కథ

స్కూలెల్లను!

డిసెంబర్ 2017


స్కూలెల్లను!

లైన్లో పిల్లలందరి తోపాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.

శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్ స్ట్రాప్స్ లోకి వేళ్లు…
పూర్తిగా »

చక్రవేణు – ‘కువైట్ సావిత్రమ్మ’

డిసెంబర్ 2017


చక్రవేణు – ‘కువైట్ సావిత్రమ్మ’

కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన చక్రవేణు 1990 లో రాసిన ‘కువైట్ సావిత్రమ్మ’ అప్పట్లో ఒక సంచలనం.

పల్లెల పచ్చదనం గురించీ, పల్లెవాసుల మానవ సంబంధాల జీవన సౌందర్యం గురించీ సాహిత్యంలో కలల ప్రపంచాన్ని సృష్టించే మధ్యతరగతి మిథ్యాజీవుల రచనా ధోరణికి భిన్నంగా – ఓ కర్కశ జీవిత వాస్తవాన్ని మరింత నిర్దాక్షిణ్యంగా కథలోకి తెచ్చిన అరుదైన రచయిత చక్రవేణు.

పిల్లల పెళ్ళిళ్ళుచేయటానికి కోవేటి (కువైట్) నుంచీ తన ఊరు వచ్చింది సావిత్రమ్మ. భర్త చనిపొయాక తన మీద అత్యాచారం చేసిన సొంత మరిది చిన్నబ్బ ఆమే వ్యభిచారం చేస్తోందని ఒకప్పుడు పెట్టించిన పంచాయితీ, భర్త పోయాక ఆదుకోవాల్సిన బంధువుల ఊరిజనాల వెలివేత, ఫలితంగా…
పూర్తిగా »

పార్డన్ మి ప్లీజ్!

పార్డన్ మి ప్లీజ్!

"మిస్ ప్రతిమా గుప్తా!  నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు గిల్టీ కాదని. కానీ ఫ్రీమాంట్ యూనియన్ స్కూల్ యూనియన్ వేసిన కమిటీ అలా అనుకోవడం లేదు. నువ్వు అతన్ని నిగ్గర్ అన్నావనీ,  నీ చర్యల్లో రేసిజం చూపించావని...(కొంతసేపు మౌనం) నీలాంటి మంచి టీచర్ కోల్పోవడం మా దురదృష్టం. రూల్స్ రూల్సే! సారీ! ఐ కాంట్ డూ యెనీ థింగ్. రియల్లీ సారీ ఫర్ యూ!"
పూర్తిగా »

వ్యాపకం

డిసెంబర్ 2017


వ్యాపకం

BB.R.Cell Point… ఆ బోర్డుని చూడగానే ప్రసాద్‌ అడుగులు నెమ్మదించాయి. నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అటువైపు నడవటం మొదలుపెట్టాడు. ఈ పూట తను తిరిగిన సెల్‌ఫోన్‌ షాపుల్లో అది పదవదో, పన్నెండవదో అయి ఉంటుంది. ఇక్కడైనా తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో లేదో తెలియదు. దొరకదు అని విచక్షణ చెబుతోంది. దొరుకుతుందేమో అన్న ఆశ, విచక్షణకి అడ్డుపడుతోంది. ప్రసాద్‌ షాప్‌ దగ్గరికి చేరుకునేసరికి ఎవరెవరో నిల్చొని ఉన్నారు. వాళ్లంతా వెళ్లిపోయేదాకా ఓపికపట్టాడు. ఈలోగా, షాపునిండా వేళ్లాడదీసి ఉన్న ఫోన్ కవర్లూ, మెమరీ కార్డులూ, సెల్‌ఫోన్‌ డొప్పలని చూస్తూ నిల్చొన్నాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? దాన్ని ఎలా అలంకరించాలి?…
పూర్తిగా »

భిక్షువు

భిక్షువు

మకాం మద్రాసుకు మార్చాక, నాకెందుకో బాగా వెలితిగా అనిపించింది. నాన్న ఆఫీసు, నేను కాలేజి. తమ్ముడు తాతయ్య దగ్గర ఆంధ్రలోనే ఉండిపోయాడు. అమ్మ కుట్టుమిషన్‌తో కుస్తీ పడుతుంది. అదో సరదా. అష్టలక్ష్మి దేవాలయం దగ్గరకు నన్ను తీసుకు వెళ్లింది చుట్టాలావిడ. అక్కడ తెలుగు అక్షరాలను చూసి ముచ్చట పడుతుంటే, ఈవిడగారు గుంపులో కలిసిపోయారు. దగ్గరగా సముద్రం అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. ‘ఎలారా భగవంతుడా ఇల్లు చేరడం,’ అని విచారిస్తున్నా.
పూర్తిగా »

ఆట

నంబూరి సూర్యనారాయణరాజుగారు ఆస్థిపరుడే కాదు, మంచి చదరంగం ఆటగాడు కూడా. ఇప్పటిదాకా ఆయనతో చదరంగం ఆడి గెలిచినోళ్ళు, మా చుట్టుపక్కల పదూళ్ళలో ఎవరూ లేరు. ఊళ్ళో వాళ్ళంతా సూర్యనారాయణరాజు గారిని మేకల సూర్రాజు అంటారు.

ఆ యీడు రాజులకుండే… చుట్ట, బీడి, సిగరెట్టు, మద్యం, నస్యం, పేకాటా లాటి అలవాట్లు సూర్రాజు గారికి లేవు. అంతెందుకు? కాఫీ, టీలకి కూడా ఆయన ఆమడ దూరం. పరగడుపునే ఓ శేరు పొదుగుకాడి మేకపాలు పుచ్చుకుంటారాయన. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని మేకలని కూడా మేపుతుంటారు. ఈ మేకలని మేపడానికి వారి మకాల్లో ఇద్దరేసి మనుషులు పని చేస్తుంటారంటే అర్ధం చేసుకోవచ్చు మేకలపెంపకం అంటే ఆయనకి ఎంత శ్రధ్ధో. అందుకనే…
పూర్తిగా »

మధ్యవర్తులు

నవంబర్ 2017


మధ్యవర్తులు

తెలుగు సాహిత్య ప్రపంచానికి అల్లం రాజయ్య పరిచయం అక్కరలేని పేరు… అని రాయాలనే ఉంది.

కానీ ఇవాళ ఆ అవసరం కనిపిస్తోంది. అందుకు కారణం ఇప్పటి ఇంటర్నెట్ దశకంలో తెలుగు సాహితీ సీమలోకి సృజనాత్మక రచయితలుగా ఓ కొత్త తరం రావటం (ఇది మంచి పరిణామమే), వారికి తెలుగు సాహిత్య ఉత్థాన పతనాలతో పరిచయం లేక పోవటం, ఆనాటి సామాజిక పరిణామాలతో దశాబ్దాల అంతరం పెరగటం, మరీ ముఖ్యంగా ఆయా రచనలు అందుబాటులో లేకపోవటం.

1970 ల నుంచీ 1990 ల చివరి వరకూ తెలంగాణా సమాజ ప్రతిఫలనాల్ని శక్తివంతమైన కథలుగా, నవలలుగా మలిచిన రచయిత అల్లం రాజయ్య. తనని ఎంతో ప్రభావితం చేసిన రావిశాస్త్రి,…
పూర్తిగా »

ది డెత్ ఫోర్ టోల్డ్

అక్టోబర్ 2017


ది డెత్ ఫోర్ టోల్డ్

పెళ్లయిన తర్వాత వెంకటేశం అత్తగారింటికే మకాం మార్చాడు- తెనాలి దగ్గరగా ఉంటుందని. కేబుల్ టీవీకి సైడుగా ఓ కంప్యూటర్ సెంటర్ తెరిచి వేలం వెర్రిగా ఎగబడుతున్న జనం నుంచి తన వంతు తాను పిండి ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని తెనాల్లో మొదటి ‘సైబర్ కేఫ్’కు ఓనరయ్యాడు. ఇంకా పదెకరాల మాగాణి, ఇరవై ఎకరాల మెట్టా ఉంది చేతి కింద.
పూర్తిగా »

మూసిన గుప్పెట

చాలా కాలమయింది మాట్లాడి అని గిరికి ఫోన్ చేస్తే “హలో” అన్న స్త్రీ గొంతు విని ఆశ్చర్యపోయాను. అది యామినిది కాదు. పెద్దయిన తరువాత వాళ్లమ్మాయి గొంతు ఫోన్లో ఎలా వుంటుందో విన్న గుర్తు లేదు. రాంగ్ నంబర్ అవడానికి వీల్లేదే అనుకుంటూ పది అంకెలూ చెప్పి, దీనికేనా నేను ఫోన్ చేసింది?” అనడిగాను. పాతికేళ్లుగా నోటికొచ్చిన నంబర్ అది. ఎలా మరచిపోతాను? “అవును” అని జవాబొచ్చింది. “గిరి…?” అని ఆగిపోయాను.

“హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్” అని జవాబొచ్చింది.

ఆ వాక్యపు టర్థం పూర్తిగా మెదడులోకి చేరక, “ఈజ్ హి అవుటాఫ్ ది కంట్రీ?” అనడిగాను.

“హి ఈజ్ నో లాంగర్ ఎవైలబుల్…
పూర్తిగా »

ప్రేమలో జయం?

అక్టోబర్ 2017


అలసటా, దుఃఖం, ఆందోళనా నిండి ఉన్నా, సితార ముఖంలో అందం ఏ మాత్రం తరగలేదు. అసలు తనని అందంగా తప్ప వేరే రకంగా చూసే సామర్థ్యం నా కళ్లకి లేదేమో. స్టీరింగ్ వీల్ పైన ఉన్న నా చేతులు ఆమెని దగ్గరకు తీసుకొని ఊరడించటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. తాను మాత్రం, బాహ్య ప్రపంచం పట్టని స్థితిలో కారు విండోకి తలానిచ్చి, నా వైపే చూస్తున్నట్లుగా, కూర్చుని ఉంది. సరిగ్గా ఆరు నెలల క్రితం ఇద్దరం అపరిచితులం. “యే కహా ఆ గయే హమ్?”

నేను ఒక సిలికాన్ వేలీ సక్సెస్ స్టోరీ. నా కంపెనీని అమెజాన్ కొనెయ్యటంతో, చిన్న వయస్సులోనే చాలా సంపాదించాను. నలభై అయిదేళ్ల ఎలిజిబుల్…
పూర్తిగా »