మోహన రాగం

అమ్మచాటు తూరుపు!

ఏప్రిల్ 2014


అమ్మచాటు తూరుపు!

ఇండియా నుండి తెచ్చే ప్యాకింగ్ అంటే బోల్డంత అమ్మ ప్రేమ, అయిన వాళ్ళ పెట్టుపోతలు, మూడు వారాల్లో వెళ్ళిన చోటల్లా వెంట తెచుకున్న ఏదోక జ్ఞాపక చిహ్నాలు, కొని తెచ్చుకున్న కొత్తబట్టల వాసన్లు, ఆ సూట్కేసు చక్రాలకంటుకున్న కాస్త మన దేశపు దుమ్ము, ఆ ఎయిర్ ట్రావెల్ వాడి ట్యాగ్లు. ఏదీ కదల్చాలని లేదు, అక్కడే వదిలేసిన నా మనసుతో సహా.

వచ్చి మూడ్రోజులవుతుందా, ఇంకా సూట్ కేస్లు అలానే ఉన్నాయి తలుపు వారగా. అవి విప్పానా అందరి ఆత్మీయతల గుర్తులు కల్లోలపరుస్తాయయని తెలుసు. ఇంకో రెండ్రోజులాగి ధైర్యం తెచ్చుకుని ముందడుగేయాలనుకుంటూనే వాయిదా. ముఖ్యంగా ఆ…
పూర్తిగా »

ఒక బృందావని

ఫిబ్రవరి-2014


ఒక బృందావని

అందమైన వ్యాకరణాన్ని అల్లుకున్న ఓచిన్న సందేశానికి అంతేసి బలముందాని అచ్చెరువొందిన సందర్భాలెన్నో నీ ఖాతాలో రాసాను. చంద్రుడి లాలి పాట  సూర్యునికి సుప్రభాతమవుతుండగా నా మదితో సంప్రదింపులు మొదలెడతావు. ఎప్పుడో అనుకున్నాను, నా ఉదయాల్ని నువు పలరించలేకపోతున్నావనీ, నా నిద్రమోముని నిమరలేకపోతున్నావని. నీకు తెలుసో లేదో, కవిత్వం కూడా కలలు కంటుందని, అప్పుడప్పుడూ అవీ నిజమవగలవనీ. అవన్నీ కూడబలుక్కుని నిన్ను కమ్ముకుంటున్నట్టున్నాయి. మెల్లి మెల్లిగా నువు నా ఉదయమవడం మొదలెడుతున్నావు. ఇక పగలంతా పదాలు మోసుకొస్తావు. నీ మెయిళ్ళ ప్రవాహమెక్కువయినరోజయితే పల్లెటూళ్ళో పంటచేల్లో  తిరిగినట్టే వుంటుంది .
పూర్తిగా »

మరో అధ్యాయపు మొదటిపేజీ…!

జనవరి 2014


మరో అధ్యాయపు మొదటిపేజీ…!

ష్!!…గప్ చుప్!!

…అని చలివేలు పెదవుల మీద పడగానే, కాళ్ళను దగ్గరకు ముడుచుకుని దుప్పట్లో దాక్కున్నంతసేపు పట్టదు కదా బద్ధకాన్ని వదిలించే కొత్త సంవత్సరం సందడి మొదలవడానికి.

మల్లెలు మంచులో తడిసినంత ముద్దుగా ఉండే ఈ చలికాలపు పొద్దులు, ఉదయాన్నే లేవనీయని బద్ధకం, అరచేతుల మధ్యలో పొగలు కక్కే కాఫీ కప్పు, బుగ్గలని దాచుకునే ముంజేతుల స్వెట్టరు, పరిగెత్తడానికి ఏ ఆఘమేఘాలు కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఒకే రంగునద్దుకుని శీతాకాలపు ఆకాశం, దారి పొడుగూతా దీర్ఘాలోచన చేసే గోరువెచ్చని జ్ఞాపకాలు …కరెక్టనిపించడంలేదూ…కొత్త సంవత్సరం తన ఆగమనానికి సరైన కాలాన్నే ఎన్నుకుందని.

స్కూలులో ఉన్నప్పుడయితే, ఈ న్యూఇయర్ అంతా పావలా గ్రీటింగ్స్ మీద జరిగిపోయేది.…
పూర్తిగా »