Have you seen the border of the sky?
~
I don’t know what would you say so ,
My sky is edged in green
Passing by my sky spreads peacock feathers. Never ask the sky about its whereabouts but, leaning my head on it can now easily hold the sphere. It can take the turmoil of the typhoons and the calmness of the mirages with ease. How graceful its hand ignites this puny lamp on the edges of darkness!
~
You may think however but,
My lamp has the green rim. Going from this way, my lamp goes unfolding few moon lights. Do not query my lamp how and what , but in the shadow of it my body easily rebels few stormy winds. It fells the severe heat of the Crease less dense night abyss and the crinkled sigh. How silently does its eye win this chaos on the brink of the torrents!
~
I keep telling you though you may not pay an ear to me for,
The lingo of my silent sweet heart is emerald. Flowing on both sides it goes throwing some incomprehensible sentences with known words. Do not inquire why and where but, playing under its words I try to find out some answers.
A stream doubtless how beautiful and soft it smears my feet loving to merge in with its warm waves –
As if mother’s touch and hers are one!
Life now exactly looks as the sky with a slight shade of jade rim that’s all!
Original(Telugu ): Afsar
Translated By: Jagathi
ఆకాశం అంచు చూశావా నువ్వు?!
~
నువ్వేమంటావో నాకు తెలీదు కాని,
నా ఆకాశానికి అంచు ఆకుపచ్చగా వుంటుంది.
అటు నించి వెళ్తూ కొన్ని నీలిమల్ని పరచుకుంటూ వెళ్తుంది నా ఆకాశం. ఎప్పటిదీ ఏమిటిదీ అని ఆకాశాన్ని అడక్కు కాని, దీని భుజమ్మీద ఆన్చుకున్న నా శిరస్సు ఇప్పుడు కొన్ని భూగోళాల్ని అతితేలిగ్గా ధరించేస్తుంది. తుపానుల అలజడినీ, ఎండమావుల ప్రశాంతతనీ హాయిగా భరించేస్తుంది. ఎంత నిబ్బరంగా వెలిగిస్తుందో కదా తన చేయి , ఇన్ని చీకట్ల చివార్న గోరంత దీపాన్ని!
~
నువ్వేమనుకున్నా సరే కాని,
నా దీపానికి అంచు ఆకుపచ్చగా వుంటుంది. ఇటు నించి వెలుగుతూ కొన్ని వెన్నెలల్ని ఆరేసుకుంటూ వెళ్తుంది నా దీపం. ఎలా ఏమిటీ అని దీపాన్ని అడక్కు కాని, దీని నీడలో నిల్చున్నప్పుడు నా శరీరం కొన్ని ఈదురుగాలుల్ని సునాయాసంగా ఎదిరించేస్తుంది. పొరల్లేని సాంద్రమైన రాత్రి అగాధాన్నీ, తెరలుతెరలుగా వాలే నిట్టూర్పుల ఉగ్ర ఉష్ణాన్నీ రాల్చేస్తుంది. ఎంత నిశ్శబ్దంగా జయిస్తుందో కదా తన కన్ను, ఉప్పెన్ల కొనమీది ఇంత కలవరాన్ని!
~
నువ్వు వినకపోయినా నేను చెప్తూనే వుంటాను కాని
నా నిశ్శబ్దపు ప్రేయసి భాష ఆకుపచ్చగా వుంటుంది. అటూ ఇటూ రెండు వేపులా ప్రవహిస్తూ కొన్ని తెలియని వాక్యాల్ని తెలిసిన మాటల్తోనే విసిరేసుకుంటూ వెళ్తుంది తను. ఎందుకూ ఎక్కడా అని అడక్కు కాని, తన మాటల కింద ఆడుకుంటున్నప్పుడు నేను కొన్ని సమాధానాలు వెతుక్కుంటాను. సంశయాల్లేని స్వచ్చమైన సెలయేరునీ, అందులో కరిగిపోవాలనుకునే నా పాదాల మీది వెచ్చని సన్నటి నీటి అలల్నీ ఎంత అందంగా మెత్తగా దువ్వుతుందో కదా తను – తన చెయ్యీ అమ్మ చెయ్యీ వొకే అరచేతిలో వొదిగిపోయినట్టు!
జీవితం ఇప్పుడు అచ్చంగా ఆకాశంలా కనిపిస్తుంది, కాస్త ఆకుపచ్చ అంచుతో!
-అఫ్సర్
Chala bagundhi
సూపెర్బ్ పదాలు….
చాలా నచ్చింది
చాలా బాగుంది, చిక్కని చక్కని కవిత ..అనువాదం లా లేదు ..జగతి మీ పద సంపద బాగుంది..
వసంత లక్ష్మి. పి