వ్యాసాలు

ఆదిలో ఒక పద్య పాదం

నా అభిమాన విషయం వచన కవిత్వమే గాని, ఈ వ్యాసంలో పద్య కవిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు ముచ్చటిస్తాను. తొంభైల్లో అనుకుంటా ఒకసారి పద్యం విషయంలో వచన కవులకి, పద్య కవులకి మధ్య వివాదం నడిచిన సందర్భంలో. చేకూరి రామారావు గారు ఇద్దరికీ సర్దిచెప్పబోయి, ఇరువర్గాల ఆగ్రహానికీ గురయ్యారు. అప్పుడు మిత్రులాయనకి సరదాగా “ఉభయ కవి శత్రువు” అనే బిరుదు నిచ్చారు. అందువల్ల, అటువంటి ప్రయత్నమేదీ ఇక్కడ చెయ్యటం లేదు. వచన కవుల దృష్ట్యా పద్య కవిత్వాన్ని వివరించటం, ఛందోబద్ధమైన పద్య రచనాభ్యాసం, ఆసక్తి వచన కవులకెలా ఉపయోగపడుతుందనే విషయం పరిశీంచటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

ఏ విద్యయినా మొదట్లో కొన్ని నియమ నిబంధనలకి లోబడి…
పూర్తిగా »

తెలుగు కథలు, స.ప.స.లు

తెలుగులో మంచికథలు రావట్లేదని ఈమధ్య తరచుగా వింటున్నాం, చదువుతున్నాం. అయితే, ఈ “మంచి” అన్న విశేషణం గూర్చి పెద్దగా చర్చ జరగలేదు. పైగా, “మంచికథలు రావట్లేదు” అని మొదలయ్యే వ్యాసాలు రెండో వాక్యంలోనే చెహోవ్ ఇలా అన్నాడనో, లేదా గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అలా అన్నాడనో తరచుగా చూస్తుంటాం కూడా. ఈ వ్యాసకర్తలకు సాటి తెలుగువాళ్లు గానీ లేక భారతీయులు గానీ మంచికథ గూర్చి ఏమన్నారో తెలియదో లేక తెలుసుకోవాలని అనిపించదో అర్థంకాని విషయం. అయితే, తెలుగులో మూసకథలు కొల్లలుగా వస్తున్నాయనేది మాత్రం పత్రికలే ఒప్పుకునే విషయం. ఆ మధ్య ఆంధ్రభూమి కథలపోటీని నిర్వహిస్తూ, “మాకు మూసకథలు వద్దు!” అని స్పష్టంగా చెప్పినా చివరికి బహుమతికి…
పూర్తిగా »

అవే కథలు ఇంకెన్నాళ్ళు?

నవంబర్ 2017


నాకు పుస్తకాలంటే పిచ్చి ఎప్పుడు ఎలా మొదలయ్యిందో తెలీదు కానీ, జ్ఞాపకాలను తవ్వుకుంటే ఒకటి గుర్తొస్తుంది. నాకు దాదాపు ఎనిమిదేళ్ల వయసున్నపుడు, ఒక చిన్న పల్లెటూళ్ళో ఉండేవాళ్ళం. అక్కడ ఒక డాక్టర్ గారింటి నుండి పత్రికలు తెచ్చుకుని అక్షరం వదలకుండా చదవడం నా మొదటి జ్ఞాపకం. ఈరోజుకి కూడా అందులో ఒక సీరియల్ పేరు “ఇది ఒక పాంథశాల” అని గుర్తుంది. ఆ పేరంటే చెప్పలేనంత మోజు నాకు. రచయిత అంటూ ఒకరుంటారని కూడా తెలీని వయసు కాబట్టి వాళ్ళ పేరూ గుర్తు లేదు.

నా చిన్నప్పుడు నాన్న ఒక హైస్కూల్లో పనిచేసేవారు. అక్కడి లైబ్రరీలో, బొమ్మలతో పురాణ కథల పుస్తకాలూ, పాకెట్ సైజు కథల…
పూర్తిగా »

ప్రబంధరసఝరి

అక్టోబర్ 2017


ప్రబంధరసఝరి

నేడు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో – ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.

తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా…
పూర్తిగా »

మాయా “క్లాసిక్”!

మాయా “క్లాసిక్”!

నేటి మానవ జీవితంలో సినిమా ఒక విడదీయరాని అంతర్భాగం. ఒక దృశ్యం వేయి మాటలకి సమానం అంటారు. సాంకేతిక ప్రగతి అభివృద్ధితో పాటు సినిమా రంగం కూడా పెరిగింది. పలు అంశాలతో కొన్ని వేల సినిమాలు వచ్చుంటాయి ఇప్పటి వరకూ. మిగతా భాషలు మినహాయించి ఒక్క తెలుగులోనే పదివేల పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్ని సినిమాలు గొప్పవి? ఆ సినిమాలు ఎన్ని తరాలకు గుర్తుంటాయి? ఇలాంటి సమాధానం చెప్పాలంటే ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. మంచివి ఎంపిక చెయ్యాలి.

ఎన్నో సినిమాలు వచ్చినా వాటిలో కొన్ని సినిమాలే కాలానికి నిలబడతాయి. కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. సినిమా అనేది సామూహిక సృజన. దర్శకుడూ,…
పూర్తిగా »

పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు

జూన్ 2015


పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు

ఆంగ్ల క్రాస్ వర్డ్ ఆధారాలను, వాటి విశిష్టతను వివరిస్తూ ఈ రచయిత రాసిన వ్యాసం వాకిలి, ఏప్రిల్ 2017 సంచికలో వచ్చింది. ఇప్పుడు, తెలుగు పజిళ్లలోని ఆధారాల గురించి అటువంటి మరొక వ్యాసాన్ని పాఠకుల ముందంచటం జరుగుతున్నది. పాత తెలుగు క్రాస్ వర్డ్ లు అంటే వెంటనే మనసులో మెదిలేవి శ్రీశ్రీ గారి పదబంధ ప్రహేళికలు. అవి ప్రమాణికతతో కూడుకున్నవి కావటమే అందుకు కారణం. తర్వాత ఆరుద్ర గారి పదబంధ ప్రహేళికలు గుర్తుకొస్తాయి. ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో వచ్చిన తెలుగు పజిళ్లను, ‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న పజిళ్లను తర్వాత పేర్కొనవచ్చు. ఇవి కాక, ‘వాకిలి’లో దాదాపు ఇరవై నెలలుగా వస్తున్న ‘నుడి’ ఉండనే…
పూర్తిగా »

‘ద హిందు’ క్రాస్ వర్డ్ పజిళ్లలోని చమత్కార వైవిధ్యం, విస్తృతి, వైచిత్రి

ఏప్రిల్ 2017


‘ద హిందు’ క్రాస్ వర్డ్ పజిళ్లలోని చమత్కార వైవిధ్యం, విస్తృతి, వైచిత్రి

ఈ మధ్య అంతర్జాల పత్రికల్లో క్రాస్ వర్డ్ పజిళ్ల హవా బాగా వీస్తోంది. దీనికి ముఖ్య కారణం పజిల్ ప్రక్రియ పట్ల ఆ సంపాదకులకు గల అమితమైన ఆసక్తే కనుక, వారిని మనమెంతో అభినందించాలి. మామూలు పజిళ్లను ప్రచురించడానికి ఏ పత్రికలైనా ముందుకు వస్తాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. అభినందించవలసిందీ లేదు. కాని, జటిలతను కలిగిన ప్రామాణిక పజిళ్లను వేసుకోవటానికి వ్యాపార పత్రికలు చాలా సందేహిస్తాయి.

నిగూఢ ఆధారాలు (cryptic clues) ఉండే ప్రామాణిక పజిళ్లతో మెదడుకు చాలా వ్యాయామం, తద్వారా మానసికానందం దొరుకుతాయి. భాషను మెరుగు పరచుకునే అవకాశం కూడా వాటి ద్వారా లభిస్తుంది. ప్రామాణిక ఆంగ్లపజిళ్ల లోని పద్ధతులను బాగా పరిశీలించి,…
పూర్తిగా »

మీడియా… సోషల్ మీడియా

మార్చి 2017


మీడియా… సోషల్ మీడియా

ఇవాళ అచ్చు పత్రికలు ఎలా వున్నాయో ఒకసారి చూడరాదూ. తెలుగు నాట ఒక కులానికి, ఆ కులానుకూల రాజకీయాలకు సేవ చేసి తరించేవి కనీసం రెండు పత్రికలున్నాయి. ఇంకో కులానుకూల రాజకీయం కోసం ఒక పత్రిక. మరొకటీ వుంది గాని అది కేవలం న్యూస్ ప్రింటు వ్యాపారి. ఇవి కాకుండా తెలుగు నాట పత్రికలున్నాయా? ఆఁ ఇంకొకటుంది. ఒక కులం వాళ్ల వుద్యోగాల కోసం. ఒకాయన, ఫరినస్టెన్స జగన్ మాట్లాడిందేమిటో తెలుసుకోవాలంటే కనీసం రెండు పత్రికలు చదవాలి. ఒక పత్రికలో ఆయన మాటల్లోని తెలివి తక్కువతనం మాత్రమే వుంటుంది. ఒక పత్రికలో ఆయన మాటల్లోని తెలివితేటలు మాత్రమే వుంటాయి. దానికి తగినట్లు ఫోటోలు, కార్టూన్లు వుంటాయి.
పూర్తిగా »

ప్రబంధరాగలహరి

జనవరి 2017


ప్రబంధరాగలహరి

అన్ని అవ్యక్త రాగాలు పలికించే వరూధిని, ప్ర-వరుని చూచింది. చూచి ఆ ’పంకజ’ముఖి, ఆతని సౌందర్యానికి మోహవిభ్రాంతి చెంది, తన ’అరవిందము’ను పోలిన తన పాదముల అడుగులు తడబడుతుండగా దిగ్గున లేచి ఎదురేగింది. ప్రవరుడికి మాత్రం అవేవీ పట్టలేదు. తనను ఊరికి చేర్చమని ఆమెను ప్రార్థించాడు. ఆవిడ - ఇక లాభం లేదని, ఇదివరకు అవ్యక్తంగా చూపిన అనురాగాన్ని వ్యక్తం చేసింది. ఇన్ని వ్యక్త అవ్యక్త రాగాలు పలికించినా, ఆ ’అరుణాస్పదపురవాసి’ ప్ర-వరుడికి ఆమెను చూడగా ఎదలో అనురాగం ఉదయించలేదు. (ఆస్పదము అంటే - నెలకొను, ఊనిక base అని అర్థం. అరుణాస్పదము - అంటే కావ్యంలో ప్రకరణికార్థంగా ఏ ప్రత్యేకతా లేదు కానీ, వ్యావహారికంగా…
పూర్తిగా »

బౌద్ధానికి పూర్వరంగం

జనవరి 2017


బౌద్ధానికి పూర్వరంగం

క్రీ.పూ. ఆరవ శతాబ్దం మన దేశ తత్వచింతనలో ఒక పెద్ద మైలురాయి. ఆ కాలంలో వైదిక సంస్కృతిని తిరస్కరిస్తూ అనేక నాస్తికవాదాలు, వాటిని ప్రచారం చేసే నాస్తికాచార్యులు బయలుదేరారు. అంతకు మునుపెన్నడు లేని విధంగా ఆ కాలంలోనే ఇన్ని వాదాలు ఎందుకు బయలుదేరాయి? అసలు ఆ కాలంలో సమాజం ఎలా ఉండేది? ఎందుకిన్ని వాదాలు అవసరమైనాయి? అని ఆలోచిస్తే -

హరప్పా నాగరికత తర్వాత భారతదేశంలో భారీ ఎత్తున నగరీకరణ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే జరిగింది. దీనికి ప్రధాన కారణాలు రెండు:

భారీ ఎత్తున ఇనుప పనిముట్లు వాడుకలోకి రావడం. సారవంతమైన గంగా-యమునా నదుల పరివాహకప్రదేశాల్లో ఎక్కువ భూమిని సాగులోకి…
పూర్తిగా »