నిన్నటి అసంతృప్త నీడలు
నా అక్షరాలనలుముకుంటున్నాయ్
రేపటి నీ చూపు వెలుగులో
సాహిత్యాన్ని మధిస్తూ….నేను
ఏంటో నువ్వెళ్ళిపోయావ్
నిశ్శబ్దాన్ని నాలో రగిల్చి
నీ తలపులు మిగిల్చిన
విషాదం మాత్రం నాతోనే…
మది సెగలో ఆరేస్తున్నా
వెల్లువౌతున్న మమతల జడిలో
నిలువెల్లా తడిసిపోతున్న
నీ జ్ఞాపకాల పరిమళాలన్నీ
నీ అనుబంధపు మర్రిచెట్టు
నిలువెల్లా నాలో విస్తరిస్తూ
చూడు గొణుక్కుంటూనే ఉంది
కాలపు గాలికి రాలిన విషాదపు ఆకు
సెలయేటిలో వెన్నెల దారి
బాటసారులెవరూ లేరు
పెక్కు నువ్వు లను వెతుకుతున్న
నీ ఒక్క నేను తప్ప
touching poem Madam.. congrats
తనక్ కవివర్మాజీ..
చిక్కగా అల్లారు,..భావాన్ని,….ఫుల్ స్టాప్లు,..వాక్యాల మధ్య ఖాళీలు వదిలివుంటే,. బాగుండేదేమో,…
ధన్యవాదాలు కవి వర్మా జీ..
ధన్యోస్మి భాస్కర్ కొండ్రెడ్డి జీ…మరొక కవిత లో మీ సూచనననుసరిస్తాను…