆ రాత బల్ల మీద ఫస్టు ఫస్టు తెలుగు సీడబల్యూ పుస్తకంపై పేర్రాసుకుని శ్రీరామ రాసుకుని పెద్దోళ్ళమయ్యామని ఫోజివ్వడం?

ఏదెట్లా ఉన్నా పుస్తకాన్నట్లా నేలమీద పడేసి మోకాళ్ళు వెనక్కి మడిచి కూచుని రాసుకోవడమే బాగుంటుంది కాస్త పెద్దయ్యే వరకు. పొడుగు చేతుల కుర్చీలో అడ్డంగా పెద్ద చెక్క అట్ట పెట్టుకుని దానిపైన సకల పుస్తకసామాగ్రీ వేసుకుని రుబ్బడం, మధ్యలో మంచినీళ్ళకి లేవాలంటే ఆ అట్టమీది ప్రపంచాన్ని ఎక్కడ దించాలో…
పూర్తిగా »

పత్రికలకి పంపించండి..

పత్రికలకి పంపించండి..

కనీకనిపించని దూరంలో ముడుచుకున్న మొగ్గలా కూచునుంటుంది.

కవ్విస్తుంది. ప్రేమగా లోనికి లాక్కున్నట్టే లాక్కుని విసిరి కొడుతుంది. మాట్లాడినట్టే మాట్లాడి అలిగి కూర్చుంటుంది.

దగ్గరికెల్తావు. బుజ్జగిస్తావు. నవ్విస్తావు. నవ్వుతావు. అర్థం చేసుకుంటావు. అపార్థం చేసుకుంటావు. హత్తుకుంటావు. విసుక్కుంటావు. ఆఖరికి భోరు.. భోరుమని ఏడుస్తావు. సూర్యమండలాలు యానిస్తూ, అందని హై ఫ్రీక్వెన్సీని కూడా ట్యూన్ చేసుకుని ఆలోచిస్తావు. చివరికి ఎట్లాగైతేనేం ఆ శతకోటి పెటల్స్ ఉన్న అందమైన పూవుని ఆసాంతం విప్పి ఆ సువాసనల్ని అనువదించి కాయితమ్మీద పెడతావు.

చదివి చూసుకుంటావు. పొంగి, పొర్లిపోతావు, మురిసి, ముసిరింతై, కరిగి, ఆవిరై తేలిపోతావు. అబ్బబ్బబ్బ… ఇంత అందమైన పీస్ ఇంతవరకు ఎవరూ రాసుండరు అనుకుంటావు.

ఎక్కడికి…
పూర్తిగా »

ఇంతకీ- ఎందుకనీ రాయడం?

ఇంతకీ- ఎందుకనీ రాయడం?

ఎందుకు రాస్తావు?

“ఎప్పుడూ కాదుకానీ, ఎప్పుడో ఒకసారి, అదెప్పుడో ఎందుకో ఇంకా సరిగ్గా తెలీదు. ఏదో ఆరాటం మొదలౌతుంది. ఎక్కడా తిన్నగా ఉండనీదు, చేస్తున్న పనేంటో అర్థం కాదు. అప్పుడొకటే దారి. వీలు చేసుకుని ఎక్కడోచోట కూర్చుని ఉన్న ఫళాన రాసెయ్యాలి. హమ్మయ్య! రాసేస్తానా, అప్పుడు కాస్త ఊపిరాడటం మొదలౌతుంది.”

మరి నీసంగతి?

“ఏదైనా కష్టమొస్తుంది కదా. చాలా పెద్ద విషాదం ఒక్కోసారి. బాగా బాధేస్తుంది. ఏడ్చినా, ఎవరితో చెప్పుకున్నా తీరదు. ఆ తీవ్రత, విషాదపు లోతు ఉన్నదున్నట్టు బయటికి పంపాలంటే రాసుకోడం తప్ప వేరే దారి లేదు.”

సరే- ఇంకా ఎప్పుడెప్పుడు?

“ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. ఒక అన్యాయం, ఒక మూర్ఖత్వం, ఒక…
పూర్తిగా »

బాస్! కొత్తగా ఏమైనా ఉందా?

బాస్! కొత్తగా ఏమైనా ఉందా?

“బాగా రాయడానికి బాగా చదవక్కర్లేదు. ఏమంటావ్?”
“రైటే కానీ. ఏం రాయక్కర్లేదో తెలుసుకోడానికి అల్రెడీ ఎవరేం రాశారో చదవాలేమో!”
“పాయింటే! ఇంకోటేంటంటే- చాలామంది చాలా సార్లు చెప్పేశారని తెలిసిన విషయం తప్ప, కొత్తగా చెప్పడానికేం లేకపోతే…”
“అహహ, కనీసం పాతదాన్నైనా కొత్తమాటల్లో, మరోవైపు నుండి చెప్పలేకపోతే..”
“…”
ష్.. ఎవర్రా అక్కడ?పాడిందే పాట.. షటప్ ఐ సే.

***

ఉదాహరణకి ఒక కథ ఇలా మొదలౌతుంది “చీకట్లని చీల్చుకుంటూ స్టేషన్లో రైలొచ్చి ఆగింది.” నిజానికి చాలా కథలు ఇలానే మొదలౌతాయి, అక్కడికీ రైళ్ళు చెయ్యవలసిన అసలు పని చీకట్లను చీల్చడమే అన్నట్టు. లేకపోతే “అలారం మోతకి…
పూర్తిగా »

Writer’s block

నవంబర్ 2014


Writer’s block

టేబుల్ మీద తెల్లకాయితం బోసిపోయి నెల రోజుల నుంచి అట్లాగే రెపరెపలాడుతుంది. డెస్క్ టాప్ మీద draft.docx, పదాలు వలసపోయిన ఖాళీ పోయెంలా పడుంది. ఎప్పుడూ రింగురింగులుగా నీ చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పి, ఆలోచనకి ఓ రూపాన్నిచ్చి, పదాల పరదాలవెనక నవ్వుతూ ఫెడ్ అయ్యే సిగరెట్ పొగ, ఇప్పుడు ఏ ఆకారమూ లేని పొగ మంచులా ఏటవాలు కిరణానికి ఉరేసుకుంటుంది. ఒడ్డున పొద్దున్నే బయల్దేరాల్సిన Inspiration బొట్ చిల్లుపడి చల్లటి నీళ్ళను చిమ్ముతుంది. ఆలోచనలు గడ్డకట్టి నరాలు చిట్లిపోతున్నాయి. చిన్న చీమంత ఫాంట్ సైజుతో మొదలైన ఆ రెండు పదాలు ఏనుగంత ఎదిగి పెనుభూతమై కౌగిలించుకుంటున్నాయి.

“writer’s block”

“writer’s block” “writer’s…
పూర్తిగా »