కొత్త పుస్తకం కబుర్లు

ఈ నెల లో విడుదలవుతున్న పుస్తకాలని పరిచయం చేసే శీర్షిక ఇది. ఈ శీర్షికకు ఎవరయినా రాయవచ్చు. కానీ, ఈ నెలలో విడుదల అయిన పుస్తకాల గురించి మాత్రమే రాయాలి.

ప్రేమ కూడా రాజకీయమేనా?

ఫిబ్రవరి 2018


ప్రేమ కూడా రాజకీయమేనా?

రెండవ దశ స్త్రీవాద ఉద్యమ ప్రభంజన వేళ షులామిత్‌ ఫైర్‌స్టోన్‌ రాసిన ‘ద డయాలెక్టిక్‌ ఆఫ్‌ సెక్స్‌’ అనే సంచలనాత్మక గ్రంథంలోని ‘ప్రేమ’ అనే అధ్యాయానికి అనువాదం ఈ చిన్ని పొత్తం. 1970లో వెలువడిన ఈ పుస్తకంలోని ఈ అధ్యాయం ఇప్పుడెందుకు చదవాలి మనం? అనే ప్రశ్నకు నా దగ్గర రెండు జవాబులున్నాయి. స్త్రీల చైతన్యాన్ని గురించి ఆలోచించే వాళ్ళందరూ ఆ చైతన్యం ఎలా మొలకెత్తి ఊపందుకున్నదీ, ఎంతవరకు ప్రయాణించిందీ తెలుసుకునే సందర్భంగా ఆయా దశల్లో వెలువడి, ఆలోచనలకు పదును పెట్టిన పుస్తకాలను చదవాలి. అవి ఇప్పుడు ప్రాసంగికమా కాదా అనేది పక్కనపెట్టి, ఆ ఆరోహణ క్రమాన్ని అధ్యయనం చేసి ఇప్పటి పరిస్థితుల్లో ఆయా…
పూర్తిగా »

ఎంతెంత దూరం?

ఎంతెంత దూరం?

దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.
పూర్తిగా »

అనుపమ స్వప్నయానం

డిసెంబర్ 2017


అనుపమ స్వప్నయానం

సీసాలో ఓ ఉత్తరముంచి సముద్రంలోకి విసిరేయటం లాంటిది కవిత్వమంటే.

ఆ సీసా అలల పై తేలుతూ ఏ తీరం చేరుతుందో.చరిత్రలో ఎప్పుడూ ఎవరో ఒకరు కవిత్వం రాస్తూనే ఉంటారు. ఓ మారుమూల గ్రామంలో లాంతరు వెలుగులోనో, అనేక అంతస్తుల భవనంలో ఓ ఇరుకు గదిలోనో, ఏడు సముద్రాలకవతల అంతరించిపోయిన తెగ తాలుకు చివరి మనిషో – నిరంతరం ఎవరోఒకరి చేత కవిత్వం రాయబడుతూనే ఉంటుంది. కవి తనకు మాత్రమే సొంతమైన ఒక నిశ్శబ్ధంలో రాసే కవిత్వం చరిత్రగమనంలో ఓ కాలానికే ఉపమానం అవుతుంది. ఓ కాలంలోని మనుషులు రక్తమాంసాలతో అనుభవించిన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఓ కాలపు అస్థిత్వాన్ని నిర్వచిస్తుంది.

కవిత్వం (creative…
పూర్తిగా »

నర్సింగాపురం పిలగాని కతలు

నర్సింగాపురం పిలగాని కతలు

ఇసుకలోంచి కాశెపుల్లను లాగినట్టుగా బాల్యంలోంచి అతని జ్ఞాపకాలను బొట్టుబొట్టుగా వర్తమానంలోకి చేదుతాడు. నా భాష పోయింది, నా యాస పోయింది, నన్ను పల్లెటూరి వాడిగా పరిచయం చేసుకునే ఏ లక్షణమూ లేదని బాధపడతాడు. కొన్ని వస్తువులకు కూడ ప్రాణం ఉంటుందనీ, వాటిని మినహాయించి ‘సాయమాను’నూ, ఇంటినీ ఊహించలేనను కుంటాడు. కడకి మనిషి ప్రేమస్వరూపుడు కావడం ఎంత కష్టభూయిష్టమో చెబుతాడు. ఇక్కడ ఓ సారూప్యం గుర్తుకొస్తుంది. 1840 నాటి రష్యన్‌ నవల ఎమ్‌.లేర్మొంతొవ్‌ ‘మన కాలం వీరుడు’లో కథానాయకుడు పెచోరిన్‌ డైరీలో ఇలా రాసుకున్నాడు: ‘‘నిజంగా చెడు అంత ఆకర్షణీయంగా ఉంటుందా?’’ మన పౌరజీవనంలోని వాస్తవమే 170 ఏళ్ళు పైబడిన తర్వాత కూడ దాదాపు అటువంటి వాక్యంగా…
పూర్తిగా »

రంగుల్లో తడిసిపోదామిలా…

రంగుల్లో తడిసిపోదామిలా…


జీవితమంటేనే రంగుల మయం. ఆ రంగుల్ని గుర్తించి ఒడిసిపట్టుకుని ఆనందాన్నో, విచారాన్నో, తీవ్రమైన వేదననో వ్యక్తపరచగలగడమే కాకుండా, చదువరులకి కూడా తమ జీవితంలో మారుతున్న రంగుల్ని చూసుకోగలిగేలా చెయ్యడం కళాకారుడికే సాధ్యం. ఒక చిత్రకారుడు తన అనుభవాల్నీ, అనుభూతులనీ తనకు నచ్చిన రంగుల్లో ప్రపంచానికి వ్యక్తపరిచినట్టు, కవి అందమైన పదచిత్రాలతో చెబుతాడు. అలా చెప్పాలంటే ఎక్కడో ఓ చోట కాసేపు ఆగాలి. అలా ఆగిన కాస్త సమయంలోనే తనలో విప్పుకుంటున్న పొరల్నీ, కలిగే మార్పుల్నీ చదువరులకి అర్థమయ్యే రీతిలో అందించగలగాలి.

ఈ సంకలనంలో తను గమనిస్తున్న రంగుల్ని మన మీదకి వెదజల్లి మనల్ని మేల్కొల్పుతాడు కవి. సమాజం గురించో, మానవ సంబంధాల గురించో…
పూర్తిగా »

ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ

ఫిబ్రవరి 2017


ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ

గుండె బద్దలు కొట్టుకొని వచ్చిన అక్షరాలకు, రక్తాన్ని అద్దుకొని గర్భం నుండి బయటపడిన అక్షరాలకు తెగువ ఎక్కువ. రాపిడి ఎక్కువ. నీటి తాకిడికి నలిగిపోయి నలిగిపోయి మొరటు రాళ్లు గులక రాళ్లుగా మారిపోయినట్టు విలాసాగరం రవీందర్ అక్షరాలు కూడా ఒక నిప్పును, ఒక దుఃఖపు పుప్పొడిని, చావు చివరి అంచును మోసుకు వస్తాయి. కాలం ఎలా కంపిస్తే అలా ప్రకంపించే కవులు తక్కువ. అందుకు విలాసాగరం రవీందర్ మినహాయింపు. దానికి నిదర్శనం అతడు ఇటీవలే వెలువరించిన ‘నది పలికిన వాక్యం’ కవితా సంపుటి. జీవితపు దిగుడు బావి నుండి ఒక నదిని భుజానికెత్తుకొని వచ్చి మన హృదయపు వాకిట్లో పరవళ్లు తొక్కిస్తాడు. నది ప్రయాణించినంత…
పూర్తిగా »

చేనుగట్టు పియానో

చేనుగట్టు పియానో

కాదేదీ కవిత కనర్హం అన్నారు కాని నిజానికి కాదేదీ కవికి అసాధ్యం అనాలి. చటుక్కున ఒక తెల్లమేఘపు తునకలా మారి గగన సీమల్లో సాగిపోడమో, ఒక నదిలా ప్రవహి౦చి ఎన్ని హృదయ సీమలనో సారవంతం చెయ్యడమో, ఒక హరిత వనమై సేద దీర్చడమో, ఒక అక్షరమై సాధికారంగా దేన్నయినా చెప్పడమో ఒక కవికే సాధ్యం.

ఒకమేఘాన్ని భుజానవేసుకుని వెళ్ళడం, రాత్రి ఏరుకున్న చుక్కలను కొప్పుని౦డా తురుముకుని ఇంద్ర ధనుస్సుల కొ౦గుల్ని బొడ్లో దోపుకుని పొల౦లో అక్షరాల నాటు వెయ్యడం, ఆకాశమూ నెమలీ ఏరువాక పాట అందుకోడమూ.. చేనుగట్టును పియానోగా మార్చుకోడం ప్రసాద మూర్తి ఊహకు పతాకస్థాయి. చేనుగట్టు పియానో మీద అక్షరాలు ప్రసాదమూర్తిగారి ఇచ్చానుసారం…
పూర్తిగా »

ఏకాంతంలో సమూహ వేదనల గానం – రామా చంద్రమౌళి కవిత్వం

ఏకాంతంలో సమూహ వేదనల గానం – రామా చంద్రమౌళి కవిత్వం

‘Writers don’t write from experience, although many are hesitant to admit that they don’t. If you wrote from experience, you’d get maybe one book, maybe three poems. Writers write from empathy’ — Nikki Giovanni

రామా చంద్రమౌళి గారు విస్తృతంగా రాస్తోన్న కవి, రచయిత. ఒక వైపు కవిత్వం, మరొక వైపు కథలు, నవలలు, పుస్తక సమీక్షలు – ఇట్లా సాహిత్యం లోని అన్ని ప్రధాన విభాగాలలోనూ రచనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా, 300 పై చిలుకు కథలు, 9 కవితా సంపుటులు, 18 నవలలు వెలువరించారు. ‘ఒక ఏకాంత సమూహం లోకి’…
పూర్తిగా »

గమనాన్ని గమనించే కథలు

గమనాన్ని గమనించే కథలు

తెలుగు వాళ్ల కిప్పుడు రెండు రాష్ట్రాలు యేర్పడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ల సంఖ్య యెంతో, అంతమంది తెలుగువాళ్లు రెండు రాష్ట్రాల బయట వున్నారు. తొలిరోజుల్లో చాలా చిన్న గొంతుగా ప్రారంభమైన వాళ్ల సాహితీస్వరం క్రమంగా పెరిగి 2000 నాటికి స్పష్టంగా వినబడసాగింది. తమిళనాడులో హోసూరు నుంచి తెలుగు సాహిత్యం వెలువడడం ప్రారంభించాక గానీ, అక్కడి తెలుగువాళ్ల వునికీ, మనికీ, యితరులకు తెలియలేదు. యిప్పుడు రాష్ట్రేతర ఆంధ్రులు తమదైన జీవితాన్ని సాహిత్యీకరించే పనిని నిర్దుష్టంగా చేసుకుపోతున్నారు. సమకాలీన సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ బలంగా వున్న కథానిక వాళ్ల వ్యక్తీకరణకు బాగా దోహదం చేస్తోంది. గత అయిదారేళ్లుగా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు రాస్తున్న కథలు తెలుగు…
పూర్తిగా »

మసిబారిన మానవ సంబంధాలను ఎత్తి చూపే మమత కవిత్వం

మసిబారిన మానవ సంబంధాలను ఎత్తి చూపే మమత కవిత్వం

మనసు బాధతో గుక్కపట్టినప్పుడో, జీవితంలో ఓ ఆనందం పూదండలా మెడకు చుట్టుకుని ఆహ్లాదపరచినప్పుడో ఉద్వేగంతో కూడిన భావజాలం కవిత్వమై మమతకు సాంత్వననిస్తూంటుంది. జీవితానికో పరమార్ధముందంటూ గుర్తుపట్టగలగడం తల్లిదండ్రులనుండి ఈ కవయిత్రి సంతరించుకున్న అనిర్వచనీయమైన వో అనుభూతి కావచ్చు. లేదా తాను నడచిన విద్యార్ది జీవితానుభవం కావచ్చు.
పూర్తిగా »