‘వాకిలి’ ముఖ్య లక్ష్యం ఉత్తమ స్థాయిలో వుండే సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రోత్సహించడం! స్నేహపూర్వకమయిన/ ఆరోగ్యకరమయిన సాహిత్య బంధాల్ని నిర్మించడం!
వాకిలి సాహిత్య మాస పత్రిక ప్రతినెలా 1 న మీ ముందు వుంటుంది. మీ రచనలు ప్రతి నెలా 15 వ తేదీకల్లా పంపండి.
మీ రచన పంపే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేసుకోండి. మీరు రచన పంపిన వెంటనే మేము ఆ రచనని పీర్ రెవ్యూకి పంపిస్తాం. కొన్ని సూచనలు ఇస్తాం. ఆ సూచనల మేరకు మీరు మీ రచనని తిరిగి మార్చవలసి వుంటుంది. కాబట్టి, మార్పులూ చేర్పులకు మీరు సిద్ధంగా వుండండి.
అలాగే, ‘వాకిలి’లో ప్రచురితమయిన ప్రతి రచన పైనా మీరు కేవలం ప్రశంసలే కాదు, సునిశితమయిన/ అర్థవంతమయిన విమర్శ కూడా చేయండి. రచయితల్ని మీరు మీ సన్నిహిత మిత్రులుగా భావించి, మీ ఆలోచనలు నిస్సంకోచంగా పంచుకోండి.
హెచ్చరిక: ‘విమర్శని స్వీకరించలేని కవులూ రచయితలూ ’వాకిలి’కి అక్షరమ్ముక్క కూడా రాయక్కరలేదు!
రచనలు పంపే పద్ధతి:
వాకిలి కోసం మీ రచనలు యూనికోడ్ లో టైప్ చేసి vaakili.editor@gmail.com ఈమెయిలుకు పంపగలరు. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా కూడా పంపవచ్చు.
మరికొన్ని ముఖ్య గమనికలు:
•గతంలో ప్రచురించబడిన, లేదా వేరే పత్రికలలో ప్రస్తుతం ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు ప్రచురణకి స్వీకరించబడవు.
•స్వంత బ్లాగులలోగాని వెబ్ పత్రికలలోగాని ప్రచురించబడిన రచనలు కూడా వాకిలిలో ప్రచురించబడవు.
•రచనలు తమ స్వంతమనీ, గతంలో ఎక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేవనీ రచయితలు వాకిలికి హామీ పత్రం ఇవ్వాలి.
•రచనలను ప్రచురణకు స్వీకరించే విషయంలో తుది నిర్ణయం వాకిలిదే.
•వాకిలిలో ప్రచురింపబడిన రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. అయితే, రచయితలు తమ రచనలను వేరే వెబ్ పత్రికలలో లేదా పేస్ బుక్ గ్రూపుల్లో మళ్ళీ ప్రచురింపదల్చుకుంటే, రచనలోని కొన్ని భాగాలు మాత్రమే ఉటంకిస్తూ, వాకిలిలో పూర్తి రచనకి లింకు జతచేయాలి. మీ స్వంత బ్లాగులో మాత్రం వాకిలిలో ప్రచురింపబడిన ఒక రోజు తర్వాత పూర్తి రచన తిరిగి ప్రచురించుకోవచ్చు.
వాకిలిలో ప్రచురించిన రచనలు మరియు వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆయా రచయితలవే కాని వాకిలివి కాదు. ఆయా రచనలపై పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయాలే కాని అందులో వాకిలికి ఎటువంటి సంబంధము లేదు.
రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా vaakili.editor@gmail.com ఈమెయిల్ అడ్రస్‌కు మీ ప్రశ్నలు పంపించండి. సాధ్యమైనంత త్వరలో మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.
—————————————————————————————-
సమీక్ష కోసం పంపించండి:
వాకిలి సమీక్ష కోసం ఇటీవల అచ్చయిన మీ కవితా, కథా సంపుటాలు, నవలలు ఏవైనా ఈ క్రిందిచిరునామాకు పంపండి. అచ్చు ప్రతులకు బదులుగా పిడిఎఫ్ ఫైల్ కూడా ఈమెయిలు ద్వారా పంపించవచ్చు.
Email Address:
vaakili.editor@gmail.com
Hyderabad Address:
VAAKILI
8-415/89, SAPTAGIRI COLONY
Miyapur, Hyderabad-49
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్