సాహిత్య వార్తలు

నాట్స్ సాహిత్య పోటీల విజేతలు

డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 4,5,6 వ తేదీలలో జరగబోయే 3 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకొని సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు ఈ క్రింది సాహిత్య అంశాలలో పోటీలు నిర్వహించారు.
• కథలు
• కవితలు
• ఫోటో కవితలు
• ఛందస్సుతో కూడిన పద్యాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది రచయితలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భముగా ఈ పోటీలలో పాలుపంచుకున్న ఔత్సాహికులైన రచయి(త్రు)తలకు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ మిత్రులకు, సాహిత్య కార్యక్రమాల కార్యవర్గ సభ్యులకు, ఈ సాహిత్య పోటీల మరియు నాట్స్ సంబరాల సాహిత్య కార్యక్రమాల సమన్వయ కర్త అనంత్ మల్లవరపు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 5,6 వ తేదీలలో సంబరాలలో భాగంగా జరిగే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద జ్ఞాపిక మరియు బహుమతి ప్రధానం ఉంటుందని తెలియచేశారు.

కథల పోటీల విజేతలు:
మొదటి బహుమతి: రంగ పిన్ని ఆకాశం – సాయి పద్మ (విశాఖపట్టణం)
రెండో బహుమతి: గజల్ – రఘు మందాటి (హైదరాబాద్)
మూడో బహుమతి: గులాబి ముల్లు – విజయ్ ప్రసాద్ కోపల్లె (కర్నూల్)

కవితల పోటీల విజేతలు:
మొదటి బహుమతి: కొన్ని రోజుల తర్వాత – నాగరాజు అవ్వారి (గిద్దలూర్)
రెండో బహుమతి: ఈ రాత్రి – నిషిగంధ (ఫ్లోరిడా)
మూడో బహుమతి: బాల్యం తిరిగొచ్చింది – ప్రసూన రవీంద్రన్ (హైదరాబాద్)

ఫోటో కవితల పోటీల విజేతలు:
మొదటి బహుమతి: వలని వలచిన వాళ్ళు – కె.వి.వి.డి.రావు (విశాఖపట్టణం)
రెండో బహుమతి: పెద్ద సిక్కే పడిందయ్యా! – ఆర్.దమయంతి (నార్త్ కెరోలినా)
మూడో బహుమతి: ఆశా దీపాలు – వెంకట శాస్త్రి చిలుకూరు (డల్లాస్)

ఛందస్సుతో కూడిన పద్యాల పోటీల విజేతలు:
మొదటి బహుమతి: తెలుగు భాషకు ‘విజయ’ వత్సరం – రామ మోహన్ అందవోలు (హైదరాబాద్)
రెండో బహుమతి: పద్యాలు – గరికిపాటి వెంకట సుబ్బావధాని (విజయవాడ)
మూడో బహుమతి: విశ్వ విజేత – విద్యాసాగర్ అందవోలు (డల్లాస్)