కథ

భవిష్యవాణి

ఫిబ్రవరి-2014

సాయంకాలం వాడుకప్రకారం పార్క్ లోకూర్చుని పేపర్ చదువుతున్ననాదృష్టి ఒకవార్తపైపడింది.

అమేరికాలో ఒకవిద్యార్ధి ముందుగా టీచర్నూఆతర్వాత కొందరుపిల్లలనూ కాల్చిచంపాట్ట! మరో విద్యార్ధి తనక్లాస్లో ఒకఅమ్మాయి గొంతు తనకు వినను బావులేదని స్కూల్ బ్యాగ్ లో పిస్టల్ ఉంచుకుని వచ్చాట్ట, ముందుగా దాన్నిగమనించిన టీచర్ అదితీసి దాచి,’ ఎందుకుతెచ్చా వని’అడిగితే చెప్పాట్ట!

అమేరికాలో ఈతుపాకులు ఆటబొమ్మలు కొన్నట్లు కొని ఉంచుకుంటారంటా, అదేమంటే సేఫ్టీకోసమనిట! ఎంతదారుణం !’అని బాధపడుటుండగా, పార్క్ లోఆడుతున్న పిల్లలనుంచీ పెద్దగా అరుపులు కేకలూనూ. గబగబా అటుకేసి నడిచాను.

ఎవరో ఒకపిల్లడు ఒక కత్తి తెచ్చి ఆటలో ఓడిపోయిన కోపంతో ఎదుటిజట్టువారిని పొడిచేస్తానని పైకెళుతున్నాడు!! అక్కడే ఉన్నకాపలాదారు సమయానికి అడ్డుకుని ఆకత్తిదాచేశాడు. మెల్లిగా వచ్చి నా బెంచ్ మీదకూర్చు న్నానన్నమాటే గానీ నామనస్సు బాధతో గట్టున వేసిన చేపలా తన్నుకుంటున్నది.

‘అసలు పేరెంట్స్ పిల్లలకు కత్తులూ, తుపాకులూ ఆటవస్తువులుగా ఇవ్వటానవారుఆటల్లోఎదుటి వారిని కాలుస్తున్నట్లు భయపెట్టడం,వారి మనస్సుల్లో నిజంగానే కోపంవస్తే కాల్చేయాలనే భావనమొలకెత్తేప్రమాదంఏర్పడుతుంది.ఈసమాజం ఎటువెళ్తున్నదో తెలీడం లేదు. రోజూ పార్కులోకలిసే నా స్నేహితుడు నాగేశంవచ్చి నాపక్కనే కూర్చున్నాడు.విచారంగా ఉన్న నాముఖాన్ని చూస్తూ” ఈరోజు నాక్కాస్తఆలస్యమైందిమిత్రమా!,ఇదిగోఈరామాయణంలోనిఈఘట్టాన్నిచదువుతూ కూర్చుండి పోయాను. ప్రతిఒక్కరూతప్పక చదవాలి.మీరూ చదవండి” అంటూ తనచేతిలోని ఆపొత్తంనాచేతికిచ్చాడు.సరే మనస్సూ కాస్త తెప్పరిల్లు తుందని తీసుకుని ఆయన చూపిన పేజీ నుంచీ చదవసాగాను.

***

అరణ్యవాసంలో శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతుడై చిత్రకూటపర్వతంపై పర్ణశాల నిర్మించుకుని నివసించసాగాడు. నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామీ ప్రతినిత్యంలాగే ఆరోజూ అడవిలో లభ్యమయ్యే పండ్లూ ఫలాలూ ఏరి తేవడం కోసం సమాయత్తమయ్యారు .రామభద్రునికి, లక్ష్మణునికీ వారి ధనుర్భాణాలు అందజేస్తూ సీతమ్మ చిఱు నవ్వు నవ్వింది.“దేవీ!నీవు అకారణంగా నవ్వవు. విషయమేమి? ” ఆసక్తిగా అడిగాడు రాముడు. “ప్రభూ!మరేంలేదు ,మీరుఅరణ్య వాసానికి వచ్చారు కదా! ఎవరితోనో యుధ్ధానికి తయారై వెళుతున్నట్లుఈవిల్లంబులూ బాణాల పొదలూ ఇలా ప్రతి రోజూ ధరించి వెళ్ళడం ఎందుకాని?’నవ్వొచ్చిం దంతే! “చిఱునవ్వుతో చెప్పింది సీతమ్మ. “ఓహ్ అంతేకదా! స్వీయరక్షణకు అనుకోవచ్చుగా సీతా!” సమాధానంగా అన్నాడు రామయ్య.

“కావచ్చు, కానీ సర్వఙ్ఞులైన మీకు తెలీంది కాదు కానీ ,నేను బాల్యంలో , ఆయుధాలు ధరించి ఉండటం వలన జరిగిన అనర్ధాన్ని గురించి విన్న ఒక కధాంశం గుర్తుకు వస్తున్నది, తమరు అనుమతిస్తే చెప్పాలని ఉంది, ” అందిసీతమ్మకమ్మని స్వరంతో. ఒకింతదూరంలో ఉన్న లక్ష్మణుడూ ,ఆమె చెప్పనున్నకధాంధాంశాన్ని వినను కుతూహల పడుతున్నాడు. చెప్పమన్నట్లు తలఊచి అక్కడే ఉన్న అరుగుపై ఆసీనుడయ్యాడు రఘురాముడు. సీతమ్మా ఆయనకు ఎదురుగా ఉన్న మరో చిన్న బండ రాతిపై సుఖాసీనురాలై చెప్పసాగింది. లక్ష్మయ్యా చెవులురిక్కించాడు.

“పూర్వం ఒక ఋషి తీవ్రమైన తపస్సుచేయ సాగాడు. ఆయనతపోమహిమ ఉష్ణరూపంలోస్వర్గలోకాన్నిచేరి,దేవేంద్రుని భయపెట్టింది. దేవేంద్రుడు తన పదవికి భంగం వాటిల్లు తుందనే భీతితో బాగా యోచించి ఒక పధకం పన్నాడు. దానిని అమలు చేయను తాను ఒక బ్రాహ్మణ రూపంలో,పదునైన తళతళ లాడే ఒక పొడవైన కరవాలాన్ని జాగ్రత్తగా ఒరలో ఉంచి చేతబూని ఆఋషి వాటికను చేరాడు.ఆ ముని పుంగవులు విశ్రాంతి పొందేవేళ కై మాటు వేసిఉండి,ఆయనధ్యానంచాలించి కళ్ళుతెరచి నంతనే సమీపిం చాడు.

” పాహి పాహి ఋషీశ్వరా! రక్షరక్ష “అంటూపాదాలపైబడిశరణువేడాడు.మందస్మితవదనంతో దయా మయుడైన ఆఋషి ” వత్సా!ఏమి నీకువచ్చిన ఇక్కట్టు? ఆలసించక చెప్పు,నీఇబ్బంది తప్పకతీర్చేప్రయత్నంచేస్తాను.”అనిఅభయమిచ్చాడు.
” మరేంలేదు స్వామీ! నేను కార్యర్ధినై దూరప్రాంతం వెళుతున్నాను. నాఈ కరవాలం నాపయనానికి పెద్ద సమస్యగా ఉంది. దీన్ని జాగ్రత్త పరచను ఎవ్వరూ లభించక మిమ్ముఆశ్రయించాను.దీని పదును తరుగ కుండా ప్రతినిత్యం తైలంఅద్దితుడిచి శుభ్రపరచి ఒరలో ఉంచాలి. మీకుశ్రమ ఇస్తున్నందుకు మన్నించండి మునీంద్రా!. ” అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. వచ్చినవాడుదేవేంద్రుడనీ, అతడి అభ్యర్ధనవెనుక దాగున్న మర్మాన్నీ , తనకు రానున్న ప్రమాదాన్నీ గుర్తించలేని ఆఋషీశ్వరులు మందస్మితవదనంతో ఆబ్రాహ్మణునిచూశారు.

“అదెంత భాగ్యం? లోకోపకారమే కదా మా ధర్మం! తప్పక నీకరవాలాన్ని మాఆశ్రమంలో ఉంచి వెళ్ళిరా బ్రాహ్మణోత్తమా!” అని బ్రాహ్మణరూపంలో ఉన్న దేవేంద్రుని పంపాడు.ప్రతిరోజూ స్వయంగా ఆకరవాలాన్ని ఒరలోంచీతీసి తైలంఅద్దిశుభ్రపరచి మెత్తనివస్త్రంతోతుడిచితిరిగిదాన్నిఒరలోఉంచడంఆఋషీశ్వరునిదినచర్యలోభాగమైంది.కొంతకాలానికితానుఇచ్చినమాటమేరకు దాన్ని చక్కగా శుధ్ధిచేశానోలేదో లేదో అన్న భావనమనస్సులోదూరికరవాలాన్నితీసిచూడటం,పదునుపరీక్షించడం మొదలెట్టాడు. అతడితపస్సు, ధ్యానం అటకెక్కాయి. మనస్సంతా ఆకరవాలం మీదే! కొంతకాలమయ్యాక ఆకరవాలాన్ని చేత్తోపట్టు కుని నడిస్తే ఎలా ఉంటుందోని తనహస్తంలో ధరించి నడవసాగాడు.

ఒకదినం అతడికరవాలంతగిలిఒకచిన్నమొక్కమధ్యకు తెగిపోయింది. ఆఋషి ” ఆహా! కరవాలం తగులగానే మొక్క తెగి పోయిందంటే దానికి పదును చక్కగా ఉంది, మరి ఈవృక్ష శాఖ తెగు తుందేమో చూద్దా”మని తలచి ,ఒక వృక్ష శాఖను నరి కాడు.ఒక్క వేటుతో అదితెగిపడింది.ఆమునివరునికిఎంతో ఆనందమైంది. అలాఆఅడవిలోనిమొక్కలు,వృక్షశాఖలనునరక సాగాడు, క్రమేపీ ఎదురైన జంతువులనూ, క్రమక్రమేపీ అడవిలో కనిపించిన మానవులనుసైతంనరికినరహంతకునిగామారి పోయాడు.అతడిధ్యానం,తపస్సుఅన్నీనశించి,ఒకక్రూరునిగాతయారై,మృత్యువుఅనంతరంయమలోకాన్నిచేరాడు.

ఆయుధాలు ధరించి ఉంటే జరిగే అనర్ధాన్ని నేను ఈకధాంశం వల్ల విన్నందున మీరు ఈ అరణ్య వాసంలో ఈధనుస్సు, బాణాలూ ధరించవలసిన అవసరం ఉందాని నాచాపల్యం కొలదీ అడుగుతున్నాను.” అంది సీతమ్మతల్లి.

” నీసందేహం వాస్తవమేకానీ నేను వనవావాసం పేరుతో వచ్చింది ,యదార్ధానికి రాక్షస సంహారంకోసం కానీ ,అడవుల్లో నివసించను కాదు సీతా!అందు వలన ఈ ధనుర్బాణాలు ధరించ వలసిన అవసరం ఎంతై నాఉంది.” అని ఆమె సందేహ నివృత్తి చేశాడు రామ చంద్రుడు. అంతా విన్న లక్షమణుడూ చిరునవ్వునవ్వాడు.

***

ఆరామాయణ ఘట్టం చదివాక నా మనస్సుకేదో స్పురించింది .‘రానున్నకాలంలో ఆయుధాలు ధరించి సామాన్య మాన వులు తోటివారిని ఎలా సంహరిస్తారో,ఆయుధధారణ ఎంత అనర్ధమో ముందుగా తెలుపనే సీతమ్మ నోట రామచంద్రుడే ‘భవిష్యవాణి’ పలికించాడేమో అనిపించింది. యుగాలు మారికలియుగం ప్రవేసింవడం,విశ్వవ్యాప్తంగాఆయుధకర్మాగారాలు వెలిసి,ఆయుధాలు మానవుల చేతుల్లోకి వచ్చి ప్రళయం సృష్టించ బడుతున్నది. పిల్లలుసైతంఆట వస్తువులుగాకత్తులు, తుపాకులూ పట్టుకుని ” షూట్ ” చేస్తాననడం పరిపాటైంది. ఇహబాంబుబ్లాస్టర్స్ లోవందలమందిఅమాయకులుబలైపోడం ఇహ అమేరికావంటిదేశాల్లోఆయుధాలుకలిగిఉండేహక్కుపౌరులందరికీఉన్నందునఇలాకాల్చిచంపుకోడంజరుగుతున్నది.

ఆయుధాలుఉండటంవల్లేకదాఈఅనర్ధమంతా.!అందుకేరామాయణకాలంలోనేసీతమ్మనోట’ఆయుధాల’మాటచెప్పిం చాడు పరమాత్మ.ఇంకారానున్నకాలంలో ఎలాంటి ప్రమాదాలు ఆయుధాలవలనపొంచిఉన్నాయో అనే భీతి నన్నుపీడించినా ‘రామాయణంలోని ఘట్టాన్నిచదివాక , రామాయణం సర్వకాలాల్లో మానవుకల ఆదర్శ గ్రంధం ఎలా ఐందో,ఎన్నిసామాజిక నీతులుదీనిలో దాగిఉన్నాయో ,అనే నిజం స్పురించి ఆగ్రంధాన్ని కళ్ళకద్దుకుని నాగేశానికి ఇచ్చేశాను. -

*** * ***



2 Responses to భవిష్యవాణి

  1. February 11, 2014 at 4:05 pm

    వేరి నైస్ స్టొరీ.ఈరోజుల్లో పిల్లలంతా తుపాకులు, కత్తులు, పట్టుకుని కాచ్లేస్తా, పేచ్లేస్తా అని బెదిరించడం వెనుక దాగున్న డామినేటింగ్ నేచర్, నేరప్రవృత్తికి దారి చక్కగా చెప్పారు.హైమాశ్రీనివాస్ గారు. ప్రతి పేరెంట్ చదవదగినకధ.వాకిలికి ధన్యవాదాలు.
    దేవీరాం.

  2. February 11, 2014 at 4:09 pm

    నిజాన్నికళ్ళకుకట్టారు రచయిత్రి.తల్లిదండ్రులేనిజానికి పిల్లలమనస్సుల్లో తోటివారినిభయపెట్టే ప్రవృత్తిని రేకెత్తిస్తున్నారేమో! పిల్లలకు కొనే ఆటబొమ్మలగురించీ ఆలోచించవలసిందే! మంచి నీతిదాయకమైన కధ ప్రచురించిన వాకిలి సంపాదకులకు మాకృతఙ్ఞతలు.
    చెందు.

Leave a Reply to chendu. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)