జూలై సంచికకు స్వాగతం

వాకిలి జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికలోని విశేషాలు కొన్ని:

అతనికి కడుపునిండా తిండి దొరుకుతుంది, కానీ, వేళ కానీ వేళ, తను తినేది మరెవరికోసమో, ఆకలికి అజీర్తికీ మధ్య శరీరం సతమతమౌతుంటుంది. పెళ్ళాం పిల్లల్ని పస్తు పడుకోబెట్టి తను మాత్రం అతిగా తినకతప్పని ఒక మనిషి (ఒక వృత్తి)ని గురించిన అరిపిరాల కథ “తెల్లతాచు”-

బీఫ్ గురించిన చర్చలు, చట్టాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాతావరణాన్ని, సంస్కృతిని అత్యంత సహజంగా చూపించే చంద్రశేఖర్ కథ “బోరచెక్కు”-

స్నేహం, ప్రేమ, కొసమెరుపులతో సాగే ఆ ఐదుగురు స్నేహితుల మధ్య దాగిన రహస్యం “సాక్షి” కథ, విజయ కలం నుండి-

అనిల్ ఎస్.…
పూర్తిగా »

బోరచెక్కు

బోరచెక్కు

ఈస్టర్పండగని అప్పుసొప్పుజేసి కొన్నకొత్త గుడ్డలేసుకొని, పొద్దున్నే కొండ దగ్గరున్న దేవుడి సిలువ దగ్గరకు నడిచెల్లి, మద్యాన్నమయ్యాక అన్నాలు కూరలు తిని, తరువాతప్రార్దనకెళ్ళి, రాత్రి పల్లెలో కుర్రోళ్లు వేస్తున్న దేవుడి నాటకాలు చూసి అలసిపోయిన ఆ వూరి ప్రజలు ఒంటి మీద…
పూర్తిగా »

ఎల్లలు దాటిన తెలుగు కవిత్వ పరిమళం

ఎల్లలు దాటిన తెలుగు కవిత్వ పరిమళం

నేను ఇన్ఫో్‌సిస్‌లో పని చేస్తున్న రోజుల్లో, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండటంతో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కొందరితో, తరచుగా వారి వారి భాషలకు చెందిన ప్రాచీన, సమకాలీన కవిత్వాల గురించి మాట్లాడేదాన్ని. హిందీ,…
పూర్తిగా »

ఆ తర్వాత

ఆ తర్వాత

తనని తాను రెండుగా చేసుకొనుటకు ఆమె చేత వాళ్ళు అంగీకరింపజేసిన వృత్తాంతాన్ని నిన్న ఆసాంతం చదువుకున్నాం.
ఏడ్చి రప్పించడం, ఏడిపించి పంపించడం ఎన్ని యుగాలనాటి ఆట కదా వాళ్లకి!
లతలు పన్నడం, వలలు దాచడం,
ప్రాణం…
పూర్తిగా »

తెల్లతాచు

ఎర్రపంచె గుర్తుకొచ్చింది విశ్వనాథానికి. “ఎందుకు కట్టుకోవు నాన్నా” అంటాడుశేఖరం. పన్నెండేళ్ళు లేని పిల్లవాడికి తను ఎందుకు కట్టుకోకూడదో చెప్పినా అర్థం కాదు. “అవును నాన్నా. కట్టుకో. ఆచార్లుగారు కట్టుకుంటే ఎంత బాగుంటుందో” అంటుంది వాడి అక్క ప్రియంవద.
పూర్తిగా »

సాక్షి

ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం బ్లూమూన్ బార్‌లో కలుసుకోవడం మా నలుగురి అలవాటు. మత్తు శరీరాన్ని మాయ చేసి, మనసు పైకి తొంగి చూసినప్పుడు ఎవరో ఒకరం “గుర్తుందిరా! చిన్నప్పుడు మన ఊర్లో… ” అంటూ మొదలు పెట్టి హఠాత్తుగా…
పూర్తిగా »

సంగమం

వేసవి సాయంత్రం వర్ష ఋతువైపోయే అరుదైన క్షణాల్లో
ఖాళీ అయిన హృదయంలో మన సంభాషణలన్నీ దాచుకుని
మేఘం ఎక్కడికో వలసపోతుంది.

పూర్తిగా »

షికారి

గప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు,…
పూర్తిగా »

కథాయణం ప్లస్ నాగరికథ=నాగరికథాయణం

ఈ సమీక్షావ్యాసం అనిల్ ఎస్. రాయల్ గారి కథాసంపుటి, ‘నాగరికథ’ మీద రాసింది. సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఒక కథ స్వేచ్ఛానువాదం. మూల కథ All You Zombies. రచయిత రాబర్ట్ ఎ. హెయిన్లిన్. మిగిలిన కథలు వివిధ
పూర్తిగా »

స్లీపింగ్ విత్ ది ఎనిమీ

అందాకా ఒకరి చుట్టూ ఒకరం గిరికీలు కొట్టి ఆ రోజును సమీపిస్తాం
ఒక ఆగర్భ శత్రు జంట పట్టు చీరల సఫారీలో నడిచొస్తుంది
పనేమీ లేని పులొకటి తన జింకను కావిలించుకుని కార్లోంచి దూకుతుంది
రోసిన బతుకుల్లోంచి కాసేపన్నా
పూర్తిగా »