కారుచీకటిని నిలువున చీలుస్తూ
పరుచుకుంటున్న వెలుగుల తీరంలో
అనుభూతికి అందని ఒక ప్రణవ నాదం
కర్ణపేయమై సోకుతుంది….
రాత్రంతా మదనవేదన పడిన తనువు
అనంతాకాశాన్నుంచి జాలువారుతున్న
జలపాతపు సవ్వడిలో తుషారమౌతుంది…
మనసు తనుకోరిన హృదయంలో
పరకాయ ప్రవేశం చేస్తూ…అనుభూతుల
పిచ్చుక గూడు అల్లుకుంటూ ఉంటుంది…
మేఘాలను ఒరుసుకున్నప్పుడు తీరిన తాపపు
సంతౄప్తి కెరటం అంతరంగాన్ని అభిషేకిస్తున్నప్పుడు…
నిలువెత్తు అగ్నిగుండంలో స్వర్ణ శరీరం ఆవిష్కృతమౌతుంది…
పంచభూతాల సమాగమంలో ఆదమరచిన మనసు
ఒక్కసారిగా ఉలిక్కిపడి…తన శరీరపు
ద్వారంకోసం వెతుకులాడుతుంటుంది…
పుష్పంచుట్టూ పరిభ్రమించే భ్రమరంలా…
వేల సూర్యుల కాంతితో అనంత ప్రేమరాగానివై
చేతులు చాచిన నీలో మంచుశిలలా ఒదిగిపోతూ
అత్మానందపు పరిపూర్ణతకు పునరంకితమౌతుంది…!!!
“నిలువెత్తు అగ్నిగుండంలో స్వర్ణ శరీరం” అన్న వాక్యానికి వేయి దండాలు మీకు