ఇష్టమే లేని స్థలంలో ఎందుకుంటావు
కొమ్మలు లేని చెట్టుని చూశావా
అక్కడే గాలీ లేదు
ఇష్టం లేని కాలంలో ఏ చెట్టైనా ఎందుకుంటుంది
అంతర్లోకంలో వీచే ఏ గాలో
చేతుల్ని నరుక్కుని తీసుకుపోతే
నీటి అడుగున
నా పేరును నేను బలంగా పట్టుకుంటే
నా కాళ్ళకు నచ్చి
నిప్పు అదుముకుంటే
వంతెన దాటేస్తాను
పూలని కాల్చుకుంటూ
మిత్రమా ఎక్కడ నువ్వు? ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మళ్ళీ నీ కవిత చదివాను. అయినా మనం కలవడం ఇలానా. నేనూ ఇప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేని ప్రయాణికుడిని. బికారిని. అజంతా అన్నట్లు కటకటాల మధ్య ఆకాశయానం చేస్తున్నాను. విడదీయలేని బంధాలతో విసిరేసే ప్రతిబింబాలతో చెల్లాచెదురై పడి ఉన్నాను. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళినా ఇష్టం లేని చోటే. ఇంతకీ నీ అనవాలెక్కడ?
చాలా బావుంది
Dear chitrakonda,
My dear poet, My dear Story writer,
yekkada unnavu naayana.
nee kosam vedukutunnamu.
ni poem chadavadam thrilling gaa unnadi.
Hi Ganga kavitvam ga batikina mana konni rojulu
Gurtochai …appudappudu jnapakammullai gucchu kuntuntavu
kavitvam rayaleni rojuluntai …kavitvam neelaanti vaalla daggara
hai ga batike undi .