ఇంకో పూవు

వాకిట మందారం రొజూ ఒక్క పూవే పూస్తున్నప్పుడు, ఒక మంచి వుదయాన ఇంకో పూవు కూడా కనిపిస్తే ఎంత సంతసం! రచయితలూ, కవుల యాత్రలో ఒక పుస్తకంతోనే సరిపుచ్చుకునే వాళ్ళు ఎందరో! ఇంకో పూవై పూస్తున్న కొత్త రచనల గురించి పరిచయం ప్లస్ నేపధ్యమూ!

కవిత్వమే మిత్రుడు, ప్రేమికుడు, సహచరుడు…!

మార్చి 2013


కవిత్వమే మిత్రుడు, ప్రేమికుడు, సహచరుడు…!

మెరుపు తీగల వంటి కవులొచ్చిన 1985లలో ఆ కవుల మధ్యకు బిక్కుబిక్కుమంటూ వచ్చి, అతికొద్ది కాలంలో తనదయిన కవిత్వ వాక్యదీపాన్ని సరిదీటుగా వెలిగించిన కవయిత్రి కె.గీత. దయలేని జీవితం విధించిన నిశ్శబ్దాల్ని దాటుకొని, రాయలేనితనాల్ని గట్టెక్కి, ఇప్పుడు మూడో పుస్తకమయి మీతో పలకరిస్తున్న విజయగీతిక గీత.

ఏదైనా ఒక జీవితం కవిత్వం వల్ల సుసంపన్నమవుతుందా? కవిత్వంవల్లే పరిపూర్ణతను పొందుతుందా! కేవలం కవిత్వం రాయడంవల్ల సాంత్వనని పొంది మరి కొందరికి మార్గం చూపించగలదా!!

అవును-కవిత్వానికి ప్రపంచాన్ని తన ప్రేమైక హస్తాల్లోకి తీసుకుని వెన్ను నిమరగల గొప్ప మన:శ్శక్తి ఉంది. అది నిన్ను బతుకు నించి వేరు చేసి జీవింపజేస్తుంది.  మరణం అణగద్రొక్క లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది. మన…
పూర్తిగా »

కైవల్యం

ఫిబ్రవరి 2013


కైవల్యం

జీవితంలో కొన్ని మలుపులు మన ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేస్తాయి. ప్రాపంచిక విషయాలలోని లోటునీ, అసంపూర్ణతనీ గుర్తించడం వల్ల ఏర్పడే మలుపులు కొన్నయితే,   ఓ సంఘటనో, సద్గురువో మనకి ఎదురవడం వల్ల కలిగిన క్రొత్త  అవగాహనతో ఏర్పడేవి మరికొన్ని. బహుశా మొదటివి వైరాగ్యానికీ, రెండోవి జ్ఞానానికీ బీజాలు వేస్తాయేమో!

అలాంటి ఒక మలుపులో వ్రాసిన కవిత “కైవల్యం”. వ్యక్తిగతంగా నా జీవితాన్ని గురించీ, మనసుని గురించీ,  అలాగే ప్రపంచాన్ని గురించీ అంతకు ముందు కలిగిన భావాలు వేరు. ఆ తర్వాత కలుగుతున్న భావాలు వేరు. ఆ వ్యత్యాసాన్ని ఈ పుస్తకంలో పట్టి వుంచుదామన్న వుద్దేశ్యంతోనే బాగా పాతవైనప్పటికీ, ‘కైవల్యం‘ కి ముందు…
పూర్తిగా »

ఓ ఆలోచన… ఓ పదం… కొన్ని పంక్తులు

ఓ ఆలోచన… ఓ పదం… కొన్ని పంక్తులు

కవిత్వం ఒక్కసారి పట్టుకుందంటే ఇక వదిలి పెట్టదు.
మరో లోకాలని సృష్టిస్తుంది.
మరో దృష్టిని ప్రసాదిస్తుంది.
నిజ జీవితానికి సమాంతరంగా మరో జీవితాన్ని నిర్మిస్తుంది.
మనసులో బందీ అయిన భావాల విడుదలకు మార్గాన్ని చూపిస్తుంది.
మామూలు మనుషులనుండి వేరు చేసి ఎక్కడో కూచోబెట్టి ,లేనిపోని భ్రమల్లో భ్రాంతుల్లో గిర్రున తిప్పుతూ తటాలున మళ్ళీ ఆ మనుషుల మధ్యే వదిలేసి పోతుంది.
వంట చేస్తుంటేనో,పుస్తకం చదువుకుంటుంటేనో, ఇంకేదో పని చేస్తుంటేనో లేక ఊరికే ఖాళీగా కూచుని కిటికీలోంచి చూస్తున్నా గబుక్కున ఏదో తడుతుంది.
ఓ ఆలోచన.
ఓ పదం.
కొన్ని పంక్తులు.పూర్తిగా »