ముఖాముఖం

సుషుప్తావస్థను దాటి రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం – నిశీధి

ఫిబ్రవరి 2016

“చలి కౌగిలింతల్లో తుళ్ళుతున్న సూర్యకాంతి
వేడిస్పర్శల కోసం తపిస్తున్న శీతగాలులు
ఆవిర్లలో సీతాకోకచిలుకలు వెతుక్కొని
ముసురుకుంటున్న కాఫీ మోచా
మధ్యాహ్నపు మెలుకువలో భూపేన్ హజారికాతో బందిష్
నెగళ్ళంటుకోని మంచునెల సెలవల సాంగత్యపు హాయి” – నిశీధి

ఛాందసవాద తెలుగు కవితారీతుల శృంఖలాలని తెంచుకుని కవిత్వానికి కొత్త భాష్యపు సొబగులద్ది, వైవిధ్యభరిత కవిత్వాన్ని అంతర్జాల మాధ్యమంగా పాఠకులకందిస్తున్న ఈ తరం కవయిత్రి నిశీ. తెలుగు కవితాప్రపంచంలో ఓ కొత్తకెరటంలా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రని వేసుకున్న నిశీధి ఈ మధ్యకాలంలో తప్పక చదవాల్సిన కవయిత్రి.

“ఒక బలమయిన భావం కకూన్లో ముడుచుకు పడుకున్న గొంగళిపురుగు అయితే, ఆ సుషుప్తావస్థను దాటిన తర్వాత రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం” అని కవిత్వాన్ని నిర్వచించిన నిశీధి గారితో ముఖాముఖి. 

ఇంటర్వ్యూ: శ్రీనివాస్ వాసుదేవ్

1. నవల, కథ, వ్యాసం – ఈ మూడింటికి బదులుగా మీరు కవిత్వాన్నే ఎంచుకొనడానికి ప్రధాన కారణం?

మెడిటేషన్ చేయలేను కాబట్టి రాసుకోవడం మిగిలినవాటిలో బెటర్ ఆప్షన్ . ఊపిరి ఉగ్గబట్టి, ప్రాణశక్తినంతా ఒకచోట చేర్చి స్తంభింపచేసి, కొన్ని సెకనుల పాటు చైతన్యానికి దూరంగా ఉండటం కంటే సజీవంగా గలగల పారేసెలయేరులా మారి కొంత సమయం పాటైనా ఆలోచనలని అక్షరాలుగా పేర్చుకుంటున్నప్పుడు కలిగే అనుభూతి గొప్పగా అనిపిస్తుంది.

పోతే కవిత్వమే ఎందుకు ఇష్టమయిన ప్రక్రియ అయింది అంటే మాత్రం- ఆప్యాయతతో కూడిన నవ్వుల వెన్నపూసలనీ, నెగళ్లలో ఎగసిపడే సూరీళ్ళనీ ఒకే భావనలో క్లుప్తంగా చెప్పగలిగే సామర్థ్యం మిగిలిన నవల, కథ, వ్యాసానికి తక్కువ. వాటిలో మనం ఒక ఫీలింగ్ నుండి ఇంకో ఫీలింగ్ కు వెళ్తూ పాఠకుడిని మనతో తీసుకెళ్ళడం ఒక లాంగ్ ప్రాసెస్ . అదే కవిత్వంలో అయితే నవరసాలని అత్యంత రసాత్మకంగా తక్కువ టైం అండ్ స్పేస్ లో క్రియేట్ చేయొచ్చు.

అంతే కాదు, క్రియేటివిటీకి కవిత్వం ఇవ్వగలిగే స్కోప్ మిగిలిన ప్రక్రియలలో తక్కువే. నవలో, కథో రాస్తున్నపుడు అందులో కవిత్వం ఉండొచ్చేమో కానీ మొత్తం భావాన్ని కవిత్వంగా చెప్పలేం. అదే కవిత్వానికి వస్తే ఒకే చిన్న కవితలో ఒక కథ మొత్తాన్ని వివరించొచ్చు.

శ్రీశ్రీ రాసిన ‘బాటసారి’ని చదివితే, అసలు 15 లైన్స్ లోనే ఆయన ఒక పూర్తి జీవితాన్ని ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది మనకు. ఇక దీర్ఘకవితలో అయితే ఒక పూర్తి నవలే చెప్పొచ్చు.

అలా expression ఏదయినా దాన్ని కవిత్వం చేయొచ్చు. అంతే కాదు కొంత భాష , భావం తెలిసిన ఏ వ్యక్తి అయినా కవి కావడం సుళువే. ‘Anybody can dance’లా, ‘Anybody can be a poet’. కొంత నిబద్ధత, అక్షరాల వెనక రిథం అర్థం అయి ఆ లయని అందంగా మెలికలు తిప్పగలిగే సామర్థ్యం ఉంటే, దాన్ని పాఠకుడి గుండెల్లో సూటిగా దిగేలా చేయడం సులువే అనుకుంటాను నేను.

రక్తాన్ని స్పందింప చేయగలిగే ఇమాజినేషన్ ని, ఇంటలెక్చ్యువాలిటీని, అతి సాధారణ ఆలోచనని తక్కువ మాటల్లో కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీసి, మనిషితనం యొక్క అత్యున్నత స్థాయికి ఆ ఆలోచనని నడపగలిగే కెపాసిటీ కవిత్వానిదే. అందుకేనేమో కవిత్వం అంటే అంత ఇష్టం నాకు.

2. కవిత్వం సాహిత్యంలోని మిగిలిన సాహిత్య ప్రక్రియల (Genres) కంటే ప్రయోజనకారి అవుతుందా?

మిగతా సాహిత్య ప్రక్రియలకన్నా కవిత్వం ఎక్కువ ప్రయోజనకారి అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందనే చెప్పాలి. రాసిన వాక్యం కవిత్వంగా మారడం వెనక కవిలోని సౌందర్యం పాటై వెలగడం, అలాగే ఆ కవిత్వాన్ని ఆస్వాదించే పాఠకుని మనసులోని భావం సుళ్ళు తిరుగుతూ ఊపిరాడనితనాన్ని కలిగించి, అతడు కొద్దిసేపు బాహ్యచేతనలు మరిచిన క్షణం – ఈ రెండు మొమెంట్స్ లో ఒక ecstasy ఉంది.

“Pagan culture లో మేల్ అండ్ ఫిమేల్ మధ్య సెక్సువల్ ఇంటిమెసీ ఉన్న తాదాత్మ్య క్షణంలో దేవుడి స్పర్శ తెలుస్తుందనీ, ఒక స్థాయిలో ఆ ఆనందం తారాస్థాయిని చేరుకుంటుందనీ భావించి, ఆ సమాగమాన్ని ఒక Social ritual గా కండక్ట్ చేసేవాళ్ళు” అని చదువుకున్నట్లే, నిజానికి కవిత్వం ఒక అలౌకికానందాన్నిస్తుంది . సరయిన వాక్యం రాసుకున్న చదువుకున్న తృప్తి మిగిలిన ప్రక్రియల్లోకన్నా కవిత్వంలో ఒక రవ్వ ఎక్కువే.

అలాగే ఓ నిర్దిష్టమైన ఇమేజ్ ని పాఠకుడికి చేరవేయటంలో విఫలమైనప్పుడు, రాయలేనితనం నెలకొన్నప్పుడు, కలాలు స్థాణువులుగా మారినప్పుడు కూడా కవిత్వం పాటరూపంలో ప్రజల హృదయాలలో ఉండటం నిత్యసత్యం కాబట్టి, మిగిలిన సాహిత్య ప్రక్రియలకన్నా కవిత్వం పాఠకులకు కచ్చితంగా ఎక్కువ రీచ్ అవుతుంది.

3. ఇప్పుడు శుద్ధకవిత్వం రాసేవాళ్ళు చాలా అరుదు. దానికన్న వచనకవిత్వం ఎక్కువగా ప్రజాదరణ పొందింది. ఓ వాక్యం వచనం నుంచి విడిపోయి ఎప్పుడు కవిత్వం కాగలుగుంది? కాస్త సోదాహరణంగా చెప్పండి?

ఈ ప్రశ్నని వినగానే, మహప్రస్థానంకు ముందుమాట రాస్తూ చలం యోగ్యతాపత్రంలో అద్భుతంగా చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది.

“తాను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగానితనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరలవెనకా, అలంకారాల మధ్యా, కఠినపదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి- ముఖ్యం, సహజసౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగాచెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధినివ్వరాదా అని చెలం కోర్కె. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు, కవులూచెయ్యరు – ఎంకీ, శ్రీశ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ, Economy of words and thoughts లేకపోవటం దేశభక్తికన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా”.

నిజానికి ఈ తరంవాళ్ళు చెప్పాల్సిన విషయాలను చలాలు, శ్రీశ్రీలు వదలలేదు కదా. ఇందులో స్త్రీల మీద కామెంట్ ని చలం ఉద్రేకాలకే పరిమితం చేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే, శుద్ధకవిత్వం నుండి ప్రజాగేయానికి, ప్రజాదరణ కవితగా మారడానికి మధ్య గీత ఒకటే. కవి తనకు తెలిసిన పాండిత్యాన్నంతా కవిత్వంలో కుప్పలు పోయటం వలన అతని అహం వాక్యం నిండా పరుచుకుపోవడం, లేదా వాక్యాన్ని వెన్నెలవాకిట్లో వెన్నముద్ద చేసి సులువుగా భావాన్ని భావితరాలకి కూడా అందించడం – ఈ రెండింటిలో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది.

సరే, మనవాళ్ళని వదిలేసినా కవిత్వంలో భాష “Language close to the language of people” అన్నటట్టుగా ఉండాలని, ప్రోజ్ రాస్తున్నట్లుగానే పోయెట్రీ నడక సాగాలని, అది ప్రపంచానికి, ఆలోచనలకి దగ్గరగా ఉండాలని తన రొమాంటిక్ మేనిఫెస్టోలో వర్డ్స్ వర్త్ అప్పటి సానెట్ రైటర్లతో చాలెంజ్ చేయడం మనం మర్చిపోవద్దు. అయితే ఇందులో కవి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తన భాష, భావం తాలూకు అత్యున్నత స్థాయిని అనుభవించడానికి రాసుకునే కవితలని మినహాయించొచ్చు. ఎందుకంటే ప్రతి ఆర్ట్ ప్రాక్టీస్ లో నేలమీద నడుస్తూనే ఎవరెస్ట్ శిఖరాన్ని చూడాలన్న కోరిక కళాకారులకి సహజం. అక్కడ వేసిన అడుగు మిగిలినవాళ్ళకి ఒయాసిస్ లా దప్పిక తీరుస్తుందా లేక ఎండమావిగా వెక్కిరిస్తుందా అన్నది తర్వాత విషయం.

వచనమే వ్యక్తిగా మారాక నిజానికి వాక్యం నుండి కవిత్వం విడిపోవడం అంటూ జరగదు. కవిత్వం నుండి వాక్యాన్ని విడదీసి చదవడానికి ఎంత ప్రయత్నించినా కుదరదు. అందుకు తెలుగుసాహిత్యంలో ఎప్పటికీ చెప్పుకోగలిగే మొదటి కవిత్వ వ్యక్తిత్వం రావూరి భరధ్వాజ గారు. తన “ఒకింతఏకాంతం” , “ఐతరేయం” ఇవన్నీ పోయెటిక్ ప్రోజ్ లకి గొప్ప ఉదాహరణలు.

అంత దూరం వెళ్లకపోయినా చిన్న ఉదాహరణతో చెప్పాలంటే -

“ఈ వెన్నెలరాత్రి ఎందుకో చాలా చలిగా ఉంది,
ఒక మంచి దళసరి దుప్పటి కప్పుకొని నిద్రించే సమయం కోసంచూస్తున్నాను”
అనే వాక్యాన్ని
“వెన్నెలరేయిలో
వణికిపోతున్న ఆకాశం భూమినింత తవ్వుకొని
కప్పుకొనే నిదురించే క్షణాల ఆశల ఆరాటం”
అని రాస్తే కొంచెం కవితాత్మకంగా ఉండటమే కాక, చదువుకున్నపుడు పదాల మధ్య ఎక్కడో ధ్వనించే పాజిటివ్ సౌండ్ హాయినిస్తుంది.

నిజానికి వచనం నుండి కవిత్వం విడిపోవడం కంటే కూడా వచనమే ఇంకొంత సోయగాన్ని అద్దుకొని కవిత్వంగా రూపాంతీకరణ చెందుతుందని చెప్పొచ్చు.

“సమాజానివన్నీ స్థిరమయిన ఆలోచనలు, మార్పు లేని విధానాలు” అనేది మాములుగా మనం రాసుకునే వాక్యం. అయితే దాన్నే శ్రీశ్రీలాంటి కవి
“నిశ్చల నిశ్చితాలు మీవి.
మంచిని గురించి,
మర్యాద, మప్పితంగురించి,
నడతా, నాణ్యం, విలువల విషయం
నిశ్చలనిశ్చితాలు మీవి” అన్నప్పుడు కొంత ఆశ్చర్యంగా విభ్రాంతిగా అనిపిస్తుంది. అదే కవిత్వం.

4. ప్రతీ కవికి తనకంటూ ఓ డిక్షన్ ఉంటుందంటారు. ఆ డిక్షన్ ఆ కవి ఎదుగుదలకీ, పాఠకులను రీచ్ అవ్వటానికీ ఎంతవరకు దోహదపడుతుంది?

తనేమి చదువుతాడో, ఏమి చూస్తాడో ఒక మనిషి కొన్నాళ్ళకి అదేవిధంగా తయారవుతాడు. నిజానికి మొదట్లో ఏ కవికీ తనదంటూ ప్రత్యేక డిక్షన్ ఏమీ ఉండదు. హాబిట్చ్యువల్ గా అప్పటిదాక తాను చదివిన వాక్యాలనే, పదాలనే తన భావవ్యక్తీకరణలో వాడుకుంటాడు. కొన్నాళ్ళు అలా వేరే రచయితల డిక్షన్ ప్రభావంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ తనకంటూ కొన్ని పదాల్లో కంఫర్ట్ తెలియడం, ప్రతీకలు అల్లడానికి ఓ వాక్యవిధానానికి అలవాటు కావడం జరుగుతుంది. కవి ఈ డిక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి ఆ టైమ్ లో తన రీడర్స్ కూడా సహాయం చేస్తారు. ముఖ్యంగా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఇమ్మీడియెట్ రియాక్షన్స్ తెలిసే చోట, కవి త్వరగా అభిమానానికి కట్టుబడే మనస్తత్వం కలిగినవాడు అయితే రీడర్స్ నిర్దేశించిన మార్గంలో తను నడవడం మొదలు పెడతాడు. తన లైకర్స్ చాయిస్ తనదిగా మారిపోయే బలహీనక్షణంలో కవి చచ్చిపోతాడు. అంతే కాదు, నిజంగా అభిప్రాయాన్ని బలంగా చెప్పగలిగే శక్తి ఉండి రీడర్స్ ని తన భావవ్యవస్థకి కట్టిపడేయగలిగే స్థాయి ఉన్న కవి కూడా ఆ కంఫర్ట్ జోన్ కి అలవాటుపడి కొత్తపదాలని, భావనలని క్రియేట్ చేయడం, ఎక్ప్రెస్ చేయడం మర్చిపోయి ఒక సింటాక్స్ ను పట్టుకొని పదాల అల్లిక మొదలు పెడతాడు. అలా చేయడం వలన నిజానికి తర్వాత పేజీలకొద్దీ కవిత్వం రావొచ్చేమో కాని, కవి చేసే ప్రయాణం తనలో మార్పుని మర్చిపోయిన క్షణంలో ఆగిపోతుంది.

Change is inevitable. మార్పుని ఆస్వాదించని కవి తన ప్రతి కవితలోని డిక్షన్లో, శైలీశిల్పంలో మార్పుని చూపకపోతే రచనలో బండరాయితనం ఆవహించుకొని కదలలేని పరిస్థితులలో ఒకానొక సమయంలో కవిత్వం లుప్తమవుతుంది.

అందుకే ఒక వివేషస్ రీడర్ (vivacious reader) నుండి మాత్రమే ఒక వివేషస్ రైటర్ పుట్టడం సాధ్యం . నిరంతరం కొత్తకొత్త పదాలని నేర్చుకోవడం, వాడటం, నేర్పడం, కొత్త ఆలోచనని అందించడం కవిత్వానికి ఎంతో అవసరం. ఇంకా చెప్పాలంటే శుద్ధకవిత్వం పేర తెలుగుకవిత్వం తెలుగులోనే ఉండాలనే ఛాందసత్వం నుండి బయటపడి, మల్టీలాంగ్వేజి కవిత్వం మల్టిపుల్ లెవెల్స్ లో డిక్షన్ యూసేజి పెరగకపోతే, కళల్లోకెల్లా హైయెస్ట్ అండ్ నోబుల్ ప్రక్రియ అయిన కవిత్వం కూడా బావిలో కప్పే.

అంతేకాదు, పేరు చూడకుండా కవిత అంతా చదివాక ఇది ఖచ్చితంగా ఫలానా వాళ్ళది అయిఉంటుంది అని చెప్పించుకోగలిగే సక్సెస్ఫుల్ డిక్షన్ ఉన్నవాళ్ళున్నారు. అలాగే రెండు లైన్స్ చదవగానే బాబోయ్ మళ్ళీ ఆయనేనా, మళ్ళీ అవే పదాలు అటుతిప్పి ఇటుతిప్పి నూటపదహారో సారి, అదే కవిత్వమూ, భావమూ దాగి ఉంటుంన్నదే అని నీరసపడే సందర్భాలు ఉంటాయి.

5. ఒక బలమైన భావం మెదడులో మెరవడానికీ, తర్వాత అది ఓ కవితగా రూపం సంతరించుకోడానికీ మధ్య ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది?

ఒక బలమయిన భావం కకూన్లో ముడుచుకు పడుకున్న గొంగళిపురుగు అయితే ఆ సుషుప్తావస్థను దాటిన తర్వాత రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం.

నిషేధాల, నిర్బంధాల నీడల్లో వెలుగును మరిచిపోయి ఒదిగిపోయిన క్షణాలు కొంత నిశబ్దపు గాఢత తర్వాత మెరుపై ఫేటేల్మంటూ విచ్చుకుని సజీవక్షణాలుగా మారడం- నాదృష్టిలో కవిత్వం. వాస్తవంలో మనసుని ఇరుకుతనానికి గురి చేసే వైరుధ్యసందిగ్ధతలు నిండిన సమాజ సంక్లిష్టత, ప్రకృతిలోని ఉపమానాల కనెక్టివిటీతో ఆ సందిగ్ధతలకి దూరంగా పోగలిగే ఒక వే అవుట్ ని చూపించే దార్శనికతక – ఈ రెండింటి మధ్య మిగిలున్న space గా మనం ఈ ట్రాన్సిషన్ని చెప్పుకోవచ్చు.

**** (*) ****

Painting Credit: Etsy



44 Responses to సుషుప్తావస్థను దాటి రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం – నిశీధి

  1. Mehdi ali
    February 1, 2016 at 10:03 am

    ఒక ఆసక్తికరమైన అద్భుతమైన ఇంటర్వ్యూ … Change is inevitable. మార్పుని ఆస్వాదించని కవి తన ప్రతి కవితలోని డిక్షన్లో, శైలీశిల్పంలో మార్పుని చూపకపోతే రచనలో బండరాయితనం ఆవహించుకొని కదలలేని పరిస్థితులలో ఒకానొక సమయంలో కవిత్వం లుప్తమవుతుంది… వాహ్ …… నిశీధి గారి కవితలు చదివినపుడు నా మనసులో ఒకే భావం ఉద్భవిస్తుంది .. శీతలంగా స్పృశిస్తూనే ఉష్ణపు అనుభూతిని కూడ చూపిస్తూ ఉంటుంది . ..

  2. February 1, 2016 at 11:44 am

    ‘expression ఏదయినా దాన్ని కవిత్వం చేయొచ్చు. అంతే కాదు కొంత భాష , భావం తెలిసిన ఏ వ్యక్తి అయినా కవి కావడం సుళువే. ‘Anybody can dance’లా, ‘Anybody can be a poet’. కొంత నిబద్ధత, అక్షరాల వెనక రిథం అర్థం అయి ఆ లయని అందంగా మెలికలు తిప్పగలిగే సామర్థ్యం ఉంటే, దాన్ని పాఠకుడి గుండెల్లో సూటిగా దిగేలా చేయడం సులువే అనుకుంటాను నేను.’ వెల్ సైడ్ నిశీ! నువ్వు చెప్పింది నిజం. ‘బై బర్త్’ అంటో తయారైన ఆరా ను చించెయ్యాలి.

  3. lasya priya
    February 1, 2016 at 4:19 pm

    కవిత్వం సజీవమై ..స్వచ్చ వ్యక్తిత్వంతో నదిలా ప్రవహించటం ఎంతో బాగుంది.గమనిస్తూ, గ్రహిస్తూ, స్వీకరిస్తూ, వ్యక్తీకరించటం కవిత్వం …అద్భుతంగా ఉంది నిశీధి గారు ….

  4. shrutha keerthi
    February 1, 2016 at 4:24 pm

    వచనం మరింత సోయగాన్ని అద్దుకొని కవిత్వంగా రూపొందింది అన్నారు..నిజమే మీ కవిత్వం లో సోయగాన్ని చూసి మీ అభిమినినయ్యాను.thanx for the interview Srinivas Vasudev sir

  5. mithil kumar
    February 1, 2016 at 4:34 pm

    #నిశి#
    1.
    కొన్ని క్షణాలు నా చుట్టూ జరుగుతున్న భౌతిక ,
    రసాయన పరిణామాల్ని గమనించే ధ్యాస కోల్పోయాను.
    మీ పదాల ecstatic flow లో నిలువెల్లా దేహాన్ని తడిపేసుకున్నాను
    అక్షరానికి అక్షరానికి మధ్య దూరి
    మీ stimulate సంతకాల కింద కాగితమయ్యాను

    2.
    మీర్రాసే పదాల ప్రయాణమొక తాత్విక tendency,
    మీ కలానికి కాగితానికి మధ్య friction లో
    నలిగిపోవడం ఎంత హాయిగా వుందో ఇప్పుడు ,
    చైతన్యానికి దూరంగా వుండే ధ్యానం కన్నా
    మనసుని విప్పుకొని కొన్ని చిత్రాలను రాస్కునే ప్రక్రియ ఒక ఇష్టమైన agony కదా.

    3.
    కొన్ని వేల కోట్ల సూరీళ్ళని ఒకే భావం లో బంధించడం.
    మరి కొన్నిరాతలు somatic స్వప్నాల కంటే ఎన్నో రెట్లు భావప్రాప్తిని ఇవ్వడం
    ఒక్కోసారి అనిర్వచనీయమైన alchemy లో కొట్టుకుపోవడం
    ఇలా మీతో సాగిపోతు నన్ను నేను మర్చిపోవడం
    పారవస్యపు echos లో చిక్కుకుపోవడమే.

    4.
    సుతారంగా చిత్రిస్తున్న పోయెట్రీ portrait లో
    రొటీన్ rituals కి random రంగులు అద్ది
    ఒక అందమైన కాన్వాస్ని రీడర్స్ హృదయపు ఇరుకుల్లో
    బుజ్జగిస్తూ సర్దడం మీకు మాత్రమే తెల్సిన ఒక drift.

    మొత్తంగా ఇదోక పాలపుంత విహారం ………

    awesome ఇంటర్వ్యూ …థాంక్స్ to వాకిలి

  6. విలాసాగరం రవీందర్
    February 1, 2016 at 4:53 pm

    నిషేధాల, నిర్బంధాల నీడల్లో వెలుగును మరిచిపోయి
    ఒదిగిపోయిన క్షణాలు కొంత నిశబ్దపు గాఢత తర్వాత
    మెరుపై ఫేటేల్మంటూ విచ్చుకుని
    సజీవక్షణాలుగా మారడం- నాదృష్టిలో కవిత్వం.

    ఎంత చక్కగా చెప్పారు నిశీది గారు…

    మంచి ఇంటర్వ్యూ

  7. February 1, 2016 at 5:11 pm

    చాలా చాలా విలువైన…. భద్రంగా హృదయాలలో చాలా సంవత్సరాలపాటు గుర్తుండే ఇంటర్వ్యూ…..చేసినవారికి ….చెప్పి హృదయం లో నిలిచిపోయిన వారికి ప్రేమపూర్వక వందనాలు….ఈ పోస్ట్ ని షేర్ చేయకుండా ఉండలేకపోయాను….ధాంక్ యూ సో మచ్ ఫర్ ఎవిరి వర్డ్ అండ్ ఫీల్

  8. mithil kumar
    February 1, 2016 at 5:18 pm

    ఒక బలమయిన భావం కకూన్లో ముడుచుకు పడుకున్న గొంగళిపురుగు అయితే ఆ సుషుప్తావస్థను దాటిన తర్వాత రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకే కవిత్వం.

    నిషేధాల, నిర్బంధాల నీడల్లో వెలుగును మరిచిపోయి ఒదిగిపోయిన క్షణాలు కొంత నిశబ్దపు గాఢత తర్వాత మెరుపై ఫేటేల్మంటూ విచ్చుకుని సజీవక్షణాలుగా మారడం- నాదృష్టిలో కవిత్వం.

    వండర్ఫుల్ నిశి జి

  9. February 1, 2016 at 8:00 pm

    కవిత్వం కొకూన్ దశ దాటి సీతాకోక చిలుకలా విశ్వాంతరాళంలో విహరించే స్థితికి చేరుకోవడం కవి తాదాత్మయతను పాఠకుడు చేరుకొంటే అది ఆ కవిత సాధించిన విజయం. ఇది నిషీ గారి కవిత్వంలో నిత్యమూ అందరికి అనుభవైకవేద్యమే. ప్రతి కవితలోనూ నూతనత్వం సాధించాలన్న తపన తనలో ప్రస్ఫుటం. దానికి ప్రేరణ ఈ ఇంటర్వ్యూలో మనముందు ఉంచారు. ఇది మీ ఇద్దరి సంభాషణ కంటే కూడా మాకో పాఠంలా సాగింది. ఇరువురికి అభినందనలతో పాటు ధన్యవాదాలు.

  10. Sharada Sivapurapu
    February 1, 2016 at 10:51 pm

    Congrats Nishiji. Adbhutamaina interview. Its always a pleasure to read your poetry.

  11. Narayanaswamy
    February 2, 2016 at 4:28 am

    చాలా మంచి ఇంటర్వ్యూ – మంచి మెచూరిటీ ఉన్నది అధ్యయనం సాధన కొత్తగా రాయాలనే నిరంతర తపన ఒకింత సామాజిక చింతనా నిబద్ధత – ఈ తరం కవుల్లో ఎక్స్పెప్షనల్ గా వినిపించే గొంతు మీది నిశీధి గారూ – మీ ఆకలి గొన్న నిరంతర అన్వేషణ కొనసాగించండి – రాసిన కవితా వాక్యాలతో తాదాత్మ్యం చెందినా సంతృప్తి మాత్రం పొందకండి – అసంతృప్తే గొప్ప కవిత్వానికి నాంది

  12. Lokesh
    February 2, 2016 at 7:57 am

    Udayaanne lechina ventane Niseedhi interview vachhindani Subhashini garu cheppagaane anni panulu pakkana petti chadivaanu.malli malli chaduvutaanu.chala adbhutamaina kavitvam tanadi.vyakti ga tanato vibhedinchinaa, aa kavitva dhaara ki tadisipovaalsinde.
    Great interview. Thanks Srinivas garu

  13. February 2, 2016 at 10:38 am

    ఉత్తమ కవిత్వం గురించిన బలమైన, స్పష్టమైన అవగాహనను కలిగివుండటం ఏ కవికైనా లాభదాయకమే. ఎందుకంటే ఆ అవగాహన చక్కని కవితా రచనకు ఒక పటిష్ఠమైన పునాదిగా పని చేస్తుంది. కవిత్వం గురించి నిశీథి గారికి ఉన్న అభిప్రాయాలలో clarity కనిపించటం అభినందనీయం. కంగ్రాట్స్ నిశీథి గారూ. ఇక మీరన్న ‘మల్టీ లాంగ్వేజి కవిత్వం’ ఆలోచించ తగిందే కాక, చర్చించ తగింది కూడా.

    ‘శుద్ధ కవిత్వం’ను ఇక్కడ ఛందోబద్ధ కవిత్వానికి సమానార్థకంగా వాడినట్టున్నారు. అలా అనటంతోనే పద్యకవిత్వానికి ఆటోమేటిక్ గా సుపీరియీరిటీ చేకూరినట్టయింది. కారణమేమంటే Pure poetry is always superior to impure poetry. ఇక పోతే వచన కవిత్వం శుద్ధ (pure) కవిత్వం కాజాలదని అనొచ్చా అన్నది సందేహం.

    నారాయణ స్వామి గారూ, అసంతృప్తే గొప్ప కవిత్వానికి నాంది అని ఎంత బాగా చెప్పారు! అది రత్నంలాంటి వాక్యం.

    • Narayanaswamy
      February 3, 2016 at 7:55 am

      ఎలనాగ గారూ నెనర్లు – మీరు మంచి పరిశీలన చేసినరు – నాకు శుద్ద కవిత్వమంటే చందోబద్దమైన పద్యకవిత్వమని తట్టలేదు – నేనింకా గతంలో కొందరన్నట్టు సమాజమూ, సామాజిక స్పృహ పట్తని కవిత్వమనుకుంటున్న – పద్య కవిత్వం శుద్ధ కవిత్వం అనడం వచన కవిత్వం impure కవిత్వం అనడం సరైంది కాదు – నిజానికి శుద్ధ కవిత్వమూ ‘అ’శుద్ద కవిత్వమంటూ యేమీ లేవు నా దృష్టిలో!

      • koppula
        February 5, 2016 at 10:05 am

        నారయణస్వామీ సర్,
        “నిజానికి శుద్ధ కవిత్వమూ ‘అ’శుద్ద కవిత్వమంటూ యేమీ లేవు.” బాగా చెప్పారు.

    • koppula
      February 5, 2016 at 10:11 am

      ఎలనాగ సర్,
      మల్టీ లాంగ్వేజి కవిత్వం మీద నాక్కూడా చాలా సందేహాలున్నాయి. సందేహాలు ఎవరైనా తీరిస్తే బాగుణ్ణు.

  14. Prasuna
    February 2, 2016 at 11:18 pm

    గుడ్ ఇంటర్వ్యూ. కంగ్రాట్స్!

  15. Jayashree Naidu
    February 2, 2016 at 11:38 pm

    ఎప్పటికీ రిఫరెన్స్ గా మిగిలే ఇంటర్వ్యూ సాగించారు దేవ్ గారు…
    నిశీధి గారి వివరణలు చాలా బాగున్నాయి. ఇద్దరు సాహితీ ప్రియుల మధ్య సంభాషణ కొనసాగితే ఎంతటి సాహిత్యాత్మకం గా వుంటుందో చూపించారు. కవిత్వపు అపప్రధల్నిఅధిగమించి పొయెట్రీ ఇస్ అ సోల్ ట్రీ అని నిరూపించారు . వెరీ నైస్ వర్డ్స్

  16. Nityaa V
    February 3, 2016 at 2:06 pm

    ఆశ్చర్యంగా ఏదో అద్భుతాన్ని వీక్షిస్తూన్నట్లుగా…ప్రకృతిని రోజూ చూస్తూనే ఉన్నా తెలియని తాదాత్మ్యతను అనుభవిస్తూన్నట్టుగా చదివించింది మొత్తంగా. అనంత మహా కవితా సాగరాలను వీక్షిస్తూన్నా.
    ఇన్ని అక్షర నక్షత్రాలతో మురిపించిన ఇద్దరికీ ధన్యవాదాలు.

  17. Indus Martin
    February 4, 2016 at 5:58 am

    వాల్యూమ్స్ కొద్దీ కవిత్వాన్ని పుట్టించిన కవులను చూశాను, ప్రోది చేసుకున్న పాఠకుల్నీ చూశాను కానీ ఏమాత్రం సుమారుగా రాసే ఆలోచన వున్నా ఎవర్నైనా చెయ్యి పట్టుకుని రాయిస్తూ, రాయనప్పుడు చెవిపట్టుకు మెలిపెడుతూ ఎందరిచేతో ఇంత కవిత్వాన్ని రాయిస్తున్న నిశీ , కవిత్వం గుడ్లను పొదుగుతున్న రాచనాగులా కనబడుతుంది. ఈమధ్య కాలంలో నేను చదివిన ఒకవిలక్షణమైన వ్యక్తి తను . గొప్ప భావజాలం అంతే గొప్పదైన కమిట్మెంట్ …. ఇవి తననుండి నేనుఅనుభవించినవి . గొప్ప అభిప్రాయాన్ని ఇంటర్వ్యుగా చూడగలిగాను . స్నేహంతో కళ్ళు కురిశాయి !!!

  18. koppula
    February 5, 2016 at 9:59 am

    ఇంటర్వ్యూ బాగుంది. ముఖ్యంగా గొంగళిపురుగు, సీతాకోకచిలుక పోలిక చాలా భాగుంది. ఎందుకో Karle Wilson కవిత గుర్తుకొచ్చింది.

    “ఇంకా చెప్పాలంటే శుద్ధకవిత్వం పేర తెలుగుకవిత్వం తెలుగులోనే ఉండాలనే ఛాందసత్వం నుండి బయటపడి, మల్టీలాంగ్వేజి కవిత్వం మల్టిపుల్ లెవెల్స్ లో డిక్షన్ యూసేజి పెరగకపోతే, కళల్లోకెల్లా హైయెస్ట్ అండ్ నోబుల్ ప్రక్రియ అయిన కవిత్వం కూడా బావిలో కప్పే.” అని అన్నారు కదా, నాకు ఈ విషయంలో కొన్ని ప్రశ్నలున్నాయి:

    1. “శుద్ధకవిత్వం పేర తెలుగుకవిత్వం తెలుగులోనే ఉండాలనే ఛాందసత్వం నుండి బయటపడి” అన్నదాంట్లో శుద్ధకవిత్వం అంటే ఛందోబద్ధ కవిత్వం అని మీ ఉద్దేశ్యం అయితే పరవాలేదు, కానీ తెలుగు వచనకవిత్వం తెలుగులో ఉండాలనుకోవడం ఛాందసత్వం అంటే మాత్రం మీరు దాన్ని ఇంకాస్త వివరంగా చెప్పాలి. ఛందోబద్ధ కవిత్వం నుండి బయటికి వచ్చినా ఇది తెలుగుకవిత్వం కాబట్టి తెలుగులోనే కదా ఉండాల్సింది?

    2. ‘బావిలో కప్పే’ అన్నది కూడా అర్థం కాలేదు. తెలుగు వచనకవిత్వాన్ని హిందీ, ఇంగ్లీష్ (మల్టీలాంగ్వేజి) పదాలతో కలగూరగంపచేసినంత మాత్రాన, తెలుగుకప్ప బావిలోంచి బయటకు దూకి ప్రపంచానికి తెలుగు గొప్పదనాన్ని చాటింపు వేస్తుందా? అలా అయితే ఈ సంకరభాషతో చంపకుండా సుబ్బరంగా తెలుగు కవులు మొత్తం ఇంగ్లీష్ లోనే, స్పానిష్ లోనే రాసుకోవొచ్చు కదా? ఇలా చేస్తే కనీసం ప్రపంచ దేశాలకు మన తెలుగువాళ్ళు రాసే గొప్ప ఇంగ్లీష్ కవిత్వం చదివే అవకాశం అయినా వస్తుంది. తెలుగురాష్ట్రాలకు కాకపోయినా భారతదేశానికన్నా పేరొస్తుంది.

    మీ గురించి వాకిలిద్వారా ఇప్పుడే తెలిసింది. కవిత్వంలో మీకు మంచి అవగాహన ఉంది. సంతోషం. ఇప్పుడే మీ పేరు గూగుల్ లో సెర్చ్ చేసి సారంగా పత్రికలో మీ వ్యాసాలు కొన్ని చదివాను. సారీ! మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలనిపించింది. తెలుగుభాష మీద మీకున్న నిర్లక్ష్యం ఆ వ్యాసాల్లో ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. మీకు ఇంగ్లీషు భాషలో రాయడం సౌకర్యంగా ఉంటే ఇంగ్లీష్లోనే రాయొచ్చుకదా?
    “కొంత భాష , భావం తెలిసిన ఏ వ్యక్తి అయినా కవి కావడం సుళువే.” అని మీరు చెప్పినట్టు, కవిత్వానికి భావం ఎంతో భాష కూడా అంతే ప్రధానం అన్నది మీరు ఒప్పుకుంటారనుకుంటాను. అయితే తెలుగు కవిత్వంలో కనీసం 80% అయినా తెలుగు ఉండాలని కోరుకోవడం తప్పంటారా? ఒక భావాన్ని తెలుగుభాషతో వ్యక్తం చేయలేనప్పుడు తెలుగులో రాయడం కూడా దండగే అని నా అభిప్రాయం.

    కొప్పుల

    • బ్రెయిన్ డెడ్
      February 5, 2016 at 6:00 pm

      పొతే ప్రశ్నలు జవాబులు కార్యక్రమం ఇంకొంచం ఎక్స్టెండ్ అయినట్టు ఉంది
      ఫైనల్లీ కొప్పుల గారు ,టెల్గు కవిత్వం టెల్గు లోనే రాయాలన్న ఆస్థాన కవుల నుంచి దూరంగా సాగుతూ ఎదిగిన కవిత్వమే న్యూ ఏజ్ తెలుగు వచన కవిత్వం . ఇది మొదటి నుండి సాగుతున్న చర్చే అయినా మళ్ళీ ఇంకోమారు చిన్న క్లారిఫికేషన్ అందరు మనుష్యులే కదా ఇన్ని మాటలు ఇన్ని బాషలు ఎందుకు శుభ్రంగా సైగలతోనే గడిపేస్తే ప్రపంచంలో చాల వరకు లాంగ్వేజి బేస్డ్ యుద్ధాలు పెద్దరికాలు ఆధిపత్యాలు తగ్గిపోతాయి కదా అంటే సమాధానం ఏముంటుంది ? ముందే చెప్పుకున్నట్లు కంఫర్ట్ + చేంజ్ . ఈ రెండు హ్యాండ్ in గ్లోవ్ లా ముందుకు నడుస్తూనే ఉంటాయి మనల్ని నడుపుతూనే ఉంటాయి
      పోతే యోగర్డ్ లో ఆవకాయ కలుపుకు తినే మనం అసలు సంకరం గురించి మాట్లాడక్కరాలేదు అనుకుంటా .ప్రస్తుతం ఉన్న జెనేరేషన్ మొత్తం గా సంకరం బేస్డ్ గానే జీవితాలు గడుపుతున్నప్పుడు భాష ఏమి దానికి అతీతం కాదు .
      తెలుగులో రాయగానే పరాయి దేశంలో వాళ్ళ జెండాలకి సెల్యూట్ కొడుతూ కూడా మన సంస్కృతి కాపాడుకుంటూన్నాం లాంటి విపరీత ధోరిణి ఏమయినా ఉంటే , అసలు ముందు మల్టీ లెవల్ లాంగ్వేజి వాడుకుంటే వేరే దేశం దాక ఎందుకు నా పక్క ఇంట్లోనో పక్క సిటీలోనో నా తర్వాతి తరంకి నేను చెప్పాలనుకున్నది అర్ధం అయితే చాలదా ? నాకోసం నేను రాసుకొని నేనే చదువుకొనే ప్రాసెస్ లో టెల్గు సరిగ్గా రాని ఒక కుర్రాడికి కనీసం వినిపిస్తే సంతోషించే కవిత్వం రాసుకోవడం హాయిపనిగా .అదంతా కుదరదు అంటే మనం అంతా పడి పడి చూసిన బాలివుడ్ NRI బేస్డ్ డ్రీం సెల్లర్ మూవీస్ సక్సెస్ కాకూడదు కదా . మన లాప్టాపుల్లో మై దిల్ గోస్ mmmm సాంగ్స్ బదులు ఎంచక్కా మేరె వతన్ లోగో అని శుద్ధ ఒకే భాష లో రాసుకొనే పాటలే వినబడాలి ( బై ది వే మై దిల్ గోస్ పాట సలాం నమస్తే సినిమాలోది పైగా సినిమా స్టోరీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కి సంభందించినది . హత విధీ . నిజ్జం కావాలని గుర్తు తెచ్చుకోలేదు సడెన్ గా స్ట్రైక్ అయిన మూవీ )
      లాస్త్లో అదృష్ట వశాత్తు మీరు సారంగ ఆర్టికల్స్ మాత్రమే చదివారు . నేను రాసిన పజ్జాలు కూడా చదివి ఉంటే 
      నిర్లక్ష్యం అని మీరు అంటున్నారు . అదే నా నిజాయితీ వాక్యం అందుకు భిన్నంగానో వేరుగానో బ్రెయిన్ డెడ్ రాయలేదు అని నేను అంటున్నాను .
      త్వరలో మీరు రాసే స్పానిష్ పోయెమ్స్ కోసం ఎదురుచూస్తూ . లోల్ . ( లోల్ ని తెలుగులో ఎలా రాయాలి దొర్లి దొర్లి నవ్వి అనా నవ్వి నవ్వి దొర్లి అనా సత్య ప్రమాణకంగా నాకు తెలియదు . )

      • koppula
        February 5, 2016 at 10:42 pm

        నిశీధి గారు,

        యువర్ కామెంట్ పడ్నేకే బాద్ నేను కూడా దొర్లి దొర్లి carcajadas :-) .

        ప్రపంచంతో పాటు మనం జీవించే విధానం మారుతుంది. భాష మారుతుంది, భాషతో పాటు వాక్యం మారుతుంది. “The essential purpose of language is communication” అన్నట్టు, వాక్యం రాసేదే భావాన్ని చేరవేసేందుకు. అందుకే వాక్యం అర్థం అయ్యేట్టు కూడా ఉండాలి. అర్థం కాని వాక్యం ఎన్ని భాషలు వాడి రాసినా దండగే.

        నేను మీ కవిత్వం ఎక్కువగా చదవలేదు. చదివి చూస్తా.

        యాకూబ్, స్వామీ వెంకటయోగి, పసునూరి శ్రీధర్ బాబు, అఫ్సర్, హెచ్చార్కె, కోడూరి విజయ్ కుమార్ .. ఇలా కొంత మంది కవిత్వం చదివాను. వీళ్ళు వాడుకభాషలోనే రాస్తున్నారు. వీళ్ళు రాసిన కవిత్వంలోగానీ వచనంలోగానీ ఈ మల్టీలాంగ్వేజ్ గొడవ లేదు. నాకు వాళ్ళవి సుబ్బరంగా అర్థం అవుతున్నాయి. మల్టీ లాంగ్వేజ్ లో రాస్తేనే అందరికీ రీచ్ అవుతుంది అన్నది నిజం కాదేమో!? అరుణ్ సాగర్ గారు కూడా తన వాక్యాల్లో హిందీ, ఇంగ్లీష్ పదాలు విరివిగా వాడుతారు. కానీ ఆ వాక్యాలు పూర్తిగా ఉంటాయి. ఆయన వాక్యనిర్మాణంలో శ్రద్ధ కనిపిస్తుంది.

        “నిర్లక్ష్యం అని మీరు అంటున్నారు . అదే నా నిజాయితీ వాక్యం అందుకు భిన్నంగానో వేరుగానో బ్రెయిన్ డెడ్ రాయలేదు అని నేను అంటున్నాను .” అన్నారు. నిశీధి గారు, మీ నిజాయితీ నిజంగా నాకు నచ్చింది. మీ నిర్లక్ష్యమే మీ ప్రత్యేకత అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఇది నాకోసం రాసుకున్న కవిత్వం. నేనిట్లాగే రాస్తాను, మీ తంటాలు మీరు పడండి అని ఒక కవి/రచయిత చెప్పుతే ఇంకేముంటుంది.

        అర్థం కాని విషయమేమిటంటే మీ వ్యాసాలకి వచ్చిన కామెంట్లలో ఒక్కరు కూడా మీ వాక్యనిర్మాణం గురించి మాట్లాడలేదు. ఆఖరికి ప్రచురించే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు అంటే ఇంకా ఆశ్చర్యం వేసింది. బహుశా కాలంతో పాటు నేనే మారాలి అనుకుంటా. ఎవడికి తెలుసు ఇంకో పదేళ్ళలో ఈ మల్టీలాంగ్వేజ్ సంకరభాషే ప్రధాన “టెల్గు” భాష అవుతుంది కావొచ్చు.

        నిర్మొహమాటంగా ఇలా మాట్లాడినందుకు సారీ! All the best with your poetry.

        కవిత్వం రాయడంలో ఇంకా కాలు పెట్టలేదు. ఒకవేళ పెడితే ఏకంగా మీరన్న టెల్గు-స్పానిష్ పోయెమ్స్ (స్పాటెల్గు) తోనే వస్తా :-)

        పడిపడి, దొర్లిదొర్లి నవ్వుతూ… బై.

        -కొప్పుల

  19. February 5, 2016 at 1:43 pm

    Interviewer గారు వేసిన 3వ ప్రశ్నలోని శుద్ధ కవిత్వంకు ఛందోబద్ధ కవిత్వం అనే అర్థం వుండగా, 4వ ప్రశ్నకు నిశీథి గారిచ్చిన జవాబులోని శుద్ధ కవిత్వానికి స్వచ్ఛమైన (కల్తీ లేనటువంటి), లేదా సాంద్రమైన (గాఢమైన) కవిత్వం అనే అర్థాలున్నట్టు గ్రహించాలి మనం. కవిత్వం పాలు తక్కువైన ‘కవిత్వాన్ని’ శుద్ధం కాని కవిత్వంగా చెప్పుకోవచ్చును కదా.

    • బ్రెయిన్ డెడ్
      February 5, 2016 at 5:59 pm

      శుద్ధ కవిత్వం అశుద్ధకవిత్వం విషయంలో ఎలనాగ గారు నారాయణ స్వామీ గారు చేసిన చిన్న డిస్కషన్లో నిజానికి అన్సర్స్ దొరికిపోయాయి . వాడుక భాషలో చాల వరకు శుద్ధ కవిత్వం అన్న పదం విన్నాం కాబట్టే , ఛందోబద్ధ కవిత్వం కి బదులుగా అది వాడటం జరిగింది తప్ప వచన కవిత్వం impure అన్న ఉద్దేశ్యం లేదు

    • koppula
      February 5, 2016 at 10:48 pm

      “కవిత్వం పాలు తక్కువైన ‘కవిత్వాన్ని’ శుద్ధం కాని కవిత్వంగా చెప్పుకోవచ్చును కదా.”
      అవును, అది అకవిత్వం అని కూడా కొందరు అంటూ వుంటారు.

  20. బ్రెయిన్ డెడ్
    February 5, 2016 at 5:59 pm

    వావ్ !
    వేకువ చలుల్లో రాలిపడ్డ చమేలి మెరుపుల పరిమళాలలో తడవడం
    ప్రేమ శబ్దమై కురిసే మేఘాల స్నేహంలో దాహం తీర్చుకోవడం
    ఇస్ అజీబ్ దాస్తా హం సే షురూ ఔర్ ఆప్ సబ్ సే కతం
    నిహిలిస్టుల నిష్టూరాలని భరిస్తూ ఇంతగా ప్రేమించడం ఎలా సాధ్యం గురూ ?
    మనసెందుకో సంభ్రమాశ్చర్యాలలో ప్రశ్నార్ధకమై తొంగి చూస్తూ గుసగుసలు

    ఇంటర్వ్యూ కావాలి నిశీ అని వాసుదేవ్ గారు అనగానే , ఆవేశంగానో అమాయకంగానో మీ అందరి వేళ్ళు పట్టుకొని కాస్త నడిచోచ్చిన దారే కదా , మీకు తెలియంది నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది చెప్మా అని ముందు బోల్డు ఆశ్చర్యం . తర్వాత ప్రశ్నలు రావడం , సోషల్ పేపర్ కి రెడీ అయ్యి లాంగ్వేజి పేపర్ రాయాల్సొచ్చింది బిటెక్ పరిక్షల్ల్లో లా చదివిన పోర్షన్ వేరు క్వషన్ పేపర్ వేరు అని బిక్కమొహం వేసి , అయినా చదివేది మన దోస్తులే కదా ఇన్నాళ్ళు నేను కవిత్వం అని ఏమ్రాసినా భళా అన్నవారే కదూ , ఇంకేమి ధైర్యే సాహసే ఇంటర్వూ అనుకోని ఫినిష్ లైన్ దాటి హమ్మయ్య అనిపించేసానా , ఇక్కడికొచ్చి ఈ రెస్పాన్స్ అంతా చూస్తే ఎంత దిల్ కుష్ . థాంక్స్ స్వీట్ హార్ట్స్ నా వాక్యం మీద మీకున్న నమ్మకం కన్నా , మీ ప్రేమాభిమానాల మీద నాకున్న నమ్మకం మళ్ళీ గెలిచింది . ఈ రెండు రెండున్నర ఏళ్ళ కలసి నడిచిన నడక ఇంకా అంతే బలంగా సాగుతూ నన్ను మీలోకి కవిత్వంలోకి మరింత లాక్కుంటూ అద్భుత ప్రయాణం
    హెచ్చార్కె , మాస్టర్ ఎస్ ఆరాలాను చించాల్సిన సమయం వచ్చేసింది . మీరలా మాకు నిండు ధైర్యం లా నిలబడి ఉండండి , చేసి చూపించే సేన మేమున్నాం
    కెక్యూబ్ వర్మ , సర్ జీ కవిత్వం ఎవరి దగ్గర ముందు నేర్చుకున్నావు నిశీ అంటే ఇదుగో మా సర్ జీ అని చూపగలిగే గర్వం . మీరిచ్చిన స్వేచ్చే కదా ఇదంతా .
    మిథిల్ ,లాస్య ప్రియ , శ్రుత కీర్తీ , లోకేష్ గారు , శారద గారు , నిత్యా వి బోల్డు హగ్స్ , ఎలా అబ్బ ప్రేమై కురవడం ?
    మెహది సర్ , , రవీందర్ సర్ , సరళ గారు థాంక్స్ అ బిలియన్
    ఇండస్ మార్టిన్ గారు కలిసి చేయాల్సిన పనులు రాయాల్సిన రాతలు ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి కదా
    నారాయణ స్వామి గారు , ఎలనాగ గారు , జయశ్రీ మేడం , ప్రసూన గారు , కొప్పుల గారు ఓపిగ్గా చదవడమే కాకుండా మార్గదర్శనం చేస్తుంన్నందుకు కృతజ్ఞతలు
    స్పెషల్ థాంక్స్ టు ఎడిటర్స్
    ఇంత సంతోషాన్ని అందించినందుకు వాసుదేవ్ గారు మీకు మాత్రం ఒక మంచి నురగలు కక్కే కాఫీ మోచా బాకీ .

  21. వాసుదేవ్
    February 6, 2016 at 8:42 pm

    హమ్మయ్య ఇప్పుడిక ఈ ఇటర్వ్యూ కి కాస్తంత అందమూ అర్ధమూ వచ్చాయనుకుంట. ముందుగా, స్పందించిన మిత్రులదరికీ ధన్యవాదాలు.

    1. ఎలనాగ గారికి–
    ‘శుద్ద’ కవిత్వం అన్న పదప్రయోగం మీ లాంటి సీనియర్ కవులు ఇప్పటికి వినే ఉండాలి. దాన్ని చందోబద్ధ కవిత్వానికి పర్యాపదంగానే వాడుతున్నాం కదా. అలానే ఇక్కడ కూడా నిశీ గారిని అడిగాను. అలానే వచన కవిత్వం ఏమాత్రం తక్కువ కాదు. కానీ చందోబద్ధ కవిత్వమెప్పుడు గొప్పదే. అలా రాయటం చేతకాకనే మనం వచనకవిత్వం రాస్తున్నాం ఇది కేవలం తెలుగులో మాత్రమె కాదు ఆంగ్లంలో కూడా ఉన్నదే. ఇప్పుడు meter లో రాసే ఆంగ్ల కవులెక్కడ? మీటర్లెక్కన రాసే వాళ్ళే తప్ప.
    “వచన కవిత్వం శుద్ధ (pure) కవిత్వం కాజాలదని అనొచ్చా అన్నది సందేహం” అన్నారు. డెఫినిట్ గా కాజాలదు. కాని దేని విలువ దానికుంటుంది.
    2. నారాయణ స్వామిగారికి–
    ప్రతి పదానికీ వ్యతిరేక పద ప్రయోగం ఉండాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకవేళ తప్పనిసరిగా ఉండాలి అనుకుంటే వచన కవిత్వమే దానికి సమాధానం. కాబట్టి ఇక్కడ ‘శుద్ద’ అంటే pure అనే అర్ధంలో తీసుకోలేం. కవిత్వం, అకవిత్వం అని మాత్రమే ఉన్నాయి వాడుకలో కదా.
    3. కొప్పుల గారికి–
    ముందుగా మీరు చాలా ఓపిగ్గా చదివి స్పందించినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్నలకు దాదాపు అన్నిటికీ ఆమె నే జవాబిచ్చారు కాబట్టి నేను చెప్పేది తక్కువే. ఒక్క విషయం మాత్రం మాట్లాడదామ్.
    భాషా సంకరం గురించి: దాదాపు కొన్ని వేల ఆంగ్ల పదాలు మన తెలుగు భాషలోకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఓ సో కాల్డ్ ఆంగ్ల పదం లేకుండా ఐదు నిముషాలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాం. ఒకవేళ అలా మాట్లాడితే అదొక పౌరాణిక స్టేజి డ్రామా లా ఉంటుందే తప్ప సంభాషణ లా ఉండదు.
    మీరు మో గురించి కాదివున్నారేమో తెలియుడు నాకు. అతనెప్పుడో ఇలా తన కవిత్వంలో చాలా భాషల పదాలని వాడి మరీ ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు నిశీ మాత్రమె ఇలా ప్రయోగం చెయ్యట్లా….
    భాషా శృంఖలాలని “మో ” (వేగుంట మోహన్ ప్రసాద్ ), కవితా శిల్ప శృంఖలాలని అరుణ్ సాగర్ లాంటి వారు తెంచుకుని మరీ బయట పడ్డారు ఎప్పుడో. ఇప్పుడు కొత్తగా నిశీ చేస్తున్న సంకరమేమి లేదు….ఐతే ఆమె కవిత్వంలో ఉన్న వేడి, వాడి మాత్రమె ఆమెని పాప్యులర్ చేస్తున్న ఈ క్రమంలో ఈ భాషా సంకరం కొత్త వాదన మాత్రమె. అయినా ఇంకా ఎన్నాళ్ళని ఒకే వరవడిలో రాసే వాళ్ళని చదువుతారు. అలానే ఎన్నాళ్ళని రాయమంటారు? మీకు కావాల్సింది ఓ మంచి వాక్యమా లేక అందులో ఎన్ని తెలుగు పదాలున్నాయి ఎన్ని పరభాషా పదాలున్నయన్నదా?
    సర్! ఓ కవిత కి లిమిటెడ్ రీడర్స్ ఉంటారు. అదే ఓ చీరలకొట్టు పాంఫ్లెట్ కి అందరూ రీడర్స్. రెంటి మధ్య తేడా కనుక్కొన్న వాడే సాహిత్య పాటకుడు లేదా పాతకుడు.
    “ఘుర్ఖా” అన్న కవిత రాస్తున్నప్పుడు టైటిల్ నుంచే భాష సమస్య రావాలి కదా మరి వస్తుందంటార? అక్కడ ఓ వాక్యంలో అతని గొంతెమ్బడి “విజిల్” అని రాసాను. అక్కడ విజిల్ అని కాకుండా దానికో తెలుగు పర్యాయ పదాన్ని వెతికి దాన్ని ఉతికి మరీ రాయమంటారా? ఒకవేళ ఓ కవితలో స్టేషన్ అని రాయాల్సి వస్తే దానికి బదులుగా “ ధూమ శకట గమనాగమన నిలయం” అనే రాద్దామా?
    సో కవిత్వ ప్రేరరణలు రకరకాలు గా ఉంటాయి అందరూ ఒకే రకంగా రాయాలనే రూలేమీ లేదు కదా ముఖ్యంగా మనకిష్తమైన వచన కవిత్వం లో? ఎంజాయ్ చెయ్యండి సర్జీ…….కవిత్వం ఎన్ని రకాలో కవిత్వ పోకడలు అన్ని రకాలే. ఎవరి దారి వారిది. ఎవరి పధ్ధతి వారిది. రాసే ప్రతి వాక్యమూ ప్రతి రీడర్ కి అర్ధం కావాలనే రాస్తాం కానీ అర్ధం కాకపోవడంలో నోట్స్ లాంటివి ఇవ్వలేం కదా.
    వాకిలి యాజమ్యాం కి ధన్యవాదాలతో… మీ వాసుదేవ్

  22. వాసుదేవ్
    February 6, 2016 at 8:53 pm

    నాపై నమ్మకం గౌరవం కొద్ది అడగ్గానే ఇంటర్వ్యూ ఇచ్చిన నిశీ గారికి ప్రత్యెక ధన్యవాదాలు. మీ మోచా కాఫీ కోసం వెయిటింగ్ మేడం .

  23. K SHESHU BABU
    February 6, 2016 at 11:00 pm

    కవి ఎవరైనా కవిత ఎవరిదైన ఆ కవితకు సామాజిక ప్రయోజనం వుంటే అది చిర స్మరనీయం గా వుంటుంది. ‘కుక్క పిల్ల , అగ్గి పుల్ల…’ కవితా వస్తువులు ఐతే అవి సమాజం లోని కొన్ని వస్తువులకు ప్రతీక కాబట్టి సామాజిక ప్రయోజనాన్ని నిర్వర్తించాయి . గదర్, చరబందరాజు మరియు వరవరరావు మొదలైన కవుల కవిత్వాలు ఈ సామజిక బాధ్యత నిర్వహిస్తున్నాయి కావున ప్రజలలో నిలబడ గలుగుతున్నాయి . ముఖాముఖి బాగుంది. ధన్య వాదాలు .

  24. koppula
    February 7, 2016 at 2:09 am

    వాసుదేవ్ గారు,
    మీ వివరణకి ధన్యవాదాలు. మీరు నా కామెంట్స్ పూర్తిగా చదవనట్టుంది. నిశీధి గారు నా కామెంట్ కు రాసిన సమాధానం చదవగానే నిజం చెప్పాలంటే నీరసం వచ్చింది. కవితలో నాలుగు ఇంగ్లీషు పదాలు వాడగానే దాన్ని చదివే పాఠకుల సంఖ్య పెరుగుతుందా? అది బావి దాటి ఎక్కువ మందికి చేరుతుందా? అయినా ఏం భాషండీ అది?! దానికి మీ సమర్థింపు ఒకటి. ఈ చర్చకు ఆవిడ దగ్గరనుండి అంతకంటే ఎక్కువ సమాధానం రాదనీ, ఆ భాష చదవలేక, చర్చ అక్కడే ఆపేద్దాం అని ఎదో సరదాగా కామెంట్ పెట్టి వదిలిచ్చుకున్నా. మీరు మళ్ళీ ఇలా…

    మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది. నేను చెప్పింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే, మళ్ళీ వివరణ ఇస్తున్నాను, చూడండి.

    అరుణ్ సాగర్ గారి గురించి నేను కూడా ముందే ప్రస్తావించాను. మో పేరు కూడా గుర్తుకు వచ్చింది, కానీ, ప్రస్తావించకపోవడానికి కారణం నిశీధి గారి కవిత్వాన్ని మో కవిత్వంతో పోల్చడం ఇష్టం లేక. అరుణ్ సాగర్, మో లతో నిశీధి గారిని పోల్చలేము. అది మీకు కూడా తెలుసు. మో గురించి ఒక చిన్న మాట. He did not F*** the language like what Nisheedhi is doing now. మీరు మో ‘నిషాదం’ చదివారు కదా, అందులో “నా ఆధునిక కవితా నేపధ్యం” అని మో రాసుకున్న వ్యాసం కూడా చదివే ఉంటారు. ఆ వ్యాసంలో పరభాషా పదాలు వాడినా ఎంత శ్రద్దగా, ఎంత కుదురుగా వాక్యాలు రాసారో ఒకసారి చూడండి. మన ఆలోచనలో నిర్లక్ష్యం ఉండొచ్చు, మనం చెప్పేది నిర్లక్ష్యంగా చెప్పొచ్చు, కానీ అది చెప్పినప్పుడు వాడే/రాసే భాషమీద నిర్లక్ష్యం చూపించవద్దు. మనం రాసే తెలుగుభాషలో ఇంగ్లీష్ పదాలు అవసరం ఉన్న చోట వాడటం వేరు, తెలుగు రాకనో, లేక స్టైల్ కోసమో వాడటం వేరు. అవసరం ఉన్నప్పుడు పరభాషా పదాలు వాడటం మీద నాకు ఏ గొడవా లేదు.
    చిన్న పిల్లలకు చెప్పినట్టు ‘విజిల్’ గురించి, ‘స్టేషన్’ గురించి చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఒక fine morning అని, మేల్ ఫిమేల్ అని, వాక్ చేసి అని, స్క్రూ చేసి, ఫ** చేసి అని వాక్యాన్ని ఎలా మొదలు పెట్టామో కూడా గుర్తుపెట్టుకోకుండా, సాగదీసి, మధ్యలో మొత్తం కలగాపులగం చేసి, చివరిగా ఆ వాక్యాన్ని పూర్తి చేయడం చేతకాక అలాగే వదిలిపెట్టడం… సర్, ఇలా రాయడం మంచిది కాదేమో అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశ్యం. అంతకంటే ఏమీ లేదు.

    వీలయితే మీరు ఆ చివరి ప్రశ్న సమాధానంలో రెండవ పేరా చూడండి. ఎంత కృతకంగా ఉందొ వాక్యం. అలాగే, సారంగా పత్రికలో ఆవిడ రాసిన వ్యాసాల్లో వాక్యాలు చూడండి. ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు మెచ్చుకుంటారా? తెలుగుభాషలో కవిత్వం రాసి ఇప్పుడిప్పుడే మంచిపేరు తెచ్చుకుంటున్న ఒక కవికి అదే తెలుగుభాషమీద నిర్లక్ష్యం, చిన్నచూపు ఉండటం మంచిది కాదు. రేపు ఎవరైనా నిశీధిగారు మహా గొప్ప తెలుగు కవి అంటారు కాని గొప్ప మల్టీ లెవెల్, మల్టీ language కవి అని అనరు కదా?
    అయినా ఈ మల్టీ లెవెల్, మల్టీ language ఏంటండీ? తెలుగు కవిత్వం ఏమన్నా ఇంగ్లీషు వీడియో గేమా?! మరీ చిన్నపిల్లల్లాగా చెబుతారు. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పండి. అసలు వాకిలి వాళ్ళమీద గౌరవం పోతుంది ఇలాంటివి ప్రచురించి మామీదికి వదిలినప్పుడు.

    ఒక విషయం చెప్పండి. తను కవిత్వం గురించి చెప్పిన ఆ చక్కని నిర్వచనం తప్ప నిశీధి గారు ఈ ఇంటర్వ్యూ లో కొత్తగా చెప్పిన విషయం ఏదైనా ఉందా?

    ఇంకో విషయం. మాట్లాడే భాషకి, రాసే భాషకి తేడా ఉంటుంది. రాసే భాష ఫార్మల్ గా ఉంటుంది. ఉదాహరణకు ఈ నెల ఈ పత్రికలో అచ్చయిన సంపాదకీయాన్నే తీసుకుందాం.
    ఆ వ్యాస రచయిత ఒకవేళ ‘ఇసుక పరదాలు’ వ్యాసంలో రాసిన టాపిక్ ని ఎక్కడైనా ఉపన్యాసంగా ఇచ్చారనుకొండీ. అప్పుడు ఆయన మాట్లాడే పద్ధతి వ్యాసంలా ఉండదు. మారుతుంది. అప్పుడు భాష కూడా కొద్దిగా మారుతుంది. అదే టాపిక్ ని ఆయన ఏదైనా మందు పార్టీలో మాట్లాడారనుకోండి, అక్కడ వెంటనే భాష చాలా ఇన్ఫార్మల్ అయిపోతుంది. మాట్లాడే వాక్యం మీద అంత పట్టింపు ఉండదు. అలాంటి సందర్భంలో పరభాషా పదాలు కూడా విరివిగా దొర్లే అవకాశం ఉంటుంది. కానీ, చూశారా, అదే టాపిక్ ని ఒక వ్యాసంలా రాసినప్పుడు ఆయన ఎంత శ్రద్ధ తీసుకుని ఉంటారో గమనించవచ్చు. వీలయితే మీరు ఆ వ్యాసం చూడండి. అందులో ఇంగ్లీషు పదాలు కూడా బాగానే ఉంటాయి. రాసేటప్పుడు మనం చెప్పే విషయం ఫార్మల్ అవుతుంది. ఎందుకంటే అది తుడిస్తే పోదు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తాము. ఇవన్నీ మీకు తెలియక కాదు. నిశీధి గారికి కూడా ఈ ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి తేడా తెలియక కాదు, నిర్లక్ష్యం వల్ల అని నా అనుమానం.

    “ఓ కవిత కి లిమిటెడ్ రీడర్స్ ఉంటారు. అదే ఓ చీరలకొట్టు పాంఫ్లెట్ కి అందరూ రీడర్స్. రెంటి మధ్య తేడా కనుక్కొన్న వాడే సాహిత్య పాటకుడు లేదా పాతకుడు.” అని మీరు అన్నారు-
    అయ్యా వాసుదేవ్ సర్, నేను చెప్పేది కూడా సరిగ్గా ఇల్లాంటిదే. పాఠకుడికి మీ కవులకన్నా ఎక్కువే తెల్సు. అసలు- పాంఫ్లెట్ కి, కవిత్వానికి ఉన్న తేడా ముందుగా మీ కవులకు తెలియాలి. కవిత్వం కాఫీ షాప్ లోని మోచా పాంఫ్లెట్ కాదు. సర్! రాయడానికి, మాట్లాడటానికి చిన్న తేడా ఉంటుంది. అది తెల్సుకున్న వాడే నిజమైన రచయిత అవుతాడు. తను రాసే భాష మీద గౌరవం ఉన్నవాడే గొప్ప రచయిత అవుతాడు. ఆలోచన ఒక్కటే కాదు సర్, భాష కూడా ముఖ్యం.

    “… ఒకవేళ అలా మాట్లాడితే అదొక పౌరాణిక స్టేజి డ్రామా లా ఉంటుందే తప్ప సంభాషణ లా ఉండదు.” అన్నారు. ఇప్పుడు మనమిద్దరం చక్కగా తెలుగులోనే కదా రాసుకున్నాం. ఇద్దరం ఇంగ్లీషు పదాలు కూడా వీలయినంత తక్కువగానే వాడాము. ఇదేమి స్టేజి డ్రామాలా లేదే?! అవసరం ఉన్నప్పుడు పరభాషా పదాలు పరవాలేదు.

    ఇలా నిక్కచ్చిగా మాట్లాడటం తప్పే కావొచ్చు, కానీ ఇలా నాలా అనుకునే వాళ్ళుకూడా పాఠకలోకంలో ఉంటారని తెలియడానికి చెప్పాలనిపించి చెప్పాను. మన్నించండి.

    అన్నట్టు, వాసుదేవ్ గారు, మీ ఐదవ ప్రశ్న చాలా బాగుంది.

    శనివారం సాయంత్రం మంచిగా దుప్పటికప్పుకుని పడుకోక ఈ కామెంట్ ఏమిటో.. సరే నండి.. పడుకోవాలి.

    ఉంటాను,

    కొప్పుల

  25. బ్రెయిన్ డెడ్
    February 7, 2016 at 11:22 am

    నిశీధి కి కవిత్వం రాయడం రాదు . హమ్మయ్య వాకిలి లో ఇంకా ఈ మాట వినిపించలేదని బెంగేసుకున్నా , వచ్చేసింది . ఇహ తృప్తిగా బ్రతికేయోచ్చు . ఎందుకంటే నేను రాసింది కవిత్వం అని నేను అనుకోలేదు మిమ్మల్ని అనమని నేను బ్రతిమిలాడుకోలేదు .

    మొత్తానికి కొప్పుల గారి ఆవేశం చూస్తుంటే తెలుగు జాతిని సంస్కృతిని భుజాలు అరిగేలా మోయడానికి ఇంకో ప్రాణి బ్రతికే ఉన్నందుకు సంతోషం . అసలు మొత్తం డిస్కషన్లో మీకొచ్చిన నష్టం ఏమిటో నాకయితే అసలు అర్ధం కాలేదు నేను రాయడమే మీకు ప్రాణాంతకమా లేక నేను ఇలా రాయడం వలన మీకు ఊపిరి పోతుందా ?

    కంపారిజన్స్ కి పేర్లు తేవడం ఎందుకు మళ్ళీ వాళ్ళతో పోల్చలేం అనడం ఎందుకు . పోల్చకుండా ఉండమనే కదా అడుగుతున్నాం . ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది , ఎవరి రాయాలనుకున్న జాన్రా వాళ్ళకి ఉంటుంది .వాళ్ళ వాళ్ళ రీడర్స్ వాళ్ళకి ఉంటారు .
    ఒక పక్క ఇప్పటికిప్పుడు గూగుల్ ( గూగుల్ ని కూడా తెలుగులో వాడాలేమో ) చేసి సారంగాలో ఆర్టికల్స్ చదివాను అని చెప్తూ , ఇంకో పక్క నా ప్రతివాక్యం తెలిసినట్టు ఇంత జడ్జిమెంటల్ గా కవిత్వాలన్నీ చదివేసి కొత్తగా స్పానిష్లో రాయడానికి పూనుకున్న మహా గొప్ప ఆస్థాన తెలుగు విధ్వంసకులు సారీ విధ్వాంసకులకి తగునా ? అలాగే తన నుండి అంత కంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టే చర్చ ముగిద్దాం ఆన్న కామెంట్ కి వస్తే
    వహ్ రే ! హూ ద సో కాల్డ్ F ఆర్ యూ అని నేను అడగగలను ( థాంక్స్ టు యూ డ్యూడ్ . వాకిలి లో F వర్డ్స్ వాడటం కూడదు అనేదేమయిన ఒక రూల్ గా నాకెవరన్నా చెప్పి ఉంటే మీ కామెంట్ నాకు కొండంత బలం అయింది )
    పబ్లిక్ లో నిలబడితే ప్రశ్నిస్తాం ! నా ఫేవరేట్ పోయెట్ లైన్స్ . కాని పర్సనల్ అజెండా వేసుకొని వచ్చేవాళ్ళకి సమాధానం చెప్పుకోనవసరం లేదని కూడా ఆ పెద్దమనిషి దగ్గరే నేర్చుకున్నా .

    నిజానికి మీ ప్రతి లైన్ కి సమాధానం చెప్పడం ఒకటో తరగతి పిల్లల ఆటే . కాని డిస్కషన్ కోసం కాకుండా అదేదో పర్సనల్ అజెండా ముందుకు వస్తుంటే ఇహ ముగించడమే మంచిదని నేను కూడా ఆపేస్తున్నాను .

    పైగా భవిష్యత్తులో నిశీధి తెలుగు కవి అని చెప్పుకోవాలన్న ఆశ కాని ఇంకో పీఠాధిపతిగా మారి ఎవరు ఏమి రాయాలి అన్నది నిర్ణయించాలన్న కోరిక కాని డెఫినెట్గా నా టు డు లిస్టు లో లేవు . ఒకవేళ నిజంగానే ఇలా రాయొద్దు అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే పాపం శ్రీనాధుడు పోతన ఏమి ఖర్మ తిరుపతి వేంకటకవులు వగైరాలు మీరు రిఫర్ చేసిన పేర్లు రిఫర్ చేయకుండానే లబ్ద ప్రతిష్టుల లిస్టుల్లోపడి ఉన్న టెల్గు ని ఫక్కకుండా టెల్గులోనే రాయగలిగే కవులనుకొనే వాళ్ళని ఉరేసేవాళ్ళేమో కదా !

    ఆఖరికి మర్చిపోకుండా చెప్పేది ఏమిటంటే ఫుల్ స్టాప్ కి తెలుగులో చుక్క పెట్టండి లాంటి కామెంట్స్ లాంటివి కొన్ని వందలు చూసాక కుడాన్ను టెల్గు లాంఘ్వేజి (లోల్ ) లో ఎప్పటికయినా ఒక పజ్జెం రాయాలన్న కోరిక ఉంటె మాత్రం ఈ రోజుతో పోయింది . Now I am glad I screwed telugu and most of those conventional freaks and I am ready do so over and again . Thanks to you I feel bloody proud today

    నా వాక్యం నచ్చకపోతే చదవడం మానేయండి భయ్యా ! ( ఈ మాట నేను ప్రతి ఆ సంస్కృతి పరిరక్షకుడికి చెప్తూనే వచ్చాను ) ! లేదు నా లాంటి టెల్గు రాని వాళ్ళ కవిత్వం మీద ఇంటర్వూ వేసుకున్న ఎడిటర్స్ని మీదయినా స్టైల్లో Just screw them dude . Happy screwing time .

  26. renuka ayola
    February 7, 2016 at 1:55 pm

    . పాఠకుడికి మీ కవులకన్నా ఎక్కువే తెల్సు. అసలు- పాంఫ్లెట్ కి, కవిత్వానికి ఉన్న తేడా ముందుగా మీ కవులకు తెలియాలి. కవిత్వం కాఫీ షాప్ లోని మోచా పాంఫ్లెట్ కాదు. సర్! రాయడానికి, మాట్లాడటానికి చిన్న తేడా ఉంటుంది. అది తెల్సుకున్న వాడే నిజమైన రచయిత అవుతాడు. తను రాసే భాష మీద గౌరవం ఉన్నవాడే గొప్ప రచయిత అవుతాడు. ఆలోచన ఒక్కటే కాదు సర్, భాష కూడా ముఖ్యం……..
    సో కవిత్వ ప్రేరరణలు రకరకాలు గా ఉంటాయి అందరూ ఒకే రకంగా రాయాలనే రూలేమీ లేదు కదా ముఖ్యంగా మనకిష్తమైన వచన కవిత్వం లో? ఎంజాయ్ చెయ్యండి సర్జీ…….కవిత్వం ఎన్ని రకాలో కవిత్వ పోకడలు అన్ని రకాలే. ఎవరి దారి వారిది. ఎవరి పధ్ధతి వారిది. రాసే ప్రతి వాక్యమూ ప్రతి రీడర్ కి అర్ధం కావాలనే రాస్తాం కానీ అర్ధం కాకపోవడంలో నోట్స్ లాంటివి ఇవ్వలేం కదా.
    వాదనలు ఎలా వున్నా ఒక మంచి ఇంటర్వ్యూ సాగించారు దేవ్ గారు …..

  27. పి.మోహన్
    February 7, 2016 at 1:55 pm

    ఇంటర్వ్యూ, కామెంట్లు, వాదవివాాదాలు అన్నీ బావున్నాయి. కొన్ని పర్సనల్గా తీసుకుని వేసిన చెత్త సటైర్లు తప్పిస్తే.
    నిశీ ఈ కాలం కవి.. నో డౌట్. మనం కావాల్సింది ఇలాంటి కవులే.
    పాడిందే పాడే పాచిపళ్ల గజల్ గాయకులు, అసలు తాము రాసి చచ్చేది తమకే అర్థం గాని అస్పష్టులు చెలరేగుతున్న వర్తమానంలో గుండె కొండలోంచి ఏ సెన్సార్లూ లేకుండు ఉవ్వెత్తు ఎగసి పడే నిప్పుల్లా, లావాలా, జన్మనిచ్చిన తీగను ముద్దాడ్డానికి గాలివాటాన్ని ఆసరాచూసుకుని అల్లల్లాడే పువ్వులా సాగే నిశీ కవిత్వాన్ని పట్టించుకోకుండా, పలవరించకుండా వుండడం అసాధ్యం. మార్టిన్ గారిని మాటలను అరువుకు తెచ్చుకోక తప్పలేదు. నావీ ఆయన మాటలే.. ‘‘నిశీ , కవిత్వం గుడ్లను పొదుగుతున్న రాచనాగులా కనబడుతుంది. ఈమధ్య కాలంలో నేను చదివిన ఒకవిలక్షణమైన వ్యక్తి తను . గొప్ప భావజాలం అంతే గొప్పదైన కమిట్మెంట్ …. ఇవి తననుండి నేనుఅనుభవించినవి . గొప్ప అభిప్రాయాన్ని ఇంటర్వ్యుగా చూడగలిగాను . స్నేహంతో కళ్ళు కురిశాయి !!!’’
    ఇక.. భాష సంకరం అయిపోతోందన్న కొప్పుల గారి ఆవేదనను పాజిటివ్గా అర్థం చేసుకోండి నిశీ, గొడవ వుండదు. ఆయన సారాంశం.. అందరికీ అర్థమైతే బావుంటుంది కదా అని నేను అనకుంటున్నాను. నాబుద్ధి కొంచెం మందం.
    కొప్పుల గారూ.. మీరే అన్నట్టు మీరు మారుతున్న కాలానికి అలవాటు పడాలి. తప్పదు. మారుతూ వుండాలి. మార్పు ప్రోగ్రెసివ్గానే వుంటుందిలెండి. చరిత్ర అదే చెబుతోందిగా. విశ్వనాథసాత్యన్నారాయణ రామాయణ కల్పవ్రుక్షాన్ని, నిశీ కవితను సాధారణ మానవుడికి ఇస్తే ఎవరివి సులభంగా అర్థమైతాయో వాళ్లే ప్రోగ్రిసిివ్, నామటుకు అయితే.
    అన్యభాషా పదాలు, ఛందస్సు గొడవల గురించి నాకు తెలీదు కానీ, నిశీతోపాటు ఈ చర్చలో పాల్గొన్నవాళ్లంతా.. శ్రీశ్నీ మాగ్నస్ ఆపస్(నావరకు) ’కవితా.. ఓ కవితా..‘ ను చదవండి. మనం ఇంకా ఎంత వెనకబడి వున్నామో అర్థమై విస్మయపడకపోతే అడగండి నన్ను.. ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా ఏదో కామెంట్ చెయ్యాలంటే చెయ్యాలని రాస్తున్నా. నేను కవిత్వ రాజ్యంలో సామాన్య పౌరుడిని.

    • పి.మోహన్
      February 8, 2016 at 2:22 am

      కొప్పులగారూ…
      బహుశా నేనూ మీ మాదిరే సాధారణ పాఠకుణ్ని కావడం వల్ల మీ ఆవేదనను కొంచెం అర్థం చేసుకున్నానేమోనండి. మంచి అయినా, చెడ్డ అయినా సూటిగా, స్పష్టంగా చెప్పడాన్ని నేను ఇష్టపడతాను. కవిత్వం అనుభూతిపరమైంది కాబట్టి దీనికి అందాన్ని జోడించక తప్పదు. ఆరెస్సెస్ భాగవత్ నుంచి , మజ్లిస్ ఒవైసీ నుంచి మనం కవిత్వాన్నిఆశించలేం కదా.
      భాష జీవనది అంటారని ఈ చర్చలో పాల్గొన్నవాళ్లందరికీ తెలిసిందే. ఆ సత్యాన్ని గుర్తిస్తే సమస్య వుండదు. జనం తమకు సులువుగా వుండే పదాలను ప్రేమిస్తారు, కొనసాగిస్తారు. ఎవరో ఒక పెద్దాయన హాస్పిటల్ను ఆస్పత్రి అని రాయకూడదని, మాట్లాడకూడదని, వైద్యశాల అనాలని వెబ్ పత్రికల్లో ఐదారేళ్ల నుంచి ఒకటే గొడవ చేస్తున్నాడు. ఆయనది లోకవిరుద్ధమై కోరిక కాబట్టి అరణ్యరోదనే అవుతోంది. అసలు అచ్చమైన తెలుగు అనే ఒక భాష ఉందాని నాకు తరచూ ఒక అనుమానం వస్తూ వుంటుంది. అచ్చతెలుగు కావ్యాల్లో వేటినీ నేను అనుభూతించలేకపోయాను. శబ్దరత్నాకరాన్ని పక్కన పెట్టుకుని చదవాల్సిన అవసరం నాకే కాదు, చాలామందికీ అక్కర్లేదు కదా. శ్రీశ్రీ మహాప్రస్థానంతో చాలాచోట్ల నాకిదే పేచీ. తమ ఇంగ్లిష్ పాండిత్యాన్ని అనవసరంగా దొర్లించే తెగులు కవులతోనూ ఇదే సమస్య. ’వన్ ఫైన్ మార్నింగ్.. నేను చంద్రుణ్ని చూశాను..’ అని అంటే చాలా ఆనందిస్తాను కానీ.. ’నేనొక despot ను, నా deride నా eloquence అని అంటే.. హా..అవునా. ఛా ఫోవో అంటాను. నాకు నిశీ కవిత్వంలో అద్రుష్టవశాత్తూ ఇలాంటి పాండితీ ప్రకర్ష కనిపించదు.
      నిశీ కవిత్వం ఏ ప్రమాణాలకూ అందనిది. ముందే చెప్పినట్టు కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. ఆమె పదాలకోసం పెద్దగా గింజుకోదు. డైరెక్ట్ అటాక్. ఇంగ్లిష్, ఉర్దూ, సంస్క్రుతం, ఇంకా ఏవో పదాలున్నా ఆమె ఏం చెబుతోందో అర్థమవుతుంది. దీన్ని శాతాల్లో కొలిస్తే చాలాకవితల్లో 99 శాతం అర్థమవుతాయనే చెప్పొచ్చు. తనే ఇదివరకు ఎక్కడో అంది, తను ఇకపై రాయబోయే కవితలను మరింత క్లారిటీగా రాయాలని. అంటే తన సమస్యను తను గుర్తించినట్టే కదా. క్లారిటీ అంటే ప్లెయిన్గా రాయడం కాదని మనకు తెలుసు. నేను అప్పకవీయాన్ని ఎంజాయ్ చేసినంతగా మో తతిమ్మా కవులను ఎంజాయ్ చెయ్యలేను. అది నా పరిమితి. అప్పకవి నాకు అర్థమౌతాడు. మో కూడా చేసుకోగలిగే అయితాడేమో కానీ నాకు ఆ శక్తి లేదు, పైనా అనవసరం కూడా లేదు. నాకే కాదు, నాలాంటి కోట్లాది మందికి కూడా. కాదని వాదించేవాళ్లు ప్లెబిసైట్ పెట్టుకోవచ్చు. కవులు మానవేతరజాతి అని, వాళ్లది గ్రహాంతరజీవుల భాష అని అంటారా? అయితే ఇక గొడవలేదు. నేను భూమ్మీదే వుంటాను. నేను దారితప్పినట్టుంది. కవిత్వంలో అసంబద్ధతను(గుర్తించగలిగితే) నేను నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను. కాని అస్పష్టతను అసలు భరించలేను, అది ఎన్ని ముసుగుల్లో వున్నా సరే. కవి ఏం చెబుతున్నాడో/తోందో అర్థమైతే అనుభూతి నిండుగా వుంటుందని ఇక్కడ కొట్టాడుకున్న వాళ్లందరూ ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను.
      ఇంతకూ నేను చెప్పినదాంట్లో అస్ఫష్టత ఏమన్నా వుంటే మన్నించగలరు. వుంటే చెప్పండి. కొరడా పక్కనే పెట్టుకున్నాను. మిమ్మల్ని కాదు, నన్ను కొట్టుకోడానికి..

  28. సాయి పద్మ
    February 7, 2016 at 8:50 pm

    నిశీధి గారి కవిత్వం గురించి.. ఇందాకటి నుండీ ఇంటర్వ్యూ నెమ్మదిగా చదివేసి.. చర్చలు ,వాడి వేడి బాణాలు స్పీడ్ గా చదివేసి, నాకు అర్ధం అయింది ఇది..
    కవిత్వానికి పీఠాదిపతులు మతాధిపతులు అక్కర్లేదని అందరూ వోప్పుకుంటున్నారు.. హమ్మయ్య వో గోల వదిలిపోయింది
    ఏది శుద్ధకవిత్వం , ఏది సుద్దముక్క కవిత్వం అన్నదాంట్లో ఏకాభిప్రాయం లేదు. నిశీధి లాంటి పిల్ల కవులని ( అబ్బా.. ఎంత సుఖమో ) అరుణ్ సాగర్, మో లతో పోల్చదగినది కాదు.. మరి అలాంటప్పుడు ఆమె ఏం రాసినా వర్రీ ఎందుకు ? వర్రీ అవుతున్నారంటే ఆమె కవిత్వంలో మిగతావాళ్ళు తీసుకుంటున్నది ఏదన్నా ఉందా ?
    భాషా సంకరం గురించి- అసలు కవిత్వమే కాదు మొర్రో అని ఆమె మొత్తుకుంటున్నప్పుడు, ఇక భాష గురించి బాధ ఎందుకు ? ఆ కవిత్వం బ్రతికుండాలి అని ఆమె కంటే విమర్శకులే కోరుకుంటున్నారా ? చాలా మందికి నచ్చితే నాలుగు షేర్లు ..మూడు లైకుల్లా అదే ఉంటుంది ..లేకపోతే పురిట్లోనే చస్తుంది. వై బాధ ?
    ఇదీ నాకు అర్ధమైంది.. కానీ, అర్ధం కానిది వొకటే.. ఎందుకు కవిత్వాన్ని ,భాషని, అందరూ పరిరక్షించాలని కంకణాలూ , బ్రేస్లేట్లూ కట్టుకుంటారు ? వాటిని అవి రక్షించుకోనంత వల్నరబుల్ పొజిషన్ లో ఉన్నాయా అవి ?
    పాశ్చాత్య పెను తుఫానుకి రెప రెప లాడుతున్న కవిత్వాన్ని రక్షించటానికి నిశీధి గానీ, మరొకరు గానీ.. అంత శంకరశాస్త్రుల మని చెప్పలేదు కదా ?
    అంటే కొన్నేళ్ళు రాసాక , అరుణ్ సాగర్ గారిలా, మో గారిలా .. వాక్యం శ్రద్ధగా రాసినట్టు అవుతుందా.. లేకపోతే చనిపోతే అవుతుందా..?
    హ్మ్మ్.. అన్నీ ప్రశ్నలే.. నాకు తెలిసింది మాత్రం వొకటే.. రాసిన వాక్యం లో దమ్ము ఉంటె.. వేరే రీసెర్చ్ అక్కర్లేదు …లేనప్పుడు ఎంత అనలైజేషన్ చేసినా నిలవదు.
    –సాయి పద్మ
    కవి ,రచయిత్రి, ఏమీ కాని వొక శుద్ధ చదువరి

    • koppula
      February 7, 2016 at 10:43 pm

      సాయిపద్మ గారికి,
      “ఏది శుద్ధకవిత్వం, ఏది సుద్దముక్క కవిత్వం” అన్నదాంట్లో కూడా కొద్దిగా క్లారిటీ ఉన్నట్టే అనిపించింది :-)

      “… మరి అలాంటప్పుడు ఆమె ఏం రాసినా వర్రీ ఎందుకు?” అన్నారు.
      వర్రీ కాలేదు. ప్రశ్నలు అడిగాను. అంతే.

      “… భాషా సంకరం గురించి- అసలు కవిత్వమే కాదు మొర్రో అని ఆమె మొత్తుకుంటున్నప్పుడు, ఇక భాష గురించి బాధ ఎందుకు ?” అన్నారు.
      మీరు ఈ ఇంటర్వ్యూ కి ఇంట్రో చదవలేదనుకుంటా. కవయిత్రి అనే ఇంటర్వ్యూ వేసారు.

      “… అంటే కొన్నేళ్ళు రాసాక , అరుణ్ సాగర్ గారిలా, మో గారిలా .. వాక్యం శ్రద్ధగా రాసినట్టు అవుతుందా.. లేకపోతే చనిపోతే అవుతుందా..?”
      వాక్యం ఎవరైనా కుదురుగా, ఏ తప్పుల్లేకుండా రాస్తే దాన్ని శ్రద్ధగా రాసారని మురిసిపోతాం. వాళ్ళ వాక్యం బాగుంది కనుకనే ఇంకా మనం వాళ్ళగురించి మాట్లాడుకుంటున్నాం. కొన్నాళ్ళనుండి రాస్తున్నారుకదాని బాగుంది అని చెప్పడం లేదు. మీరన్నట్టు వాక్యం బాగుంటేనే నిలబడుతుంది.

  29. koppula
    February 8, 2016 at 12:09 am

    అమ్మా నిశీధి (భయ్యా అన్నారన్న చనువుతో, వయసులో కూడా పెద్దవాన్నే అనుకుంటా),

    కవి మనసు సున్నితం అంటారు. అది తెలిసి కూడా నేనేమైనా మీ మనసు నొప్పిస్తే క్షమించండి. మీ కవిత్వం బాగాలేదని నేను అనలేదు. కావాలంటే నా వ్యాఖ్యలు మళ్ళీ చదవండి. కవిత్వంలో మీకు మంచి అవగాహన ఉన్నట్టుంది అని కూడా అన్నాను. మీ కవిత్వం మీద నేను కామెంట్ చేయలేదు. ఏవో రెండు ప్రశ్నలడిగాను. వాక్యనిర్మాణం మీదనే నా సోది అంతా. వాక్యంలో అనవసరంగా వాడే పరభాషా పదాల గురించే నా ఏడుపు అంతా.

    నేను వొక సంస్కృతిని భుజాలమీద మోయగలిగేంత పండితుణ్ణి కాను. ఎదో పొద్దుపోక సాహిత్యం చదువుకునే మామూలు మనిషిని. మీ ఇంటర్వ్యూ తో, మీ అభిప్రాయాలతో నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. నిజానికి మీరు ఎవరో కూడా తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీర్రాసే రాతలు మాత్రమే చదివి స్పందించగలను.

    “స్పానిష్లో రాయడానికి పూనుకున్న మహా గొప్ప ఆస్థాన తెలుగు విధ్వంసకులు” అన్నారు. అది నవ్వుతూ అన్నాను. స్మైలీ కూడా పెట్టాను. తెలుగును ఎవరైనా ‘టెల్గు’ అంటేనే బాధ పడేవాణ్ణి. ఇక తెలుగులో స్పానిష్ ఎలా రాయగలను.

    నేనడిగిన ప్రశ్నలు మీకు ఒకటో తరగతి పిల్లల ఆటలా అనిపిస్తే వదిలేయండి. నాకు ఎలాంటి పర్సనల్ అజెండా లేదు. కవిత్వం అంటే కొద్దిగా ఇష్టం ఉండటం మూలాన ఇలా కామెంట్లు పెడుతుంటాను. కవిత్వంలో ఇలా రాయొద్దు, అలా రాయొద్దు అన్న రూల్స్ ఏమీ లేవు. మీ స్టైల్ మీది. మిగతా వాళ్ళ స్టైల్ మిగతా వాళ్ళది. ఒకరిది గొప్పది కాదు. మరొకరిది బావిలో కప్పా కాదు అని గుర్తుంచుకోవాలి. అట్లాగే ఒకరిది గొలుసులు వేసుకున్న కవిత్వం కాదు. మరొకరిది శృంఖలాలని తెంపుకున్న కవిత్వమూ కాదు.

    ఎవడో ఫుల్ స్టాప్ పెట్టమన్నాడని మీరు తెలుగు పద్యాలు రాయడం ఆపకండి.

    మో అనుకుంటా “కవిత్వం భాష యొక్క భాష” అన్నారు. మన కవిత్వమే మన భాషను నిర్వచించుకుంటూ పోతుంది. కానీ, వచనానికి వచ్చినప్పుడు మాత్రం, వాక్యనిర్మాణం సరిగ్గా లేకపోతే అర్థంలో ambiguity పెరుగుతుంది. మార్మికత వలన, కవిత్వంలో ఉండే డెప్త్ వలన చదివేవాళ్ళకి కవిత్వం అర్థం కాకపోతే అది కవి తప్పు ఎంతమాత్రమూ కాదు, కానీ, వచనం అర్థం అయ్యేట్టు రాయకపోతే మాత్రం దానికి బాధ్యలు కచ్చితంగా రచయితే అంటాను. మీరు ఇన్ని అన్నాక కూడా ఇంకా చాదస్తంతో నేను చెప్పే మాట అదొక్కటే.

    వాక్యం నచ్చకపోతే నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్ ఉందనే అనుకుంటున్నాను. ఒకవేళ అది తప్పంటే, సారీ! ఇందాకే సారంగాలో కూడా కామెంట్ పెడదామనుకున్నా కానీ నచ్చకపోతే చదవడం మానేయండి భయ్యా అన్నారు కాబట్టి, ఇక చదవను.

    నేను ఇంతకుముందు వ్యాఖ్యలో ఉదాహరించిన కవులు కూడా ఎప్పుడో శుద్దకవిత్వం(ఛందోబద్ధకవిత్వం) గొలుసులు తెంపుకున్నవాళ్ళే. నాకు తెలిసి ఇప్పుడు ఛందోబద్ధకవిత్వం ఎవ్వరూ రాయడం లేదు. అందరూ వాడుకభాషలోనే రాస్తున్నారు. మీరు ఆ వాడుకభాష/వచనకవిత్వపు గొలుసులు కూడా తెంపుకుని మల్టీ లెవల్, మల్టీ language వైపు దూసుకువెళ్లాలని ఆరాట పడుతున్న వాళ్ళు. ఈ మల్టీ లెవల్, మల్టీ language అనే బ్రహ్మపదార్థం ఏమిటో తెలుసుకోవాలన్న తాపత్రయం నాది. ఐరనీ ఏమిటంటే, మనమెంత మల్టీ language లో రాసినా, తెలుగులోనే రాసి ఏడుస్తున్నాం కనుక ఆ చదివే కవిత్వపాఠకులకు తెలుగు చదవడం వచ్చిచావాలి. అందుకే ఇలా మల్టీ language లో రాసినా, ఆ కవిత్వం కొత్తగా చేరే ప్రదేశాలు, మెదళ్ళు ఏమీ ఉండవు. నిజానికి మల్టీ language పోయెట్రీ చాలా తక్కువ మందికి చేరుతుందేమో అని నా అభిప్రాయం.

    నాకు సిల్లి అనిపించే విషయమే మీకు గొప్పగా అనిపించవచ్చు. నా అభిప్రాయాన్ని మీమీద రుద్దాలని నేను కూడా అనుకోవడం లేదు. చర్చ అన్నప్పుడు ఇలాగే ఉంటుంది.

    ఎక్కువ అనుకోకపోతే, చిన్న అడ్వైస్.
    మన రచనలను విమర్శించిన వాళ్ళని “సంస్కృతి పరిరక్షకుడు, తెలుగును భుజాలమీద మోసేవాడు” అని నిష్టూరంగా ముద్ర వేయకండి. ఈ రోజుల్లో అంతా అవసరం గురించి కామెంట్లు పెట్టేవాళ్ళే ఎక్కువ. నిజాయితీగా విమర్శించే వాళ్ళు తక్కువ. మీ కవిత్వం బాగుంది అని మీ ముందు అని, మీ వెనకే ఆవిడ వాక్యాలు చూసారా అని ఎద్దేవా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు.

    మీ ఇంటర్వ్యూ వేసినందుకు వాకిలి వారికి, ఇంట్రోలో వాసుదేవ్ గారు చెప్పినట్టు తెలుగు కవితాప్రపంచంలో ఓ కొత్తకెరటంలా మీకంటూ ఓ ప్రత్యేక ముద్రని వేసుకున్న మీకూ అభినందనలు.

    ఇంకా అయిపోలేదు :-)

    చివరిగా అందరు కవులకి చెప్పేది ఏమిటంటే, సరికొత్త భాషతో/డిక్షన్ తో, కొత్తకొత్త వాక్య విన్యాసంతో, కొత్తకొత్త పదాలతో, సరికొత్త భాషాసంకేతాలతో, కొత్త వస్తువులతో, కొత్త పోలికలతో, మీ కవిత్వవ్యాకరణం మీరే సృష్టించుకుంటూ ముందుకెళ్ళడం మంచిదే, కానీ, కానీ, కానీ.. వాక్యం కుదురుగా రాయండి. వాక్యంలో ఇంగ్లీషు పదాలు ఎక్కువై, ఇక దాన్ని తెలుగులో రాయలేం అనుకున్నపుడు, సుబ్బరంగా ఇంగ్లీషులోనే ఏడవండి.

    కొప్పుల

  30. koppula
    February 8, 2016 at 12:10 am

    పి.మోహన్ సర్,
    ఇక్కడ ఇంతమందిలో మీరొక్కరే నన్ను కొద్దిగా అర్థం చేసుకున్నట్టు అనిపించింది.

    మీకు ధన్యవాదాలు.

    • పి.మోహన్
      February 8, 2016 at 2:23 am

      కొప్పులగారూ…
      బహుశా నేనూ మీ మాదిరే సాధారణ పాఠకుణ్ని కావడం వల్ల మీ ఆవేదనను కొంచెం అర్థం చేసుకున్నానేమోనండి. మంచి అయినా, చెడ్డ అయినా సూటిగా, స్పష్టంగా చెప్పడాన్ని నేను ఇష్టపడతాను. కవిత్వం అనుభూతిపరమైంది కాబట్టి దీనికి అందాన్ని జోడించక తప్పదు. ఆరెస్సెస్ భాగవత్ నుంచి , మజ్లిస్ ఒవైసీ నుంచి మనం కవిత్వాన్నిఆశించలేం కదా.
      భాష జీవనది అంటారని ఈ చర్చలో పాల్గొన్నవాళ్లందరికీ తెలిసిందే. ఆ సత్యాన్ని గుర్తిస్తే సమస్య వుండదు. జనం తమకు సులువుగా వుండే పదాలను ప్రేమిస్తారు, కొనసాగిస్తారు. ఎవరో ఒక పెద్దాయన హాస్పిటల్ను ఆస్పత్రి అని రాయకూడదని, మాట్లాడకూడదని, వైద్యశాల అనాలని వెబ్ పత్రికల్లో ఐదారేళ్ల నుంచి ఒకటే గొడవ చేస్తున్నాడు. ఆయనది లోకవిరుద్ధమై కోరిక కాబట్టి అరణ్యరోదనే అవుతోంది. అసలు అచ్చమైన తెలుగు అనే ఒక భాష ఉందాని నాకు తరచూ ఒక అనుమానం వస్తూ వుంటుంది. అచ్చతెలుగు కావ్యాల్లో వేటినీ నేను అనుభూతించలేకపోయాను. శబ్దరత్నాకరాన్ని పక్కన పెట్టుకుని చదవాల్సిన అవసరం నాకే కాదు, చాలామందికీ అక్కర్లేదు కదా. శ్రీశ్రీ మహాప్రస్థానంతో చాలాచోట్ల నాకిదే పేచీ. తమ ఇంగ్లిష్ పాండిత్యాన్ని అనవసరంగా దొర్లించే తెగులు కవులతోనూ ఇదే సమస్య. ’వన్ ఫైన్ మార్నింగ్.. నేను చంద్రుణ్ని చూశాను..’ అని అంటే చాలా ఆనందిస్తాను కానీ.. ’నేనొక despot ను, నా deride నా eloquence అని అంటే.. హా..అవునా. ఛా ఫోవో అంటాను. నాకు నిశీ కవిత్వంలో అద్రుష్టవశాత్తూ ఇలాంటి పాండితీ ప్రకర్ష కనిపించదు.
      నిశీ కవిత్వం ఏ ప్రమాణాలకూ అందనిది. ముందే చెప్పినట్టు కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. ఆమె పదాలకోసం పెద్దగా గింజుకోదు. డైరెక్ట్ అటాక్. ఇంగ్లిష్, ఉర్దూ, సంస్క్రుతం, ఇంకా ఏవో పదాలున్నా ఆమె ఏం చెబుతోందో అర్థమవుతుంది. దీన్ని శాతాల్లో కొలిస్తే చాలాకవితల్లో 99 శాతం అర్థమవుతాయనే చెప్పొచ్చు. తనే ఇదివరకు ఎక్కడో అంది, తను ఇకపై రాయబోయే కవితలను మరింత క్లారిటీగా రాయాలని. అంటే తన సమస్యను తను గుర్తించినట్టే కదా. క్లారిటీ అంటే ప్లెయిన్గా రాయడం కాదని మనకు తెలుసు. నేను అప్పకవీయాన్ని ఎంజాయ్ చేసినంతగా మో తతిమ్మా కవులను ఎంజాయ్ చెయ్యలేను. అది నా పరిమితి. అప్పకవి నాకు అర్థమౌతాడు. మో కూడా చేసుకోగలిగే అయితాడేమో కానీ నాకు ఆ శక్తి లేదు, పైనా అనవసరం కూడా లేదు. నాకే కాదు, నాలాంటి కోట్లాది మందికి కూడా. కాదని వాదించేవాళ్లు ప్లెబిసైట్ పెట్టుకోవచ్చు. కవులు మానవేతరజాతి అని, వాళ్లది గ్రహాంతరజీవుల భాష అని అంటారా? అయితే ఇక గొడవలేదు. నేను భూమ్మీదే వుంటాను. నేను దారితప్పినట్టుంది. కవిత్వంలో అసంబద్ధతను(గుర్తించగలిగితే) నేను నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను. కాని అస్పష్టతను అసలు భరించలేను, అది ఎన్ని ముసుగుల్లో వున్నా సరే. కవి ఏం చెబుతున్నాడో/తోందో అర్థమైతే అనుభూతి నిండుగా వుంటుందని ఇక్కడ కొట్టాడుకున్న వాళ్లందరూ ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను.
      ఇంతకూ నేను చెప్పినదాంట్లో అస్ఫష్టత ఏమన్నా వుంటే మన్నించగలరు. వుంటే చెప్పండి. కొరడా పక్కనే పెట్టుకున్నాను. మిమ్మల్ని కాదు, నన్ను కొట్టుకోడానికి..

      • koppula
        February 8, 2016 at 5:56 am

        పి. మోహన్ గారు,
        “ ’వన్ ఫైన్ మార్నింగ్.. నేను చంద్రుణ్ని చూశాను..’ అని అంటే చాలా ఆనందిస్తాను కానీ.. ’నేనొక despot ను, నా deride నా eloquence అని అంటే.. హా..అవునా. ఛా ఫోవో అంటాను.”
        మోహన్ గారు నిశీది గారి వాక్యాలు దాదాపుగా ఆ రెండవ కోవలోనే ఉంటున్నాయి అని చెప్పాను అంతే. వాక్యాలు సరిగ్గా రాసుకోవొచ్చు కదా అన్నందుకే నాకు ఆమె మీద ఎదో పాతపగ ఉన్నట్టు చెబుతున్నారు.
        “తను ఇకపై రాయబోయే కవితలను మరింత క్లారిటీగా రాయాలని. అంటే తన సమస్యను తను గుర్తించినట్టే కదా” – చాలా సంతోషం.
        I wish her all the success!
        మీరు చెప్పినదాంట్లో స్ఫష్టత ఉంది. ఓపికగా మీరిచ్చిన వివరణకి ధన్యవాదాలు. ఆ కొరడాతో ఓపిక లేని వాళ్ళని కొట్టండి :-)
        Thank you!

  31. వాసుదేవ్
    February 8, 2016 at 12:10 am

    కొప్పుల గారూ
    మీరు నాకిచ్చిన గౌరవానికీ, చాలా ఓపిగ్గా మీరు ఈ పోస్ట్ ఫాలో అవుతున్నందుకూ ధన్యవాదాలు.
    మీరు కేవలం శనివారం మాత్రమే కాదు ప్రతి రోజూ దుప్పటి ముసుగేసుకుని పడుకోవాల్సిందే. ఎందుకంటే మీరన్నట్తు గానే మీరింకా చిన్నపిల్లాడి నుంచి ఎదగలేదు. అందుకే “అసలు వాకిలి వాళ్ళమీద గౌరవం పోతుంది ఇలాంటివి ప్రచురించి మామీదికి వదిలినప్పుడు.” అని అనగలిగారు.
    పైగా మీరు మాత్రమే ఈ ఇంటర్వ్యూ ని ఇలా ఎద్దేవా చేసే గొప్ప పని పెట్టుకున్నారు.
    నాకొకటి అనిపిస్తుంది– మీరిది కేవలం ఇక్కడ ఈ ఇంటర్వ్యూ ని బేస్ చేసుకుని మాత్రమే స్పందింస్తున్నారని అనుకోను. మీకు, ఈ సదరు నిషీ కి ఎక్కడో ఏదో గొడవ ఉండి ఉండాలేమొ … లేకపోతె కేవలం సారంగ లో ఆమె రాసిన వ్యాసాలు మాత్రమే చదివి ఆమె కవిత్వం పై కామెంటడం అనుచితం . అది మీకూ తెల్సు.
    కవితకీ పాంఫ్లెట్ కీ తేడా కవులకెలాగూ తెలుస్తుంది. అందుకె వారు మాత్రమే అవి రెండూ రాయగలరు. అది మీకింకా తెలీకపోవడమె విచారకరం. Please be informed that nobody can Fuck the language. Its beyond our limits. If you think someone is doing it its your ignorance or your intention of bringing down someone here.
    “అయినా ఏం భాషండీ అది?! దానికి మీ సమర్థింపు ఒకటి.”
    మీకు ఈ సందర్భంగా ఓ విషయం చెప్పి తీరాలి. ఆమెని కానీ మరెవ్వరి కానీ సమర్ధీంచే స్థితికి దిగజారే స్థితిలో నేనులేను. నాకా అవసరం లేదు కూడా. నిజానికి మీ అందరికి ఆమె ఎంత తెల్సొ నాకూ అంతె తెల్సు. ఓ మంచి
    ఇంటర్వ్యూ ఇవ్వాలి అనే సదుద్దేశ్యతం తోనే ఇది మొదలయింది. అదే రవి ని అడిగాను “అలా మొదలయ్యింది”

    ప్రతి కవితనీ ఓ “మో” కళ్ళద్ద్దలా నుంచో లెక మరో వ్యూ పాయింట్ నుంఛో చూసే మీకు ఈ కొత్త కవితలు అర్ధం కావు. అందుకే అన్నా మీరింకా పూప్సీ బాటిల్ నుంచి లేవలేకపోతున్నారు. లేవలేరు కూడా. ఎందుకంటె మీరు కవిత్వాన్ని కూడా ఓ బయాస్డ్ కెలిదియొస్కోప్ లో మత్రమే చూడగలరు. అక్కడ మాత్రమే మీకు స్వచ్చ తెలుగు కనపడుతుంది.
    ఇది ప్రచురణ జరిగిన నెలలోనే పతంజలి శాస్త్రి గారి ఇంటర్వ్యూ కూడా ఉంది, దాదాపు పాతిక ప్రశ్నలతో. దాంట్లో టైటిల్ లోనే ఆంగ్ల ప్రస్తావన ఉంది మీరు గమనించారో లేదో మరి. ఆయన తన అనుభవంతో కవిత్వానికి సంబ్భందించి అన్ని సందేహాలకి జవాబులిచ్చ్చారు.
    At last I’d like to say that If Nishee fucked the language Mo also did the same. Its only a matter of our view point. As an ardent admirer of Mo I dare say this. Bcz this is the only language you understand.

    మో రాసిన ఒకానొక కవితలోని కొన్ని వాక్యాలు మీకోసం:
    “చీకి చీకి తాగి తాగి
    ది మిల్క్ ఆఫ్ హ్యూమన్ కైండ్ నెస్ ని
    డయానాయాకి సరస్వతికీ చంద్రకాంతికీ వీణాతంత్రికీ”
    కవికి భాష ఓ కంఫోర్ట్ జోన్. అక్కడ ఆ క్షణంలో ఏ పదం బావుంటుందో అదే ప్రామాణీకం. అంతే ఆ తర్వాత అది పాఠకుడి అదృష్టం. సో మీరు మాట్లాడె భాషకీ కవిత్వ భాషకి తేడా గురించి అర్జంటు గా బెంగెంట్టుకుని నిద్రపోవడం మానకండై…అది మాత్రమె మీకు కరక్ట్. వాదోపవాదాలపై నాకంత నమ్మకం లేదు. అవి మన భావాల్ని ఎలాగూ మార్చవు కాబట్టి మన ఈ చర్చని ఇక్కడితో ఆపేద్దాం’ మన ప్రియ వాకిలి ఎడిటర్స్ కి ఏ ఇబ్బందీ లేకుండా ముగిధ్ధాం

    • koppula
      February 8, 2016 at 6:00 am

      అయ్యా వాసుదేవ్ గారు,
      మీరు రాసిన ఈ కామెంట్ తో మీమీద ఉన్న గౌరవం పూర్తిగా పోయింది. You can do better than this. ఈ కామెంట్ ముందే చూస్తే, నిన్న రాత్రి ఆ కామెంటే రాసేవాణ్ణి కాదు. You people do not deserve that comment. ఇక్కడ మనం చర్చించిన విషయాలు మీకిష్టమైన ఒకరిద్దరు మంచి కవులకి/రచయితలకి చూపించండి. అవసరాలకోసం పొగిడే కవులకు కాదు నిక్కచ్చిగా చెప్పే కవులకి సుమా. వాళ్ళు నేను అడిగిన ప్రశ్నలు తప్పు అని అంటే చెప్పండి. మీ కవిత్వాన్ని, నిశీధి గారి కవిత్వాన్ని జీవితాంతం పొగుడుతూ ఉంటా.

      వాకిలి పత్రిక సంపాదకులకో చిన్న విన్నపం: ఇక్కడ నేను నిన్న రాత్రి ‘అమ్మా నిశీధి’ అని అడ్రస్ చేస్తూ రాసిన వ్యాఖ్యని వీలయితే డిలీట్ చేయండి. వీళ్ళకి ఆ మాత్రం గౌరవం కూడా దండగే. నా కామెంట్లు అన్ని డిలీట్ చేసినా పర్వాలేదు. తెలుగు కవులకి విమర్శ తట్టుకునే స్థాయి లేదని రుజువయ్యింది.

      నా కామెంట్ల వలన ఇంకా ఎవరికైనా ఇబ్బంది కలిగితే సారీ!

      కొప్పుల.

  32. వాకిలి
    February 8, 2016 at 6:08 am

    వాకిలి మిత్రులకు,
    క్షమించండి!
    ‘అన్ని అభిప్రాయాల్నీ ఆహ్వానించు’ అనే వాక్యానికి ‘వాకిలి’ నిబద్ధత ప్రకటిస్తుంది కానీ, ఈ ఇంటర్వ్యూ మీద వ్యాఖ్యలు వ్యక్తిగత స్థాయిలో వెళ్తున్నందున, ఈ ఇంటర్వ్యూ గురించి చర్చించడానికి ఇంకేం లేదన్న అభిప్రాయంతో చర్చని ఇంతటితో ముగిస్తున్నాం. అభిప్రాయాల్ని ఆరోగ్యకరమయిన వాతావరణంలో ప్రకటించుకునే స్వేచ్ఛని వాకిలి ఎప్పటికీ గౌరవిస్తుంది.
    ధన్యవాదాలతో,
    -సం.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)